Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రిషష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః

దేవతా ప్రతిష్ఠావిధిః- కుండమండపవేదీనాం లక్షణం చ.

ఋషయః : దేవతానా మథైతాసాం ప్రతిష్ఠావిధి ముత్తమమ్‌| కుణ్డమణ్డపవేదీనాం ప్రమాణం చ యథాక్రమమ్‌. 1

వద సూత యథాన్యాయం సర్వేషామ ప్యశేషతః| సూతః : అథాత స్సమ్ప్రవక్ష్యామి ప్రతిష్ఠావిధి ముత్తమమ్‌. 2

* పరిణాహ పరి< (ఉపసర్గ)+ నాహ; అని రూపనిష్పత్తి; ఇచట ఆర్షప్రయోగముగా 'పరి'అను ఉపసర్గము లేకయే ఆ ఉపసర్గ ఉన్నచో ఇచ్చు 'పరిణాహము 'అను అర్థమున 'నాహా ' పదము ప్రయోగించబడినది. అని విజ్ఞులు గ్రహింతురుగాక.

కుణ్డమణ్డపవేదీనాం ప్రమాణం చ యథావిధి చైత్రే వా ఫాల్గునే వాపి జ్యేష్ఠి వా మాధవే తథా. 3

మాఘే వా సర్వదేవానాం ప్రతిష్ఠా శుభదా భ##వేత్‌ | ప్రాప్య పక్షం శుభం శుక్ల మతీతే దక్షిణాయనే. 4

పఞ్చమీ చ ద్వితీయా చ తృతీయా సప్తమీ తథా | దశమీ పౌర్ణమాసీ చ తథా శ్రేష్ఠా త్రయోదశీ. 5

అసు ప్రతిష్ఠాం విధివ త్కృత్వా బహుఫలం లబేత్‌ | అషాడే ద్వే తథా మూల ముత్తరాద్వయ మేవ చ. 6

జ్యేష్ఠా శ్రవణరోహిణ్యః పూర్వాభాద్రాపదా తథా | హస్తాశ్వినీ రేవతీ చ పుష్యో మృగశిరా స్తథా. 7

అనూరాధా తథా స్వాతీ ప్రతిష్ఠాదిషుశస్యతే | బుధో బృహస్పతీ శ్శుక్ర స్త్రయో 7ప్యేతే శుభగ్రహాః. 8

ఏభిర్నిరీక్షితం లగ్నం నక్షత్రం చ ప్రశస్యతే | గ్రహతారాబలం లభ్ద్వా గ్రహపూజాం విధాయ చ. 9

నిమి త్తం శకునం లభ్ద్వా వర్జయుత్వా7 ద్భుతాదికమ్‌ | శుభయోగే శుభస్థానే క్రూర గ్రహవివర్జితే. 10

లగ్నే ఋక్షేచ కుర్వీత ప్రతిష్ఠాదిక ముత్తమమ్‌ | అయనే విషువే తద్వ త్షడశీతిముఖే తథా. 11

ఏతేషు స్థాపనం కార్యం విధిదృష్టేన కర్మణా | ప్రాజాపత్యేతు శయనం శ్వేతే తూత్థాపనం తథా. 12

ముహుర్తే స్థాపనం కుర్యా త్పున ర్బ్రహ్మే విచక్షణః |

రెండు వందల అరువది మూడవ అద్యాయము.

దేవతా ప్రతిష్ఠా విధి- కుండ మండప వేదుల లక్షణము

ఋషులు సూతునితో నిట్లనిరి: సూతా! ఈ దేవతల ఉత్తమమగు ప్రతిష్ఠా విధిని కుండ మండప ప్రమాణములను ఏమియు వదలక యథాక్రమమునను యథాన్యాయముగను (శాస్త్ర సంప్రదాయానుసారముగను యుక్తి యుక్తముగను) తెలుపుము. అన సూతుడు పారికిట్లు చెప్పెను:

మీరు అవి తెలిసికొన జిజ్ఞాసువులయి యున్నారు కావున ఉత్తమమగు ప్రతిష్ఠా విధానమును కుండ మండప వేదికల లక్షణములను కూడ యథా శాస్త్ర విధానాను సారముగ తెలిపెదను.

కాలము

ఎల్ల దేవతల ప్రతిష్ఠలకును చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాఘ ఫాల్గున మాసములు ప్రశస్తములు; శుక్ల పక్షమును ఉత్తరాయనమును మంచివి; తిథులలో ద్వితీయా తృతీయా పంచమీ సప్తమీ దశమీ త్రయోదశీ పూర్ణిమలు మంచివి; ఈ చెప్పిన వానియందు యథా విధిగ ప్రతిష్ఠ జరిపినతో బహు ఫలము లభించును.

నక్షత్రములలో పూర్వాషాఢోత్తరా షాఢలు- మూలోత్తర ఫల్గున్యుత్తరా భాద్రలు జ్యేష్ఠ శ్రవణము రోహిణి పూర్వా భాద్ర హస్త అశ్విని రేవతి పుష్యమి మృగశిర అనూరాధ స్వాతి- ఈ నక్షత్రమలు మంచివి; బుధ బృహస్పతి శుక్రులు అను మూడు గ్రహములలోనేవి కాని చూచుచుండు లగ్నమును నక్షత్రమును ప్రశ స్తములు.

గ్రహ బల తారా బలములను చూచికొని గ్రహపూజను జరిపి ప్రశ స్తమగు నిమిత్తమును శకునమును చూచికొని అద్భుతములు మొదలగు క్రూరములగునవేవియు జరుగని సమయమున శుభయోగమున క్రూర గ్రహములు లేని శుభస్థానమున (రాశియందు) శుభలగ్నమునందు శుభ నక్షత్రమునందు అయన పుణ్యకాల విఘవ పుణ్యకాల షడశీతి ముఖ పుణ్య కాలమందు శాస్త్ర విధానమునందు చెప్పిన ఆయా కర్మలననుష్ఠించుచు దేవతా ప్రతిష్ఠ జరుపవలయును.

ముహుర్తముల విషయమున- ప్రాజా పత్యముహుర్తమునందు దేవతార్చా మూర్తి శయనమును శ్వేతముహుర్తమునందు ఉత్థాపనమును బ్రహ్మముహుర్తమునందు స్థానమును (ప్రతిష్ఠాపనమును) జరుపవలయును.

ప్రాసాదస్యోత్తరే వాపి పూర్వేవా మణ్డపో భ##వేత్‌.

హస్తా న్షోడశ కుర్వీత దశ ద్వాదశ వా పునః | మద్యే వేదికయా యుక్తః పరిక్షిప్త స్సమన్తతః. 14

పఞ్చ సప్తాపి చతురః కరా స్కుర్వీత వేదికామ్‌ | చతుర్భి స్తోరణౖ ర్యుక్తో మణ్డప స్స్యా చ్చతుర్ముఖః.15

ప్లక్షద్వారం భ##వే త్పూర్యం యామ్యే చౌదుమ్బరం భ##వేత్‌ | పశ్చాదశ్వత్థఘటికం న్యగ్రోదం చ తథోత్తరే. 16

భూమౌ హస్తప్రవిష్టాని చతుర్హస్తాని చోచ్చ్రయే | సూపలిప్తం తథా శ్లక్షణం భూతలం స్యా త్సుశోభనమ్‌. 17

వసై#్త్ర ర్నానావిధై స్తద్వ త్పుష్పపల్లవశోభితమ్‌ | కృత్వైవం మణ్డపం పూర్వం చతుర్ద్వా రేషు విన్యసేత్‌. 18

అవ్రణా న్కలశా నష్టౌ జ్వలత్కాఞ్చనగర్భితా & | చూతపల్లవసఞ్ఛన్నా

న్త్సితవస్త్రయుగాన్వితా&. 19

నానా పుష్పఫఫలోపేతాం శ్చన్దనోదకపూరితా & | ఏవం నివేశ్య తద్గరే గన్ధధూపార్చనాదిభః. 20

ధ్వజాధిరోహణం కార్యం మణ్డపస్య సమన్తతః | ధ్వజాంశ్చ లోకపాలానాం సర్వదిక్షు నివేశ##యేత్‌. 21

బలిం చ లోకపాలేభ్య స్స్వమన్త్రేణ నివేదయేత్‌| ఊర్ధ్వం తు బ్రహ్మణో దేయం త్వధస్తా చ్ఛేషవాసుకేః. 22

సంహితాయాం తు యే మన్త్రాస్తద్దైవత్యా శ్శ్రుతౌ స్మృతాః | తైః పూజా లోకపాలానాం కర్తవ్యా చ సమన్తతః. 24

త్రిరాత్ర మేకరాత్రం వా పఞ్చరాత్ర మథాపి వా | అథవా సప్తరాత్రం వా కార్యం స్యా దధివాసనమ్‌. 25

ఏవం సతోరణం కృత్వా అధివాసనమణ్డపమ్‌| తస్య చోత్తరతః కుర్యా త్స్ననమణ్డప ముత్తమమ్‌. 26

తదర్ధేన త్రిభాగేన చతుర్భాగేన వాపునః | ఆనీయ లిఙ్గ మార్చాం వాశిల్పినం పూజయే ద్భుధః. 27

వస్త్రాభరణరత్నైశ్చ యే7పి తత్పరిచారకాః| క్షమధ్వ మితి తా న్భ్రూయా ద్యజమానో 7ప్యతః పరమ్‌.

మండపాది లక్షణము

ప్రాసాద (దేవాలయ)మునకు ఉత్తరమందుకాని తూర్పున కాని (హోమాది ప్రక్రియలకు ) మండపముండవలయును; అది పదునారుకాని పండ్రెండు కాని హస్తముల (మూరల) ప్రమాణముకల నాలుగు భూజములతో చతురస్రాకృతితో నుండవలయును; దాని నడుమ వేదిక యుండవలయును; ఈ మండపము చుట్టును అంచుకట్ట మొదలగు అవధి జ్ఞాపి కలు ఉండవలయును. ఈ వేదిక నాలుగుకాని ఐదు కాని ఏడుకాని మూరల భుజములతో చతురస్రముగా నుండవలయును; ఈ మండపము చతుర్ముఖమై నాలుగువైపుల నాలుగు తోరణములతో(ద్వాకరములతో) నుండవలయును; ఈ ద్వారములలో తూర్పు ద్వారము జువ్వి కొయ్యతో దక్షిణ ద్వారము మేడి కొయ్యతో పశ్చిమ ద్వారము రావి కొయ్యతో ఉత్తర ద్వారము మర్రి కొయ్యతో చేయవలయును; ఈ ద్వారముల నిలువు కమ్ములు ఐదు మూరల పొడవుతో చేయవలయును; అందు ఒక మూరెడు ముక్క భూములోనికి పోగా నాలుగు మూరలు భూమిపై నుండును.

మండప మందలి భూతల మంతయు చక్కగా అలికి కంటికి ఇంపుగా నుండునట్లు చేయవలయును; దానినంతటిని నానా విధ వస్త్రములతోను పుష్పములతోను పల్లములతోను అలంకృతమునుగా చేయవలయును; ఇట్లు మండపమును శోభింపజేసిన తరువాత నాలుగు ద్వారములందును ఒక్కొక్క ద్వారపు రెండేసి నిలువు కమ్ముల దగ్గరను రెండేసి చొప్పిన మొత్తము ఎనిమిది కలశములను ఉంచవలయును; వానికి రంధ్రములు సొట్టలు మొదలగునవి యుండరాదు; వానియందు ప్రకాశించు పదారు వన్నె బంగారు ఉంచవలును; మామిడి చిగుళ్లతో వానిని కప్పవలయును; రెండేసి నూతన వస్త్రములు చుట్టవలెను; నానా పుష్ప ఫలములనందుంచవలెను; ఇట్టి ఈ కలశములను చందనోదకముతో నింపవలయును; ఆ మండపాంతచర్భాగమునందు ఇవన్నియును నిలిపి వానికి గంధ ధూపాదికముతో అర్చనలు జరుపవలయును; తరువాత మండపముపై అన్ని వైపులను ధ్వజములను (జెండాలను) ఎక్కించవలెను. ఇవి కాక అన్ని దిక్కులందును ఆయా దిక్పాలకులకు చెందిన ధ్వజములను కూడ ఎక్కించవలయును; మండపు పై భాగమున నట్టనడుమ మేఘమువంటి ధ్వజ మును ఒక దానిని కూడ ఎక్కించవలయును; వానికి ఆయా దేవతా మంత్రములతో గంధ ధూపాదికముతో యథాక్రమ ముగ అర్చనలు జరుపవలయును; వారి వారి మంత్రములతో లోకపాలురకు బలులుకూడ అర్పించవలయును; బ్రహ్మకు అంతటిలో పై భాగమందును శేషునికి వాసుకికి అంతటిలో క్రింది ప్రదేశమందును పుష్పగంధాదికమును అర్పించవలయును; ఆయా దేవతలకై ఏయే మంత్రములు శ్రుతియందు చెప్పబడి యున్నవో ఆయా లోకపాలురకు ఆయా మంత్రములతో పూజయును జరుపవలయును. ఇట్లు తోరణ సహితముగా అధివాసనశాలను ఏర్పరచిన తరువాత దేవతా మూర్తులకు ఒక రాత్రి కాని మూడు రాత్రులుకాని ఐదు రాత్రులుకాని ఏడు రాత్రులుకాని అధివాసనము జరుపలయుండును.

ఈ అధివాసన మండపమునకు ఉత్తరమున ఈ మండలపు కొలతలో సగము కొలతతోకాని మూడవవంతు కొలతతో కాని నాలుగవ వంతు కొలతతో కాని స్నానమండపమును నిర్మించవలయును. లింగమునో అర్చామూర్తినో (ప్రతిష్ఠించవలసినదానిని) తెప్పించిన తరువాత ఆ తెచ్చిన శిల్పులను వారి పరిచారకులను కూడ యజమానుడు ఆయా విషయములను సంప్రదాయములను ఎరిగి వస్త్రాభరణాదితముతో పూజించవలయును. తరువాత క్షమించుడని అతడు వారిని ప్రార్థించవలయును.

నేత్రోన్మీలన విధానము.

( ఈ చెప్పబోవు ప్రక్రియను నేత్రోన్మీలనము- నేత్రోద్ధరణము (కనురెప్పలుపైకెత్తుట- కనులు తెరచుట- కనులకు చూపు వచ్చునట్లు చేయుట కనులకు ప్రకాశమును- జ్యోతిస్సును కలిగించుట-) మొదలగు పదములతో ఇందు వ్యవహరించియున్నారు. దేవతా ప్రతిష్ఠాప్రక్రియయందిది ముఖ్యాంశము).

నేత్రోన్మీలనవిధిః

దేవం ప్రస్తరణ కృత్వా నేత్రజ్యోతిః ప్రకల్పయేత్‌| అక్షణో రుద్ధరణం వక్ష్యే లిఙ్గస్యాపి సమాసతః. 29

సర్వతస్తు బలిం దద్యా త్సిద్ధార్థఘృతపాయసైః | శుక్లపుషై#్ప రజఙ్కృత్య ఘృతగుగ్గులుధూపకైః. 30

విప్రాణాం చార్చనం కుర్యా ద్ధద్యా చ్ఛక్త్యా చ దక్షిణమ్‌| గాం మహీం కాఞ్చనం చైవ స్థాపకాయ నివేదయేత్‌. 31

లక్షణం కారయే ద్భక్త్యా మన్త్రేణానేన వై ద్విజః | ఓం: నమో భగవతే తుభ్యం శివాయ పరమాత్మనే. 32

హిరణ్యరేతసే విష్ణో విశ్వరూపాయ తే నమః | మన్త్రో7యం సర్వదేవానాం నేత్రజ్యోతిష్ష్వపి స్మృతః. 33

