Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్విషష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

లిఙ్గలక్షణమ్‌.

సూతః అథాత స్సమ్ప్రవక్ష్యామి లిఙ్గలక్షణ ముత్తమమ్‌ | సుస్నిగ్ధంచ సువర్ణం చ లిఙ్గం కుర్యా ద్విచక్షణః.1

ప్రాసాదస్య ప్రమాణన లిఙ్గమానం విధీయతే | లిఙ్గమానేన వా విద్యా త్ప్రాసాదం శుభలణమ్‌. 2

చతురశ్రే సమే గర్తే బ్రహ్మసూత్రం నిపాతయేత్‌ | వామేన బ్రహ్మసూత్రస్య అర్చాం వా లిఙ్గమేవ చ. 3

ప్రాగుత్తరేణ లీనంతు దక్షిణాపరమాశ్రితమ్‌ | పురస్యాపరదిగ్భాగే పూర్వద్వారం ప్రకల్పయేత్‌. 4

పూర్వేణ చాపరం ద్వారం మాహేన్ద్రం దక్షిణోత్తరే | ద్వారం విభజ్య పూర్వం తు ఏకవింశతిభాగికమ్‌. 5

తతో మధ్యగతం జ్ఞాత్వా బ్రహ్మసూత్రం ప్రకల్పయేత్‌ | తస్యార్ధం తు త్రిధా కృత్వా భాగం చోత్తరత స్త్యజేత్‌. 6

ఏవం దక్షిణం స్త్యక్త్యా బ్రహ్మస్థానం ప్రకల్పయేత్‌ | భాగార్ధేన తు యల్లిఙ్గం కార్య తదిహ శస్యతే. 7

పఞ్చభాగవిభ##క్తే వా త్రిభాగే జ్ఞ్యైష్ఠ్య ముచ్యతే | భాజి తే నవధా గర్భే మధ్యమం పాఞ్చభాగికమ్‌. 8

పఞ్చభాగవిభ##క్తేన కనీయా నేకభాగికః | ఏకస్మిన్నేవ నవధా గర్భే లిఙ్గాని కారయేత్‌. 9

సమమాత్రం విభజ్యాథ నవదా గర్భభాజితమ్‌(జనమ్‌) | జ్యేష్ఠం మర్ధం కనీయో7ర్ధం తథా మధ్యమమధ్యమమ్‌ (మర్ధకమ్‌). 10

ఏవం గర్భ స్సమాఖ్యాత స్త్రిభి ర్భాగై ర్విభాజయేత్‌ | జ్యేష్ఠం తు త్రివిధం జ్ఞేయ మధ్యమం త్రివిధం తథా. 11

కనిష్ఠం త్రివిధం ల్లిఙ్గభేదా న్నవై వతు|

రెండు వందల అరువది రెండవ అధ్యాయము.

లింగ ప్రతిష్ఠా స్థాన నిర్ణయము- లింగ లక్షణము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను; ఇంతవరకును దేవతా పీఠికాలక్షణమును తెలిసికొంటిమి; కనుక ఇప్పుడు అందు ప్రతిష్ఠించవలసిన లింగపు లక్షణమును తెలిపెదను: ఇది ఉత్తమమయినది; శాస్త్ర సంప్రదాయముల నెరిగిన విద్వాంసుడగు శిల్పికాని ఆగమ శాస్త్రవేత్త కాని లింగమును చాల నునుపుగాను చక్కని వన్నెతో మెరయుచుండునట్లును నిర్మించవలయును; ప్రాసాదము(దేవతాగృహము- దేవాలయుము)ను ముందుగా నిర్మింపజేసి దాని కొలతను దృష్టియందుంచు కొని దానికి అనుగుణముగా లింగమునైన చేయవలయును; లేదా ప్రతిష్ఠించదలచిన లింగపు ప్రమాణమును మనస్సు నందుంచుకొని దాని కొలతకు అనుగుణముగా దేవాలయమును నిర్మించనైనవచ్చును; ఎటులయినను లింగముకాని ప్రాసాదము కాని ఈ రెండు శుభలక్షణములు కలిగి చూచుటకు అందముగా నుండవలయును.

దేవాలయపు గర్భ గృహమందు అర్చామూర్తినో లింగముచో ప్రతిష్ఠించుటకు

ఉద్దేశించిన ప్రదేశమునందు చతురస్రమయి లోతుకూడ చతురస్రపు భుజ పరమాణమంతయే యున్న (సమఘనాకారపు) గుంతను త్రవ్వవలయును; ఆ గుంతయందు ముందు చెప్పబోవు కొలతలను అనుసరించి బ్రహ్మసూత్రమును (ఆలయ గర్భగృహ మధ్యభాగమును నిర్ణయించు సూత్రమును- దారమును-రజ్జువును) వ్రసారించవలయును; ఈ బ్రహ్మ సూత్రము మీదుగ సరిగాలింగపు నడుమ బిందువు వచ్చునట్లుగాక లింగపు నడుమ బిందువు ఈ బ్రహ్మసూత్రమునకు కొంచెము ఎడమవైపుగావచ్చునట్లు లింగమును గాని అర్చామూర్తినిగాని ప్రతిష్ఠించవలయును.

పుర(గ్రామ) మునకు పశ్చిమ దిశగా అందును కొంచెము దక్షిణమున దేవాలయమును నిర్మించవలయును; అది కొలదిగ ఈశాన్యమునకు మలుపుగా నుండవలయును ఆలయపు ద్వారము తూర్పుదిశయందుండవలయును; ఈ ద్వారమునకు తూర్పుగా మరియొక ద్వారము కూడ ఉండవలయును; ఈ ద్వారమును 'మహేంద్రము' అని వ్యవహరింతురు; ఈ రెండిటిలో మొదటి వాకిటి దక్షిణోత్తరమానమును ఇరువదియొక భాగ*ములుగా విభజించవలయును: వానిలో నడిమి భాగపు నడిమి బిందుస్థానమును గుర్తించి దానిమీదుగా బ్రహ్మ సూత్రమును నిలుపవలయును.

1. తరువాత (ఈ ద్వారపు దక్షిణోత్తరాయామమును నాలుగు చతుర్థాంశముముగా విభజించి వానియందలి దక్షిణోత్తర చతుర్థాంశములను రెంటిని వదలి మిగిలిన చతుర్థాంశములను రెంటిని కలుపగా అర్ధ భాగమగును కావున ఆ) ద్వారాయామపు అర్ధభాగమును మూడు భాగములుగా చేయవలయును; వీనియందలి దక్షిణ తృతీయాంశమును ఉత్తర తృతీయాంశమును వదలి నడుమనున్న తృతీయాంశములో అర్ధాంశమును గ్రహించవలెను. ఈ నడిమి తృతీయాంశపు రెండు అపధుల నడిమి కొలతను బ్రహ్మ స్థానమందురు; దీనికే గర్భ స్థానమనియు వ్యవహారము. లింగపు

* ఆలయ ప్రాగ్ద్వారపు ఉత్తర దక్షిణాయామమును ఇరువదియొక సమభాగములు చేయవలెను అనుటనుబట్టి- సాధారణముగా వీరు (ప్రాచీనులు) ఆలయద్వారమును 84 అంగుళములు దక్షిణోత్తరాయామముతో పేట్టెడి వారనియు ఆనాటివారి ప్రమాణదండము (కొలత కర్ర) మీద 4 ఏసి అంగుళములకు ఒకటి చొప్పున గీతలు గీచి ఉంచు కొనెడివారనియు తోచును.

అడ్డు కొలత వ్యాసము ఈ పరిమాణములో నుండునట్లు చేయించవలయును; ఇదియొక విధమగు లింగ పరిమాణ నిర్ణయ ప్రకారము. ఇది సర్వసాధారణ ప్రకారము.

2. లేదా- ద్వార దక్షిణోత్తరాయామమును ఐదు భాగములుగా చేయవలయును. వానియందలు దక్షిణోత్తర భాగద్వయమును వదలవలయును. నడిమి భాగత్రయమును గ్రహించవలయును! ఈ నిడివిని బ్రహ్మ స్థానము (గర్భస్థానము)గా గ్రహించి ఇంత అడ్డుకొలతతో అడ్డు వ్యాసముతో లింగమును నిర్మింపజేయవలయును; ఇది జ్యేష్ఠ పరిమాణము.

3. లేదా- ద్వారదక్షిణోత్తరాయామమును తొమ్మిదిగా విభజించవలయును; వాని యందలి దక్షిణ భాగద్వయమును ఉత్తర భాగద్వయమును వదలవలయును; నడిమి భాగపంచకమును గ్రహించవలయును. ఇది బ్రహ్మస్థానముగా గ్రహించి ఈ ప్రమాణమును లింగపు అడ్డుకొలత వ్యాసముగా గ్రహించి అట్టి కొలతతో లింగమును నిర్మింపజేయవలయును. ఇది మధ్యమ పరిమాణము.

4. ద్వారదక్షిణోత్తరాయామమును ఐదు భాగములుచేసి ఉత్తర భాగద్వయమును దక్షిణ భాగద్వయమును వదలవలయును; నడిమి పంచమాంశ పరిమాణమును లింగపు అడ్డువ్యాసముగా గ్రహించి ఆ పరిమాణముతో లింగమును నిర్మింపజేయవలయును. ఇది

కనిష్ఠ పరిమాణము.

ఇదికాక జ్యేష్ఠ మధ్యమ కనిష్ఠ పరిమాణక లింగములను మూడింటిని కూడ మరల ఉపవిబాగములతో తొమ్మిది విధములుగా నిర్మించు పద్ధతియు కలదు. అది ఎట్లన- జ్యేష్ఠ పరిమాణక లింగపు పరిమాణమును మధ్యమ పరిమాణక లింగపు పరిమాణమును కనిష్ఠ పరిమాణక లింగపు పరిమాణమును కూడ వేరువేరుగా తొమ్మిదేసి భాగములుగా చేసి యుంచుకొనవలయును. వీనియందలి ప్రతియొక సవమాంశమును మరల రెండుగా విభజించవలెను.

ఇపుడు -(1) జ్యే 8/9 + జ్యే 1 /18 +జ్యే1 /18=జ్యేష్ఠ జ్యేష్ఠము; (2)జ్యే 8 /9 +జ్యే 1/ 18 +మ 1/18 =జ్యేష్ఠ మధ్యమము; (3) జ్యే 8/9+ జ్యే1/18+ క 1/18 =జ్యేష్ఠ కనిష్ఠము; (4) మ 8/9 +మ 1/18+జ్యే1/18 =మధ్యము జ్యేష్ఠము; (5) మ 8/9 +మ 1/ 18 +మ 1/18 మధ్యమ మధ్యమము; (6) మ 8 /9 +మ 1/18+క 1/18 =మధ్యమ కనిష్ఠము; (7) క 8/9 +క 1/18+ జ్యే 1/18 కనిష్ఠ జ్యేష్ఠము; (8) (క) 8/9+ క 1/18+ మ 1/18 =కనిష్ఠ మధ్యమము; (9) క 8/9 +క 1/18 +క 1/ 18= కనిష్ఠ మధ్యము- (అని ఇట్లు నవధాలింగభేద నిర్మాణమని మూల శ్లోకముల యన్వయమును బట్టి స్ఫురించుచున్నది; దీనిని సంప్రదాయజ్ఞులవలన తెలిసికొని నిశ్చయించుకొన వలెను.

నాభ్యర్ధ మష్టభాగేన విభజ్యాథ సమం బుధైః. 12

భాగత్రయం పరిత్యజ్య విష్కమ్భం చతురశ్రకమ్‌ | అష్టాశ్రం మధ్యమం జ్ఞేయం వృత్తభాగం తదూర్ధ్వతః. 13

వికీర్ణే చే త్తతో గృహ్య కోణాభ్యాం లాఞ్చయే ద్బుధః | అష్టాశ్రం కారయే త్తద్వ దూర్ధ్వ మప్యేవ మేవతు. 14

కిఞ్చిచ్చ పూజనం జ్ఞాత్వా షోడశాశ్రం ప్రదర్శయేత్‌ | షోడశాశ్రం కృతం పశ్చా ద్వర్తులం కారయేత్తతః. 15

ఆయామం తస్య దేవస్య నాభ్యాం వై కుణ్డలీకృతమ్‌ | మాహేశ్వరం త్రిభాగం తు ఊర్ధ్వవృత్తం తు యత్థ్సితమ్‌. 16

అధస్తా ద్బ్రహ్మాభాగస్తు చతురశ్రో విధీయతే | అష్టాశ్రో వైష్ణవో భాగో మధ్య స్తస్య ఉదాహృతః. 17

ఏవం ప్రమాణయుక్తం చ లిఙ్గం వృద్ధిప్రదం భ##వేత్‌ |

లింగరూప విశేష కథనము: లింగలక్షణము నెరిగి శిల్పి లింగమునందలి నాభి( నడుమ) నుండి క్రింది సగమును ఎనిమిది సమభాగములుచేయవలెను; దానియందు పైనుండి మూడు అష్టమాంశములను వదలి మిగిలిన ఐదు అష్టమాంశములను చతురస్రముగా చేయవలెను; పైమూడు అష్టమాంశములను అష్టాస్రముగా నిర్మించవలెను; అందులకై పద్ధతి ఏమనిన వికీర్ణ *(వెడల్పుగా- చతురస్రముగా చేయబడిన) ముఖములలో ప్రతిదానియందును రెండు చివరలయందలి కొంత కొంత భాగమును కోణములుగా చెక్కవలెను. అపుడది సహజముగా అష్టాస్రముగా అగును; ఇపుడిక మిగిలిన లింగపు నాభ్యూర్ధ్వ భాగమును గూడ ఎనిమిది సమభాగములుగా చేసి దానియందు నాభినుండి పైకిగల మొదటి మూడుభాగములను కూడ అష్టాస్రముగా చేయవలెను. నభ్యూర్ధ్వమందలి పూజాయోగ్య దేశమందు ఆరంభించి షోడశాస్రముగా రూపొందించుచు క్రమముగా దానిని వర్తులముగా చేసి ముగించవలయును. కాన నడిమి గురుతునకై నాభి భాగమునందు కుండలీకరణము(గుండ్రని రేఖను కొంచెములోతుగా చెక్కుట) చేయవలయును; (ఇపుడిట్లు మొత్తము లింగము 16 భాగములై అందు క్రింది 5 /16 చతురస్రముగా దానికిపైగా 6 /16 భాగములు అష్టాస్రముగా మిగిలిన 5/16 లో కొంత భాగము షోడశాస్రముగా కొంతభాగము వర్తులముగానైనది; కాని షోడశాస్రము కూడ వర్తులముగానే బావించ వలయును ; ఇందు చతురస్రము బ్రహ్మాంశము; అష్టాస్రము విష్ణునంశము ; వర్తులము ఈశ్వరాంశము; ఇట్లు మొత్తము లింగము మూర్తియాత్మకమయినది; ఇట్లు ఈ చెప్పిన ప్రమాణములతో నిర్మించబడిన లింగము యజమానునకును ప్రజలకును వృద్ధిక్షేమప్రదము.

అథాన్యదపి వక్ష్యామి గర్భమాన ప్రమాణతః. 18

గర్భమానప్రమాణన లిఙ్గం యదుచితం భ##వేత్‌ | చతుర్ధా తద్విభజ్యాథ విష్కమ్భం తు ప్రకల్పయేత్‌. 19

తదేవ చాయతం సూత్రం భాగత్రయం వికల్పితమ్‌ | అధస్తా చ్చతురశ్రం తు అష్టాశ్రం మధ్యభాగతః. 20

పూజాభాగ స్తతో7ర్ధేన నాభిభాగ స్తథోచ్యతే | ఆయామే తద్భవేత్సూత్రం నాహస్య చతురశ్రకే. 21

చతురశ్రం పరిత్యజ్య అష్టాశ్రస్య తు యద్భవేత్‌ | తస్యాప్యర్ధం పరిత్యజ్య తతో వృత్తం తు కారయేత్‌.

*మత్స్య-అధ్యా 262; శ్లో. 14; లింగ లక్షణాధ్యాయము-

" వికీర్ణేచేత్తతోగృహ్య- కోణాభ్యాంలాంఛయేద్భుధః"

వికీర్ణం - విస్తారితం- వ్యాపితం; తస్మినే వికీర్ణే; అనగా వెడల్పుగానున్న ; పార్శ్వే - చతురస్రస్య- ఇతి శేషః; చ+ఇత్‌ =చేత్‌ (యది అను అర్థమున- చేత్‌- కాదు; ఇత్‌- ఏవార్థకము; చ- ఇత్‌= చ ఏవ; కాగా- విస్తారితే- చతుర స్రస్య పార్శ్వే ఏవ గృహ్య- గృహీత్వా- బుధః లింగనిర్మాణశాస్త్రజ్ఞః- కోణాభ్యాం లాంఛయేత్‌- అని అన్వయము.

లింగమును రూపొందించుటకై నిర్దేశించుకొనినశిలకు దిగువభాగమునందలి చతురస్రపు ప్రతియొక పార్శ్వమును తీసికొని అట్టి ప్రతియొక పార్శ్వమునందును రెండేసి కోణములను ఏర్పరచవలెను. ఆ కోణములతో ఆ శిల 'లాంఛితము' 'లక్షణము - గుర్తుకలది'గా అగును; దీనితో ఈ చతురస్రము అష్టాస్రముగా మారును; ఇట్లే అష్టాస్రమును షోడశాశ్రముగా మార్చవచ్చును; అది క్రమముగా వర్తులమగును. ఇట్లు మొత్తము లింగమును 16 భాగములు చేయగా అందు- క్రిందినుండి మొదటి 5/16 భాగముల చతురస్రమగును; నడిమి 6/16 భాగములు అష్టాస్రమగును. మిగిలిన పై 5/ 16 లో కొంత భాగము షోడశార్పమై అది క్రమముగా వర్తులమగును.

శిరః ప్రదక్షిణం తస్య సఙిక్షప్తం వర్ణతో భ##వేత్‌ | జ్యేష్ఠం పూజ్యం భ##వేల్లిఙ్గ మధస్తాం ద్విపులం చ యత్‌. 23

శిరసాచ సదా నిమ్నం మనోజ్ఞం లక్షణాన్వితమ్‌ | సౌమ్యం తు దృశ్యతే లిఙ్గం లిఙ్గం తద్వృద్దిదం భ##వేత్‌. 24

అథ మూలేచ మధ్యేచ ప్రమాణం సర్వత స్సమమ్‌ | ఏవం విధం తు యల్లిఙ్గం భ##వే త్త త్సార్వకామికమ్‌. 25

అన్యథా యద్భవేల్లిఙ్గం త దస త్సమ్ప్రచక్షతే | ఏవం రత్మమయం కుర్యా త్స్ఫాటికం పార్థివం తథా. 26

శుభం దారుమయం వాపి యద్వా మనసి వర్తతే. 26

ఇతి శ్రీమత్స్య మహాపురాణ లిఙ్గలక్షణం నామ

ద్విషష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

గర్భాలయపు ప్రమాణము ననుసరించి తగినట్లు నిర్మించదగిన లింగలక్షణమును మరియొక దానిని తెలిపెదను; ఎట్లనగా పైని చెప్పినట్లు గర్భాలయద్వార ప్రమాణముననుసరించి జ్యేష్ఠ మద్యమ కనిష్ఠ పరిమాణములలోని వానినుండి ఏర్పడు నవభేదాములలోను ఏ పరిమాణమునైన గ్రహించి ఆ పరిమాణము మొత్తపు లింగపు నిలువుటెత్తులో నాలుగవ వంతగునట్లు చూడవలెను. అనగా ఈ గ్రహించిన పరిమాణమునకు నాలుగింతలు పొడవుతో లింగముండవలెను. ఈ మొత్తము ఎత్తును మూడు సమభాగములుగా చేసి మొదటి క్రింది భాగమును చతురస్రముగా నుంచవలెను; నడిమి భాగమును అష్టాస్రముగా మలచవలెను. ఈ అష్టాస్రభాగమందలి సగము (ఇది మొత్తము లింగపుటెత్తులో సగమే కదా!) దగ్గర రేఖనిర్మించి దానిని పూజాభాగముగా గుర్తించవలెను. ఇపుడు అష్టాస్రభాగము రెండు అర్ధభాగములయినది; అష్టాస్రపు పై అర్ధభాగమునకు పైని మిగిలియున్న భాగమును క్రమముగ వర్తులముగా చేయవలెను. లింగశిరోభాగము అన్ని ప్రక్కలకును పల్లముగా వాలుచు అందముగా నుండవలెను; లింగము దిగువ భాగముకంటె పైనుండు భాగము తక్కువ వ్యాసముతో నుండవలెను; ఇట్లున్న జ్యేష్ఠ పరిమాణకలింగము పూజ్యమగును; మొత్తముమీద చూడగా లింగపు చతురస్రభాగపు నాలుగు భుజములచుట్టు కొలత (*నాహస్య -పరిణాహస్య- సూత్రం -అయామే స్యాత్‌) ఎంతయో లింగపు ఎత్తు అంత ఉండవలెను. ఇట్లు మనోహరమగుటతోపాటు లక్షయుక్తమగుచు సౌమ్యముగా కనబడు లింగము వృద్ధి ప్రదముగానుండును; ఇట్లు క్రింది వ్యాసపు కొలతకంటె పై వ్యాసపు కొలత తక్కువకాక- మూలమందును నడుమను అంతమందును సమానముగానుండు లింగము సర్వకామ ఫలప్రదమగును; ఈ రెండు విధములలో ఏదియు కాని లింగము అనత్‌( మంచిది కాని) లింగము అని పంద్దలందురు.

ఇట్లు లింగమును రత్నములతోనో స్ఫటికముతోనో మృత్తికతోనో శిలతోనో దారువుతోనో తన మనస్సునకు నచ్చిన ఏ పదార్థముతోనైనను చేయించవచ్చును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున లింగలక్షమ ప్రతిపాదనమను é

రెండు వందల అరువది రెండవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-2    Chapters