Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్త త్రింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- పారాసాదపతనాదిదుర్నిమిత్తశాన్తిః.

గర్గః ప్రాసాదాతోరణాట్టాల ద్వార ప్రాకారవేశ్మనామ్‌| నిర్నిమిత్తం తు పతనం దృఢానాం రాజమృత్యవే. 1

రజసా వా 7పి ధూమేన దిశో యత్ర సమాకులాః| అదిత్య చన్ద్ర తారాస్చ వివర్ణా భయవృద్ధయే. 2

రాక్షసా యత్ర దృస్యన్తే బ్రాహ్మణాశ్చ విధర్మిణః| ఋతవశ్చ విపర్యస్తా అపూజ్యా న్పూజయే జ్జనః. 3

నక్షత్రాణి వియోగీని త న్మహద్భయలక్షణమ్‌| కేతూదయోపరాగౌ వా ఛిద్రం వా శశిసూర్యయోః. 4

గ్రహరక్షవికృతి ర్యత్ర తత్రాపి భయమాదిశేత్‌| స్త్రియశ్చ కలబాయన్తే బాలా నిఘ్నన్తి బాలకా & .5

క్రియాణా ముతుతానాం చ వ్యుచ్ఛిత్తిర్యత్ర జాయతే| అగ్ని ర్యత్ర న దీప్యేత హుయమానో7పి శాన్తిషు. 6

పిపీలికాశ్చ క్రవ్యాదా యాన్తి చోత్తరత స్తథా| పూర్ణకుమ్భా స్స్రవన్తే చ హవిర్వాపి ప్రలుప్యతే. 7é

మఙ్గల్యాస్చ గిరో యత్ర శ్రూయన్తేన సమన్తతః| క్షవథు ర్భాధతే చాథ ప్రహసన్తి నదన్తిచ. 8

న చ దేవేషు వర్తన్తే యథావ ద్బ్రాహ్మణషు చ| మన్దఘోషాణి వాద్యాని వాద్యన్తే విస్వరాణి చ. 9

గురుమిత్రద్విషో యత్ర శత్రుపూజారతా నరాః| బ్రాహ్మణా స్త్సుహృదో మాన్యాన్జనో యత్రా 77వమన్యతే. 10

శాన్తి మఙ్గళహోమేషు నాస్తిక్యం యత్ర జాయతే| రాజా వై మ్రియతే తత్ర స దేశో వా వినశ్యతి. 11

రాజ్ఞో వినాశే సమప్రాప్తే నిమిత్తాని నిభోధ మే| బ్రాహ్మణా న్ప్రతమం ద్వేష్టి బ్రాహ్మణౖస్చ విరుద్ధ్యతే. 12

బ్రాహ్మణాస్వాని చాదత్తే బ్రాహ్మణాంశ్చ జిఘాంసతి| నైతాన్త్మరతి కృత్యేషు యాచితం చ ప్రకుప్యతి. 13

రమతే నిన్దయా తేషాం ప్రసంసా వాధి గచ్ఛతి| అపూర్వం తు కరం లోబా త్తథా పాతయతే జన్‌. 14

ఏతేష్వభ్యర్చయే త్సమ్య క్సపత్నీకం ద్విజోత్తమమ్‌| భోజ్యాని చైవ కర్యాణి సురాణాం బలయ స్తథా. 15

సన్తో విపప్రాశ్చ పూజ్యాః స్యు స్తేభ్యో దానం చ దీయతామ్‌| గావశ్చ దేయా ద్విజపుఙ్గవేభ్యో వాసాంసి రత్నాని సమన్దిరాణి. 16

హోమశ్చ కార్యో7మర పూజనం చ ఏవం కృతే శాన్తి ముపైతి పాపమ్‌. 16u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే గర్గాత్రిసంవాదే ప్రాసాదపతినాదిదుర్నిమిత్త

శాన్తి కథనం నామ సప్త త్రిశందుత్తరద్విశతతమో7ధ్యాయః

రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.

ప్రాసాద పతనాది దుర్నిమిత్త శాంతి.

గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: మేడలును పురద్వారములును ఋరుజులును ద్వారములును ప్రాకారములును మహాగృహములును గట్టినున్నవియు అకస్మికముగా పడుట రాజమృత్యు సూచకములు; దిక్కులు ధూళులతో పొగలతో అకారణముగ వ్యాప్తమయినను ఆదిత్యచంద్ర తారలు వివర్ణములయినను రాష్ట్ర భయమును సూచించును; రాక్షసులు కనబడుట బ్రాహ్మణులు తమ ధర్మము తప్పట ఋతుధర్మములు వ్యత్యాసమందుట జనులు అపూజ్యులను పూజించుట నక్షత్రములు ఏడమొగముగా కనబడుట మహాభయ సూచకములు; ధూమకేతువులు కనబడుట చంద్ర సూర్య గ్రహమములు తరచగుట చంద్ర సూర్య మండలములు రంధ్రముతో కనబడుట గ్రహ నక్షత్రవైకృత్యము స్త్రీలు అకారణముగ అధికముగ కలహించుట బాలురు బాలురతో కలహించుచు కొట్టుచుండుట ఉచితక్రియలు జరుగక విచ్ఛిన్నములగుట శాంత్యాది కర్మములందు హోమము చేయుచుండగా అగ్నిజ్వలించక పోవుట చీమలును మాంసాహారి మృగపక్ష్యాదులసును ఉత్రముగా పోవుచుండుట నిండు కడవలు అకారణముగా కారుట హవిస్సు లుప్తమగుట అన్నివైపులముండి యు శుభవాక్కులు వినబడకుండుట జనులలో జలుబు బాధ ఎక్కువగుట అకారణముగ నవ్వులు అరపులు అధికమగుట దేవ బ్రాహ్మణులను సరిగా అదరించక పోవుట వాద్యములను మ్రోగించగా అవి సరిగా మ్రోగక పోవుట జనులు గురువులను మిత్రులను ద్వేషించుట శత్రువులను పూజించుట బ్రాహ్మణులను సుహృదులను మాన్యులను అవమానించుట శాంతికృత్య మంగళకృత్య హోమకృత్యముల విషయమున నాస్తికతా భావము ప్రబలుట- ఇట్టివి రాజమరణమును దేశనాశనమును రాజునకు నాశమును సూచించును. మృత్యువు దాపురించినచో రాజును బ్రాహ్మణులను ద్వేషించును ; బ్రాహ్మణులను తాను ద్వేష్యుడగును; వారి ధనములు హరించును ;వారిని చంపగోరును ;పనులు పడినపుడు వారిని తలచుకొనడు; వారు యాచించినచో కోపించును ; వారిని నిందించునో సంతోషించును ; ప్రశంసించినచో మెచ్చడు - నొచ్చుకొనును ; జనులపై క్రొత్తక్రొత్త పన్నులు వేయును; ఇట్టి సందర్భములలో బ్రాహ్మణదంపతుల నర్చించవలెను; బ్రాహ్మణ సంతర్పణములును దేవతా బలులును జరుపవలయును ; సజ్జనులను విప్రులను పూజించవలయును - వారికి దానమీయవలెను; బ్రాహ్మణులకు గోవస్త్ర రత్నగృహ దానములు చేయవలయును ; హోమములును దేవతా పూజలును జరుపవలయును ;దీనిచే దోషశాంతియగును.

ఇది శ్రీ మత్స్య మహపురాణమున రాజధర్మమున ప్రాసాదా వతనాది దుర్నిమిత్తశాంతియను రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters