Sri Matsya Mahapuranam-2    Chapters   

నవత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

ఏతత్పురాణ విషయానుక్రమాణికా.

సూతః : ఏతద్వః కథితం సర్వం యదుక్తం విశ్వరూపిణా | మాత్స్యం పురాణ మఖిలం ధర్మకామార్థసాధన మ్‌. 1

యత్రాదౌ మనుసంవాదో బ్రహ్మణ్డకథనం తథా | సాఙ్ఖ్యం శారీరకం తద్వ చ్చతుర్ముఖముఖోద్భవమ్‌. 2

దేవాసురాణా ముత్పత్తి ర్మారుతోత్తత్తి రేవచ | మదనద్వాదశీ తద్వ ల్లోకపాలాభిషేచనమ్‌. 3

మన్వన్తరాణా ముద్ధేశో వైన్యరాజాభివర్ణనమ్‌ | సూర్యవైనస్వతోత్పత్తి ర్భుధస్యాగమనం తథా. 4

పితృవంశానుకథనం శ్రాద్ధకల్ప స్తథైవచ | పితృతీర్థ ప్రచారశ్చ సోమోత్పత్తి స్తథైవచ. 5

కీర్తనంసోమవంశస్య యయాతితరితం తతా | కార్తవీర్యస్య మహాత్మ్యం వృష్టివంశానుకీర్తనమ్‌. 6

భగృశాప స్తథా విష్ణోర్ధైత్యశాప స్తథైవచ | కీర్తనం పురువంశస్య వంశో హౌతాశన స్తథా. 7

పురాణకీర్తనం తద్వ త్క్రియా యోగ స్తథైవచ | వ్రతం నక్షత్రపురుషం మార్తణ్డశయనం తథా. 8

కృష్ణాష్టమీవ్రతం తద్వ ద్రోహిణీ చన్ద్రసంజ్ఞితమ్‌ | తటాకవిధిమాహాత్మ్యం పాదపోత్సవ ఏవచ. 9

సౌభాగ్య శయనం తద్వ దగస్తివ్రత మేవచ | తథానన్తతృతీయాతు రసకల్యాణినీతథా. 10

ఆర్ధ్రానన్ధకరీ తద్వ ద్వ్రతం సారస్వతం పునః | సప్తమీసప్తకం తద్వ ద్విశోకద్వాదశీవ్రతమ్‌. 11

ఉపరాగాభిషేకం చ సప్తమీస్నపనం పునః | భీమాఖ్యాద్వాదశీ తద్వ దనఙ్గశయనం తథా. 12

అశూన్యశయనం తద్వ త్తథైవాఙ్గారకవ్రతమ్‌ | మేరుప్రదానం దశధా గ్రహశాన్తి స్తథైవచ. 13

గ్రహస్వరూపకథనం తథా శివచతుర్దశీ | తథా సర్వఫలత్యాగః సూర్యావారవ్రతం తథా. 14

సఙ్క్రాన్త్యుద్యాపనం తద్వ ద్విభూతిద్వాదశీవ్రతమ్‌ | షష్టివ్రతానాం మాహాత్మ్యం తథా స్నానవిధిక్రమః. 15

ప్రయాగస్య చ మాహాత్మ్యం భువనస్యతు కీర్తనమ్‌ | ఐలాశ్రమఫలం తద్వల్లోకే ద్వాపాను కీర్తనమ్‌. 16

తథా న్తరిక్షచారం చ ధ్రువమాహాత్మ్యమేవచ | భువనాని సురేన్ద్రాణాం త్రిపురప్లోషణం తథా. 17

పితృపిణ్డదమాహాత్య్మం మన్వన్తరవివిర్ణయః | వజ్రాఙ్గస్యచ సమ్భూతి స్తారకోత్పత్తి రేవచ. 18

తారకాసురమాహాత్య్మం బ్రహ్మదేవానుకీర్తనమ్‌ | పార్వతీసమ్భవ స్తద్వత్తథా శివతపోవనమ్‌. 19

అనఙ్గదేహదాహస్తురతీశోక స్తథైవచ | గౌరీతపోవనం తద్వ ద్విశ్వనాథ ప్రసాదనమ్‌. 20

పార్వతీ ఋషిసంవాదం తథైవోద్వాహమఙ్గళమ్‌ | కుమారస్య తథోత్పత్తిః కుమారవిజయస్తథా. 21

తారకస్యవధో ఘోరో నారసింహోపవర్ణనమ్‌ | పద్మోద్భవవిసర్గస్తు తథైవాన్ధకఘాతనమ్‌. 22

వారాణస్యాస్తు మాహాత్య్మం నర్మదాయా స్తథైవచ | ప్రవరానుక్రమ స్తద్విత్పితృగాతానుకీర్తనమ్‌. 23

తథోభయముఖీనామ దానం కృష్ణాజినస్యచ | తత్ర సావిత్య్రుపాఖ్యానం రాజధర్మ స్తథైవచ. 24

యాత్రానిమిత్తకథనం స్వప్నమఙ్గళ్య కీర్తనమ్‌ | వామనస్యతు మాహాత్య్మం తథైవాథవరాజమ్‌. 25

క్షీరోదమథనం తద్వ త్కాలమకూటాభిశాసనమ్‌ | దేవాసురవిమర్ధశ్చ వాస్తు విద్యా తథైవచ. 26

ప్రతిమాలక్షణం తద్వ న్మణ్డపానాంచ లక్షణమ్‌ | ప్రాసాదలక్షణం తద్వ త్ప్రతిష్ఠావిధి ముత్తమమ్‌. 27

భవిష్యరాజ్ఞా ముద్ధేశో మహాదానానుకీర్తనమ్‌ | కల్పానుకీర్తనం తద్వ ద్గ్రన్థానుక్రమణం తథా. 28

ఏతత్పవిత్ర మాయుష్య మేత త్కీర్తివివర్ధనమ్‌ | ఏత త్సర్వగుణోపేత మేత త్కల్మషనాశనమ్‌. 29

ఏత త్పవిత్రం కల్యాణం మహాపాపహరం శుభమ్‌ | ఏత త్పురాణం పరమం సర్వదోష విఘాతకమ్‌. 30

అస్మా త్పురాణా త్సుకృతం నరాణామ్‌ | తీర్థావలీనా మవగాహనానామ్‌ |

సమస్త ధర్మాచరణోద్భవానామ్‌ | సదైవ లాభశ్చ మహాఫలానామ్‌.

అస్మా త్పురాణాదపి పాద మేకమ్‌ | పఠేత్తు యః సో7పి విముక్తపాపః |

నారాయణస్యాస్పద మేతి నూనమ్‌ | అనంగవ ద్దివ్యవపుః సుఖీ స్యాత్‌. 32

పురాణ మేత త్సకలం రహస్యమ్‌ | శ్రద్ధాన్వితః పుణ్య మిదం శృణోతి |

సచాశ్వమేధావ భృథ ప్రభావమ్‌ | ఫలం సమాప్నోతి హరప్రసాదాత్‌. 33

మత్స్యరూపేణ హరిణా కథితం మనవే7ర్ణవే | శివం విష్ణుం సమభ్యర్చ్య బ్రహ్మాణం సదివాకరమ్‌.

శ్లోకం శ్లోకార్ధపాదం వా శ్రద్ధయా యః శృణోతివా | శ్రావయేద్వా7పి ధర్మజ్ఞ స్తథ్పలం శృణుత ద్విజాః.

బ్రహ్మణో లభ##తే విద్యాం క్షత్త్రియో లభ##తే మహీమ్‌ | వైశ్యో ధన మవాప్నోతి సుఖం శూద్రస్తు విందతి.

ఆయుష్మాన్‌ పుత్త్రవాంశ్చైవ లక్ష్మీవాన్‌ పాపవర్జితః | శ్రుత్వా పురాణ మఖిలం శత్రుభి స్చాపరాజితః. 36

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే చతుర్ధశ సాహస్ర్యాం సంహితాయ మేతత్పురాణాను క్రమణికాదికథనం నామ నవత్యుత్తరద్విశతతమో7ధ్యాయఃé.

సమాప్త మిదం శ్రీ మత్స్యమహాపురాణమ్‌-

స్వస్త్యస్తు.

రెండు వందల తొంబదియవ అధ్యాయము

పురామ విషయాను క్రమణిక

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: విశ్వరూపుడగు మత్స్య జనార్దనుడు ఏది చెప్పెనో అట్టిదియు ధర్మకా మార్థ నామక పురుషార్థత్రయ సాధనమునునగు మాత్స్య పురాణమున ఏ మాత్రమును వదలక సర్వమును ఇదిగో మీకు చెప్పితిని; దీని యందు 1. మొదటి అంశము మత్స్యమను సంవాదము; తరువాత వరుసగా. 2. బ్రహ్మాండ సృష్టి ప్రతి పాదనము. 3. శారీరక సాంఖ్య తత్త్వ వివేచనము. 4. బ్రహ్మకు చతుర్ముఖోత్పత్తి. 5. దేవాసురుల ఉత్పత్తి. 6. మారుతోత్పత్తి. 7. మదనద్వాదశీవ్రతము 8. లోకపాలుర అభిషేచనము. 9. మన్వంతరములను ఉద్దేశించుట (పేర్కొనుట) 10. వైస్య(పృథు) రాజాభివర్ణనము.11. సూర్యోత్పత్తి. 12. వైవస్వతోత్పత్తి. 13. బుధుని సంగమనము. 14. పితృవంశాను కథనము 15. శ్రాద్ధకల్ప ప్రతిపాదనము. 16. పితృతీర్థ ప్ర(సం)చారము. 17. సోమోత్పత్తి. 18. సోమవంశకీర్తనము, 19. యయాతి చరితము 20. కార్తవీర్యుని మహాత్య్మము (గొప్పదనము) 21. వృష్టి వంశాను కీర్తనము. 22. విష్ణునకు భృగుదత్తశాపము. 23. దైత్యులకు భృగుశాపము. 24. పూరువంశకీర్తనము. 25. అగ్నివంశ వర్ణనము. 26. పురాణ సంఖ్యాను కీర్తనము. 27. క్రియాయోగము. 28. నక్షత్ర పురుష వ్రతము. 29. మార్తాండశయనవ్రతము. 30. కృష్ణాష్టమీవ్రతము. 31. రోహిణీ చంద్రవ్రతము. 32. తటాక నిర్మాణవిధి మాహాత్మ్యము. 33. పాదపోత్సవము. 34. సౌబాగ్యశయనవ్రతము. 35. అగస్త్యవ్రతము. 36. అనన్తతృతీయావ్రతము. 37. రసకల్యాణి నీవ్రతము 38. ఆర్ధ్రానందతృతీయావ్రతము. 39. సారస్వతవ్రతము. 40. గ్రహమ స్నానవ్రతము. 41. సప్తమీ న్నపనవ్రతము. 42. భీమద్వాదశీవ్రతము. 43. అనంగశయనవ్రతము. 44. అశూన్యశయనవ్రతము. 45. అంగారక వ్రతము. 46. కల్యాణ సప్తమీ ప్రభృతి సప్తమీ వ్రతసప్తకము. 47. విశోక ద్వాదశీవ్రతము. 48. పది విధములగు మేరుపర్వత దాన వ్రతము. 49. గ్రహశాంతి 50. గ్రహస్వరూప కథనము 51. శివచతుర్ధశీవ్రతము. 52. సర్వఫలత్యాగవ్రతము. 53. సూర్యవారవ్రతము. 54. సంక్రాంత్యుద్యావనవ్రతము. 55. విభూతి ద్వాదశీవ్రతము. 56. షష్టి (60) వ్రత మాహాత్మ్యము. 57. స్నానవిధి క్రమము. 58. ప్రయాగ మాహాత్య్మము. 59. భువనకోశ వ్యవస్థా వర్ణనము. 60. ఐలాశ్రమ(పురూరవఆశ్రమ) ఫలవర్ణనము. 61. ద్వీపాను కీర్తనము. 62. అంతరిక్షచార వర్ణనము. 63. ధ్రువ మాహాత్యము . 64. సురేంద్ర భువన వర్ణనము. 65. త్రిపురదాహ వృత్తాంతము. 66. పితృపిండదాన మహాత్య్మము 67. మన్వంతరవి నిర్ణయము. 68. వజ్రాంగ సంభవము. 69. తారకోత్పత్తి. 70. తారకాసుర మాహాత్య్మము. 71. బ్రహ్మదేవాను కీర్తనము. 72. పార్వతీ సంభవము. 73. శివతపోవన వర్ణనము. 74. మన్మథ దహనము. 75. రతిశోకము. 76. గౌరీ తపోవన స్థితి. 77. శివానుగ్రహము. 78. పార్వతీ ఋషి సంవాదము. 79. పార్వతీ కల్యాణము. 80. కుమారోత్పత్తి. 81. కుమార విజయము. 82. తారకవధము. 83. నారసింహావతార వర్ణనము. 84. పాద్మకల్ప సృష్టి వర్ణనము 85. అంధకవధము. 86. వారాణసీ మాహాత్య్మము 87. నర్మదా మాహాత్య్మను. 88. ప్రవరాను కీర్తనము 89. పితృగాథాను కీర్తనము. 90. ఉభయముఖీ గోదానము. 91. కృష్ణాజినదానము. 92. సావిత్ర్యుపాఖ్యాన ము 93. రాజధర్మాను కీర్తనము. 94. యాత్రాకాల నిమిత్తములు. 95. మంగళకర స్వప్నాను కీర్తనము. 96. వామన మాహాత్య్మము. 97. వారాహ మాహాత్య్మము. 98. క్షీరసాగర మథనము. 99. కాలకూట దమనము. 100. దేవాసుర యుద్ధము. 101. వాస్తు విద్య 102. ప్రతిమా లక్షణము. 103. మండవ లక్షణము. 104. ప్రాసాద లక్షణము. 105 ప్రతిష్ఠావిధి. 106. భవిష్యద్రాజాను కీర్తనము. 107. షోడశ మహాదానాను కీర్తనము. 108. కల్పాను కీర్తనము. 109. గ్రంథానుక్రమణీ కథనము. (108 వరకే గ్రంథమందలి ప్రధానాంశములుగా పెద్దలు లెక్కించదలచిరని తోచును). అను విని ఈ మత్త్య పురాణమందలి ప్రదాన ప్రతిపాద్యవిషయములు.

ఈ మత్స్య మహాపురాణము పవిత్రము ఆయుః ప్రదము యశోవృద్ధికరము పవిత్రతరము శుభకరము మహా పాపహారము శుభస్వరూపము; ఈ పురాణము వలన నరులకు సుకృత(సత్కర్మముల నాచరించినందువలన కలుగు) ఫలములు లభించును; అనేక తీర్థపంక్తులయందు స్నాన మాడుటచే సమస్త ధర్మముల నాచరించుటచే కలుగు మహాఫలములు సదా లభించును; ఈ పురాణము ఉత్తమము- సర్వదోష విఘాతుకము; ఇది మత్స్యరూపుడగు హరి ఏకార్ణవమందు మనువు నకు చెప్పినట్టిది; (అత్యంతము ప్రాచీనమయినది). ఈ పురాణమునుండి యొక శ్లోకపాదమునైన పఠించువాడు కూడ సర్వ పాపముక్తుడై నిశ్చయముగ నారాయణ స్థానము నందును; ఆ మన్మథునివలె దివ్యసుందర శరీరుడై సుఖీ యగును.

రహస్య తత్త్వ ప్రతిపాదకమగు ఈ పుణ్య పురాణమంతయు శ్రద్ధాయుక్తుడయి వినువాడు కూడ హరుని యను గ్రహము వలన అశ్వమేధయాగ మాచరించి తత్పూర్తిగా అవభృథ మాచరించినవా డందు మహాఫలము నందును.

ద్విజులారా! ధర్మజ్ఞుడు (ధార్ముకుడు- ధర్మము నెరిగి యనుష్ఠించువాడు ) శివుని విష్ణుని బ్రహ్మను సూర్యుని అర్చించిన తరువాత ప్రతిదినమందును) శ్రధ్ధాయుక్తుడై ఈ మహాపురాణమునుండి శ్లోకమునో శ్లోకపాదమునో ఐన తానువినునో ఇతరులకు వినపించునో అట్టివానికి కలుగు ఫలమును వినుడు; బ్రాహ్మణుడు విద్యను క్షత్త్రియుడు భూమిని వైశ్యుడు ధనమును శూద్రుడు సుఖమును పొందును. ఈ పురాణమంతయు వినినతో ఆయుష్మంతుడును పుత్త్రవంతుడును లక్ష్మీవంతుడును పాపరహితుడును శత్రువులచే అపరాజితుడును నగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున సూత ఋషి సంవాదమున మత్స్యపురాణ ప్రతిపాదిత విషయానుక్రమణియు పురాణ శ్రవణఫల ప్రతిపాదనమునను రెండు వందల తొంబదియవ అధ్యాయము.

శ్రీ మత్స్య మహాపురాణము సర్వమును సమాప్తము.

పుట పంక్తి తప్పు ఒప్పు

651 34 దగోసౌ దగ్ధో7సౌ

685 22 వాల్లభ్యేని వాల్యబ్యేన

685 23 పతేర పతేరఙ్గ

776 15 కస్సస్తి కస్స్వస్తి

780 28 (రవి రవి

881 13 జైహ్య్మాపుడు జైహ్య్మాపుడు

1042 11 సూర్య సూర్య సత్య

1042 17 పాదములందు పితరులును హృదయమందు- అని

చదువుకొనవలెను.

1109 1 క్రియాయాగ క్రియాయోగ

విషయశేషము

తారకోపాఖ్యానమునందలి ఉపాసనాం (ఆలోచనీయాం)శములు.

ఈ అధ్యాయము ముఖ్యముగా తాత్త్విక విచారణ చేయవలసిన అంశములు మూడు కలవు.

అందు మొదటిది 'విభావరీ' అను దేవతకు సంబంధించిన తత్త్వము . రెండవది కుమారస్వామి తాత్త్వికరూపము ఏమి? ఈ పౌరాణిక దేవుని వైదిక దేవతారూపము ఏమి? అనునది. మూడవది - శ్రీ దేవీ సప్తశతియందలి ఉత్తమ చరితమునకు అధిష్ఠాత్రీ దేవతయగు మహాసర్వతీ (కౌశికీ- కాళీ) దేవీ వృత్తాంత మునకు ఆ అధ్యాయమునందలి గౌరీ వృత్తాంతముతోడి సమన్వయము.

1. శ్రీ దేవీ - విభావరి- అను త్తరతత్త్వము.

శ్రీదేవి సప్తశతీ పారయణమునకు పూర్వాంగముగా 'రాత్రిసూక్త' పఠనమునకు హేతువు శ్రీమత్స్య మహాపురాణమునందలి (అ. 153) బ్రహ్మ విభావరితో చెప్పిన వచనములను బట్టి స్పష్టముగా తెలియుచున్నది. ఇదియేకాదు; మధుకైటభ తత్త్వము మహిష-శుంభులను విష్ణువు చంపక-వారు దేవి చేతిలో చావవలెననుట- గౌరినుండి ' కౌశికి' జనించుట మొదలగు అంశములు- శ్రీదేవీ సప్తశతికి సంబంధించినవి- ఈ శ్రీమత్స్య మహాపురాణమునుండి తెలియును.

ఈ మహాపురాణమున (153 అ. శ్లో. 47) దేవతలతో బ్రహ్మ-తారకుని గూర్చి- ' త్రైలోక్య దహనాత్మకః' అనెను; అట్టివానిని చంపుటకు తాత్త్విక దహనాత్మకుడే కావలయును. అట్టివాడు సాక్షాత్‌ అగ్ని మూర్తియే యగు కుమారస్వామియే; ఆతని అవతరణమునకు విభావరియు హేతుభూత కావలయును; ఏలయన ఆమె బ్రహ్మదేవుని పూర్వతనువు (బ్రహ్మదేవుని శరీరపు పూర్వతరరూపము) (చూ. 153 అ; శ్లో. 53); అనగా అది అవ్యక్తతత్త్వము; మాయా శబల బ్రహ్మము; కావుననే మాయా శబల బ్రహ్మ రూపయే యగు శ్రీదేవిని వర్ణించు సప్తశతిని పారాయణము చేయుటలో తత్పూర్వాంగముగా రాత్రి సూక్త పారాయణము విహితము. ఏలయన ప్రళయరాత్రి అవ్యక్తతత్త్వముతో అభిన్న.

బ్రహ్మ విభావరితో "నిన్ను కొందరు 'అనంశా' "ఏకానంశా" నామములతో ఉపాసింతురు." అనెను; (చూ. 153 అ; శ్లో. 71); 'అనంశా' అనగా-అంశరహిత-అవయవరహిత-అఖండరూప అనియర్థములు; 'అనుత్తర'శబ్దమునకును ఇదియే అర్థము; అనుత్తరము' -ఉత్తరము- దీనికంటె గొప్పది-లేనిది (న- విద్యతే-ఉత్తరం-పరతరం అధికతరం వా-అస్మాత్‌) అనునది ఒక వ్యుత్పత్తి; ఇది అట్లుండుగాక!

వాస్తవమున-ఉత్తరించు-అనగా ఖండించు; ముక్కలుగా చేయు-అని యర్థము; కనుక 'ఉత్తర' శబ్దమునకు 'ఖండము' అవయవము 'అంశము' అను అర్థములు ఉపపన్నములు; కావున 'అనుత్తరం' అనగా ' అనంశము' 'అంఖండము' ' అనవయవము' అను అర్థములు ఏర్పడుచున్నవి. ఇట్లు బ్రహ్మ పలికి కినట్లు శ్రీదేవిని ' ఏకా' 'అనంశా' 'ఏకానంశా' అనుటయుసరిపోవుచున్నది. మాతృకా పాఠమునందు 'అకారము' 'అనుత్తరము' 'అకారః సర్వవర్ణాగ్ర్యః' , 'అక్షరాణామకారో7స్మి' ఇత్యాది ప్రమాణవచనములును కలవు కదా; అకారమునకు అనుత్తరము అని తంత్ర శాస్త్రములందు వ్యవహారము; (చూ. నిత్యాషోడశికార్ణవసేతు బంధము- ఉపోద్ఘాత వ్రకరణము) భాషాతత్త్వాను సారమును వ్యాకరణ శాస్త్రాను సారమును అకారమే స్వరముల మూల రూపము; ఇ-ఉ-అకారపు పరిణామములు; కావున '' వర్ణముకూడ అనుత్తరము- అఖండము- అనవయవము-అనంశము-ఏకము; కావుననే ఇది- శ్రీదేవివాచకము అనుట సమంజసము.

'విభావరీ శబ్దార్థ విచారణము'

'విభావరీ': విభా =విశిష్టా- భా; విశిష్టమగు బుద్ధి ప్రతిభాసనము; విభావరీ =ఈదృశీ విభా- విశిష్టం బుద్ధిప్రతిభాసనం - వ్రియతే -అనయా ఇతి; ఈ రాత్రి తత్త్వముచే ప్రాణులకు గల 'విభా' విశిష్టమగు బుద్ధి ప్రతిభాసనతత్త్వము' ఆవరింపబడును; లేదా - 'విభా - వ్రియతే -అస్యాం రాత్ర్యాం'- ఈ రాత్రియందు ప్రాణుల బుద్ధప్రతిభాసనతత్త్వము కప్పివేయబడును. ఈ విధముగా 'విభావరీ' శబ్దమునకు 'మహా మాయా' 'యోగమాయా' 'యోగనిద్రా' అను అర్థము కూడ సముచితమగును; ఏలయన- విసదృశ (విలక్షమ) ప్రతీతి సాధనం- మాయా -అని మాయా శబ్దార్థమును ప్రామాణికులు చెప్పియున్నారు. (చు. శ్రీదేవీ సప్తశతీ -అధ్యా. 1; శ్లో 2.) 'విభావరీ 'శబ్ధమునకు 'రాత్రి ' అను అర్థమున వ్యుత్పత్తి ఇట్లు చెప్పవచ్చును: 'విభాతి -నక్షత్రాతిభిః' ' నక్షత్రాదులచే విశేషముగా ప్రకాశించును'; వి(ఉపసర్గ)+ భా (ధాతువు) +వన్‌ (క్వనిప్‌ ప్రత్యయము)> విభావర్‌ (వనో- ర-చ-పా. 4-1-7 అను సూత్రముచే- న్‌ >ర) దీనిపై '' (జీప్‌) రాగా 'విభావరీ'.

పై విధమున విభావరి- రాత్రి- ప్రకాశాత్మకమును- అప్రకాశాత్మకమును; రాత్రి యందు ప్రాణులకు ప్రపంచము (సరిగా) కనరాదు; విలక్షణముగా ఆవృతమగును; ఇది స్థూలదేహ- స్థూల ప్రపంచ- జాగ్రద్దశా- దృష్టితో; ఇది రాత్రికి గల విభావరీత్వము; కాని- ఇచట స్వప్నదశ- సూక్ష్మదేహము- సూక్ష్మ ప్రపంచము- కలవు; ఇట్లే పరమేశ్వరునకు ప్రళయకాలమే 'విభావరీ'; ఇచట ఈ విభావరికిని ప్రకాశత్వమును అప్రకాశత్వమును రెండును కలవు; జాగ్రద్దశ- స్థూల ప్రపంచము వంటిది (సృష్టి ప్రక్రియా ప్రవృత్తి) ఇచట లేదు; కాని స్వప్నదశ (వంటిది)కలదు; పరమేశ్వరుడు ఈ కాలమున యోగనిద్రయందుడును; తాను ఇక ముందు మరల చేయవలసిన ప్రపంచసృష్టి విషయమును అవ్యక్తరూపమున యోజించుచుండును. ఇది ఆతని యోగనిద్రావస్థా స్వరూపము; ఇది మనవంటి వారి స్వప్నావస్థ వంటిది; అస్మదాదులకు (మన వంటి వారికి) జాగ్రద్దశయందు స్వప్నదశ లేదు; స్వప్నదశయందు జాగ్రద్దశ లేదు; గాఢసుషుప్తియందు ఈ రెండును లేవు; మన గాఢసుషుప్తి స్వప్రకాశ జీవచైతన్యముపై తమ (తమస్తత్త్వకృతమగు) ఆవరణము ఉన్నది; ఈ ఆవరణము కూడ లేని జాగ్రత్స్వప్న సుషుప్తి రహితదశ తురీయావస్థ; అది స్వప్రకాశాత్మకము; అట్లే పరమాత్మకును స్థూల ప్రపంచ సృష్టియను జాగ్రద్దశయును సృష్టి విషయక భావనాత్మక యోగనిద్రావస్థయు అందే విశ్రామాత్మక గాఢసుషుప్తవ్యవస్థయు కలవు; అట్లే ఇవి ఏవియులేని స్వప్రకాశావస్థయును కలదు; అని దీనిని బట్టియే స్పష్టము; అదియే సచ్చిదానందతత్త్వము; అదియే నిర్విషయక జ్ఞానము; అది స్వయముగనే చిదా(జ్ఞానా)త్మకమగు స్వయం ప్రకాశతత్త్వము; కావున ఆ జ్ఞానమునందు విషయమగు (గోచరించు) మరియొక వస్తువు ఏదియును ఉండదు. ఇది 'సాక్షీ- చేతా- కేవలో - నిర్గుణశ్చ' అను శ్రుతిచే చెప్పబడిన పరమాత్మతత్త్వము.

2. స్కంద (కుమార తత్త్వము)

ఈ పురాణమునందు కుమార (స్కంద) తత్త్వ నిర్ణయమునకు అవలంబనములగు శ్లోకములు (అ. 153):

" క్రతవో మూర్తిమన్తస్త ముపాంసతేహ్యహర్నిశమ్‌ | కృతాపరాధసంత్రాసం సం(న) త్యజన్తి కథంచన.

తంత్రీలయత్రయో పేతం సిద్ధగంధర్లకింనరైః | సరాగ ముపధాతిష్ఠం గీయతే తస్య వేశ్మసు. 41

హంతాకృతోపకరణో మిత్రారిగురులాఘవైః | శరణాగతసంత్యాగం త్యక్తసత్యపరిశ్రయః. 42

ఇతి నిశ్శేష - మథవా నిఃశేషం కేన కథ్యతే | తస్యావినయ మాఖ్యాతుం; స్రష్టా తత్ర పరాయణమ్‌." 43

కుమార దేవుడు అగ్నిమూర్తి; ఈ యంశమును ఇట్లు నిరూపించవచ్చును.

పరమశివుడు శబ్దార్థోభయాత్మక తత్త్వము; ఇతడు ధర్మి; శక్తిరూపయగు పార్వతి- ఈ శివుని ధర్మాంశము; ఆమె శబ్దాత్మిక; చితిరూప; చితియనగా నిర్విషయకజ్ఞానము; ఆమెయే సకల చరాచరాత్మక విశ్వసముదాయసృష్టికిని మూలభూత; 'చితిః స్వతంత్రా విశ్వసిద్ధిహేతుః' (శక్తిసూత్రమ్‌); పరాపరాశబ్దాత్మికయగు ఈమెనుండియే సకల శబ్దసృష్టియును -అర్థసృష్టియును; ఈమెయే పరమశివుని శబ్దాత్మకాంశము -సకల విశ్వస్థిత సమగ్ర వాక్తత్త్వమును; అధ్యాత్మమున - పిండాండమున-ఏది వాక్కో -అధి దైవతమున -దేవతగా -అదియే అగ్ని; 'అగ్ని ర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్‌'- అని శ్రుతి; (ఐతరేయోపనిషత్‌ -2-4)

అగ్నికి ఆయుధము శక్తి; కుమారుని ఆయుధమున శక్తియే; కుమారుని వాహనము మయూరము; దానికి మరి యొక నామము'శిభి'; (శిఖ కలది కావున); అగ్నియు ' శిభి'యే -శిఖలు- జ్వాలలు- కలవాడు కావున.

కుమారుని జన్మ ప్రకారమును ఆలోచింతము; శివుని తేజస్సు (వీర్యము) పార్వతీ గర్భమున ప్రవేశింపలేదు; ఏలయన - ప్రవేశించవలసిన ఆవశ్యకతయే లేదు; పార్వతి స్వయముగనే శబ్దాత్మిక; వాగ్రూప; వాక్‌- అగ్నియే కదా! అగ్ని ఆ వీర్యమును గ్రహించెను; అనగా పార్వతియే-శక్తియే- గ్రహించెను.

ఈ అగ్ని (దేవతాతత్త్వము) వాగ్రూపమున పరిణమించవలెను. అగ్ని ఆ తేజస్సును గంగలో వయిచెను. 'గంగ' ఇచట గంగానది కాదు; వాగ్దశాప్రతీకము; ఎట్లు?గచ్ఛతి గచ్ఛతి-ఇతి గంగా; 'నిరంతర గతిశీల 'అని అర్థము; ఈ తత్త్వమే మరియొక నామమున 'సరస్వతీ'; 'సరస్‌' =సరణమ్‌; (సృ-గతౌ -ధాతువు; భావార్థమున 'అస్‌' ప్రత్యయము); సరస్‌ (సరణం) నిరంతర గమనం - ప్రాణిషు అస్యాః అస్తి ఇతి సరస్వతీ; ప్రాణులయందు నిరంతర ప్రవృత్తి కలది కావున సరస్వతీ; అనగా వాక్కు- భాష; ఇట్లు గంగా -సరస్వతీ -శబ్దములు 'వాక్‌'అను అర్థమున సమానార్థకములు; 'గమ్‌' ధాతువునుండి నిష్పన్నమగు 'గో' శబ్దము కూడ 'వాక్కు' అను అర్థమును ఇచ్చును - అనుట గమనించవలయును; నిరంతర గమనశీలము' అనియే ఈ వ్యుత్పత్తి లో కూడ అర్థము.

గంగ ఆ తేజస్సు ను తన తీరమునందలి 'శరవణము'నందు' ఱల్లు దుబ్బుల అడవి' యందు- ఉంచెను; శరః =జలము; జలములు 'కర్మ'లకు ప్రతీకములు; (చూ.ఈ శావాస్యోపనిషత్‌- శాంకర భాష్య మ్‌- మంత్ర 4); యజ్ఞాత్మకములగు కర్మములనే ఇట గ్రహింపవలెను. వాక్కు కూడ శ్రుతిరూపమయినదే పారమార్థిక (వాస్తవ)మగు వాక్కు; ఏలయన లౌకిక ప్రవృత్తిరూప కర్మములును లౌకిక వ్యవహార ప్రయోజకమగు వాక్కును ఉపాసన దృష్టిలో ఉదాత్తతను సంతరించుకొనజాలదు; ఈ శ్రుత్యాత్మకమగు వాక్కునకు పరమ ప్రయోజనము యాగాది శ్రౌతకర్మములు.

'షట్కృత్తికలు' (కృత్తికా నక్షత్రజ్యోతి రధిష్టాత్రులగు దేవతలు) ఈ శరవణభవునకు తమన్తన్యమను ఇచ్చిరి. కృత్తికా నక్షత్రము అగ్నిదేవతాకమే; అనగా జ్యోతీరూపమగు కృత్తిక - దేవతారూపమున అగ్నిదేవుడే; అతనిని స్త్రీ రూపమున భావన చేయగా అగు దేవతావ్యష్టి రూపములే షట్కృత్తికలు; కుమారునికి వారు స్తన్యము ఇచ్చుట 'అగ్ని' స్తన్యమును ఇచ్చుటయే.

కుమారుడు షణ్ముఖుడు; ఆముఖమలు ఏవి? ప్రాచీనులు శబ్దములను 1. నామములు 2. అఖ్యాతములు 3. ఉపసర్గలు 4. నిపాతములు అని నాలుగుగా విభజించిరి; 5. అది స్థానకరణ ప్రయత్నములతో ఉచ్ఛరించబడును. 6. ప్రకృతి ప్రత్యయ విభాగముచే శబ్దతత్త్వము (శబ్దముల అర్థము) తెలియును. కావున- ఇవియే ఆ ఆరుముఖములు కావచ్చును.

ఇట్లు 'అధిదైవత'మున 'అగ్ని'యే 'అధ్యాత్మమున' (ప్రాణుల దేహములందు- పిండాండములందు) 'వాగ్‌' రూపమున ఉన్నాడు. ఈ 'వాక్‌' శ్రుతులు మొదలగు ఆర్షవాగ్రూపమున కర్మకాండోపాననాకాండ జ్ఞానకాండములను లౌకిక వాగ్రూపము ప్రాణులకు ఆయా జీవన వ్యవహారములను నిర్వర్తించుచున్నది. ఇది 'అగ్ని 'రూపమే.

ఈ అగ్నియే 'వైశ్వానరుడు'గా ప్రాణుల దేహములందు 'అత్తా '=తినువాడు; తినిన ఆహారమును వచనమంద జేసి దానిచే ప్రాణి జీవనప్రవృత్తికి ఆవశ్యకమగు శక్తిని అందడేయువాడు-గా నున్నాడు; 'అహం వైశ్వానరో భూత్వా' అను ఇత్యాది గీతావతనమును ఛాందోగ్యోపనిషత్తునందలి వైశ్వానర విద్యయు ఇందులకు ప్రమాణములు.

ఈ అగ్నియే దేవతలకు ముఖము(నోరు)గా ఉండి వారికి హవిస్సులను అందజేయుచున్నాడు. ఇట్లు ఈతడు రెండు విధములుగా యజ్ఞ ప్రవర్తకుడుగా ఉన్నాడు.

ఇంతే కాదు; ఈ అగ్నికి దక్షునితో సంబంధముకలదు; ఎట్లు? దక్షుడు అగ్నీషోమీయాత్మక (అగ్నిసోముల సమాహార) తత్త్వము. అగ్ని ఇట్లు దక్షుని అంశ##మే; దక్షుని కన్యయగు 'స్వాహా' అగ్నికిపత్ని; అనగా ఆమె అగ్నిదేవుని స్త్రీరూపతత్త్వము; దక్షునిమరియొక దుహిత 'అదితి' 'యా- అత్తి' సా 'అదితిఃః'; ఏ దేవతాతత్త్వము తినునో -ఆహారాదిక మును పక్వమొనరించి శక్తి రూపమున పరిణమింపజేయునో అట్టిది 'అదితి' అగ్నియు లేదా 'అదనం' ' తినుటయు' అదితియే- అత్తయే- అని చూచితిమి; అతడే దేవతలకుహవిస్సునందజేయుచు వారిని పోషించుచున్నాడు. కనుకనే దక్షుని పుత్త్రి అదితి; ఆమె సంతానము ప్రాణులకు అమృతత్వమును సంపన్న మొనర్చు దేవతలు; (వీరు ఇచ్చు అమృతత్వము పరతత్త్వాపైక్షయా గొప్పది కాకపోవచ్చును ఐనను మర్త్యత్వము కంటె అది గొప్పది) ఈ యర్థముతోనే శ్రీదేవ్యథర్వ శీర్షోపనిషత్తునందు ఒక ఋక్‌ ఇట్లున్నది:

"అదితి ర్హ్యజనిష్ట దక్ష యా దుహితా తవ | తాం దేవా అన్వజాయంత భద్రా అమృతబంధవః.

ఈ విధముగ 'అత్తృరూపుడును వాగ్రూపుడును దేవముఖుడును అగు అగ్నియే కుమారస్వామి.'

తాకకుడు సకల యజ్ఞములను యజ్ఞాంగములను యజ్ఞారాధనీయదేవతలను తనకు వశీభూతులనగా చేసికొనగా అగ్నితత్త్వాత్మకుడగు కుమారుడు వాని నుండి వీనిని విడిపించెను. ఈ యర్థమును స్పష్టము చేయు సన్నివేశము కూడ జ్యోతిర్వ్యవస్థలో ఉండియుండును.

కుమార దేవుని నామములును- వాని యర్థములును: 1.గుహః గుహూ సంవవరణ (ధాతువు); కప్పియుంచుట అని వాచ్యార్థము; రక్షించుట అని లక్ష్యార్థము; దీనినుండి క (అ) ప్రత్యయము(పాణిని- 3-1-135) ;గుహ్‌+>గుహః.

2. కుమారః కుత్సితాన్‌ః మారయతి- దుష్టులను సంహరించువాడు; మరియొక విధముగ -కుం-ఇయర్తి ఇతి కుమారః; భూమిని చేరి- ఆశ్రయించి- యుండువాడు; ఎట్లు అనగా భూః -భూవః- సువః -అను మూడు మాహావ్యాహృతులలో ప్రథమ వ్యాహృతికి అధిలోకముగా 'ఈలోకము' అనియు -అధి దైవతముగా 'అగ్ని 'అనియు అర్థములు.

అగ్నికి గల స్థానములలో భూమి ఒకటి; (చూ- మత్స్య -51 అ.) ఇట్లు భూమి నాశ్రయించియుండు అగ్ని రూపుడే కుమారుడు; మరియొక విధముగా - వాగ్రూపుడగు అగ్ని పిండైండమునందు పృథివీతత్త్వాత్మకమగు (కు-అనబడు) పృథివిని ఆశ్రయించియుండును- కావునను - కుం -ఇయర్తి- ఇతి -కుమారః; 3. వాక్కునకు గల ఉత్తమ రూపము ప్రణవము; అది కుమారుని రూపము; కావున అతడు సుబ్రహ్మణ్యుడు- బ్రహ్మకు (వేదమునకు) శోభసత్వమును కలిగించు వాడు; 4. ఈతడు దేవతలకు హలిస్సునందించుచును - శ్రుతి వాగ్రూపమునను- దేవతలకు ముఖము (నోరు) గా నుండును; కావున (దేవసేనాపతి) సేనానీః.

ఈ కుమారుడు షడ్డిన జాతమాత్రుడై (అనగా సప్తమదినమున) దేవసేనాపతిత్వము వహించెను. పరా పరా వాగ్రూపమున నుండు కుమారుని వానస్థానము షట్చక్రములకు పైగా నుండు సహస్రార కమలమే కదా!

ఇట్లు కుమారుడు శ్రీదేవ్యభిన్నమగు మహాతత్త్వము.

3. కౌశికీ - మహాసరస్వతీ- తత్త్వము.

పార్వతి తన దేహమునందలి కాళిమ(నల్లదనము)ను పోగొట్టుకొనుటకు సంబంధించిన కథ వలన శ్రీదేవీ సప్తశతియందలి కౌశికీ (తృతీయ చరితాధి దేవతయగు మహాసరస్వతీ) వృత్తాంతము స్పష్టముగా తెలియుచున్నది. (అనువాదము మొదలు- ది. 18-6-1986; ముగింపు -ది. 6-2-1987)

Sri Matsya Mahapuranam-2    Chapters