Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకవింశతితమో ధ్యాయః.

శాకద్వీపవర్ణనమ్‌.

సూతః : శాకద్వీపస్య వక్ష్యామి యథావదిహ నిశ్చయమ్‌| కథ్యమానం నిబోధధ్వం శాకద్వీపం ద్విజోత్తమాః 1

జమ్భూద్వీపస్య విస్తారా ద్ద్విగుణ స్తస్య విస్తరః | విస్తారా త్త్రిగుణశ్చాపి పరిణాహ స్సమన్తతః. 2

క్షీరోదధిపరిక్షిప్తో ద్వీపోయం ద్విగుణనతు | తత్రపుణ్యా జనపదా శ్చిరాచ్చ మ్రియ(ం)తే జనాః. 3

కుతఏవతు దుర్భిక్షం క్షమా తేజో యుతేష్విహ | తత్రాపి పర్వతాశ్శుభ్రా స్సపై#్తవ మణిభూషితాః. 4

శాకద్వీపాదిషు జ్జేయం సప్త సప్త సమాశ్రితాః | ఋజ్వాయతాః ప్రతిదిశం నివిష్టా వర్షపర్వతాః. 5

రత్నాకరా ద్వినామాన స్సారవన్తో మహాబలాః | సమోదితాః ప్రతిదిశం ద్వీపవిస్తరమానతః.6

ఉభయత్రావగాఢాశ్చ లవణక్షీరసాగరౌ | శాకద్వీపేతు వక్ష్యామి సప్త దివ్యా న్మహాచలా& .

7

దేవర్షిగన్ధర్వయుతాన్‌ ప్రథమో మేరు రుచ్యతే | ప్రాగాయతస్తు సౌవర్ణ ఉదయోనామ పర్వతః. 8

తత్ర మేఘాస్తు వృష్ట్యర్థం ప్రభవన్తి సహస్రశః | తస్యాపరేణ సుమహా న్జలధారో మహాగిరిః. 9

సైవ చన్ద్ర స్సమాఖ్యాత స్సర్వౌషధినమన్వితః | తస్మా న్నిత్య ముపాదత్తే వాసవః పరమం జలమ్‌.10

నారదోనామ స ప్రోక్తో దుర్గశ్శ్యైలో మహాచలః | తత్రాపిచ సముత్పన్నౌ పూర్వం నారదపర్వతౌ. 11

తస్యాపరేణ సుమహా ఞ్ఛ్యామోనామ మహాగిరిః | అత శ్శ్యామత్వమాపన్నాః ప్రజాః పూర్వ మిమాః కిల.

సఏవ దున్ధుభిర్నామ శ్యామః పర్వతసత్తమః | శబ్దమృత్యుః పురాతస్మి& దున్ధుభి స్తాడిత స్సురైః. 13

రత్నమాలాన్తరమయ శ్శాల్మల శ్చాన్తరాళకృత్‌| తస్యాపరేణ రజతో మహా నస్తగిరి స్స్మృతః. 14

సఏవామృత ఇత్యుక్తో దేవైర్యత్రామృతం పురా| సమ్భృతంచ హృతంచైవ మాతురర్థే గరుత్మతా. 15

అస్యాపరే చామ్బికేయ స్సుమనాశ్చైవ స స్మృతః| హిరణ్యాక్షో వరాహేణ తస్మిఞ్ఛెలే నిషూదితః. 16

ఆమ్బికేయా త్పరే(రో) రమ్య స్సర్వౌషధినిషేవితః| విభ్రాజస్తు సమాఖ్యాత స్స్ఫటికైస్తు సమాచితః. 17

యస్మా ద్విభ్రాజతే త్విడ్చి ర్విభ్రాజ స్త్వేషవై స్మృతః| సఏవ కేశ##వేత్యుక్తో యతో వాయుః ప్రవాతి తే. 18

నూట ఇరువది యొకటవ అధ్యాయము.

శాక-కుశ-క్రౌంచ శాల్మల ద్వీపముల వర్ణనము.

[వాయు పురాణము మొదలగు వాని యందు 1. జంబూద్వీపము-దాని చుట్టు క్షార సముద్రము 2. ప్లక్ష(గోమేదక) ద్వీపము-దానిచుట్టు ఇక్షు సముద్రము 3. శాల్మల ద్వీపము-దానిచుట్టు సురా సముద్రము 4. కుశద్వీపము-దానిచుట్టు ఘృత సమద్రము 5. క్రౌంచ ద్వీపము-దానిచుట్టు దధి సముద్రము 6. శాక ద్వీపము-దానిచుట్టు క్షీర సముద్రము 7. పుష్కర ద్వీపము-దానిచుట్టు స్వాదుల (తీయని నీటి) సముద్రము అని యున్నది. ఈ మత్స్య పురాణము నందు వరుస వేరు విధముగా నున్నది.]

శాకద్వీప వర్ణనము

సూతుడు ఋషులతో ఇట్లు చెప్పనారభించెను: శాక ద్వీపమునకు సంబంధించిన ఆయా విషయముల నిశ్చయమును సంప్రదాయమందున్న విధమున చెప్పెదను. నేను చెప్పుచుండ-ద్విజోత్తములారా! శాక ద్వీప (విషయ)మును సమగ్రముగా తెలిసికొనుడు. జంబూద్వీపపు వ్యానమునకు ద్విగుణము శాకద్వీప వ్యాసము. వ్యాసమునకు మూడింతలు దాని చుట్టుకొలత. దీనికి రెట్టింపు పరిమాణము కల క్షీర సముద్రము దీని చుట్టు నున్నది. అచటి జనపదములు పుణ్యవంతములు. అచటి జనులు దీర్ఘాయువుల; క్షమా తేజోవంతులను; అచట కరవులు ఉండనే ఉండవు.

ఆ శాఖ ద్వీపమునందును మణ భూషితలములును శుభములు నగుఏడేసి పర్వతములు కలవు. దీనయందే కాదు; శాక ద్వీపాది సర్వ ద్వీపములందును ఏడు ఏడుగానే పర్వతాదికము కలదని తెలియవలెను. ఇవి ప్రతి దిక్క నందును ఋజువులై (వంకరలు లేక) ఆయతములై (దీర్ఘ చతురస్రాకారమున) అమరి ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరుచు వర్ష పర్వతములగా ఉన్నవి. ఇవి రత్నములకు అకరములు (గనులవంటివి.) ప్రతి దానికిని రెండేసి పేరులు కలవు. ఇవి సారవంతములు; మహాబలములు. ద్వీపపు నిడివికి తగ్గినట్లు అనుపాతములో ప్రతి దిక్కునందును సమముగా పుట్టియున్నవి. ఇవి ప్రతియొక్కటియు లోపలివైపు (జంబూ ద్వీపపు చుట్టునున్న) లవణ సముద్రమునను వెలుపలివైపు క్షీర సముద్రమునందును చొచ్చుకొనియున్నవి. శాక ద్వీపమందలి దేవర్షి గంధర్వయుత దివ్య మహాచలముల నేడింటిని చెప్పెద; వినుడు.

1. మేరువు-ఉదయము. ఇది బంగారుకొండ; తూర్పునకు పొడవుగా సాగినది. అచట వేలకొలది మేఘములు బాగుగ వానలు కురియుచుండును; 2. జలధారము-చంద్రము; ఇది మహాపర్వతము; సర్వౌషధియుతము; ఇంద్రుడు దీనినుండి ఉత్తమ జలమును (తన మేఘములకై) గ్రహించుచుండును. 3. నారదము-దుర్గము; ఇదియు మహా పర్వతము; పూర్వము నారద పర్వతులను గంధర్వులు దీనియందు జన్మించిరి. 4. శ్యామము-దుందుభి; ఇదియు మహాపర్వతము; నల్లనిది; దీని మూలముననే ఆ ప్రాంతపు జనులు పూర్వము నల్లని వారయిరి. దేవతలిచట దుందుభి రాక్షసుని కొట్టి-శబ్దము వాని నుండి ఉత్పన్న మగుటచే మరణముగాగల ఆ దానవుని చంపిరి. ఈ కొండ నడుమ రత్న పంక్తులును శాల్మల వృక్షమును కలవు; 5. ఆస్తగిరి-అమృతము; తన తల్లి దాస్యము విడిపించుటకై గరుడుడు దేవతలనుండి హరించి తెచ్చిన అమృతమును ఇచ్చటనే పాత్రయందు నింపి భద్రపరచెను. 6. ఆంబికేయము-సుమనన్‌; దీని యందే వరాహ విష్ణువు హిరణ్యాక్షుని సంహరించెను. 7. విభ్రాజము-కేశవము; ఇది స్ఫటిక మణులతో వ్యాప్తము. దీనినుండియే వాయువు వీచుట ఆరంభమగును. విభ్రాజతే-మిగుల ప్రకిశించునది-కావున దీనకేపేరు.

తేషాం వర్షాణి వక్ష్యామి పర్వతానాం ద్విజోత్తమాః | శృణుధ్వం నామతస్తాని యథావదనుపూర్వశః 19

ద్వినామన్యేవ వర్షాణి యథైవ గిరియ స్తథా | ఉదయస్యోదయంవర్షం జలధారేతి విశ్రుతమ్‌.20

నామ్నా గతభయంనామ వర్షంత త్ప్రథమం స్మృతమ్‌ | ద్వితీయం జలధారస్య సుకుమారమిత స్మృతమ్‌.

తదేవ శైశిరంనామ వర్షం సమ్పరికీర్తితమ్‌ | నారదస్య చ కౌమారం తదేవచ సుఖోదయమ్‌. 22

శ్యామపర్వతవర్షం త దనీచక మిదం స్మృతమ్‌ | ఆనన్దకమితి ప్రోక్తం తదేవ మునిభి శ్శుభమ్‌. 23

ఆస్తస్యాపి శుభం వర్షం వజ్ఞేయం కుసుమోత్తరమ్‌ | తదేవ శివ మిత్యుక్తం వర్షం సోమక సంజ్ఞితమ్‌. 24

ఆమ్బికేయస్య మైనాకం క్షేమకంచైవ తత్స్మృతమ్‌ | కైశోరపర్వతస్యాపి మహాద్రుమ మితి స్మృతమ్‌. 25

తదేవ ధ్రువమిత్యుక్తం వర్షం విభ్రాజసంజ్ఞికమ్‌ | ద్వీపస్య పరాణాహశ్చ హ్రస్వదీర్ఘత్వ మేవచ. 26

జమ్బూద్వీపేన సజ్ఖ్యౌత; స్తస్య మధ్యే వనస్పతిః | శాకోనామ మహావృక్షః ప్రజాస్తస్య నహానుగాః 27

ఏతేషు దేవగన్దర్వా స్సిద్ధాశ్చ సహచారణౖః | విహరన్తి సమత్వేన దృశ్యమానాశ్చ తై స్సహ. 28

తత్ర పుణ్య జనపదా శ్చాతుర్వర్ణ్య సమన్వితాః | తేషు నద్యశ్చవై సప్త ప్రతివర్షం సముద్రగాః 29

ద్వినామ్న్యశ్చైవ తాస్సర్వా గజ్గౌ సప్తవిధా స్మృతా | ప్రథమా సుకుమారీతి గజ్గౌ శివజలా శుభా. 30

తపస్తప్తాచ నామ్నైషా నదీ సమ్పరికీర్తితా | సుకుమారీ తపస్సిద్ధా ద్వితీయా నామత స్సతీ. 31

నన్దాచ పావనీచైవ తృతీయా పరికీర్తితా | శిబికాచ చతుర్థీస్యా త్త్రివిధాచ పునస్స్మృతా. 32

ఇక్షుశ్చ పఞ్చమీ జ్ఞేయా తథైవచ పునః కుహూః | రేణుకా చామృతాచైవ షష్ఠీ సమ్పరికీ ర్తితా. 33

సుకృతాచగభ స్తిశ్చ సప్తమీ పరికీర్తితా | ఏతా స్సప్త మహాభాగాః ప్రతివర్షం శివోదకాః. 34

పావయన్తి జనం సర్వం శాకద్వీపనివాసినమ్‌ | అభిగచ్ఛన్తి తాశ్చాన్యా నదా నద్య స్సరాంసిచ. 35

బహూదకపరిస్రావా ద్యతో వర్షతి వాసవః | తాసాంత నామధేయాని పరిమాణం తథై వచ. 36

నశక్యం పరిసజ్ఖ్యాతుం పుణ్యాస్తా స్సరిదుత్తమాః | తాః పిబన్తి మహాహృష్ఠా నదీ ర్జనపదాస్తుతే. 37

ఏతేషాం తనయాః ప్రోక్తాః ప్రమోదాశ్చాపి వై శివాః | ఆనన్దాశ్చ సుఖాశ్చైవ క్షేమకాశ్చ నదైస్సహా. 38

వర్ణాశ్రమాచారయుతా దేశాస్తే సప్త విశ్రుతాః | ఆరోగ్యా బలినశ్చైవ సర్వే మరణవర్జితాః. 39

అవసర్పిణీ నతేష్వస్తి తథైవోత్సర్పిణీ పునః | న తత్రాస్తి యుగావస్థా చతుర్యుగకృతా క్వచిత్‌. 40

త్రేతాయుగసమః కాల స్తథా తత్ర ప్రవర్తతే | శాకద్వీపాదిషు జ్ఞేయం పఞ్చస్వేతేషు సర్వశః. 41

దేశస్యతు విభాగేన కాల స్స్వాభావికః స్మృత! | న తేషు సజ్కరః కశ్చి ద్వర్ణాశ్రమకృతః క్వచిత్‌. 42

ధర్మస్య చాన్యథాచారా దేకాన్తసుఖినః ప్రజాః | న తేషు మాయా లోభోవా ఈర్ష్యాసూయా భయం కుతః 43

విపద్భయో న తేష్వస్తి న దణ్డోనచ దాణ్డికాః | స్వధర్మేణచ ధర్మజ్ఞా స్తే రక్షన్తి పరస్పరమ్‌. 44

వీనితో ఏర్పడిన వర్షముల ద్విజోత్తములారా ! ఇదే వరుసలో చెప్పెదను; వినుడు; గిరులకువలెనే వర్షములకును రెండేసి పేరులు గలవు.

1. ఉదయవర్షము-జలధార వర్షము; ఇది పేరునకు తగినట్లు జలధారలతో నిండినదగుటచే అనావృష్టి భయము లేనిది. 2. సుకుమారము-శైశిరము; 3. కౌమారము-సుఖోదయము. 4. అనీచకము - ఆనందకము; 5. కుసుమోత్త(త్క)రము-సోమకము; 6. మైనాకము-క్షేమకము; 7. మహాద్రుమము-ధ్రువము.

ఈ ద్వీపము వైశాల్యము పొడవు వెడల్పులు జంబూద్వీపము వైశాల్యము పొడవు వెడల్పుల నిష్పత్తి ననుసరించి అనుపాతములో గణనచేసి తెలిసికొనవలెను. ఈ ద్వీపపు నడుమ శాకము (చాగచెట్టు) అను వనస్పతి (పూవులు పూయకయే కాయలనిచ్చు) జాతి మహావృక్షము కలదు. ఇచటి ప్రజలు దీని ననుజీవింతురు. ఈ ప్రజలతో సమముగా ఇచట దేవగంధర్వ-సిద్ధ-చారణులు జీవించుచు సంచరించుచుందురు. చాతుర్వర్ణ్యులు కల పుణ్యజనపదము లిచ్చట గలవు.

ఇదే వర్ష పర్వతముల-వర్షముల - వరుసలో ఇచట రెండేసి నామములు గల నదులు గలవు. గంగయే ఏడుగా అయి ఈ సప్తనదులగా నున్నది. ఇవి అన్నియు హాయిగొల్పు నీరు కలిగినవి; సముద్రములో కలియునవి; 1. సుకుమారి-తపస్త (అనుత)ప్త; 2. కుమారి-తపస్సిద్ద; 3. న(మ)ంద-పావని; 4. శిబిక-త్రి(ద్వి)విధ 5. ఇక్షు-కుహూ; 6. వేణు (వైశ్య) క-అమృత; సుకృత-గభస్తి.

శుభుకర జలము గలిగిన మహాభాగలగు ఈనదులు శాకద్వీప నివాసియగు సర్వజనుని పవిత్రుని చేయుచున్నవి. ఎన్నో నదీనద సరస్సుల వీనితో చేరుచుండును. ఇంద్రుడు బహూదకమును స్రవించుచు వర్షించుచుండుటచే ప్రభవించి ప్రవహించు ఆ నదీనదుల నామములను పరామాణమును చెప్పశక్యము కాదు. అవి పుణ్యకరములు - శ్రేష్టములు; వానిని (వాని జలమును) త్రావుచు అచటి జనపదజనులు హర్షముతో నుందురు. అచటి నదములకును - వానితోపాటే అచటి జనుల వంశము వారికిని - ప్రమోద-శివ-ఆనంద-సుఖ-క్షేమక-ప్రభృతి నామములు ప్రసిద్దములు; ఆ ఏడు దేశ (వర్ష)ముల జనులును వర్ణాశ్రమాచారములు ఆరోగ్యము బలము కలిగి అనుచిత మరణములు లేకయుందురు. అచటి జనులయందు అవసర్పిణీ ప్రవృత్తి (ఉన్నదానికంటె దిగజారి పతనావస్థకు పోవుట) కాని ఉత్పర్పిణీ ప్రవృత్తి (సన్మార్గ ప్రవృత్తికి ఎదురు నడచుట-త్రోవ తప్పుట) కాని లేవు. చతుర్యుగ వ్యవస్థలేదు; శాకద్వీపాది షట్‌ ద్వీపములందును సదా త్రేతాయుగమునందువలె ధర్మ వ్యవస్థ ఉండును. స్వాభావదికముగ మనము మన అలవాటు ననుసరించి కాల విభాగమును ఆదేశ విభాగములందును అన్వయించవలసినదేకాని వాస్తవమున అచట ఇవి లేవు. అచట వర్ణాశ్రమ సంకరము మాయ లోభము ఈర్ష్య అసూయ విపద్భయము ఇతరులు తమ కపకారము సేయుదురను భయము దండము దండ్యులు దండించువారు లేరు. స్వధర్మ వర్తనముతో ఎల్లరు ధర్మజ్ఞులై పరస్పర రక్షణము చేయుచు ధర్మమును అన్యధా (విలక్షణ మగు ఏకైక విధమున) పాటించువారగుటచే అచటి జనులు ఏకాంత సుఖులు. (సుఖము తప్ప దుఃకమును ఎరుగరు) (ఇది Scithya ప్రాంతమని గుర్తింపవచ్చును

పరిమణ్డలస్తు సుమహా9 ద్వీపశ్చ కుశసంజ్ఞితః | నదీజలైః ప్రతిచ్ఛన్నః పర్వతై శ్చాభ్రసన్నిభైః. 45

సర్వధాతువిచిత్రైశ్చ మణిద్రుమవిభూషితై | అన్యైశ్య వివిధాకారై రమ్యో జనపదైస్తథా. 46

వృక్షైః పుష్పఫలోపేతై స్సర్వతో ధనధాన్యవా9 | నిత్యం పుష్ప సమాయుక్త స్సర్వరత్న సమన్వితః. 47

కుశద్వీపవర్ణనమ్‌.

ఆవృతః పశుభిస్సర్వై ర్ద్రామ్యారణ్యౖశ్చ సర్వశః | అనుపూర్వ్యా త్సమాసేన కుశద్వీపం నిబోధత. 48

అథ తృతీయం వక్ష్యామి కుశద్వీపస్య కృత్స్నశః | కుశద్వీపే సురామ్బోధి స్సర్వతః పరివారితః 49

శాకద్వీపస్య విస్తారా ద్ద్విగుణన సమన్వితః | తత్రాపి పర్వతాస్సప్త విజ్ఞేయా రత్న యోనయః. 50

రత్నాకరా స్తథానద్య స్తేషాం నామాని మే శృణు | ద్వినామానశ్చ తేసర్వే శాకద్వీపే యథా తథా. 51

ప్రథమః సూర్యసజ్కౌశః కామదోనామపర్వతః | విద్రుమోచ్చయా ఇత్యుక్త స్సఏవచ మహీధరః 52

సర్వధాతుమయై శ్శృజ్గై శ్శిలాజాలై స్సమిన్వితః | ద్వితీయః పర్వత స్తత్ర ఉన్నతోనామ విశ్రుతః. 53

హేపర్వతఇత్యుక్త స్సఏవచ మహీధరః | హరితాళమయై శ్వృజ్గై ర్ద్వీపమావృత్య సర్వశః. 54

బలాహక స్తృతీయస్తు కాలాఞ్జనమయో గిరిః | ద్యుతిమా న్నామతః ప్రోక్త స్సఏవచ మహీధరః 55

చతుర్థఃపర్వతో ద్రోణో యత్రౌషధ్యో మహాగిరౌ | విశల్యకరణీచైవ మృతసఞ్జవనీ తథా. 56

పుష్పవాన్నామ స ప్రోక్తః పర్వత స్సుమహాన్వితః | కజ్కస్తు పఞ్చమస్తేషాం పర్వతోనామ సరావా9. 57

కుశేశయ ఇతిప్రోక్త స్సచ పృథ్వీధర స్స్మృతః | దివ్యపుష్పఫలోపేతో దివ్య వీరుత్సమన్వితః. 58

షష్ఠస్సు పర్వత స్తత్ర మహిషో మేఘసన్నిభః | నఏవతు పునఃప్రోక్తో హరిరిత్యభివిశ్రుతః. 59

తస్మిన్త్సోగ్ని ర్నివసతి మహిషోనామ యోప్సుజః | కుకుద్మా న్సర్వత (న్సప్తమ) స్తత్ర తన్నామ్నా సహ భావ్యతే. 60

సఏవ మన్దరో జ్ఞేయ స్సర్వధాతుసమన్కవితః | మన్ద(న)ఇత్యేవ యో ధాతు రపామర్థే ప్రకాశ##తే. 61

ఆపాం విదారణాచ్చైవ మన్గర స్స నిగద్యతే | తత్ర రత్నాన్యనేకాని స్వయం రక్షతి వాసవః. 62

ప్రజాపతి రూపాదాయ ప్రజాభ్యో హ్యదదా త్స్వయమ్‌ | తేషా మన్తరవిష్కమ్బో ద్విగుణ స్సవిభాగాశః. 63

ఇత్యేతాః పర్వతాస్తత్ర కుశద్వీపే ప్రభాషితాః | తేషాం వర్షాణి వక్ష్యామి సపై#్తవచ విభాగశః. 64

కామస్య కామదంవర్ష మున్నతంచైవ తత్మ్సృతమ్‌ | ఉన్నతస్య పరిజ్ఞేయం వర్షం లోహితసంజ్ఞితమ్‌. 65

వేణుమణ్డలకం చేతి తదేవ పరిశబ్ద్యతే | బలాహకస్య జీమూతం తద్రథాకార మిత్యపి. 66

ద్రోణస్య హారికం నామ లిమ్పకంచ తదేవహి | కజ్కస్యాపి కురుర్నామ మతిమచ్చైవ తత్స్మృతమ్‌. 67

మాహిషం మహిషస్యాపి పునశ్చాపి ప్రభాకరమ్‌ | కకుద్మతస్తు తద్వర్షం కపిలంనామ విశ్రుతమ్‌. 68

ఏతా న్యుపనివిష్టాని సప్తసప్త పృథక్పృథక్‌ | వర్షాణి పర్వతాశ్చైవ నదీస్తేషు నిబోధత. 69

తత్రాపి నద్య స్సపై#్తవ ప్రతివర్షం హి తాః స్మృతా | ద్వినామవత్య స్తా స్సర్వాః సర్వాః పుణ్యజలాః స్మృతాః.

ధూతపాపా నదీ సా హి యోనిశ్చైవ పునఃస్మృతాః | సీతా ద్వితీయా చైవేహ సాచైవహి నిశాస్మృతా. 71

తృతీయాతు వితృష్ణాహ్వా పవిత్రా సైవచ స్మృతా | చతుర్థీ హ్లాదినీత్యుక్తా చన్ద్రమాఇతిచ స్మృతా. 72

విద్యుచ్చ పఞ్చమిప్రోక్తా శుక్లాచైవ నిగద్యతే | షణ్డా షష్టీతు విజ్ఞేయా పునసై#్సవ విభావరీ. 73

మహతీ సప్తమీ ప్రోక్తా పునసై#్సవ ధృతిస్స్మృతా | అన్యా స్తాభ్యః పరిజ్ఞాతా శ్శతశోథ సహస్రశః. 74

అనుగచ్ఛన్తి తా నద్యోయతో వర్షతి వాసవః | ఇత్యేష సన్ని వేశోయం కుశద్వీపస్య వర్ణితః. 75

శాకద్వీపస్య విస్తారః ప్రోక్తశ్చైవ సనాతనః | శాకద్వీప స్సముద్రేణ వృతః క్షీరోదకేన తు. 76

సర్వతస్తు మహా9 ద్వీప శ్చన్ద్రవ త్పరివేష్టితః | విస్తారా న్మణ్డలాచైవ క్షీరోదా ద్ద్విగుణ స్స్మృతః. 77

కుశద్వీప వర్ణనము.

మూడవదగు కుశద్వీపము శాకద్వీపము చుట్టును గుండ్రనై నదీజలములతో సర్వవిధ గైరిక ధాతువులతో వివిధ వర్ణముల కలవై మణులతో వృక్షములతో అలంకృతములయి ఇంకను వివిధ రూపములు కలవై మేఘములవలె కనబడు పర్వతములతో వ్యాప్తము. జనపదములతోను పుష్పఫలోపేతములగు వృక్షములతోను రమ్యము; అంతటను ధనధాన్య సహితము. ఎడతెగక ఎప్పుడు ఎల్లయెడల సకల పుష్పములతో సర్వరత్నములతో గ్రామ్యములు ఆరణ్యములునగు పశువులతో కూడియుండునది. ఇది ద్వీపముల నామక్రమానుసారమున సంగ్రహముగా చెప్పదగిన విషయము. ఇక ఈ ద్వీప విషయము అంతయు విస్తరముగ చెప్పెదను; వినుడు; కుశద్వీపమునకు చుట్టును సురా సముద్రమున్నది; వైశాల్యములో ఇది శాక ద్వీపమునకు ద్విగుణము; దీనియందు రత్నములకు జన్మస్ఠానములగు పర్వతములను అట్టివే నదులును కలవు. ఈ వర్ష పర్వతములు కల వర్షములను ఏడేసి చొప్పున రెండేసి పేరులు కలవిగా ఉన్నవి.

పర్వతములు : 1. సూర్యునితో సమమగు-కామదము-విద్రుమోచ్చయము; 2. సర్వధాతుమయ శృంగములతోను శిలాజాలములతోను కూడిన-ఉన్నతము హేమము; 3. హరితాళ (అరిదళము)మయశృంగములతో ఆ ద్వీపము నన్ని వైపులను క్రమ్మిన కాలాంజనమయమగు-వలాహకము-ద్యుతి ; 4. విశల్యకరణి మృతస-జీవిని అను ఓషధులు కల-ద్రోణము-పుష్పవాన్‌; 5. సారవంతమయి దివ్య పుష్పఫలములతో దివ్యలతోలతో కూడినది అగు-కంకము-కుశేశయము ; 6. మేఘసదృశము-నీటినుండి జనించిన మహిషుడను అగ్నికి వానస్థానము (చూ. 51 అ.) అగు మహిషము-హరి 7. సర్వగైరిక ధాతు యుక్తమగు-కకుద్మాన్‌-మందరము; మన్‌ అనగా జలమును-దర-చీల్చునది కావున దీనకి ఈ పేరు; ప్రజాపతి ప్రజల నిమిత్తమై స్వయముగా ఇంద్రునకు ఇచ్చిన అనేక దత్నములను అతడు ఈ పర్వతమునందుంచి కాపాడుచున్నాడు. ఈ పర్వతముల నడిమి వ్యాసము శాకద్వీప పర్వతముల ఆంతర విష్కంభము (నడిమి వ్యాసము)నకు ద్విగుణము.

వర్షములు: 1. కామదము-ఉన్నతము; 2. లోహితము-వేణు మండలకము 3. జీమూతము-రథాకారము; 4. హారకము-లింపకము ; 5. కురు-మతిమత్‌ ; 6. మహిషము-ప్రభాకరము; 7. కకుద్మత్‌-కపిలము.

నదులు: ఇవి అన్నియు పుణ్యజలవంతములు: 1. ధూతపాప-యోని; 2. సీత-నిశ ; 3. తృష్ణ-పవిత్ర; 4. హ్లాదిని-చంద్రమస్‌; 5. విద్యుత్‌-శుక్ల: 6. షండా-విభావరి: 7. మహతీ-ధృతి; వీటియందు అచట ఇంద్రుడు తరచుగా కురియించెడి వర్షముల వలన ఏర్పడెడి వందల-వేల-కొలది నదులు కలియుచుండును.

[శాశ్వత సంప్రాదాయాగతమగు శాకద్వీప విన్తారాదికము చెప్పబడినదికదా! క్షీర సముద్రము శాకద్వీపమును చంద్రుడువలె చుట్టియున్నది. అంటిని:]

క్రౌఞ్చద్వీపవర్ణనమ్‌.

అతఃపురం ప్రవక్ష్యామి క్రౌఞ్చద్వీపం యథాతథమ్‌ | కుశద్వీపస్య విస్తారా ద్ద్విగుణ స్తస్య విస్తరః. 78

ఘృతోదకసముద్రోసౌ క్రౌఞ్చద్వీపే సుసంవృతః| చక్రనేమిక్రమేణౖవ వృతో వృత్తేన సర్వశః. 79

తస్మి9 ద్వీపే నరాశ్శ్రేష్ఠాః కౌఞస్తు ప్రథమోగిరిః | క్రౌఞ్చాత్పరః పావకాఖ్య పావకా దణ్డకారకః. 80

అణ్డకారక త్పరశ్చాపి దేవవాన్నామ పర్వతః | దేవస్త్రస్య పరేచాపి దేవకోటి స్తథోచ్యతే. 81

దేవవత్పర్వతాచ్చాపి గోవిన్దోనామ పర్వతః | గోవిన్దాత్పరతశ్చాపి పుణ్డరీకో మహాగిరిః. 82

ఏవం రత్నమయాస్సప్త క్రౌఞ్చద్వీపేతు పర్వతాః | పరస్పరస్య ద్విగుణం విష్కమ్భా వర్షపర్వతాః. 83

వర్షాణి తస్య వక్ష్యమి నామతస్తా న్నిబోధత | క్రౌఞ్చస్య కుశలోదేశః పావకస్యతు చానుగః. 84

తతోనుగా త్పరశ్చోష్ణ స్తృతీయోదేశఉచ్యతే | ఉష్ణాత్పరః పావనకః పావనా దణ్డకారకః. 85

అణ్డకారకదేశాత్తు మునిదేశ స్తతఃపరమ్‌ | మునిదేశా త్పరోవాపి ప్రోచ్యతే చన్ద్రనిస్వనః. 86

రక్తాన్తరజ్గనారజ్గై ర్బహుభి స్సప్రియుజ్గుభిః | సిద్దచారణసజ్కీర్ణో దేవప్రాయశ్శుచిస్మృతః. 87

స్మృతా స్తత్రైవ నద్యస్తు ప్రతివర్షం గతా శ్శుభాః | గౌరీ కుముద్వతీచైవ సన్ద్యా రాత్రిర్మనో రామా. 89

ఖ్యాతిశ్చ పుణ్డరీకాచ గజ్గౌ సప్తవిధా స్మృతా | ఆసాం సహస్రశశ్చాన్యా నద్యోయా స్తత్స మీపగాః. 89

అభిగచ్ఛన్తి తా నద్యో బహులా స్సబహూదకాః | తేషాం నిసర్గో దేశానా మానుపూర్వ్యేణ సర్వశః. 90

న శక్యోవిస్తరా ద్వక్తు మాసాం వర్షశ##తైరపి | నోపసర్గః ప్రజానాంతు సంహారో యశ్చతేషు వై. 91

శాల్మలద్వీపవర్ణనమ్‌.

అతఊర్ధ్వంతు పక్ష్యామి శాల్మలస్య నిబోధత| శాల్మలో ద్విగుణో ద్వీపః క్రౌఞ్చద్వీపస్య విస్తరాత్‌. 92

పరివార్య సముద్రశ్చదధిషణ్డోదకః స్థితః | తత్ర పుణ్యా జనపదా శ్చిరాచ్చ మ్రియతే జనః. 93

కుతఏవహి దుర్భిక్షం క్షమాతేజోయుతా హి తే | ప్రథమ స్సూర్యసజ్కౌశ స్సుమనానామ పర్వతః. 94

పీతస్తు మధ్యమస్తత్ర శాతకుమ్భమయో గిరిః | నామ్నా సర్వసుఖోనామ సర్వౌషధిసమన్వితః. 95

తృతీయశ్చైవ సౌవర్ణో శృజ్గసత్రాజిరో గిరిః | స నామ్నా లోహితో నామ దివ్యో గిరివరో మహా9. 96

సుమనాః కుశలో దేశ స్సుఖోదర్క స్సుఖోదయః| రోహితాఖ్య స్తృతీయస్తు రోహిణోనామ విశ్రుతః. 97

తత్ర రత్నా న్యనేకాని స్వయం రక్షతి వాసవః| ప్రజాపతి రూపాదాయ ప్రసన్నో వ్యదద త్స్వయమ్‌. 98

న తత్ర నద్యో వర్షంవా శీతోష్ణంవాన్య దప్రియమ్‌| వర్ణాశ్రమాణాం వార్తావా త్రిషుద్వీపేషు విద్యతే. 99

న దీక్షా న చ దణ్డోస్తి నేర్ష్యాసూయాభయం తథా | ఉద్భిదా న్యుదకాన్యత్ర గిరి ప్రస్రవణానిచ. 100

భోజనం షడ్రసం తత్ర తేషాం స్వయ ముపస్థితమ్‌| అధమోత్తమో న తేష్వస్తి న లోభో న పరిగ్రహః.

అశోకా బలవన్తశ్చ ఏకాన్తసుఖినః ప్రజాః| త్రింశద్వర్షసహస్రాణి మానసీం సిద్ధి మాశ్రితాః. 102

సుఖమాయుశ్చ రూపంచ ధర్మైశ్వర్యం తథైవచ| శాల్మలాదిషు విజ్ఞేయం ద్వీపేషు త్రిషు సర్వశః. 103

వ్యాఖ్యాతం శాల్మలాదీనాం ద్వీపానాంతు విధి స్తథా. 104

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే శాకద్వీపాదివర్ణనం

నామైకవింశత్యుత్తరశతతమోధ్యాయః.

క్రౌంచ-శాల్మల ద్వీపవర్ణనము.

క్రౌంచ ద్వీప వర్ణనము.

ఇకమీదట క్రౌంచ ద్వీపపు యథాస్థితిని వివరింతును. కుశద్వీపపు వైశాల్యము కంటె క్రౌంచ ద్వీప వైశాల్యము ద్విగుణము. దీనిచుట్టు చక్రము చుట్టు నేమి (బండి పట్టాయును దానికి లోపల నుండునదియు చక్రపు ఆకులను అమర్చిన పూటీలు అనబడు దారు ఖండముల అమరికతో ఏర్పడినదియు అగు వృత్తాకృతియును) వలె వృత్తాకృతి గల ఘృతోదక సముద్రము చుట్టియున్నది. ఈ సముద్రము «విస్తారము (మండలము) నందు క్షీరోదక సముద్రము నక ద్విగుణము. దీనియందలి నరులు శ్రేష్ఠులు.

దీనియందు వర్ష పర్వతములు:1. క్రౌంచము 2. పావకము 3. అండకారము 4. దేవవాన్‌ 5. దేవకోటి 6. గోవిందము 7. పుండరీకము. ఇవన్నియు రత్నమయములును ఒకదాని నడిమి వ్యాసము కంటె ద్విగుణమగు వ్యాసము (విష్కంభము) కలవియు.

దీనియందలి వర్షములు:1. కుశలము 2. అనుగము 3. ఉష్ణము 4. పావనకము 5. అండకారము 6. మునిదేశము 7. చంద్రనిఃస్వనము.

ఈ ద్వీపము రక్తాంత-రంగ (Apple)-నారంగ (Orrange)-ప్రియంగు-వృక్షములతో వ్యాప్తము. సిద్ధులు చారణులు దేవతలు తరచుగా కలిగిన శుచియగు దేశ మిది.

ఈ ద్వీపమున ప్రతి వర్షమునందును వ్యాపించి ప్రవహించు నదు లేడు గలవు. 1. గౌరి 2. కుముద 3. సంధ్య 4. రాత్రి 5. మనోరమ 6. ఖ్యాతి 7.పుండరీక; ఇవి అన్నియు గంగా భేదములే; దీని సమీపముగా ప్రవహించుచు ఈ ప్రధాన నదులలో కలియు చిన్న నదులు నదములు వేలకొలది అట గలవు. ఇవన్నియు బహుదకములు; అచటి దేశ బేదములు-వాని స్వభావము మొదలగునవి సవిస్తారముగా చెప్పవలెననిక నూర్ల ఏండ్లయినను చాలవు. అచటి ప్రజలకు ఉపద్రవములు కాని అచటివారు ప్రళయమునకులోగా నశించుట కాని యుండదు: (ఈ క్రౌంచద్వీపమునే మధ్యధరా సముద్ర (Meditarranean Sea) ప్రాంతమని గుర్తింపవచ్చును.)

శాల్మల ద్వీపవర్ణనము

ఇక మీదట శాల్మల ద్వీప విషయము తెలిపెదను; తెలిసికొనుడు. శాల్మల ద్వీప విస్తరము క్రౌంచ ద్వీప విస్తరమునకు ద్విగుణము; దీని చుట్టును దధిసముద్ర మున్నది. అచటి జనపదములు పుణ్యవంతములు; జనులు చాల కాలము జీవింతురు. వారు క్షమా తేజోవంతులు. వారు కరవులే ఎరుగురు.

దీనియందు మూడు పర్వతములు గలవు. మొదటిది సుమనస్‌ అనునది. ఇది సూర్యకాంతితో ప్రకాశించు చుండును. నడిమిది-రెండవది-బంగారుతో ఏర్పడి పచ్చని వన్నెతో ప్రకాశించునది; దీని పేరు సర్వసుఖము; దీనియందు సర్వౌషధులును గలవు; మూడవది రో(లో)హితమును పర్వతము; ఇదియు బంగారుతో ఏర్పడినదే; కాని తుమ్మెద రెక్కల సంధివలె (పసిమివన్నెతో) ప్రకాశించుచుండును. ఇది మహాదివ్యమగు గిరివరము; ఈ పేరులతోనే మూడు దేశము లా ద్వీపమున గలవు; మొదటిదగు సుమననమను దేశము కుశలములతో కూడినది; సర్వసుఖమను దేశము సుఖములతో ఉదర్కము (అన్నింటిలో గొప్పది) సుఖముల వృద్ధి కలదియును; మూడవ దేశము పర్వతపు పేరుతో రోహితము అని మాత్రమే కాక రోహిణము అనియు ప్రసిద్ధ నామము కలది.

స్వయముగా ప్రజాపతి ప్రజలయందు ప్రసన్నుడై ఇచ్చిన నవజాతులకు చెందిన రత్నము లనేకములను ఇంద్రుడిచ్చట నుంచి కాపాడుచుండును. వర్షము కాని శీతము ఉష్ణము కాని ప్రాణులకు అప్రీతికరమగు మరి ఏది కాని వర్ణాశ్రమముల మాట కాని శాల్మల గోమేద పుష్కరము లనెడు మూడు ద్వీపములందును ఉండదు. (కర్మ) దీక్ష-దండము ఈర్ష్యాసూయాభయములు అట లేవు. కొండవాగులు సెలయేళ్ళు ఇచ్చు జలమును భూగర్భము చీల్చుకొనివచ్చు ఉద్భిదజలమును ప్రాణుల కుపయోగపడును. స్వయముగ (అప్రయత్నముగ) అచటి జనులకు షడ్రసభోజనము ఎదుటికి వచ్చి లభించును. అచట అధమోత్తమభేద వ్యవస్థలు లోభము పరిగ్రహము (కలవారు ఇచ్చుట-లేనివారు పుచ్చుకొనుట) అచట లేవు. (కలవారు లేనివారు అను భేదములే అచట లేవు.) అచటి జనులు శోకరహితులు బలవంతులు సుఖము తప్ప ఎరుగనివారు. మానసయోగసిద్ధి నంది వారు ముప్పదివేల సంవత్సరములు జీవింతురు. శాల్మల గోమేద పుష్కర ద్వీపముల మూడిటియందును ఇదే విధముండును.

ఇతి శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున శాక కుశక్రౌంచ శాల్మల ద్వీప వర్ణనమను

నూట ఇరువది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters