Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వాదశో7ధ్యాయః.

ఇళాన్వేషణార్థ మిక్ష్వాకు ప్రభృతీనాం శరవణగమనమ్‌.

సూతః: అథాన్విషన్తో రాజానం భ్రాతర స్తస్య మానవాః | ఇక్ష్వాకు ప్రముఖా జగ్ము స్తథా శరవణా న్తికమ్‌.

తతస్తే దదృశు స్సర్వే బడబా మగ్రత స్థ్సితామ్‌ | రత్న పల్యాణకిరణదీప్తకాయా మనుత్తమామ్‌. 2

పల్యాణప్రత్యభిజ్ఞానా త్సర్వే తే విస్మయం గతాః | ఆయం చన్ద్రప్రభో నామ వాజీ తస్య మహాత్మనః. 3

అగమ ద్బడబారూప ముత్తమం కేన హేతునా | తతస్తు మైత్రావరుణిం పప్రచ్ఛు స్తే పురోధసమ్‌. 4

కిమిత్యేత దభూ చ్చిత్రం వద యోగవిదాం వర | వసష్ఠో7ప్యబ్రవీ త్సర్వం దృష్ట్వాత ద్జానచక్షుషా. 5

సమయ శ్శమ్భుదయితాకృత శ్శరవణ పురా | యః పుమా న్ర్పవిశే దత్ర స నారీత్వ మవాస్స్యతి. 6

అయ మశ్వోపి నారీత్వ మగా ద్రాజ్ఞా సహైవ తు | పునః పురుషతా మేతి యథా7సౌ ధనదోపమః. 7

తథైవ యత్న ః కర్తవ్య ఆరాధ్యాథ పినాకినమ్‌ | తతస్తే మానవా జగ్ము ర్యత్ర దేవో మహేశ్వరః. 8

తుష్టువు ర్వివిధై స్త్సోత్రైః పార్వతీపరమేశ్వరౌ | తా వూచతు రలఙ్ఘ్యో7యం సమయః కిం తే సామ్ర్పతమ్‌.

ఇక్ష్వాకో రశ్వమేధేన యత్ఫలం స్యాత్తదా77వయోః | దత్తా కిమ్పురుషో వీర స్స భవిష్య త్యసంశయః.

ద్వాదశాధ్యయము.

ఇలుని వెదకుడటకై ఇక్ష్వాకు ప్రభృతులు శరవణమునకు పోవుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: అనంతరము వైవస్వత మను కుమారులగు ఇళుని సోదరులు ఇక్ష్వాకుడు మొదలగు వారు రాజగు ఇళుని వెదకుచు శరవణోద్యాన సమీపమునకు వెళ్ళిరి. వారికి అందరకు అచ్చట తమ ఎదుట ఒక ఆడు గుర్రము కనబడెను. దాని మేను రత్నములు తాపటము చేసిన పల్యాణము (జీను)తో ప్రకాశించుచుండెను. ఆ బడబ చాల ఉత్తమ మయినది. ఉత్తమ లక్షణములు కలది వారు ఆ పల్యాణమును గుర్తించిరి. అది తమ రాజగు ఇళుని అశ్వమునకు సంబంధించినదే. అని తెలిసి వారాశ్చర్యపడిరి. ఇది ఆ మహాత్ముని (ఇళుని) చంద్రప్రభమను పేరు గల గుర్రమే. ఇది ఉత్తమ మగు బడబగా మారినది. ఇందులకు హేతువు ఏమి ? అని ఆలోచించిరి. తరువాత వారు తమ పురోహితుడగు వసిష్ఠునిక డకు పోయి ''అయ్యా! మీరు యోగవేత్తలలో శ్రేష్ఠులు. ఎందువలన ఈ విచిత్రము జరిగెనో తెలుపుడు '' అని వేడిరి

వసిష్ఠుడును తన జ్ఞానమయ నేత్రముతో చూచి ఇట్లు చెప్పెను: ''ఈ శరవణమున ప్రవేశించిన పురుష ప్రాణి స్త్రీత్వమును పొందును. అని పూర్వము పార్వతి ఈ ఉద్యానము విషయమున వ్యవస్థ చెసెను. దాని చేతనే (దీనిలో ప్రవేశించినందున) రాజుతో పాటుగానే ఈ అశ్వము గూడ స్త్రీత్వమును పొందినది. కుబేరునితో సమానుడగు ఈ ఇళరాజు మరల వురుషుడగు నట్లుగా యత్నము చేయవలసి యున్నది. అందులకై పరమేశ్వరుని ఆరాధించి అనుగ్రహింప జేసికొనవలసి యున్నది.''

అంతట ఆమను పుత్త్రులు మ హేశ్వరుడు ఉన్న చోటికి పోయిరి. పార్వతీ పర మేశ్వరులను వివిధ స్తోత్రములతో స్తుతించిరి. వారు వీరితో ఇట్లు పలికిరి. ''ఈ వ్యవస్థ దాటరానిది, కాని ప్రస్తుతమున ఇట్లు చేయుడు. ఇక్ష్వాకుడు అశ్వమేధము చేసి దాని ఫలమును మాకు అర్పణ చేయవలయును. దాని వలన ఇళ (మరల పురుషుడై) కింపురుషుడుగా అగును.''

తథేత్యుక్త్వా తత స్తే తు ర్వైవస్వతాత్మజాః | ఇక్ష్వాకో రశ్వమేధేన ఇళా కిమ్పురుషో7భవత్‌. 11

మాస మేకం పుమా న్వీర స్త్ర్సీ చ మాస మభూత్పునః | బుధస్య భవనే *తిష్ఠ న్నిళా గర్భధరా7భవత్‌.

అజీజన త్పుత్త్రమేక మనేకగుణ సంయుతమ్‌ | బుధ ఉత్పాద్య తం పుత్త్రం స్వర్గమేవాగమ త్తతః. 13

ఇళస్య నామ్నా తద్వర్ష మిళావృత మభూ త్తదా | సోమార్కవంశయో రాజా ఐళో7భూ ద్వంశవర్ధనః. 14

స్త్రీరూపిణ ఇళస్య ఐళోత్పత్తిః.

ఏవం పురూరవాః పుంసో రభవ ద్వంశవర్ధనః | ఇక్ష్వాకో రర్కవంశస్య తథైవో క్త స్తపోధనాః. 15

ఇళా కిమ్పురుషత్వే చ సుద్యమ్న ఇతి చోచ్యతే | పునః పుత్త్రత్రయ మభూ త్సుద్యుమ్న స్యాపరాజితమ్‌.

ఉత్కలో7థ గయ స్తద్వ ద్ధరితాశ్వో7థ వీర్యవా9 | ఉత్క లస్యోత్కలా నామ గయస్య తు గయా మతా.

హరితాశ్వస్య దిక్పూర్వా విశ్రుతా కురుభి స్సహ | ప్రతిష్ఠానే7భిషిచ్యాథ స పురూరవసం సుతమ్‌. 18

జగామేళో వ్రతం భోక్తుం దివ్యవర్షఫలాశనమ్‌ | ఇక్ష్వాకు రస్య దాయాదో మధ్యదేశ మవాప్ను యాత్‌. 19

నరిష్య న్తస్య పుత్త్రో7భూ చ్ఛఫో నామ మహాబలః | నాభాగస్యామ్బరీషస్తు ధృష్టస్య తు సుతత్రయమ్‌. 20

ధృష్ట కేతు శ్చిత్రనాధో రణధృష్టశ్చ వీర్యవా9 | ఆనర్తో నామ శర్యాతే స్తత్కన్యా చైవ దారికా. 21

ఆన ర్తస్యా7భవ త్పుత్త్రో రోచమానః ప్రతాపవా9 | ఆనర్తో నామ దేశో7భూ న్నగరీ చ కుశస్థలీ. 22

రోచమానస్య రేవో7భూ ద్రేవా ద్రైవత ఏవ చ | కుకుద్మాం శ్చాపరో నామ్నా జ్యేష్ఠః పుత్త్రశతస్య చ. 23

రేవతీ తస్య సా కన్యా భార్యా రామస్య విశ్రుతా | కరూశస్యతు కారూశా బహవః ప్రథితా భువి. 24

ఆ మాట విని ఆ మనుపుత్త్రులందరును అట్లేయని వెళ్ళిరి. ఇక్ష్వాకుడు అశ్వమేధము చేసి తత్ఫలమును పార్వతీ పరమేశ్వరులకు అర్పించెను. ఇళ (ఇళుడు) కింపురుషుడయ్యెను. తరువాత ఆ వీరుడు ఒక మాసము పురుషుడుగా ఒక మాసము స్త్రీగా అయ్యెను. ఇళుడు ఇళగా బుధుని గృహమున ఉన్న కాలములో ఆమె గర్భము ధరించెను. ఆమెకు అనేక సద్గుణములు గల ఒక కుమారుడు కలిగెను. ఇట్లు (ఇళా గర్భమున) ఒక కుమారుడు కలిగిన తరువాత బుధుడు మరల స్వర్గ లోకమునకు పోయెను. ఇళ పేరట ఆ దేశ భాగమునకు ఇళావృత వర్షమను పేరు వచ్చెను. (ఇది బహుశః నేటి మంగోలియా) ఇట్లు ఇళ కుమారుడగు ఐళుడు చంద్ర సూర్య వంశముల రెంటి నుండియు పుట్టిన వాడై ఆ వంశములకు వృద్ధిని (అభివృద్దిని శుభమును) కలిగించు వాడయ్యెను. అతని పేరు పురూరవసుడు. అతడు చంద్ర వంశమును వృద్ధి చేయువాడయ్యెను. ఇక్ష్వాకుడు సూర్యవంశక ర్త అయ్యెను.

ఇళుడు స్త్రీత్వమున తన కుమారుడగు పురూరవసుని ప్రతిష్ఠానము అను నగరము రాజధానిగా (ఆర్యావర్త భాగమునకు) రాజుగా అభి షేకించి తాను కంద మూల ఫలములాహారముగా వానప్రస్థవ్రతమును అనుష్ఠించుటకై వనమునకు ఏగెను.

ఇళుని సోదరుడగు ఇక్ష్వాకుడు మధ్యదేశమునకు (హిమాలయము వింద్యము వినశనము ప్రయాగ ఈ నాలుగు ఎల్లలకు నడుమ ఉండు దేశమునకు) రాజయ్యెను. నరిష్యంతుని కుమారుడు శపుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. ధృష్టునకు ధృష్టకేతుడు చిత్రనాథుడు రణధృష్టుడు అనువారు ముగ్గురు కుమారులు. ఆనర్తుడను కుమారుడును దారికా అను కన్యయును శర్యాతి సంతానము. ఆనర్తుని కుమారుడు ప్రతాపశాలియగు రోచమానుడు. అతని ఉదేశము ఆనర్తము. అతని రాజదాని కుశస్థలి. ఆనర్తుని కుమారుడు రేవుడు. అతని కుమారుడు రైవతుడు. అతనికే కకుద్మాన్‌ అనియు పేరు. ఇతడు రేవుని కుమారులు నూరుమందిలో జ్యేష్ఠుడు రైవతుని కూతురు రేవతి బలరాముని భార్యగా ప్రసిద్ధురాలు. కరూశునకు చాలమంది కుమారులు కలిగిరి. వారు కారూశులు అను పేర ప్రసిద్ధులు. పృషధ్రుడు (పృషదశ్వుడేమో?) గోవధమువలన తనగురుని శాపముచే శూద్రత్వమును పొందెను.

వృషధ్రో గోవధా చ్ఛూద్రో గురుశాపా దజాయత | ఇక్ష్వాకువంశం వక్ష్యామి శృణధ్వ మృషిసత్తమాః. 25

ఇక్ష్వాకోః కుక్షినామా7థ మికుక్షి ర్నామ దేవరాట్‌ | జేష్ఠః పుత్త్రశతస్యాసీ ద్దశ వఞ్చ చ తత్సుతాః 26

మేరో రుత్తరత స్తే తు తు జాతాః పార్థివసత్తమాః | చతుర్దశో త్తరం చాశు శత మన్యం తదా7భవత్‌. 27

మేరో ర్దక్షిణతో యే వై రాజాన స్సమ్ర్పకీ ర్తితాః | జ్యేష్ఠః కకుత్థ్సనామాభూ త్తత్సుతశ్చ సుయోధనః. 28

తస్య పుత్త్రః పృథుర్నామ విశ్వశాఖః పృథోస్సుతః | ఇన్దు స్తస్యచ పుత్త్రోభూ ద్యవనాశ్వ స్తతో7భవత్‌.

శ్రావ స్తశ్చ మహాతేజా వత్సక స్తత్సుతో7భవత్‌ | నిర్మితా యేన శ్రావస్తీ గౌడదేశే ద్విజో త్తమాః. 30

వత్సా ద్విహర్షక శ్చాభూ త్కులాద స్తత్సుతో7భవత్‌ | దున్దుమారత్వ మగమ ద్దున్దో ర్నా శేన యః పురా.

తస్య పుత్త్ర స్త్రయో జాతా దృఢాశ్వో దణ్డ ఏవ చ | కపిలాశ్వశ్చ విఖ్యాతో దౌన్దుమారిః ప్రతాపవా9.

దృఢాశ్వస్య ప్రమోదస్తు హర్యశ్వ స్తస్య చాత్మజః |హర్యశ్వస్య నికుమ్భో7భూ త్సంహతాశ్వ స్తతో7భవత్‌.

అకృతాళ్వో రణాశ్వశ్చ సంహతాశ్వసుతా పుభౌ | యువనాశ్వో రణాశ్వాత్తు మాంధాతా తత్సుతో7భవత్‌.

మాన్ధాతుః పురుకుత్సోభూ ద్ధర్మ కేతుశ్చ పార్థివః | ముచుకున్దశ్చ *విఖ్యాత శ్చక్రవర్తీ ప్రతాపవా9. 35

పురుకుత్సస్య పుత్త్రోభూ ద్వసుదో నర్మదాపతిః | సమ్భూతి స్తస్య పుత్త్రోభూ త్త్రిధన్వా చ తతో7భవత్‌.

త్రిధన్వన స్సుతో జాత సై#్త్రయారుణ ఇతి స్మృతః | తస్య సత్యవ్రతో నామ తస్మా త్సత్యరథ స్స్మతః.

తస్య పుత్త్రో హరిశ్చన్ద్ర హరిశ్చన్ద్రస్య లోహితః | లోహితాచ్చ వృకో జాతో వృకా ద్బాహు రజాయత.

సగర స్తస్య పుత్త్రో భూ ద్రాజా పర మధార్మికః | ద్వే భార్యే సగరస్యాపి ప్రభా భానుమతీ తథా. 39

తాభ్యా మారాధితః ¨పూర్వ మౌర్వో వై పుత్త్రకామ్యయా |

ఔర్వ స్తుష్ట స్తయోః ప్రాదా ద్యథేష్టం వర ముత్తమమ్‌. 40

ఏకా షష్టి సహస్రం తు సుత మేకం తథా7పరా | జగృ హే వేదకర్తారం ప్రభా «గృహ్ణా త్సుతా న్బహూ9.

ఏకం భానుమతీ పుత్త్ర మసృజద్వా7సమఞ్జసమ్‌ | ఏకా షష్టిసహస్రం తు సుషువే సా రవిప్రభూ. 42

ఖనన్తః పృథివీం దగ్ధా విష్ణునా యేన మార్గణ | అసమఞ్జస్య తనయో హ్యంశుమాన్నామ విశ్రుతః. 43

ఋషిస త్తములారా! ఇక్ష్వాకు వంశమును చెప్పబోవుచున్నాను వినుడు. ఇక్ష్వాకునకు కుక్షి-కుక్షికి వికుక్షి అను రాజశ్రేష్ఠుడు కలిగెను. ఇతడు కుక్షి పుత్త్రుల నూరుగురలో పెద్దవాడు. వికుక్షి కుమారులలో పదునై దుమందియే పర్వతపుటు త్తర దేశమునకు ప్రభువులైరి. (ఇచ్చట ఇక్ష్వాకు కుమారుడే వికుక్షియని కొన్ని ప్రతులలో కలదు.) వీరుకాక ఇంకను నూట పదునాల్గుమంది వికుక్షి కుమారులు మేరువునకు దక్షినపు దేశమును పాలించిరి. వీరిలో పెద్దవాడు కకుత్థ్సుడు. అతని కొడుకు సుయోధనుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విశ్వశాఖుడు. అతని కొడుకు ఇంద్రుడు. అతని కొడుకు యవనాశ్వుడు. అతని కొడుకు శ్రావస్తుడు అతని కొడుకు వత్సకుడు. శ్రావస్తుడు గౌడ దేశములో తన పేర శ్రావస్తీ నగరము నిర్మించెను. వత్సుని కొడుకు విహర్షకుడు. అతని కొడుకు కులాదుడు. అతడు దుందు అనువానిని చంపినందున దుందుమారుడని ప్రసిద్ధి పొందెను. అతనికి దృఢాశ్వుడు దండుడు కపిలాశ్వుడు అను ముగ్గురు కుమారులు. దృఢాశ్వుని కుమారుడు ప్రమోదుడు. అతని కుమారుడు హర్వశ్వుడు. అతని కుమారుడు నికుంభుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. అతనికి అకృతాశ్వుడు రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు. రణాశ్వుని కుమారుడు యవనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారులు పురుకుత్సుడు-ధర్మ కేతుడు-ముచుకుందుడు శత్రుజిత్‌ అను వారు నలుగురు. పురుకుత్సుని కుమారుడు వసుదుడు. అతడు నర్మదకు పతి. అతని కొడుకు సంభూతి. అతని కొడుకు త్రిధన్వుడు. అతని కుమారుడు త్త్రె యారుణుడు. అతని కుమారుడు సత్యవ్రతుడు. అతని పుత్త్రుడు సత్యరథుడు. అతని

_____________________________________

*విఖ్యాతశ్శత్రుజిచ్చ. ¨పూర్వమౌర్వాగ్నిః. «గృహ్య.

సుతుడు హరిశ్చంద్రుడు. అతని తనయుడు లోహితుడు. అతని కుమారుడు. వృకుడు. అతని కొడుకు బాహుడు. అతని పుత్త్రుడు సగరుడు. అతడు పరమ ధార్మికుడు. అతనికి ప్రభ బానుమతి అను ఇద్దరు బార్యలు. వారు పుత్త్రులను కనగోరి ఔర్వమునిని ఆరాధించిరి. అతడు మెచ్చి వారికి కోరిన వరములనిచ్చెను. ఆ వరప్రభావమున ప్రభకు ఆరువదివేలమంది కుమారులు కలిగిరి భానుమతికి అసమంజుడు అను ఒకే కుమారుడు కలిగెను. వారిలో ఆరువదివేలమందియు భూమిని త్రవ్వుచు (కపిలరూపుడగు) విష్ణునిచే దగ్ధులైరి. అసమంజుని కుమారుడు అంశుమంతుడని ప్రసిద్ధినొందెను.

తస్య పుత్త్రో దిలీపస్తు దిలీపాత్తు భగీరథః | యేన భాగీరథీ గఙ్గా త ప స్తప్త్వా7వతారితా. 44

భగీ ర థస్య తనయో నాభాగ ఇతి విశ్రుతః | నాభాగస్యామ్బరీషో7భూ త్సిన్ధుద్వీప స్తతో7భవత్‌ 45

తస్యా యుతాయః పుత్త్రోభూ దృతుపర్ణ స్తతో7భవత్‌ | తస్య కల్మాషపాదస్తు సర్వకల్ప స్తతో7భవత్‌.

తస్యానరణ్యః పుత్త్రోభూ న్ని ఘ్న స్తస్య సుతో7భవత్‌ | నిఘ్న పుత్త్రా పుభౌ జాతా వనమిత్ర రఘూ నృపౌ.

అనమిత్రో వన మగా ద్భవితా స కృతే సృపః | రఘో రభూ ద్దిలీవస్తు దిలీపా దజక స్తథా. 48

దీర్ఘబాహు రజా జ్జాత స్త్వజపాల స్తతో7భవత్‌ | తతో దశరథో రాజా తస్య పుత్త్రచతుష్టయమ్‌. 49

నారాయణాంశజా స్స ర్వే రామ స్తేస్వగ్రజో7భవత్‌ | రావణా న్తకర స్తద్వ ద్రఘూణాం వంశవర్ధనః. 50

వాల్మీకి స్తస్య చరితం చ క్రే భార్గవసత్తమః | తస్య పుత్త్రౌ కుశలవా విక్ష్వాకుకులవర్ధనౌ. 51

అతిథిస్తు కుశా జ్జజ్ఞే నిసధ స్తస్య చాత్మజః | నళస్తు నిషధా త్తస్మా న్నభా స్తస్మా దజాయత. 52

సభనః పుణ్డరీకోభూ తేక్షమధన్వా తత స్స్మృతః | తస్య పుత్త్రోభవ ద్వీరో దేవానకః ప్రతాపవా9. 53

అహీనగ స్తస్య సుత స్సహస్రాశ్వ స్తతః పరః | తత శ్చన్ద్రావలోకస్తు తారాపీడ స్తతో7భవత్‌. 54

తస్యాత్మజ శ్చన్ద్రగిరి ర్భానుచిత్ర స్తతో7భవత్‌ | శ్రుతాయు రభవ త్మస్మా ద్భారతే యో నిపాతితః. 55

నళౌ ద్వావేవ విఖ్యాతౌ వంశే కశ్య పసమ్భవే | వీర సేనసుత స్తద్వ న్నై షధ శ్చాపరో మతః. 56

ఏవం వివస్వతో వంశే రాజానో భూరిదక్షిణాః | ఇక్ష్వాకు వంశప్రభవాః ప్రాధాన్యేన ప్రకీర్తితాః. 57

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే సూర్యవంశవర్ణనం నామ ద్వాదశో7ధ్యాయః.

అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. అతడే తపస్సుచే గంగను భూమికి తెచ్చెను. కనకనే గంగ భాగీరథియైనది. అతని కొడుకు నాభాగుడు. అతని కుమారుడు అంబరీషుడు. అతని కుమారుడు సింధుద్వీపుడు. అతని సుతుడు అయుతాయుడు. అతని పుత్త్రుడు ఋతుపర్ణుడు. అతని కొడుకు కల్మాషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు. అతని కొడుకు అనరణ్యుడు. అతని కుమారుడు నిఘ్నుడు. అతనికి అనమిత్రుడు రఘువు అను ఇద్దరు కుమారులు. రఘుని కుమారుడు దిలీపుడు. అతని కుమారుడు అజుడు. అతని సుతుడు దీర్ఘ బాహువు. అతని పుత్త్రుడు అజపాలుడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి నారాయణుని అంశవలన నలుగురు కుమారులు కలిగిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు. రావణుని అంతమొందించినవాడు అతడే. ఆయన రఘువుల వంశమునకు సమృద్ధిని శుభమును కలిగించినవాడు. భృగువంశ శ్రేష్ఠుడగు వాల్మీకి అతని చరితమును రచిం ను. ఇక్ష్వాకు వంశ వర్ధనులగు లవకుశులను ఇద్దరు అతని కుమారులు. కుశుని కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. అతని కుమారుడు నళుడు. అతని కుమారుడు నభుడు. అతని కుమారుడు పుండరీకుడు. అతని కొడుకు క్షేమధన్వుడు. అతని కుమారుడు వీరుడు ప్రతాప వంతుడునగు దేవానీకుడు. అతని కొడుకు అహీనగుడు. అతని కుమారుడు సహస్రాశ్వుడు. అతని కొడుకు చంద్రావ లోకుడు. ఆతని కుమారుడు తారాపీడుడు. అతని కుమారుడు చంద్రగిరి. అతని సుతుడు భానుచిత్రుడు. అతని పుత్త్రుడు శ్రుతాయువు. భారతయుద్ధము మరణించిన శ్రుతాయువు ఇతడే. కశ్యపవంశమున పుట్టి ప్రసిద్ధినొందిన నళులు ఇద్దరు. వారిలో ఒకడు వీరసేనుని కుమారుడు. మరియొకడు నిషధుని కుమారుడగుటచే నైషధునబడిన నళుడు.

వివస్వంతుని (సూర్యుని) వంశమున జన్మించి బంగారునాణములనే బంగారమునే అనేకవిధ ద్రవ్యములనే దక్షిణలుగా ఇచ్చి (భూరిదక్షిణలు) యజ్ఞముల నాచరంచి ప్రసిద్ధులయి లోకములకు మేలుచేసిన రాజులు వీరు. వీరిలోను ఇక్ష్వాకు వంశమున జన్మించిన వారే ప్రధానముగా ఇచట పేర్కొనబడినారు. (అనమిత్రుడు కృతయుగమున రాజగును.)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదముప సూర వంశ వర్ణనమను ద్వాదశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters