Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వాదశోత్తరశతతమో7ధ్యాయః.

ద్వీపాది పరిమాణ కథనమ్‌.

ఋషయః :  

కతి ద్వీపా స్సముద్రాశ్చ పర్వతాః కతిచ ప్రభో l కియన్తి చైవ వర్షాణి తేషు నదృశ్చ కాస్మ్సృతాః. 1

మహాభూతప్రమాణంచ లోకాలోక స్తథైవచ l పర్యయః పరిమాణంచ గతిశ్చన్ద్రార్కయో స్తథా. 2

ఏత ద్ర్బూహిచ నస్సర్వం విస్తరేణ యథార్థతః l త్వద్వక్త్రాదేవ సకలం ళ్రోతు మిచ్ఛామహే వయమ్‌. 3

సూతః : ద్వీపభేదసహస్రాణి తథా ఖణ్డశతానిచ l నశక్యతే క్రమేణౖవ వక్తుంవై సకలం జగత్‌. 4

సపై#్తవ సమ్ర్పవక్ష్యామి చన్ద్రాదిత్యగ్రహై స్సహ l తేషాం మనుష్యా స్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే. 5

అచిన్త్యాః ఖలు యే భావా స్తాంస్తు తర్కేణ సాధయేత్‌ l ప్రకృతిభ్యః పరం యచ్చ తదచిన్త్యస్య కారణమ్‌.

నూట పండ్రెండవ అధ్యాయము

ద్వీపాది పరిమాణ కథనము.

[భారతీయులు భూగోళ స్వరూప ప్రతిపాదనమున పురాణములందు మూడు భావనలను దృష్టియందుంచుకొనినా రని తోచును. మొదటిది దేశ చతుష్టయ భావన. రెండవది సప్తద్వీప భావన. మూడవది నవవర్షవిభాగభావన. వీనిని భావించుటలో నాటి వారి దృష్టి ఏమనునది విచారింపవలసియున్నది. మిగిలిన రెండు భావనల మాట ఎట్లున్నను మొదటి భావన మాత్రము చాల విశిష్టమయినది. దీనియందు మన ఋషులు మేరువు (పామీరు పీఠభూమి) మధ్యస్థానముగా గ్రహించి ఏర్పడు ఒక చతురస్రాకృతిగల ప్రదేశమును యజ్ఞవేదికనుగా భావనచేసిరి. ఇదియొక విలక్షణమగు భావన. ఇది మనవారి హృదయ పవిత్రతను వైదిక దృష్టిని తెలుపుచున్నది. దీనితోబాటు వారు సకల భూమండలమును అందలి నదీ పర్వత సముద్రాదికమును వానిచే ఏర్పడు ఆకృతి విశేషములను ప్రకృతియందు అయా పర్వత నద్యాదికము ప్రాణి సమూహమునకు కలుగజేయు అయా ఉపకారములను ఎంతగా ఎరిగియుండిరో కూడ దీనిచే అవగతమగుచున్నది.

ఇక సప్త ద్వీపభావనలో యాపద్భూమండలమును చేరియున్నది. నవవర్ష భావన జంబూద్వీప భావనలోని ఒక ఉపాంశము మాత్రమే అని తోచును. దీనిని ఈ అధ్యాయములందు ఎరుగగలము]

ఋషులు సూతు నిట్లడిగిరి: ద్వీపములు సముద్రములు పర్వతములు వర్షములు నదులు ఎన్ని? మహాభూత ప్రమాణము లోకాలోక(పర్వత)ము సూర్యచంద్రుల భ్రమణ క్రమము వారి పరిమాణము ఇదియంతయు యథాతథముగను సవిస్తరముగను తెలుపుము. మే మిదియంతయును మీ నోటినుండి వినగోరుచున్నాము. అన సూతు డిట్లు చెప్పసాగెను. భూమండలమున వేలకొలది ద్వీపములును నూరుల కొలది ఖండములును గలవు. సకల జగత్తును క్రమము తప్పక చెప్పుట శక్యమే కాదు. (ఐనను) ఈ భూమిని సప్త ద్వీపాత్మకముగా విభజించి చంద్రాదిత్య ప్రభృతి గ్రహముల వ్యవస్థతోను ఖగోళ వ్యవస్థతోను తెలిపెదను. మనుష్యులు తర్కముతో వాని ప్రమాణమును తెలిసికొని చెప్పుచున్నారు. ఏలయన ఆచింత్యములు (సామాన్యబుద్దితో ఆలోచించి ఎరుగ శక్యముకానివి ) అగు భావములు (పదార్థ వ్యవస్థలు-Systems) ఏవి లోకమున కలవో అవి అచింత్యములు. కావున అవి తర్కముతోనే ఎరుగవలయును.

[ఇచ్చటినుండి మొత్తము భూమండలమును 1 . జంబూ 2. శాక 3. కుశ 4. క్రౌంచ 5. శాల్యల 6. గోమేద 7. పుష్కర ద్వీపములను పేర సప్త ద్వీపములుగా విభజించి వానిలో మొదట జంబూ ద్వీపమును గ్రహించి దానియందు చతుర్దేశ విభాగమును సప్తవర్ష విభాగమును దృష్టియందుంచుకొని భారతదేశము ప్రధానముగా వర్ణనము ఈయబడును. ఈ సప్తవర్ష విభాగమునందే ఆర్ష వాజ్మయమున అత్యంత ప్రసిద్ధముగా నున్నదియు శ్రీమద్భాగవతాదులందు వర్ణింపబడి నదియు నగు నవవర్ష విభాగము కూడ ఇమిడి యున్నది. ఈ భూమండల విభాగ భావనా పరంపర అత్యంత ప్రాచీనము - పురాణ రచయితృ ఋషులకు వైదిక ఋషులనుండి అనుశ్రుతముగా అను స్యూతముగా వచ్చిన భావనా పరంపర ఇది - యనుట యందెట్టి సందియమును లేదు. వైదిక స్మార్త పౌరాణిక కర్మానుష్ఠానము లన్నిటియందును అయా ప్రసంగములందు ఇదియే గ్రాహ్యము. నేడు మనకు వాడుకలోనికి వచ్చిన దేశఖండ ద్వీప విభాగములు దీనియం దెట్లు చేరియున్నవో పరిశీలించిన గమనించవచ్చును.

వీని గమనికకై మొదట ఆయా విభాగముల స్థూలరూప ప్రతిపాదనము ఇట్లుండును.

దేశ చతుష్టయ విభాగము: నట్టనడుమ మేరువు దీని సమీపమున ఇలావృతవర్షము (నేటి పామీరుముడి అను పీఠభుమి) దీనికి దక్షిణమున- 1. భారత వర్షము 2. కైలాస హిమవత్పర్వతములు 3. అలకనందానది (గంధమాదన మందు) 4. నందనవనము 5. మానస సరన్‌ 6. కచ్ఛప భగవానుడు 7. జంబూవృక్షము; పశ్చిమమున-1. కేతుమాల వర్షము 2. ఋషభ పారియాత్ర పర్వతములు 3. స్వరక్షునదీ 4. వైభ్రాజవనము 5. శీతోద సరస్‌- 6. వరాహ భగవానుడు 7. అశ్వత్థ వృక్షము; ఉత్తరమున -1. ఉత్తర కురువర్షము 2. శృంగవత్‌-జారుధి(దేవ)పర్వతములు 3. సోమానది 4. సావిత్రవనము 5. మహాభద్ర సరస్‌ 6. మత్స్య భగవానుడు 7. వటవృక్షము; తూర్పున-1 . భద్రాశ్వవర్షము 2. దేవ పర్వతము-3. సీతానది 4. చైత్రరథవనము 5. అరుణోద సరస్‌-6. హయగ్రీవ భగవానుడు 7. భద్రకదంబవృక్షము.

సప్త ద్వీపములు:1. జంబూ 2. శాక 3. ప్లక్ష(గోమేదము అని మత్స్య పురాణమున) 4. శాల్మల 5. పుష్కర 6. కుశ 7. క్రౌంచ ద్వీపములు.

సవవర్షములు: భారత కింపురుష హరీలావృత రమ్యక హైరణ్యక కురు భద్రాశ్వ కేతుమాల వర్షములు. (వర్షము=స్థానము)

వీనిలో దేశ చతుష్టయ విభాగమున ఇలాపృత భారత కేతుమాల కురు భద్రాశ్వ వర్ణములు చేరియున్నవి.

భరతవర్షమందలి నవ భాగములు (ఖండములు) మత్స్య పురాణానుసారమున- 1. ఇంద్రద్వీపము 2. కశేరు ద్వీపము 3. తామ్రపర్ణ ద్వీపము 4. గభస్తిమాన-5. నాగద్వీపము 6. సౌమ్యద్వీపము 7. గంధర్వ ద్వీపము 8. వారుణ ద్వీపము 9. భరతద్వీపము (ఖండము).

సప్తవర్షం ప్రవక్ష్యామి జమ్బూద్వీపం యథావిధమ్‌ l విస్తారం మణ్డలం యచ్చ యోజనై స్తన్నిబోధత. 7.

యోజనానాం సహస్రాణి శతం ద్వీపస్య విస్తరమ్‌ l నానాజనపదాకీర్ణం సురైశ్చ వివిధై శ్శుభైః.. 8

సిద్ధచారణసజ్కీర్ణం పర్వతై రుపశోభితమ్‌ l సర్వధాతుపినద్దైసై#్త శ్శిలాజాల లసద్గతైః. 9

పర్వతప్రభవాభిశ్చ నదీభిస్తు సమన్తతః l ప్రాగాయతా మహాపార్శ్వాష్షడిమే వర్షపర్వతాః. 10

అవగా హ్యే త్యుభయత స్సముద్రౌ పూర్వపశ్చిమౌ l హిమప్రాయశ్చ హిమవా& హేమకూటశ్చ హేమవా &. 11

పర్వత స్సుముఖశ్చాపి నిషధః పర్వతో మహా& l చాతుర్వర్ణ స్స సౌవర్ణో మేరుశ్చోల్బమయ స్స్మృతః. 12

చతుర్వింశత్సహస్రాణి విస్తీర్ణ స్స చతుర్దిశమ్‌ l వృత్తాకృతిప్రమాణశ్చ చతురశ్రసమాహితః. 13

నానావర్ణై స్సమః పార్శ్వే ప్రజాపతి గుణాన్వితః l నాభిబన్ధనసమ్బూతో బ్రహ్మణో 7వ్యక్తజన్మనః. 14

పూర్వత శ్శ్వేతవర్ణ స్యా ద్ర్బాహ్మణ స్తస్య తేన తత్‌ l పార్శ్వ ముత్తరత స్తస్య రక్త వర్ణం స్వభావతః.

తేనాస్య క్షత్త్రభావస్తు మేరో ర్నానార్థకార ణాత్‌ l పీతశ్చ దక్షీణనాసౌ తేన వైశ్యత్వ మిష్యతే. 16

భృంగపత్రనిభశ్చాపి పశ్చిమేన సమాచితః l తేనాస్య శూద్రభావః స్స్యా దితి వర్ణాః ప్రకీర్తితాః. 17

నీలశ్చ వైదూర్యమయ శ్శ్వేతః పీతో హిరణ్మయః l మయూరబర్హవర్ణస్తు శాతకుమ్భమయ స్తథా.

ఏతే పర్వతరాజాన స్సిద్దచారణసేవితాః. 18

తేషా మన్తేచ విష్కమ్భో నవసాహస్ర ఉచ్యతే l మధ్యే ఇళావృతం నామ మహామేరో స్సమన్తతః. 19

చతుర్వింశత్సహస్రాణి విస్తీర్ణం యోజ నై స్సమమ్‌ l మధ్యే తస్య మహామేరు ర్వీధూమ ఇవ పావకః. 20

వేద్యర్ధం దక్షిణ మేరు రుత్తరార్ద స్తధోత్తరే l వర్షాణి యాని సప్తాత్ర తేషాంవై సప్త పర్వతాః. 21

ఇలావృత భారత భద్రాశ్వ కేతుమాల కురు రమ్యక హిరణ్యము లనెడి సప్త వర్షములను జంబూ ద్వీపమును యథాస్థితముగ వివరింతును. ఈ ద్వీపముల-వర్షముల-మండలపు విస్తారమును యోజనములు లెక్కలో చెప్పెదను. జంబూ ద్వీప వైశాల్యము లక్ష(చదరపు)యోజనములు. ఇది అనేక జనపద(గ్రామ)ములతో వ్యాప్తము; అనేకులగు సిధ్ధులు చారణులు దేవతలు ఇందు వ్యాపించియున్నారు. శిలా సమూహములందు మెరయుచు నుండెడి గైరిక (కొండలయందు ఏర్పడెడి) ధాతువులతో కప్పువడిన పర్వతము లనేకములను ఆ పర్వతములందు ప్రభవించిన నదులును దీనియంతటను గలవు. మిగుల గొప్ప సమీప ప్రదేశములును ప్రక్క ప్రదేశములను కల ఆరు వర్ష పర్వతములు పూర్వ పశ్చిమ సముద్రములందు చొచ్చుకొని తూర్పు పడమరలుగా వ్యాపించియున్నవి . అవి 1. చాల భాగము మంచుతో కప్పబడియుండు హిమవంతము 2. బంగారుతో వ్యాప్తమగు హేమకూటము. 3.చక్కని ముఖము కలిగినదియు గొప్పదియునగు నిషధ పర్వతము అనునవి మూడు. (ఇచట వర్ష పర్వతములు ఆరనిచెప్పియు మూడు మాత్రమే ఈయబడినవి. ఈ మూడును మూడు జతలను తెలుపును. వానిలో ఒక జత నీల నిషధములు; రెండవజత ééశ్వేత హేమకూటములు; మూడవజత హేమకూట హిమవంతములు. పైని చెప్పిన మూడును ఈ మూడు జతలలో ముఖ్యమైనవిగా నున్నవి. వర్ష పర్వతములు అనగా ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరచు అవధులు.) దేశ (వర్ష) చతుష్టయ విభాగములో కేంద్ర స్థానీయమగు మేరు పర్వతము ఉల్బమయము( ఉపలమయము-ప్రచురముగా రాళ్ళు కలది. అనగా ఇది శిలా ప్రచురమగు ఉన్నత ప్రదేశ##మేకాని అన్ని పర్వతములవంటి రూపము కలది కాదని తెలియదగినది. సువర్ణమయమని ప్రసిద్ధమైనను అది చాతుర్వర్ణము (నాలుగు వర్ణములు కలది.) ఇదియుగాక పగమ పురుషుడు తన అనంతశక్తిచే అవ్యక్తతా వ్యక్తతా దశలనొందు క్రమములో అతని నుండి ప్రజాపతి హిరణ్యగర్భుడు జనించెను. ఆ జనించిన ప్రజాపతి నామక శిశువు నాభిస్థానమీ మేరువు. దానిపై ఆవరించిన మావి-ఉల్బపు-పొరవంటిది ఈపామీరు శాలామయ ప్రదేశము. ఇది ఇరువది నాలుగువేల చదరపు యోజనముల వైశాల్యము గలదై నాలుగు దిక్కులందును విస్తరిల్లినది. ఇది వృత్తాకృతియు చతురస్ర రూపమును కలది. ఎట్లన-తూర్పు-పడమర-ఋజు రేఖా రూపమునను దక్షిణోత్తరమలందు గుండ్రదనముతోను ఉన్నందున ఈ వృత్తాకృతిలోనే చతురస్రాకృతి ఏర్పడును. ఈ మహామేరువు తూర్పున శ్వేతవర్ణము దక్షిణమున పీతవర్ణము పడమర కృష్ణవర్ణము ఉత్తరమున రక్త వర్ణము కలిగి వరుసగా బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్త్రియ వర్ణముల రూపమున విరాట్పురుషుడుండుటను తెలుపుచున్నది. ఈ మహామేరు శిలామయ ప్రదేశమునకు (పామీరు పీఠభూమికి) అయా దిశలందు నీలవర్ణము-వైదూర్య రత్నకాంతి- శ్వేతవర్ణము-పీతవర్ణము-హిరణ్య వర్ణము-నెమలిపించెపుకాంతి- బంగారు కాంతి-కలిగిన ఏడు పర్వతములు వెలుగొందుచుండ వీని నడుమ ఈ మహామేరువు పొగలేక జ్వలించు అగ్నివలె ప్రకాశించుచుండును. ఈ ఏడు పర్వతములందును సిద్ధులును చారణులును సదా సంచరించుచుందురు. అగ్నివలె ప్రకాశించుచుండును. ఈఏడు పర్వతములందును సిధులును చారణులును సదా సంచరించుచుందురు.(అష్ట సిదులు-మహామంత్ర సిద్ధులు పొందియును పొందుటకు ఆయా సాధనలు చేయుచును సాత్త్వక ప్రవృత్తితో సంచరిచుచుండు దేవజాతివారు సిద్ధులు-తమ దివ్య శక్తులతో అంతరిక్ష ద్యులోక సంచారము చేయుచు విమానములు లేకయు ఆయా లోకములందు సంచరించుచు వింతల చూచుచు అనందించుచు అవి మొచ్చుచు తిరుగు దేవతలు చారణులు) ఈ పర్వతములలో ఒకదానికిని మరియొక దానికిని నడుమగల అంతరములన్నియు కొలచి కూడగా అగు అంతరముల మొత్తము తొమ్మిదివేల యోజనములు (ఇది వైశాల్యముకాదు.) ఈ నడుమ నున్న మహామేరువునకు చుట్టుప్రక్కల దీనంటియున్న వర్షమునకు ఇలావృత వర్షమని వ్యవహారము. దీని వైశాల్యము ఇరువది నాలుగువేల చదరపు యోజనములు.

సృష్ట్యాదియందు భగవత్సంకల్పాను గుణముగా దేవతలు వితతమొనర్చిన అది యజ్ఞమునందు ఈ ప్రజాపతి నాభిస్థానము వేదియై అ వేదికకు నలుమూలలందున్న నాలుగు పర్వతములును విష్కంభములు-వేదికకు అవధిని తెలుపు గుంజలు-కాగా నడుమనున్న అగ్ని స్థానమీ మహామేరువని ఋషుల భావన. ఈ మహామేరువు (పామీరు శిలామయ ప్రదేశము) అను దేవయజ్ఞ వేదికలో దక్షిణార్థము-ఉత్తరార్థము అను రెండు అర్ధభాగములు ఉన్నవి. అని భావన.

ఇది భౌగోళిక సంగ్రహ ప్రతిపాదనము-ఇకమీదట సప్తద్వీప-నవవర్ష-నవఖండ -భావనలలో దీని వివరణము చూడనగును.

ద్వే ద్వే సహస్రే విస్తీర్ణా యోజనై ర్దక్షిణోత్తరమ్‌ | జమ్బూద్వీపస్య విస్తార స్తేషా మాయామ ఉచ్యతే. 22

నీలశ్చ నిషధశ్చైవ తాభ్యాం హీనాశ్చ యే పరే | శ్వేతశ్చ హేమకూటశ్చ హిమవా ఞ్ఛృఙ్గవాంశ్చయః. 23

జమ్బూద్వీపప్రమాణన ఋషభః పరికీర్తితః | తస్మా ద్ద్వాదశభాగేన హేమకూటో 7పి హీయతే. 24

హిమః పశ్చిమభాగేన తస్మాదేవ ప్రహీయతే | అష్టాశీతిసహస్రాణి హేమకూటోమహాగిరిః. 25

అశీతి ర్హిమఞ్ఛైల ఆయతః పూర్వంపశ్చిమే | ద్వీపస్య మణ్డలీభావా ద్ధ్రాసవృద్ధీ ప్రకీర్తితే. 26

వర్షాణాం పర్వతానాంచ యథాభేదం తథోత్తరమ్‌ | తేషాం మధ్యే జనపదా స్తాని వర్షాణి సప్తవై. 27

ప్రపాతవిషమై సై#్తస్తు పర్వతై రావృతాని తు | సప్త తాని నదీ భేదై రగమ్యాని పరస్పరమ్‌. 28

వసన్తి తేషు సత్త్వాని భూతజాతాని సర్వతః |

ఈ మహామేరువు ఒక గుర్తుగా చేసికొని చేయు ఈ భూగోళ సప్తవర్ష విభాగమునందు ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరను పర్వతములు వర్ష పర్వతములు. ప్రతి వర్షమునకు ఉత్తర దక్షిణముందు రెండేసి వర్ష పర్వతములు పొలిమేర గీతలై తూర్పు పడమరులుగా వ్యాపించిన ఈ పర్వతములలో ఒక్కొక్కదాని పొడవు ఇంచుమించుగ రెండేసి వేల యోజనవములు.

1. జంబూద్వీప వర్ణనము.

ఇక జంబూద్వీప విస్తారమును దానియందలి ఆయా వర్షముల సీమా రేఖలను ఆయా

వర్ష పర్వతముల పొడవును తత్సంబంధులగు అంశములను తెలిపెదను. వీనిలో నీల

నిషధ పర్వతములు అను జత మొదటిది. మిగిలినశ్వేత-హేమకూట-హిమవత్‌-శృంగవత్‌ లను నాలుగును వీనికంటె తక్కువు పొడవు గలవి. ఏడవదగు ఋషభ పర్వతము పొ

డవు జంబూద్వీపపు వైశ్యైమెన్ని యోజనములో అన్నియే యోజనములు. హేమకూటపు పొడవు దానిలో పండ్రెండవ వంతు తక్కువ; హిమాలయపు పశ్చిమ భాగమున (పర్వతము లేక లోయగా ఏర్పడియున్న నేటి ఖైబరు బోలన్‌ కనుమల భాగమువంటివి)

ఈ పండ్రెండవ వంతులో పండ్రెండవ వంతు తగ్గియున్నది. హేమకూట మహాగిరి పొడవు ఎనబది ఎనిమిదివేల యోజనములు; హిమవంతము ఎనుబదివేల యోజనముల పొడవు తూర్పు పడమరలుగ ఉన్నది. ఈ జంబూద్వీపపు మండలీభావము (గుండ్రని రూపమును బట్టి ఈ అవధి పర్వతముల పొడవులో ఎక్కవ తక్కువలు కనపడుచున్నవి. (అనగా దీనినిబట్టి వీని పొడవును కొలుచు పద్దతిని ఎరుగవలెను.)

ఈ రెండేసి వర్ష-అవధి-పర్వతముల నడుమ ఎన్నియో జనపదములు గలవు.(జనపదములు-గ్రామములును-మహా గ్రామములును) వాని సముదాయములే వర్షములు. అవి మొత్తము ఏడు. (మరి రెండు ముందు చెప్పబడును.) ప్రపాతముల (నిట్టనిలువుగానున్న ఉన్నత శిలామయ ప్రదేశముల) తోను అంతకుమించిన పల్లములతోను నిండిన అనేక పర్వతముల మూలమునను అనేక నదుల మూలమునను ఇవి పరస్పరము-ఒక దానినుండి మరియొక దానికి-పోవుటకు వీలు కాకున్నవి

వానియందంతటను ఎన్నియో ప్రాణులను మూర్తములను అమూర్తములను అగు పదార్ధములను వ్యాపించియున్నవి.

తేషు హైమవతం వర్షం భారతం నామ విశ్రుతమ్‌ 29

హేమకూటం పరం తస్మా న్నామ్నా కింపురుషం స్మృతమ్‌| హేమకూటచ్చ నిషధం

హరివర్షం తదుచ్యతే.

హరివర్షా త్పరం చాపి మేరోస్తు తదిలావృతమ్‌ | ఇలావృతా త్పరం నీలం రమ్యకం నామ విశ్రుతమ్‌. 31

రమ్యకా దపరం శ్వేతం విశ్రుతం తద్ధిరణ్యకమ్‌ | హిరణ్యకా త్పరం వర్షం శృఙ్గవ న్తం కురు స్మృతమ్‌.

వానిలో మొదటిదగు భారతవర్షమునకు హైమవత వర్షమని పర్వతమును

బట్టియు పేరు. ఇట్లే దాని కావల నున్న హేమకూట పర్వతము అవధిగాగల వర్షము కింపురుష వర్షము. దాని కావల నున్న నిషధ పర్వతము అవధిగా నున్నది హరివర్షము. దాని కావల మేరుపు నాశ్రయించియున్నది ఇలావృతవర్షము. దీని కావల నీలపర్వతము అవధిగా గలది రమ్యకవర్షము. దానికి ఆవల శ్వేతం విశ్రుతం త ద్దిరణ్యకమ్‌ |

హిరణ్యకా త్పరం వర్ష శృఙ్గవన్తం కురు స్మృతమ్‌.

వానిలో మొదటిదగు భారతవర్షమునకు హైమవత వర్షమని పర్వతమును బట్టియు

పేరు. ఇట్లే దాని కావల నున్న హేమకూట పర్వతము అవధిగాగల వర్షము కింపురుష

వర్షము. దాని కావల నున్న నిషధ పర్వతము అవధిగా గలది రమ్యకవర్షము. దానికి

ఆవల శ్వేతపర్వతము అవధిగా గలది హిరణ్యక వర్షము. దాని కావల శృగవత్‌ పర్వతము అవధిగా గలది ఉత్తర కురువర్షము. (ఇవి తమకు అవధిగా గల ఆయా పర్వతములను బట్టి నిషధవర్షము నీల వర్షము ఈ మొదలగు పేరులతో కూడ

వ్యవహరింపబడవచ్చును.)

తథా స్వం స్వేతి విజ్ఞేయే ద్వే వర్షే దక్షిణోత్తరే | దీర్ఘాణి తస్య చత్వారి మధ్యమం తదిళావృతమ్‌. 33

పూర్వతో నిషధస్యేదం వేద్యర్ధం దక్షిణం స్మృతమ్‌ |

పరం చేలావృతం పశ్చా ద్వేద్యరంతు తదుత్తరమ్‌. 34

ఉదగాయతో మహాఞ్చైలో మాల్యవాన్నామ పర్వతః | ద్వాత్రింశతా సహస్రేణ

ప్రతీచ్యాం స మహాగిరిః.

మాల్యవాన్వై సహసై#్రక ఆనీలనిషధావధి | ద్వా త్రింశ##త్యేవమప్యుక్తః పూర్వతో గన్దమాదనః. 36

విపులశ్చ సుపార్శ్వశ్చ సర్వరత్న విభూషితౌ | పరిమణ్డలతో మధ్యే మేరుః కనకపర్వతః. 37

చాతుర్వర్ణ స్స సౌవర్ణ శ్చతురశ్రసమన్వితః | నానావర్ణః సమ స్తేషు పూర్వన్తే

శ్వేత ఉచ్యతే. 38

పీతంతు దక్షిణపశ్చాత్‌ భృంగపత్రాభయా పరమ్‌ | తస్య చోత్తరతో రక్త శ్చతుర్‌ వర్ణసమన్వితః. 39

భూమే ర్మధ్యస్థితో మేరు శ్చతురాశీత రుచ్ఛ్రితః | యోజనానాంసహస్రాణి

సౌవర్ణో రత్నసానుమాన్‌. 40

తద్వచ్చ షోడశాధస్తా దష్టావింశతి రుచ్ఛ్రితః | విస్తరా త్త్రిగుణ శ్చాస్య పరిణాహ స్సమన్తతః. 41

సపర్వతో మహా& దివ్యో దివ్యౌషధిసమన్వితః | భువనై రావృత స్సర్వై ర్జాతరూపపరిష్కృతైః. 42

తత్ర దేవగణా స్సర్వే గన్దర్వాసురరాక్షసాః | శైలరాజే ప్రమోదన్తే సర్వతో 7ప్సరస

స్తథా. 43

స తు మేరుః పరివృతో భువనై ర్భూతభావనైః |

మేరువర్ణనము: మహామేరుపునకు చుట్టును ఇలావృతవర్షము కలదు. ఇది ఉత్తరమున నీలపర్వతము-ఈ రెండును తూర్పున గంధమాదనము పడమర మాల్యవంతము అను రెండు పర్వతములును ఉత్తర దక్షిణములుగా వ్యాపించి దక్షిణమున నిషిధమును ఉత్తరమున నీలమును తాకుచున్నవి- కాని నిషిధ-నీల పర్వతములు రెండును

మహా మేరువునకు నడుమ భాగమునకు సరిసాటిగా నున్న భాగములో నిషిధము మరికొంత దక్షిణమునకును నీలము మరికొంత ఉత్తరమునకు వంపు తిరిగి ధనురాకారముగ ఉన్నవి. ఇట్లున్న ఈ నీల గంధమాదన నిషధ మాల్యవత్పర్వతముల నడుమ ఇలావృతవర్షము ఉన్నది. ఈ నడుమ భాగము కొంత యజ్ఞవేదికయందలి దక్షిణోత్తరార్ధభాగములగాను దీనియందే జనావాసభాగము ఉత్తర దక్షిణలా వృత భాగములుగా ఉన్నది. ఈ చెప్పిన విధమున ఈ ఇలావృతవర్షపు (వేదిరూప ప్రదేశమందలి) రూపము తూర్పు పడమరలందు ఋజు రేఖారూపముగాను ఉత్తర దక్షిణములందు (వృత్తఖండపు) వక్ర రేఖారూపమునను ఉన్నది. ఈ మాల్యవద్గంధమాదన పర్వతములు రెండును ఒక్కొక్కటి ముప్పదిరెండు వేల యోజనముల పొడవు కలిగి ఉన్నవి. ఈ నాలుగు అవధుల నడుమగా మహా మేరువునకు చుట్టును కొలత కొంతమేర వ్యాపించి సర్వరత్న విభూషితములగు ఈ నాలుగు

విపుల సుపార్శ్వము లనెడు రెండు పర్వతములు ఉన్నవి. ఈ రెంటి నడుమను

పైని తెలిపిన నీల మాల్యవత్‌ నిషధగంధ మాదనములకు నడుమను ఉన్న మేరువు కనక పర్వతము అను ప్రసిద్దితో ప్రకాశించుచున్నది. ఇది నాలుగుఅస్రములందును (అస్రము=కోణము-అంచు) నాలుగు వర్ణములు కలిగి ఉన్నది. ఎట్లన-తూర్పున తెలుపు-దక్షిణమున పీతము-పశ్చిమమున నలుపు ఉత్తరమున ఎరుపునై యున్నది. ఇట్లాయాపరిమండల పర్వతాంశముల కాంతులను బట్టి దూరమునుండి చూచువారికి బంగారు కొండగాను రత్నమయ శాఖా పర్వతములతో కూడి రత్నమయముగాను నై కనక పర్వతము రత్న సానువు (రత్నమయములగు సానువులు-నెత్తములు కలది) అని కీర్తింపబడుచు భూమికి నడుమ నున్న ఈ మేరువు (పామీరు శిలామయతలము) ఎనబది వేల యోజనముల ఎత్తు కలిగియున్నది. దీనికి గల పాతు(భూమిలోనికి

గల లోతు నలువది నాలుగు యోజనములు. వెడల్పునకు*మూడింతలు దీని

చుట్టుకొలత. ఇట్టి ఈ మేరు పర్వతము చాల గొప్పది; దివ్యమయినది;(మన కీనాడు కానరాకున్నను విశ్వసించదగిన అతీంద్రియ విశిష్టతను కలది; దివ్యౌషధులు

కలది; (తన కాంతుల వ్యాప్తిచే బంగారుతో అలకరించబడినవియో అనునట్లు తోచెడి సర్వ భువనములును దీనిచుట్టు నున్నవి. ఈశైలరాజమునందేఅంతటను గంధర్వాపర్సో 7సురరాక్షసులును అప్సరోగణాదికముతోసర్వదేవగణములును ఆనందించుచు విహరించుచుందురు. ఇట్లీమేరువు సర్వభూతముల సృష్టిస్థతులకు హేతువులగు భువనములతో చుట్టబడి యున్నది.

యస్యేమే చతురో దేశా నానాపార్శేషు సంస్థితాః. 44

భద్రాశ్వో భారతశ్చైవ కేతుమాలశ్చ పశ్చిమే | ఉత్తరాశ్చైవ కురవః కృతపుణ్యప్రతిశ్రయాః. 45

విష్కమ్భపర్వతా స్తద్వన్మస్దరో గన్దమాదనః | విపులశ్చ సుపార్శ్వశ్చ సర్వరత్న విభూషితాః. 46

అరుణో మానసంచైవ సితోదం భద్రసంజ్ఞితమ్‌ | తేషాం చోపరి చత్వారి సరాంసిచ వనానిచ. 47

తథా భద్రకదమ్బస్తు మన్దరే గన్దమాననే | జమ్పూప్లక్షౌ తథా7 శ్వత్థో విపులేవా వటః పరమ్‌. 48

__________________________________________

* ఇక్కడ చెప్పిన కొలతలు అన్నియు ఈనాడు మనకు తెలిసిన కొలతలతో పోల్చినచో అభూతకల్పనలుగా తోచును. కాని మన ప్రాచీనుల అతీంద్రియ విజ్ఞానమున బట్టి వాని కొలత లేమైయుండునో జాగ్రత్తతో యోజించవలయును వ్యక్తి తానొకనచో నిలిచి నడుమ నున్న అవరోధ పదార్ధము మీదుగా ఒక కోణములో ఊర్ధ్వ దిశగా చూచినపుడు ఈ అవరోధము తన కావల నున్న అంతరిక్షములో ఎంత ఎత్తును చూడ నిచ్చుచున్నదో అది ఇచ్చట ఎనుబది నాలుగు వేల యోజనములు కావచ్చును. పామీరుముడియే ప్రపంచమునందలి సర్వ ప్రధానాప్రధాన పర్వత శాఖలకును కేంద్ర స్థానీయమని నేటి భూతత్త్వవేత్తలు (Geologists) చెప్పు విషయమును గమనించి ఈ విషయముల నాలోచించినచో ఈ కొలతల యాధార్థ్యము మరికొంత తెలియగలదు. ఏమైనను మన పూర్వులు యావద్భూమండల స్వరూపమును సూక్ష్మతి సూక్షము పవిత్ర భావనాపూర్ణము భావుకతాయుతమునగు దృష్టితో చూచి మనకు అందించిన తీరు ప్రశంసనీయము గదా|

తత్ర తే శుభకర్మాణః కేతుమాలా ఇతి శ్రుతాః | తత్రా కాలా నరాః స్సర్వే మహాసత్త్వా మహాబలాః. 49

గన్దమాదనపార్శ్వేతు పశ్చిమే వరమణ్డపః |

ద్వావింశత్తు సహస్రాణి యోజనై స్సర్వతః సమః. 50

స్త్రియ శ్చోత్పలవర్ణాభా స్సర్వాస్తాః ప్రియదర్శనాః | తత్ర దివ్యో మహావృక్షః

పనసః పత్రభాసురః. 51

తస్య పీత్వా ఫలరసం జీవన్తిహి సమా7 యుతమ్‌ | మాల్యవతశ్చ పార్శ్వేతు పూర్వే పౌరాపరాన్తికాః. 52

ద్వాత్రింశత్త్రిసహస్రాణి యోజనానాం తదుచ్యతే | భద్రాశ్వ స్తత్రం విజ్ఞేయో నిత్యం ముదితమానసః. 53

భద్రసాలవనం తత్ర కాలామ్రశ్చ మహాద్రుమః | తత్ర తే పురుషా శ్శ్వేతా మహోత్సాహా మహాబలాః.

స్త్రియః కుముదవర్ణభా స్సున్దర్యః ప్రియదర్శనాః | చన్ద్రప్రభా శ్చన్ద్రవర్ణాః పూర్దచన్ద్రభాననాః. 55

చన్ద్రశీతలగాత్రాశ్చ స్త్రియ శ్చోత్పలగన్దికాః | దశవర్షసహస్రాణి తేషామాయు రనామయమ్‌. 56

కాలామ్రరసపానాత్తు సర్వేచ స్థిరజీవనాః | సూతః : ఇత్యుక్తవా నృషీ న్బ్రహ్మా

వర్షాణితు నిసర్గతః. 57

సర్వం మయానుగ్రహకం భూయః కిం వర్ణయామి వః | ఏత చ్ఛ్రుత్వా వచ స్తేతు ఋషయ స్సంశితవ్రతాః. 58

జాతకౌతూహలా స్సర్వే ప్రత్యూచు స్తం ముదాన్వితాః | ఋషయః : పూర్వాపరౌ సమాఖ్యాతౌ ద్వౌ తు దేశౌ మహామతే. 59

ఉత్తరాణాంచ వర్షాణాం పర్వతానాంచ సంస్థితిమ్‌ | ఆఖ్యాహి నో యథాతత్త్వం

యేచ పర్వతవాసినః. 60

ఏవముక్తస్తు ఋషిభి స్తేభ్య స్త్వాఖ్యాతవా న్పునః |

నాలుగు వర్షములు: దీని నానా పార్శ్వములయందు (తూర్పున) భద్రాశ్వ వర్ష

(మహాదేశ) ము (దక్షిణమున) భారతవర్ష(మహాదేశ)ము (పడమట) కేతుమాల

వర్ష(మహాదేశ)ము (ఉత్తరమున) ఉత్తర కురువర్ష (మహాదేశ)ము ఉన్నవి. ఈ ఉత్తర కురువులు పుణ్యము చేసికొన్న వారికి నివాసభూములు. ఈ మేరువునకు నలుమూలల ఈ వర్షము లందు విష్కంభ (అవష్టంభ) పర్వతములు సర్వ రత్న విభూషితములు. మందర గంధమాదన విపుల సుపార్శ్వములను నవి కలవు. అరుణోదము మానసము సితోదము భద్రము అను సరస్సులు ఈ వర్షములందు(ఈ పర్వతములపై)వరుసగా గలవు. ఇట్లే వరుసగ భద్రకదంబవృక్షము జంబూ ప్లక్ష(జువ్వి) వృక్షములు-అశ్వత్థ వృక్షము కలవు.

కేతుమాల వర్షము: గంధమాదన పర్వత పార్శ్వమున పశ్చిమదిశగా మేలగు మండపము (పందిరి క్రిందివలె చల్లనిదై జనావానయోగ్య ప్రదేశము) కలదు. శుభకర్మకారులగు కేతుమాలులు అను జను లచట ఉందురు. వారు నల్లని దేహచ్ఛాయయు మహాసత్త్వమును మహాబలమును గలవారు. స్త్రీ లచట నల్లకలువలవంటి దేహచ్ఛాయ కలిగిన ప్రియ దర్శనలు (వారిని దర్శించుటకు కన్నులకు ప్రీతి కలిగించును.) అచట చక్కని ఆకులతో ప్రకాశించు దివ్య పనసవృక్షము గలదు. అచటివా రా వృక్షపు పండ్లరసమును త్రాపుచు పదివేల ఏండ్లు జీవింతురు. (దీని సంకేతితార్థము ఏమయినను ఇది నేటి ఆసియా పశ్చిమభాగము); ఇక భద్రాశ్వవర్షము: మాల్యవత్‌ పర్వత పార్శ్వమున పౌర్వాపరాంతికులు (తూర్పు కడపటిమేరయందలి జనులు) నివసింతురు. ఇచట సదా ముదిత మానసముకల భద్రాశ్వము (మేలుజాతి గుర్రము) కలదు. ఈచోటి వై శాల్యము ముప్పదిరెండు చదరపు యోజనములు; ఈ భద్రాశ్వ వర్షమున భద్రసాలమను వనము కలదు; కాలామ్ర(నల్లని మామిడి) మహావృక్షము గలదు. అచటి జనులు తెల్లనివారు-మహోత్సాహ మహాబలములు గలవారు; అచటి స్త్రీలు తెల్ల కలువలకాంతివంటి-చంద్రునికాంతివంటి- దేహకాంతి చంద్రుని ప్రకాశమువంటి లావణ్యము పూర్ణచంద్రునివంటి మొగము కలిగిన ప్రియదర్శనలగు సుందరులు; ఆ స్త్రీల శరీరములు చంద్రునివలె చల్లనివి; కలువపూలవలె కమ్మని సువాసనలు కలవి; అచట జనులు ఏ వ్యాధులును లేక పదివేలు సంవత్సరములు జీవింతురు. ఈ కాలామ్రరసపానముచే వారందరును స్థిరజీవనులై యుందురు. (ఈ భద్రాశ్వవర్షము నేటి చీనాదిదేశములు); అని ఇట్లు స్వయంభూ బ్రహ్మ ఈ వర్షముల స్వాభావికస్థితిని ఋషులతో చెప్పెను. ఇది వారి అనుగ్రహమున నాకు తెలిసినందున నాచే తెలుపబడినది; మరి ఇంకేమి వినగోరెదరు; ఏమి చెప్పమందురు? అని సూతు డనగా విని సంశితవ్రతులు (పవిత్ర కర్మానుష్ఠానము కలవారు) అగు ఆ నైమిశారణ్య ఋషులు ముదన్వితులును కుతుహలులునై జిజ్ఞానతో ఇట్లు పలికిరి: మహామేరువునకు తూర్పు పడమరలందుగల రెండు మహాదేశముల విషయము మాకు తెలిపితిరి: మహామతీ: ఉత్తర దిశయందలి వర్షములను అచటి పర్వతముల ఉనికియు ఆ పర్వతములందు వసించు జనులను ఏమి-ఎట్టివి-ఎవరు-అను విషయముయథాతత్త్వముగా మాకు దెలుప వేడుచున్నాము. అని ఋషులడుగ సూతు డిట్లు చెప్ప నారంభించెను:

సూతః : శృణుధ్వం *మునయు స్సర్వే పూర్వం నోక్తాని వై మయా. 61

దక్షిణనతు నీలస్య నిషధస్యోత్తరేణతు | వర్షంచ రమ్యకం నామ యత్ర జీవన్తివై ప్రజాః. 62

జాతిప్రధానా విమలా జాయన్తే తత్ర మానవాః | శుక్లాభిజనసమ్పన్నా స్సర్వే తే ప్రియదర్శనాః. 63

తత్రాపిచ మహాన్వృక్షో న్యగ్రోధో రాజతే మహా& | తస్య పీత్వా ఫలరసం పిబన్తో వర్తయన్తివై. 64

దశవర్షసహస్రాణి దసవర్షతానిచ | జీవన్తి తే మహాభాగాః సదా హృష్ణా నరోత్తమాః. 65

ఉ త్తరేణతు శ్వేతస్య శృఙ్గపార్శ్వస్య దక్షిణ | వర్షం హిరణ్యకం నామ తత్ర హైరణ్యకా నదీ. 66

మహాబలా మహాసత్త్వా నిత్యం ముదితమానసాః | శుక్లాభిజనసమ్పన్నా స్సరే తే ప్రియదర్శనాః. 67

ఏకాదశసహస్రాణి వర్షాణాంచ నరోత్తమాః | ఆయఃప్రమాణం జీవన్తి శతాని దశ పఞ్చతు. 68

తస్మిన్వర్షే మహావృక్షో +హ్యశ్వత్థః పత్రశాఖవా& | తస్య పీత్వా ఫలరసం జీవన్తే తత్ర మానవాః. 69

శృఙ్గసాహ్వన్య శృఙ్గాణి రమ్యాణిచ మహాన్తివై | ఏకం మణిమయం తత్ర ద్వితీయం తత్ర కాఞ్చనమ్‌.

సర్వరత్నమయం త్వేకం భవనై రుపశోభితమ్‌ |

మునులారా: మీరందరును వినుడు: నే నిదివరకు చెప్పనివాని నిపుడు తెలిపెదను. రమ్యకవర్షము: నీలపర్వతమునకు దక్షిణమున నిషధపర్వతమునకు ఉత్తరమున రమ్యకము అను వర్షము కలదు. అదియు ఉత్తమ ప్రజావాసము; అచటి జనులందరు జాతి ప్రధానులు (జన్మసిద్ధముగా శ్రేష్ఠతాలక్షణములు కలవారు.) నిర్మలులు; పాపరహితమగు వంశమున పుట్టినవారు-తెల్లని ఆనువంశికమగు దేహచ్ఛాయ కలవారు; ప్రియదర్శనులు (చూడముచ్చట గొలుపు వారు); అచట గొప్పదియు పూజ్యమును నగు మర్రిచెట్టు కలదు; అచటి మహాభాగులు అగు నరోత్తములు ఆ పండ్లరసమును త్రావుచు హృష్టు(సంతోష యుక్తు)లై పదునొకండు వేల సంవత్సరములు జీవింతురు.

హిరణ్యక వర్షము: శ్వేత పర్వతమునకు ఉత్తరమున శృంగవత్పర్వతమునకు దక్షిణమున హిరణ్యక వర్షము కలదు. అచట హైరణ్యక నది కలదు. అచటి మానవులందరును మహాబలులు మహాసత్త్వులు (సత్త్వము అనగా నిబ్బరము-శ్రమను ఓర్చెడి యోగ్యత) సదా సంతుష్టమానసులు; తెల్లని దేహచ్చాయ కలవారు; ప్రియదర్శనులు; పదునొకండువేల ఐదువందల ఏండ్లు జీవింతురు. అచట మనోహరములగు ఆకులు కొమ్మలు రెమ్మలు గల మహాశ్వత్థవృక్షము కలదు. అచటివారు దాని పండ్లరసము త్రావి జీవింతురు. అచటి శంగవత్పర్వతపు రమ్య మహా శిఖరము లనేకములలో ఒకటి మణిమయమును మరియొకటి స్వర్ణమయమును మూడవది సర్వరత్నమయమును భవనోపశోభితమును.

ఉత్తరే చాస్య శృఙ్గస్య సముద్రం తస్య దక్షిణ. 71

కురవ స్తత్ర తద్వర్షం పుణ్యం సిద్దనిషేవితమ్‌ | తత్ర వృక్షా మధురసా దివ్యామృతజలాపగాః. 72

వృక్షాశ్చతే ప్రసూయ్త ఫలాన్యాభరణానిచ | సర్వకామప్రదాతారః కేచిద్వృక్షా మనోరమాః. 73

వస్త్రాణిచ ప్రసూయన్తే సర్వభక్ష్యాంశ్చ షడ్రసా& | అపరే క్షీరిణో నామ వృక్షా స్తత్ర మనోరమాః. 74

__________________________________________

* యాని వర్షాణి పూర్వోక్తాని చవై మయా. +లకుచః.

భోజనం తేప్రయచ్ఛన్తి షడ్రసం చామృతోపమమ్‌ | సర్వా మణిమయా భూమి స్సూక్ష్మకాఞ్చనవాలుకా. 75

సర్వత్ర శుభసంస్పర్శా నిషఙ్కా నీరుజా శుభా | దేవలోకా చ్చ్యుతా స్తత్ర శుభా జాయన్తి మానవాః. 76

శుక్లాభిజనసమ్పన్నా స్సర్వేచ స్థిర¸°వనాః | మిథునాని ప్రసూయన్తే స్త్రియశ్చాప్సరసోపమాః. 77

తేషాం తే క్షీరిణాం క్షీరం పిహన్తి హ్యమృతోపమమ్‌ | సమంచ జాయతే యుగ్మం సమం చైవాభివర్దతే. 78

సమేవై శీలరూపేచ సమంచైవ మ్రియన్తితే | ఏకైక మనురక్తాశ్చ చక్రవాకాఇవ ధ్రువమ్‌. 79

అనామయా విశోకాశ్చ నిత్యం ముదితామానసాః | దశవర్షసహస్రాణి శతాని దశపఞ్చచ. 80

జీవన్తి తే మహాసత్త్వా నచాన్యా స్త్రీ ప్రవర్తతే | సూతః : ఏవమేవ నిసర్గోవై వర్షాణాం భారతాదినామ్‌. 81

దృష్టః పరమతత్త్వజ్ఞై ర్భూయః కిం కథయామి వః | వ్యాకృతే త్వేవమృషయ స్సూతపుత్త్రేణ ధీమతా. 82

ఉత్తరశ్రవణ భూయః పప్రచ్ఛు స్సూతనన్దనమ్‌. 82u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే ద్వీపాది వర్ణనం నామ ద్వాదశోత్తర శతతమో7ధ్యాయః.

ఉత్తరకురు వర్షము: శృంగవత్పర్వతపు మూడు శిఖరములలో కడపటిదగు సర్వరత్నమయ శిఖరమునకు ఉత్తరపు అంచును తాకుచు (క్షారజల) సముద్రమును దక్షిణపు అంచును తాకుచు ఉత్తర కురు వర్షమును ఉన్నవి. ఈ వర్షము సిద్ధ జనులకు ఆశ్రయము. అచటి వృక్షములు మధు (తేనెయే-లేదా తేనవంటి) రసములు కలవి. దివ్యమగు అమృత తుల్యమగు జలములు కల నదులచట కలవు. అచటి వృక్షములు పండ్లతోపాటు ఆభరణములను కూడ ఫలించును. అచటి కొన్ని వృక్షములు మనోరములను సర్వకామ ప్రదములనయి వస్త్రములను షడ్రసోపేత భక్ష్యములను ఫలించును. క్షీరి వృక్షములు (పాలుగల చెట్లు) అను అచటి కొన్నిచెట్లు అమృత తుల్యమగు షడ్రస భోజనము నిచ్చును. అచటి భూమియంతయు మణిమయమును సన్నని బంగారు ఇసుక కలదియు అంతటను సుఖకరమగు స్పర్శము కలదియు బురద లేనిదియు శుభకరమును బాధ కలిగించనిదియునై యుండును. తమ పుణ్యానుభవానంతరము దేవలోకమునుండి భువికి జారిపడిన శుభ మానవులు అచట జన్మింతురు. వారందరును తెల్లని ఆను వంశికమగు దేహచ్చాయయు స్థిర ¸°వనమును కలవారు. అప్సరసల వంటి అచ్చట స్త్రీలకు కవల పిల్లలు (దంపతులే) పుట్టుదురు. ఆ కవ శిశువులు అమృతోపమమగు అచటి క్షీరి వృక్షముల క్షీరమును త్రావుదురు. కవలు సమముగా (సమరూప గుణ లక్షణములతో) పుట్టుదురు-పెరుగుదురు-సమశీల రూపము కలిగి జీవించి సమముగా సమకాలమున మరణింతురు. వారు పరస్పరము అనురక్తులై చక్రవాకములవలె జీవింతురు. వారు రోగరహితులు-శోకరహితులు-నిత్యము ముదిత మానసులు-మహాసత్త్వులు; వారును పదునొకండువేల ఏండ్లు జీవింతురు; ఏ స్త్రీయు ఆ దంపతుల జీవితముల నడుమ ప్రవర్తించదు.

భారత వర్షము మొదలగు వర్షముల స్వభావము ఇట్టిదియేయని పరమ తత్త్వజ్ఞులు దర్శించి తెలిపిరి. మీకు మరి ఇంకేమి చెప్పవలయును. అని సూతుడు ఋషులతో పలికెను.

బుద్ధిశాలియగు సూతపుత్త్రుడు ఇట్లు వ్యాకరించి (విడుమరిచి) చెప్పగా మరియు తరువాతి విషయము విను కుతూహలముతో ఋషులు అతని నింకను ప్రశ్నించిరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళవర్ణనమున ద్వీపాది వర్ణనమను నూట పండ్రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters