Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకసప్తత్యుత్తద్విశతతమో7ధ్యాయః.

భవిష్యద్రాజాను కీర్తనమ్‌.

సూతః బృహద్రథేష్వతీతేషు వీతిహోత్రే ష్వవన్తిషు | పులక స్స్వామినం హత్వా న్వపుత్త్రమభిషేక్ష్యేతి. 1

మిషతాం క్షత్త్రియాణాంతు బాలకః పులకోద్భవః | స వై ప్రణతసామన్తో భవిష్యో నయవర్జితః. 2

త్రయో వింశత్సమా రాజా భవితా స నరోత్తమః | అష్టావింశతివర్షాణి పాలకో భవితా నృపః.

విశాఖయూపో భవితా త్రిపఞ్చష త్తథా సమాః | ఏకవింశ త్సమా రాజా సూర్యకస్తు భవిష్యతి. 4

భవిష్యతి నృప స్త్రింశ త్తత్సుతో నన్దివర్దనః | ద్విపఞ్చాశ చ్ఛతం భుక్త్వా ప్రణష్టాః పఞ్చ తే నృపాః. 5

* ద్యుమత్సేనో

హృత్వా తేషాం యశః కృత్స్నం శిశునాగో భవిష్యతి | వారాణస్యాం సుతం స్థాప్యశ్రయిష్యతి గిరివ్రజమ్‌. 6

శిశునాగస్తు వర్షాణి చత్వారింశ ద్భవిష్యతి | కాకవర్ణః సుతస్తస్య షడ్వింశ త్ప్రాప్స్యతే మహీమ్‌. 7

షడ్వింశతిచ వర్షాణి క్షేమధన్వో (న్వా) భవిష్యతి | చత్వారింశ త్సమా రాజా క్షేమజి త్ప్రాప్స్యతే మహీమ్‌. 8

అష్టావింశతివర్షాణి విన్ధ్యసేనో భవిష్యతి | భవిష్యతి సమా రాజా నవ కాణ్వాయనో నృపః. 9

భూమిమిత్రస్సుత స్తస్య చతుర్దశ భవిష్యతి | అజాతశత్రు ర్భవితా సప్తవింశ త్సమా నృపః. 10

చతుర్వింశ త్సమా రాజా వంశకస్తు భవిష్యతి | ఉదాసీ భవితా తస్మా త్త్రయస్త్రింశ త్సమా నృపః. 11

చత్వారింశ త్సమా భావ్యో రాజా వై నన్దివర్దనః | చత్వారింశ త్త్రయశ్చైవ మహానన్ది ర్భవిష్యతి. 12

ఇత్యేతే భవితారో వై +వంశే7స్మి ఞ్చిశునాక (గ) జాః | శతాని త్రీణి పూర్ణాని షష్టివర్షాధికానిచ . 13

శిశునా (కా) గా భవిష్యన్తి రాజానః క్షత్రబన్ధనః |

రెండు వందల డెబ్బది యొకటవ అధ్యాయము.

భవిష్యద్రాజాను కీర్తనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: బృహద్రథులును వీతిహోత్రులును అవంతులును అను రాజవంశములు గడచిన తరువాత పులకుడను వాడు తన ప్రభుని వధించి తన కుమారుని రాజుగా అభిషేకించును; క్షత్త్రియులందరు చూచుచండగనే పులకపుత్త్రుడగు ఈ బాలకుడు నయవర్జితుడు (రాజధర్మానుసారము యోగత్య లేనివాడు) అయినను తనకు సామంతు లెల్లరు ప్రణతులు కాగా నరోత్తము డనిపించుకొని ఇరువది మూడేండ్లు పాలించును; తరువాత పాలకుడు ఇరువది ఎనిమిదేండ్లు విశాఖయూపుడు ఏబది మూడేండ్లు సూర్యుకుడు ఇరువది యొక్క ఏండ్లు వాని కొడుకు నందివర్ధనుడు ముప్పది ఏండ్లు పాలింతురు; ఇట్లు ఈ ఐదుగురు రాజులను నూట ఏబది రెండు ఏండ్లు (నూట ఏబదియైదేండ్లని యుండవలయును) పాలించి నశించురు; తరువాత శిశునాగుడు వారి కీర్తి యంతయు నశింపజేసి ఆ వంశము నణచి వారాణసియందు తన కుమారుని రాజుగా నిలిపి తాను గిరివ్రజ మాశ్రయముగా చేసికొని పాలించును; అతడు నలువదు ఏండ్లును వింధ్యసేనుడు ఇరువది ఎనిమిది ఏండ్లును కాణ్వాయనుడు తొమ్మిది ఏండ్లును అతని కుమారుడు భూమిమిత్రుడు పదునాలుగేండ్లును అజాతశత్రుడు ఇరువది ఏడు ఏండ్లును వంశకుడు ఇరువది నాలుగేండ్లును ఉదాసి ముప్పది మూడేండ్లును నందివర్ధనుడు నలువదేండ్లును మహానంది నలువది మూడేండ్లును రాజ్య మేలుదురు; ఇట్లు ఈ శిశునాగ(క) వంశరూవారగు క్షత్త్రబంధువులు (సుక్షత్త్రియులు కానివారు) మూడు వందల అరువది ఏండ్లు పాలింతురు; (ఈచెప్పినవి కూడ 350 మాత్రము అగును.)

ఏతై స్సార్ధం భవిష్యన్తి యావ త్కలినృపాః పరే. 14

తుల్యకాలం భవిష్యన్తి సర్వే హ్యేతే మహీక్షితః | చతుర్వింశ త్తథైక్ష్వాకాః పాఞ్చాలా స్సప్తవింతిః. 15

కాశేయాస్తు చతుర్వింశ దష్టావింశతి హైహయాః | కలిఙ్గాశ్చైవ *ద్వావింశ దశ్మకాః పఞ్చవింశతిః 16

కురవశ్చాపి షడ్వింశ దష్టావింశత్తు మైథిలాః | శూరసేనా స్త్రయోవింశ ద్వీతిహోత్రాస్తు వింశతిః. 17

ఏతే సర్వే భవిష్యన్తి ఏకకాలం మహీక్షితః | మహానన్ధిసుతశ్చాపి శూద్రాయాం కలికాంశజః. 18

ఉత్పత్స్యతే మహాపద్మః సర్వక్షత్రాన్తకో నృపః | తతః ప్రభృతి రాజానో భవిష్యా శ్శూద్రయోనయః19

ఏకరా ట్స మహాపద్మ ఏకచ్ఛత్త్రో భవిష్యతి | అష్టాశీతి న వర్షాణి పృథివ్యాం తు భవిష్యతి. 20

*దశ ద్వౌ శిశునాకజాః *ద్వాత్రింశ

సర్వక్షత్త్ర మథోత్సాద్య భావినా7ర్థేన చోదితః| *సుమాల్యాదిసుతా హ్యష్టౌ సమా ద్వాదశ తే నృపాః. 21

మహపద్మ స్య పర్యాయే భవిష్యన్తి నృపాః క్రమాత్‌| ఉద్ధరిష్యతి కౌడిల్య స్సమైర్ధ్వాదశభి స్సుతా& .22

కౌటిల్య శ్చన్ద్రగుప్తంతు తతో రాష్ట్రే 7భిషేక్ష్యతి | భుక్త్వా మహీం వర్షశతం తతో మౌర్యాన్గమిష్యతి. 23

భవితా శతధన్వాతు తస్య పుత్త్రస్తు షట్త్సమాః| బృహద్రథస్తు వర్షాణి తస్యపుత్త్రస్తు సప్తతిమ్‌. 24

*షడ్వింశత్తు మహారాజా భవితా శక ఏవచ | సప్తాసాం దశ వర్షాణి తస్య సప్తా భవిష్యతి.25

ఈ శిశునాగులు పాలించుచున్న కాలమందే ఆయా దేశ భాగములందు ఐక్ష్వాకులు ఇరువది నలుగురును పాంచాలురు ఇరువది ఏడుగురును కాశేయులు ఇరువది నలుగురును హైహయులు ఇరువది ఎనిమిది మందియు కళింగులు ఇరువది ఇద్దరును అశ్మకులు ఇరువదియైదు మందియు కురువులు ఇరువదియారుమందియు మైథిలులు ఇరువది ఎనిమిది మందియు శూరసేనులు ఇరువది ముగ్గురును వీతిహోత్రులు ఇరువది మందియు పాలింతురు; మహానందికి శూద్ర స్త్రీయందు కలియంశమున మహాపద్ముడను సర్వక్షత్త్రాంతకుడగు కుమారుడు కలుగును; అది మొదలు (ఆ వంశపు) రాజులు శూద్రయోనులు (జాతీయులు) అగుదురు; భవిష్యదదృష్టి ప్రేరితుడై సర్వ క్షత్త్రియులను నశింపజేసి అతడు ఈ పృథివియందు ఏకరాట్టును ఏకచ్ఛత్త్రుడును అగును; అతడట్లు ఎనుబది ఎనిమిదేండ్లు పాలించును; ఆ మహాపద్ముని కుమారులు పండ్రెండు మందియు సుమాల్యుడు మొదలగువారు (ఏడాది కొకడు చొప్పుననేమో) పండ్రెండేండ్లు పాలింతురు; అటు తరువాత వారి రాజ్యము మౌర్యులలో అనంతర రాజులకు పోవును; తరువాత చంద్రగుప్తుని పుత్త్రుడు శతధన్వుజారేండ్లు వాని కుమారుడు బృహద్రథుడు డెబ్బది ఏండ్లు తరువాత శకుడను వాడు ఇరువది యారేండ్లు వాని ముని మనమడు డెబ్బది ఏండ్లు పాలింతురు.

రాజా దశరథో 7ష్టౌ తు తస్య పుత్త్రోభవిష్యతి| భవితా నవవర్షాణి తస్య పుత్త్రస్తు సప్తతిమ్‌. 26

ఇత్యేతే దశ మౌర్యాస్తు యే బోక్ష్యన్తి వసున్దరామ్‌| సప్తవింశ చ్ఛతం పూర్ణం తతా శ్సుఙ్గా న్గమిష్యతి.27

పుష్యమిత్రస్తు సేనానీ స్సముద్దృత్య బృహద్రథాన్‌| కారయిష్యతి వై రాజ్యం షట్త్రింశతి సమా నృపః. 28

వసుమిత్రసుతో భావ్యో దశవర్షాణి వై నృపః | భవితా 7పి వసుజ్యేష్ఠ స్సప్తవర్షాణి వై నృపః. 29

తతో 7న్తక స్సమే ద్వే తు తస్య పుత్త్రో భవిష్యతి| భవిష్యతి తత స్తస్మా త్త్రీణ్యవం స పుళిన్దకః. 30

భవితా వడ్రమిత్రస్తు సమే రాజా పునర్భవః| ద్వాత్రింశచ్చ సమాభాగ స్సమాభాగా త్తతో నృపః. 31

భవిష్యతి సుతస్తస్య దేవభూమిః సమాదశ| దశైతే క్షుద్ర (శుంగ) రాజానో భోక్ష్యన్తీమాం వసున్ధరామ్‌. 32

శతం పూర్ణం తథా ద్వేచ తతః శుంగన్గమిష్యతి| అమాత్యో వసుదేవస్తు ప్రసహ్యా 7వ్యసనీ నృపమ్‌. 33

దేవభూమి మథోత్సాద్య శౌఙ్గస్స భవితా న-పః| భవిష్యతి సమా రాజా నవ కాణ్వాయనో నృపః. 34

భూమిమిత్ర స్సుతస్తస్య చతుర్ధశ భవిష్యతి |నారాయణ స్సుతస్తస్య భవితా ద్వాదశైవ తు. 35

సుశర్మా తత్సుతశ్చాపి భవిష్యతి దశైవతు| ఇత్యేతు శుంగ ధృత్యాస్తు స్మృతాః కాణ్వాయనా నృపాః. 36

చత్వారస్తు ద్విజా హ్యేతే కాణ్వా భోక్ష్యన్తివై మహీమ్‌| చత్వారింశ త్పఞ్చచైవ భోక్ష్యన్తీమాం వసున్దరామ్‌. 37

*షట్త్రింశతి *షట్త్రింశంత్తు

ఏతే ప్రణసామన్తా భవిష్యా ధార్మికాశ్చయే | తేషాం పర్యాయకాలేతు భూమి రన్ధ్రాన్గమిష్యతి. 38

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ భవిష్య ద్రాజాను కీర్తనం నామ

ఏకసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

వాని కుమారుడు దశరథుడు ఎనిమిదేండ్లు వాని కుమారుడు తొమ్మిదేండ్లు వాని కుమారుడు డెబ్బది ఏండ్లు పాలింతురు ; ఇట్లు మౌర్యులు పదిమంది నూట ఇరువది ఏడు సంవత్సరములు పాలింతురు; తరువాత ఆ రాజ్యము శుంగ వంశము వారికి పోవును; కడపటి బృహద్రథ వంశీయునినుండి వాని సేనాపతియగు పుష్యమిత్రుడు రాజ్యము లాగికొని ముప్పది యారేండ్లు పాలించును; తరువాత వసుమిత్రుడు పదేండ్లును వసుజ్యేష్ఠుడు పదేండ్లును వాని కుమారుడు డంతకుడు రెండేండ్లు ను పుళిందకుడును వజ్రమిత్రుడును ఈ ఇరువురును మొత్తము మూడేండ్లును పునర్భవుడు రెండు సంవత్సరములును సమాభాగుడు ముప్పది రెండు సంవత్సరములు ను వాని కిమారుడు దేపభూమి పది ఏండ్లును పాలింతురు; ఇట్లీ క్షుద్ర( శుంగ) రాజులు పదిమందియు నూరేండ్లు ఈ భూమి ననుభవింతురు; తరువాత రాజ్యము శుంగులను *విడిచి శుంగ భృత్యులకు (కాణ్వాయనులకు) పోవును; (ఇచట మూలమునందు సుంగపదము శుంగభృత్యులు అను నర్థములో వాడబడి నది;) దేవభూమియను వ్యననియగు రాజును ఉన్మూలించి అతని యమాత్యుడగు వసుదేవుడు రాజగును; వీరి వంశము కాణ్వాయన( శుంగభృత్య) వంశము ; ఇతడు తొమ్మిదేండ్లు పాలించును; తరువాత అతని కుమారుడు భూమిమిత్త్రుడు పదునాలుగేండ్లును వాని కుమారుడు నారాయణుడు పండ్రెండేండ్లును వాని కుమారుడు సుశర్మ పదేండ్లును పాలింతును. ఈ వంశపు రాజులకు శుంగభృత్యులు కాణ్వాయనులు అని వ్యవహారము; ఈ నలుగురు కాణ్వాయన బ్రాహ్మణులును నలువది యైదేండ్లు రాజ్య మేలుదురు; వీరందరును ప్రణత సామంత్రులును ధార్మికులును నగుదురు; వీరి యనంతరము భూపాలనాధి కారము వీరినుండి తొలగి ఆంధ్ర(ఆంధ్ర )రాజులకు పోవును.

(ముఖ్య గమనిక: చంద్రగుప్తుడు శతధన్వుడు బృహద్రథుడు తత్పుత్త్రుడు శకుడు వానిస్త(ముని మనుమడు) దశరతుడు తత్పుత్త్రుడు కలిసి ఎనిమిది తరములే కాని పది తరములు కాదు; శకుని మునిమనుమడు డెబ్బది ఏండ్లు పాలించెను అను దానిని- శకుని కుమారుడు మనుమడు- ముని మనుమడు- ఈ ముగ్గురును కలిసి మొత్తము డెబ్బది ఏండ్లు పాలించిరి అని చెప్పుకొనినచో ఇపుడు చంద్రగుప్తునుండి దశరథుని కుమారుని వరకు పది తరములగును; ఇక వీరి పరిపాలనా కాలమపరిమితి విషయ మాలోచింతము; చంద్రగుప్తుడు నూరేండ్లు ను అతని కుమారుడు ఆరేండ్లును మొత్తము నూట ఆరేండ్లు పోగా మిగిలిన ఎనిమిది తరముల వారి పరిపాలన కాలము నూట ఇరువది ఏండ్లు సంవత్సరములు అగును; చంద్ర గుప్తుని తరువాతి వీరి పేరుల విషయము మాత్రము విష్ణు పురాణ మత్స్య పురాణముల రెంటి నడుమ భిన్నాభిప్రాయము కనబడుచున్నది).

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున భవిష్యద్రాజవంశాను కీర్తనమను

రెండు వందల డెబ్బది యొకటవ అధ్యాయము.

అ. 271; ఈ భవిష్య ద్రాజానుకీర్తనాధ్యాయములో - కారక విశేషము.

''తతః శుంగా & గమిష్యతి''- శుంగాన్‌ త్యక్త్వా

కాణ్వాయనామ్‌ గమిష్యతి ఇత్యర్థే;

ఇది వారినుండి పోవును; (వారిని-ఉండి = వారిని విడిచి ) అను తెలుగు వాక్యమువలె నున్నది కదా!

Sri Matsya Mahapuranam-2    Chapters