Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకత్రింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః వృక్షోత్పాతిశాన్తిః.

గర్గః పురేషు యేషు దృస్యన్తే పాదపా దేవచోదితాః| రుదున్తో వా హసన్తోవా విముఞ్చన్తి రసం ముహుః.

అరోగా వా వినా వాయుం శాఖాం ముఞ్చన్త్యథ (ధో) ద్రుమాః| ఫలం పుష్పం తథా 7కాలే దర్శయాన్తిత్రిహాయనాః. 2

పూర్వవత్స్వం దర్శయన్తి ఫలం పుష్పం తతాన్తరే| క్షీరం స్నేహం సురాం రక్తం మధు తోయం స్రవన్తిచ. 3

శుష్యన్తి రోగరహితా శ్శుష్కా రోహన్తి వా పునః| ఉత్తిష్ఠన్తీహ పతితాః పతన్తిచ తథోత్థితాః. 4

తత్ర పక్ష్యామి తేబ్రహ్మన్విపాకం ఫలమేవచ| రోదనే వ్యాధిమాప్నోతి హసనే దేశవిభ్రమమ్‌. 5

శాఖాప్రపతనం కుర్యా త్సఙ్గ్రామే యో 7థ పాతనమ్‌| బాలానాం మరణం కుర్యా ద్బాలానాం పుష్పితం తథా. 6

స్వరాష్ట్రే కురుతే భేదం ఫలం పుష్ప మథాన్తరే| క్షయన్త్సర్వతః క్షీరం స్నేహం దుర్భిక్షలక్షణమ్‌. 7

వాహనాచయం మద్యం రక్తం సఙ్గ్రామ మాదిశేత్‌| మధుస్రావే భ##వేద్వ్యాధి ర్జలస్రావే న వర్షతి. 8

అరోగశోషణం జ్ఞేయం బ్రహ్మ న్దుర్భిక్షలక్షణమ్‌| శుష్కేషు సమ్ప్రరోహస్తు వీర్య మన్నంచ హీయతే. 9

ఉత్థానే పతితానాం చ భయం భేదకరం భ##వేత్‌| స్థానా త్థ్సానాస్య గమనే దేశభఙ్గస్తథా భ##వేత్‌. 10

జ్వలత్స్వపిచ వృక్షేషు రుదత్స్వపి ధనక్షయమ్‌| ఏతత్పూజితవృక్షేషు సర్వం రాజ్ఞో విపద్యతే. 11

పుష్పేఫలే వా వికృతే రాజ్ఞో మృత్యుం తథా 77దిశేత్‌| అన్యేషు చైవ వృక్షేషు వృక్షోత్పాతే ష్వతన్ద్రితః. 12

అచ్ఛాదయిత్వాం తం వృక్షం గన్ధమాల్యై ర్విభూషయేత్‌| వృక్షోపరి తథా ఛత్త్రం కుర్యా త్పాపవ్రశాన్తయే. 13

శివ మభ్యర్చయే ద్దేవం పశుం చాసై#్మ నివేదయేత్‌| రుద్రేభ్య ఇతి షడ్హోమా న్కృత్వా రుద్రా న్జపే త్తతః. 14

మధ్వాజ్యయుక్తేన తు పాయసేన సమ్పూజ్య విప్రా న్కనకం చ దద్యాత్‌| గీతేన నృత్యేన తథా7 ర్చ యేత్తు దేవం హరం పాపవినాశ##హేతోః. 15

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మో వృక్షోత్పాత శాన్తి కథనం నామ

ఏకత్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పదు ఒకటవ అధ్యాయము.

రాజధర్మము- వృక్షోత్పాత శాంతి.

ఏ పట్టణములయందు వృక్షములు దేవప్రేరణచే ఏడ్చుచు నవ్వుచు కనబడునో మాటిమాటికి రసమును విడుచునో రోగమును గాలియు లేకయే కొమ్మలు పడునో ఆకాలమందును మూడు సంవత్సరముల వయస్సు కలవియు పూలు పూయునో పండ్లు పండునో కొమ్మల నడుమనే పూయునో కాయునో పాలను నూనెను మద్యమును రక్తమును కార్చునో రోగములు లేకయే ఎండునో ఎండినవి మరల చిగుర్చునో మొలకెత్తునో పడినవి లేచునో లేచినవి పడునో అచట కలుగు పరిణామమును ఫలమును తెలిపెద వినుము; చెట్లు ఏడ్చుచుచే వ్యాధులు ప్రబలును; నవ్వినచో దేశమున కలవరములు కలుగును; కొమ్మలు పడుటచే యోధులు పడెదరు; చిన్నవయసు చెట్లు పూచినచో బాలురు మరణింతురు ;కొమ్మల నడుమ పూయుటచే రాష్ట్రమున జనులలో కలహములు చీలికలు కలుగును ;పాలుకాని నూనె కాని కార్చినచో కరవులేర్పడును; మద్యము కార్చినచో వాహనమున నాశనము రక్తము కార్చినచో యుద్ధము సంభవించును ;తేనె కార్చినచో వ్యాధులు నీరుకార్చినచో అనావృష్టి కలుగును ;రోగములు లేకయే చెట్లెండినచో దుర్భిక్షమును ఎండినవి చిగిర్చినచో అన్నమును వీర్యమును తగ్గుటయు జరుగును ;పడినవి లేచినచో రాష్ట్రపు చీలికలతో భయమేర్పడును; ఉన్నచోటినుండి కదలిపోయినచో దేశ భంగమమగును ;వృక్షములు మండినను ఏడ్చినను ధనక్షయమగును; ఇట్టి వృక్షములను శత్రువులు పూజించినచో ఈ వృక్షములున్న రాజ్యపు రాజునకు సర్వస్వనాశమగును ;పుష్ప ఫలములందు వైకృతము (అస్వాభావిక లక్షణములు) కల్గినచో రాజు మరణించును ;ఇట్టివే మరేవయిన వృక్షోత్పాతములు సంభవించినను ఎచ్చరికతో గమనించి ఆ వృక్షమును మరుగుపరచి గంధమాల్యములతో అలంకరించవలయును; పాప శాంతికై చెట్టు పై గొడుగు నిలుపవలెను ;శివునర్చించ వలెను ;శివునకు పశువు నర్పించవలెను 'రుద్రేభ్యః 'అనుచు ఆరు హోమములను జరిపి రుద్ర మంత్రముల జపించవలయును; తేనెతో నేతితో కూడిన పాయసముతో విప్రుల పూజించి వారికి బంగారు దానమీయవలెను; హరుని గీత నృత్యము లతో అర్చించవలయును; ఇట్లు పాపనాశమగును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున వృక్షవైకృత శాంతియను

రెండు వందల ముప్పది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters