Sri Matsya Mahapuranam-1    Chapters   

షోడశోత్తరతతమో7ధ్యాయః.

హిమవత్పర్వతవర్ణనమ్‌.

సూతః: 

ఆలోకయ న్నదీ రమ్యాం తత్సమీరగతక్లమః| స గచ్ఛన్నేవ దదృశే హిమవస్తం మహాగిరిమ్‌. 1

ఖముల్లిఖద్భి ర్బహుభి ర్యుతం శృఙ్గైస్తు పాణ్డరైః|పక్షిణామథ సఞ్చారై ఋషీణాం సిద్ధిదంశుభమ్‌ 2

నదీప్రపాతసఞ్జాతమహాశబ్ద సమస్తతః|అసంశ్రితాన్యశబ్దంతు శీతతోయంమనోహరమ్‌. 3

దేవదారువనైర్నీలైః కృతకృత్య స్సమద్రరాట్‌| మే ఘోత్తరీయకం శైలం దదర్శ స నరాధిపః. 4

శ్వేతమేఘకృతోష్ణీషం చన్ద్రార్కమకుటం క్వచిత్‌| హిమానులిప్తసర్వాజ్గం క్వచిద్దాతువిచిత్రిమ్‌. 5

చన్దనేనానులిప్తాఙ్గం దత్తపఞ్చాఙ్గుళం యథా| శీతప్రదం నిదాఘేపి శిలావిషమసఙ్కటమ్‌. 6

సాలక్తకై రప్సరసాం ముద్రితం చరణౖః క్వచిత్‌| ఆపానభూమిగళితై ర్గన్ధర్వాప్సరసాం క్వచిత్‌. 7

స్పృష్టం సూర్యాంశుభిః క్వాపి క్వచి చ్ఛీతసమావృతమ్‌|

దరీముఖైః క్వచి ద్భీమైః పిబస్తం సలిలం మహత్‌. 8

క్వచి ద్విద్యాధరగణౖః క్రీడద్భి రుపశోభితమ్‌| ఉపగీతం తథాముఖ్యైః కిన్నరాణాం గణౖఃక్వచిత్‌. 9

పుషై#్ప స్సన్తానకాదీనాం దివ్యై స్తముపశోభితమ్‌| భుక్తోజ్ఘితాభి ర్మాలాభిః కుసుమానాం తథాక్వచిత్‌. 10

మృదితాభి స్సమాకీర్ణం గన్ధర్వాణాం మనోరమమ్‌|

నూట పదునారవ అధ్యాయము.

హిమవత్పర్వత వర్ణనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: మద్రరాజగు పురూరవుడు రమ్యమగు ఆ ఇరావతీ నదిని చూచుచున్నంతలోనే నదీవాయు స్పర్శచే నాతని బడలిక అంతయు తీరెను. ఆనదివెంట ఎగువకు మరికొంత దూరము పోగా మహాగిరి హిమవంతము కానవచ్చెను. దాని తెల్లని బహు శృంగము లాకాశమును ఒరయుచుండెను. వానిపై పక్షులనేకములు సంచరించుచుచూడముచ్చటయై ఉండెను. ఋషులకు తపోజ్ఞాన సిద్ధిప్రద మాకొండ. మరి వేరుశబ్దముల వినీయని చప్పుడులతో పడు శీతల జలనదీ ప్రపాతములతో ఆకొండ మనోహరముగ నుండెను. (మహాబాహువులో యనదగు) నీలములగు దేవదారు వనములతో ఒప్పు ఆ కొండపై కనవచ్చు మేఘములుత్తరీయములుగా ఉండెను. ఆయా తావులందు తెల్లని మేఘములు తలపాగలై చంద్రార్కులు మకుటములై మంచు పొరలును గైరిక ధాతువులును గంధానులేపనములై పలువన్నెల వెలయుచు ఐదు వ్రేళ్ళతో రాచికొనిన చందన రేఖలో యన కనవచ్చుచుండెను. వేసగియందు చలువల ఇచ్చు శిలలతో విషమమును ఇరుకునునైన ఆ కొండవయి అప్సరల పాదముల లత్తుక పారాణి ముద్రలును ఆసవపాన ప్రసంగమున జారిపడిన గంధర్వుల అప్సరసల కాలి గుర్తులును కనబడుచుండెను. దాని కొన్ని తావులు రవి కిరణ తప్తము కాగా మరికొన్ని కడుచల్లనై ఉండెను. కొన్నియెడల నా పర్వతము తన భయంకర గుహలను నోళ్ళతో మహాపరిమాణ జలముల త్రావుచుండెను. కొన్ని తావులందు సన్తానకాది దివ్య(కల్ప) వృక్ష విశేషముల పూచిన పూలును మరికొన్ని గంధర్వులనుభవించి విడువగా నలిగిపడిన కుసుమ మాలలును మనోరమములై యుండెను.

నిరుద్ధపవనై ర్దేశై ర్నీలశౄడ్వలమణ్డితైః. 11

క్వచిచ్చ కుసుమైర్యుక్త మత్యన్తరుచిరం శుభమ్‌| మృగైస్తథానుచరితం దన్తిభిశ్చ మహాద్భుతమ్‌. 12

యత్ర సింహనినాదేన త్రస్తానాం భైరవం రవమ్‌| దృశ్యతే నచ సంశ్రాన్తం గజానా మాకులంకులమ్‌. 13

తపద్బి స్తాపసైర్యస్య కుఞ్జదేశో7ప్యలఙ్కృతః|

రత్నైర్యస్య సముత్సన్నై సై#్త్రలోక్యం చాప్యలఙ్కృతమ్‌. 14

అహీనశరణం నిత్య మహీన జనసేవితమ్‌| అహీనః పశ్యతి గిరి మహీన మథ సమ్పదా. 15

అల్పేన తపసా యత్ర సిద్ధిం ప్రాప్యన్తి తాపసాః|యస్య దర్శనమాత్రేణ సర్వకల్మషనాశనమ్‌. 16

మహాప్రపాతసమ్పాతనదీభి ర్వేగితామ్భుభి?| వాయునీతై స్సదాతృపస్తీకృతదేశం క్వచిత్క్వచిత్‌. 17

అనమ్బుజలదై శ్శృఙ్గైః క్వచి ద్ధసిత ముచ్ఛ్రితైః నిత్కార్కతాపవిషమై రగమ్యై ర్మనసా వృతమ్‌. 18

దేవదారుమహావృక్షప్లక్షశాఖినిరస్తరైః|వంశైశ్చ స్తమ్భసాకారపాదపై రుపశోభితమ్‌. 19

సింహానునాదితగుహం మహాశృఙ్గాగ్రనిర్దరమ్‌| శబ్దలభ్యామ్బువిషమం హిమసంరుద్ధకన్దరమ్‌. 20

దృష్ట్వాతు తాం చారునితమ్బభూమిం మహానుభావ స్సతు మద్రరాజః|

బభ్రామ త్రైవ నృపః ప్రదేశం స్వవాసయోగ్యం చ సమాససాద. 21

ఇతీ శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవశ్చరితే హిమవత్పర్వత వర్ణనం

నామ షోడశోత్తరశతతమో7ధ్యాయః.

ఆ కొండ మరియు ఆయా తావులయందు వాయువునే ముందునకు పోనీయని ఎత్తయిన నల్లని పచ్చికల బయళ్ళతోను వివిధ సుమములతోను అత్యంత మనోహరమయి వివిధ మృగములయు కరులయు సంచారములతో అద్భుతమయి సింహుల నాదములతోను అవి విని భయమందిన మృగముల భైరవ రవములతోను భయానకమయి యొప్పుచుండెను. ఐనను అచటి గజములు మాత్రము అలయక కలతపడకుండును. ఉత్పన్నములగు రత్న విశేషములతో త్రైలోక్యమును అలంకృతమగుచుండును. ఆ కొండ సదా అహీన (అహి+ఇన-సర్పశ్రేష్ఠములకు) శరణము (వానస్థానము); అహీన (హీనులుకాని గొప్ప) జనులిద్దాని సేవింతురు. సంపదలతో అహీన (యుక్త) మగు ఆగిరిని అహీనుడు మాత్రమే దర్శించును. తాపసులచట అల్ప తపమొనర్చియు సిద్ధినందుదురు. దాని దర్శన మాత్రమున సర్వకల్మషనాశమగును. తద్గిరి ప్రదేశములు కొన్న ఇనదీ ప్రపాత సంపాతవశమున వేగముగ పారు జలములనుండి రేగిన వాయువుచే అటకటకు కొని రాబడిన జలముల (బిందువుల)తో సంతృప్తములందు యుండెను. జలరహిత మేఘములతో వెలయు ఉన్నత శృంగములతో ఆగిరి నవ్వుచున్నదో యనునట్లుండెను. దాని శిఖరములు కొన్ని నిరంతర రవికిరణ తప్తములును విషమములును నగుటచే మనస్సుతోనైన చేరనలవి కాకుండెను. దట్టములై నిండిన ప్లక్ష(జువ్వి) దేవదారు మహావృక్షముల తోను స్తంభములవలె కననగు వెదుళ్లతోను వృక్షములతోను ఆగిరి ఉపశోభిల్లుచుండెఉన. ఆగిరి గుహలు సింహనాదానునాది తములు; శిఖరాగ్రములందలి పగుళ్ళతోను శబ్దము మాత్రమే లభించు జల ప్రదేశములతోను హిమముతో మూతపడిన గుహలతోను ఆగిరి కొన్ని తావుల భయానకమును విషమమును అగమ్యమునునై యుండెను. మనోహరముగు నితంబ(పర్వతమందలి చదునైన ఉన్నత)ప్రదేశములతో ఒప్పు ఆ హిమవంతమును చూచుచు పోవుచు మహానుభావుడగు ఆ మద్రరాజ పురూరవసుడు తాను వసించి తపము సేయ యోగ్యమగు తావునకై వెదకివెదకి తుదకట్టిది చేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణమున భరత వర్షాంతర్గత భరతఖండన వర్ణనమున

పురూరవశ్చరితమున మద్రరాజ పురూరవో వృత్తాంతమను నూట పదునారవ

అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters