Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకాదశో7ధ్యాయః.

సూర్యవంశానువర్ణనమ్‌.

ఋషయః. 

ఆదిత్యవంశ మఖిలం వద సూత యథాక్రమమ్‌ |. సోమవంశం చ త త్త్వజ్ఞ యథావ ద్వక్తు మర్హసి. 1

 సూతః: వివస్వా న్కశ్యపా త్పూర్వ మదిత్యా మభవ త్పురా |

తస్య పత్నీత్రయ మభూ త్సంజ్ఞా రాజ్ఞీ ప్రభా తథా. 2

రేవతస్య సుతా రాజ్ఞీ రైవతం సుషువే సుతమ్‌ |

ప్రభా ప్రభాతం సుషువే త్వాష్ట్రీ సంజ్ఞా తథా మనుమ్‌. 3

యమశ్చ యమునా చైవ యమళౌ తౌ బభూవతుః | తత స్తేజోమయం రూప మసహన్తీ వివస్వతః. 4

నారీ ముత్పాదయామాస స్వశరీరా దనిన్దితామ్‌ | త్వాష్ట్రీ స్వరూపరూ పేణ నామ్నా ఛాయేతి భామినీ. 5

కిం కరోమీతి పురత స్సంస్థితా తా మభాషత | ఛాయే త్వం భజ భర్తారం మదీయం చ పరాఙ్గనే. 6

అపత్యాని మదీయాని మాతృ స్నేహేన పాలయ | తథేత్యుక్త్వా చ సా దేవ మగా ద్ధర్మాయ సువ్రత. 7

కామయామాస దేవోపి సంజ్ఞేయమితి చాదరాత్‌ | జనయాయాస సావర్ణిం మనుం మానుషరూపిణమ్‌. 8

సవర్ణత్వాచ్చ సావర్ణో మనో ర్వైవస్వతస్య తు | తత శ్శనిం చ తపతీం విష్టిం చైవ క్రమేణ తు. 9

ఛాయాయాం జనయామాస సంజ్ఞేయమితి భాస్కరః | ఛాయా స్వపుత్త్రే త్వధికం స్నేహం చక్రేమనౌ తదా.

పూర్వో మను స్తతః క్షాన్తో యమ శ్చ క్రోధమూర్ఛితః | సన్తర్జయామాస తదా పాద ముద్యమ్య దక్షిణమ్‌.

శశాప చ యమం ఛాయా భక్ష్యతే క్రిమిసంచయైః | పాదో7య మేకో భవతః పూయశోణితవిస్రవః. 12

నివేదయామాస పితు ర్యమ శ్శాప మమర్షితః | నిష్కారణ మహం శప్తో మాత్రా దేవ సకోపయా. 13

బాలభావా న్మయా తద్వ దుద్యత శ్చరణ స్సకృత్‌ | మనునా వార్యమాణాపి మమ శాప మదా ద్విభో. 14

ప్రాయేణ మాతా చాస్మాక మసమా స్నేహతో యతః | దేవోప్యాహ యమం భూయః కిం కరోమి మహామతే.

మౌర్ఖ్యా త్కశ్చన దుఃఖీ స్యా దథవా కర్మస న్తతేః | అనివార్యో భవస్యాపి కా కథా7న్యేషు జన్తుషు. 16

కర్తారం కర్మపాకస్తు స క్రిమీ న్భక్షయిష్యతి | క్లేదం చ రుధిరం చైవ పుంసో7య మపనేష్యతి. 17

ఏకాదశాధ్యాయము

సూర్యవంశాను వర్ణనము

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: మీరు పురాణ తత్త్వమును ఎరిగినవారు. తాము మాకు సూర్యచంద్రవంశముల వృత్తాంతములను సంప్రదాయమున ప్రతిపాదింపబడిన విధమున యథా క్రమమున తెలువ వేడుచున్నాము.

సూతు డిట్లు చెప్పనారంభించెను: పూర్వము కశ్యప ప్రజాపతికి అదితి యందు సూర్యుడు కుమారుడుగా జనించెను. అతనికి సంజ్ఞా రాజ్ఞీ ప్రభా అనువారు ముగ్గురు భార్యలు. రేవతుని కూతురు రాజ్ఞి. ఆమె కుమారుడు రైవతుడు. ప్రభా కుమారుడు ప్రభాతుడు. త్వష్ట అను ప్రజాపతి కూతురు అగు సంజ్ఞకు వై వస్వతుడను మనువును యముడు యమున అను కవలును కలిగిరి. సూర్యుని తేజోమయమగు రూపమును సహింపజాలక సంజ్ఞ తన శరీరము నుండి పవిత్రురాలును సుందరియు నగు స్త్రీని జనింపజేసెను. ఆమెయును సంజ్ఞరూపములో సమానమగు రూపము కలిగియుండెను: ఆమె పేరు ఛాయ. నేనిపు డేమి చేయవలయును? అనుచు తన ఎదుట నిలిచిన ఛాయతో సంజ్ఞ ఇట్లనెను: నీవు స్త్రీలలో ఉత్తమురాలవు. నీవు నాభర్తను భర్తగా గ్రహించియుండుము. నా సంతానమగు ఈ ముగ్గురను ప్రీతిలో కాపాడుచుండుము. అని సంజ్ఞకోరగా ఛాయ అంగీకరించి ధర్మము నాచరించు తలంపులోచే సూర్యునికడకు పోయెను. అతడును ఆమెను సంజ్ఞనుగా తలచి ఆమెతోనే కామమున ప్రవృత్తుడయ్యెను. సూర్యునకు ఛాయ యందు మనుష్య రూపుడగు సావర్ణి మనువు పుట్టెను. అతడు తండ్రితో సమానముగా వర్ణము కలవాడు. కనుకనే అతనికా పేరు కలిగెను. పిమ్మట సూర్యునికి ఛాయ యందే శని తపతి విష్టి అను ముగ్గురు సంతానము కలిగిరి. ఛాయ తన పుత్త్రుడగు సావర్ణి మనువుపై అధికముగా ప్రేమ చూపసాగెను. దానిని సంజ్ఞ మొదటి కుమారుడగు వైవస్వతుడు ( మనువు) సహించెను. కాని యముడు సహించక క్రోధో ద్రేకము చెందెను. అతడు తన కుడికాలు ఎత్తి చాయను బెదరించెను. నీ ఈ పాదము ఎల్లప్పుడును చీము ర క్తము కారు చుండును. దానిని క్రిములు తినుచుండును. అని ఛాయ యముని శపించెను.

యముడును ఆ శాపమును సహించలేక సూర్యుని కడకు పోయి ఇట్లు పలికెను: దేవా! మా అమ్మ (ఛాయ) మా అన్న దమ్ముల-అక్కచెల్లెండ్ర-అందర యందును సమానముగా స్నేమ భావము చూపుటలేదు. అది సహించలేక నేను చిన్న తనపు స్వభావముచే ఒక్క మారు కాలు ఎత్తితిని. కోపించి మా అమ్మ నన్ను శపంచినది. వైవన్వతుడు వలదని బ్రతిమాలు చున్నను ఆమె వినలేదు. ఆది విని సూర్యుడు యమునితో ''నాయనా! నీవు తెలియనివాడవు కావు. ఒక్కొక్కరికి తన మూర్ఖత్వము చేతను మరియొకరికి కర్మ వశమునను దుఃఖము కలుగుచుండును. ఈ రెండు విధములలో దేనిచేతనైనను దుఃఖముననుభవించుట శివునకును తప్పించుకొనరానిది. ఇతరుల విషయము చెప్పవలసినదేమున్నది? జీవుల కర్మ విపాకము వారిని క్రిముల చేత భక్షింపజేయును. కర్మానుభవము వలన (పాపము అనెడి) చీము రక్తము కారుట క్షీణించి పోవును.'' అనెను.

ఏవ ముక్త స్తప స్తేపే యమ స్తీవ్రం మహాయశాః | గోకర్ణతీర్థే వైరాగ్యా త్ఫలమూలానలాశనః. 18

ఆరాధయ న్మహాదేవం వర్షాణా మయుతాయుతమ్‌ | వరం ప్రాదా న్మహాదేవ స్సంతుష్ట శ్శూలభృ త్తదా. 19

వవ్రే స లోకపాలత్వం పితృలోకస్య పాలనమ్‌ | ధర్మాధర్మాత్మకస్యాపి జగతస్తు పరీక్షణమ్‌. 20

ఏవం స లోకపాలత్వ మగమ చ్ఛూలపాణినా | పితౄణా మాధిపత్యం చ ధర్మాధర్మస్య చానఘ. 21

వివస్వా నథ* తత్త్వజ్ఞ స్సంజ్ఞాయాః కర్మచేష్టితమ్‌ | త్వష్ణు స్సమీప మగమ దాచచక్షే స రోషవా9. 22

త్వష్టృకృతసూర్య తేజశ్శాతనమ్‌.

త మువాచ తత స్త్వష్టా సాన్త్వపూర్వం తదా వచః | తదా7సహన్తీ భగవం స్తేజ స్తీవ్రం తమోనుదమ్‌. 23

బడబారుప మాస్థాయ ¨ త్వత్సకాశా దిహాగతా | నివారితా మయా సా చ త్వద్భయేన దివాకర. 24

యస్మా దవిజ్ఞాతమనా మత్సకాశం త్వ మాగతా | తస్మాన్మదీయం భవనం ప్రవేష్టుం న త్వమర్హసి. 25

ఏవముక్తా జగామాశు మరు దేశ మనిన్దితా | బడబారూప మాస్థాయ భూతలే సంప్రతిష్ఠితా. 26

తస్మా త్ప్రసాదం కురు మే యద్యను గ్రహభా గహమ్‌ | అపనేష్యామి తే తేజః కృత్వా యన్త్రే దివాకర. 27

రూపం తవ కరిష్యామి లోకానన్దకరం ప్రభో | తథేత్యుక్త స్స రవిణా భ్రమౌ కృత్వా దివాకరమ్‌. 28

పృథ క్చకార తత్తేజ శ్చక్రం విష్ణోః ప్రకల్పయత్‌ | త్రిశూలం చాపి రుద్రస్య వజ్ర మింద్రస్య చాధికమ్‌.

దైత్యదానవసంహర్తు స్సహస్రకిరణాత్మకమ్‌ | రూపం చాప్రతిమం చక్రే త్వష్టా పద్భ్యామృతే మహత్‌. 30

_________________________________________

ద్జాత్వా సంజ్ఞాయాః ¨ మత్సకాశం సమాగతా.

న శశాకాథ సన్ద్రష్టుం యదా రూపం రవేః పునః | అర్చాస్వపి తతః పాదౌ న కశ్చి త్కారయే ద్రవేః. 31

యః కరోతి స పాపిష్ఠగతి మాప్నోతి నిన్దితామ్‌ | కుష్ఠరోగ మవాప్నోతి లోకే7స్మి న్దుఃఖసంయుతః. 32

తస్మా న్న ధర్మ కామార్థీ చత్రే ష్వాయతనేషు చ | న కశ్చి త్కారయే త్పదౌ దేవ దేవస్య ధీమతః. 33

సూర్యుడు పలికినది విని మహాయశశ్శాలియగు యముడు తీవ్రమగు తపస్సు నాచరించెను. అతడు గోకర్ణ తీర్థమున కోటి సంవత్సరముల పాటు వైరాగ్యమును పూని పండ్లు దుంపలు వేళ్లు గాలి ఆహారముగా శివుని ఆరాధించెను. త్రిశూల ధారి మహాదేవుడు సంతుష్టుడై వరము కోరుకొమ్మనెను. యముడును లోక పాలత్వమును పితృ లోకపాలనాధి కారమును ధర్మాధర్మ స్వభావములతో నడచు జగములను నిరీక్షించుచుండుటయు కోరెను. శివుననుగ్రహమున యమునకీ మూడధికారములును లభించెను.

వాస్తవ స్థితిని ఎరిగి సూర్యుడును రోషము చెంది త్వష్టకడకుపోయి సంజ్ఞ చేసిన పని తెలి పెను. త్వష్ట అతనితో ప్రార్థనా పూర్కముగా ఇట్లు పలికెను : భగవన్‌ ! ఆనాడు సంజ్ఞ చీకటులను పారదోలు నీ తీవ్ర తేజమును సహించలేనిదయి నీ కడనుండి బయలుదేరి ఆడు గుర్రపు రూపముతో నా కడకు వచ్చెను. నేను నీకు భయపడి ఆమెను నా ఇంటికి రావలదని వారించితిని. నీవు నీ భర్త హృదయమును ఎరుగక ఆతని అనుమతి లేక) నా దగ్గరకు వచ్చితివి. కనుక నీవు నా గృహమును ప్రవేశింపదగదు. అని నేను అనగా ఆ సుగుణవతి భూలోకము నందలి మరు దేశమునకు పోయినది. ఆమె ఇప్పుడును అదే ఆడు గుర్రపు రూపముతో అచ్చట (తానుండదగిన చోటు దొరుకక తిరుగుచు) ఉన్నది. నేను నీయనుగ్రహము పొందదగిన వాడనని మీరు భావించినచో నన్ను అనుగ్రహించుడు. మీ దేహమును యంత్రమునందు ఉంచి మీ తీవ్ర తేజస్సును (కొంత) పోగొట్టుదును. మీ రూపము ప్రాణులకు ఆనందకరము అగునట్లు చేయుదును.

త్వష్ట మాటలను రవి అంగీకరించెను. త్వష్టయును భాస్కరుని తరిమెన పట్టు యంత్రమునందుంచి అతన తీవ్ర తేజస్సులో కొంత భాగము వేరు పరచెను. దానితో అతడు విష్ణుని చక్రమును శివుని త్రిశూలమును దైత్యదానవ సంహర్త అగు ఇంద్రుని వజ్రమును చేసెను.

అప్పటికిని త్వష్ట సూర్యుని రూపమును చూడజాలకపోయెను. అందుచే అతడు సూర్యుని కిరణములను ఇంకను తగ్గించి సహస్ర కిరణములు మాత్రమే కలిగిన సాటిలేని గొప్ప అందమైన రూపమును రవికి కలిగించెను.

(కిరణములను సంస్కృతమున కరములు పాదములు అని కూడ అందురు. ఈ చెప్పిన దానిని బట్టి త్వష్ట సూర్యుని పాదములను తీసివేసెను.)

అందుచేతనే నాటి నుండి తరువాత ఇప్పటికిని ఎవరును సూర్యునికి పాదములున్నట్లుగా అతని ప్రతిమను నిర్మింపజేయరాదు. అను నిషేధము ఏర్పడినది. ఒక వేళ అట్లు పాదములు గల రవి ప్రతిమ చేయించినచో ఆ పాపిష్ఠుడు నిందితమగు గతిని పొందును; కుష్ఠ రోగమును పొందును. ఈ లోకమున దుఃఖములను పొందును. కావున ధర్మమును కామమును కోరినవారెవ్వరును చిత్తరువుల యందును ఆలయములందును దేవ దేవుడును మహాబుద్ది శాలియును నగు సూర్యునకు పాదములు నిర్వింపజేయరాదు.

తత స్స భగవా న్గత్వా భూలోక మమరాధిపః | కామయామాస కామార్తో ముఖమేవ దివాకరః. 34

అశ్వరూపేణ మహతా తేజసా చ సమావృతః | సంజ్ఞాచ మనసా క్షోభ మగమ ద్భయపీడితా. 35

నాసాపుటాభ్యా ముత్సృష్టః పరో7యమితి శఙ్కయా |

తస్య రేత స్స్రవా జ్జాతా వశ్వినా వితి న శ్శ్రతమ్‌. 36

దస్రౌ దస్రోష్ఠసంజాతౌ నాసత్యౌ నాసికాం గతౌ | జ్ఞాత్వా చిరార్చితం దేవం సన్తోష మగమ త్పరమ్‌. 37

విమానే నాగమ త్స్వర్గం పత్న్యా సహ ముదాన్వితః | సావర్ణోపి మను ర్మేరా వద్యాప్యాస్తే తపోధనః. 38

శని ప్తపోబలా దాయా ద్గ్రహసామ్యం తతః పునః | యమునా తపతీ చైవ పున ర్నద్యౌ బభూవతుః. 39

విష్టి ర్ఘోరాత్మికా తద్‌ త్కాలత్వేన వ్యవస్థితా | మనోర్వైవస్వతస్యాథ దశ పుత్త్రా మహాబలాః. 40

ఇళస్తు ప్రథమ స్తేషాం*పుత్త్రేషు సమజాయత | ఇక్ష్వాకుః కుశనాభశ్చ అరిష్టో ధృష్ట ఏవ చ. 41

నరిష్యన్తః కరూశశ్చ శర్యాతిశ్చ మహాబలః | పృషదశ్వో7థ నాభాగ స్సర్వే తే దివ్యమానుషాః. 42

అభిషిచ్య మనుః పుత్త్ర మిళం జ్యేష్ఠం స ధార్మికః | జగామ తపసే భూయో ¨ హిమవచ్చిఖరం పరమ్‌. 43

అథ దిగ్జయసిద్ధ్యర్థ మిళః ప్రాయా న్మహీ మిమామ్‌ |

భ్రామ్య న్ద్వీపాని సర్వాణి క్ష్మాభృత స్సమ్ప్రసాధయత్‌. 44

సూర్యవంశ్యస్యేళస్య శరవణ స్త్రీరూపప్రాప్తిః.

జగామోపవనే శమ్భో రశ్వకృష్టః ప్రతాపవా9 | కల్పద్రుమలతాకీర్ణం నామ్నా శరవణం మహత్‌. 45

రమతే తత్ర దేవేశ స్సోమ స్సోమార్ధ శేఖరః | ఉమయా సహిత స్తత్ర పురా శరవణ కృతః. 46

పున్నామ సత్త్వం యత్కిఞ్చి దాగమిష్యతి నో వనే | స్త్రీత్వ మేష్యతి తత్సర్వం దశయోజనమణ్డలే. 47

తరువాత అమరులకు అధిపతియగు భగవానుడు సూర్యుడు భూలోకమునకు పోయెను. అతడు మహాతేజస్సుతో క్రమ్మబడిన వాడును అశ్వరూపమును ధరించినవాడును ఐ ఆమెకడకు పోయెను. ఆ దివాకరుడు కామార్తుడుగా ఉండినందున ఆడు గుర్రపు రూపమున ఉన్న సంజ్ఞ ముఖమునే తన కామ ప్రవృత్తికి సాధనముగ చేసికొనెను. ఆమె తన భర్తను గుర్తించక ఆతడెవరో పరుడు అను భ్రాంతిచే మనస్సునందు భయముచే భాధనొంది కవలవరపాటు చెందెను. ఆమె సూర్యుని వీర్యమును తన ముక్కు పుటముల ద్వారమున వదలివేసెను. ఇట్లు జరిగిన ఈ రేతఃస్రావమువలన పుట్టిన ఇద్దరు దేవతలే అశ్వినులు అని మనము (సంప్రదాయమున) వినుచున్నాము.

నాసికల (ముక్కుల) నుండి పుట్టినందున నాసత్యులు అనియు దస్రము (అశ్వము) యొక్క ఓష్ఠము (పెదవు)ల నుండి పుట్టుటచే దస్రులనియు అశ్వి దేవతలకు పేరు లేర్పడినవి.

తరువాత సంజ్ఞ తాను పూర్వము చాలకాలము క్రిందట అర్చించిన తన పతియే ఇతడని సూర్యుని గుర్తించి మరల సంతోషము నందెను. రవియు విమానము పై తన భార్యతో కూడ స్వర్గమునకు వెళ్లెను.

సూర్యునకు ఛాయయందు కలిగిన సూర్య సావర్ణి తపోధనుడుగా ఈనాటికిని మేరు పర్వతమునందున్నాడు. శని తపస్సాచరించి తన తపోబలమున గ్రహములతో సమానత్వము పొందినాడు.

యమున తపతి అను ఇద్దరు కన్యలును నదులైరి. విష్టి అను కన్య మాత్రము ఘోర రూపురాలు (మిగులనల్లనిది). ఈమె కాల రూపురాలయి ఉన్నది.

వైవ స్వత మనువునకు మమాబలులగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో మొదటివారు ఇళుడు. ఇంకను ఇక్ష్వాకుడు కుశనాభుడు అరిష్టుడు ధృష్టుడు నరిష్యంతుడు కరూశుడు శర్యాతి పృషడశ్వుడు నాభాగుడు అనువారు తొమ్మిది మంది. ధర్మమును ఎరిగి అనుష్ఠించు ధార్మికుడగు, వైవస్వతుడు జ్యేష్ఠ పుత్త్రుని ఇళుని రాజ్యమునందభి షేకించి శ్రేష్ఠమగు హిమవచ్ఛిఖరమునకు (మహేంద్ర మనమునకు) పోయి అందరకంటె మిన్నగా తప మాచరింపసాగెను.

తరువాత దిగ్విజయమును సాధించుటకై ఆ ప్రతాపవంతుడగు ఇళుడు ఈ భూమియం దంతటను అన్ని ద్వీపముల యందును సంచరించుచు రాజులను అందరను తనకు లోబరచుకొనెను. ఆ దిగ్జయ యాత్రాక్రమములో అతడు

*తన గుర్రము తీసికొనిపోగా శివుని ఉద్యానవనమునకు పోయెను ఆ ఉద్యానము కల్పవృక్షపులతలతో వ్యాప్తమయి

___________________________________________

* పుత్త్రేష్ట్యా ¨ మహేన్ద్రవనమాలయమ్‌.

* ఇలుడు దిగ్విజయము కోరి అశ్వమును మంత్ర పూర్వకముగా వ లి అది భూమండలమందంతట తిరుగుచుండ తానును దాని వెంట పోవుచుండెను. ఆయశ్వము అట్లు పోవుచు శరవణములోనికి పోగా ఇలుడును దానిననుసరించి ఆ ఉద్యానములో ప్రవేశించెను. అని అర్థము.

(సుందరమయి) నది. చాల పెద్దది. గొప్పది. దాని పేరు శరవణము. దాని యందు అర్ధచంద్రుని శిరోభూషణముగా ధరించు వాడును దేవేశుడును అగు సోముడు (స+ఉమా) పరమేశ్వరుడు పార్వతి (ఉమ)తో కూడి విహరించుచు ఆనందించుచుండును. దశయోజన వెశాల్యము గల మా యీ వనమునందు పురుషప్రాణి ఏది వచ్చినను అట్టి ప్రతియొక పురుష ప్రాణియు స్త్రీత్వమును పొందును. అని పూర్వము ఒకప్పుడు పార్వతి ఈ వన విషయమున ఒక వ్యవస్థ (కట్టడి) చేసెను.

అజ్ఞాతసమయో రాజా వృత శ్శరవణ పురా | స్త్రీత్వ మాప విశ##న్నేవ బడబా7శ్వో7భవ త్తదా. 48

పురుషత్వే కృతం సర్వం స్త్రీరూపే విస్మృతం నృప | ఇళేతి సా7భవ న్నారీ పీనోన్నఘనస్తనీ. 49

ఉన్నతశ్రోణిజమనా పద్మపత్రాయతేక్షణా| పూర్ణేన్దువదనా తన్వీ విలాసోల్లసితేక్షణా. 50

స్థూలోన్నతాయతభుజా నీలకుఞ్చితమూర్ధజా | తనులోమా సుదశనా మృదుగమ్భీరభాషిణీ. 51

శ్యామా గౌరేణ వర్ణేన హంసచారణగామినీ | కామరూపగుణోపేతా తనుతామ్రనఖాంకురా 52

భ్రమమాణా వనే తస్మిం శ్చింతయామాస భామినీ | కామే పితా వా భ్రాతా వా కా మే మాతా భ##వే దిహ.

కస్య భర్తు రహం దత్తా కీదృగ్వర్ణస్య భూతలే | సా చిన్తయన్తీ దదృశే సోమపుత్త్రేణ చాఙ్గనా. 54

ఇళారూపసమాక్షిప్తో మనసా వరవర్ణినీమ్‌ | బుధస్తు కామయామాస తాం వనే కామపీడితః. 55

విశిష్టాకారవా న్దణ్డీ సకమణ్డలుపు స్తకః | వేణుదణ్డకృతానేకపవిత్రకగణో నృప. 56

ద్విజరూప శ్శిఖీ బ్రహ్మ నిగద న్రుక్మకుణ్ణలే | బహుభి శ్చాన్వితో ధత్తే సమిత్పుష్పకుశోదకైః. 57

కిలాన్విష్య వనే తస్మి న్నాజుహావ స తా మిళామ్‌ | బహిర్వన స్యాన్తరితః కిల పాదపమణ్డలే. 58

ససమ్భ్రమ మకస్మాచ్చ సోపాలమ్భ మిదం వద9 | త్యక్త్వాగ్ని హోత్రశుశ్రూషాం క్వ గతా మన్దిరా స్మమ.

ఇయం ఇహారవేళా తే గమితా తవ సామ్ప్రతమ్‌ | ఏహ్యేహి పృథులశ్రోణి నాయాతా కేన హేతునా. 60

ఇయం సాయన్తనీ వేళా విహారస్యాతివర్తతే | కృత్వోపలేపనం పుషై#్ప రలఙ్కురు గృమం మమ. 61

సా త్వబ్రవీ ద్విస్మృతా7హం సర్వ మేత త్తపోధన | ఆత్మానం తవ శీలం చ కులం చ వద మే7నఘ.

బుధః ప్రోవాచ తాం తన్వీ మిళాం వై వరవర్ణినీం | అహం చ కాముకో నామ బహువిద్యో బుధ స్మ్సృతః.

తేజస్వినః కులే జాతః పితా మే బ్రాహ్మణాధిపః | ఇతి సా తస్య వచనా త్ప్రవిష్టా బుధమన్దిరమ్‌. 64

*రమ్భాస్తమ్భసమాకీర్ణం దివ్య ¨ ముక్తావినిర్మితమ్‌ | ఇళా కృతార్థా మాత్మానం మేనే తద్భవనస్థితా. 65

అహో గేహ మహోరూప మహో ధన మహో కులమ్‌ |

మమ చాస్య పురా భర్తు రహో లావణ్య ముత్తమమ్‌. 66

రేమే చ సా తేన సమ మతికాల మిళా తతః | సర్వభోగమయే గేహే యథేన్ద్రభవనే తథా. 67

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే సూర్యవంశవర్ణనం

నామైకాదశోధ్యాయః.

పూర్వము ఎప్పుడో శివుడు చేసిన ఈ వ్యవస్థ తెలియని రాజు ఇలుడు ఆ శరవణములో ప్రవేశించిన వెంటనే స్త్రీ అయ్యెను. అతని అశ్వమును బడబ (ఆడు గుర్రము) అయ్యెను. రాజు వెంటనే తాను పురుషుడుగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిని మరచెను. ఆమె ఇళ అను పేర స్త్రీ అయ్యెను. ఈ రూపములో ఆమె వక్షోజములు బలిసినవై ఉన్నతములై యుండెను. ఆమె పిఱుదులును కటి ప్రదేశమును ఉన్నతమయి ఉండెను. ఆమె కన్నులు తామరపూరేకులవలె విశాలమలయి యుండెను. ఆమె ముఖము నిండు చందురుని పోలియుండెను. ఆమె శరీరము అంత స్థూలముకాక సన్ననై యుండెను. ఆమె చూపులు ఒయ్యారపు కదలికలచే మెరయు చుండెను. అంతవరకు సంతానమును కని ఉండని ¸°వనములో ఉండెను. ఆమె మేను బంగారు చాయతో ఉండెను. ఆమె హంసవలె నడచుచుండెను. కోరికల రేకెత్తించు రూపమును శృంగార గుణములును కలిగి యుండెను. ఆమె గోళ్ళ మొలకలు పలుచనై ఎర్రనయి యుండెను.

ఇటువంటి ఆ సుందరి ఇళ ఆ శరవణయను ఉద్యానమునందు అటునిటు తిరుగుచు తన మనస్సులో ''నా నాయన ఎవరో ! అమ్మ ఎవరో ! సోదరులు ఎవ్వరో ! ఎవరిని భర్తగా చేసి నన్ను అతనికి ఇచ్చిరో ! భూలోకమున అతడు ఏ వర్ణము వాడో!'' అని ఆలోచంపసాగెను. ఆమె ఇట్లాలోచించుచు తిరుగుచుండగా చంద్రుని పుత్రుడగు బుధుడు ఆమెను చూచెను. ఆమె సౌందర్యము అతనిని ఆకర్షించెను. కామము పీడింపగా ఆ ఉద్యానమునందే అతడామె యందు అనురాగము చెందెను.

(అతడు ఆమె విషయమున తన కోరిక తీర్చు కొనుటకై ఒక ఉపాయము చేసెను.)

బుధుడు ఒక విశిష్టమయిన రూపము ధరించెను. అతని చేతులయందు దండము కమండలువు పుస్తకమును ఉండెను. బ్రహ్మణ రూపము శిఖ బంగారు కుండలములును దాల్చి ఉండెను. వేదము చెప్పుచుండెను. తమ చేతులందు వేణు దండములు ధరించి సమిధలు పుష్పములు కుశలు ఉదకము చేత పుట్టుకొనియున్న అనేకులు అగు బ్రహ్మచారులు అతని వెంట నుండిరి. ఇట్టి రూపముతో పరివారముతో ఆ బుధుడు (ఇళ తప్పిఫోగా ఆమె కొరకై) వెదకుచున్న వానివలె నటించుచు ఆ శరవణమున ఆమెను గట్టిగా పిలువసాగెను. బుధుడు ఆ శరవణమునకు వెలుపలనే (లోపలకు వచ్చినచో తానును స్త్రీగా మారునను భయమున చెట్ల గుబురు చాటున నుండి తడబాటు పడుచు ఆకస్మికముగా మందలింపు మాటలతో ఈ విదముగా పలుకసాగెను. ''అగ్నిహోత్ర కాలములో చేయవలసిన నాశుశ్రూష చేయక విడిచి నా ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళితివి ? నీవు విహరించు వేళ ఇప్పుడు ముగిసిపోయినది. ఓ సుందరీ ! రమ్ము-రమ్ము ! ఇంకను రాకున్నావు. కారణమేమి ? సాయంకాలమున నీవు విహరింపదగిన సమయము గడచిపోవు చున్నది. నా ఇంటికి రమ్ము. వచ్చి ఇల్లు అలికి పూలతో అలంకరించుము.''

ఈ మాటలు విని ఇళ ఇట్లు పలికెను. ''తపోధనా ! నేను ఈ విషయమంతయు మరచితిని. మీరు ఎవరో మీ కులమేమో శీలమేమో చెప్పవేడుచున్నాను.''

బుధుడు మిగుల సౌందర్యవతియగు ఇళతో ఇట్లు పలికెను: ''నేను కాముకుడు అను పేరుతో ప్రసిద్ధుడను. అనేకములగు విద్యల నెరిగిన వాడను. (కనుక) బుధుడను ప్రసిద్ధి వహించి యున్నాను. తేజస్వి (కాంతి గలవాడు-చంద్రుడు) అనువాని కులము (వంశము-ఇల్లు)నందు పుట్టిన వాడను. నాతండ్రి బ్రాహ్మణులకు (ద్విజులకు-అనగా పక్షులకు) అధిపతి (చంద్రుడు) (ఇట్లు పైకి తాను బ్రాహ్మణుడై నట్లును రహస్యర్థమున తాను చంద్రుని కుమారుడగు బుధుడనియు మాటలాడగా) ఆమె అతని ఆ మాటలు విని బుధుని గృహమునకు పోయి దాని యందు ప్రవేశించెను. అది మనోహరములగు స్తంభములతో వ్యాపింపబడి యున్నది. దివ్యములగు ముత్తెములు అంతట కూర్చబడి యున్నవి. ఇది యంతయు చూచి ఆ ఇళ ఆ ఇంటిలో ఉండుటవలన తాను కృతార్థురాలయోయనని తలచెను. ఎంతో మెచ్చదగిన ఇల్లు! ఎంతో మెచ్చదగిన రూపము. ఎంతో ప్రశంసింప దగిన ధనము. ఎంతో పొగడదగిన వంశము. ఎంతో కాలము నుండియు ఇతడే నాభర్త. ఇతన లావణ్యము ఉత్తమమైనది. అని ఆమె సంతోషపడెను.

నాటి నుండియు చాలకాలము వరకు ఇళ ఇంద్రభవనము వంటిదిగా తనకు తోచుచు సర్వబోగములతో నిండిన ఆ ఇంటియందు ఆ బుధునితో కూడ విహరించి ఆనందించెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున సూర్యవంశ వర్ణనమున ఇళా బుధసమాగమమను ఏకాదశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters