Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వ్యధికశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

యుధిష్ఠిర ఉవాచ : 

భగవన్‌ శ్రోతుమిచ్ఛామి పురాకల్పే యథా స్థితమ్‌ | బ్రహ్మణా దేవముఖ్యేన యథావ త్కథితం మునే. 1

కథం ప్రయాగే గమనం నరాణాం తత్ర కీదృశమ్‌|

మృతానాం కా గతి స్తత్ర స్నాతానాం తత్ర కిం ఫలమ్‌. 2

యే వసంతి ప్రయాగేతు బ్రూహి తేషాంచ కిం ఫలమ్‌ |

మార్కండేయ ఉవాచ : కథయిష్యామి తే వత్స యచ్ఛ్రేష్ఠం తత్ర యత్ఫలమ్‌. 3

పురా హి సర్వవిప్రాణాం కథ్యమానం యథా శ్రుతమ్‌ | ఆప్రయాగ ప్రతిష్ఠానా దాపురా ద్వాసుకే ర్హ్రదాత్‌.

కంబళాశ్వతరౌ నాగౌ.నాగశ్చ బహుమూలకః | ఏత త్ర్పజాపతేః క్షేత్రం త్రిషు లోకేషు విశ్రుతమ్‌. 5

తత్ర స్నాతా దివం యాంతి యే మృతా స్తే7పునమర్భవాః |

తతోబ్రహ్మాదయో దేవా రక్షాం కుర్వంతి సంగతాః. 6

అన్యేచ బహవ స్తీర్థాః సర్వపాపహరాః శుభాః | న శక్యాః కథితం రాజన్‌ బహువర్ష శ##తై రపి. 7

సంక్షేపేణ ప్రవక్ష్యామి ప్రయాగస్యతు కీర్తనమ్‌ | షష్టి ర్ధనుః సహస్రాణి యాని రక్షంతి జాహ్నవీమ్‌. 8

యమునాం రక్షతి సదా సవితా స ప్తవాహనః | ప్రయాగంతు విశేషేణ సదా రక్షతి వాసవః. 9

మండలం రక్షతి హరి ర్దైవతైః సహ సంగతః | తం వటం రక్షతి సదా శూలపాణి ర్మ హేశ్వరః. 10

స్థానం రక్షంతి వై దేవాః సర్వపాపహరం శుభమ్‌ | అధర్మేణావృతో లోకే నైవ గచ్ఛతి తత్పదమ్‌. 11

స్వల్ప మల్పతరం పాపం యదా తే స్యా న్నరాధిప |

ప్రయాగం స్మరమాణస్య సర్వ మాయాతి సంక్షయమ్‌. 12

నూట రెండవ అధ్యాయము.

ప్రయాగ మాహాత్మ్య వర్ణనము.

యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లు పలికెను: భగవన్‌! ప్రయాగ యాత్ర ఎట్లు చేయవలెను? అచట మరణించినచో కలుగు ఫలము ఏమి? స్నానముచే కలుగు ఫలమెట్టిది? అచట నివసించు వారికి కలుగు పుణ్యమేమి? ఈ విషయమున దేవ ముఖ్యుడగు బ్రహ్మ ఏమని చెప్పెనని పురా కల్పమునందు చెప్పబడినది? తెలుపుము.

మార్కండేయుడు: నాయనా! ప్రయాగ క్షేత్రమువలన కలుగు ఫలమేమో దాని శ్రేష్ఠత ఏమో అదంతయు పూర్వము బ్రాహ్మణులు చెప్పుకొనుచుండ నేను వినిన దానిని తెలిపెద; వినుము ప్రయాగ (పుర)ము-ప్రతిష్ఠాన నగరము (ఇది నేటి పైథాను మాత్రమేకాదు; నేటి అలహాబాదు స్థానమున నొక ప్రతిష్ఠాన నగరముండెడిది. అది ఒకప్పుడు-దుష్యంతాదుల కాలమున పూరు వంశీయుల రాజధానిగా నుండెను.) వాసుకిహ్రదపురము-కంబలాశ్వతరులను నాగుల స్థానములు-బహుమూలకుడను నాగుని స్థానము-అను ఈ నాలుగు అవధుల లోపలనున్నది ప్రజాపతి క్షేత్రము అని లోకత్రయ ప్రసిద్ధము; అచట స్నానము చేసినచో స్వర్గప్రాప్తి; అట మరణించిన వారికి పునర్జన్మము లేదు; అందుననే బ్రహ్మాది దేవతలు అందరును కూడి దీనిని రక్షించుచుందురు. ఇంకను ఇచటగల బహుతీర్థముల సంఖ్య ఇంతయని వందల ఏండ్లకును చెప్పనలవికాదు. ఐనను ప్రయాగ క్షేత్ర కీర్తనమును సంక్షేపమున చేయుదును. అచటి గంగను ఆరువేల ధనువులు (అందరు ధానుష్కులు) రక్షించుచుండును (దురు.) యమునను సప్తాశ్వుడగు రవి కాపాడుచుండును. ప్రయాగమును ఇంద్రుడు విశేషించి రక్షించుచుండును. ఈ ప్రయాగ మండలమునంతటిని హరి సకల దేవసహాయుడై రక్షించుచుండును. అచటి వటవృక్షమును శూలపాణియగు మహేశ్వరుడు రక్షించును; సర్వపాపహరమగు ఆ పుణ్యస్థానమును దేవతలు రక్షింతురు. లోకమునందలి మానవుడు అధర్మావృతుడై నంతవరకును అచటికి పోజాలడు; అల్పాల్పమగు & పమున్న వానికి మాత్రము ప్రయాగను తలంచినంతనే అదియు నశించును; ఆ తీర్థమును దర్శించినను పేర్కొన్నను అచటి మృత్తికను స్పృశించినను నరుడు పాపముక్తుడగును.

దర్శాన త్తస్య తీర్థస్య నామసంకీర్తనాదపి | మృత్తికా77లంభనాద్వాపి నరః పాపా త్ర్పముచ్యతే. 13

పంచకుండాని రాజేంద్ర తేషాం మధ్యేతు జాహ్నవీ | ప్రయాగస్య ప్రవేశే తు పాపం నశ్యతి తత్‌క్షణాత్‌.

యోజనానాం సహస్రేషు గంగాయాః స్మరణా న్నరః| అపి దుష్కృతకర్మాతు లభ##తే పరమాం గతిమ్‌. 15

కీర్తనా న్ముచ్యతే పాపాత్‌ దృష్ట్వా భద్రాణి పశ్యతి | అవగాహ్యచ పీత్వా తు పునాత్యాస ప్తమం కులమ్‌. 16

సత్యవాదీ జితక్రోధీ అహింసాయాం వ్యవస్థితః | ధర్మానుసారీ త త్త్వజ్ఞో గోబ్రాహ్మణహితే రతః. 17

గంగాయమునయో ర్మధ్మే స్నాతో ముచ్యేత కిల్బిషాత్‌ |

మనసా చింతయన్‌ కామా నవాప్నోతి సుపుష్కలాన్‌. 18

తతో గత్వా ప్రయాగంతు సర్వదేవాభిరక్షితమ్‌ | బ్రహ్మ చారీ వసే న్మాసం పితౄన్‌ దేవాంశ్చ తర్పయేత్‌.

ఈప్సితాన్‌ లభ##తే కామాన్‌ యత్ర యత్రాభిజాయతే | తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా. 20

సమాగతా మహాభాగా యమునా తత్ర నిమ్నగా | తత్ర సంనిహితో నిత్యం సాక్షాద్దేవో మ హేశ్వరః. 21

దుష్ప్రాప్యం మానుషైః పుణ్యం ప్రయాగంతు యుధిష్ఠిర | దేవదానవగంధర్వా ఋషయః సిద్ధచారణాః. 22

తదుపస్పృశ్య రాజేంద్ర స్వర్గలోక ముపాసతే.

ఇతీ శ్రీమత్స్యమహాపురాణ ప్రయాగమాహాత్మ్యే ద్వ్యధికశతతమో7ధ్యాయః.

రాజా! అచట పంచకుండలు (తీర్థములు) కలవు. వానిలోనిదే జాహ్నవి (గంగ)యును; ప్రయాగములో ప్రవేశించిన తత్‌క్షణమే పాపనాశమగును; యోజన సహస్రములనుండియైనను ఆమోను స్మరించినంతనే ఎట్టి దుష్కృత కర్ముడును పాపముక్తుడై పరమగతినందును. దర్శించినంతనే శుభములు పొందును. స్నానమాడినను ఆ నీటిని త్రావినను ఏడు తరములవారిని పవిత్రులనొనరించిన వాడగును. ఒక సత్యవాదియు జితక్రోధుడును అహింసకుడును ధర్మానుసారియు త త్త్వజ్ఞుడును గోబ్రాహ్మణ హితరతుడునునగు సజ్జనుడు గంగా యమునా మధ్యమున స్నా నమాడినంత పాపముక్తుడగును; మనసా నిరంతరము దానినే ధ్యానించుచుండువాడు సుపుష్కలమగు కామములన్నియు నెరవేరును.

అందువలన సర్వదేవాభిరక్షితమగు ప్రయాగమున కేగి బ్రహ్మ చర్యముతో మాసముండి పితృ దేవతలకు దేవతలకు తర్పణ మీయవలెను. తత్పుణ్యమున అత డెచట జన్మించినను సర్వ కామపూ ర్తి నందును.

రవిపుత్త్రిగా త్రిలోక విశ్రుతయగు మహాభాగ యమున అచట గంగతో కలియును. అచట సాక్షాన్మ హేశ్వరుడు సదా సన్నిహితుడు; ప్రయాగ క్షేత్రోపాసనమున మానవులకు దుష్ప్రాపమగు పుణ్యము లభించును. ఏలయన దేవదానవ గంధర్వ సిద్ధచారణులును ఋషులును ఆ క్షేత్రమున ఆరమించినంతమాత్రముననే స్వర్గ సుఖముల నందగలుగుచున్నారు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters