Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్య వర్ణనమ్‌.

అతఃపరం ప్రవక్ష్యామి ప్రయాగస్యోపవర్ణమమ్‌ l మార్కండేయేన కథితం యత్‌పురా పాండుసూనవే. 1

భారతేతు యదా వృత్తే ప్రాప్తరాజ్యే పృథాసుతే l ఏతస్మిన్నంతరే రాజా కుంతీపుత్త్రో యుధిష్ఠిరః. 2

భ్రాతృశోకేన సంతప్త శ్చింతయన్‌ స పునఃపునః l ఆసీ త్సుయోధనో రాజా ఏకాదశచమూపతిః. 3

అస్మాన్‌ సంతాప్య బహుశః సర్వే తే నిధనం గతాః l వాసుదేవం సమాశ్రిత్య పంచశేషాస్తు పాండవాః. 4

హత్వాభీష్మంచ ద్రోణంచ కర్ణంచైవ మహాబలమ్‌ దుద్యోధనంచ రాజానం పుత్త్రభ్రాతృసమన్వితమ్‌. 5

రాజానో నిహతాః సర్వే యే చాన్యే శూరమానినః l కింనో రాజ్యేన గోవింద! కింభోగై ర్జీవితేనవా. 6

ధిక్కష్టమితి సంచింత్య రాజా వైక్ల్యబ్య మాగతః lనిర్విచేష్టో నిరుత్సాహః కించి త్తిష్ఠ త్యధోముఖః. 7

లబ్ధసంజ్ఞో యదా రాజా చింతయన్‌ సపునఃపునః l కతరో వినియోగో వా నియమం తీర్థమేవచ. 8

యేనాహం శీఘ్ర మాముచ్యే మహాపాతకకిల్బిషాత్‌ l యత్ర స్థిత్వా నరో యాతి విష్ణులోక మనుత్తమమ్‌. 9

కథం పృచ్ఛామి వై కృష్ణం యేనేదం కారితో7స్మ్యహమ్‌ l ధృతరాష్ట్రం కథం పృచ్ఛే యస్య పుత్త్రంశతం హతమ్‌. 10

ఏవం వైక్లబ్యమాపన్నో ధర్మరాజో యుధిష్ఠిర ః l రుదంతి పాండవా ః సర్వే భ్రాతృశోకపరిప్లుతాః. 11

యేచ తత్ర మహాత్మానః సమేతాః పాండవా ః స్మృతాఃl కుంతీచ ద్రౌపదీచైవ యేచ తత్ర సమాగతాః. 12

భూమౌ నిపతితాః సర్వే రుదంతస్తు సమంతతః l

నూట ఒకటవ అధ్యాయము

ప్రయాగ మాహాత్మ్యము

నంది కేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: (స్నాన ప్రసంగమున) పూర్వము పాండుపుత్త్రడగు ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పిన ప్రయాగ తీర్థ క్షేత్రోపవర్ణనమును తెలిపెదను.

మహాభారత యుద్ధాంతరము యుధిష్ఠిరుడు రాజ్యమును పొందియు భ్రాతృశోక సంతప్తుడయ్యెను.

మా భ్రాత దుర్యోధనుడు ఏకాదశాక్షాహిణీ సేనా నాధుడుగా చక్రవ ర్తిగా నుండెనుగదా! అతడును అతని వారును మమ్ములను చాల విధముల బాధించిరేకాని తుదకు వారును మరణించిరికదా! వాసుదేవుని ఆశ్రయించియు పాండవులము మేము ఐదుగురమే మిగిలితిమి. భీష్మ ద్రోణ కర్ణులను పుత్త్ర భ్రాతృ సహితుడగు దుర్యోధనుని చంపి తాము శూరులమనుకొని మావీరులందరును తామును మరణించిరి. గోవిందా! మాకు రాజ్యముతోగాని భోగములతోగాని జీవితముతోగాని ఏమిపని? ఛీ! ఎంత దుఃఖకరమిది! అని యుధిష్ఠిరుడేమియు తోచక నిర్విచేష్టుడు నిరుత్సాహుడునునై అధోముఖుడై ఊరకుండెను. మరల తెప్పరిల్లెను. కాని చింత అతనిని వదలలేదు. ఏ విధానమును అనుష్ఠించి నియమ మవలంబించి తీర్థము సేవించి ఈ మహాపాతక దోషమునుండి విముక్తుడను కాగలుగుదును; ఏక్షేత్రవాసము చేసినచో సర్వోత్తమ విష్ణులోక ప్రా ప్తియగును; ఇవి అన్నియు నాచే జరిపించిన కృష్ణునేమని అడుగుదును? ధృతరాష్ట్రుని నూర్గుర కొడుకులను చంపి అతనినేమడుగుదును? అని ఇట్లు ధర్మరాజు ఏమియు తోచని వాడయ్యెను. పాండవులందరును కుంతీ ద్రౌపదులును మరియు నచట చేరిన ఇతరులగు పెద్దలును భూమిపై పడి దొరలుచు ఏడువసాగిరి.

వారాణస్యాం మార్కండేయ స్తేన జ్ఞాతో యుధిష్ఠిరః. 13

యథా వైక్లబ్య మాపన్నో రుదమానస్తు దుఃఖితః | అచిరేణౖవ కాలేన మార్కండేయా మహాతపాః. 14

సంప్రాప్తో హా స్తినపురం రాజద్వారే హ్యతిష్ఠత | ద్వారపాలో7పి తం దృష్ట్వా రాజ్ఞః కథితవాన్‌ ద్రుతమ్‌.

త్వాం ద్రష్టుకామో మార్కండో ద్వారి తిష్ఠత్యసౌ మునిః |

త్వరితో ధర్మపుత్త్రస్తు ద్వార మాగా దతఃపరమ్‌. 16

యుధిష్ఠిర ఉవాచ : స్యాగతం తే మహాభాగ స్వాగతం తే మహామునే |

అద్య మే సఫలం జన్మ అద్య మే తారితం కులమ్‌. 17

అద్య మే పితర స్తుష్టా స్త్వయి దృష్టే మహామునే |

అద్యా7హం పూతదేహో7స్మి య త్త్వయా సహ దర్శనమ్‌. 18

నందికేశ్వర ఉవాచ : సింహాసనే సమాస్థాప్యపాదశౌచార్చనాదిభిః |

యుధిష్ఠిరో మహాత్మా వై పూజయామాస తం మునిమ్‌. 19

తతః స తుష్టో మార్కండః పూజిత శ్చాహ తం నృపమ్‌ |

ఆఖ్యాహి త్వరితం రాజన్‌ కిమర్థం రుదితం త్వయా. 20

కేన వా విక్లబీభూతః కా బాధా తే కిమప్రియమ్‌ |

యుధిష్ఠిర ఉవాచ : అస్మాకం చైవ యద్వృత్తం రాజ్యస్యార్థే మహామునే. 21

ఏతత్సర్వం విదిత్వాతు చింతావశ ముపాగతః |

మార్కండేయ ఉవాచ : శృణు రాజన్‌ మహాబాహో క్షత్త్రధర్మవ్యవస్థితమ్‌. 22

నైవ దృష్టం రణ పాపం యుధ్యమానస్య ధీమతః | కింపునా రాజధర్మేణ క్షత్త్రియస్య విశేషతః. 23

తదేవం హృదయం కృత్వాతస్మా త్పాపం న చింతయేత్‌ |

తతో యుధిష్ఠిరో రాజా ప్రణమ్య శిరసా మునిమ్‌. 24

పప్రచ్ఛ వినయోపేతః సర్వపాతకనాశనమ్‌ |

యుధిష్ఠిర ఉవాచ : పృచ్ఛామి వినయోపేతః సర్వపాతకనాశనమ్‌. 25

కథయ త్వం సమాసేన యేన ముచ్యేత కిల్బిషాత్‌ |

మార్కండేయ ఉవాచ : శృణు రాజన్‌ మహాబాహో సర్వపాతకనాశనమ్‌. 26

ప్రయాగగమనం శ్రేష్ఠం నరాణాం పుణ్యకర్మణామ్‌.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ప్రయాగమాహాత్మ్యవర్ణనం నామ

ఏకోత్తరశతతమో7ధ్యాయః.

ఆ సమయమున వారాణసియందుండిన మహాతపస్వి మార్కండేయుడు యుధిష్ఠిరుని ఈ స్థితిని ఎరిగి శీఘ్రమే హ స్తినాపురమునకేతెంచి రాజ ద్వారమున నిలువ ద్వారపాలుడు రాజు కడకువచ్చి యాసమాచారము తెలిపినంత ధర్మజుడును త్వరితమే ద్వారము కడకు పోయెను.

అతడు ఆ మునితో మహాభాగా! స్వాగతము. మహామునీ! స్వాగతము. మీ దర్శనమున ఇపుడు నా జన్మము సఫలమయినది. నా కులమువారు తరించిరి. నా పితరులు సంతుష్టులయిరి. నేను పవిత్ర శరీరుడనయితిని. అని పలికి లోనికి కొనిపోయి సింహాసనమున మునిని కూర్చుండజేసి పాద ప్రక్షాళనార్చనాదులతో మహాత్ముడు యుధిష్ఠిరుడామునిని పూజించెను.

మార్కండేయుడు సంతుష్టుడై యుధిష్ఠిరునితో ''రాజా! నీవేల ఏడిచితివి; నీవేల ఏమియు తోచని వాడ వయితివి? నీ బాధ ఏమి? నీకు కలిగిన అప్రియము ఏమి?'' అని యడిగెను. అతడును ''మునీ! మాకు రాజ్యము విషయమున జరిగినదంతయు తలచి తలచి చింతావశుడనయితిని.'' అనగా మార్కండేయుడనెను: ''రాజా! క్షత్త్ర ధర్మమున యుద్ధము చేయునపుడు ఇది పాపము అనునదిలేదు. విశేషించి రాజధర్మముననుసరించి యుద్ధము చేయుటలో పాపము లేదని చెప్పవలసిన పనియేలేదు. క్షత్త్రియుడు సైనికుడై యుండి జీవనమునకే కాని దీనజన రక్షణమునకేకాని యుద్ధము చేయుట క్షత్త్ర ధర్మము. రాజైనయతడు తన రాజ్యమును రక్షించుకొనుటకో దానిని శత్రువులనుండి సంపాదించుటకో దీనజన రక్షణమునకో యుద్ధము చేయుట రాజధర్మము. ఇది ఎరిగి వివేకమునంది నీవు నీకు పాపము కలుగునని ఆలోచింపకుము.'' అనెను.

అంతట యుధిష్ఠిరుడు మునిని శిరసా నమస్కరించి వినియోపేతుడై ''అయ్యా! తామ త్రైలోక్య (ధర్మ) ద్రష్టలు; మహాప్రాజ్ఞులరు; పాప మోచనమగు ఉపాయమును సంక్షేపమున చెప్ప మిమ్ము వేడుచున్నాను.'' అనెను. ఆ మునియు ''రాజా! వినుము; పుణ్య కర్మాచరణమున పాప మోచనము కోరువారికి ప్రయాగ గమనము శ్రేష్ఠమయినది.'' అని పలికెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను

నూట ఒకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters