Sri Matsya Mahapuranam-1    Chapters   

షడ్వింశత్యుత్తరశతతమోధ్యాయః

అగ్నిసూర్యయోః పరస్పరతేజోనుప్రవేశకథనమ్‌

ఋషయః : 

యదేత ద్బవతా ప్రోక్తం శ్రుతం సర్వ మశేషతః కథం దేవగృహాణి స్యుః పునర్జ్యోతీంషి వర్ణయ. 1

సూతః : ఏతత్సర్వం ప్రవక్ష్యామి సూర్యాచన్ద్రమసో ర్గతిమ్‌ |

యథా దేవగృహాణి స్సు స్సూర్యచస్ధ్ర గ్రహాస్తథా. 2

అగ్రే ప్యుష్టౌ రజన్యాంవై బ్రహ్మణోవ్యక్తయోనినః | అవ్యాకృత మిదం త్వాసీ న్నై శేన తమసా వృతమ్‌. 3

ఖద్యోతరూపో విచరన న్నావిర్భవం విచిస్తయ& | జ్ఞాత్వాగ్నిం సతు కాలేవై జలపృథ్వీసమాశ్రయామ్‌. 5

సంహృత్య సమ్రకాశార్థంత్రిధాతు వ్యభజత్పునః | పవనోయస్తు లోకేస్మి న్పార్థివ స్సోగ్ని రుచ్యతే. 6

యశ్చాసౌ తపతే సూర్య శ్శుచిరగ్నిస్తు సస్మృతః | వైద్యుతో జాఠర స్సౌమ్యో వైద్యుతశ్చా ప్యనిన్దనః. 7

తేజోభి శ్శామ్యతే కశ్చి త్కశ్చిదేవాప్యనిన్ధనః | కాష్ఠేనాన్యస్తు నిర్మన్థ్యస్సోద్భిశ్శామ్యతి పావకః. 8

అర్ఛిష్మా న్పవమానోగ్ని ర్నిష్ర్పభ స్సౌమ్యవీక్షణః | యశ్చాసౌ మణ్డలే శుక్లే నిరుష్ట స్సమ్ర్పకాశ##తే. 9

ప్రభా సౌరీ త్రిభాగేన అస్తంయాతి దివాకరే | అగ్ని మావిశ##తే రాత్రౌ తస్మా త్సూర్యా త్ర్పకాశ##తే. 10

ఉత్తిష్ఠతి పునస్సూర్యే అస్తమగ్ని స్సమావిశేత్‌ | పాదేన తేజస శ్చాగ్ని స్తస్మా త్స తపతే దివా. 11

ప్రకాశంచ తతోష్ణంచ సౌర్యగ్నీ ¸° తు తేజసా | పరస్పరానుప్రవేశా దాపూర్యేతే దివానిశమ్‌. 12

నూట ఇరువది ఆరవ అధ్యాయము

అగ్ని సూర్యల పరస్పర తేజోనుప్రవేశము

జ్యోతిర్గోళముల దేవగృహత్వ నిరూపణము.

ఋషులు సుతునిట్లడిగిరి: నీవు ప్రతిపాదించిన ఖగోళ విషయము అంతయు వింటిమి. జ్యోతిర్గళములు దేవ గృహములు అంటివి. అది ఎట్లో వర్ణించుము అన సూతడిట్లనెను: సూర్యచంద్రుల గతి విధానమును సూర్య చంద్రాది గ్రహములు దేవగృహములగు విధమును తెలిపెదను. అవ్యక్త తత్త్వము (మాయాశబలము) నుండి జన్మించిన బ్రహ్మకు ఒక రాత్రి ముగిసి మరల తెల్లవారుసరికి ఈ దృశ్య ప్రపంచమంతయు ఈ వస్తువునకు ఇది రూపము ఇది పేరు అను విభాగములేక రాత్రి సంబంధియగు చీకతితోనిండి (చీకటిలో ఏ వస్తువునకు గాని ఇది రూపము. ఇది పేరు అని తెలియనట్లే) యుండెను. ఈ నాలుగు వేదలములను ఇది ఈ వేదమిని అనుశాసించుటయు అప్పటికి జరగ లేదు. అట్టి సమయమున లోకసృష్టి రూపమగు అర్థమును (పనిని) సాధించదలచి భగవానుడగు స్వయంభూబ్రహ్మ మిణుగురు పురుగువలె మినుకు మినుకుమని ప్రకాశించుచు జగదావిర్భావము ఎట్లు జరుపవలెనాయని ఆలోచింపసాగెను. అట్టి సమయమున అతనికి అగ్ని జలమును పృథివిని ఆశ్రయించి యున్నట్లు కనబడెను. స్వయంభూబ్రహ్మ జల పృథివులనుండి ఆ అగ్నిభూతమును ఒకచోటికి చేర్చి దానినంతయు మూడుగా విభజించెను. పవ(మా)నుడుగా వాయువునందు కనబడుచున్న నిర్మథనముతో ఏర్పడెడి అగ్ని పార్థివమగు (పృథీవి సంబంధియగు) అగ్ని; ఈ రవియే శుచియను అగ్ని; జఠరమునందుండి జీర్ణాది ప్రక్రియల చేయుచు నిర్మథనముతో కాక ఇంధనములతో పనిలేక వెలిగెడి అగ్ని వైద్యుతాగ్ని ; అదియే పావకాగ్ని.

వినిలోనొక యగ్ని (సౌరాగ్ని) తేజస్సులతోనే శాంతించున. (తన ప్రకాశమును కోల్పోడును) మరి యొకటి (వైద్యుతాగ్ని) ఇంధనములతో పనిలేకయే వెలుగును. ( అది నీటితో చల్లారదు) నిర్మథ్యాగ్ని మాత్రము కాష్ఠములతో వెలుగును. నీటితో శమించును. పవమానాగ్ని యనబడెడి నిర్మథ్యాగ్ని (పార్థివాగ్ని) జ్వాలలుండియు ప్రభలు తక్కువయగుటచే సౌమ్యుడుగా కనబడుచుండును. రవి మండలమునందు వేరొక యష్ణముతో పనిలేకయే ప్రకాశించు అగ్నికి సంబంధించి సౌర ప్రభయందలి మూడు పాదములు అగ్నియందు ప్రవేశించును. అందువలన అగ్ని రాత్రులందు రవికంటె అధికముగా నున్నట్లు ప్రకాశించును. మరల రవి ఉదయించునపుడు ముందటి దినమున అస్తమయకాలమున రవినుండి ప్రకాశము పొందిన అగ్ని మరల రవిని ప్రవేశించును. అందుచే అగ్ని పగటివేళల నాలుగవవంతు తేజస్సుతో మాత్రమే వెలుగును. ఇట్లు ఆగ్నేయ సౌర ప్రకాశములు రాత్రింబవళ్ళలో పరస్పరాను ప్రవేశమున పరస్పర పూరణము చేసికొనుచుండును.

ఉత్తరేచైవ భూమ్యర్ధే తథాహ్యాగ్నిశ్చ దక్షిణ | ఉత్తిష్ఠతి పునస్సూర్యే రాత్రా వావిశ##తే హ్యపః. 13

తస్మా త్తామ్రా భవన్త్యాపో దివా రాత్రిప్రవేశనాత్‌ | అస్తంగతే పునస్సూర్యే అహోవై ప్రవిశత్యపః. 14

తస్మా న్నక్తం పున శ్శుక్లా హ్యాపో దృశ్యన్తి భాసురాః | ఏతేన క్రమయోగేన భూమ్యర్ధే దక్షిణోత్తరే. 15

ఉదయా స్తమయేహ్యత్ర అహోరాత్రం విశత్యపః | యశ్చాసౌ తపతే సూర్య స్సోపః పిబతి రశ్మిభిః. 16

సహస్రపాద స్వ్వేషోగ్ని ర్వృతః కుమ్భనిభస్తు సః | ఆదత్తే సతు నాడీనాం సహస్రేణ సమన్తతః. 17

అపో నదీసముద్రేభ్యో హ్రదకూపేభ్య ఏవచ | తస్య రశ్మిసహస్రంతు శరద్‌వర్షా దివానిశమ్‌ 18

తాసాం చతుశ్శతం నాడ్యో వర్షన్తే చిత్రమూర్తయః | చన్దనాశ్చైవ మేధ్యాశ్చ కాన్తకా శ్చోతసాస్థథా. 19

అమృతానామ తాస్సర్వా రశ్మయో వృష్టివర్జనాః | హిమద్రవాశ్చ తేన్యోన్యం రశ్మయ స్త్రశతం స్మృతాః. 20

చన్ద్రాస్తా నామత స్సర్వా శ్శీతా భానో ర్గభస్తయః | ఏతా మేధ్యా స్తథాన్యాశ్చ హ్లాదిన్యో హిమసర్జనాః. 21

శుక్లాశ్చ కకుభ##శ్చైవ గావో విశ్వభృతశ్చ యాః | శుక్లాస్తా నామతస్సర్వా స్త్రీశతం ఘర్మసర్జనాః. 22

సమం బిభర్తి తాస్సర్వా న్మనుష్య& దేవతాః పితౄ& | మనుష్యానోషదీభిశ్చ స్వధయాచ పితౄనపి. 23

అమృతేన సురాన్త్సర్వా న్త్సతతం పరివర్తయ& | వసన్తేచైవ గ్రీష్మేచ శ##తైస్స తపతేత్రిభిః. 24

వర్షాసుచైవ శరది చతుర్భి స్సమ్ప్రవర్షతి | హేమన్తేశిశి రేచైవ హిమోత్పర్గం త్రిభిఃపునః. 25

