Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచవింశత్యుత్తరశతతమో7ధ్యాయః.

వసన్తాదిష్వతుషు సూర్యగణభేదకథనమ్‌.

సూతః :

స రథో7ధిష్ఠితో దేవై ర్మాసేమాసే యథాక్రమమ్‌ | తతో వహత్యథాదిత్యో బహుభి రృషిభిస్సహ. 1

గన్దర్వై రప్సరోభిశ్చ సర్పగ్రామణి రాక్షసైః | ఏతే వసన్తివై సూర్యే మాసౌ ద్వౌద్వౌ క్రమేణతు. 2

ధాతార్యమా పులస్త్యశ్చ పులహశ్చ ప్రజాపతిః | ఉరగా వాసుకిశ్చైవ సకణాదశ్చ

తావుభౌ. 3

తుమ్బుర్యర్నారదశ్చైవ గన్దర్వౌ గాయకేశ్వరౌ | కృతస్థలాప్సరాశ్చైవ యామకా పుఞ్జికస్థలా. 4

గ్రామణీరథగృత్స్నశ్చ రథౌజాశ్చైవ తావుభౌ | రక్షోహేతిః ప్రహేతిశ్చ యాతుధానా వుభౌ స్మృతౌ. 5

మధుమాధవయోర్‌ హ్యేష గణో వసతి భాస్కరే | వసేద్గ్రేష్మేతు ద్వౌమాసౌ మిత్రశ్చ వరుణశ్చవై. 6

ఋషి రత్రిర్వసిష్ఠశ్చ నాగౌ తక్షకరమ్భకౌ | మేనకా సహజన్యాచ గన్దర్వౌచ హహాహుహూః. 7

రథన్తరశ్చ గ్రామణ్యోరథకృచ్చైవ తావుభౌ | పౌరుషో యోధనశ్చైప యాతుధానౌచ తౌస్మృతౌ. 8

ఏతే వసన్తివై సూర్యే మాసయో శ్శుచిశుక్లయోః | ఏతే వసన్తి సూర్యేచ నివసన్తిస్మ దేవతాః. 9

ఇన్ద్రశ్చైవ వివస్వాంశ్చ అఙ్గిరా భృగురేవచ | ఏలాపుత్ర స్తథా సర్ప శ్శఙ్గపాలశ్చ పన్నగః. 10

విశ్వావసూగ్రసేనౌచ ప్రాతశ్చైవ రథస్యహ | ప్రవ్లూెచాచా *ప్సరాశ్చైవానువ్లూెచా చైవ తే ఉభే. 11

యాతుధానా స్తథా హేతి ర్వ్యాఘ్రశ్చైవతు తావుభౌ | నబౌ నభస్యయోరేతే వసన్తితు దివాకరే. 12

మాసౌ ద్వౌ దేవతా స్సూర్యే వసన్తిచ శరదృతౌ | పర్జన్యశ్చైవ పూషాచ భారద్వాజశ్చ గౌతమః. 13

చిత్రసేనశ్చ గన్దర్వ స్తథాచ సురుచిశ్చయః | విశ్వాచీచ ఘృతాచీచ ఉభే తే పుణ్యలక్షణ. 14

నాగశ్చైరావతశ్చాపి విశ్రుతశ్చ ధనఞ్జయః | సేనజిచ్చ సుషేణశ్చ సేనానిగ్రామణీస్తథా. 15

పారావారౌచ ద్వావేతౌ యాతుధానా పుభౌ స్మృతౌ | వసన్త్యౌతే చ వైసూర్యే మాసయో స్త్విషఊర్జయోః.

హైమన్తికౌ చ ద్వౌమాసౌ నివసన్తి దివాకరే | హంసో భగశ్చ ద్వావేతౌ కశ్యపశ్చక్రతుశ్చవై. 17

భుజఙ్గశ్చ మహాపద్మ స్సర్పః కర్కోటక స్తథా | చిత్రసేనశ్చ గన్దర్వో ఘూర్ణాయుశ్ఛైవ మానినౌ. 18

అప్సరాః పూర్వచిత్తిశ్చ గాన్దర్వీ చోర్వశీతథా | తార్‌క్ష్యశ్చారిష్టనేమిశ్చ సేనానిగ్రామణీ చతౌ. 19

సహేచైవ సహస్యేచ వసన్త్యేతే దివాకరే | విద్యుత్స్పర్శశ్చ తావుగ్రౌ యాతుధానా వుభౌ స్మృతౌ. 20

తత శ్శిశిరయోశ్చాపి మాసయో ర్నివసన్తి తే | త్వష్టా చైవ తథా విష్ణు ర్జమదగ్ని స్సకౌశికః. 21

కాద్రవే¸° తథా నాగౌ కమ్బళాశ్వతరా వుభౌ | గన్దర్వౌ ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చాశ్చ తావుభౌ. 22

తిలోత్తమాప్సరాశ్చైవ దేవీ రమ్భా మనోరమా | గ్రామణీ రుతజిచ్చైవ సత్యజిచ్చ మహాయశాః. 23

బ్రహ్మోపేతశ్చ వైరక్షో యక్షోపేతశ్చ వై తథా | ఇత్యతే నివసన్తిస్మ ద్వౌద్వౌ మాసౌ దివాకరే. 24

నూట ఇరువదియైదవ అధ్యాయము.

సూర్యరథస్థ దేవతాభేద కథనము-చంద్రాది గ్రహమండల

స్వరూప-తద్రథాది స్వరూప ప్రతిపాదనము.

అందు వసంతాది ఋతువులందు సూర్యరథస్థ దేవతా గణభేద ప్రతిపాదనము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ సూర్యరథమును ఆయా మాసములందు యథాక్రమమున ఆయా దేవతదలు అధిష్ఠించియుందురు. అందుచేతనే రవి ఆయా మాసములందును ఆయా ఋతువులందును ఆయా ఋషులతో గంధర్వులతో అప్సరసలతో సర్వగ్రామణు (శ్రేష్ఠు)లతో రాక్షసులతో కూడి తన రథమును నడుపుకొనుచుపోవు చుండునని వేదశాస్త్రములందు చెప్పబడుచున్నది.

సూర్యరథమున 1. వసంత ఋతువునందు-మధు-మాధవ-మానములు; ధాత-అర్యమన్‌-ఆదిత్య దేవతాభేదములు;పులస్త్యవులహులు-ఋషులు-వాసుకి కణాదులు నాగులు-నారద తుంబురులు గంధర్వులు-కృతస్థలాపుంజికస్థలలు అప్సరసలు-రథగృత్స రథౌజసులు గ్రామణులు-హేతిప్రహేతులు రాక్షసులు. 2. గ్రీష్మర్చువునందు-శుచి-శుక్రమానములు; మిత్రుడు-వరుణుడు-ఆదిత్య దేవతాభేదములు-అత్రి వసిష్ఠులు ఋషులు-తక్షకరంభకులు నాగులు-హాహాహూహులు గంధర్వులు-మేనకాసహజన్యలు అప్సరసలు-రథంతర రథకృత్‌లు గ్రామణులు-పౌరుషయోధనులు రాక్షసులు; 3. వర్షర్తువునందు-నభస్‌-నభస్య-మాసములు-ఇంద్ర-వివాస్వాన్‌-లు ఆదిత్య దేవతాభేదములు-అంగిరుడు భృగువు ఋషులు-ఏలాపుత్త్ర శంఖపాలులు నాగులు-విశ్వావసూగ్రసేనులు గంధర్వలు-ప్రవ్లూెచా7నువ్లూెచలు అప్సరసలు-హేతి-వ్యాఘ్రలు రాక్షసులు; 4.శరదృతువునందు ఇషము ఊర్జము మాసములు-పర్జన్యుడు-పూషన్‌-ఆదిత్య దేవతాభేదములు-భారద్వాజుడు-గౌతముడు ఋషులు-ఐరావతుడు-ధనంజయుడు-నాగులు-చిత్రసేనుడు-సురుచి-గంధర్వులు-విశ్వాచీ-ఘృతాచీ-అప్సరసలు-సేనజిత్‌-సుషేణుడు-గ్రామణులు-పారుడు-అవారుడు రాక్షసులు; 5. హేమంతమున సహస్‌-సహస్య-మాసములు-హంసుడు-భగుడు-ఆదిత్యదేవతాభేదములు-కశ్యపుడు-క్రతువు-ఋషులు-మహాపద్ముడు-కర్కటకుడు-నాగులు-చిత్రసేనుడు-ఘూర్ణాయువు-గంధర్వులు-

__________________________________________________________________________

* ప్రవ్లూెచన్త్యప్సరాశ్చైవానుచన్తీతథైవచ

పూర్వచిత్తి-ఊర్వశి-అప్సరసలు-తార్‌క్ష్యుడు-అరిష్టనేమి-గ్రామణులు-విద్యుత్‌-స్పర్శుడు-రాక్షసులు; 6. శిశిర ఋతువునందు తపన్‌-తపస్య మాసములు-త్వష్ట-విష్ణువు ఆదిత్య దేవతాభేదములు-జమదగ్ని-కౌశికుడు-ఋషులు-కంబళుడు-అశ్వతరుడు-నాగులు-ధృతరాష్ట్రడు-సూర్యవర్చస్‌-గంధర్వులు-తిలోత్తమ-రంభ-అప్సరసలు-రుతజిత్‌-సత్యజిత్‌-గ్రామణులు-బ్రహ్మోపేతుడు-యక్షోపేతుడు-రాక్షసులు.

స్థానాభిమానినోహ్యేతే గణా ద్వాదశసత్తమాః | సూర్య మాప్యాయయన్త్యేతే తేజసా తేజ ఉత్తమమ్‌.

గ్రథితైసై#్త ర్వచోభిశ్చ స్తువన్తి ఋషయో రవిమ్‌ | గన్దర్వాప్సరసశ్చైవ గీతనృత్తై రుపాసతే. 26

విద్యాగ్రామణినో యక్షాః కుర్వన్తి స్మేశసఙ్గ్రహమ్‌ | సర్పాస్సర్పన్తివై సూర్యం యాతుధానగణా అపి. 27

వాలఖిల్యాస్తు యాన్తిస్మ పరివార్యోదయా ద్రవిమ్‌ | ఏతేషామేవ దేవానాం యథావీర్యం యథా వయః. 28

యథాయోగం యథాధర్మం యథాతత్త్వం యథాబలమ్‌ | తథా తపత్యసౌ సూర్య స్తేషాం వృద్ధిస్తు తేజసామ్‌. 29

భూతానా మశుభం సర్వం వ్యపోహయతి తేజసా | మానవానాం శుభం హ్యేత ద్ద్రియతే దురింతతు యత్‌. 30

దురితం శుభచారాణా మపహన్తి క్వచిత్కృతమ్‌ | ఏతే భ్రమన్తి సూర్యేణ సహైతే సామగా దివి. 31

తపన్తశ్చ జయన్తశ్చ హ్లాదయన్తశ్చ వైప్రజాః | గోపయన్తిస్మ భూతాని ఇహ తేహ్యనుకమ్పయా. 32

స్థానాభిమానినా మేత త్థ్సానం మన్వన్తరేషు వై | అతీతానాగతానాంచ వర్తన్తే సామ్ప్రతంచయే.

ఏవం పసన్తివై సూర్యే సప్తకాస్తు చతుర్దశ | చతుర్దశసు వర్తన్తే గణా మన్వన్తరేష్విహ. 34

గ్రీష్మే హిమేచ వర్షాసు ముఞ్చమానా యథాక్రమమ్‌ | ఘర్మంచ హిమతోయంచ యథాక్రమ మహర్నిశమ్‌. 35

(ఈ చెప్పిన దేవాది గణములు సూర్యరథమును ఆయా మూసములం దధిష్ఠించియుండుటలోని తాత్త్వికార్థమును పురాణమే ఇట్లు చెప్పుచున్నది:)1. ఈ ద్వాదశ సత్తములు (సత్‌-తమ-దేవశ్రేష్ఠులు)ను ఆయా మాసస్థానాభిమాని దేవతలు; మానభేదమున భిన్నదశలనొందు తమ తేజో విశేషముచే ఉత్తమ తేజోమూర్తియగు రవిలోని సూర్య ప్రధానతత్త్వమును ఆప్యాయన మొందింతురు; (ప్రీతునొనరించి అధిక శక్తి సంపన్నుని చేయుదురు.) ఋషులు తాము గ్రథనము (కూర్పు) చేసిన వచస్సులతో రవిని స్తుతింతురు.(ఋషులు వాగాత్మక తత్త్వరూపులు); గంధర్వలు నృత్తగీతములతో రవి నుపాసింతురు. గ్రామణులనగా-ఊరి పెద్దలు-వీరు విద్యాగ్రామణులు-త్రయీ విద్యలకును తదంగ విద్యలకును తద్‌ గ్రామ (సముహ)-మునకును ముఖ్యముగా దేవతాస్తావక గానప్రధానమగు స్వరముల-గ్రామమునకును అధిష్ఠాతలు: కనుకనే వీరు ఈశ సంగ్రహము (రవి యందర్నిహితమగు పరమేశ తత్త్వమును ప్రసన్న మొనర్చు పనిని) నెరవేర్తురు: సర్వగణములు రవిని సర్పణమొనరింతురు-రవి రథమును ముందునకు ప్రసరించు ప్రవృత్తికి సహాయకులుగా నుందురు: రక్షోగణము కూడ ఇదేపనిని (రథరక్షా రూపమున) నిర్వర్తింతురు. వీరుకాక పైగణములలో చెప్పకయు శ్రుతి పురాణములందు ఉదయము మొదలు అస్తమయమువరకు రవి రథము వెంటనుందురని చెప్పిన వాలఖిల్యఋషులు రవిని పరివారించి వెంటనుందురు. వీరు సౌరశక్తి సర్వస్వ రూపులగు ఋషులు.

ఇంతయేల? ఈ చెప్పిన దేవతాది గణముల వీర్యమును వయస్సును యోగమును (అమరికను) ధర్మమును తత్త్వమును బలమును (ఇవి అన్నియు శ్రుతులయందును కలవు. ఇచట చెప్పబడలేదు.) అనుసరించి సూర్యుని తేజమాయా దేశకాలములందు వృద్ధినొందుచు పరిణమించుచు నుండును. వాని ననుసరించి రవి తపించు చుండును. ఆ దేవుడు ఆ శక్తితో తన తేజస్సుతో భూతముల యశుభము పోగొట్టి దురితమును హరించి వానికి శుభమును కలిగించును. శుభాచారులును ఒకొనొకచో (తెలిసియో తెలియకయో) చేసిన దురితమునుకూడ ఆరవి నశింపజేయును. ఈ విషయమున సూర్యునకు సహకారులై ఈ దేవాది గణములవారు తమతమ పరివారముతో కూడ సంచరించుచు భూతములపై దయతో

వానికి వేడిమి వెలుగులనిచ్చుచు జయము కలిగించుచు సంతోష పెట్టుచు వానిని కాపాడుచుందురు.

ఈ సప్తకము (ఆదిత్య-ఋషి-సర్ప-గంధర్వాప్సరోగ్రామణి రక్షోగణములు ఏడు) ఇంతవరకును గడచిన-ఇపుడు జరుగుచున్న-ఇకముందు రానున్న-మన్వంతరములందు

పదునాల్గింటియందును ఇదే విధముగా స్థానాభిమానులుగా ఉండి హిమవర్షాది ఋతువులయందు యథాక్రమముగ ఉష్ణ హిమ వృష్ట్యాదికమును విశ్వమునందు అహర్నిశములును ప్రవర్తిల్లజేయుచుందురు.

గచ్ఛత్యసౌవ్రతవశా త్పరివృత్తరశ్మి ర్దేవాన్పతృంశ్చ మనుజాంశ్చ స తర్పయన్వై |

శుక్లేచ పూర్ణన్తమనుక్రమేణ కళాక్షయే నైవపునః పిబన్తి. 36

సోమేన యచ్చామృత మన్య సృష్టం కృష్ణక్షయే రశ్మిషు రక్షితం తత్‌ |

సర్వే7మృతం తత్పితరః పిబన్తి దేవాశ్చ సౌమ్యాశ్చ తథైవ కామ్యాః. 37

సూర్యేణ గోభిర్హి వివర్దితాభిః పునశ్చ తైరేవ సముచ్ఛ్రితాభిః |

పుష్టంతి వృష్యాభి రివౌషధీభి ర్మర్త్యాం స్తథాన్నేన సమేధయన్తి. 38

అమృతేన తృప్తి రర్దమాసం సురాణాం మాసం తు స్వాహాభిః స్వధయాపితృణామ్‌|

అన్నేన జీవన్త్యనిశః మనుష్యా స్సూర్య స్స్యయం తద్ధి బిభర్తి గోభిః 39

ఇత్యేష ఏకచక్రేణ సూర్యం స్తూర్ణం ప్రవర్తతే | తత్ర తైరక్రమై రశ్వై స్సర్పతేసౌ దినక్షయే. 40

హరిర్హరిద్భి ర్హ్రియతే తురఙ్గమైః పిబన్త్యపో గో-హరి-భి స్సహస్రధా |

పున ప్రయచ్ఛ త్యథ తాశ్చ యోహరి స్సమూహ్యమానో హరిభి స్తురఙ్గమైః. 41

అహోరాత్రం రథేనాసా వేకచక్రేణ వై భ్రమ& | సప్తద్వీప సముద్రాంతు సప్తభిస్సప్తిభి ర్హృతమ్‌. 42

ఛన్దోరూపైస్తు తైరశ్వై ర్యతశ్చక్రం దివస్పతిః | కామరూపై స్సకృద్యుక్తైః కామగై సై#్త ర్మనోజవైః. 43

హరితై రవ్యయైః పింగైరీశ్వరై ర్బ్రహ్మవాదిభిః | వాహ్యతే7 నన్తరం చైవ మణ్డలం దివస క్రమాత్‌. 44

కల్పాదౌ సమ్ప్రయుక్తాశ్చ వహన్త్యాభూతసవ్ల్పుమమ్‌ | ఆవృతో వాలఖిల్యైశ్చ భ్రమతే రాత్ర్యహానితు. 45

గ్రథితై స్స్వవచోభిశ్చ స్తూయమానో మహర్షభిః | సేవ్యతే గీతనృత్యైశ్చ గన్దర్వాప్సరసాం గణౖః. 46

పతంగైః పతగై రశ్వై ర్బ్రామ్య మాణో దివస్పతిః |

ఈ రవి తన వ్రతముల (క్రియాశక్తి ప్రవృత్తి)వశమున (చంద్రకిరణములుగా) మారుచుండెడి తన కిరణములతో దేవతలను పితరులను మనుజులను తృప్తి నొందించుచుండును. అది ఎట్లనిన-సోముడు శుక్ల పక్షమున రవియందలి అమృతమును తనయందలి యమృతముగా

సృష్టించుకొని తనయందు రక్షించుకొనును. అతనిని (అతనియందలి యమృతమును)సౌమ్యులు (సోమార్హులైన యజ్ఞములం దారాధ్యు లు)-కామ్యులు(యజనముచే తృప్తులై యజమానులకు కామముల నొసగు వారు) అగు దేవతలును పితృ దేవతలును అనుక్రమమున త్రావుదురు. అదియే చంద్రునియందు కళాక్షయరూపమున కనబడుచున్నది. ఈ దేవతలును పితరులను తామట్లు తృప్తి నొంది వృష్యౌషధములతోవలె మనుజులను ఆయా అన్నములతో పోషించి ఉత్తేజింపజేయుచున్నారు. దీని రహస్య మేమన-అమృతము త్రావుటచే దేవతలకు కలుగు తృప్తి అర్దమాసము వరకు మాత్రమే యుండును. కాని స్వాహాకారములో దేవతలను స్ధాకారమలతో పితరులను యజించుటచే వారికి కలుగు తృప్తి మాసము పాటుండును. కాని మనుజులు అన్నముతోనే జీవింతురు. రవి ఆ మానవాహారమగు అన్నమును తన కిరణముల రూపమున తనయందు నిలుపుకొని యుండును. (అదియే చంద్రుని ద్వారమున సోమాది హవిరాది రూపమున దేవతలకును కవ్యాది రూపమున పితరులకును అంది తదనుగ్రహమువ అన్న రూపమున మనుజులకు చేరును.) ఇట్లు రవి తన కిరణములయందు నిలుపుకొనిని దేవ పితృ మనుజాహార జన్యతృప్తియే రవి రథపు ఏకచక్రము. ఇట్టి ఏకచక్ర రథముతో రవి వేగముగా ప్రవర్తిల్లుచుండును. అక్కడనే (అంతరిక్ష ద్యులోకములందే) అక్రమములు (క్రమము=పాదవిన్యాసము; పాద విన్యాసము చేయనివి అక్రమములు) అయిన అశ్వములతో సాయంకాలమున ముందునకు ప్రసరించును. (అందుచే సూర్యుడు అస్తమించుట జరుగును.) సూర్యుడు ఇట్లు పచ్ఛని గుర్రములచే కొనిపోబడును. కిరణము లనెడు గుర్రములతో నీటిని వేయి విధములుగా త్రాగును. మరల పచ్చని గుర్రములతో రథముపై కొనిపోబడుచు మరల ఆ జలమును భూతలములకు అందజేయును.

ఈ దివస్పతియగు రవి అహోరాత్రములను ఏడు గుర్రములచే లాగబడు ఏకచక్రయుతమగు రథముతో సప్తద్వీప సప్త సముద్ర ఘటితమగు ఈ పృథవీ చక్రము నంతను భ్రమించుచుండును.ఆ అశ్వములు సప్తచ్ఛందోరూపములు; కామరూపములు; కామగమములు (భగవంతుని-లేదా సూర్యుని -సంకల్పానుసారము పోవునవి)మనోవేగయుతములు; సకృద్యుక్తములు(ఒకమారు పూన్చినంతనే మరల పూంచుచు విప్పుచుండవలసిన పని లేనివి) హరితవర్ణము కలవి;పింగవర్ణమును కలవి;ఎన్నటికిని ఏ మార్పును లేకయుండునవి; అవి ఈశ్వరములు(సర్వసమర్ధములు; బ్రహ్మవాదులు (వేద విజ్ఞానవంతములు): అట్టి అశ్వములతో మోయబడు రథమున రవి దివసక్రమమున మండల రూపమున నిరంతరముగా సాగిపోవుచుండును.

ఈ ఛందోమయాశ్వములను కల్పాదియందు ఒకసారి రథమున పూన్చినంతనే భూత సంప్లవ (ప్రళయ) పర్యంతము ఆ రథమును అవి మోసుకొనిపోవుచునే యుండును.

దివస్పతి(ద్యులోకాధిపతి)యగు రవి తన కిరణముల శక్తిని మారు రూపములగు వాలఖిల్య ఋషులు పరివారమయి తనవెంట నుండగా మహర్షు లందరు తాము కూర్చిన వచ్చస్సులతో స్తుతించుచుండగా గంధర్వాప్సరోగణములు గీతనృత్యములతో సేవించుచుండగా పక్షములు కలవియు పక్షివలె ఆకాశమున పోవునవియు నగు అశ్వములు తన రథమును మోయుచు త్రిప్పుచుండగా రాత్రింబవళ్లు అంతరిక్ష ద్యులోకములందు సంచరించుచుండును.

చన్ద్రమణ్డలపరిమాణాదికథనమ్‌.

వీథ్యా7నయా7పిచరతే నక్షత్రాణి తథా శశీ. 47

హ్రాసపృద్దీ తథైవాస్య రశ్మయ స్సూర్యవత్మ్సృతాః | త్రిచక్రోభయతోశ్వశ్చ విజ్ఞేయ శ్శశినో రథః. 48

అపాంగర్భా త్సముత్పన్నో రథస్సాశ్వ స్ససారథిః |

సుతారై సై#్తస్త్రిభి శ్చక్రైర్యుక్త శ్శుక్లైర్హ యోత్తమైః. 49

దశభి స్తురగై ర్దివ్యై రసంగై సై#్తర్మనోజవైః | సకృద్యుక్తరథే తస్మిన్‌ వహన్త స్త్వాయుగక్షయాత్‌. 50

సమ్ప్రస్థితే రథే తస్మి& శ్వేతచక్రాశ్వవాంశ్చ వై | అశ్వా స్తమేకవర్ణైశ్చ వహన్తే శఙ్గవర్చసః. 51

అజ శ్శతముఖశ్చైవ వృషో వాజీ నరో హ్వయః | అశ్మశ్చ సప్తధాతుశ్చ హంసో వామో మృగస్తథా. 52

ఇత్యేతే నామభి స్సర్వై ర్దశ చన్ద్రహయోత్తమాః | ఏతే చన్ద్రమసం దేవం వహన్త్యశ్వా 77యుగక్షయమ్‌. 53

దేవైః పరివృత స్సోమః పితృభిశ్చైవ గచ్ఛతి | సోమశ్చ శుక్లపక్షాదౌ భాస్కరే పరతః స్థితే. 54

ఆపూర్యతే పరో భాగ స్సోమస్య తు అహఃక్రమాత్‌ | తతః పితృక్షయం సోమం యుగప ద్వ్యాప్యతే రవిః. 55

పీతం పఞ్చదశాహంతు రశ్మినై కేన భాస్కరః | ఆపూరయం స్తదేవేమం భాగం భాగ మహః క్రమాత్‌. 56

సుషుమ్నా పూర్యమాణస్య శుక్లే వర్ధన్తి తాః కలాః | తస్మాద్ద్రసన్తివై కృష్ణే శుక్లే హ్యాప్యాయయన్తిచః. 57

ఇత్యేవం సూర్యవీర్యేణ చన్ద్రస్యాప్యాయితం వపుః | పౌర్ణమాస్యాం ప్రదృశ్యేత శుక్లే సమ్పూర్ణమణ్డలః. 58

ఏవ మాప్యాయిత స్సోమ శ్శుక్లపక్షే ష్వహఃక్రమాత్‌ | తతో ద్వితీయాప్రభృతి బహుళస్య చతుర్దశీమ్‌. 59

అపాం సారమయస్యేన్దో రమృతాత్మాత్మకస్య తు | పిబన్త్యమ్బుమయం దేవా మధు సౌమ్యం తథా7 మృతమ్‌. 60

చంద్రమండల- తద్రథాది -ప్రతిపాదనము

చంద్రుడును నక్షత్రమయమగు వ్యోమవీథియందే సూర్యుని వలెనే సంచరించును. ఇతని హ్రాస(క్షయ)వృద్దులును కిరణముల విషయమును సూర్యుని విషయమునందే చెప్పబడినవి. అవి అట్లే గ్రహింపవలెను. ఇచట వేరుగా చెప్పపని లేదు. చంద్రరథమునకు చక్కని తారలతో ఏర్పడిన మూడు చక్రములును కాడికి రెండు వైపులను తెల్లని మేలగు గుర్రములును ఉండును. ఇతని రథమును అశ్వములును సారథియును జలగర్భమునుండి ఉత్పన్నమయినవి. అజ-శతమఖ-వృష-వాజి-నరా7శ్మ-సప్తధాతు- హంస-వామ-మృగ-నామములు గల మనోజపములగు ఆ పది అశ్వములును శంఖము వంటి తెల్లని ఒకేవన్నె కలవి. తెల్లని రథమున ఒకసారి పూన్చిన ఆ అశ్వములు ప్రళయ పర్యంతము చంద్ర భగవానుని మోయుచుండును.

చద్రుని పరివారముగా అతని వెంట దేవతలును పితృ దేవతలు నుందురు. శుక్ల పక్షారంభమునుండి సూర్యుడు చంద్రునకు ఆవలగా నుండి సుషుమ్నా మార్గమున తన యొక్కొక్క కిరణముతో నింపుచు పోవును. పితరులును దేవతలును కృష్ణపక్షమున చంద్రుని యందలి అమృతము త్రాపుటచే క్షీణించుని యంశము ఇట్లు పూరింపబడును అందుచేతనే శుక్లపక్షమున చంద్రకలలు వృద్ది చెందును; కృష్ణమున క్షీణించును. ఇట్లు సూర్యునిచే కలిగిన ఆప్యాయనము చంద్రకలావృద్ధికి హేతువై అతడు పూర్ణిమనాడు సంపూర్ణ మండలుడై కనబడును. కృష్ణపక్ష ద్వితీయ మొదలు కృష్ణచతుర్దశి వరకు దేవతలును పితరులును జలసారమయుడును అమృతమయుడు నగు చంద్రుని చాంద్ర మధువును-అమృతమును-త్రావుదురు.

సమ్భృతం వర్దమానేచ అమృతం సూర్యతేజసా | భక్ష్యార్థ మాగతం సోమం పౌర్ణమాస్యా ముపాసతే. 61

ఏతరాత్రం సుర్తైస్సార్దం పితృభి రృషిభిశ్చవై | సోమస్య శుక్లపక్షాదౌ భాస్కరాభి ముఖస్యతు. 62

ప్రక్షీయతే పరోభాగః పీయమానః కలాక్రమాత్‌ | త్రయస్త్రింశచ్ఛతైస్సార్ధం త్రయస్త్రింశ త్తథైవచ. 63

త్రయస్త్రింశత్సహస్రాణి దేవాస్సోమం పిబన్తివై | ఇత్యేవం పీయమానస్య కృష్ణే వర్ధన్తి తాఃకలాః. 64

క్షీయన్తేచ తతఃకృష్ణే శుక్లే హ్యాప్యాయయన్తిచ | ఏవం దినక్రమా త్పీతే దేవైరపి నిశాకరే. 65

పీత్వార్దమాసం గచ్ఛన్తి అమావాస్యం సురాశ్చ తే | పితరశ్చాపి తిష్ఠన్తి అమావాస్యాం నిశాకరమ్‌. 66

తతః పఞ్చదశే భాగే కిఞ్చిచ్ఛేషే నిశాకరే | తతోపరాహ్ణే పితరో జఘన్యే దివసే పునః. 67

పిబన్తి ద్వి*కలంకాలం శిష్టాస్తస్య కలాస్తుయాః | వినిభ్రష్టం త్వమావాస్యాం గభస్తిభ్య స్తథామృతమ్‌. 68

అర్ధమానసమాప్తోతు పీత్వా గచ్ఛన్తి తే7మృతమ్‌ | సౌమ్యా బర్హిషదశ్చైవ అగ్నిష్వాత్తాశ్చ యే స్మృతాః. 69

కావ్యాశ్చైవ తు యేప్రోక్తాః పితర స్సర్వఏవతే | సంవత్సరాస్తు వై కావ్యాః పఞ్చాబ్దా యేద్విజాః. స్మృతాః. 70

సౌమ్యాస్తుఋతవో జ్ఞేయా మాసా బర్హిషద స్తథా | అగ్నిష్వాత్తా ర్తవాశ్చైవ పితృసర్గోహ్యయం ద్విజాః. 71

పితృభిః పీయమానాయాం పఞ్చదశ్యాంతు వైకలా | యావ న్నక్షీయతే తస్య భాగః పఞ్చదశస్తు సః. 72

అమావాస్యాం తథా తస్య అన్తరా పూర్యతే పరః | వృద్ధి¸°వై పక్షాదౌ షోడశ్యాం శశినః స్స్మృతౌ. 73

+ఏవం సూర్యసముద్దేశా త్‌క్షయద్దీ నిశాకరే|

ఇట్లు వర్దమాన-శుక్ల-పక్షమున సూర్యతేజస్సుచే చంద్రునియం దమృతము నింపబడును. దేవతలును పితరులును తమకు భక్ష్యమై వచ్చిన సోముని పూర్ణమనాడు పరివారించి యుందురు. ఇది ఒక రాత్రి మాత్రమే. శుక్లపక్షాది తిథినుండి భాస్కరాభిముఖుడై యున్నందున నింపబడిన చంద్రుని పరభాగము కలాక్రమమున ఆనాటినుండి దేవతలచే పిత

___________________________________________________________________________*లవం +ఏవం సూర్యనిమిత్తైషా క్షయవృద్ధి ర్నిశాకరే.

రులచే ఋషులచే (ఉపాసకులచే) త్రావబడి క్షయించును. చంద్రామృతపానము చేయు దేవతల సంఖ్య ముప్పది మూడు వేలును ముప్పది మూడు వందలును మూడు=36333 అగును. ఇట్లర్దమాసముపాటు చంద్రామృతపానము చేసి దేవతలు వెడలిపోవుదురు. (కావ్యులు బర్హి షదులు అగ్నిష్వాతులు అను) పితరులు నిలచియుండి అమావాస్యనాటి అపరాహ్ణవు కడపటి భాగమున రెండు కలల కాలమున చంద్రుని పంచదశ భాగమున మిగిలి జారిపడిన కలాశేషమును గ్రహించి దానియం దింకను మిగిలియున్న అమృతము త్రావి వెడలి పోవుదురు. పితృ దేవతల కందరుకును కావ్యులు అని సాధారణముగా వ్యవహరము ముందు 140 అ. లో చూచునది.

ఇట్లు పితరులు పదునైదవ కలను అమావాస్యనాడు త్రావుటతో అది అంతయు నిశ్శేషముగ క్షయించుటకు లోపలనే ఆ చంద్ర మండలములో రవి కిరణవశమున మరియొక కల పూరింపబడును. ఇట్లు శుక్లపక్షారంభమునుండి చంద్రకలావృద్దియు కృష్ణపక్షారంభమునుండి చంద్రకలాక్షయమును ఆరంభమగును. వృద్ది పదునారు కలల వరకు జరుగును. ఇట్లు చంద్రుని యందు కలుగు కలావృద్ది క్షయములు సూర్యవశముననే జరుగును.

తారాగ్రహణాం వక్ష్యామి స్వర్బానోస్తు రథం పునః. 74

యః ప్రయాతి సుశుభ్రస్తు సోమపుత్త్రస్య వైరథః | యుక్తో హయైః పిశ##ఙ్గైస్తు అష్టభి ర్వాతరంహసైః. 75

శ్వేతః పిశఙ్గ స్సారజ్గో నీల శ్శ్యామైపి లోహితః | శ్వేతశ్చ హరితశ్చైవ చిత్రవర్ణా స్తథైవచ. 76

అష్టభిసై#్త ర్మహాభాగై రుత్తమై ర్వాతరంహసైః | తతో భౌమరథశ్చాపి అష్టాఙ్గైః కాఞ్చన స్స్మృతః. 77

అష్టభి ర్లోహితై రశ్వై స్సధ్వజై రగ్నిసమ్భవైః | సర్పతేవై కుమరోసా వృజువక్రాతివక్రగః. 78

తతస్త్వాఙ్గిరసో విద్వా దేవాచార్యో బృహస్పతిః | గౌరాశ్వేనతు రౌక్మ్యేణ స్యన్దనేన విసర్పతి. 79

యుక్తేనాష్టాభిరశ్వై శ్శ ధ్వజ రగ్నిసముద్భవైః | అబ్దం వసతి యో రాశౌ స్వాం దిశం తేన గచ్ఛతి. 80

యుక్తేనాష్టాభిరశ్వై శ్చ సధ్వజై రగ్ని సమ్భవైః | రథేన క్షిప్రవేగేన భార్గవ స్తేన గచ్ఛతి. 81

తత శ్శనైశ్చరోప్యశ్వై శ్శబళై ర్వాతరంహసైః | కార్షాయసం సమారుహ్య స్యన్దనం యాత్యసౌ శ##నైః. 82

స్వర్భానోస్తు తతోష్టాశ్వాః కృష్ణావై వాతరంహసః | రథం తమోమయం తస్య వహన్త స్సముదఞ్చితాః. 83

ఆదిత్యమేతి సోమంచ తమస్సర్వేషు పర్వసు | తతః కేతుమత శ్చాశ్వా అష్టాఙ్గా వాతరంహసః. 84

పలాలధూమవర్ణాభాః కేతోరశ్వా స్సుదారుణాః | ఏతే వాహా గ్రహాణాంవై మయా ప్రోక్తా రథైస్సహ. 85

కుజ బుధ గురు శుక్ర శనులకు తారాగ్రహములని జ్యోతిఃశాస్త్ర వ్యవహారము. వీరి రథముల విషయమును రాహుకేతు రథ విషయమును ఇక తెలిపెదను.బుధ రథము-తెల్లనిది. దానికి శ్వేత పిశంగ సారంగ నీలశ్యామలోహిత హరిత చిత్రవర్ణములగు గలిగి వాయువేగము గల ఎనిమిది యశ్వములు పూన్చియుండును. కుజుని రథమును సధ్వజములు సలక్షణములగు అష్టాంగములు కలిగినవై అగ్నినుండి పుట్టిన ఎనిమిది ఎర్రని గుర్రములు లాగుచుండ అతడు దానిపై ఋజు-వక్రాతివక్రగతిత్రయముతో సంచరించుచుండును. బృహస్పతి రథము బంగారుతో చేసినది. దానికి అగ్నిసంభవములగు గౌరాశ్వము లెనిమిది పూన్చియుండును. అతడు ప్రతి రాశియందును సంవత్సరముండుచు తన గతిక్రమమున సంచరించును. శుక్రుని రథమును ధ్వజమును అగ్నిసంభవములగు ఎనిమిది గుర్రములును కలిగి మహావేగవంతమయి యుండును. శనియు శబల (మిశ్రిత)వర్ణము వాయువేగము కలిగిన గుర్రములు పూన్చిన ఇనుపరథ మెక్కి నెమ్మదిగా పోవును.రాహురథము తమోమయము; దానికి వాయు వేగములగు నల్లని గుర్రము లెనిమిది

యుండును.కేతురథాశ్వములు సలక్షణాష్టాంగయుతములై పలాల ధూమవర్ణములై దారుణములైనవి. వాయువేగములు ఇవి ఆయాగ్రహముల రథముల-అశ్వముల- విషయము.

సర్వే ధ్రువనిబద్దాస్తే నిబద్దా వాతరశ్మిభిః | ఏతేవై భ్రమాణాస్తే యథాయోగం వహన్తితే. 86

వాయవ్యాభి రదృశ్యాభిః ప్రబద్దా వాతరశ్మిభిః | పరిభ్రమన్తి తద్బద్దా శ్చన్ద్రసూర్యగ్రహా దివి. 87

యావన్త మనుపరియంతి ధ్రువం తే జ్యోతిషాంగణాః | యథా నద్యుదకే నౌస్తు ఉదకేన సమూహ్యతే. 88

తథా దేవగృహాణి స్యు రూహ్యన్తే వాతరంహసా | తస్మా ద్యదత్ర దృశ్యన్తే వ్యోమ్ని దేవగృహా దివి. 89

యావత్యశ్చైవ తారాస్స్యు స్తాపత్యశ్చ మరీచయః | సర్వా ధ్రువనిబద్ధాస్తా భ్రమన్త్యో భ్రామయన్తితమ్‌. 90

తథా భ్రమన్తి జ్యోతీంషి వాతావిద్దాని సర్వశః | అలాతచక్రవద్యాన్తి వాతచక్రేరితాని తు. 91

యస్మాత్ప్రవహతే తాని ప్రవహస్తేన స స్స్మృతః | ఏవం ధ్రువే నియుక్తోసౌ భ్రమతి జ్యోతిషాం గణః. 92

ఏష తారమయో జ్ఞేయ శ్శింశుమారో ధ్రువో దివి | యదహ్నా త్కురుతే పాపం దృష్ట్వా తాని విముచ్యతే. 93

శింశుమారశరీరస్థా యావన్త్య స్తారకా మతాః | వర్షాణి దృష్ట్వా జీవన్తి తావదేవాధికానితు. 94

శింశుమారకృతిం జ్ఞాత్వా ప్రవిభాగేన సర్వశః | ఉత్తానపాద స్తస్యాథ విజ్ఞేయ శ్చోత్తరేహనౌ. 95

యజ్ఞో7ధరేతు విజ్ఞేయో ధర్మో మూర్దాన మాశ్రితః | హృది నారాయణ స్సాధ్యా హ్యశ్వినౌ పూర్వపాదయోః. 96

వరుణ శ్చార్యమాచైవ పశ్చిమే తస్య సక్థిని | శిశ్నే సంవత్సరో జ్ఞేయో మిత్ర శ్చాపాన మాశ్రితః. 97

పుచ్ఛే7గ్నిశ్చ మహేన్ద్రశ్చ మారీచః కాశ్యపో ధ్రువః | ఏష తారామయఃస్తమ్బో నాస్తమేతి నచోదయమ్‌. 98

నక్షత్రచన్ద్రసూర్యశ్చ గ్రహా స్తారాగణౖ స్సహ | తన్ముఖాభిముఖాస్సర్వే చక్రభూతా దివి స్తితాః. 99

ధ్రవేణాధిష్ఠితాశ్చైవ ద్రువమేవ ప్రదక్షిణమ్‌ | పరియన్తిచ సుర శ్రేష్ఠం మేథీభూతం ధ్రువం దివి. 100

ఆగ్నీధ్రకాశ్యపానాంతు తేషాం స పరమో ధ్రువః | ఏక ఏవ భ్రమత్యేష మేరో రన్తరమూర్దని. 101

జ్యోతిషాం తక్రమాదాయ ఆకర్షం స్తమధోముఖః | మేరు మాలోకయన్నేవ ప్రతియాతి ప్రదక్షిణమ్‌.102

ఇతి శ్రీమత్య్యమహాపురాణ ఖగోళే సూర్యమణ్డలాదికథనం నామ పఞ్చవింశత్యుత్తరశతతమో7ధ్యాయఃయ.

ఈ సూర్యచంద్రాది గ్రహములును జ్యోతిర్గణములును అన్నియు వాతమయములగు పగ్గములతో ఆయా అమరికలతో ధ్రవునితో బిగింపబడి కంటికి కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు-మరీచులు-(కిరణములును-కిరణయుతములగు జ్యోతిస్సులును) అవియు ధ్రువునితో నిబద్దములై తా మతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కవకాశము నిచ్చుచున్నవి. (ధ్రువుడు తన చుట్టు తాను తిరుగుచు జ్యోతిర్గణములనుకూడ తన చుట్టు త్రిప్పుచున్నాడు;) ఇవన్నియు వాయుమయ చక్రముచే ప్రేరితములయి కొరవిని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచుండును.ఇట్లు జ్యోతిర్గణములు అంతరిక్షమున తిరుగుటకు హేతువు అగు వాయువునకు ఈ హేతువుతోనే ప్రవహము (ప్ర= మిక్కిలిగా; వహ=వహించునజది;) అని నామము ఏర్పడినది.

ఇట్లు ధ్రువుని కేంద్రముగా చేసికొనియున్న తారామయమగు ఆమరికకు 'శింశుమార చక్రము' ( శిశుమారమను జలచరపు రూపమున నున్నది) అని సంప్రదాయాగత నామము. ఈ శింశుమారపు అమరికను ప్రవిభాగ పూర్వకముగ ఎరిగి తత్త్వమెరిగి దీనిని దర్శించినచో ఏనాటి పాపమానాడే విముక్తమగును. ఎతద్దర్శనముచే ఈ శింశుమార శరీరమున చిన్న చిన్న జ్యోతిస్సులు (తారకలు) ఎన్నికలవో అన్నియు అంతకంటె ఎక్కువగను కూడసంవత్సరముల పాటు జీవించును.

ఈ శింశుమారపు అమరిక ఇది: పైదౌడ-ఉతా%్‌తనపాదుడు యజ్ఞుడు క్రిందిదౌ

డ - మూర్తము (శిరస్సు) ధర్ముడు - హృదయము నారాయణుడు ముందరి పాదములు సాధ్యులు - అశ్వినులు వెనుకసక్థులు (తొడలు అని అర్థము. కాని ఇచ్చటసక్థి అనగా పాదములనియే గ్రహించవలెను.) వరణుడు ఆర్యమన్‌ అను ఇద్దరు దేవతలు శిశ్నము సంవత్సరము ఆపానము మిత్రుడు - పుచ్చము ఆగ్ని మహేంద్ర మారీచకాశ్యప ధ్రువులు అను పదునాలుగు దేవతాత్మక తారాగణముతో ఈ శింశుమారము ఏర్పడినది. (యజురారణ్యకమునందు 'ధర్మోమూర్ధానం-బ్రహ్యోత్తరాహనుఃయజ్ఞోధరా విష్ణుర్హృదయం సంవత్సరః ప్రజననం - అశ్వినౌ పూర్వపాదౌ అత్రిర్మధ్యం మిత్రావరుణావపర పాదౌ అగ్నిః పుచ్ఛస్య ప్రథమం కాండం తత ఇంద్ర స్తతః ప్రజాపతి రభయం చతుర్థం సవా ఏష దివ్యః శాక్వర శ్శిశుకుమారః' అని యున్నది.) ఇట్టి ఈ తారామయ స్తంబము (దుబ్బువంటి అమరిక) అస్తమించక ఉదయించక నర్వదా ప్రకాశించుచుండును. నక్షత్రములు చంద్రుడు సూర్యుడు గ్రహములు తారాగణముల ఈ శిశుమార చక్రమున కభిముఖములయి చక్రాకృతితో ద్యులోకమున (అంతరిక్షోన్నత స్థానమునందు) ఉన్నవి. ఇవి తమకు ధ్రువుడు అధిష్ఠాతగా సూరశ్రేష్ఠుడగు ఆ ధ్రువుని మేథిగా చేసికొని అతనిని ప్రదక్షిణించుచుండును. ఈ ధ్రువుడు అగ్నీధ్రకాశ్యప వంశీయులలో పరము (శ్రేష్ఠ)డు; ఈ జ్యోతి రూపుడు తానొక్కడే (ప్రధానభూతుడై) మేరుపర్వత శిరోమధ్యమున (కు తిన్నగా అంతరిక్షాగ్రమున) ఈ జ్యోతి శ్చక్రమును తన యధీనమున పట్టుకొని లాగికొనుచు అధోముఖుడై మేరువును చూచుచు ప్రదక్షిణ ప్రతియానము (ఆత్మ ప్రదక్షిణము) చేయుచు ఉండును. (మారీచుడు=మరిచికి కుమారుడు)

(ఇది ధ్రువుడు కేంద్రముగాను సూర్యుడు దిక్కాలాత్మక ప్రజాపతి కధీనుడుగాను నుండుననెడు సంప్రదాయము ననుసరించి జ్యోతీరాశి వ్యవస్థా విషయక భావనతో ప్రతిపాదింపబడినది.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున ఖగోళ వ్యవస్థయందు సూర్కది గ్రహరథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనను నూట ఇరువదియైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters