Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తదశోత్తరశతతమో7ధ్యాయః.

హిమవత్పర్వతవృక్షాదివర్ణనమ్‌.

సూతః: 

తసై#్యవ పర్వతేన్ద్రస్య ప్రదేశం సుమోహరమ్‌| అగమ్యం మానుషైరన్యై ర్దైవయోగా దుపాగతః. 1

ఇరావతీ సరిచ్ఛ్రేష్ఠా యస్మాద్దేశా ద్వినిర్గతా| మేఘశ్యామంచ తందేశం ద్రుమషణ్డౖరనేకశః. 2

సాలైస్తాలై స్తమాలైశ్చ కర్ణికారై స్సశాల్మలైః| న్యగ్రోధైవ్చ తథా7శ్వత్థై శ్శిరీషై శ్శింశుపాద్రుమైః. 3

శ్లేష్మాతకై రామలకై ర్హరీతకవిభీతకైః| భూర్జై స్సముఞ్జకై ర్బాణౖ ర్వక్షై స్సప్తచ్ఛదైరపి. 4

మహానిమ్బై స్తథానిమ్బై ర్నిర్గుణీభి ర్హరిద్రుమైః దేవదారుమహావృక్షై స్తథా కాలేయక ద్రుమైః. 5

పద్మకై శ్చన్దనై ర్బిల్వైః కపిత్థై రక్తచన్దనైః| వాతామరిష్టకాక్షీరై రశ్వకర్ణై స్తథార్జునైః. 6

హస్తికర్ణై స్సుమనసైః కోవిదారై స్సుపుష్పితైః| ప్రాచీనామలకైశ్చాపి మధూకైః స్సవరాటకైః. 7

ఖర్జూరై ర్నాళికేరైశ్చ ప్రియాళ్వామ్రాతకద్రుమైః తన్తుమాలై ర్దవైర్భవ్యైః కాశ్మీరైః పర్నిభిస్తథా. 8

జాతీఫలైః పూగఫలైః కట్ఫలై స్సల్లకీఫలైః| మన్దారైః కోవిదారైశ్చ కింశుకైః కుసుమాంశుకైః. 9

పలాశై శ్శాల్మలీభేదై ర్వేతసై ర్జలవేతసైః|రక్తారంగైశ్చ సారఙ్గైర్హిఙ్గుభి స్సప్రియఙ్గుభిః. 10

lరక్తాశోకై స్తథాశోకైః కురుకై ర్భువిరూఢకైః| ముచుకున్దైస్తథాకున్దైః కోటరూషసరూషకైః.

కిఙ్కరాతైః కిరాతైశ్చ కేతకై ర్వనకేతకైః|శోభాఞ్జనై రఞ్జనైశ్చ శుకలిఙ్జనిచోళ##కైః. 121

సపర్ణాకైశ్చ శయనై ర్ద్రుమశ్రేష్ఠై స్తథాసనైః|

నూట పదునేడవ అధ్యాయము.

హిమవత్పర్వత వృక్షాది వర్ణనము.

(ఈ అధ్యాయమున వృక్షాది వర్ణనము కొంత పరస్పర నమ్మిశ్రణము ఉన్నను చాలభాగము ఆయా వర్గములకు చెందిన వృక్షలతాదికమున మహాముని క్రమముగా వర్ణించుట జరిగినది)

సూతుడు బుషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఈ హిమవత్పర్వతమునందే అతి మనోహరమగు ప్రదేశము ఒకటి కలదు. అది సామాన్య మానవులకు చేరనలవికానిదేయైనను అదృష్టవశమున మద్రరాజగు పురూరపుడు చేరెను. అచటి నుండియే నదీ శ్రేష్ఠయగు ఇరావతి ప్రభవించి వెడలును. అనేకములగు వృక్షముల గురులతో ఆ ప్రదేశము మేఘములవలె నల్లనై కానవచ్చుచుండును.

(అచటి వృక్షములలో కొన్ని కలపను లక్క మొదలగు పదార్థములను అగురు మొదలగు సుగంధ ధూప ద్రవ్యములను అలంకరణ సామగ్రిని ఓషదులను ఉత్పన్నము చేయు మహావృక్షములు అవి ఏవన): సాలతాల (తాటి) తమాల-కర్ణికార-శాల్మల(బూరుగు) న్యగ్రోధా(మర్రి)శ్వత్థ (రావి) శిరీష (దిరిసెన) శింశుపా (అగురు)శ్లేష్మాతకామలక(ఉసిరిక)హరీతక(కరక) విభీతక(తాడి) భూర్జముంజక బాణ(ఈరెండును ఏళ్ళయొడ్డున మొలచు ముంజగడ్డి ఱల్లు)సప్తచ్ఛద (ప్రతిరెమ్మయందును ఎప్పుడును ఏడాకులే ఉండెడి అరణ్య వృక్షము) మహానింబ (పెద్దవేప) నింబ నిర్గుండీ హరిద్రుడు దేవదారు కాలేయక పద్మక చందన బిల్వ కపిత్థ (వెలగ) రక్తచందన వాతామ రిష్టకా-క్షీరా-శ్వకర్ణార్జున (మద్ది) హస్తికర్ణ-సుమననకోవిదార ప్రాచీనామలక మధూక (ఇప్ప) వరాటక ఖర్జూరనాళికేరప్రియా-శ్వామ్రాతక తంతు మాలధన భవ్య కాశ్మీర-పర్ణిజాతీఫల(జాజికాయ) పూగఫల (పోక) కట్పల నల్లకీఫల మందార కింశుక కుసుమాంశుక పలాశ (మరియొక విధమగు మోదుగు) శాల్మలీఖేద (మొరక విధమగు బూరుగు) వేతన (మెట్టప్రబ్బలి)జలవేతన (నీటిప్రబ్బలి) రక్తాంగ సారంగహింగు (ఇంగువ) ప్రియంగు రక్తాశోకాశోక కురుక భువిరూఢకముచుకుంద కుంద కోట రూషక-రూషక కింకరాత కిరాతకేతక(నీటి మొగలి) వనకేతక (అడవి మొగలి) శోభాంజనాంజన వుకలింగ నిచోళక పర్ణాక శయనా7సన వృక్షములును.

మన్మథస్య శరాకారై స్సహకారైర్మనోరమైః. 13

పీతయూథికవల్మీకై శ్శ్వేతయాథిక యా తథా| జాత్యా చమ్పకజాత్యాచ తుమ్బకైశ్చ సతుమ్బకైః. 14

మోచై శ్చోచైశ్చ లికుచై స్తిలబిల్వకుసుమ్బకైః తథాచ శుష్మచరణౖ ర్వరుణౖః కామవల్లభైః. 15

పుష్పాఙ్కుశైశ్చవకుళైః పారిభ్రదహరిద్రకైః ధారాకదమ్బైః కుటజైః కదమ్బై ర్గిరికూటజైః. 16

ఆక్రాన్తమూర్థకకుభైః కకుభైః కమనీయకైః| కర్కన్ధుబదరై ర్నీపై ర్ద్విపైరివ మదోద్ధతైః. 17

రక్తైః పాలీవనైర్వృక్షై ర్దాడియై శ్చమ్పకద్రుమైః| బన్దూకైశ్చ సబన్ధూకైః కుఞ్జకానాంతు జాతిభిః 18

కుసుమైం పాటలాభిశ్చ మల్లికాకరవీరకైః|కురువకై ర్హిమవఞ్జరైర్జము%్‌భభి ర్మృదుజమ్భుభిః. 19

బీజపూరై స్సకర్పూరై ర్గురుభి శ్చాగురుద్రుమైః బిమ్బైశ్చాప్రతిబిమ్బైశ్చ సన్తానకవితానకైః. 20

తథాంతుఫలవక్షైశ్చ హిన్తాలఫలధన్వికైః|తృణశూన్యైః కరీషైశ్చ శాకైశ్చ మదనై స్తథా. 21

పీలుభి ర్ధాతకీభిశ్చ చిరిబిల్వసవాలుకైః| తిన్త్రిణీకై స్తథా లోధ్రైర్విడఙ్గైః క్షీరికాద్రుమైః. 22

అశ్మాతకై స్తథాజ్కోలై స్తథా చ మధుకద్రుమైః| భల్లాతకై రిన్ద్రవనై ర్వల్మీకై స్సిన్దువారకైః. 23

నాగకేసరవృక్షైశ్చ సుకేసరమనోరమైః| కరమర్దైః కాసమర్దై రరిష్టకవరిష్టకైః. 24

రుద్రాక్షై ర్ద్రాక్షసమ్భూతై స్సనిమ్బైః పుత్త్రజీవకైః తక్కోలైస ర్లావకైశ్చాపి త్వగ్ద్రుమైః పారివేతసైః. 25

(మరికొన్ని అందమగు పూలను ఔషధములుగా పనికివచ్చు ఫలములను ఇచ్చునవి-అవి ఏవన): అసన మన్మథ శరాకార మనోరమ సహకరా(రసాలమను మామిడి) పీతయూథికా-వల్మీక-శ్వేతయూథికా-జాతీ(జాజి) చంపక తీగ(సంపెగ) తుంబక మోచచోచలికుచ తిల-బిల్వ-కుసుంభక (నూనెనిచ్చు కుసుమపంట) శుష్మచరణ వరుణ కామవల్లభ పుష్పాంకుశ వకుళపారి భ్రదహరిద్రక ధారా కదంబ (ఒక కడిమి) కుటజ (కొడిసె) కదంబ (నాటుకడిమి) గిరికుటజ సమాక్రాంత దిగంత కమనీయ కకుభ (మద్ది) కర్కంధుబదరీ మదగజ సమాన నీపరక్త (ఎర్రని) పాలీవనదాడిమద్రుమ చంపక( చెట్టు సంపెంగ) బంధూక నలబంధూక కుంజకజాతిభేద(వేరువేరు జాతుల కుంజక వృక్షములు) పాటల కరవీర (ఎర్ర గన్నేరు-అదేవిధమగు తెల్లని పూలచెట్టును)కురువక (పచ్చనిములు గోరింట) హిమవంజీరములును.

(మరికొన్ని ఓషధులుగానే విశేషముగా పనికివచ్చు చెట్లు. అవి ఏవన):జంబూ (నేరెడు)మృదు జంబూ బీజపూర కర్పూరాగురు బింబ(దొండ) సంతానక వితానక(పందిళ్ళు)ములును-ఔషధజాతి(మరికొన్ని పండ్ల చెట్లు: అవి ఏవన): హింతాల ధన్విక తృణశూన్య కరీషశాక(చాగ) మదన (ఉమ్మెత్త) పీలు ధాతకీ (ఆరె)చిరిబిల్వ వాలుక తింత్రినీ(చింత)లోధ్ర విడంగ క్షీరికా7శ్మాతకా7ంకోల (ఊడుగ) మధుక భల్లాతకేంద్రవన వల్మీక సిందువార సుకేసర (మనోరమ) నాగకేసర కరమర్ధకానమర్ధారిష్టక వరిష్టక రుద్రాక్ష ద్రాక్ష నింబ పుత్త్రజీవక (గారకాయ) తక్కోలలావకత్వక్‌ద్రుమ పారివేతనములును.

ప్రతానైఃపిప్పలీనాంచ నాగవల్లీభి రుత్తమైః|మరీచానాం తథాగుల్మైః పద్మైశ్చ వనమాలికైః. 26

మృద్వీకామణ్డలై ర్ముఖ్యై రతిముక్తకమణ్డలైః| వకులై ర్వక్రకీనాంచ ప్రతానై స్సఫలైశ్శుభైః. 27

కూశ్మాణ్డానాం ప్రతానైశ్చ పటోలాలాబువల్లికైః| చిరణ్డస్య ప్రతానైశ్చ పటలైః కరవేల్లకైః. 28

కార్కొటకవితానైశ్చ వార్తాకై ర్బృహతీఫలైః|రాజమాషాతసీషణ్డౖశ్శాకైశ్ప వివిధై స్తథా. 29

కన్దైర్విదార్యాచ తథా కరోటై స్స్వాదుసంయుతైః సబిడారీ విష్ణుసారా జతుపత్త్వగ్వివర్ధితైః. 30

సునిష్పాపక వృక్షైశ్చ గవిక్షువక వాస్తుకైః సువర్చలాభి స్సర్వాభి స్సర్షపాభి స్తథైవచ. 31

కాకోలీ క్షీరకాకోలీ వృక్షైశ్చసుమనోహరైః కాసుమర్దై స్తథా సాలై స్తథాకట్పలచక్రకైః 32

తథా క్షీరికశాకైశ్చ కాలశేకేన వై తథా | శిమ్బిధాన్యై స్తథాధాన్యై స్సర్వైర్నిరవశేషతః. 33

ఓషధీభి ర్విచిత్రాభి ర్దీప్యమానాభి రేవచ| ఆయుష్మద్భి స్ససస్యాభిర్వన్యాభిశ్చ నరాధిప. 34

జరామృత్యు భయఘ్నాభిః క్షుద్భయఘ్నాభి రేవచ| సౌభాగ్యజననీభిశ్చ లతాభి శ్చాప్యనేకశం. 35

తత్ర వేణులతాభిశ్చ తథౄ కీచకవేణుభిః కాశై శ్శశాఙ్కకాశైశ్చ కాశగుల్మై స్తథైవచ. 36

కుశగుల్మై స్తథారమ్యై ర్గుల్మై శ్చేక్షో ర్మనోరమైః |కార్పాసద్రుమ సఙ్ఘేన దుర్లభేన శుభేనచ. 37

తథాచ కదళీషణ్డౖ ర్మనోహారిభి రుత్తమైః|తథా మరకతప్రస్థ ప్రదేశైశ్శాడ్వలాన్వితైః. 38

హరిత్పుష్ప సమాయుక్తైః కుఙ్కుమస్చ భాగశః భృఙ్కరాజ టామాంసీ గ్రన్థికై స్తుమురాఙ్గదైః. 39

స్వర్ణపుష్పా యథాభూమి ర్నానాపుషై#్ప స్తథాపరైః| జమ్బీరికా భూతృణకై స్సరసైః కకుభైస్తథా. 40

శృఙ్గిబేరాజమోదాభిః కుహకైశ్చ ప్రియాంళుకైః| జలజైశ్చ తథావర్ణై ర్నానావర్ణై స్సుగన్ధిభిః. 41

ఉదయాదిత్య సఙ్కాశైః పూర్ణచన్ద్ర నిభైస్తథా| తపనీయసవర్ణైశ్చ అతసీపుష్ప సన్నిభైః. 42

శుకపత్ర నిభైశ్చాన్యై స్థ్సలపాలైశ్చ భాగశః|పఞ్చవర్ణైస్సమాకీర్ణై ర్బహువర్ణై స్తథైవచ. 43

దృష్టృదృష్ట్యాహితముదైః కుసుమై శ్చన్ద్రసన్నిభైః| తథా వహ్నిశిఖాకారై ర్గజవక్త్రోత్పలై శ్శుభైః. 44

నిలోత్పలై స్సకర్పూరై ర్గుఞ్జాతక కశేరుకైః|శృఙ్గాటకసృగాలైశ్చ భరటైశ్చ స్తళోత్పలైః. 45

జలజై స్థ్సలజై ర్మూలైః ఫలైః పుషై#్ప ర్విశేషతః| వివిధైశ్చైవ నీవారై ర్మునిభోజ్యై ర్నరాధిప. 46

న తద్ధాన్యం న తత్స్వల్పం న తచ్ఛాకం న తత్ఫలమ్‌|

న తన్మూలం న తత్కన్ధం న తత్పుష్పం నరాధిపం. 47

నాకలోకోద్భవం నిత్యం నరలోకోద్భవంచ యత్‌| అనూపోత్థం పనోత్థంచ యత్రయత్రాస్తి పార్థివః. 48

సదాపుష్పఫలం సర్వ మజర్యమృతుయోగతః మద్రేశ్వర స్స దదృశే తపసోర్థోపయోగతః. 49

(మరికొన్ని వివిధోప యోగములుకల తీగల గుబురు పొదల జాతులు. అవి ఏవన) పిప్పలీ నాగవల్లీ(తమలపాకు) మరీచ (మిరియపు) పద్మ-వనమాలికా మృద్వీకా (ద్రాక్ష)7తిముక్తక వకుల (పొగడ) సఫల (పండ్లుగల) వక్రకీ కూశ్మాండ (బూడిద గుమ్మడి) పటో(పొట్ల) లా7లాబు(సొర) చిరంట కారవేల్ల (కాకర) కార్కోటక వార్తాక (పందిరివంగ) బృహతీఫల రాజమాషాతసీ(బొబ్బర-అవిసె)త్యాది వివిధ శాకలతాప్రతానులును రుచిమంతములును కంద విదారీ కరోట బిడారీ విష్ణుసారాజతువత్‌ త్వగ్నివర్ధిత నిష్పాపక గవిక్షువక వాస్తుక సువర్చలా సర్షపములును (ఆవాలు) కాకోలీక్షీరకాకోలీకానమర్ధసాల కట్ఫల చక్రక వృక్షములును క్షీరిక శాక కాలశాకములును శింబి ధాన్య ప్రభృతి సర్వ ధాన్యములును విచిత్రములును ప్రకాశించునవియు దీర్ఘాయువు కలవియు సస్యయుతములును నగు వన్యములగు ఓషధులును జరామృత్యు క్షుద్భయ నాశకములును సౌభాగ్య వర్దనములునునగు అనేక లతలును తీగ వెదుళ్ళు బొంగు వెదుళ్ళును చంద్రునివలె మెరయు పూలుగల రెల్లు పొదలును రమ్యములగు దర్భల చెరకుల గుబురులును దుర్లభములును శుభకరములునగు తెగకు చెందిన ప్రత్తిచెట్లును మనోహరములును నుత్తమములునగు అరటి గుబురులును పచ్చిక బయళ్ళతో నిండిన గరుడ పచ్చమణుల నెత్తములును పచ్చని పూవులతో వెలయు కుంకుమ పొదలును భృంగరాజ జటామాంసీ గ్రంథికతుమురా7ంగదములను ఓషధివృక్షకము(మొక్క)లును భూమి బంగారుపూవులు దాల్చెనేమో యని తోపజేయు మరి ఇతరములగు పూవులును సరనములగు జంబీరికా భూతృణక కకుభ వృక్షములును శృంగిబేరాజ మోదా(వాము) కుహక ప్రియాళుక వృక్షలతాదికమును ఏ వన్నెయు లేనివి పలువన్నెలు కలవియగు సుగంధవంతములు నగు తామరలును ఉదయ సూర్యునివలె పూర్ణచద్రునివలెకాచిన బంగారువలె అవిసె పూలవలె చిలుక ఱక్కలవలె మెరయు మెట్టయందుపూచ పూలుసు ఐదు వన్నెలు ఇంకను ఎక్కువ వన్నెలు కలిగి చూపఱ కంటికింపు కలిగించు మరి ఇతర పుష్పములును చంద్రునివలె వహ్ని జ్వాలలవలె మెరయ శుభములగు గజ వక్త్రోత్పలములును (కలువ) నీలోత్పలములును కర్పూర పుష్పములును గుంజాతకములును కళేరుకములును శృంగాటకములును నృగాలములును భరటములును స్థలోత్పలములును (మెట్ట కలువలు) మరికొన్ని నీటియందు మెట్టయందు మొలచి పెరుగు కందమూలఫల పుష్ప విశేషములును మునుల కాహారములగు వివిధ నీవాద ధాన్యములును ఆ ప్రదేశమునందు ఆ రాజునకు కనవచ్చెను.

స్వర్గమందో నరలోకమందో జలప్రాయ ప్రదేశములందు గాని మెట్టపైగాని వనములందుగాని లభించు ఆయా జాతులలో అచట లేని ధాన్యము కాని పుష్పముకాని శకము కాని ఫలముకాని కందముకాని మూలము కాని ఏదియు నుండదు. అవి అన్నియు ఎల్లప్పుడు ఫల పుష్పములను కందమూలాదికమును ఇచ్చునదే కాని ఋతు లక్షణ వశమున నశించునవి కావు. తపశ్చర్యకివి యన్నియు ఉపయుక్తములను అనుకూలములును అగుననుకొనుచు రాజవి యన్నియు చూచుచుండెను.

దదృశేచ తథాతత్ర నానారూపపత త్రిణః | మయూరా ఞ్చితపక్షాంశ్చ కాకకఙ్చాంశ్చ కోకిలా&. 50

బకా న్కాదమ్బకా& హంసా న్కోయష్టీ& ఖఞ్టరీటకా& | కుక్కుటా న్కాష్ఠకూటాంశ్చ ఖట్వాఙ్గా న్లుబ్ధకీం స్తథా. 51

గౌక్షేడకాం స్తథాకుమ్భా& ధార్తరాష్ట్రా ఞ్ఛుకాన్బకా& | ధాతుకాం శ్చక్రవాకాంశ్చ కటుకా న్టిట్టిభా& దృభా&. 52

పుత్త్రప్రియా న్లోహపృష్ఠా న్గోచర్మగిరివర్తకా& | పారావతాంశ్చకమలా ఞ్ఛారికా జీవజీవకా&. 53

లావవర్తకవర్తాంశ్చ రక్తవత్సప్రభద్రకా& | తామ్రచూడా న్త్స్వర్ణచూడా న్కుక్కుటా న్కాష్ఠకుబ్జకాన్‌.

కపిఞ్జలా న్కలవికాం స్తథా కుఙ్కుమచూడకా& | భృఙ్గరాజా& సారవాదా& భుల్లిఙ్గా& పిణ్డమానవాన్‌.

మంజుళీతక దాత్యూహాన్వ్యా ధాన్యాత్రాన్త్స పక్షకాన్‌ | భారద్వాజాం స్తథా చాషా న్త్సుపర్ణానంజలీయకాన్‌.

భౌమపుత్త్రా న్త్సదాజ్వాలాన్త్సుపర్ణాన్భాజనాన్తికా& | ఏతాంశ్చాన్యాంశ్చ బహుశః పక్షిసఙ్ఘా న్మనోహరా&. 57

శ్వాపదా న్వివిధాకారా న్మృగాంశ్చైవ మహామృగా& | వ్యాఘ్రాన్కేసరిణ స్సింహా& ద్వీపిన శ్శరభా న్వృకాన్‌. 58

ఋక్షాం స్తరక్షాంశ్చ మృగా న్గోలాఙ్గాలాంశ్చ వానరా& | శశకా న్మశకా న్దంశా న్మార్జారా న్వాయువేగినః.

మూషికా న్నకులా న్కాంశ్చి చ్ఛివనోడవకాలకా& | తథా మత్తాంశ్చ న్గోమహిష్యశనా న్వృకా&.

చామరా న్త్సృమరాంశ్చైవ తథా గౌరముఖాం స్తథా | ఉరభ్రాంశ్చ తథౄ మేషాం త్సారఙ్గా నథ కుక్కుటా&. 61

తరక్షూ నృక్షకానృక్షా& క్షపక్వాన్కుకురాన్మృగా& | నీలాన్మృగా న్మర్కటకా న్మహానీలాంశ్చ రావకా&. 62

శ్వదంష్ట్రా న్రామశరభా& కోరకారకసఞ్చరా& |

ఇవికాక యారాజు చూడ ఇంపుగొలుపు వివిధ పక్షులను-పలువన్నెల వెలయు ఱక్కలీకలుకల నెమళ్ళు కాక కంక కోకిల బక కాదంబక హంసకోయష్టిఖంజరీట కుక్కుట కాష్టకూట ఖట్వాంగ లుబ్ధకి గౌక్షేడక కుంభ ధార్త రాష్ట్ర శుక ధాతుక చక్రవాక కటుక టిట్టిభ పుత్రప్రియలోహపృష్ఠ గోచర్మ గిరివర్తక పారావత కమల శారికా జీవంజీవకలావ-వర్తక-వర్త రక్తవత్స ప్రభద్రక తామ్రచూడకుక్కుట స్వర్ణ చూడకుక్కుట కాష్ఠకుబ్జక కపింజల కల వింక కుంకుమ చూడక భృంగరాజ సారపాద భుల్లింగ పిండమానవ మంజుళీతక దాత్యూహ వ్యాధసపక్షక యాత్ర భారద్వాజచాష సుపర్ణాంలీయక భౌమ పుత్త్ర సదాజ్వాల భాజనాంతికములు అనెడి వానిని చూచెను. మనోహరములగు వేరువేరు పక్షులమందలును ఆ మద్రరాజ పురూరవసునకు అట కననయ్యెను.

మరియు వివిధాకారములగు వన్య క్రూర మృగములు మహామృగములు వ్యాఘ్రములు కేసరయుత సింహములు ద్వీపి శరభ వృక ఋక్షతరక్షు మృగగోలాంగూల వానర శశకమశక దంశ (వాయువేగి) మార్జాల మూషికనకుల శివనోడవకాలక మత్తగజ గోమహిష్యశన వృక చమర నృమర గౌరముఖోరభ్రమేష మేష సారంగ కుక్కుట (ఇది ఒక మృగము-కోడికాదు) తరక్షు ఋక్షక ఋక్షక్షపక్వకుకుర మృగ మర్కటక (చిరుకోతులు) మహానీలరావకశ్వ దంష్ట్ర రామశరభ కోరకారక సంచర కరాళకృతమాలకాలపుచ్ఛతోరణోష్ట్ర ఖడ్గవరాహ తురగ గర్దభములను ఆ రాజున కచట కాననయ్యెను.

కరాళౄన్కృతమాలాంశ్చ కాలపుచ్ఛాన్త్సతో రణా&. 63

ఉష్ట్రా న్ఖడ్గా న్వరాహాంశ్చ తురఙ్గవర గర్దభా& | ఏతా నన్వీక్ష్య విరుద్ధాంశ్చ పరస్పరమ్‌. 64

అవిరుద్ధాం శ్చ తే తస్మి న్నిర్వృతిం పరమాం య¸° | తదాశ్రమం పరంపుణ్యం సతు మద్రేశ్వరో నృపః. 65

తత్ప్రభావా త్ప్రభాయుక్తం స్థావరై ర్జఙ్గమై స్తథా | హింస న్తిహి నచాన్యోన్యం హింసకాస్తు పరస్పరమ్‌. 66

క్రవ్యాదాః ప్రాణిన స్తత్ర సర్వే క్షీరఫలాశినః | నిర్మితం తచ్చ తద్వద్వై చాత్రిణాతు మహాత్మనా. 67

శిలాయాం నిమ్మదేశే చావసత్తత్ర స్వయంనృపః | పయఃక్షర న్తి తే దివ్య మమృతస్వాదుసన్నిభమ్‌. 68

క్వచిద్గ్రామ్య మహిష్యశ్చ క్నచిద్గావశ్చ సర్వశః | గోక్షిరేణచ సమ్పూర్ణా దధ్నా చాన్యత్రవా బహు. 69

సోపశ్య త్పరమాం ప్రీతి మవాప వసుధాధిపః | సరాంసి తత్ర దివ్యాని నద్యశ్చ విమలోదకాః. 70

ప్రణాళికా న్యశోష్యాణి శీతలానిచ భాగశః | కన్దరాణిచ శైలస్య సుసేవ్యాని పదేపదే. 71

హిమపాతో న తత్రాస్తే సమన్తా త్పఞ్చయోజనమ్‌ | ఉపత్యకాసు శైలస్య శిఖరేషు విద్యతే. 72

తత్రాస్తి రాజచ్ఛిఖరం పర్వతేన్ద్రస్య పాణ్డరమ్‌ | హిమపానం సమాదాయ ఘనాః కుర్వన్తి సంహతాః. 73

తత్రాస్తి చాపరంశృఙ్గం సదాతోయఘనావృతమ్‌ | నిత్యమేవాభివర్షన్తి శిలాభి శ్శిఖరంపరమ్‌. 74

తత్పరం సుమనోహారి యత్ర కామహరో హరః | సురముఖ్యోపయోగిత్వా చ్ఛాఖిన స్పఫలాన్సదా. 75

సదోపగీతభ్రమరా స్సుర స్త్రీసేవి తాస్సురాః | సర్వపాపక్షయకరం శైలసై#్యవం మనోహరమ్‌. 76

వానరైః క్రీడమానాశ్చ దేశేదేశే నరాధిప | హిమపుఞ్జకృతా స్తత్ర పూర్ణబిమ్బసమప్రభాః. 77

తమాశ్రమం సమన్తాచ్చ హిమసంరుద్ధకన్దరైః | శైలవాటైః పరివృతం మనుజై స్సదా. 78

పూర్వారాధితభాగ్యోసౌ మహారాజః పురూరవాః | తమాశ్రమ మనుప్రాప్తో దేవదేవప్రసాదతః. 79

తమాశ్రమం శ్రమహరం సుగన్ధంచ మనోహరమ్‌ |

సుపుష్పితైః కుసుమశ##తై రలఙ్కృతం కృతంస్వయం రుచిర మథాత్రిణా శుభమ్‌. 80

సుయోగదం మునివరసేవితం మహ చ్ఛుభావహం సతు దదృశేథ మద్రరాట్‌. 81

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవ్చరితే హిమవద్‌ వృక్షాదివర్ణనం నామ సప్తదశోత్తర శతతమోధ్యాయః.

మద్రరాజునకు కనబడిన ఈ మృగములలో పరస్పర సహజ విరోధము కలవియు కలవు. ఐనను నవి విరోధము లేక మెలగుటచూచి ఆతడు మిగుల ఆనందము చెందెను. ఈ ఆశ్రమము మిగుల పుణ్యకరము. అది ఎవరిదో ఆ మహనీయుని ప్రభావమున అచటి స్థిర (వృక్షాది) చర (పక్షిమృగాది) ప్రాణులన్నియు కాంతిమంతములయి వెలుగొందు చుండెను. అచటి పక్షి మృగములలో పరస్పర హింసకములును ఆ లక్షణము లేక శాంతితో నుండెను. అచట మాంసాహారి ప్రాణులన్నియు పాలు పండ్లు త్రాగి తిని జీవించును. మహాత్ముడగు ఆత్రిముని దానినిఇట్టి దానినిగా నొనర్చెను. (అచటి ఈ ప్రశాంతతకు ఆ మహాత్ముని ప్రభావము హేతువు.)

ఆరాజు తానచట ఒక పల్లమున శిలపై కూర్చుండెను. అచటి గ్రామ్య (ఆరణ్యములుకాని) గేదెలను ఆవులు అమృతమువంటి రుచికల పాలు స్రవించుచుండెను. అచటి తావులన్నియు ఆలపాలతో పెరుగుతో మిక్కిలిగ నిండి ఉండుటచూచి యారాజు మిగుల ఆనందమందెను. అచటి సరస్సులు దివ్యములు. నదులు నిర్వలోదకములు-ఊటలన్నియు ఎండనివి చల్లనివి; అడుగడుగున గుహలు తమ్ము చేరిన వారికానందప్రదములు. ఆ చుట్టుపట్టుల ఐదు యోజనముల మేర పర్వత సమీప భూములందుకాని పర్వత శిఖరములందు కాని హిమపాతము లేదు.

అచట మంచును త్రావి ఘనీభవించి తెల్లనై వెలుగొందు మేఘములతో నిండి ప్రకాశించు హిమాలయపు శిఖరము ఒకటి కలదు. అచటి పరిసరములందే ఎల్లవేళల సజలములగు జలదములతో నిండి కనులపండువు గేయు శిఖరమింకొకటి కలదు. ఆ మేఘములా శిఖరమును తమ వాన నీటితో నెల్లవేళల తడుపుచుండును. కామహరుడగు హరుడే కోరి సదా ఆట నివసించునన ఆ ప్రదేశము మిగుల మనోహరమని మరి చెప్పవలెనా?

దేవ ముఖ్యులు అచట నెల్లవేళల సుఖము లనుభవించుచు ఆనందించుచుందురు. అందులకు అనుకూలముగానే ఆ శిఖరమందలి ఫల వృక్షములన్నియు నిరంతరము సఫలములు; అచటి పూల-పండ్ల సుగంధములచే నాకర్షింపబడు తుమ్మెదలు సదా రొద సేయుచుండును. అచట తమ అంగనల సేవలందుకొనుచు దేవతలానంద విహారములు సేయు చుందురు. ఆ పర్వత శిఖరము ఇట్లు సుమనోహరమగులతోపాటు సర్వపాప క్షయకరమయి యుండెను. ఆయా ప్రదేశము లందు క్రీడించుచుండు వానరములు చూపఱకు కుతూహల వినోదములు కలిగించుచుండును. అచటనచట కనవచ్చు హిమరాశి ఘనములు పూర్ణ చంద్ర బింబమువలె ప్రకాశించుచుండును.

ఇట్టి ఆ ఆశ్రమమునకు అన్నివైపులను మంచుతో మూతవడిన గుహలును చిరుకొండల వరుసలును ఉండి మనుజులకు ఎన్నడును అగమ్యములయి యుండెను. అయినను పూర్వ పుణ్య కర్మానుష్ఠానమున అదృష్టమును సంపాదించినవాడగుటచేతను దేవదేవుడగు శివుని యనుగ్రహమునను మద్రమహారాజా పురూరవుడు అటకు చేరి ఆ ఆత్రి మున్యాశ్రమమును చేరగలిగెను. అత్రి మహాముని తనకై ఏర్పరచుకొనినదియు ఆ మహనీయుని తపోబలముచే వర్ధితమహిమమును శ్రమ హరమును సుగంధయుతమును మనోహరమును చక్కగా పూచి వికసించిన నూరులకొలది పూలతో అలంకృతమును యోగసిద్ధి ప్రదమగుటచే ముని శ్రేష్ఠులకును ఆశ్రయమును శుభావహమును అగు ఆ ఆశ్రమమును ముద్ర భూపాలుడు సంతనముతో కాంచెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరతవర్షస్థ భరతఖండ వర్ణనము పురూరవశ్చరితమున హిమవత్పర్వత వృక్షాది వర్ణనమున అత్రి మున్యాశ్రమ వర్ణనమను నూట పదునేడవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-1    Chapters