ఓషదీషు బలంధత్తే స్వధాచ సుదయా పునః | భూయోమరత్వ మమృతే త్రయస్త్రిషు నియచ్చతి. 26

ఏవం రశ్మసహస్రంతు సౌరం లోకార్థసాధనమ్‌ | భిద్యతే ఋతుసూర్యమాసాద్య సహస్రం బహుధా పునః. 27

ఇత్యేత న్మణ్డలంశుక్లం భాస్వరం లోకసంజ్ఞితమ్‌ | నక్షత్రగ్రహసోమానాం ప్రతిష్ఠా యోని రేవచ. 28

ఇట్లు అగ్ని భూమికి ఉత్తరార్థ దక్షిణార్థములందు స్థాన పరివర్తనమున తన తేజమును పరివర్తనము చేసికొనుచు ప్రకాశాధిక్యము పొందుచు కోల్పోవుచు నుండును. ఇట్లే సూర్యడుదయించగానే రాత్రి (కాల ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచేత పగటి వేళలందు నీరు అగ్నివలెనే ఎర్రగా కనబడును. మరల రవి అస్తమించగనే పగలు (పగటికాలపు ప్రభావమ) నీటియందు ప్రవేశించును. అందుచేతనే నీరు రాత్రులందు రవివలె తెల్లగా కనబడును. ఈ క్రమమున భూమి దక్షిణోత్తరార్దములందు రవ్యగ్ని ప్రకాశముల పరస్పర ప్రకాశ పరివర్తనముచే ఉదయాస్తమయ ప్రభావానుసారము రవియు అగ్నియు జలములందు ప్రవేశించుచు వాటి వర్ణమును కూడ మార్చును.

ఈ సౌరాగ్ని ( రవి మండలము) వేయి కిరణములతో పరవారితమై ఒక కడవవలె నున్నది. అతడు తన వేయి నాడులతో నదీ సముద్రహ్రద కూపాదులనుండి నీరు పీల్చి తనయందు నింపుకొనును.

సూర్యని వేయి కిరణములలో నాలుగు వందల కిరణములు శదర్వర్షా కాలములందు వాన కురియును. ఆ కిరణములు చల్లనివి పవిత్రములు తక్కువ వేడిమి నిచ్చునవి. వాటికి అమృత కిరణములని నామము. ఇవికాక మూడు వందల కిరణములు హేమంత శిశిర ఋతువులందు రవియందు సేకరింపబడియున్న జలమును హిమ రూపమున లోకమున కందించును. ఈ కిరణ సముదాయమునకు చంద్రములు అని పేరు. ఇవియన్నియు పవిత్రములును ఆనందము కలిగించునవియు. మరి మూడు వందల కిరణములు వసంత గ్రీష్మములందు ఘర్మమును ఆవిరిని వదలును. వీనికి శుక్ల కిరణములని వ్యవహారము.

ఇట్లు రవి తన సహస్రకిరణప్రవృత్తి ద్వారమున ఓషదులతో మానవులను స్వధాద్రవ్య (కవ్య)ముతో పిరులను అమృతముతో దేవతను సమముగా పోషించుచున్నాడు.

ఈ సహస్ర కిరణములు కూడ ఋతుభేదమున మరియు అనేక విధముల మార్పును పొందుచుండును.

ఇట్లు శుక్లవర్ణమై ప్రకాశశీలమైన 'లోక' మను సంప్రదాయసిద్ద వ్యవహార నామముగల రవియే నక్షత్రములకు (తారా)గ్రహములకు సోమునకు గూడ జన్మహేతువును స్ఠితికారణమునై యున్నాడు.

చన్ద్రఋక్ష గ్రహాస్సర్వే విజ్ఞేయా రశ్మిసమ్భవాః | సుఘమ్నా సూర్యరశ్మిర్యా క్షీణం శశిన మేధతే. 29

హరికేశం పునస్తస్మిన్యోవై నక్షత్రయోనికృత్‌ | దక్షిణ విశ్వకర్మాతు రశ్మి రాప్యాయయే ద్భుధమ్‌. 30

విశ్వాసువస్తు యః పశ్చా చ్ఛుక్రయోనిస్తు స స్మృతః | సంవర్ధనస్తు యోరశ్మి న్సయోని ర్లోహితస్యతు. 31

షష్ఠ స్త్వర్వావసూ రశ్మిర్యోనిస్సతు బృహస్సతేః | శ##నైశ్చరం పునశ్చాపి రశ్మి రాప్యాయయే త్స్వరాట్‌. 32

న క్షీయన్తే యతస్తాని తస్మా న్నక్షత్రతా సృతా | క్షేత్రాణ్యతాని వై సూర్య మాపతంతి గభస్తిభిః. 33

తేషా మనన్తక్షేత్రాణాం సూర్యో నక్షత్రతాం గతః | అస్మాల్లోకా దముం లోకం తీర్ణానాం సుకృతాత్మనామ్‌. 34

తారాణా త్తారకణ్యతే శుక్తత్వాచ్చైవ తారకాః | దివ్యానాం పార్థివానాంచ వంశానాంచైవ సర్వశః. 35

తపసా తేజ సా೭೭దానా దాదిత్య స్తేన చోచ్చతే | భవతి స్యన్దనార్థేతు ధాతు రేష నిగద్యతే 36

సవనా త్తేజసశ్చైవ తేనాసౌ సవితాస్మృతః | బహ్వర్ధ శ్చదిరిత్యేష ప్రధానో ధాతురుచ్యతే. 37

శుక్తత్వే హ్యమృతత్వేచ శీతత్వే హ్లాదనేపిచ | సూర్యాచన్ద్ర మసో ర్దివ్యే మణ్ణలే భాస్వరే ఖగే. 38

జలతేజోమయే శుక్లే వృత్తకుమ్భనిభే శుభే| విశన్తి కర్మదేవాస్తు స్థానాన్యేతాని సర్వశః. 39

మన్వన్తరేషు సర్వేషు ఋక్షా స్సూర్యగ్రహాశ్రయాః | తాని దేవగృహాణి స్యు స్ధ్సానాఖ్యాని భవన్తిహి. 40

సౌరం సూర్యో విశత్థ్సానం సౌమ్యం సోమ స్తథైవచ | శౌక్రం శుక్రో విశత్థ్సానం షోడశార ప్రభాస్వరమ్‌. 41

బృహస్పతిర్‌ బృమన్తంచ లౌహితంచాపి లోహితః | శ##నైశ్చరో విశత్థ్సాన మేవం శానైశ్చరం తథా. 42

బుధోపి వై బుధస్థానం స్వర్భాను ర్భానుమేవచ | నక్షత్రాణితు సర్వాణి నక్షత్రాణ్యావిశన్తివై. 43

చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఇవి యన్నియును సూర్యని రశ్ములు అనెడి నాడుల నుండియే జనించి తృప్తిని పుష్టిని పొందునని తెలియవలయును. ఎట్లన సుషుమ్నా అనెడి నాడి (రశ్మి) క్షీణుడగు చంద్రుని పరిపోషించును. హరికేవము అను రశ్మి నక్షత్రములను దక్షిణమునం దుండెడి విశ్వకర్మయను నాడి బుధుని వెనక నుండెడి విశ్వావనునాడి శుక్రుని సంవర్దన నాడి అంగారకుని అర్వావసువను ఆదవనాడి బృహస్పతిని స్వరాట్‌ అను నాడి శ##నైశ్చరుని అప్యాయన మొందించును. క్షయము నొందవు కావున నక్షత్రములు (న-క్ష-త్ర) ఇవి సూర్యని క్షేత్ర (స్థాన)ములుగా నుండి తమ కిరణములతో సూర్యని తపింపజేయును. సూర్యడు అనంతక్షేత్ర రూపములగు ఆ నక్షత్రములలో తానును నక్షత్రత్వము పొందియున్నాడు. ఈ లోకమునుండి పై లోకములకు దాటిపోయిన సుకృతాత్ములను దాటించునవి కావునను తెల్లనివి కావు నను తారకలు (తరింప-దాటునట్లు-చేయునవి) అని వీనికి పేరు. పృథివీగతులగు వారిలో దివ్య వంశవముల వారిని వారి తపోబలమును తన తేజోబలమును ఆశ్రయించి తనలోనికి గ్రహించును కావున సూర్యునకు ఆదిత్యుడు (ఆద్రత్తే-తనలోనికి తీసికొనును) అని పేరు. స్యన్దనము-స్రవింపజేయుతట అను అర్థము నిచ్చు 'సూ' అను ధాతువునుండి 'సవితా' అను పద మేర్పడినది. తేజస్సును ప్రసరింపజేయువాడు కావున సూర్యుడు 'సవిత' అనబడును. 'చది' లను ధాతువునుండి 'చంద్ర' అనెడు శబ్దము ఏర్పడినది. తెల్లగా అమృతరూపడై-చల్లనై-ఆనందింపచేయువాడై-ఉండును. అని అర్థము. ఇట్టి సూర్యచంద్రుల మండలములు ప్రకాశవంతములు దివ్యములు ఆకాశగాములు తెల్లనివి గుండ్రని కుండలవంటివి. వీరిలో రవి తేజోమయుడ-చంద్రుడు జలమయుడు. తమ సుకృతములచే దేవత్వ మందిన కర్మదేవులు ఆయా మన్వంతరములం దెల్ల ఈ రవి నక్షత్ర చంద్రగ్రహ లోకములందు తమ పుణ్యానుసారము ప్రవేశింతురు. ఇవి వారికి స్థానము లగును. కావున వీనకి 'దేవగృహములు' కర్మదేవులకు ఇండ్లు' అని పేరు ఏర్పడినది. ఇంతే కాదు. సూర్య శుక్ర బృహస్పత్యంగారక శ##నైశ్చర బుధ రాహువలు ఇతర నక్షత్రములు కూడ వాస్తమున దేవతాత త్త్వములే. వీరుసు తమ సుకృతమున కర్మదేవులై ఆయా జ్యోతిర్గోళములను తమ తమ ఇండ్లుగా పొందిరి. ఈ కనబడు జ్యోతిర్గోళములు కేవలము జడ పదార్థములు కావు. వానికి అధిష్ఠాతలుగా రవ్యాది దేవతలున్నారు.

జ్యోతీంషి సుకృతా మేతే జ్ఞేయా దేవగృహాస్తువై| స్థానాన్యేతాని తిష్ఠన్తి యావదాభూతవ్ల్పువమ్‌. 44

మన్వస్తరేషు సర్వేషు దేవస్థానాని యానివై | అభిమానినోనుతిష్ఠిన్తి తాని దేవాః పునః పునః. 45

అతీతాంశ్చ సహాతీతై ర్భావ్యా భావ్యై స్సురై స్సహ | వర్తన్తే వర్తమానైస్తు సురై స్సార్దంతు స్థానినః. 46

సూర్యోదేవో వివస్వాంశ్చ అష్టమ స్త్వదితే స్సుతః

ద్యుతిమా& ధర్మయుక్తస్తు సోమో దేవో వసు స్స్మృతః 47

శుక్రో దైత్యస్తు వజ్ఞేయా భార్గవోసురయాజకః | బృహస్పతి ర్వేధసశ్చ దేవాచార్యో జ్గిస్సుతః. 48

అగ్నే ర్వికేశ్యాంజజ్ఞిరే యువానః కేతవోనృప | నక్షత్రనామ్నా ఋక్షాని దాక్షయణ్యస్తు తా స్మ్సృతా.ః 50

స్వర్భాను స్సింహికాపుత్త్రో భూతసమ్మోహనోసురః | చన్ద్రార్క గ్రహనక్షత్రే ష్వభిమానీ ప్రకీర్తితః. 51

స్థానాన్యేతాని చోక్తాని స్థానిన్యశ్చైవ దేవతాః | శుక్ల మగ్నిమయం దివ్యం సహస్రాంశో ర్వివస్వతః. 52

సహస్రాంశుక స్త్విషిస్థాన మమ్మయం తైజసం తథా | ఆప్యం స్థానం మనోజ్ఞస్కయ పఞ్చరశ్మి ర్బృహస్పతి.ః 53

శుక్రష్షోడశరశ్మిస్తు యశ్చ దేవో హ్యాపాం స్వయమ్‌ | లోహితో నవరశ్మిస్తు స్థానమాప్యంతు తస్యతత్‌. 54

బుధో ద్వాదశరశ్మిస్తు హరితాభంతు తద్గృహం | అష్టరశ్మి గృమం ప్రోక్తం కృష్ణం మందస్య చ స్వయమ్‌. 55

స్వర్భానో ర్ధామ సంస్థానం భూతసన్తాపనాలయమ్‌ | శుక్లా నామ్నాతు సూర్యస్య రశ్మయస్తు హిరణ్మయాః.

తారాణాం తాపకాహ్యేతా శ్శుక్లత్వాచ్చైవ తారకాః 56

ఈ చెప్పిన కారణములచే ఈ జ్యోతిర్గోళములన్నియు సుకృతము చేసికొనిన కర్మదేవుల ఇండ్లయినందున దేవ గృముల లయ్యెను. ఇవి ప్రళయకాలము వరకు ఇట్లే యుండును. ప్రతి మన్వంతరమునందును ఆయా స్థానములకు అభిమానులగు దేవతలు ఇట్లే వానిని మరల మరల తమ ఇండ్లుగా చేసికొందురు. అతీత మన్వంతరములందు అతీత దేవతలును వర్తమానమన్వంతరముంలదు వర్తమాసదేవతలును భావి మన్వంతరములందు భావి కర్మదేవులును ఇట్లే ఉండిరి. ఉన్నారు-ఉందురు.

ఇక వీరి దేవతాత్వములు ఇట్లుండును: అదితి కుమారులలో ఎనిమిదవవాడగు 'వివస్వాన్‌' అను నతడే సూర్య దేవుడు; ద్యుతి (కాంతి) కలవాడు ధర్మయుక్తుడు నగు సోమ (చంద్ర) దేవుడు వసువులలో నొకడు; శుక్రడు అసురుల యాజకుడు (యజ్ఞాదులు చేయించు పురోహితుడు) ఐనను దేవతాకోటిలోని వాడు; దేవాచార్యుడగు బృహస్పతి అంగిరుని కుమారుడు; బ్రహ్మాంశ సంభూతుడు; బుధుడు మనోహరరూపుడు త్విషి (చంద్ర) పుత్త్రుడు; శ##నైశ్చరుడు విరూపుడు-రవికి సంజ్ఞాదేవియందు కలిగినవావు; కేతువులు అనువారు అగ్నిదేవునకు వికేశి అను భార్యయందు జనించినవారు; దాక్షాయణులు (దక్షపుత్త్రికలు) నక్షత్రములు; భూతము(ప్రాణు)లకు సమ్మోహము కలిగించు స్వర్భానుడు (రాహువు) సింహికా పుత్త్రుడగు అసురుడే యైనను చంద్రార్క గ్రహనక్షత్రములందు ఒకడుగా అభిమతుడై ఆరాధింపబడుచున్నాడు.

ఇట్లు జ్యోతిః స్థాన తత్త్వమును ఆస్థానముల కభిమానులగు దేవతలను తెలిపితిని. ఆ జ్యోతిః స్థానముల భౌతిక సంస్థానమును తెలిపెదను. సహస్రాంశుడగు వివస్వంతు (సూర్య)ని స్థానము అగ్నిమయ జ్యోతిర్గోళము. చంద్ర స్థానము కూడ వేయి కిరణములు గల జలమయగోళము. మనోజ్ఞిని గోళము కూడ జలమయమే; బృహస్పతి గోళము ఐదు నాడులు కలది; శుక్రగోళము పదునారు నాడులు కల జలమయగోళము; అంగారకునిది తొమ్మిది నాడులుగల జలమయగోళము; బుధునిది పండ్రెండు నాడులుగల పచ్చని ప్రకాశముగల గోళము; రాహు స్థానమగు గోళము భూత సంతాపము కలిగించునది; ఇతని కిరణములు హిరణ్మయములు శుక్ల నామకములయి తెల్లని వగుటచే తారకములని కూడ పేరు గల సూర్య కిరణములే ; ఇవి తారలకు కూడ తాపము కలిగించును.

సూర్యాదిమణ్డలపరిమాణకథనమ్‌

నవయోజనసాహసై#్ర ర్విష్కమ్భ స్సవితు స్స్మృత. 57

మణ్డలం త్రిగుణంచాస్య విస్తారో భాస్కరస్యతు | ద్విగుణ స్సూర్యవిస్తారా ద్విస్తార శ్శశినస్స్మృతః. 58

విస్తారం మణ్డలం చాస్య వైపుల్యా చ్ఛశిన స్స్మృతమ్‌ | సర్వోపరి నినృష్టాని మణ్డలానితు తారకాః. 59

యోజనార్ద ప్రమాణాని తాభ్యోన్యాని గుణానితు | తుల్యోభూత్వాతు స్వర్భాను స్తదదస్తా త్ప్రసర్పతి. 60

ఉద్దృత్య పార్థివీం ఛాయం నిర్మితాం మణ్డలాకృతిమ్‌ |

స్వర్భానోశ్చ బృహత్థ్సానం తృతీయంతు తమోమయమ్‌. 61

ఆదిత్యా త్సచ నిష్క్రమ్య సోమం గచ్ఛతి పర్వసు | ఆదిత్య మేతి సోమాచ్చ పునస్సౌరేషు వర్వసు . 62

స్వభాసా నుదతే యస్మా త్స్వర్భానురితి స స్మృతః | చన్ద్రతః షోడశో భాగో భార్గవస్య విధీయతే. 63

విష్కమ్భా న్మణ్డలాచ్చైవ యోజనానాంతు సస్మృతః | భార్గవా త్పాదహీనస్తు విజ్ఞేయా వై బృహస్పతిః. 64

బృహస్పతేః పాదహీనౌ వక్రసౌరా వుభౌ స్మృతౌ | విస్తారా న్మణ్డలాచ్చైవ వాదహీన స్తయోర్బుదః. 65

తారానక్షత్రరూపాణి వపుష్మన్తీహ యానివై | బుధేన సమరూపాణి విస్తారా న్మణ్డలాచ్చైవ. 66

తారానక్షత్రరూపాణి హీనానితు పరస్పరమ్‌ | *శతాని పఞ్చత్వారి త్రీణి ద్వాదశ చైవచ. 67

తతోపరి నివిష్టాని మణ్డలానితు తారకాః | యోజనార్దప్రమాణాని త్యేభ్యో హ్రస్వం న విద్యతే. 68

ఉపరిష్టా త్త్రయస్తేషాం గ్రహాయే క్రూరసర్పిణః | సౌరి శ్చాజ్గిరసో వక్రో విజ్ఞేయా మన్దచారిణః. 69

తేబ్యోధస్తా ద్రాహు కేతూ పునశ్చాన్యే మహాగ్రహః | సోమ శ్శుక్రో బుధశ్చైవ భార్గవశ్చేతి శీఘ్రగాః. 70

రవి మండల వ్యాసము తొమ్మిది వేల యోజనములు. చుట్టు కొతల దానికి మూడింతలు; చంద్రుని వ్యాసము సూర్యుని వ్యాసమునకు ద్విగుణము; తారకలు వీటికి పైగా నున్నవి. వాని వ్యాసము అర్ధ యోజనము మాత్రమే. అదే వ్యాసముతో రాహువు నక్షత్రములకంటె క్రిందుగా సంచరించును. ఇతడు పృథివీ ఛాయను మండలాకారమున చేసికొని యుండును. రాహు స్థానము పెద్దదె కాని తమోమయమము; అతడు చంద్రపర్వములందు (పూర్ణిమలందు) సూర్యుని నుండి చంద్రుని కడకును రవిపర్వములందు (అమావాస్యలందు) చంద్రునినుండి సూర్యుని కడకును పోవుచుండును. తన భానువులతో (కిరణములతో ) భానుని బాధించును కావున అతనకి స్వర్భానుడని పూరు. చంద్రునిలో పదునారవవంతు శుక్ర మండలము; శుక్ర మంలములతో నాల్గవవంతు తగ్గించినచో బృహస్పతి మండల మగును. బృహస్పతి మండలములో నాల్గవవంతు తగ్గించినచో అంగారక మండల మగును; శని మండలము అంగారక మండలముతో సమానము. అంగారకుని మండలములో నాల్గవవంతు తగ్గించినచో బుధ మండల మగును. తారా నక్షత్రమున లన్నియు బుధ మండలముతో సమాన మండలము కలవి. ఇవి ఒక దాని కంటె మరియొకటి తక్కువ పరిమాణము కలవి. ఇవి వందలుగా ఐదులుగా నాల్గులుగా మూడులుగా పండ్రెండులుగా నున్నవి. ఈ తారానక్షత్ర మండలములకు పైగా నక్షత్రము లున్నవి. లోగడ చెప్పినట్లు వీనిలో ఒక్కోక్క దాని మండలము అర్ధ యోజనము ; ఇంతకంటె చిన్న మండలము కల జ్యోతిస్సులు లేవు; వాటికి పైగా నున్న గ్రహములగు శని బృహస్పత్యంగారకులు మందసంచారులు; నక్షత్రములకు క్రిందుగా రాహుకేతువులున్నవి. సోమ శుక్ర బుధులు శీఘ్ర సంచారులు; వీరును నక్షత్ర మండలమునకు క్రిందుగానే యున్నారు.

యావన్తి దేవబుక్షాణి కోట్య స్తావచ్చతారకాః | సర్వేషాంతు గ్రహాణాంవై సూర్యోధస్తా త్ప్రసర్పతి. 71

విస్తీర్ణం మణ్డలంకృత్వా తస్యోర్ధ్వం చరతే శశీ | నక్షత్ర మణ్డలంచాపి సోమాదూర్ద్వం ప్రసర్పతి. 72

నక్షత్రేభ్యో బుధశ్చోర్ద్వం బుధాదూర్ద్వంతు భార్గవః | వక్రస్తు భార్గవాదూర్ద్వం వక్రాదూర్ధ్వం బృహస్పతిః. 73

తస్మాద చ్ఛనైవ్చరశ్చోర్ద్వం దేవాచార్య త్పర స్స్మృతః | శ##నైశ్చరా దతశ్చోర్ధ్వం జ్ఞేయం సప్తర్షిమణ్డలమ్‌.

సప్తర్షిభ్యో ధ్రువశ్చోర్ద్వ మాసక్తం త్రిదివం ధ్రువే | ద్విగుణషు సహస్రేషు యోజనానాం శ##తేషుచ. 75

గ్రహాన్తర మథైకైక మూర్థ్వం నక్షత్రమణ్డలాత్‌ | తారాగ్రహాన్తరాణిస్యు రుపర్యుపరి తే స్మృతాః. 76

గ్రహాశ్చ చన్ద్రసూర్యౌచ దేవి దివ్యేన తేజసపా | నక్షత్రేషుచ యుజ్యన్తే గచ్ఛన్తో నియతక్రమాత్‌. 77

చన్ద్రార్కగ్రహనక్షత్రా నీచోచ్చమృదుసంస్థితాః | సమాగమేతు భేదేన పశ్యన్తి యుగప త్ప్రజాః. 78

పరస్పరా స్థితా హ్యేవం యుజ్యన్తేచ పరస్పరమ్‌ | అసజ్కరేణ చక్రేణ తేషాం యోగాస్తు వై బుధైః. 79

ఇత్యేష సన్నివేశో వః పృథివ్యా జ్యోతిషామపి | ద్వీపానా ముదధీనాంచ పర్వతానాం తథైవచ. 80

వర్షాణాంచ నదీనాంచ యేచ దేవషు సన్తివై | ఇత్యేషార్కవశేనైవ సన్ని వేశస్తు జ్యోతిషామ్‌. 81

ఆద్యన్తప్రాన్తో మధ్యం సజేపస్తు ధ్రువాశ్రితః | సర్కత స్తేషు విస్తీర్ణో వృత్తాగార ఇవోచ్ఛ్రితః 82

లోక సంవ్యవహారార్థ మీశ్వరేణ వినిర్మితః | కల్పాదౌ బుద్ధిపూర్వంతు స్థాపితోయం స్వయమ్భువా. 83

ఇత్యేష సన్నివేశోవ స్సర్వస్తు జ్యోతిషాత్మకః | వైశ్వరూపం ప్రధానస్య పరిణామోస్య యస్స్మృతః. 84

నైష శక్యః ప్రసజ్ఖ్యౌతుం యాథాతథ్యేన కేసచిత్‌ | గతాగతం మనుష్యేణ జ్యోతిషాం మాంసచక్షుషా. 85

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ ఖగోళపరిసమాప్తి కథనం నామ

షడ్వింఃశుత్యుత్తర శతతమోధ్యాయః

ఇతి ఖగోళ సంస్థానవర్ణనమ్‌

దేవత్వమును పొందిన నక్షత్రాత్మ లెందరు కలరో అన్ని కోట్ల తారక లంతరిక్షమందున్నవి. ( కావున అవి ఇన్ని యని లెక్కింపజాలము.)

అన్నింటికంటెను దిగువ సూర్యడున్నాడు. అతని మీదుగా చంద్రుడు-అతని పైగా బుధుడు అతనిపై శుక్రుడు అతని పై కుజుడు అతని పై బృహస్పతి అతనిపై శ##నైశ్చరుడు అతని పైగా సప్తర్షి మండలము దానిలో ఊర్ధ్వమున ధ్రువుడు ఉన్నారు. ఇట్లీ ద్యులోకమంతయు ధ్రువునియందు నిబద్దమయి యున్నది.

ఈ గ్రహాదులన్నియు ఒక దానికి మరియొకటి రెండు (వేల ఒక వంద ) లక్షల యోజనముల ఎడముతో పైపైగా ఉన్నవి. ఈ తారాగ్రహములును చంద్రసూర్యులును ద్యులోకమున దివ్యతేజస్సుతో ప్రకాశించుచు అశ్విన్యాది నక్షత్రములందు నియమానుసారము సంచరించుచుండును. ఇవి నీచోచ్చమృదు గతులతో సంచరించును. వీనికి సమాగమము భేదము అను స్థితులును కలుగుట కనబడుచుండును. ఈ సమాగము భేదములు గణనవశమున పండితులు తెలిసికొందురు. వాస్తవమున అవి కలియుట జరుగదు. ఏలయన అవి ఒక దానిని మరియొకటి తాకని చక్రమున (క్షక్ష్యలలో) నియతముగా తిరుగుచుండును. కాని వాని కన్నింటికి దిగువగా నున్న మనకు అవి అట్లు కనబగును.

ఇట్లు పృథివీ సన్నివేశము జ్యోతిః సన్నివేశము ద్వీప సముద్ర పర్వత నదీ వర్ష సంనివేశము-జ్యోతిరాత్మక దేవగృహ సంనివేశము సూర్యాశ్రిత జ్యోతిర్వ్యవస్థ ధ్రువాశ్రితమగు ఆద్యస్త ప్రాంత మధ్య ప్రదేశములందలి అంతరిక్ష జ్యోతిర్గోళ వ్యవస్థ మీకు తెలిపితిని. గుండ్రని భవనములవలె కనబడు ఈ ఉన్నత జ్యోతిర్గోళముల వ్యాసములు మొదలగు కొలతలు లోక సంవ్యవహారార్థము ఈశ్వరుడు సంకల్పించిన విధమున కల్పాదియందు స్వయంభూ బ్రహ్మ బుద్ది (ఆలోచన) పూర్వకముగా ఏర్పరచెను. మీకు నేను తెలిపిన జ్యోతిర్వ్యవస్థ దాని ననుసరించినదే; ప్రధాన (ప్రకృతి) పరిణామమే ఈ విశ్వరూపము (విరాట్స్వరూపము) దీనిని ఉన్నదున్నట్లు గణన చేయుట కాని జ్యోతిర్గోళముల గతాగత రూప సంచారము కాని మాంసచక్షువుతో నుండు మానవునకు సాధ్యము కాదు.

(ఈ చెప్పిన వానిలో (అధ్యా-123-124-125-126) కొన్ని ఆధునిక సిద్ధాంతములో సరిపోవు. మరికొన్ని ప్రాచీన భారతీయ సిద్దాంతములతో కూడ సరిపోవు. మరికొన్ని తత్త్వపరము లయినవి. వీనిని తాత్త్విక దృష్టితో విచరించి ఎరుగవలెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ఖగోళ వర్ణన పరిసమాప్తి యను నూట ఇరువది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters