Sri Matsya Mahapuranam-1    Chapters   

శ్రీరస్తు

శ్రీ మత్స్యమహాపురాణమ్‌

ప్రథమో7ధ్యాయః.

మత్స్యావతార కథనమ్‌.

శ్లో. శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ |

ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాన్తయే. 1

యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరిఞ్చిః పాలకో హరిః | సంహర్తా కాలరుద్రాఖ్యో నమస్తసై#్మ పినాకినే. 2

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 3

అజో7పి యః క్రియాయోగా న్నారాయణ ఇతి స్మృతః | త్రిగుణాయ త్రివేదాయ నమస్తసై#్మ స్వయమ్భువే. 4

దిక్కాలాద్యనవచ్ఛిన్నానన్తచిన్మాత్రమూర్తయే | స్వానుభూత్యేకమానాయ నమ శ్శాన్తాయ తేజసే. 5

సూత మేకాన్త మాసీనం నైమిశారణ్యవాసినః | మునయో దీర్ఘసత్రాన్తే పప్రచ్ఛు ర్దివ్యసంహితామ్‌. 6

ప్రవృత్తాసు పురాణానాం ధర్మ్యాసు లలితాసు చ | కథాసు శౌనకాద్యాస్త మభినన్ద్య ముహుర్ముహుః. 7

కథితాని పురాణాని యాన్యస్మాకం త్వయా7నఘ | తాన్యేవామృతకల్పాని శ్రోతు మిచ్ఛామహే పునః. 8

కథం ససర్జ భగవా న్మత్స్యరూపిత్వ మాశ్రితః | భైరవత్వం భవస్యాపి పురారిత్వం నిగద్యతే. 9

కుతో హేతోః కపాలిత్వం జగామ స వృషధ్వజః | ఏతత్సర్వం సమాచక్ష్వ సూత విస్తరతః క్రమాత్‌. 10

త్వద్వాక్య స్యామృతసై#్యవ న తృప్తి రిహ జాయతే |

శ్రీరస్తు

శ్రీ మత్స్యమహాపురాణము

ప్రథమాధ్యాయము-ఋషుల ప్రశ్నము-

మత్స్యావతార కథనము.

శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ | ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే. 1

యస్యాజ్ఞయా జగత్ర్సష్టా విరించిః పాలకో హరిః | సంహర్తా కాలరుద్రాఖ్యో సమస్తసై#్మ పినాకినే. 2

అజో7పి యః క్రియాయోగా న్నారాయణ ఇతి స్మృతః | త్రిగుణాయ త్రివేదాయ నమస్తసై#్మ స్వయంభువే. 3

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంతచిన్మాత్రమూర్తయే | స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే. 4

(ఈ నాలుగు శ్లోకములును మూలములో 1-2-4-5 శ్లోకములుగా ఉన్నవి. ఏమయినను ఇవి మూలగ్రంథముతో సంబంధము కలవిగా తోచవు. 3వ సంఖ్యగల 'నారాయణం' అనుశ్లోకమును 6వ శ్లోకమునుండి తరువాతనున్న శ్లోకములును వ్యాసుడు రచించిన శ్లోకములును మూలముతో సంబంధముకలవియును అనిపించుచున్నది.)

1. తెల్లని వస్త్రములు ధరించిన వాడును చంద్రుని వర్ణమువంటి దేహవర్ణము కలవాడును నాలుగు భుజములు కలవాడును అనుగ్రహమును కురియు ముఖము కలవాడును అగు విష్ణుని సర్వవిష్నుములును ఉపశమించుటకు ధ్యానించ వలయును.

2. ఎవని ఆజ్ఞచేత బ్రహ్మ లోకములను సృష్టించువాడును హరి పాలించువాడును కాలరుద్రుడు అను దేవుడు సంహరించువాడును అయ్యెనో పినాకము అనుధనువును ధరించిన అటువంటి శివునకు నమస్కారము.

3. ఎవరు పుట్టుకలేనివాడై యుండియు తాను చేయు క్రియల సంబంధమువలన నారాయణుడు (జలములు ఆధారస్థానముగా గలవాడు - జీవులకు ఆధారమయినవాడు) అని తలచబడు(చెప్పబడు)చున్నాడో - మూడు గుణములు కల వాడును వేదత్రయ స్వరూపుడును అగు స్వయంభువు (తనంతటతానే ఉన్నవాడు) నకు నమస్కారము.

4. దిక్కులు కాలము మొదలగు వానిని బట్టి (ఇక్కడ ఇటు ఈ కాలమునందు ఉన్నాడు అని) నిర్ణయించబడక అంతములేని జ్ఞానము మాత్రము స్వరూపముగాగలదై (ఉపాసకుల) తమ అనుభూతి మాత్రమే ప్రమాణముగా కలది అగు శాంత (సాత్త్విక) మగు తేజస్సునకు నమస్కారము.

నరులలో ఉత్తముడయిన నారాయణమునిని అటువంటివాడే అయిన నరమునిని సరస్వతీదేవిని వ్యాసమహామునిని నమస్కరించి అటు తరువాత 'జయము' అను సంప్రదాయ సిద్ధము అయిన వ్యవహారముకల పురాణమును ప్రవచించవలెను.

నైమిశారణ్యమున నివసించుచు ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము అను దీర్ఘసత్రయాగము జరుపుచుండిన మహామునులు ఆసత్రపు విరామకాలమున ఏకాంతమున ఏకాగ్రమనస్సుతో కూర్చుండియున్న సూతుడుఅను కథకు సంనిధికి వెళ్లిరి. అంతవరకును ఆయన ఆ దీర్ఘసత్ర విరామ సమయములందు ధర్మమునుండి తొలగనివియు మనోహరములును అగు పురాణ కథలు వినిపించి ఉండెను. మునులు ఆ కథలను ఆయన వాటిని తమకు చెప్పిన విధమును మాటిమాటికిని మెచ్చుకొనిరి. తరువాత వా రాయనను దివ్యమగు పురాణ సంహితా విషయమున ఇట్లు ప్రశ్నించిరి: అనఘా! మీరు మా కింతవరకునుగొన్ని పురాణములు ప్రవచించితిరి. అవి అమృతముతో సమానముగా నున్నవి. ఇంకను వినవలెనని మాకు వేడుకగ నున్నది. భగవానుడు ఏవిధముగ ఏకారణమున మత్స్యరూపమును ధరించి సృష్టి చేసెను? భవు(శివు)నకు భైరవుడు అనియు పురారి అనియును పేరులు కలవుకదా! ఆవృషభధ్వజునకు కపాలి అనియు వ్యవహారము కలదుకదా! వీటికి హేతువు ఏమి? ఇది అంతయు విస్తరించి మాకు చెప్ప వేడుచున్నాము. మీ వాక్యములు సాక్షాత్‌ అమృతమేయని మాకనిపించుచున్నది. ఇంతవరకును ఎంతగ వినినను మాకు తృప్తి కలుగుటలేదు. అని పలికిరి.

సూతః: పుణ్యం పవిత్ర మాయుష్య మిదానీం శృణుత ద్విజాః. 11

మాత్స్యం పురాణ మఖిలం య జ్జగాద గదాధరః | పురా రాజా మనుర్నామ చీర్ణవా న్పరమం తపః. 12

పుత్త్రే రాజ్యం సమారోప్య క్షమావా న్రవినన్దనః | మలయ సై#్యకదేశే తు సర్వాత్మగుణసంయుతః. 13

సమదుఃఖసుఖం చైవ ప్రాప్తవా న్యోగ ముత్తమమ్‌ | బభూర వరద శ్చాస్య వర్షాయుతశ##తే గతే. 14

వరం వృణీష్వేత్యువాచ ప్రీతాత్మా కమలాసనః | ఏవ ముక్తో7బ్రవీ ద్రాజా ప్రణమ్య చ పితామహమ్‌. 15

ఏక మే వాహ మిచ్ఛామి త్వత్తో వర మనుత్తమమ్‌ | భూతగ్రామస్య సర్వస్య స్థావరస్య చరస్య చ. 16

భ##వేయం రక్షణాయాలం ప్రళ##యే సముపస్థితే | ఏవ మస్త్వితి విశ్వాత్మా తత్రైవాన్తరధీయత. 17

పుష్పవృష్టిశ్చ మహతీ ఖాత్పపాత సురార్పితా |

అది విని సూతు డిట్లు చెప్ప నారంభించెను: బ్రాహ్మణులారా! సాక్షాత్‌ విష్ణువే చెప్పిన మత్స్యపురాణము మీకు ఇప్పుడు చెప్పుచున్నాను. వినుడు. అది పుణ్యకరమును పవిత్రమును ఆయువును వృద్ధి చేయునదియును. పూర్వము సూర్యుని కుమారుడు అయిన మనువు అను రాజుండెడివాడు. ఆయన ఆత్మ సంస్కారమునకు కావలయుగుణములన్నియు కలవాడు. క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారునకు రాజ్యము నప్పగించి మలయపర్వతముమీద నొక ప్రదేశమున ఉత్తమతప మాచరించెను. సుఖదుఃఖముల యందు సమదృష్టి కలిగి ఉత్తమ యోగసాధన నవలంబించెను. పదిలక్షల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ వరమీయదలచి ప్రత్యక్షమయ్యెను. వరముకోరుకొమ్మని మనువుతో పలికెను. మనువు బ్రహ్మకు నమస్కరించి ఇట్లు పలికెను: ''అన్నిటికంటెఉత్తమమగు ఒకేఒక వరము నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు చరములునగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును.'' విశ్వమునకు ఆత్మరూపుడు అగు బ్రహ్మ అట్లే కానిమ్మని పలికి అక్కడనే అంతర్ధాన మందెను. దేవతలు కలిగించిన పూలవాన ఆకాశము నుండి పడెనుకూడ.

కదాచి దాశ్రమే తస్య కుర్వతః పితృతర్పణమ్‌. 18

పపాత పాణ్యో రుపరి శఫరీ జలసంయుతా | దృష్ట్యా త చ్ఛఫరీరూపం సదయో7యం మహీపతిః. 19

రక్షణా యాకరో న్మత్స్యం స తస్మి న్కరకోదకే | అహోరాత్రేణ చైకేన షోడశాఙ్గుళివిస్తృతః. 20

కోభవా న్మను ముద్వీక్ష్య పాహిపాహీతి చాబ్రవీత్‌ | స త మాదాయ మణికే ప్రాహిణో జ్జలచారిణమ్‌. 21

తత్రాపి చైకరాత్రేణ హస్తత్రయ మవర్ధత | పునః ప్రాహార్తనాదేన సహస్రకిరణాత్మజమ్‌. 22

స మత్స్యః పాహిపాహీతి త్వా మహం శరణం గతః | తత స్స కూపే తం మత్స్యం ప్రాహిణో ద్రవినన్దనః. 23

యదా న మాతిచక్రన్ద తదా మత్స్య స్సరోవరే | క్షిప్త స్స పృథుతా మాగా త్పున ర్యోజనసమ్మితామ్‌. 24

తత్రా ప్యాహ పున ర్దీనః పాహిపాహీతి తం నృపమ్‌ | తత స్స మనునా క్షిప్తో గఙ్గాయా మభ్యవర్ధత. 25

యదా తా మఖిలాం తద్వత్తదాబ్ధౌ ప్రాక్షిపన్నృపః | తదా సముద్ర మఖిలం వ్యాప్యాసౌ సముపస్థితః. 26

తదా ప్రాహ మను ర్భీతః కో7సి త్వ మసురేశ్వరః | అథవా వాసుదేవ స్త్వ మన్యథేదృ క్కథం భ##వేత్‌. 27

యోజనాయుతవింశత్యా కస్య తుల్యం భ##వే ద్వపుః | జాతస్త్వం మత్స్యరూపేణ మాం ఖేదయసి కేశవ. 28

హృషీకేశ జగన్నాథ జగద్‌గ్ధమ న్నమో7స్తు తే | ఏవ ముక్త స్స భగవా న్మత్స్యరూపీ జనార్దనః. 29

సాధుసాధ్వితి హోవాచ సత్యం జ్ఞాతం త్వయా7నఘ | అచిరేణౖవ కాలేన మేదినీ మేదినీపతే. 30

భవిష్యతి జలే మగ్నా సశైలవనకాననా | నౌ రియం సర్వదేవానాం నికాయేన వినిర్మితా. 31

మయా జీవనికాయస్య రక్షణార్థం మహీపతే | స్వేదాణ్డజోద్భిదా యే చ యే చ జీవా జరాయుజాః. 32

అస్యాం నిధాయ సర్వాం స్తా ననర్థా త్పాహి సువ్రత | యుగాన్తవాతాభిహతా యదా చలతి నౌ ర్నృప. 33

శృఙ్గే7స్మి న్మమ రాజేన్ద్ర నిధేహి త్వం చ మాన్యధా | తతో లయాన్తే సర్వస్యస్థావరస్య పరస్య చ. 34

వ్రజాపతి స్త్వం భవితా జగతః పృథివీపతే | ఏవం కృతయుగ స్యాదౌ సర్వజ్ఞో భగవా నృషిః. 35

మన్వన్తరాధిపశ్చాపి దేవపూజ్యో భవిష్యసి ||

ఇతి శ్రీమత్స్యపురాణ మత్స్యమనుసంవాదే మత్స్యావతార

కథనం నామ ప్రథమో7ధ్యాయః.

ఒకానొకనాడు మనువు తన ఆశ్రమమున పితృతర్పణము చేయుచుండగా ఒక ఆడు చేప నీటితోకూడి అతని రెండుచేతులపై పడెను. ఆరాజు ఆచేపరూపమును చూచి దయకలిగి దానిని రక్షింపదలచి తన కమండలు జలములలో వైచెను. ఆ మత్స్యము ఒక అహోరాత్రములో పండ్రెండంగుళముల పొడవు కలదై మొగమెత్తిమనువును చూచి రక్షించుము రక్షించుము అని పలికెను. ( బ్రిటిషు అంగుళము = ప్రాచీన భారతీయుల 1 అంగుళము) మనువు ఆ చేపను తీసికొని వెడలుపైన మూతిగల మట్టిపాత్రలో వైచెను. అచ్చట అది ఒక అహోరాత్రములో మూడు మూరలంతగా పెరిగెను. మరల ఆ చేప సహ్రస కిరణాత్మజుడగు మనువుతో అర్తనాదముతో నేను నిన్ను శరణు పొందితిని. రక్షించు రక్షించుమనెను. ఆ రవినందనుడు దానిని బావిలో పడవైచెను. అది అచ్చట రెండు యోజనములంత(1600 మూరలు) పెద్దది అయ్యెను. అచ్చటను అది దీనమయి రక్షించు రక్షించుము అని ఆ రాజుతో పలికెను. అతడు దానిని అంతట గంగలో వేయగా అది అచ్చటను అట్లే ఆనది నిండుగా సరిపోవునంతగా పెరిగెను.అపు డారాజు దానిని సముద్రమునవైచెను. అపుడది సముద్రమంట వ్యాపించి కనబడెను. అపుడు మనువు భయపడి నీవు ఎవ్వరవు? రాక్షస రాజవా? లేక వాసుదేవుడవా? అట్లు కానిచో నీవు ఇట్లు ఎట్ల గుదువు? రెండు లక్షల యోజనములంత శరీరము ఎవ్వనికుండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై నన్ను శ్రమపెట్టుచున్నావు. హృషీకేశా!(హృషీక+ఈశ-విషయేంద్రియములను అధిపతి) జగన్నాథా!జగద్దమా!(లోకములను తన యందు ఉంచుకొనుచు లోకములయందు తానుండువాడు) నీకు నమస్కారము. మనువు ఇట్లు పలుకగా మత్స్యరూపుడు అగు ఆభగవానుడు జనార్దనుడు బాగుబాగు!అనఘా! నీవు సత్యము గ్రహంచితివి. అచిరకాలముననే ఈ భూమి పర్వతముల-మహావనముల-వనముల తో కూడ నీట మునుగును. ఇదిగో!ఈ నౌకను జీవసమూహములను రక్షించుటకై నేను దేవతల సమూహముచేత నిర్మింపజేసితిని. స్వేదజములు అండజములు ఉద్భిజ్జములు జరాయుజములు(చెమటనుండి ఉష్ణమునుండి పుట్టు దోమలు గ్రుడ్లనుడి పుట్టుపక్ష్యాదులు-నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు చెట్లు-మావినుండి పుట్టు మనుష్యులు మొదలగు ప్రాణులు) అగు ప్రాణులను అన్నింటికి ఏకీడును గలుగకుండ కాపాడుము. ఈ ఓడ ప్రళయ కాలము ముగిసిన తరువాత స్థిరచర రూపమయిన ఈ జగత్తున కంతటికి నీవు ప్రజాపతి వగుదువు. ఇట్లు కృతయుగారంభమున సర్వజ్ఞుడు భగవానుడు ఋషి మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేతను పూజింపబడెదవు.

ఇది మత్స్య మహాపురాణము మత్స్యమనుసంవాదమున మత్య్సావతార కథనము అను మొదటి అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters