Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వావింశత్యుత్తర శతతమోధ్యాయః.

గోమేదద్వీపవర్ణనమ్‌.

సూతః : పరిమణ్ణలేన స ద్వీప శ్చక్రవ త్పరివేష్టితః| స్వాదూదేన సముద్రేణ ద్విగుణన సమన్వితః. 1

«గోమేదకంతు వక్ష్యామి షష్ఠద్వీపం ద్విజోత్తమాః|

శాల్మలస్యతు విస్తారా ద్ద్విగుణ స్తస్యవిస్తరః | తస్మి& ద్వీపేతు విజ్జే¸° పర్వతౌ ద్వౌ సమాహితౌ. 3

ప్రథమ స్సోమకో నామ జాత్యఞ్జనమయో గిరిః | ద్వితీయః కుముదోనామ సర్వౌషధిసమన్వితః. 4

శాతకుమ్భమయ శ్శ్రీమా న్విజ్ఞేయ స్స మహోచ్ఛ్రితః| l(సముద్రేక్షురసోదేన వృతోగోమేదక శ్శుభః. 5

షష్ఠేనతు సముద్రేణ సురోదా ద్ద్విగుణనతు) | ధాతకిః కుముదశ్చైవ హవ్యపుత్రౌ సువిశ్రుతౌ. 6

సౌమకం ప్రథమం తేషాం ధాతకీఖణ్డ ముచ్యతే| ధాతకేస్తు స్మృతం తద్వై ప్రథమం ప్రథమస్యతు. 7

గోమేదం యత్స్మృతం వర్షం నామ్నా సర్వసుఖంతు తత్‌ | కుముదస్య ద్వితీయస్య ద్వితీయం కుముదంతు తత్‌. 8

ఏతౌ ద్వౌ పర్వతౌ జ్ఞే¸° వృత్తౌ సర్వసముచ్ఛ్రితో | పూర్వద్వీపస్య తసై#్యవ సోమకః పర్వత స్థ్సితః. 9

ప్రాగాయతై స్సపాదైస్తు ఆసముద్రా దితిస్థితిః | పశ్చాద్యై కుముదశ్చాపి ఏకమేవ స్థితస్తు తైః. 10

ఏతైః పర్వతపాదైస్తు స దేశో వైద్విధా కృతః | ద్వీపస్య దక్షిణార్దేతు ధాతకీఖణ్డ ముచ్యతే. 11

కుముదం తూత్తరే తస్య ద్వితీయం వర్షముత్తమమ్‌ | ఏతౌ జనపదౌ ద్వౌతు గోమేదస్యతు విశ్రుతౌ. 12

నూట ఇరువది రెండవ అధ్యాయము.

గోమేద-పుష్కర-ద్వీప వర్ణనము-శాకాది ద్వీప సామాన్య లక్షణము-

బ్రహ్మాండమున మహాభూతముల వ్యవస్థ-

అందు-గోమేద ద్వీప వర్ణనము.

ఇది దధిసముద్రమునకు ద్విగుణపరిమాణముగల స్వాదూదక(తీయనీటి) సముద్రముచే చుట్టబడినది. ఈ ద్వీపపు విస్తరము శాల్మల ద్వీప విస్తరమునకు ద్విగుణము. దీనియందు జాత్యంజనమయమగు (స్వాభావికమగు కాటుకతో ఏర్పడిన)1. సోమకము - సర్వౌషధి సమన్వితము మహోన్నతము సువర్ణమయమునగు 2.కుముదము అను రెండు పర్వతములున్నవి. హవ్యుడను మను పుత్రునకు ధాతకి-కుముదుడు అను కుమారులు ఇద్దరు కలరు. సోమక పర్వతముగల ప్రథమ ఖండము ధాతకిచే పాలితమై ధాతకీఖండము-కుముదపర్వతము గలదియు గోమేద వర్షమని ద్వీపనామముతోనే ప్రసిద్ధమును సర్వసుఖమయమునగు రెండవ ఖండము కుముదునిచే పాలితమయి కుముదఖండము-అని ప్రసిద్ధములు.

ఈ సోమక కుముద పర్వతములు రెండును వృత్తాకృతులును మహోన్నతములును; సోమకము ద్వీప పూర్వార్ధ మందున్నది. దీని పాదములు(ప్రత్యంత పర్వతములు) తూర్పునకు సముద్రము వరకు సాగియున్నవి. కుముదము ఇట్లే ద్వీప పశ్చిమ గమున నున్నది. దీని ప్రత్యంత పర్వతములు పడమటగా సముద్రము వరకు సాగి ఉన్నవి. ఈ పర్వత పాదములు ద్వీపమును రెండుగా విభజించుచున్నవి. దక్షిణార్ధము ధాతకీఖండము; ఉత్తరార్థము కుముద ఖండము. గోమేద ద్వీపము నందు దేశములనినను వర్షములనినను ఈ రెండే. (ఈ ద్వీపము ఆస్ట్రేలియా అని భావింపవచ్చును.)

పుష్కరద్వీపవర్ణనమ్‌.

ద్వీపేన పుష్కరేణాసౌ వృత శ్చేక్షురసోదక- | సముద్రేణ మహాభాగో గోమేద ద్విగుణనతు. 13

పుష్కరే పర్వత శ్శ్రీమాం శ్చిత్రసామ ర్మహాగిరిః- కూటై శ్చిత్రై ర్మణిమయై శ్శిలాజాల సముద్గతైః. 14

ద్వీపస్య తస్య పూర్వార్దే చిత్రసాను స్థ్సితో మహా& | దరీమణ్డలసాహస్రో విస్తీర్ణః పఞ్చవింశతిః. 15

ఊర్ధ్వంచైవ చతుర్వింశ ద్యోజనానాం మహాచలః| ద్వీపస్యార్ధే పరిక్షిప్తః పశ్చిమే మానసో గిరిః. 16

స్మృతో వేలాసమీ పేతు నవశ్చన్ద్ర ఇవోదితః| యోజనానాం సహస్రాణి హ్యూర్ధ్వం పఞ్చాశ దుచ్ఛ్రితః. 17

తస్యపుత్త్రో మహావీరః పశ్చిమార్ధేతు రక్షితా| పూర్వార్దే పర్వత స్యాపి ద్విధా దేశస్తు స స్స్మృత. 18

¡స్వాదూదకే నోదధినా పుష్కరః పరివారితః | విస్తరా న్మణ్డలాచ్చైవ గోమేదద్విగుణనతు. 19

దశవర్షసహప్రాణి తేషు జీవన్తివై | ప్రజాః విపర్యయో న తేష్వస్తి ఏతతత్స్వాభావికం స్మృతమ్‌. 20

ఆరోగ్యం సుఖబాహుళ్యం మానసీం సిద్ధి మాశ్రితాః| సుఖమాయుశ్చ రూపంచ త్రిషు ద్వీపేషు సర్వశఃః. 21

అధమోత్తమౌ న తేష్వాస్తాం తుల్యాస్తే రూపశీలతః | న తత్ర వధ్యవధకా నేర్ష్యాసూయా భయం న చ. 22

న లోభో న చదణ్డోవా న లౌల్యం న చ విగ్రహః | సత్యానృతే న తేష్వాస్తాం ధర్మాధర్మౌ తథైవచ. 23

వర్ణాశ్రమాణాం వార్తా వా పాశుపాల్యం వణిక్కృషిః| త్రయీ విద్యా దణ్డనీతి శ్వుశ్రూషాదణ్డ ఏవచ. 24

న తత్ర వర్షం నద్యోవా శీతోష్ణం నైవ విద్యతే| ఉద్భిజ్ఞా న్యుదకాని స్యు ర్గిరిప్రస్రణానిచ. 25

తుల్యోత్తరకురూణాంతు కాలస్తత్రతు సర్వదా| సర్వత స్సుఖకాలో7సౌ జరాక్లేశవివర్జితః. 26

సర్గస్తు ధాతకీఖణ్డ మహావీరే తథైవచ|

పుష్కర ద్వీప వర్ణనము.

గోమేద ద్వీపమునకు ఆవల పుష్కర ద్వీపమున్నది. ఇది ఇక్షురస సముద్రముచే చుట్టబడినది. దీని విస్తరము గోమేద ద్వీప విస్తరమునకు ద్విగుణము. పుష్కర ద్వీపమున ద్వీప పూర్వార్థమున శిలాజాలములతో ఉత్పన్నములై మణిమయములగు శిఖరముల గలదియు వేలకొలది గుహలు గలదియు అగు చిత్రసాను మహాపర్వతము గలదు. దీని విస్తరము ఇరువదియైదు యోజనములు. ఇరువది నాలుగు యోజనములు దీని ఎత్తు. ద్వీపపు పశ్చిమార్ధమున సముద్ర వేలా (చెలియలి కట్టకు) సమీపమున అపుడే ఉదయించిన చంద్రునివలె (వక్రరేఖా రూపములో) మానసమను పర్వతమున్నది. దీని ఎత్తు ఏబదివేల యోజనములు. ప్రియవ్రత పుత్రుని పుత్రుడు మహావీరుడు ద్వీప పూర్వార్ధ పశ్చిమార్ధములందు రక్షకుడు.

ఈ శాల్మల గోమేద పుష్కర ద్వీపములయందు జనులు పదివేల యేండ్లు జీవింతురు. అచట విపర్యయములేని యునులేవు. ఆరోగ్యము సుఖ బాహుళ్యము-ఇది అచటి స్వాభావిక స్థితి. వారు మానససిద్ధిని పొందిన వారగుటచే వారిలో సుఖము ఆయువు రూపము-వీనికి కొరతలేదు. రూపశీలములందు అచట అందరును సమానులు; అధమోత్తమత్వములు లేవు వధ్యులు-వధకులు ఈర్ష్యాసూయాభయ లోభదండ లౌల్యనిగ్రహములు సత్యానృత ధర్మాదర్మభేదములు వర్ణాశ్రమములు పశుపాలన వాణిజ్య కృషిత్రయీ విద్యాదండనీతి శుశ్రూషాదండములు లేవు. వానలు నదులు శీతోష్ణభేదము లచట లేవు. గిరిప్రస్రవణముల జలమును ఉద్భిజ్జజలమును అచటివారి కుపయోగపడును.

అచటి కాలప్రవృత్తి సదా ఉత్తర మేరువులందువలె నుండును. అంతటను కాలము సుఖప్రదమయి జరాక్లేశ ములు లేకయుండును.

ఈ చెప్పినవానిలో గోమేదమునందలి ధాతకీ ఖండమందును పుష్కర ద్వీపమునందలి మహావీరుని ఖండమునందును సృష్టి ప్రవృత్తి కలదు.

గమనిక: స్వాయంభువమను పుత్త్రుడగు ప్రియవ్రతునకు పదిమంది కుమారులు కలిగిరి; వారి నామము లన్నియు అగ్ని వాచకములు. వారిలో ముగ్గురు విరక్తులై తపమునకు ఏగిరి. మిగిలిన ఏడుమందికిని ప్రియవ్రతు డేడు ద్వీపములను ఇచ్చెను. వారికిని కుమారులు కలిగిరి. ఈ ప్రియవ్రత పౌత్త్రుల నామములకును ఈ సప్త ద్వీపములందలి వర్షముల నామములకును సంబంధమున్నట్లు కనబడును. ఈ మత్స్య పురాణమున నామములు పాఠభ్రంశము వలననేమో సరిగా గుర్తించరాకున్నవి.

ఏతే ద్వీపా స్సముద్రైస్తు సప్త సప్తభి రావృతాః. 27

ద్వీపస్యానన్తరో యస్తు సముద్ర స్తత్సమస్తు వై| ఏవం ద్వీపసముద్రాణాం వృద్ధిర్జేయా పరస్పరమ్‌. 28

అపాంచైవ సముద్రేకా త్సముద్ర ఇతివిశ్రుతః | సరిద్విసన్ధ్యో వర్షేషు ప్రజా యత్ర చతుర్విధాః. 29

ఋ(వృ)షిరిత్యేవ రమణోవర్షితం తేనతేషుచ| ఉదయతీన్దౌచ పూర్ణేచ సముద్రః పూర్యతే సదా. 30

ప్రక్షీయమాణ బహుళే క్షీయతే తనుతాచవై| అపూర్వమాణ హ్యుదధి రాత్మనైవాభిపూర్యతే. 31

తతోవై క్షీయమాణస్య స్వాత్మనైవచ తత్షయః| ఉదయా త్పక్షసంయోగా త్పుష్ణాత్యాపో యథా స్వయమ్‌.

తథా సతి సముద్రోపి వర్ధతే హ్యుదయే విదోః| అన్యోన్యస్యాతిరిక్తాస్తా వర్ధన్త్యాపో హ్రనన్తిచ. 33

ఉదయాస్తమయే ష్విన్ధోః పక్షయో శ్శుక్లకృష్ణయోః| క్షయో వృద్ధి స్సముద్రస్య సోమవృద్ధిక్ష¸° తథా. 34

దశోత్తరాణి వఞ్చాహు రఙ్గుళానాం శతానితు| అపాం వృద్ధిక్షయో దృష్ట స్సముద్రాణాంచ పర్వసు. 35

ద్విరాపత్వా త్స్మృతో ద్వీపః ఉదధాదుదధిః స్మృతః| ఉద్గీర్ణత్వాచ్చ గిరయః పర్వవత్త్వాచ్చ పర్వతాః. 36

ద్వీప సామాన్య విషయములు

ఈ చెప్పిన సప్త ద్వీపములకు చుట్టును సప్తసముద్రములు కలవు; ఏ ద్వీపమునకుసంబంధించిన సముద్రమయినను దానితో సమానమయినది అనగా ద్వీప పరిమాణమెంత పెరుగునో ఆ సముద్ర పరిమాణమును అంతే పెరుగును.

సముద్ర శబ్ద నిర్వచనము-దానికి సంబంధించిన రహస్యములు

జలములు దీనియందు సముద్రేకించును గావున సముద్రమునకు సముద్రము అని పేరు. «జరాయుజాండజి స్వేదజోద్భిజ్జములను నాల్గు విధములగు ప్రజ లెచ్చట నివసింతురో ఆనందింతురో ఇట్లు వృష్ఠి-వర్షితము వాన) వారి ఆనందపూర్వకస్థితి వర్షితమును ఎచ్చట జరుగునో అది వర్షము అనబడును.

ప్రతిదినమును చంద్రు డుదయించునపుడును చంద్రుడు పూర్ణుడై నపుడు (పూర్ణి మాతిథియందు)ను సముద్రము పూర్ణమగును. బహుళ పక్షమున చంద్రుడు ప్రక్షిణుడగుచుండ సముద్రమును క్రమముగ క్షీణించి సన్నదనమును పొందును. అపూర్యమాణ(శుక్ల)పక్షమున సముద్రము క్రమముగ స్వయముగనే వృద్ధి పొందును. కనుక ఇట్లు చంద్ర క్షయముతోపాటు సముద్రక్షయమును చంద్రవృద్ధితోపాటు సముద్రవృద్ధియు నుండును. ఏలయన జలవృద్ధిక్షయములు చంద్రవృద్ధిక్షయానుసారులు. అందుచేతనే చంద్రుని ఉదయమున వృద్ధినొంది చంద్రజలముల పరస్పరాతిరేకానుసారము సముద్రజలముకూడ హ్రసించును. (తగ్గును) ఇదే విధముగ శుక్ల కృష్ణపక్షములందు చంద్రవృద్ధి క్షయముల ననుసరించి సముద్రవృద్ధి క్షయములును జరుగును. ఈ వృద్ధి పరిమాణము పదునైదు వందల అంగుళములుండును.

రెండు వైపులను నీరుండటచే ద్వీపము (ద్వి+ఆప=ద్వీప) అనియు నీటిని నిలుపుకొనునది కావున సముద్రమునకు ఉదధి (ఉద+ధా-నీటిని ధరించు)అనియు వ్యవహారము కలిగినది. భూమిచేత వెలిగ్రక్కబడినవి కావున కొండలకు గిరులు (ఉద్‌+గౄ-వెలిగ్రక్కుట) అనియు పర్వములుకలవి కావున పర్వతములు అనియు (పర్వ=కణుపులు; ఉబ్బెత్తులు) వ్యవహారములు.

శాకద్వీపేతు వై శాకః పర్వతస్తేన చోచ్యతే| కుశద్వీపే కుశస్తమ్బో జనపదస్యతు. 37

క్రౌఞ్చద్వీపే గిరిః క్రౌఞ్చ స్తస్య నామ్నా స ఉచ్యతే| శాల్మల శ్శాల్మలద్వీపే పూజ్యతే స మహాద్రుమః. 38

గోమేదకేతుగోమేదఃపర్వతస్తేన చోచ్యతే| న్యగ్రోదఃపుష్కర ద్వీపేపుష్కరస్తేననస్మృతః. 39

పూజ్యతే7త్రమహాదేవో బ్రహ్మణో7వ్యక్తజన్మనః | అస్మిన్త్స వసతి త్వష్టా సాధ్యై స్సిద్దైః ప్రజాపతి ః. 40

అత్ర దేవా ఉపాస్యన్తే తయస్త్రింశ త్సహర్షిభిః| సచాత్ర పూజ్యతే దేవో దేవదేవోత్తమశ్చ సః. 41

జమ్బూద్వీపే ప్రవర్తన్తే రత్నాని సుబహూన్యపి| ద్వీపేరషు తేషు సర్వేషు వ్రజానాం క్రమశస్తువై. 42

ఆర్జవా ద్ర్బహ్మచర్యేణ సత్యేనచ ద మేనచ| ఆరోగ్యాయుఃప్రమాణాభ్యాం ద్విగుణం ద్విగుణంతతః. 43

ద్వీపేషు శాల్మలాద్యేషు యుదుక్తం వర్షకేతు తత్‌ | గోపాయన్తే ప్రజాస్తత్ర న జరామృత్యుపీడితాః. 44

భోజనం చాప్రయత్నేన సదా స్వయ ముపస్థితమ్‌| షడ్రసంతు మహావీర్యం తత్ర తే భుఞ్జతే జనాః. 45

పరేణ పుష్కరస్యాథ ఆవృత్యావస్థితో మహీమ్‌| స్వాదూదక స్సముద్రస్తు సమన్తా త్పరివేష్టితః. 46

స్వాదూదకస్య పరతః శైలోస్తి పరిమణ్డలః| ప్రకాశ్చాప్రకాశశ్చ లోకాలోక స్స ఉచ్యతే. 47

ఆలోక స్తస్య చార్వాక్చ నిరాలోకస్తతస్తః| లోకవిస్తారమాత్రంతు పృథ్వ్యర్థ ముదకావృతమ్‌. 48

ప్రతిచ్ఛన్నం సమన్తాత్తు ఉదకేనావృతం మహత్‌|

శాక పర్వత(వృక్ష) ముండుటచే శాకద్వీపము-ధేవము నడుమ కుశస్తంబము(దర్భదుబ్బు) ఉండుటచే కుక ద్వీపము-క్రౌంచపర్వత ముండుటచే క్రౌంచద్వీపము-శాల్మలవృక్షము (బూరుగుచెట్టు) ఉండుటచే శాల్మల ద్వీపము-గోమేద రత్న పర్వత ముండుటచే గోమేదద్వీపము- న్యగ్రోధవృక్షము(మర్రి చెట్టు) ఉండుటచే పుష్కర(పుష్కర=మర్రి?)ద్వీపము అని ఆయా ద్వీపములకు వ్యవహారము కలిగినది.

ఈ జంబూద్వీపమునకు అవ్యక్తము (మాయాశబ్దబలము)నకు కూడ మూలకారణమగు బ్రహ్మతత్త్వము కంటె అభిన్నమగు మహాదేవుడు పూజింపబడును. దీనియందే సాధ్యులతో సిద్దులతో కూడ ప్రజాపతియగు త్వష్ట (చతుర్ముఖుడు. హిరణ్యగర్భుడు)నివసించును. ఇచటనే ముప్పది ముగ్గురు దేవతలును ఋషులును ఆరాధింపబడుచున్నారు. దేవదేవోత్తముడగు ఆ దేవుడు (నారాయణుడు) కూడ ఇచ్చట పూజింపబడుచున్నారు. ఈ ద్వీపమునందు అనేకములగు రత్నములును వాడుకలో ఉన్నవి. ఈ చెప్పిన ద్వీపములన్నిటను అచటి ప్రజల ఆర్జవము (వక్రతలేని నడుపడి) బ్రహ్మచర్యము సత్యము దమము మొదలగువానిని బట్టి వారి వారి ఆరోగ్యాయుః ప్రమాణాదికము ఒకదాని యందుకంటె మరియొక దానియందు రెట్టింపు చొప్పున అధికమగుచున్నది. ప్రజలును వారి సద్గుణములచే రక్షింపబడుచున్నారు. జరామృత్యు పీడితులు కాకున్నారు. అచటి జనులు అప్రయత్నసిద్ధమగు షడ్రసాహారమును తిని సుఖముగ జీవింతురు.

పుష్కర ద్వీపమున కావల స్వాదూదక (మంచినీటి) సముద్రమున్నది. దాని కావల చుట్టును లోపలివైపు ప్రకాశము(వెలుగు కలది) వెలుపలి వైపు అప్రకాశము (వెలుగు లేనిది) అగు పర్వతము గుండ్రముగ ఆవరించి ఉన్నది. దీనియందలి ఆలోక విస్తార మాత్రాంశము (ప్రకాశించు భాగము) పృథినీ సంబంధియై దృడాంశముగా ఉన్నది. మిగిలిన ఆలోకభాగము(అప్రకాశాంశము) ఉదకముతో ప్రతిచ్ఛన్నము(పూర్ణముగా కప్పివేయ బడియున్నది) అనపిచెప్పవలసియున్నది.

పృథివ్యాదిమహాభూతవివరణమ్‌

భూమే ర్దశగుణా హ్యాప స్సమన్తా త్ల్పావయ స్మహీమ్‌. 49

అద్భ్యో దశగుణశ్చాగ్నిః సర్వతో ధారయ న్పయః- అగ్నే ర్ధశగుణో వాయు ర్ధారయ న్జ్యోతిరావృతః. 50

తిర్యక్చ మణ్డలో వాయు ర్భూతా న్యావేష్ట్య ధారయ&|తతోపీదం దశాకాశం వాతోద్భూతాని దారయ& 51

సమరో గుళికాకారో బర్హే ర్దశగుణో నభిః| భూతానీకం దశగుణో మహాభూతాని ధారయ & 52

మహాంస్తతో హ్యసత్త్వేన అవ్యక్తేనతు ధార్యతే| ఏవం పరమస్రోత్సన్నా ధార్యతేచ పర్సపరమ్‌. 53

ఆధారాధేయభావేన వికారాస్తే వికారినా| పృథ్వ్యాదయో వికారాస్తే పరిచ్ఛిన్నాః పరస్సరమ్‌. 54

పరస్పరాధికాశ్చైవ పరివిష్టాః పరస్పరమ్‌|యస్మా త్ర్పవిష్టా స్తేన్యోన్యం తస్మాత్థ్సిరతరం గతాః. 55

ఆధత్తే హ్యవశిష్టాస్తు విశేషాన్యోన్యవేశనాత్‌| పృథ్వ్యాదయస్తు వాయ్వన్తాం పరిచ్చిన్నాస్తు తత్రవై. 56

భూతేభ్యః పరతస్తేభ్యో ఆలోక స్సర్వత స్సమః| తథా హ్యాలోక ఆకాశే పరిచ్ఛిన్నాని సర్వశం. 57

పాత్రే మహతి పాత్రాణాం యథైవాన్తర్గతానిచ| భవన్త్యన్యోన్యహీ(ధీ) నాని పర్సపరసమాశ్రయాత్‌. 58

యథా హ్యలోక ఆకాశే తథా త్వన్తర్గతా మతా| కృత్స్నాన్యన్యాని సత్త్వాని అన్యోన్యస్యాధికానితు. 59

యావదేతాని భూతాని తావ దుత్పత్తి రుచ్యతే| జన్తూనామిహసంస్కారోభూతే ష్వన్తర్గతస్‌తువై. 60

ప్రత్యాఖ్యాయేహ భూతాని తావ దుత్పత్తి రుచ్యతే| తస్మా త్పరిమితే ర్బేదా స్స్మృతాం కార్యాత్మకాస్తు వై.

తే కారణాత్మకాశ్చైవ తథైవ మహదాదయః| ఇత్యేష సన్నివేశోవై పృథివ్యాక్రాన్తభాగశం. 62

సప్తద్వీపసముద్రాయాయాథాతథ్యేనవై మయా| విస్తారా జ్జగతశ్చైవ యథామానేన చైవహి. 63

విశ్వరూపం ప్రధానస్య పరిణామైక దేశికమ్‌| ఏతావ త్సన్నివేశోయం మయా సమ్యక్ర్పభాషితః. 64

ఏతావదేవ శ్రోతవ్యం సన్నివేశస్తు వార్థివ| అతఊర్ధ్వం ప్రవక్ష్యామిసూర్యాచన్ద్రమసోర్గతిమ్‌.65

ఇతి శ్రీమత్సమహాపురాణ భూగోళే గోమేదాదిద్వీపవర్ణనం నామ

ద్వావింశత్యుత్తర శతతమో7ధ్యాయః.

ఇతి భూగోళమ్‌.

భూమికి చుట్టున ఉన్న జలము భూమికి పదిరెట్లుండి భూమిని తడుపుతున్నది. దానికి పదిరెట్ల పరిమాణముతో అగ్ని ఈ జలములను నిలిపియున్నది. దానికి పదిరెట్ల పరిమాణముతోనున్న వాయువు అగ్నిని నిలిపి పట్టియున్నది. కాని వాయు మండలము తిర్యక్‌ (అడ్డముగా -Horizontally) ప్రసారము కలది-మిగిలిన పృథివ్యప్తేజ ఆకాశములు గోళాకృతి వ్యాప్తి ప్రసారముల కలవి. వాయువునకు పదిరెట్ల పరిమాణముగల ఆకాశము ఇతర భూతములు గాలిచే చెదరిపోకుండ నలిపి పట్టుచున్నది. దానికంటె అధికమగు పరిమాణముగల సదసదాత్మకమగుమహత్తు ఈ పృథివ్యాది పంచకమును దానికంటెఅధికా పరిమాణముగల అవ్యక్తము ఈ పృథివ్యాధి మహదృత షట్కమును దరించు9నిలిపిపట్టు)చున్నది. ఇట్లవివికారములు(ఉత్పన్నములు) వికారిచే (తమ మూలకారణముచే) నిలుపబడుచు పరస్పరాధారాధేయ భావములోనున్నవి. పృథిని మొదలగునవి అన్నియు వికారములు-ఒకదానికంటె మరియొకటి పరిమాణములో పెద్దవి-ఒకదానినింకొటి నిలిపి పట్టినవి. అవి పరస్పరాను ప్రవేశము చేసియున్నందుననేస్థిరతరత్వము పొంది కదలకయున్నవి. వీనిలో పృథివి-నీకు -అగ్ని వాయువు6ఇవి పరిచ్ఛిన్నములు-ఇది ఇంతవరకున్నవి అని చెప్పశక్యమగును. ఈ నాలుగు భూతములకు ఆవలగానున్న వెలుగుకూడ అన్నివైపుల సమముగా నుండును కావున ఆకాశమందా వెలుగు వ్యాపించి వానిని దీనియందిది యున్నదని చెప్పగలుగుచున్నాము. ఇవి ఇట్లు పెద్ద పాత్ర యందున్న చిన్న పాత్రలవలె నుండి పరస్పర మాశ్రయాశ్రయి భావముతోనుంటచే ఒకదానికంటే ఒకటి చిన్నవన వీలగుచున్నది. అట్లే ఈ ప్రాణులను ఒక విదమగు వాటికంటె మరియొక విధమైనవి అధికమైనవి అనదగియున్నవి. ఈ భూతముల వ్యాప్తియున్నంతమేర ప్రాణుల-భూతముల-ఉత్పత్తియు కలదు. ఈ ప్రాణులు సంస్కార రూపమున భూతములయందంతర్గతములై యున్నవి. కాని అచటి భూతముల పాళ్ళ పరిమితినిబట్టి 'కార్యవశమున కారణ నిర్ణయ'మను యుక్తిచే ఈ ప్రాణులు ఈ భూతము ప్రధానముగాగల ప్రాణులని నిర్ణయించవలెను. (మానవుల శరీరము పార్థివము-మత్స్యముల శరీరముజల ప్రధానము అన్నట్లు)

ఇట్లు పృథివ్యాదికము మహదంతము కార్యము ఏదియో కారణముఏదియో నిర్ణయించవలెను.

ఇట్లు నేను (మత్స్యుడు) పృథివి ప్రధానముగా ఆక్రమించిన సప్తద్వీపాత్మక భూమండల స్థతిని పరిమాణ విస్తరమును యాథాతథ్యముతో తెలిపితిని. ఇది భూసన్నివేవ ప్రకారము.

ఏది ఏమైనను ఈ కనబడు విశ్వమంతయు ప్రకృతి పరిణామమునందలి ఏకదేశము(అల్పాంశము) మాత్రమే.

నేను చెప్పిన ఇంతమాత్రమే వినుటకును చెప్పుటకున శక్యము.

ఇక మీదట సూర్యా చంద్రమసుల గమన ప్రకారము ప్రతిపాదింతును.

ఇది శ్రీమత్సమహాపురాణమున గోమేదాది ద్వీప వర్ణనము. విశ్వమున పృథివ్యాది

భూత సన్నివేశ వర్ణమునను నూట ఇరువది రెండవ అధ్యాయము.

భూగోళ విషయము ముగిసినది.

Sri Matsya Mahapuranam-1    Chapters