Sri Matsya Mahapuranam-1    Chapters   

నవో త్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

యుధిష్ఠిరః: 

కథం స్వర్గమిదం ప్రోక్తం ప్రయాగస్య మహామునే | ఏతన్మే సర్వమాఖ్యాహి యథాహి మమ తారయేత్‌. 1

మార్కణ్డయః: శృణు రాజ న్మహాబాహో ప్రోక్తం సర్వమిదం జగత్‌ | బ్రహ్మా విష్ణు స్తథా సోమో దేవతాః ప్రభు రవ్యయః. 2

బ్రహ్మా సృజతి భూతాని స్థావరం జఙ్గమం చ యత్‌ | తాన్యేతాని పరే లోకే విష్ణు స్సంవర్ధతే ప్రజాః. 3

కల్పాన్తే తత్సమగ్రంహి రుద్రస్సంహరతే జగత్‌ | తదా హరతి చాప్యేత న్న కదాచి ద్వినశ్యతి. 4

ఈశ్వర స్సర్వభూతానాం యః పశ్యతి స పశ్యతి | అత్ర యే త్వవతిష్ఠన్తి తే యాన్తి పరమాం గతిమ్‌. 5

యుధిష్ఠిరః ఆఖ్యాహి మే యథాతత్త్వం యథై వాతిష్ఠతే శ్రుతిః| కేనవా కారణనైవ తిష్ఠన్తే లోకసత్తమాః. 6

మార్కణ్డయః : ప్రయాగే యేన వసతి హ్మా విష్ణు ర్మహేశ్వరః | కారణం త త్ప్రక్ష్యామి శృణు త్వం త ద్యుధిష్ఠిర. 7

పఞ్చయోజనవిస్తీర్ణం ప్రయాగస్యతు మణ్డలమ్‌ | తిష్ఠన్తి రక్షణార్థాయ పాపకర్మనివారణాత్‌. 8

యస్మి న్జహ్యా త్స్వకం పాపం నరకంచ న పశ్యతి | ఏవం బ్రహ్మాచ విష్ణుశ్చ ప్రయాగే నిత్య మీశ్వరః. 9

ఉత్తరేణ ప్రతిష్ఠానా చ్ఛద్మనా బ్రహ్మతిష్ఠతి | మహేశ్వరో వటో భూత్వా యావదాభూతసవ్ల్పువమ్‌. 10

యే చాన్యే బహవశ్చైవ తిష్ఠన్తిచ యుధిష్ఠిర | స్వరాజ్యం కురు రాజేన్ద్ర భ్రాతృభి స్సహితో7నఘ. 11

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్డయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ

మాహాత్మ్యే నవోత్తరశతతమో7ధ్యాయః.

నూట తొమ్మిదవ యధ్యాయము.

ప్రయాగ మాహాత్మ్యము.

యుధిష్ఠిరుడు మార్కండేయుని ఇట్లడిగెను: మహామునీ! ప్రయాగ తీర్థప్రభావము స్వర్గప్రదమెట్లగును? అది నా పూర్వులను ఎట్లు తరింపజేయగలదు? తెలుపుమన మార్కండేయుడిట్లు చెప్పెను: ఈ లోకములన్నియును దాని యందలి స్థిరచర ప్రాణులును పదార్థములును బ్రహ్మ విష్ణు శివులును దేవతలును అన్నియు అవ్యయుడగు ప్రభువగు ఆ పరమాత్మయే. అందునను బ్రహ్మ సృజింపగా విష్ణువా లోకములును వర్ధిల్లజేయును. కల్పాంతమందదియంతయు రుద్రుడు సంహరించును (మూల తత్త్వమునందు లయమందజేయును.). ఐనను ఇది (ఈ ప్రయాగ) ఎన్నడును నశించునదికాదు. కావున ఇచట నివసించువారు పరమపదము నందుదురు. అన యుధిష్ఠిరుడిట్లడిగెను: ప్రయాగఏల ఎన్నడును నశించదు? ఈ లోక సత్తములగు త్రిమూర్తులచట సదా ఏల నివసింతురు? తెలుప వేడెదను. అన మార్కండేయు డిట్లనెను: పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమునందు తీర్థ సేవకుల పాప మోచనము చేయుటకే వారు మువ్వురును మారు రూపములో ఉందురు. వారచట వట రూపమున నున్నారు. ప్రళయము వరకును ఉందురు కూడను. వారి మారు రూపములగునవి ఇంకను అచట అనేకములు గలవు. కావున అనఘా! (నామాట విశ్వసించి ప్రయాగ తీర్థ సేవచేసి) నీ సహోదరులతో కూడి రాజ్యపాలనము చేయుచుండుము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను

నూట తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters