Sri Matsya Mahapuranam-2    Chapters   

చతుస్త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- ప్రసవోత్పాతశాన్తిః.

గర్గః అకాల ప్రసవా నార్యః కాలాతీతప్రజా స్తథా| వికృతప్రసవాశ్చైవ యమలప్రసవా స్తథా. 1

అమానుషా హ్యతుణ్డాశ్చ సఙ్జాతవ్యసనా స్తథా| హీనాఙ్గా శ్చాధికాఙ్గాశ్చ జాయన్తే యది వా స్త్రియః. 2

పశవః పక్షిణశ్చైవ తథైవ చ సరీసృపాః| వినాశం తస్య దేశస్య కులస్య చ వినిర్దిశేత్‌. 3

నిర్వాసయే త్తాం నృపతి స్స్వరాష్ట్రా త్త్సియశ్చ పూజ్యాశ్చ తతో ద్విజేన్ద్రాః| కిమిచ్ఛకై ర్బ్రాహ్మణతర్పణం చ లోకే తత శ్శాన్తి ముపైతి పాపమ్‌. 4

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే ప్రసవోత్పాతశాన్తి కథనం నామ

చతుస్త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పది నాలుగవ అధ్యాయము.

ప్రసవోత్పాత శాంతి.

గర్గుడత్రితో ఇట్లు చెప్పెను; స్త్రీలకు అకాలమందు ప్రసూచి జరిగినను కాలాతీతముగా ప్రసూతి ఐనను వికృత ప్రసము (యమలకము) ప్రసవమయినను అమానుష ప్రాణులును ముక్కులు నోరు మొదలగునవి లేనివారు వ్యసనము లతో కూడినవారు హీనాంగులు అధికాంగులు పశుపక్షి నరీ నృపాదులకు ఇట్లు వికృత ప్రసవమయినను అదేశ మునకును ఆస్త్రీలున్న కులమునకును నాశమగును; రాజు ఆ మాతా శిశువులను స్వరాష్ట్రమునుండి వెడలగొట్టవలెను; తరువాత స్త్రీలను పూజించవలెను; బ్రాహ్మణులకును కోరినవెల్ల ఇచ్చి పూజించి తృప్తిపరచవలయును; దీనిచే ఈ దోషము శాంతించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున ప్రసవోత్పాత శాంతియను

రెండు వందల ముప్పది నాలుగల అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters