Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రయస్త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- నద్యాది వైకృతాశాన్తిః.

గర్గః నగరా దపసర్పన్తే సమీప ముపయాన్తి చ| నద్యో హ్రదప్రస్రవణా విరసాశ్చ భవన్తి చ. 1

వివర్ణం కలుషం తప్తం ఫేనావర్తం తు సఙ్కులమ్‌| స్నేహం క్షీరం సగరళం వహన్తే వా

77కులోదకాః. 2

షణ్మాసాభ్యన్తరే తత్ర పరచక్రం భయం విధుః| జలాశయా నద్నతే వా ప్రజ్వలన్తి కథంచన. 3

విముఞ్చన్తి తథా బ్రహ్మ న్జ్వాలాధూమరజాంసి| చ అఖాతేవా జలోత్పత్తి స్సుసత్త్వా జవాశయాః. 4

సఙ్కీతశబ్దా శ్శ్రూయన్తే జనమారభయం భ##వేత్‌| దివ్య మమ్భోమయం సర్పి ర్మధు తైవావసేచనమ్‌. 5

జప్తవ్యా వారుణా మన్త్రా సై#్తశ్చ హోమో జలే భ##వేత్‌| మధ్వాజ్యయుక్తం పరమాన్న మత్ర దేయం ద్విజానాం ద్విజభోజనార్థమ్‌. 6

గావశ్చ దేయా స్సితవసత్రయుక్తా స్తథోదకుమ్భా స్సలిలాఘశాన్త్యై. 6u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే నద్యాది వైకృతశాన్తి కథనం నామ

త్రయస్త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పది మూడవ అధ్యాయము.

నద్యాది వైకృతశాంతి.

గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: నదులును హ్రదములును ప్రస్రవణములు (సెలయేళ్లు నీటి ఊటలు బుగ్గలు మొదలగునవి) నగరములకు దగ్గరగా నున్నవి దూరముపోవుట దూరమున నున్నవి దగ్గరకు వచ్చుట వీటి రుచి తప్పుట వివర్ణమగుట కలుషమగుట క్రాగుట నురుగులు సుడులు ఏర్పడుట కలతపడుట కాలువల నీటియందు నూనె పాలు విషము ప్రవహించుట జరిగినచో ఆరు మాసములకు లోగా ఏదేశమందు పరచక్ర భయమేర్పడును; జలాశయములు మ్రోగుట మండుట మంటలనో పొగనో ధూళులనో వెలిక్రక్కుట త్రవ్వకయే నీరు పైకి వచ్చుట జలాశయములందు జల జంతువులధికమగుట నీటి నుండి సంగీతధ్వనులు నిలబడుట జరిగినచో జనమరణ భయము కలుగును ;

దీని శాంతికై దివ్యములగు జలములను తేనెయు నూనెలును జలాశయములందు వేయుచు వారుణ మంత్రము లతో హోమము జరుపవలెను; వారుణమంత్ర జపము జరిపించవలయును.

బ్రహ్మణులను తేనెతో నూనెతో కూడిన పరమాన్నము భుజింపజేయవలయును. గోవులను తెల్లని వస్త్రము లను ఉదకుంభములను బ్రాహ్మణులకు దానమీయవలయును; దోషశాంతియగును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణున రాజధర్మమున నద్యాది వైకృత శాంతియను é

రెండు వందల ముప్పది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters