Sri Matsya Mahapuranam-2 Chapters
సప్తచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.
శ్రీ వరాహావతారచరితమ్.
శౌనకః : జగదణ్డం మిదం సర్వ మాసీ ద్ధివ్యం హిరణ్మయమ్ | ప్రజాపతే రియం మూర్తి రితీయం వైదికీ శ్రుతిః. 1
తత్తు వర్షసహస్రాన్తే బిభేదోర్ధ్వముఖం విభుః | లోకసర్జనహేతోశ్చ బిబేదాధోముఖం తతః . 2
భూయో7ష్టధా బిభేదాణ్డం విష్ణుర్వై లోకజన్మకృత్ | చకార జగతశ్చాత్ర విభాగం స విభాగకృత్. 3
యచ్ఛిద్ర మూర్ధ్వం మాకాశం వివిరాకృతితాం గతమ్ | విహితం విశ్వయోగేన యదధ స్తద్రసాతలమ్. 4
యదణ్డ మకరో త్పూర్వం దేవో లోకచికీర్షయా | తత్ర యత్సలిలే స్కన్న ముల్బం తత్కాఞ్చనో గిరిః. 5
శైలై స్సహసై#్ర ర్గహమా విషమా మేదినీ తథా | తైశ్చ పర్వతజాలౌఘై ర్బహుయోజనివిస్తరైః. 6
పీడితా గురుభి ర్దేవీ వ్యథితా మేదినీ తదా | సహామరై ర్బూరిబలం దివ్యం నారాయణాత్మకమ్. 7
హిరణ్మయం జగత్సృష్టం తేజో వై జాతరూపిణమ్ | అశక్తా వై ధారయితు మధస్తా త్ప్రవివేశ సా. 8
పీడ్యమానా భగవత స్తేజసా తస్య సా క్షితిః | పృథ్వీం విశన్తీం దృష్ట్వా తు తా మధో మధుసూదనః. 9
ఉద్ధారార్థం మన శ్చక్రే తస్యా వై హితకామ్యయా | శ్రీభగవా&: మత్తేజ ఏషా మసుధా సమాసాద్య తపస్వినీ. 10
రసాతల ప్రవిష్టా7సి పఙ్కే గౌరివ దుర్బలా |
రెండు వందల నలువది ఏడవ అధ్యాయము.
వరాహోత్పత్తి - ధరణీ సముద్ధరణము.
శౌనకుడర్జునునితో ఇట్లు చెప్పెను: ఈ జగమంతయు పూర్వము హిరణ్మయమగు అండముగ నుండెను; ప్రజాపతి మూర్తి ఇదియే అని వేదమున వినబడుచున్నది; వర్ష సహస్రాంతరమా విభుడు దానిని సృష్టినిమిత్తమై మొదట ఊర్ధ్వాధః- కపాలములుగా భేదించెను; లోక జన్మకర్తయగు విష్ణుడు దానిని మరల ఎనిమిదిగా విభజించెను; విభాగక ర్తయగు అతడు దీనియందు జగద్విభాగమొనర్చెను; వానితో ఊర్ధ్వముఖావకాశరంధ్ర మాకాశమును అధోరంధ్రము రసాతలమునుగా విశ్వ యోగయోగియగు ఆ దేవుడు ఏర్పరచెను; ఆ దేవుడు లోక సృష్టి సంకల్పముతో నిర్మించిన యండముతో ఏర్పడిన మావి బ్రహ్మాండాశ్రయమగు సలిలమందుపడి స్వర్ణయమ (మేరు) పర్వతమయ్యెను; వేలకొలది పర్వతములతో గహనమును విషమమునునగు మేదిని (భూమి) ఏర్పడెను; బహుయోజన విస్తరములును బరువును సహస్ర పర్వతగణ సమూహముతో పీడితయై భూదేవి పీడిత యయ్యెను; భూరి బలయుతమును దివ్యమును నారాయణాత్మకమును హిరణ్యమయ మును సువర్మరూపమునునగు విష్ణు సృష్టమయిన ఆ తేజస్సును మోయజాలక ఆ భగత్తేజ ః పీడితయగు క్షితిదేవత క్రిందకు క్రుంగిపోయెను; పాతాళమున ప్రవేశించెను; మధుసూదనుడట్లామె అధఃప్రవిష్టగుచుండుట చూచి ఆమెకు హితమాచరించు తలంపుతో ఆమెను ఉద్ధరించి (పైకెత్తి) దలచెను; అతడామెతో ఇట్లనెను; వసుధా దేవీ ! పాపము(తపస్విని =దయనీయ -జాలిపడదగినది అగు ) ఈ నీవు నా తేజస్సు నీయందు నిలువగా మెయజాలక దుర్హలయగు గోవు బురదయందువలె రసాతలమందు దిగబడితివి; అన పృథివీ విష్ణునిట్లు స్తుతించెను.
భూదేవీ కృత విష్ణుస్తుతిః.
పృథివీ ః త్రివిత్రమాయామితవిక్రమాయ మహావరాహాయ సురోత్తమాయ. 11
శ్రీశార్‌ఙ్గ చక్రాసిగదాధరాయ నమో7స్తుతే దేవవర ప్రసీద | తవ దేహాజ్జగజ్జాతం పుష్కరద్వీప ముత్థితమ్.
బ్రహ్మణ మిహ లోకానాం భూతానాం శాశ్వతం విదుః | తవ ప్రసాదా ద్దేవో7యం
దివం భుఙ్త్కే పురన్దరః. 13
*తవ క్రోధా ద్వినిర్ధూతా స్సర్వే దైత్యా జనార్దన | దాతా విధాతా సంహర్తా త్వయి సర్వం ప్రతిష్ఠితమ్.
*తవ క్రోధాద్ధి బలవా న్జనార్ధన జితో బలిః.
మనుః కృతాన్తో నియతం జ్వలనః పవనో ఘనః | వర్ణాశ్చాశ్రమ ధర్మాశ్చ సాగరా స్తరవో 7చలాః. 15
నద్యో ధర్మశ్చ కామశ్చ యజ్ఞో యజ్ఞస్య యాః క్రియాః. విద్యా వేద్యంచ సత్త్వం చ హ్రీశ్శ్రీః కీర్తి ర్దృతిః క్షమాః. 16
పురాణం వేదవేదాఙ్గం సాఙ్ఖ్యం యోగో భవాభవౌ | జజ్గమం స్థావరం చైవ భవిష్యతి చ భవచ్చ యత్. 17
సర్వం తచ్ఛ త్రిలోకేషు ప్రబావోవహితం తవ | త్రిదశోదారఫలదః స్వర్గస్త్రీ చారుపల్లవః. 18
సర్వలోకమనః కాన్త స్సర్వసత్త్వ మనోహరః | విమాననేకవిటప స్తోయదామ్బుమధుస్రవః. 19
దివ్యలోక మహాస్కన్ధ స్సత్యలోక ప్రశాఖవా& | 20
సాగరాకారనిర్యాసో రసాతలజలాశ్రయః | నాగేన్ద్రపాదపోపేతో జన్తుపక్షినివితః. 21
శీలాచారార్యగన్ధశ్చ సర్వలోకమయో ద్రుమః | ద్వాదశార్కమయద్వీపో రుద్రైకాదశపత్తనః. 22
వస్వష్టాచలసంయుక్త సై#్త్రలోక్యామ్భోమహోదధిః | సిద్ధిసాధ్యోర్మిసలిల స్సుపర్ణానిలసేవితః. 23
దైత్య లోక మహాగ్రాహో యక్షోరగగణాకులః | పితామహా మహాధైర్య స్స్వర్గ స్త్రీ రత్నభూషితః. 24
త్వం స్వయోగ మహావీర్యో నారాయణ మహార్ణవః | త్వయా సృష్టా స్త్రయో లోకా స్త్వయైవ ప్రతిసంహృతా. 26
విశన్తి యోగిన స్సర్వే త్వామేవ ప్రతియోజితాః | యుగే యుగే యుగాన్తాగ్నిః కాలమేఘో యుగేయుగే. 27
త్రివిక్రమా! అమిత విక్రమా! మహావరాహా! సురోత్తమా! శ్రీ శార్జచక్రాసిధరా గదాధరా; నీకు నమస్కారము; దేవోత్తమా! ప్రసన్నుడవుగమ్ము; దేవా! నీ దేహమునుండి జగము జనించినది; పుష్కర ద్వీపము ఉత్థితమయినది; లోకములను సృష్టించు బ్రహ్మయు సకల భూతములతో శాశ్వతుడవును నీవే యని వేదములనును; నీయనుగ్రముననే ఈ పురందరుడు స్వర్గమునుభవించుచున్నాడు. జనార్ధనా! నీ క్రోధముననే సర్వదైత్యులును(బె) చెదరిపోవుచున్నారు; ధాత (స్రష్ట) విధాత (స్థితికర్త) సంహర్త- ఇందరును ఇదియంతయు నీ యందే నిలిచియున్నది; మనువు యముడు అగ్ని వాయువు పర్జన్యుడు వర్ణములు ఆశ్రమ ధర్మములు సాగరములు పర్వతములు వృక్షములు నదులు ధర్మము కాముడు యజ్ఞములు యజ్ఞ క్రియలు విద్యయు (తెలియవలసినది) సత్త్వము - హ్రీ- శ్రీ- కీర్తి ధృతి- క్షమ పురాణములు వేదములు వేదాంగములు సాంఖ్యము యోగము భవము (సృష్టి) అబావము (ప్రళయము) స్థావర జంగమ (చర) భూతములు భూతము వర్తమానము భవిష్యము ఇంకను త్రిలోకముల యందున్నదంతయును నీ ప్రభావమును ఆశ్రయించియున్నవి; త్రిదసుల (దేవతల) నెడు ఉదార ఫలమునిచ్చునదియు స్వర్గ స్త్రీలనెడు మనోహరపల్లవములు కలదియు ను సర్వలోకమనోహరమును విమానములను అనేక శాఖలు కలదియు మేఘజలమను తేనెను స్రవించునిదియు దివ్య లోకములను మహాస్కంధము (పెద్ద బోదె) సత్యలోకమను చిగురు కొమ్మ సాగర (జల) ములనెడు నిర్యాసము (జిగురు ఊట) రసాతలమనెడు పాతు ఆదిశేషుడనెడు తల్లివేరు జంతువులు పక్షులు ననెడు ఆశ్రితులు శీలము ఆచారము ఆర్యులు అనెడు సుగంధము కలదియు నగు దివ్య పర్వతములు త్రైలోక్యమునెడు నీరు సిద్ధసాధ్యులనెడు జలోర్ములు సువర్ణు (గరుడు) లనెడు వాయువులు యక్షోరగ దైత్యలోక (గణ) మనెడు మహాగ్రాహములు పితామహుడు (బ్రహ్మ) అనెడు మహా ధీరత్వము స్వర్గస్త్రీలనెడు రత్నములు ధీహ్రీ శ్రీ కాంతులనెడు నదులు కాలాంశములు యోగములు మహాపర్వతములు అనెడు ప్రయోగములు (పాటులు పోటులు) ఆత్మయోగమనెడు మహావీర్యము కల ఏకరాట్ ధర్మములతో నుండు నారాయణుడను మహాసముద్రమపు; లోక త్రయమును నీచే సృష్టింపబడుచును; లయింపబడును; సర్వయోగులును నీచే బయటికి తేబడి నిన్నే ప్రవేశింతురు; యుగయుగమందును నీవే ప్రళయకాలాగ్ని మేఘరూపుడవగుదువు.
మహాభారావతారాయ దేవ త్వం హి యుగే యుగే| త్వం హి శుక్లః కృతయుగే త్రేతాయాం చమ్పకప్రభః. 28
ద్వాపరే రక్తసఙ్కాశః కృష్ణః కలియుగే భవా& | వైవర్ణ్య మబిధత్సే త్వం ప్రాప్తేషు యుగసన్ధిషు. 29
వైవర్ణ్యం సర్వధర్మాణా ముత్పాయసి వేదవిత్| భాసి వాసి ప్రతపసి త్వం చ పాసి విచేష్టసే. 30
క్రుధ్యసి క్షాన్తి మాయాసి త్వం దీపయసి వర్షసి| త్వం హాన్యసి న నిర్యాసి నిర్వాపయసి జాగ్రసి. 31
నిశ్శేషయసి భూతాని కాలో భుత్వా యుగక్షయే| శేష మాత్మాన మాలోక్య విశేషయసి త్వం పునః. 32
కాలో భూత్వా ప్రసన్నాభి రద్భిర్హలాదయసే పునః|
యుగాన్తాగ్న్యవలీడేషు సర్వభూతేషు కిఞ్చన| యాతేషు శేషో భవసి తస్మా చ్ఛేషో 7సి సన్తతమ్. 33
చ్యవనోత్పత్తియుక్తేషు బ్రహేన్ద్ర వరుణాదిషు| యస్మాన్న చ్యవసే స్థానా త్తస్మా దచ్యుత ఉచ్యసే. 34
బ్రహ్మణ మిన్ద్రం రుద్రంచ యమం వరుమ మేవచ| నిగృహ్య హరసే యస్మాత్తస్మా ద్ధరి రిహోచ్యసే. 35
సనా (దా) నయసి భూతాని వపుషా యశసా శ్రియా| చిరేణ వపుషా దేవ తస్మా చ్ఛాసి సనాతనః. 36
యస్మాద్బ్రహ్మాదయో దేవా మునయ శ్చేగ్రతేజనః| నతే త్వా మభిగచ్ఛన్తి తేనానన్త స్త్వముచ్యసే. 37
న క్షీయసే న క్షరసే కల్పకోటిశ##తై రవి| యస్మాత్త్వ మక్షరత్వాచ్చ తస్మా ద్విష్ణుః ప్రకీర్త్యసే. 38
విష్టబ్దం య త్త్వయా సర్వం జగత్థ్సాపరజఙ్గమమ్| జగద్విష్టమ్భనా చ్చైవ విష్ణు రేవేతి కీర్త్యసే. 39
విష్టభ్య తిష్ఠసే నిత్యం త్రైలోక్యం సచరాచరమ్| యక్షగన్ధర్వ నగరం సుమహాభూతపన్నగమ్. 40
వ్యాప్తం త్వయి ప్రవిశతి త్రైలోక్యం సచరాచరమ్| తస్మా ద్విష్ణు రితి ప్రోక్త స్స్వయమేవ స్వయమ్భువా.41
దేవా !నీవు యుగయుగమున మహీభారావతారణునకై అవతరింతువు ;కృత త్రేతా ద్వాపర కలియుగములందు వరుసగా శుక్ల(చంపక కుసుమ) హరితరక్త కృష్ణవర్ణుడవు ;ఆయా యుగ సంధుకాలములు వచ్చినపుడు వైవర్ణ్యము నందుదువు ;వేదవేత్తవయి ఆయా కాలములందు సర్వధర్మములకును వైవర్ణ్యము (సాంకర్యము కూడ కలిగింతువు ;నీవే ప్రకాశింతువు వీచెదవు తపింపజేయుదువు రక్షింతువు కృత్యము లాచరింతువు క్రుద్ధుడవగుదువు క్షాంతినందుదువు దీపపింపజేయుదువు వర్షింతువు విడుతువు వెలువడుదువు చల్లార్చెదవు మేలుకొందువు; యుగక్షయమున కాలుడయి సకల భూతములను నిఃశేషమొనరింతువు ;అదే కాలరూపుడవై తేటయగు నీటితో ఆనందపరచెదవు ;సర్వభూతములును యుగాంతాగ్నిచే నాకివేయ (దహించ) బడగా అన్నియు పోగా నీవే శేషింతువు ;కనుకనే సంతతమును శేషుడవనబడెదవు ;శేషించిన ఆత్మను (నీ స్వస్వరూపమును చూచికొని మరల విషేష (భేద) మును నీ రూపమునందును కలిగించుకొందువు; ఈ హేతువుచేతను నీవు (వి) శేషుడవు ;బ్రహ్మేంద్ర పరుణాదులు చ్యవనము (చ్యుతి- నాశము) ఉత్పత్తి కలవారు. నీవు మాత్రము స్థానమునుండి చ్యుతుడవుకావు. కనుక అచ్యుతుడవు. బ్రహ్మేంద్ర రుద్ర యమ వరుణులను గూడ నిగ్రహించి హరింతువుకావున హరివి. సనా (ఎల్లపుడు) భూతములను శరీరకీర్తి శ్రీలతో కూర్చుచు నీవు చిరస్థాయి వపుపు (శరీరము)తో కూడియుందువు. కావున నీవు 'సనా( దా) తనుడు' (ఎల్లపుడు ఉండువాడు) అయితివి. బ్రహ్మాది దేవతలును ఉగ్ర తేజస్కులగు మునులును నిన్ను అందుకొనజాలరు. కావున అనంతుడవు (అంత- అంతికము- సమీపము- నకు వచ్చుట) శతకోటి కల్పములకయిన నీవు క్షయించవు- క్షరించవు- (కరుగవు- తరుగవు) కావున అక్షరుడవు, స్థావర జంగమాత్మక జగత్తును విష్టబ్ధము (నిలుపపబడినదిగా) చేయుదువు. కావున సచరాచర త్రైలోక్యమును విష్టంభించి (ఆశ్రముగా చేసికొని) ఉందువు- యక్ష గంధర్వ నగరములతో మహాభూత నాగులతో నిండిన సచారాచర త్రైలోక్యమువును వ్యాప్తమయి నీయందు ప్రవేశించియున్నది కావున నీవు విష్ణుడవు( విశంతి సర్వభూతాని ఏనం- విశంతి సర్వభూతాని అయమ్) 'సర్వభూతములును ఇతనియందు ప్రవేశించును. సర్వభూతములందు ఇతడు ప్రవేశించును 'అని స్వయంభువు చెప్పెను.
నారా ఇత్యుచ్యంతే హ్యాపో ఋషిభి స్తత్త్వ దర్శిభిః | ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్స్మృతః. 42
యుగే యుగే ప్రణష్టాం గాం విష్ణో విన్దసి తత్త్వతః| గోవిన్దేతి తతో నామ్నా ప్రోచ్యసే ఋషిభిస్తథా. 43
హృషీకాణీన్ద్రి యాణ్యాహు స్తత్త్వజ్ఞాన విశారదాః| ఈశ##త్వే వర్తసే తేషాం హృషీకేశ స్తథోచ్యసే. 44
వసన్తి త్వయి భూతాని బ్రహ్మాదీని యుగక్షయే | త్వం వా వససి భూతేషు వాసుదేవ స్తథోచ్యసే. 45
సఙ్కర్షయసి భూతాని కల్పే కల్పే పునః పునః | తత స్సఙ్కర్షణః ప్రోక్త స్తత్త్వవిజ్ఞావిశారదైః. 46
ప్రతిప్యూహేన తిష్ఠన్తి సదేవారసురాక్షసాః| ప్రవిద్యు స్సర్వధర్మాణాం ప్రద్యుమ్న స్తేన చోచ్యసే. 47
నిరోద్ధా విద్యతే యస్మా న్న తే భూతేషు కశ్చన| అనిరుద్ధ స్తతః ప్రోక్తః పూర్వమేవ మహర్షిభిః. 48
యత్త్వయా ధార్యతే విశ్వం త్వయా సంహ్రియతే జగత్| త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ. 49
యత్త్వయా ధార్యతే కిఞ్చి త్తేజసా చ బలేన వా| మయా హి ధార్యతే పస్చా న్నాధృతం ధార్యతే త్వయా. 50
న హి తద్విద్యతే భూతం త్వయా య న్నాత్ర ధార్యతే| త్వమేవ కురుషే దేవ నారాయమ యుగే యుగే . 51
మహీభారావతరణం జగతో హితకామ్యయా | తవైవ తేజసా77 క్రాన్తాం రసాతలతలం గతామ్. 52
త్రాయస్వం మాం సురశ్రేష్ఠ త్వామేవ శరణం గతా| దానవైః పీడ్యమానా 7హం రాక్షసైః క్రోధతత్పరైః. 53
త్వామేవ శరణం నిత్య ముపయామి సనాతనమ్| తావన్మే7స్తి భయం దేవ యావ న్న త్వాం క కుద్మినమ్. 54
శరణం యామి మనసా శతశో7ప్యు పలక్షయే | ఉపమానం న తే శక్తాః కర్తుం సేన్ద్రా దివౌకసః. 55
త్వమేవ సతతం వేత్సి నిరుత్తర మతః పరమ్|
తత్త్వదర్శులగు ఋషులు అప్పు( జలము) లను 'నారములు' అందురు; (సృష్టికి) పూర్వమతనికవి అయనము (ఆశ్రయ- లయ- స్థానము) కావున నారాయణుడవు ; యుగయుగమునందును ప్రణాశమందిన గోవును (ధర్మమును- భూమిని- నన్ను) తాత్త్వికముగా యథాస్థితిని పొందింతువు; (గో-విద్) కావున నీవు ఋషులచే గోవిందుడనబడెదవు; తత్త్వజ్ఞాన విశారదులు ఇంద్రియములు హృషీకరములందురు ; వానికి ఈశుడవైవర్తిల్లుదువు కావున హృషీకేశుడవు;యుగక్షయమందును బ్రహ్మాది భూతములు నీ యందు వసించును; నీవును వానియందు వసింతువు; కావున సంకర్షణుడవు అని తత్త్వజ్ఞాన విశారదులందురు; దేవాసుర రాక్షసులు ప్రతివ్యూహము (అమరిక)తో నీ బలముననే యున్నారు; సర్వధర్మ ముల తత్త్వములను ఎరుగుచున్నారు ; కావున (ప్ర-దివ్: ప్ర-విద్) ప్రద్యుమ్నుడవు; భూతములయందు ఏయొకడును ఇతని కంటెమించి నిరోధము (ఆటంకము) ఒనరించువాడు (తన అదుపునందుంచుకొవాడు) లేడు కావున మహర్షులచే అనిరుద్ధడన బడెదవు; విశ్వము నీచే ధరించబడును; సంహరించబడును; నీవు భూతములను ధరింతువు - భువనమును భరింతువు ఏ కొంచె(తత్త్వ)మయినను తేజముచే కాని బలముచేకాని మొదట నీచే ధరించబడును ; తరువాత నాచే ధరించబడును; నీచే ధరించబడనిదే నాచే ధరించబడదు; ఈ విశ్వమందు నీ చేత ధరించబడనిది ఏదియు లేదు; నారాయణా! యుగయుగమునను జగములకు హితముచేయు కామనచో నీవే మహీభారమనవతరించ(దిగునట్లు) చేయుదువు; నీ తేజస్సుతోనే ఆక్రాంతికై (వ్యాప్తికై) రసాతలతలమును చేరియున్న నన్ను రక్షించుము; సురశ్రేష్ఠా! నిన్నే శరణందితిని; క్రోధతత్పరులగు దానవులచే రాక్షసులచే పీడింపబడుచున్న నేను సనాతనుడవగు నిన్నే శరణు పొందుచున్నాను: కకుద్మి (దేవవృషభుడు) అగు నిన్ను మనసా శరణందనంతవరకు నాకు భయము ఉండనేయున్నది. నూరు విధములుగా ఆలోచించినను నీకు ఉపమానము నాకు కనబడుట లేదు. ఇంద్రాది దేవతలును నిన్నెవరితోను పోల్చుటకును శక్తులు కారు. ఎల్లపుడును ఈ విషయము లన్నియు నీవే ఎరుగుదువు. ఇక మీదట (ఇంతకు మించి) పైగా చెప్పవలసినది ఏమియు లేదు.
శౌనకః : తతః ప్రీతి స్స ఙగవా న్పృథివ్యా శ్శార్‌జ్గచక్ర భృత్. 56
కామ మస్యా యథాకామ మభిపూరితవా& హరిః| అబ్రవీచ్చ మహాదేవి మాధవీయం స్తవోత్తమమ్. 57
ధారయిష్యతి యో మర్త్యో నాస్తి తస్య పరాభవః| లోకా న్నిష్కల్మషాం శ్చైవ వైష్ణవా న్ప్రతిపత్స్యతే. 58
మహాదాశ్చర్యం సర్వస్వం మాధవీయం స్తవోత్తమమ్| అధీతవేదః పురుషో మునిః ప్రీతిమనా భ##వేత్. 59
శ్రీ భగవా& :మా భైర్ధరణి కల్యాణి శాన్తిం వ్రజ మమాగ్రతః| ఏష త్వా ముచితం స్థానం ప్రాపయామి మనీషితమ్. 60
వరాహోత్పత్తిః.
శౌనకః : తతో మహాత్మా మనసా దివ్యం రూప మచిన్తయత్| కిన్ను రూప మాహం కృత్వా ఉద్ధరేయం ధరా మిమామ్. 61
జలక్రీడారుచి స్తస్మా ద్వారాహం రూప మాస్థితః| అదృశ్యం సర్వభూతానాం వాఙ్మయం బ్రహ్మ సంస్థితమ్. 62
శతయోజనవిస్తీర్ణ ముచ్ఛ్రితం ద్విగుణం తతః| నీలజీమూతసఙ్కాశం మేఘస్తనితనిస్వనమ్. 63
గిరిసంహననం భీమం శ్వేతతీక్షణోగగ్రదంష్ట్రిణమ్| విద్యుదగ్నిప్రతీకాశ మాదిత్యసమతేజసమ్. 64
పీనవృత్తాయతస్కన్ధం ధృష్టశార్దూలగామినమ్| పీనోన్నతకటీదేశం వృషలక్షణ మూర్జితమ్. 65
విపులం రూప మాస్థాయ వారాహ మమితోజసమ్| పృథివ్యుద్ధరణార్థాయ ప్రవివేశ రసాతలమ్. 66
అంతట శార్‌జ్‌ఞ్గచక్రధారియగు భగవానుడు హరి పృథివియందు ప్రీతుడై ఆమె కామములను యథాకామముగ పూరించెను. అంతే కాక -మహాదేవి మాధవుని ఈ స్తవోత్తమమును మనస్సున ధరించు మర్త్యుడు పరాభవమునందడు; నిష్కల్మములగు వైష్ణవ లోకములనందును. అపురుషుడు వేదముల నధ్యయనము చేసినంతటి వాడును ప్రీతిచిత్తుడును మునియంతటి వాడునగును. ఏలయన ఈ మాధవీయస్తవోత్తమము మహాశ్చర్యకర విషయ సర్వస్వము. కల్యాణీ! ధరణీ! నాముందుగా నడుపుము. భయమందకుము. ఇదిగో! ఇపుడే నిన్ను నీకు ఈప్సితమగు సముచిత స్థానమునకు చేర్చెదను. అని మహాత్ముడు విష్ణుడు 'నేను ఏరూపమును ధరించి ఈ ధరను ఉద్ధరించగలను. ' అని తదనుకూలమగు దివ్యరూపమును గూర్చి యోజించెను. వెంటనే మొదటునుండియు జలమున విహరించుటయందు ఆసక్తికల ఆ నారాయణుడు తదనురూపమును వారాహరూపము దాల్చెను. ఆరూపము ఏ భూతములకును కలరానిది. వాగ్రూపమయినది- పరబ్రహ్మమందు నిలుచునది. శతయోజన విస్తీర్ణము - ద్విశతయోజనోన్నతము. నీలమేఘ సమానము మేఘగర్జిత సమానధ్వని యుక్తము- పర్వతములె దృఢనిర్మాణయుతము- భయంకరము- శ్వేతతీక్ష భయంకర దంష్ట్పాయుక్తము- విద్యుదగ్నులతో సమానము- రవి సమాన తేజస్కము- బలిసిగుండ్రనై పొడవైన భుజమూ లములు కలది. గర్వించిన పులివలె నడుచు నది. పీనమయి ఉన్నతమయిన కటిప్రదేశము కలది. మహావృషభలక్షణయుక్తము. ఊర్జితము (పుష్టికలది). వృథివి నుద్దరించదలచి నారాయణుడు అమిత శక్తింతము విపులమునగు ఇట్టి వారాహరూపము ధరించి రసాతలమున ప్రవేశించెను.
వేదపాదో యూపదంష్ట్రః క్రతుదన్త శ్చితీముఖః| అగ్ని జిహ్వో దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః. 67
అహోరాత్రేక్షణధరో వేదాఙ్గశ్రుతిభూషణః| ఆజ్యనాస స్స్రువతుణ్డ స్సామఘోషన్వనో మహా& . 68
సత్యధర్మమయ శ్రీమత్క్రమవిక్రమసత్కృతః| ప్రాయశ్చిత్తనఖో ఘోరః పశుజాను ర్మఖాకృతిః. 69
ఉద్గాతా హోతృలిఙ్గో7థ బీజాషధిమాహాఫలః| వాయ్వన్తరాత్మా యజ్ఞాస్థివికృతి స్సోమశోణితః. 70
వేదస్కన్దో హవిర్గన్దో హవ్యకవ్యవిభాగవా& | ప్రాగ్వంశకాయో ద్యుతిమా న్నానాదీక్షాభి రన్వితః. 71
దక్షిణా హృదయో యోగీ మహాసత్రమయో మహా &| ఉపాకర్మాష్టరుచకః ప్రవర్గ్యావర్తభూషణః. 72
నానా ఛన్దో గతిపథో గుహ్యోపనిషదాసనః| ఛాయాపత్నీ సహాయో వై మణిశృఙ్గ ఇవోత్థితః. 73
రసాతలతలే మగ్నాం రసాతలతలం గతామ్| ప్రబు ర్లోకహితార్థాయ దంష్ట్రాగ్రేణోజ్జహార
తామ్. 74
తత స్స్వస్థాన మానీయ పృథివీం పృథివీధరః| ముమోచ పూర్వం మనసా ధారయిత్వా వసున్దరామ్. 75
తతో జగామ నిర్వాణం మేదినీ తస్య ధారణాత్| చకార చ నమస్కారం తసై#్మ దేవాయ శమ్భవే. 76
ఏనం యజ్ఞవరాహేణ భూత్వా భూతహితార్థినా| ఉద్ధృతా పృథివీ దేవీ సాగరాన్తర్గతా పురా. 77
అథోద్ధృత్య క్షితిం దేవో జగత స్థ్సాపనేచ్ఛయా| పృథివీ ప్రవిభాగాయ మన శ్చక్రే7మ్భుజేక్షణః. 78
రసాం గతా మవని మచిన్చ్యవిక్రమ స్సురోత్తమః| ప్రవరవరాహరూపధృక్|
వృషాకపిః ప్రసభ మథైకదంష్ట్రయా సముద్ధర ధ్ధరణి మతుల్యవిక్రమః. 79
ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వరాహావతార చరిత్రే ధరణీసముద్ధరణం నామ
సప్తచత్వారింశదుత్తరద్వి శతతమో7ధ్యాయః.
ఈ వరాహుడు యజ్ఞరూపుడు. అందుచే అతనికి వేదములు పాదములును యూపస్తంభములు దంష్ట్రలును క్రతువులు దంతములును వేదిక ముఖమును అగ్నులు జిహ్వాయును దర్భలు రోమములును బ్రహ్మము (ప్రణవము) శీర్షమును అహోరాత్రములు కన్నులును వేదాంగములు కర్ణాభరణములును ఆజ్యము నాసికయు స్రువము తుండమును సామధ్వని సత్యధర్మములును క్రమగతములగు పాదవిన్యాసములును ప్రాయశ్చిత్తములు గోళ్లును యజ్ఞపసువులు జానువులును యజ్ఞము శరీరాకృతియు ఉద్గాతయు హోతయు లింగమును బీజములును ఓషధులును మహావృషణములును వాయువు అంతరాత్మయ యజ్ఞ విశేషములు వివిధాస్థులును సోమము రక్తమును వేదవిశేషములు స్కంధములును హవ్యకవ్యరూప హవిస్సులు గంధమును ద్యుతిమంతమును నానా దీక్షాయుతమునగు ప్రాగ్వంశము కాయమును దక్షిణలు హృదయమును ఉపాకర్మాష్టకము రుచకములు అను ఆభరణములును ప్రవర్గ్యావృత్తులు భూషణములును నానా ఛందోగతులు మార్గములును గుహ్య( రహస్య) ములగు ఉపనిషత్తులు ఆసనమును ఛాయయను పత్నియునయ్యెను. ఇట్టి మహాసత్ర (యాగ) మయుడగు ప్రభుడా వరాహుడు ఉన్నతమయిలేచిన మణిశృంగమువల ఉన్నతుడై లేచి రసాతలతలమునమునిగి అడుగువరకు చేరిన ధరణిని తన కోరకొనతో లోకహితార్థమయి పైకిలేవనెత్తెను. తరువాత ఆ పృథివీధరుడు వసుంధరయగు వృథివిని మనస్సుతో ధరించి తరువాత ఆమెను స్వస్థానమునకు తెచ్చి విడిచెను. ఆ దేవుడు ధరించినందున మేదినీ సుఖమునందెను. మొదటశంభు(సుఖకారణు)డగు ఆ దేవునకు నమస్కారము చేసెను.
ఇట్లు పూర్వము భూత హితార్థియగు యజ్ఞ వరాహుడు సాగరాంతర్గత యగు పృథివిని ఉద్ధరించెను; ఇట్లా దేవుడును అంబుజనేత్రుడునగు విష్ణుడు జగత్సంస్థాపన వాంఛతో భూమినుద్ధరించి యనంతరము పృథివిని ప్రవిభక్త మొనరించసంకల్పించెను. అతులాచింత్య విక్రముడు సురోత్తముడును ఉత్తమ యజ్ఞ వరాహ రూపధారియునగు పృషాకపి(ధర్మరక్షకుడు) నారాయణుడు ఒకేకోరతో మహాబలముతో ధరణి నిట్లుద్ధరించెను.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వారాహావతార చరితమున ధరణీ సముద్ధరణమను
రెండు వందల నలువది ఏడవ అధ్యాయము.