Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోనపంచాథదుత్తర ద్విశతతమోధ్యాయః.

అమృతార్థం క్షీరోదధి మథనసమయే శీతాంశుప్రభృతీనా ముత్పత్తిః.

సూతః : నారాయమవచ శ్శ్రుత్వా మమన్థుస్తే మహోదధిమ్‌| తత్పయ స్సహితా బహూత్వా చక్రిరే భృశ మాకులమ్‌.1

తత శ్శతసహస్రాంసుసమాన ఇవ సాగరాత్‌| ప్రసన్నాభస్సముత్పన్న స్సోమ శ్శీతాంశు రుజ్జ్వలః. 2

శ్రీ రనన్తర ముత్పన్నా ఘృతా త్పాణ్డరవాసినీ| సురా దేవీ సముత్పన్నా తురగః పాణ్డు స్తథా. 3

కౌస్తుభశ్చ మణిర్దివ్య శ్చోత్పన్నో 7మృతసమ్భవః| మరీచివికచ శ్శ్రీమా న్నారాయమ ఉరోగతః| 4

పారిజాతశ్చ వికచకుసుమన్తబకాన్వితః| అనన్తర మపస్యంస్తే ధూమ మమ్బరసన్నిభమ్‌| 5

ఆపూరితదిసా భాగం దుస్సహం సర్వదేహినామ్‌| త మాఘ్రాయ సురా స్సర్వే మూర్ఛితాః పరిలమ్బితాః. 6

కాలకూట విషోత్పత్తిః.

ఉపవిశ్యామ్బుధితటే స్వశిరో గృహ్య పాణినా| తతః క్రమేణ దుర్వాద స్సో7నలః

ప్రత్యదృశ్యత. 7

జ్వాలామాలాకులాకారః సమన్తాద్బీషణార్చిషా | తేనాగ్నినా పరిక్షిప్తాః ప్రయశ##స్తే సురాసురాః. 8

దగ్ధాశ్చాప్యర్ధదగ్ధాశ్చ బభ్రము స్సకలా దిశః| ప్రధానా దేవదైత్యాశ్చ భీషితా స్తేన వహ్నినా. 9

రెండు వందల నలుబది తొమ్మిదవ అధ్యాయము.

క్షీరసాగరమథనమున చంద్రాదుల ఉత్పత్తి.

సూతుడు ఋషులకిట్లు చెప్పెను: నారాయణువచనమును విని ఆ దేవదానవులు మహోదధి నింకను మథించిరి ; ఒక్కుమ్మడిగ త జ్జలమును మిగుల కల్లోలపరచిరి ;అంతట సాగరమునుండి శతరవి సమానుడో యన గనవచ్చుచుండియు హాయిగొలుపు కాంతులు గల చల్లని కిరణిముల కోముడుత్పన్నుడయ్యెను ;తరువాత క్రమముగ ఘృతమునుండి తెల్లని వస్త్రముధరించిన లక్ష్మియు సురాదేవియు శ్వేతాశ్వమును అమృత సంభవమును కిరణవికాసియు నారాయణ వక్షోవిభూషణ మునునగు దివ్యకౌస్తుభమణియు వికసిత కుసుమస్తబకసమన్వితమగు పారిజాతవృక్షమును ఉత్పత్తినందెను; అనంతరమంబర సమానమును అపూరితదిశాభాగమును సర్వప్రాణులకును దుఃసహమునునగు ధూమము వారికి కనబడెను; దాని నాఘ్రాణించినంత సురులందరును మూర్ఛితులగుచు వ్రేలాడుచు చేతితో తలలు పట్టుకొని సముద్రతటమున కూర్చుండిరి. అనంతరము అది క్రమముగ దుర్వారమును జ్వాలామాలాకులా 77కారమునునగు అనలమయి కనబడెను; భయానక జ్వాలాయుతమయి అన్ని దిశల క్రమ్మిన ఆ అగ్నిచే క్రమ్మబడి అసురాసురులలో చాల మంది దగ్ధులో అరదగ్ఘులో ఐ అన్ని దిశలకు పరుగిడుచుండిరి. దేవదైత్య ప్రధానులును అవహ్నిచే భీషితులయిరి.

అనన్తరం సముద్భూతా స్తస్మాడ్డుణ్డభజాతయః | కృష్ణసర్పా మహాదంష్ట్రా రక్తాశ్చ పవనాశనాః. 10

శ్వేతపీతా స్తథా చాన్యే గోనసజాతయః| మళకా భ్రమరా దంశా మక్షికా శ్శలభా స్తథా. 11

కర్ణశల్యాః కృకలాసా అనేకాశ్చైవ బభ్రముః| ప్రాణినో దంష్ట్రిణో రౌద్రా స్తథా హి విషజాతయః. 12

శారఙ్గహాలాహలా ముస్తవత్సరం గుల్మవత్సకాః| నీలపత్రాయ శ్చాన్యే శతశో బహుభేదినః. 13

యేషాం గన్ధేన దహ్యన్తే గిరిశృఙ్గాణ్యపి ధ్రువమ్‌| అనన్తరం నీల సౌఘభృఙ్గభిన్నాఞ్జనాభం విషమం శ్వసన్తమ్‌. 14

కాయేన లోకాన్తపూరకేణ కేశైశ్చ వహ్నిప్రతిమైర్జ్వలద్భిః| సువర్ణముక్తాఫలభూషితాఙ్గం కిరీటినం పీతదుకూలజుష్టమ్‌. 15

నీలోత్పలాభైః కుసుమైః కృతార్థం గర్జన్త మమ్భోదరభీమవేగమ్‌| అధ్రాక్షు రమ్భోనిదిమధ్యసంస్థం సవిగ్రహం దేహిభయాశ్రయం తమ్‌. 16

విలోక్యం తం భీషణ ముగ్రనేత్రం త్రేసుశ్చ భూతాని సురాశ్చ సర్వే| కేచి ద్విలోక్యైవ గతాహ్యాభావం నిస్సంజ్ఞతాం చాప్యపరే ప్రసన్నాః. 17

వేము ర్ముఖేభ్యో7పి చ ఫేన ముగ్రం త్వన్యే నిపేతుశ్చ మహార్ణవే చ| శ్వాసేన తస్య నిర్దగ్దా స్తతో విష్ణ్వన్ద్ర దానవాః. 18

దగ్ధాఙ్గారనిభా జాతా యే బూతా దివ్యరూపిణః| తతస్తు సమ్భ్రమా ద్విష్ణు స్తమువాచ సురాత్మకమ్‌. 19

శ్రీ భగవా& : కో భవా నన్తక ప్రఖ్యః కిమిచ్ఛసి కుతో 7పి వా | కిం కృత్వా7తిప్రియం జాయే త్తదేవాచక్ష్వ మే 7ఖిలమ్‌. 20

తత్తు తస్య వచ శ్శ్రుత్వా విష్ణోః కాలాగ్నిసన్నిభః| ఉవాచ కాలకూటస్తు భిన్న దున్ధుభినిస్వనః. 21

కాలకూటః అహం హి కాలకూటాఖ్యో విషో7 మ్భుది సముద్భవః| యదా తీవ్రతరామర్షైః పరస్రవరధై షిభిః. 22

సురాసురై ర్విమథితో దుగ్దామ్భోనిది రాదృతైః| సమ్భూతో7హం తదా సర్వా& హన్తుం

దేవా న్త్సదానవా&. 23

సర్వా నిహ హనిష్యామి క్షణమాత్రేణ దేహినః| మాం వా గ్రసధ్వం వై సర్వే యూయం దేవా స్సదానవాః. 24

అనంతరము దానినుండి డుండుభ జాతులును మహాదంష్ట్రములగు కృష్ణసర్పములును రక్తసర్పములును శ్వేతసర్పములును పీతసర్పములును గోనసజాతి సర్పములును మశకభ్రమర దంశమక్షికాశలభ కర్ణశర్యకృకలాసము(తొండ) లును కోరలును రౌద్ర ప్రాణులును విషజాతి సర్పములును శారజ్గ- హలాహల ముస్తక- గుల్మవత్సక- నీలపత్రాదిశత విధపదార్చములును బయటకు వచ్చెను; వాటి గంధమాతరమున గిరిశృంగములును నిశ్చయముగ దగ్ధములగును ;అనంతరము నీలరసమువలె తుమ్మెదల వలె చీల్చిన కాటుక కొండవలె మెరయుచు విషమమయి బుసలు కొట్టుచు లోకాంతరపూరకమగు దేహముతోను అగ్నువలె జ్వలించు కేశములతోను కూడి బంగరుతో ముత్తెములతో భూషిత శరీరమయి కిరీటమును పీతదుకూలమును దాల్చి నల్లకలువలవంటి కుసుమములు ధరించి కృతార్థమయి మేఘమువలె గర్జించుచు భయానక వేగవంతమయి ప్రాణుల భయమెల్ల రూపొందెనోయనునట్లు సముద్ర మధ్యమందుండిన యొక విశరాజము వారికి కనబడెను. భయంకరాకృతియు భయానక నేత్రములును కల అద్దానిని చూచినంతనే సకల భూతములును సకల సురులును భయమందిరి ;దర్శన మాత్రమున అందరు నశించిరి; మరికొందరు నిస్సంజ్ఞులయికరి;ఇంకను కొందరు నోళ్లనుండి నురుగులు క్రక్కిరి ; ఇతరులు మహావర్ణమున పడిపోయిరి; దాని శ్వాసముతో నిర్దగ్దులయి బ్రహ్మవిష్ణ్వింద్రాదులును దానవులును దివ్యరూపులు కూడ మాడిన బొగ్గువలెనయిరి ;అంతట సంభ్రమముతోనే నారాయణుడు దేవరూపుడగు అతనితో నిట్లనెను; యమనముడవు నీవెవ్వడవు? నీకోరిక ఏమి? ఎటనుండి వచ్చితివి? ఏమిచేసినచో నీకు ప్రీతి కలుగును? ఇదంతయు నాకు చెప్పుము ;అనిన విష్ణుని వచనమును విని కాలాగ్ని సమానముగు ఆ కాలకూటము మ్రోయించిన ఢంకాధ్వనిసదృశమగు గంభీర ధ్వనితో ఇట్లనెను ;నేను అంబుధు సముద్బూతమగు కాలకూటవిషమను ;తీవ్రతర క్రోధసాలురు పరస్పరవధ కాంక్షులునగు దేవదానవులును ఒకటిగనై ఆదరమున క్షీరసాగరమును మథించుచుండ ఈ దేవదానవులందరు వధింపనై నేను జనించితిని ;సర్వప్రాణులను నేను క్షణమాత్రమున వధింతును ;ఇంద్రాదిదేవతలు మీరందరు నన్ను మ్రింగనైనమ్రింగుడు.

కాలకూట విషభీతి విష్ణ్వాది దేవతానాం శఙ్కరాలయగమనమ్‌.

శ్రుత్వైతద్వచనం తస్య తతో భీతా స్సురా 7సురాః| బ్రహ్మ విష్ణూ పురస్కృత్య గతాస్తే శఙ్కరాన్తికమ్‌. 25

నివేదితా స్తతో ద్వార్థ్సైర్గణశైస్తు సురా 7సురాః| అనుజ్ఞాతా శ్శివేనాథ వివిశు ర్గిరిశాన్తికమ్‌. 26

మన్దరస్య గుహాం హైమీం ముక్తామణి విభూషితామ్‌| సుస్వస్థమణి సోపానాం వైడూర్యస్తమ్భమణ్డితామ్‌. 27

తత్ర దేవాసురై స్సర్వై ర్జానుభి ర్ధరణీం గతైః| బ్రహ్మమ మగ్రతః కృత్వా ఇదం స్తోత్ర ముదాహృతమ్‌. 28

దేవదానవకృత శఙ్కరస్తుతిః(నామ సప్తతి రూపా)

దేవదానవాః : నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచక్షుషే | నమః పినాకహస్తాయ ధన్వినే కామరూపిణ.29

నమస్తే శూలహస్తాయ దణ్డహస్తాయ ధూర్జటే| మనసై#్త్రలోక్యనాథాయ భూతగ్రామశరీరిణ. 30

నమ స్సురారిహన్త్రే చ సోమార్కవహ్నిచక్షుషే| బ్రహ్మణ చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణ.31

బ్రహ్మణ వేదరూపాయ నమస్తే విశ్వరూపిణ | సాఖ్ఖ్యయోగాయ భూతానాం నమస్తే శమ్భవాయ తే. 32

మన్మథాఙ్గవినాశాయ నమః కాలక్షయఙ్కర| రంహసే దేవదేవాయ నమస్తే వసురేతసే. 33

ఏకవీరాయ సర్వాయ నమః పిఙ్గకపర్దినే హర్త్రే కర్త్రే నమస్తుభ్యం నమ స్త్రిపురగాతినే. 34

శుద్ధబోధ ప్రబుద్ధాయ ముక్తికైవల్యరూపిణ | లోకత్రయవిదాతేరే చ వరిణన్ద్రా గ్ని రూపిణ. 35

ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ| అగ్ర్యాయ చైవచో గ్రాయ విప్రాయ శ్రుతిచక్షుషే.36

రజసే చైవ సత్త్వాయ నమస్తే తామసాత్మనే| అనిత్యనిత్యబాసాయ నమమో నిత్యచరాత్మనే. 37

వ్యక్త్యాయ చైవావ్యక్త్యాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః| భక్తానా మార్తినాసాయ ప్రియనారాయణాయచ. 38

ఉమా ప్రియాయ శర్వాయ నన్దివక్త్రాఞ్చితాయవై| ఋతుమన్వన్తర కల్పాయ పక్షమాసదినాత్మనే. 39

నానా రూపాయ ముణ్డాయ వరూథపృథుదణ్డినే| నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖణ్డినే. 40

దన్వినే రథినే చైవ యతయే బ్రహ్మచారిణ| శివాయ దేవదేవాయ నమ స్తుభ్యం నమో నమః. 41

అతని ఈ మాటవిని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకరుని కడకుపోయిరి. ద్వారస్థులగు గణశులచే తెలుపబడి శివునిచే వారనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితము నిర్మల మణి సోపానయుతము వైడూర్యమణి స్తంభాలంకృతమునగు మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి; అట దేవాసురులందరును బ్రహ్మను ముందుంచుకొని ఈ స్తోత్రముతో మహాదేవుని స్తుతించిరి.

విరూపాక్షా !తీక్‌ష్ణనేత్రా !పినాకహస్తా!ధన్విన్‌!కామరూపిన్‌!శూలహస్తా!దండహహస్తా!త్రైలోక్యనాధా!భూతనమూహమూర్తీ!సురారిహంతా!సోమసూర్యవహ్నినేత్రా!బ్రహ్మవిష్ణురుద్రరూపిన్‌!బ్రహ్మన్‌!వేదరూపా!విశ్వరూపిన్‌!సాంఖ్యయోగా!భూతాసంభవా!మన్మథదేహనాశకా!కాలక్షయాకరా!రంహో(వేగ) రూపా!దేవదేవా;వసురేతోరూపా!ఏకవీరా!సర్వా!పంగజటాజూటా!హర్తా ;కర్తా! త్రిపురఘాతిన్‌!శుద్ధబోధప్రబుద్ధా!ముక్తికైవల్యరూపా!లోకత్రయవిధాతా!వరుణంద్రాగ్ని రూపా!ఋగ్యజుఃసామరూపా!పురుషా!ఈశ్వరా!అగ్ర్యా!(శ్రేష్టా)ఉగ్రా!విప్రా!వేదనేత్రా!సత్త్వరజస్తమోరూపా!అనిత్యబాసా(ప్రకాశా)నిత్యచరాత్మకా!వ్యక్తరూపా!అవ్యక్తరూపా!వ్యక్తావ్యక్తారూపా!భక్తార్తినాశకా!నారాయణప్రియా!ఉమావ్రియా!శర్వా!నందిముకాంచితా!ఋతుమన్వంతర కల్పవృక్షమాసదికానాత్మక నానారూపా! ముండరూపా!వరూథ(కవచ) రూపా!పృథుదండిన్‌! కపాలహస్తా! దిగంబరా! శిఖండిన్‌! ధన్విన్‌! రథిన్‌! యతీ! బ్రహ్మచారిన్‌! శివా! దేవదేవా! సమస్తుభ్యం - నమస్తుభ్యమ్‌(నీకు నమస్కారము).

ఏవం సురాసురై స్త్సుత స్సోషముపాగతః| ఉవాచ వాక్యం భీతానాం స్మితాన్విత శుభాక్షరమ్‌. 42

శఙ్కరః కిమర్థ మాగరా బ్రూత త్రాసగ్లానముకామ్భుజాః| కిం వా 7భీష్టం దదామ్యద్య కామం ప్రబ్రూత మాతిరమ్‌. 43

ఇత్యుక్తా స్తేతు దేవేన ప్రోచు స్త మసురాస్సురాః| సురా 7సురా ః అమృతార్థే మహాదేవ మథ్యమానే మహోదధౌ. 44

విష మద్భుత ముద్భూతం లోకసఙ్‌క్షయకారకమ్‌| స ఉవాచాథ సర్వేషాం దేవానాం భయకారకః. 45

సర్వాన్వా భక్షయిష్యామి యూయం వా భక్షతాథ మామ్‌| తమశక్తా వయం గ్రస్తుం సో 7స్మాఞ్ఛక్తో మహోత్కటః. 46

ముఖనిశ్వాసమాత్రేణ శతపత్రసమద్యుతిః| విష్ణుః కృష్ణః కృత స్తేన యమశ్చ విమనాత్మకః. 47

మూర్ఛితాః పతితాశ్చాన్యే విప్రణాశం గతాః పరే| అర్థో7నర్థక్రియాం యాతి దుర్భగానాం యథా విభో. 48

దుర్బలానాం చ సఙ్కల్పో యథా భవతి చాపది| విషమే తత్సముద్బూతం తస్మా దమృచకాజ్‌జ్ఞయా. 49

తస్మా ద్భయా న్మోచయ త్వం గతస్త్వం చ పరాయణమ్‌| భక్తానుకమ్పీ కర్లజ్ఞో భవనాధీస్వరో విభుః. 50

యజ్ఞాగ్రభు క్సర్వబవి స్సోమ స్సౌమ్యస్సస్మ్సరాన్తకృత్‌| త్వమేకో నో గతి ర్దేవ గీర్వాణగ్రామశర్మకృత్‌. 51

రక్షా7స్మా న్భక్త సఙ్కల్పాద్విరూపాక్ష విషజ్వరాత్‌|

ఇట్లు సురాసురులచే స్తుతించబడి సంతుష్టుడై శంకరుడు భయమందియున్న వారందలతో చిరునగవలుతోను శుభాక్షరములతోను కూడిన ఈ మాట పలికెను: మీరందరును భయముచే వాడిన ముఖప్దములతోనునాన రేల? ఏలవచ్చితిరి?

మీకేమియభీష్టము నిత్తు ను? తడవుచేయక నిర్భయముగ మీ కోరిక తెలుపుడు; అన వారిట్లనిరి;మహాదేవా! అమృతార్థమై మేము మహోదధిని మథించుచుండ లోక సంక్షయ కారకమగు అద్భుత విషముద్భవిల్లినది ;అది సర్వదేవ భయంకరమయి 'నేనైనమిమ్మందర భక్షింతును; మీరయిన నన్ను భక్షించుడు;'' అనినది; మహోద్ధతమగు అది మమ్ము మ్రింగగలదేకాని మేము దానిని మ్రింగజాలకున్నాము ;దాని ముకనిశ్శ్వాస మాత్రముననే శతపత్రపద్మ సమానకాంతియటగు విష్ణుడును కృష్ణుడయ్యెను- యముడు విమనస్కుడయ్యెను; కొందరు మూర్ఛితులైపడిరి ; మరికొందరు పూర్తిగా నశించిరి; దురదృష్ణ వంతులను అర్థమును అనర్థమగును ; దుర్భలుల సంకల్పములాపదల యందు మరియు వ్యర్థములగును ; అట్లే అమృతము కోరి యత్నించు మాకీవిషము దాపురించినది; ఇపుడు నీవే మాకు గతియు పరమగమ్యమును ఆశ్రయమును; నీవు భక్తులను దయచూచువాడవు సర్వజ్ఞుడవు భువనాధీశ్వరుడవు విభుడవు యజ్ఞమున ప్రతమభాగ భోక్తపు సర్వహవిః సోమాదిరూపుడవు సౌమ్యుడవు; మన్మథాంతకరుడవు; దేవగణ సుఖప్రదుడవు అగు నీవే మా కు గతి; భక్త సంకల్పము నెరవేర్చుచు మమ్ము ఈ విష జ్వర( సంతాప) ము నుండి రక్షింపుము.

తచ్ఛ్రుత్వా భగవానాహ భగనేత్రాన్తకృ ద్భవః. 52

దేవ దేవః : భక్షయిష్యామి తం ఘోరం కాలకూటం మహావిషమ్‌| తథా7న్యదపి యత్కృత్యం కృచ్ఛ్రసాధ్యం సురా7 సురాః. 53

తత్సర్వం సాధయిష్యామి తిష్ఠధ్వం విగతజ్వరాః| తే సర్వే హృష్టరోమాణో భాష్పగద్గదకణ్ఠినః. 54

ఆనన్దాశ్రుపరీతాక్షా స్సనాతా ఇవ మేనిరే| సురా బ్రహ్మదయస్సర్వే తే సమాశ్వన్తమానసాః. 55

కాలకూట భక్షణార్థమీశ్వరాగమనమ్‌.

తతో య¸° ద్రుతిగతినా కకుద్మినా హరో7మ్బరే పవనగతి ర్జగత్పతిః| ప్రధావితైరసురసురేన్ద్ర నాయకైః స్వవాహనై ర్విచలితశుభ్రచామరైః. 56

పురస్సరై స్స తు శుశుభే శుభాశ్రయై శ్శివో వశీ శిఖికపిశోర్ధ్వజూటకః| ఆసాద్య దుగ్ధసిన్ధుం తం కాలకూటం విషం యతః. 57

తతో దేవో మహాదేవో విలోక్య విషమం విషమ్‌| ఛాయా స్థానం సమాస్థాయ సో 7పిబ ద్వామపాణినా. 58

హియమానే విషే తస్మిం స్తతో దేవా మహాసురాః| జగుశ్చ ననృతుశ్చాపి సింహనాదాంశ్చ పుష్కలా&. 59

చక్రు శ్శతక్రతుముఖా హిరణ్యాక్షాదయ స్తథా| సంస్తువన్తశ్చ దేవేశం ప్రసన్నా శ్చాభవం స్తథా. 60

కణ్ఠదేసం తదా ప్రాప్తే విషే దేవ మథా బ్రువ &| విరిఞ్చిప్రముకా దేవా బవిప్రముఖతో 7సురాః 61

శోభ##తే దేవ కణ్ఠ స్తే గాత్రే కున్దనిభప్రభే| భృఙ్గగమాలానిభం కణ్ఠ తత్రైవా7స్తు విషం తవ. 62

ఇత్యుక్చ శ్శఙ్కరో దేవై స్తథేత్యాహ పురాన్తకః| పీతే విషే దేవగణా న్విముచ్య గతో హరో మన్దరశైవ మేవ. 63

తస్మి న్గతే దేవగణాః పునస్తం మనున్థ రబ్ధిం వివిధ ప్రకారైః. 63 u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ అమృతమథనే ఈశ్వరకృత కాలకూటభక్షణం

నామ ఏకోనపంచాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఇది భగుడను అదిత్యుని నేత్రములు పోగొట్టిన భవుడగు భగవానుడా శంకరుడు ఇట్లనెను : ఆ ఘోర కాకూటమహావిషమును భక్షింతును; అట్లే క్లేశసాధ్యమగునదింకేమియున్నను సురా7సురులారా అది ఎల్ల మీకై సాధింతును; విగతసంతాపులయియుండుడు. అదివిని బ్రహ్మాదిసురులు గగుర్పాటు చెందిరి ; బాష్పగద్గద కంఠులయిరి - ఆనందాశ్రుపూర్ణనేత్రులయిరి; తాము సనాధులు (రక్షకులు కలవారు) అయినట్లు భావించిరి. వారి మనస్సులు ఓదార్పుచెందెను.

అంతట జగత్పతియగు హరుడు నందిపైనెక్కి వెడలెను; అసురసురేంద్ర నాయకులు కదలియాడెడు నిర్మల చామరయుతములగు స్వవాహనాస్వములతో అతనియందు పరుగెత్తుచుండిరి; నిర్మలహృదయులగు వారితో కూడి జ్వాలా యుక్తములగు పచ్చని నిట్టనిలువయిన జటాజూటములతో అలంకృతుడు జితేంద్రియుడునగు ఆ శివుడెంతగనో ప్రకాశించెను.

అంతట కాలకూట విషము ఉన్న క్షీరసాగరమును సమీపించి ఆ మహాదేవదేవుడు విషమ విషమును చూచి దాని నీడయున్నచోట (దానికి వెనుకగా) నిలిచి తన ఎడమచేతితో దానిని త్రావెను. అపుడు ఇంద్రాది హిరణ్యాక్షాది దేవాసులులెల్లరును పాడిరి ఆడిరి పుష్కల సింహనాదములు చేసిరి; ప్రసన్న హృదయులై దేవేశుని సంస్తుతించిరి; ఈ విషమ హరుని కంఠదేశము చేరగానే బ్రహ్మాది దేవతలును బలి ప్రముఖ దానవులును ఆ దేవునితో నిట్లనిరి; దేవా! నీ కంఠము ఇపుడు మొల్ల పూపువలె తెల్లని నీ దేహమున తుమ్మెదల వరుసవలె శోభించుచున్నది; కావున అది అందే యుండనిమ్ము. దేవతల ఈ మాటకు పురహరుడను సరేయనెను విష పానాంతరము దేవగణములను అటనే విడిచి హరుడు మందర శైలమునకు పోయెను! తరువాత మరల దేవదానవులు క్షీరాభ్దిని వివిధ రీతుల మథించిరి.

249 అధ్యాయము -శివనామ సప్తతి(70 నామములతో స్తుతి).

శివ పూజాదులందు ఈ నామావళి నుపయోగించుకొనవచ్చును.

ఓం విరూపాక్షాయనమః దేవదేవాయ వ్యక్తాయ

తిగ్మచక్షుషే వసురేతసే అవ్యక్తాయ

పినాకహస్తాయ ఏకవీరాయ వ్యక్తావ్యక్తాత్మనే

ధన్వినే సర్వాయ భక్తానాం ఆర్తినాశాయ

కామరూపిణ పింగకపర్దినే ప్రియనారాయణాయ

శూలహస్తాయ హర్త్రే ఉమాప్రియాయ

దండహస్తాయ కర్త్రే శర్వాయ

ధూర్జటయే త్రిపురఘాతినే నంది వక్త్రాంచితాయ

త్రైలోక్యనాధాయ శుద్ధభోదప్రబుద్ధాయ ఋతుమన్వన్తరకల్పాయ

భూతగ్రామ శరీరిణ 10 ముక్తి కైవల్య రూపిణ పక్షమానదినాత్మనే

సురారిహన్త్రే లోకత్రయ విధాత్రే నానారూపాయ

సోమార్క వహ్నిచక్షుషే వరుణంద్రాగ్ని రూపిణ ముండాయ

బ్రహ్మణ ఋగ్యజుస్సామ వేదాయ వరూథినే60

రుద్రాయ పురుషాయ

విష్ణురూపిణ ఈశ్వరాయ పృథుదండినే

బ్రహ్మణ అగ్ర్యాయ కపాలహస్తాయ

వేదరూపాయ ఉగ్రాయ 40 దిగ్వాసాయ (సనే)

విశ్వరూపిణ విప్రాయ ధన్వినే

యోగాయ శ్రుతిచక్షుసే రథినే

సాంఖ్యాయ రజసే యతయే

భూతానాం శంభవాయ 20 సత్త్వాయ బ్రహ్మచారిణ

మన్మథాంగ వినాశాయ తామసాత్మనే శివాయ

కాలక్షయంకరాయ అనిత్య నిత్యభాసాయ దేవదేవాయనమః

రంహసే నిత్య చరాత్మనే

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున అమృత మథనమున ఈశ్వరుడు కాలకూటమును భక్షించుటయను రెండు వందల నలువది తొమ్మిదవ యధ్యాయము

Sri Matsya Mahapuranam-2    Chapters