ఏవమామన్త్య్ర తం దేవం కాఞ్చనేన విలేఖయేత్‌ | మఙ్గళ్యాని చ వాద్యాని బ్రహ్మఘోషం సగీతకమ్‌. 34

సిద్ద్యర్థం కారయే ద్విద్యా నమఙ్గళ్యనివారణమ్‌ |

దేవుని అర్చామూ ర్తిని (లింగమును) దర్భలు మొదలగు వానితో ఏర్పరచిన ప్రస్తరణముపై (పాన్పుపై) ఉంచి ఆ మూర్తికి నేత్రజ్యోతిస్సును ప్రకల్పింప (ఏర్పరచ) వలయును; సంక్షేపముగా ఈ అక్ష్యుద్ధరణ ప్రక్రియను (అక్షి+ ఉద్దరణము =అక్ష్యుద్దరణము- కనులు- పైకెత్తుట- మూతను తెరచుట -అని -యర్థము) తెలిపెదను - వినుడు; మూర్తిని తెల్లని పూవులతో అలంకరించి నేతితోను గుగ్గులుతోను ధూపమిచ్చి అర్చించవలయును; తెల్లని ఆవలతోను నేతి పాయసముల తోను మూర్తికి బలి (నివేదనము) జరుపవలయును: విప్రులనుకూడ అర్చించవలయును; యథా శక్తిగ వారికి గోవునో భూమినో బంగారమునో దక్షిణగా స్థాపకునకు (ప్రతిష్ఠా ప్రక్రియలో ప్రధాన ఋత్విక్‌ - అధ్వర్యుడు - గానున్న విప్రునకు) ఈయవలయును. తరువాత (స్థాపక) ద్విజుడు ఈ మంత్రముతో భక్తి పూర్వకముగా మూర్తికి లాంచనము (మంత్రమును ఆ మూర్తిపై వ్రాయుట) జరుపవలయును.

మంత్రార్థము: సర్వమును ప్రణవాత్మకము; ప్రణవలముకంటె వేరగునది ఏదియును లేదు; భగవానుడవును(ఈ భగవత్‌ శబ్దమునకు అర్థము లోగడ చెప్పబడినది) వేదరూపుడవును శుభకరుడవును పరమాత్మడవును హరిణ్యరేత స్కుడవును (స్వయంజ్యోతిరూప వీర్యము కలవాడవు) సర్వవ్యాపియును సకల విశ్వరూపుడను సకల విశ్వములకు చూపును ప్రసాదించువాడవునునగు నీకు నమస్కారము.

నేత్ర జ్యోతిః (నేత్రోన్మీలన) ప్రక్రియను జరుపునపుడు సర్వదేవతల విషయమునందును వినియోగింపవలసిన మంత్రమిదియే; ఇట్లీ మంత్రమును పఠించుచు దేవుని ఆ మూర్తిలోనికి ఆవాహనము జరిపి (దేవుని ఆ మూర్తిలోనికి వచ్చి యుండుమని ఆహ్వానించి) అదే సమయమున ఆ మంత్రమును బంగారు ఉపకరణముతో మూర్తిపై విలిఖించవలయును. ఈ ప్రక్రియ సరిగా సిద్దించుటకుగాను శాస్త్రసంప్రదాయముల నెరిగిన స్థాపకుడు మంగళవాద్య ధ్వనులను వేదధ్వనులను పాటలు గానము మొదలగు వానిని జరిపించవలయును; ఆమంగళకరములగు నవి ఏవియు అచట జరుగకుండునట్లు చూచుకొనవలయును.

లక్షణ్యోద్ధరణం కుర్యా ల్లిఙ్గస్య సుసమాహితః. 35

త్రిధా విభజ్య పూజ్యాయాం లక్షణం స్యా ద్ద్విభాగకమ్‌ | లేఖాత్రయం తు కర్తవ్యం యవాష్టాన్తరసంయుతమ్‌. 36

న స్థూలం న కృశం తద్వ చ్ఛేదభేదవివర్జితమ్‌ | నిమ్నం యవప్రమాణన జ్యేష్ఠలిఙ్గస్య కారయేత్‌. 37

సూక్ష్మాస్తతస్తు కర్తవ్యా యథా మధ్యమకస్యసమ్‌ | అష్టభక్తం తతః కృత్వా త్యక్త్వా భాగత్రయం బుధః.

లమ్భయే త్సప్తరేఖాస్తు పార్శ్వయో రుభయో స్సమాః |

భ్రామ్యతే పంచ భాగార్ధం కారయేత్సంగమం తతః | తావత్ప్రలంబయేద్విద్వాన్యావద్భాగచతుష్టయమ్‌. 39

రేఖయో స్సఙ్గమే తద్వ త్పృష్ఠే భాగద్వయం భ##వేత్‌. 40

ఏవ మేత త్సమాఖ్యాతం సమాసా ల్లక్షణం మయా.

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ దేవతాప్రతిష్టానుకీర్తనే మణ్డపనిర్మాణాదికథనం

నామ త్రిషష్ట్యుత్తర ద్విశతతమో7 ధ్యాయః.

లక్షణోద్ధారము.

(మన దేశమున రాయంసీమ మొదలగు కొన్ని ప్రాంతములందు పూర్వము లింగాకృతితోనుండు 'బొడ్డురాయి 'అను శిలను గ్రామములందు ఊరి నడిబొడ్డు మొదలగు వానిని గుర్తించుటకై నిలిపెడివారు. వానినుండి అర్ఛాలింగమును వేరుపరచి చూపుటకీ 'లక్షణోద్ధారము 'పనికివచ్చును. ఒకనాటికి ఆలయము శిథిలమై 'కేవలలింగము' దొరకినపుడును ఇది అర్చాలింగమేయని దీనితో గురుతింవవచ్చును)

తరువాత స్థాపకుడు మిగుల అవదానముకల మనస్సుతో లింగమునకు (అర్చామూర్తికి) 'లక్షణోద్ధారము' జరుపవలయును; అర్చాలింగము పూజింపబడు భాగమునందు- అనగా లింగపు ముఖము అనదగినచోట - ఈ లక్షమమును- గురుతును-ఏర్పరచవలయును: ఎట్లనగా ముఖభాగమును నిలువున మూడుగా విభజించుకొని వానిలోని పైభాగమును వదలి మిగిలిన రెండు (దిగువ) భాగములందు క్రమ్మునట్లుగా మూడు అడ్డు గీతలు చెక్కవలయును: అవి ఒకదానికి మరియొకటి

ఎనిమిదియవల (ఒక భారతీయాంగుళము) ఎడమలో నుండవలయును. ఇవి అంతగా లావుగనుండరాదు; అంతగాసన్నగ నుండరాదు: ఎట్లన- లోగడ తెలిపిన వానిలో జ్యేష్ఠపరిమాణకలింగమునందు ఈ రేఖలలోతు ఒక యవ పరిమాణము (1/ 8 భారతీయాంగుళము)తో నుండవలెను. మధ్యమ పరిమాణక- *కనిష్ఠపరిమాణక లింగములందివి ఇంకను తక్కువ లోతుననే ఉడవలయును. తరువాత లింగపు నిలువుటెత్తును ఎనిమిది భాగములుచేసి పై మూడు భాగములను వదలి అక్కడి నుండి దిగువకు- లోగడ చెక్కిన అడ్డురేఖలకు రెండు పార్శ్వములందును వచ్చునట్లు సమదైర్ఘ్యముగల ఏడు రేఖలను నిలువుగా చెక్కవలెను. వానిలో నాలుగవ భాగమందలి రేఖదిగువకొన ఐదవభాగమందలి రేఖపై కొనను తాకునంతవరకు తెచ్చి ఆ రెంటిని కలుపవలెను. ఇట్లు రేఖాద్వయ సంగమ స్థానమునందును దానివెనుక భాగమునందును రెండు వేరు వేరు భాగములేర్పడును.

ఇట్లు మీకు సంక్షేపముగా లింగ లక్షణోద్ధార విధానమును తెలిపితిని

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున దేవతా ప్రతిష్ఠానుకీర్తనమున మండప నిర్మాణాది కథనమను రెండు వందల అరువది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters