Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

మహాభూతఘట దానవిధానమ్‌.

శ్రీమత్స్యః : అథత స్సమ్ర్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | మహాభూతఘటం నామ మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యాం తిథి మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్‌ | ఋత్విజ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదనాదికమ్‌. 2

తులాపురుషవ త్కుర్యా ల్లోకేశావాహనాదికమ్‌ | కారయే త్కాఞ్చనం కుమ్భం మహారత్నాచితం బుధః. 3

ప్రాదేశా దజ్గుళశతం యావ త్కుర్వా త్ర్పమాణతః | క్షీరాజ్యపూరితం తద్వ త్కల్పవృక్షసమన్వితమ్‌. 4

పద్మాసనతాం స్తత్ర బ్రహ్మవిష్ణుమహేశ్వరా9 | లోకపాలా న్మహేన్ద్రదీ న్త్సస్వవాహన మాస్థితా9 . 5

వరాహేణోద్దృతాం తద్వ త్కుర్యా త్పృథ్వీ సపజ్కజామ్‌ | వరుణం చసనగతం కాఞ్చనం మకరోపరి. 6

హుతాశనం మేషగతం వాయుం కృష్ణమృగాసనమ్‌ | తథా కోశాధిపం కుర్యా న్మూషకస్థం వినాయకమ్‌. 7

రెండు వందల ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.

మహాభూతఘటదాన విధానము.

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడిక మహాపాతక నాశనమును మహోత్తమమునగు మహాభూత ఘటదానమును వివరింతును; పుణ్యకరమగు పర్వదినమందు తులాపురుష దానమందువలెనే బ్రాహ్మణులచే పుణ్యాహవాచనమును జరిపించుకొనవలెను. అట్లే ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాదులను సమకూర్చు కొనవలయును; లోకపాలావాహనమును జరుపవలయును; ప్రాదేశ పరిమాణమునకు తక్కువకానిదియు నూరంగుళములకు మించనిదియునగు మహారత్న ఖచిత సువర్ణఘటమును చేయించి దానిని పాలతోనో నేతితోనో నింపి దానితో కల్పవృక్షమును కూడ జతపరచవలయును; పద్మాసనగతులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తమ తమ వాహనములయందు మహేంద్రాదిలోకపాలురను వరాహదేవునిచే ఉద్ధరించబడి పంకజముతో కూడియున్న పృథివిని మకరముపై కూర్చుండి యున్న వరుణుని మేషారూఢుడగు అగ్నిని నల్లని ఇర్రిపై కూర్చున్న వాయువును మూషకస్థుడగు అగు కోశాధిపతియైన వినాయకుని కూడ బంగారుతో చేయించవలెను.

విన్యన్య ఘటమధ్యే తా న్వేదపఞ్చకసంయుతా& | ఋగ్వేదస్యాక్షసూత్రం స్యా ద్యజుర్వేదస్య పఙ్కజమ్‌. 8

సామవేదస్య వీణా స్యాద్వేణుం దక్షిణతో న్యసేత్‌ | అథర్వవేదస్య పునస్స్రుక్స్రువౌ కమలం కరే. 9

పురాణవేదో వరద స్సాక్షసూత్రకమణ్డలుః | పరిత స్సర్వధాన్యాని చామరాసనదర్పణమ్‌. 10

పాదుకోపానహచ్ఛత్రం దీపికా భూషణానిచ | శయ్యాం చ జలకుమ్భాంశ్చ పఞ్చవర్ణం వితానకమ్‌. 11

స్నాత్వా7ధివాసనం కుర్యా దిమం మన్త్రముదీరయేత్‌ | నమో వ స్సర్వదేవానా మాధారేభ్య శ్చరాచరే. 12

మహాభూతాదిదేవేభ్య శ్శాన్తి రస్తు శివం మమ | యస్మా న్న కించిదవ్యస్తి మహాభూతై ర్వినాకృతమ్‌. 13

బ్రహ్మణ్డ సర్వభూతేషు తస్మా చ్ఛ్రీ రక్షయా7స్తు మే | ఇత్యుచ్చార్య మహాభూతఘటం యో వినివేదయేత్‌. 14

సర్వపాపవినిర్ముక్త స్స యాతి పరమాం గతిమ్‌ | విమానేనార్కవర్ణేన పితృబన్ధుసమన్వితః. 15

స్తూయమానో పరస్త్రీభిః పద మభ్యేతి వైష్ణవమ్‌ | షోడశైతాని యః కుర్యా న్మాహాదానాని మానవః. 16

న తస్య పునరావృత్తి రిహలోకే స జాయతే | ఇతి పఠతి య ఇత్థం వాసుదేవస్య పార్శ్వే స సుతపితృకళత్ర స్సంశృణోతీహ సమ్యక్‌. 17

మురరిపుభవనే వై మన్దిరే చార్కలక్ష్మ్యా త్వమరపురవధూభి ర్మోదతే సో7పి నిత్యమ్‌. 17u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానాను కీర్తనే మహాభూతఘట ప్రదానికో

నామ అష్టాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

వీటిని వేదపంచకములతో కూడ ఘటపు నడుమ నుంచవలయును; ఋగ్వేదమునకు అక్షసూత్రమును యజుర్వేద మునకు పద్మమును చేతులందును సామవేదమునకు వీణ సమీపమందు కుడివైపునను అథర్వవేదమునకు స్రుక్స్రువ కమల ములు కరములందును పురాణవేదమునకు అక్షసూత్రరమండలువులును వరదముద్రయు కరములందును ఉండవలయును; చుట్టు ప్రక్కలందు సర్వధాన్యములు చామరములు ఆసనములు అద్దము పాదుకలు పాదరక్షలు ఛత్త్రము దీపికయు భూషణములను శయ్యయు జలకుంభములును ఐదు వన్నెల వితానకమును ఉంచవలయును.

స్నానముచేసి దేవతాద్యుపాసనము జరిపి ఈ మంత్ర ముచ్చరించవలయును.

"ఈ చరాచర ప్రపంచమునందు సర్వభూతములకును ఆధారభూతులును మహాభూతములకు ఆదిదేవులును నగు మీకు నమస్కారము; ఇట్టి మీ దయవలన నాకు శాంతియు శివ( శుభ)మును కలుగును గాక! మహాభూతముల వ్యాప్తిలేని తత్త్వము బ్రహ్మాండమునందలి సర్వభూతములయందును ఏ యొకదానియందును లేదు: కావున వానికి మూలభూతులగు ఈ దేవతల కృపచే నాకు అక్షయ శ్రీ కలుగుగాక!"

ఇట్లుచ్చరించి మహాభూతఘటదానము చేయువాడు సర్వపాప వినిర్ముక్తుడై పరమగతి నందును ;ఉత్తమ దేవతా స్త్రీలచే స్తుతింపబడుచు పితృబంధు సమన్వితుడగుచు వైష్ణవ స్థానమును పొందును. ఎవ డీ షోడశ మహాదానముల నాచరించునో ఆ మానవుడు ఇహలోకమునందు పునరావృత్తి నందడు.

ఎవడు ఈ విధముగా నున్న ఈ షోడశ మహాదాన కల్పమును వాసుదేవ సన్నిధియందు పఠించునో సుతకలత్ర పుత్త్రసహితుడై లెస్సగ వినునో అతడు మురాసురశత్రుడగు విష్ణుని భవనమందు రవిసమాన తేజఃకాంతులతో నిండి అమరపుర స్త్రీలతో కూడి సదా మోదము నందును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున మహాభూతఘటన ప్రదానికమను రెండు వందల ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters