Sri Matsya Mahapuranam-1    Chapters   

చతురు త్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

యధిష్ఠిరః : 

యథా యథా ప్రయాగస్య మాహాత్మ్యం కథితం త్వయా | తథాతథా ప్రముఛ్యే7హం సర్వపాపై ర్న సంశయః. 1

భగవ న్కేన విధినా కర్తవ్యో ధర్మ నిశ్చయః | ప్రయాగే యో విధిః ప్రో క్త స్తన్మే బ్రూహి మహామునే. 2

మార్కణ్డయః : కథయిష్యామి తే వత్స తీర్థయాత్రావిధిక్రమమ్‌ |

ఆర్షేణ చైవ విధినా యథా దృష్టో యథా శ్రుతః. 3

ప్రయాగతీర్థయాత్రార్థీ యః ప్రయాతి నరః క్వచిత్‌ | బలీవర్దం సమారూఢ శ్శృణు తస్యాపి యత్ఫలమ్‌. 4

నరకే వసతే ఘోరే గవాం క్రోశోహి దారుణః | సలిలంచ న గృహ్ణన్తి పితర స్తస్య దేహనః. 5

యస్తు పుత్త్రం స్నుషాం భార్యాం లాలయే త్పాలయేత్తథా |

యథాత్మానం తథా సర్వం దానం విప్రేషు దాపయేత్‌. 6

ఐశ్వర్యలోభమోహాద్వా గచ్ఛే ద్యానేన యో నరః | నిష్ఫలం తస్య తత్తీర్థం తస్మాద్యానం వివర్జయేత్‌. 7

గఙ్గాయమునయోర్మధ్యే యస్తు కన్యాం ప్రయచ్ఛతి | ఆర్షేనైవ విధానేన యథావిభవసమ్భవమ్‌. 8

న స పశ్యతి తం ఘోరం నరకం తేన కర్మణా | ఉ త్తరా న్త్స కురూన్గత్వా మోదతే కాలమక్షయమ్‌. 9

పుత్త్రాన్దారాంశ్చ లభ##తే ధార్మికా న్రూపసంయుతా& | తత్ర దానం ప్రదాతవ్యం యథావిభవసమ్భవమ్‌. 10

తేన తీర్థఫలంచైవ వర్ధతే నాత్ర సంశయః | స్వర్గే తిష్ఠతి రాజేన్ద్ర యావదాభూతసవ్ల్పువమ్‌. 11

వటమూలం సమాసాద్య యస్తు ప్రాణా న్విముఞ్చతి | సర్వలోకానతిక్రమ్య శివలోకం స గచ్ఛతి. 12

తత్ర తే ద్వాదశాదిత్యా స్తప న్తే రుద్ర మాశ్రితాః | నిర్దహ న్తి జగత్సర్వం వటమూలం నదహ్యతే. 13

నష్టే చన్ద్రర్కపవనే యదా చై కార్ణవం జగత్‌ | స్వపతే తత్ర వై విష్ణుఃపరమాత్మా పునఃపునః. 14

దేవదానవగన్దర్వా ఋషయస్సిద్ధచారణాః | సదా సేవ న్తి త త్తీర్థం గఙ్గాయమునసఙ్గమే. 15

నూట నాలుగవ అధ్యాయము

ప్రయాగ మాహాత్మ్యము

యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లనెను: భగవన్‌! తాము నాకు ప్రయాగ మాహాత్మ్యమును చెప్పుచున్న కొలదిని నేను సర్వపాపముక్తుడ నగుచున్నట్లు భావించుచున్నాను. ఆ క్షేత్రమున ధర్మ సంపాదనము చేయు విధానమును తెలుప వేడెదను. అనగా మార్కండేయు డతని కిట్లు చెప్పసాగెను: ఆర్ష పరంపరలో నేను వినినట్లును కనినట్లును ప్రయాగ తీర్థయాత్రా విధిక్రమమును తెలిపెదను.

ప్రయాగ తీర్థయాత్ర ఎద్దు పై చేసినచో గోవులకు కలుగు దారుణ క్రోధఫలముగా ఆతడు ఘోర నరకమున వసించును. అత డిచ్చిన సలిలమును కూడ పితరులు గ్రహింపరు. ఐశ్వర్యమదలోభ మోహాదులచే అట్లు పోయినను వాని యాత్ర నిష్ఫలము. కావున యానముపై తీర్థయాత్ర చేయనేరాదు. తన పత్నీ పు త్త్రస్ను షాదులను తను కాపాడుకొనునంత శ్రద్ధతోనే తీర్థయాత్రను చేసి అచట స్నానమాడి విప్రులకు దానమును చేయవలెను. గంగా యమునా మధ్యమున (ప్రయాగయందు) ఆర్ష విధానమున తన విభవము కొలది కన్యాదాన మొనర్చువాడు తత్పుణ్యమున నరకమును చూడనైన చూడడు. (ముందు జన్మములలో) ఉ త్తర కురువర్షము లందనంతకాలము సుఖించును. ధార్మికులు రూపవంతులు నగు దారపుత్త్రు లతనికి లభింతురు. ప్రళయకాలము వరకు స్వర్గమున వసించి సుఖించును. కావున అచట తన విభవ వి స్తరానుసారము దానములు చేయవలెను. దానిచే అతని పుణ్యము వృద్ధి నందును.

అచటి వటమూలమున ప్రాణముల వదలినయాతడు సర్వలోకముల నతిక్ర మించి శివలోకము చేరును. అచట తపమాచరించిన పుణ్యమున ద్వాదశాదిత్యులును రుద్రుని చేరగలిగిరి. కావుననే (ప్రళయమునను) వారును సర్వజగమును దహింతురు కాని వటమూలమును దహించరు. చంద్రార్క పవనులును నశించి జగ మేకార్ణవమయినపుడును ప్రతి కల్పాంతమందును పరమాత్ముడు విష్ణువచటనే నిదురించును. దేవదానవ గంధర్వ ఋషి సిద్ధచారణాదులు సదా ఆ తీర్థమును సేవించుచుందురు. కావున రాజేంద్రా! పవిత్రమగు ఆ తీర్థయాత్ర చేయవలెను.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర ప్రయాగం సంశితంచ తత్‌ | యత్ర బ్రహ్మాదయో దేవా దిశశ్చ సదిగీశ్వరాః. 16

లోకపాలాశ్చ సాధ్యాశ్చ పితరో లోకసమ్మతాః | సనత్కుమారసహితా స్తథావై పరమర్షయః. 17

అంగిరఃప్రముఖ శ్చైవ తథా బ్రహ్మర్షయో7పరే | యక్షా నాగా స్సువర్నాశ్చ సిద్ధా శ్చక్రచరాశ్చ యే. 18

సరితః సాగరాః శైలా స్తథా విద్యాధరాశ్చ యే | హరిశ్చ భగవా నాస్తే ప్రజాపతిపురస్సరః. 19

గంగాయమునయోర్మధ్యం పృథివ్యా జఘనం స్మృతమ్‌ |

ప్రయాగం రాజశూర్దూల త్రిషు లోకేషు విశ్రుతమ్‌. 20

తతః పుణ్యతరం నా స్తి త్రిషు లోకేషు భారత | శ్రవణా త్తస్య తీర్థస్య నామసంకీ ర్తనా దపి. 21

మృత్తికాలంభనాద్వాపి నరః పాపా త్ర్పముచ్యతే | తత్రాభిషేకం యః కుర్యా న్మకరస్థే దివాకరే. 22

స తుల్యఫలమాప్నోతి రాజసూయాశ్వమేధయోః | న వేదవచనాతీతం న లోకవచనా త్తథా. 23

మతి రుత్క్రమణ యాతి ప్రయాగగమనం ప్రతి | కోటితీర్థసహస్రాణి షష్టికోట్య స్తథా7పరాః. 24

తేషాం సాన్నిధ్య మత్రైవ సతతం కురునందన | యా గతి ర్యోగయు క్తస్య స త్త్వస్థస్య మనీషిణః. 25

సా గతి స్త్యజతః ప్రాణా న్గంగాయమునసంగయే | న తే జీవ న్తి లోకే7స్మి న్యత్ర యత్ర యుధిష్ఠిర. 26

యే ప్రయాగం న సమ్ర్పాప్తా స్త్రిషు లోకేషు విశ్రుతమ్‌ |

ఎవం దృష్ట్వా తు త త్తీర్థం ప్రయాం పరమం పదమ్‌. 27

ముచ్యతే సర్వపాపేభ్యః శశాంక ఇవ రాహుణా | కంబళాశ్వతరౌ నాగౌ యమునాదక్షిణ తటే. 28

తత్ర స్నాత్వాచ దత్వాచ ముచ్యతే సర్వపాతకైః | తత్ర గత్వాచ సంస్థానం మహాదేవస్య ధీమతః. 29

నర స్తారయతే పూన్వా న్దశాతీతా న్దశాపరన్‌ | కృత్వా7భిషేకంతు పున స్సో7శ్వమేధఫలం లభేత్‌. 30

స్వర్గలోక మవాప్నోతి యావభూతసంప్లవమ్‌ |

బ్రహ్మాది దేవతలు దిశలు దిగధిపతులు లోకపాలురు సాధ్యులు లోకపూజ్య పితరులు సనత్కుమారాది మహర్షులు అంగిరః ప్రముఖ బ్రహ్మర్షులు యక్షనాగ గరుడ సిద్ధచారణులు నదీ సాగర శైలములు విద్యాధరులు ప్రజా పతియు హరియు సదా అచటనుందురు.

గంగా యమునా మద్యము (ప్రయాగ) పృథివీ జఘన స్థానము. అని లోకత్రయ ప్రసిద్ధము. లోక త్రయమునను అంతకంటె పుణ్యకర ప్రదేశము మరిలేదు. ఆ తీర్థపు నామమును వినినను కీ ర్తించినను మృత్తికను సంపాదించినను తాకినను నరుడు పాపముక్తుడగును. రవి మకర సంక్రాంతియందచట స్నా నము చేసినచో రాజసూయాశ్వమేధ తుల్య ఫలము లభించును. వేదవచన లోకవచములబట్టి ఇట్లు చెప్పుట మాత్రముకాదు; (ఇది ప్రత్యక్ష సిద్ధము.) ప్రాణోత్ర్కమణ సమయమందైన ప్రయాగకు పోవలెనని సంకల్పము కలుగుట మేలు. వేయికోట్ల తీర్థములును మరి అరువది కోట్ల తీర్థములును సతతమచటనేయుండును. కావున సత్త్వగుణ ప్రధానుడై యోగమనుష్ఠించినవానికి కలుగు సుగతి ప్రయాగలో మరణించినంత మాత్రమున కలుగును. త్రిలోక ప్రసిద్ధమగు ప్రయాగతీర్థమునకు పోవని వారెచ్చ టెచ్చట జీవించినను జీవించనట్లే. యమునా దక్షిణ తీరమున కంబళుడు అశ్వతరుడు ననునాగులుందురు. అచటి నీరు స్నా నమాడినను త్రావినను సర్వపాపము క్తియగును. అచటనే శివ క్షేత్రమొకటి కలదు. అచటికేగినను అతని వెనుకముందు పదితరముల వారు తరింతురు. అచట స్నానమాడినచో అశ్వమేధ ఫలము కలిగి ప్రళయకాలము వరకు స్వర్గమున సుఖవించును.

పూర్వభాగేతు గంగాయా స్త్రిషు లోకేషు భారత. 31

కూపం చైవతు సాముద్రం ప్రతిష్ఠానం (నే)తు విశ్రుతమ్‌ |

బ్రహ్మచారీ జితక్రోధ స్త్రిరాత్రం యది తిష్ఠతి. 32

సర్వపాపవిశుద్ధాత్మా సో7శ్వమేధఫలం లభేత్‌ | ఉ త్తరేణ ప్రతిష్ఠానా ద్భాగీరథ్యాస్తు పూర్వతః. 33

హంసప్రపతనం నామ తీర్థం త్రైలోక్య విశ్రుతమ్‌ | అశ్వమేధఫలం తత్ర స్నా నమాత్రేణ భారత. 34

యావచ్చంద్రశ్చ సూర్యశ్చ తావత్స్వర్గే మహీయతే | ఊర్వశీపులినే రమ్యే విపులే హంసపాండురే. 35

పరిత్యజతి యః ప్రాణాం చ్ఛృణు తస్యాపి య త్ఫలమ్‌ | పష్టిర్వర్షసహస్రాణి షష్ణి ర్వర్షశతాని చ. 36

వసతే పితృభిః సార్ధం సూర్యలోకే నరాధిప | ఊర్వశీం తు సదా పశ్యే ద్దేవలోకే నరాధిప. 37

పూజ్యతే సతతం తత్ర ఋషిగంధర్వకిన్నరైః | తతః స్వర్గపరిభ్రష్టః క్షీణకర్మా దివి చ్యుతః. 38

ఊర్వశీసదృశీనాంతు కన్యానాం లభ##తే శతమ్‌ | గవా మశ్వసహప్రాణాం మహాభోగపతి ర్భవేత్‌. 40

మధ్యే నారీసహస్రాణాం బహ్వీనాం వసతి ర్భ వేత్‌ | దశగ్రామసహస్రాణాం భోక్తా భవతి నిత్యశః. 41

కాంచీనూపురశ##బ్దై శ్చ సుప్తో7సౌ ప్రతిబుధ్యతే |

భక్త్వాతు భోగా న్విపులాం స్తత్తీర్థం లభ##తే పునః. 42

శుక్లామ్బరధరో నిత్యం నియత స్సంయతేన్ద్రియః | ఏకకాలం తు భుఞానో మాసం శమ్భో ర్గతిర్భవేత్‌. 43

సువర్ణాలఙ్కృతానాంతు నారీణాం లభ##తే శతమ్‌ | స భుక్త్వా విపులా న్భోగాం స్తత్తీర్థం లభ##తే పునః. 44

అథ సన్ధ్యావటే రమ్యే బ్రహ్మచారీ జితేన్ద్రియః | ఉపాసీత శుచిస్సన్ధ్యాం బ్రహ్మలోక మవాప్నుయాత్‌. 45

అచటనే గంగకు తూర్పున సాముద్ర కూపము అనియు ప్రతిష్ఠాన నగరమున నొక ప్రదేశము కలదు. జితక్రోధుడై బ్రహ్మచర్యమున త్రిరాత్రమట గడపినచో సర్వపాప విశుద్ధాత్ముడై అశ్వమేధ ఫలమందును. భాగీరధీ గంగకు తూర్పున ప్రతిష్ఠానమునకు ఉ త్తరమున «హంసప్రపతనమను త్రై లోక్య విశ్రుతమగు తీర్థము కలదు. అచట స్నాన మాత్రమున అశ్వమేధ ఫలము లభించును. ఆ చంద్ర సూర్యముగ స్వర్గమున సుఖించును. మనోహరమై విశాలమై హంసవలె తెల్లనిదగు ఊర్వశీపులినము (పులినము-ఇసుకతిన్నె) అనుచోట ప్రాణత్యాగమున అరువది ఆరువేల సంవత్సరములు తన పితరులతో కూడ సదా ఊర్వశీ దర్శనముతో రవి లోకమున వసించును (ఊర్వశి-అగ్ని తత్త్వాత్మికయగు శ క్తి) అచట ఋషి గంధర్వ కిన్న రుల సతత పూజలందుకొనుచు పుణ్యాంతమున స్వర్గ పరిభ్రష్టుడైనను ఊర్వశిని పోలు నూర్గుర కన్యలను కనును: ఆసముద్ర పర్వంత పృథివికి పతియగును. ధనధాన్యయుతుడు బహు సహస్ర గవాశ్వాధిపతియునగును. బహు సహస్ర నారీపతియు దశ సహస్ర గ్రామాధిపుడు నగును. అందెల యొడ్డాణముల సవ్వడి వినుచు నిద్ర మేల్కాంచువాడగును. ఇట్లు భోగములన్ని యనుభవించియు మరల ఈ తీర్థమునకే వచ్చును.

ఈ తీర్థమున శుక్లాంబరధరుడు నియతేంద్రియుడునై ఏకభు క్తము చేయుచుండునతడు శివ సాంనిధ్యమందును-మరల భూమిపై జన్మించియు స్వర్గ భూషణాలంకృతలగు నారీశతమునకు పతియగును. విపుల భోగముల ననుభవించి మరల ఆ తీన్థమునకేగి దాని సేవించును. అచటి సంధ్యావటమను రమ్య ప్రదేశమున శుచియు బ్రహ్మచారియు జితేంద్రియుడునై సంధ్యోపాసన చేయువాడు బ్రహ్మలోక ప్రాప్తుడగును.

కోటితీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరాత్యజేత్‌ | కోటిర్వర్షసహస్రాణాం స్వర్గలోకే మహీయతే. 46

తతస్సర్గా త్పరిభ్రష్టః క్షీణకర్మా దివశ్చ్యుతః | సువర్నమణిముక్తాఢ్యే కులే జాయేత రూపవా&. 47

తతో భోగవతీం గత్వా వాసుకే రుత్తరేణతు | దశాశ్వమేధికం నామ తీర్థం తత్రాపరంభ##వేత్‌. 48

కృతాభిషేకస్తు నర స్సోశ్వమేధఫలం లభేత్‌ | ధనాఢ్యో రూపవా& దక్షో దాతా భవతి ధార్మికః. 49

చతుర్వేదేషు యత్పుణ్యం సత్యవాదిషు యత్ఫలమ్‌ | అహింసాయాంతు యో ధర్మో గమనాదేవ తత్ఫలమ్‌.

కురుక్షేత్రసమా గఙ్గా యత్రకుత్రావగాహితా | తస్మా ద్దశగుణా సా హి కాళిన్ద్యా యత్ర సఙ్గతా. 51

యత్ర గఙ్గా మహాభాగా బహుతీర్థ తపోధనా | సిద్ధక్షేత్రం తదుభయం నాత్ర కార్యా విచారణా. 52

క్షితౌ తారయతే మర్త్యా న్నాగాం స్తారయతే హ్యధః | దివి తారయతే దేవాం స్తేన త్రపతగా స్మృతా. 53

_______________________________________

« హంసలు వాలెడిచోటు అని అర్థము. హంసలు క్రౌంచములు మొదలగు వలస జాతి జలపక్షులు వర్షాకాలమున మన దేశమును విడిచి ఉ త్తరమందలి ఇతర దేశములకు పోవునపుడును అచటినుండి మరల శరత్కాలమున మన దేశములోనికి వచ్చునపుడును నడుమ అవి ఈ ప్రదేశమున వాలి కొలదికాలము గడపి పోవుచుండును. అనగా ఇది ఉభయ ప్రకృతులకు అనుకూల ప్రదేశమయి పవిత్రమయి యుండునది. అందుచేతనే దీనికా పేరు వచ్చెను.

యావదస్థీని గఙ్గాయాం తిష్ఠన్తే యస్య దేహినః | తావద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే. 54

తీర్థానాం తు పరం తీర్థం నదీనాము త్తమా నదీ | మోక్షదా సర్వభూతానాం మహాపాతకినామపి. 55

సర్వత్ర సులభాగఙ్గా త్రిషు స్థానేషు దుర్లభా | గఙ్గాద్వారే ప్రయాగే చ గఙ్గాసాగరసఙ్గమే. 56

తత్ర స్నా త్వా దివం యా న్తి యే మృతా స్తే7పునర్భవాః| సర్వేషామేవ భూతానాం పాపోపహతచేతసామ్‌.

గతి మన్వేషమాణానాం నా స్తి గఙ్గాసమా గతిః | పవిత్రాణాం పవిత్రంచ మఙ్గళానాంచ మఙ్గళమ్‌. 58

మహేశ్వరశిరోభ్రష్టా సర్వపాపహరా శుభా.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్డయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ

మాహాత్మ్యే చతురుత్తర శతతమో7ధ్యాయః.

అచటి కోటి తీర్థమున ప్రాణత్యాగముచే సహస్రకోటి సంవత్సరములు స్వర్గసుఖమబ్బును. పుణ్యావసానమున స్వర్గభ్రష్టుడయ్యు సువర్ణ మణిముక్తా సంపన్నమగు వంశమున రూపవంతుడై జనించును. వాసుకి ప్రదేశమునకు ఉ త్తరమునగల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడినచో అశ్వమేధ ఫలమందును. స్వర్గ వాసానంతరము ధనాఢ్యుడు రూపవంతుడు సమర్థుడు దాతయు ధార్మికుడునై జన్మించును. చతుర్వేదాధ్యయనము సత్యవచనము అహింస పాటించుటచే గలుగు ఫలమంతయు ఆ తీర్థగమనముచే గలుగును. గంగయందెచ్చట స్నానమాడినను కురుక్షేత్రవాస సమాన పుణ్యము లభించును. ఆనది యమునతో కలిసిన ఈ ప్రయాగమంతకంటె పది మడుగులు పుణ్యప్రదము. బహు తీర్థములు తపోధనులు నిండియున్న ఈ గంగా యమునా సంగమ స్థానము సిద్ధక్షేత్రమే; ఇందు సంశయమే లేదు. గంగ మూడు త్రోవల ప్రవహించి పాతాళమున నాగులను భూలోకమున నరులను స్వర్గమున దేవతలను తరింపజేయునది కావుననే ఆమెకు త్రిపథగయను నామము కలిగినది. ఏ ప్రాణికిగల ఎన్ని అస్థి కండములు గంగయందు నిలుచునో అతడన్ని వేలయేండ్లు స్వర్గసుఖమందును. గంగ తీర్థములలో ఉ త్తమతీర్థము; నదులలో ఉ త్తమనది; మమాపాతకులగు ప్రాణులకును మోక్షమొనగునది; గంగ సర్వత్ర సులభముగ లభించును; మూడు స్థానముందు ఆమె దుర్లభ; (చాల పుణ్యప్రదాయిని); అవి ఏవనిన-గంగాద్వారము (హరిద్వారము) ప్రయాగ-గంగా సాగర సంగమము: ఈ మూడు తావులయందును స్నా నమాడువారు పునరావృత్తిలేని లోకములందుదురు; పాప కలుషిత చిత్తులై గడపి పుణ్య గతికోరు ఆర్తులకు గంగవంటి శరణ్యముమరిలేదు. ఆమె పవిత్రమగువానిలోనెల్ల పవిత్రయైనది; శుభమగు వానిలోకెల్ల శుభకరి; మహేశ్వర శిరమునుండి జారిపడి సర్వుల సర్వపాపముల పోగొట్టు శుభరూపురాలు గంగ

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను

నూట నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters