Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనత్రింశదుత్తరశతతమోధ్యాయః.

మయకృతత్రిపురే దైత్యదానవాదిప్రవేశః.

సూతః : నిర్మితే +త్రిపురే దుర్గే పూర్ణే త్వసురపుఙ్గవైః | తద్దుర్గం దుర్గతాం ప్రాప బద్ధవైరై స్సురాసురైః. 1

సకళత్రా స్సపుత్త్రాశ్చ శస్త్రవన్తోన్తకోపమాః | మా(మ) యావిష్టా నివివిశుర్గృహాణి హృణి హృషితాశ్చతే. 2

సింహైర్వన మివానేకై ర్నక్రైరివ మహార్ణవః | వీరా శ్చేవాతిపౌరుషై#్య శ్శరీరమివ రోమభిః. 3

తద్వద్బలిభిరధ్యస్తం తత్పురం దేవతారిభిః | త్రిపురం సఙ్కులం జాతం దైత్యకోటిశతాకులమ్‌. 4

సుతలాదపి నిష్పన్నం పాతాళా ద్దానవాలయాత్‌ | ఉపతస్థు ర్నభోదుర్గం యేచ గిర్యుపజీవినః. 5

యో యం ప్రార్థయతే కామం సమ్ప్రాప్తం స్త్రిపురాలయాత్‌ |

తస్యతస్య మయస్తత్ర మాయయా విదధాతి సః. 6

సచన్ద్రేషు ప్రదోషేషు సామ్బుజేషు సరస్సుచ | ఆరామేషు సచూతేషు తపోవనవనేషుచ. 7

వ్యఙ్గా శ్చన్దనదిగ్ధాఙ్గా మతఙ్గా స్సమదాఇవ | మృష్టాభరణవస్త్రాశ్చ మృష్టస్రగనులేపనాః. 8

ప్రియాభిః ప్రియాకామీభిర్హావభావప్రసూతిభిః | నారీభి స్సంతతం రేము ర్ముదితాశ్చైవ దానవాః. 9

మయేన నిర్మితే స్థానే మోదమానా మహాబలాః | అర్థేధర్మేచ కామేచ విదధు స్తే మతిం స్వయమ్‌. 10

తేషాం త్రితయయుక్తానాం త్రిపురేమరవైరిణామ్‌ | జగామ సుమహాన్కలా స్స్వర్గస్థానాం యథాతథా. 11

_______________________________________________

+త్వాసురే దుర్గే మయేనాసురశిల్పినా.

శుశ్రూషన్తే పితౄన్పుత్త్రాః పతీన్పత్న్యశ్చ యత్నతః | విముక్తకలహాశ్చాపి సానురాగాః పరస్పరమ్‌. 12

నాధర్మం త్రిపురస్థానాం లభ##తేనృతవాగపి | అర్చయన్తి దితేఃపుత్త్రా స్త్రిపురాయతనే హరమ్‌. 13

Oపుణ్యాహశబ్దా విప్రాణాం ఆశీర్వాదాశ్చ సర్వశః |

·సిఞ్జన్మఞ్జుళమఞ్జీర వేణువీణారవా మృదు. 14

హాసశ్ఛ వరనారీణాం చిత్తవ్యాకులకారకః | త్రిపురే దానవేన్ద్రాణాం శ్రూయతే రమతాం సదా. 15

నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

త్రిపుర దుర్గమున దైత్యదానవులు ప్రవేశించుట.

అనుర శిల్పియగు మయుడు నిర్మించిన త్రిపురదుర్గపు నిర్మాణము పూర్ణమయ్యెను. అది పరస్పరము బద్ధవైరులగు సురలకును అసురులకును దుర్గత్వమును పొందెను. సురలకు అది దుర్గము-చొరరానిది - అయ్యెను. అసురులకు అది దుర్గము-రక్షణ స్థానము - ఆశ్రయము అయ్యెను. యమునివంటి అసురులెందరో తమ కళత్రములతో పుత్త్రులతో శస్త్రములతో మా(మ) యావిష్టములగు ఆయా గృహములందు ప్రవేశించిరి. వనమనేక సింహములతోవలెను మహా సముద్రమనేక నక్రములతో వలెను వీరులు అతి పౌరుషములతో వలెను శరీరము రోమములతో వలెను త్రిపుర దుర్గము బలశాలురగు దేవాసరులతో అధిష్ఠితమయి వ్యాప్తమయ్యెను. అది నూరులకోట్ల దైత్యులతో దట్టమయి కల్లోలిత మయి కనబడెను. అయా పర్వతములందుండు వారును దానవాలయమగు పాతాళ##భేదమయిన సుతలమందుండువారును అగు దానవులందరును ఈ అంతరిక్ష దుర్గము నాశ్రయించిరి.

ఈ త్రిపుర దుర్గమును చేరిన వారిలో ఎవరు ఏదికోరిన - వారికి అదెల్ల ఆ మయుడచట మాయతో అమర్చుచుండెను. చంద్రుడు వెలుగుచుండు ప్రదోషములందును పద్మములు వికసించిన సరస్సులందును మామిళ్ళు అందగించు ఆరామములందును తపోవన సదృశవనములందును అసురులు చందనములు పూసికొన్న ఒడళులతో నలుపు తెలుపు మచ్చలు కనబడు మదపుటేనుగులవలె కానవచ్చుచు శుద్ధములగు ఆభరణములు వస్త్రములు మాలలు మెయి పూతలు దాల్చి కామసమేతులై ప్రియుల వాంఛించుచు హావిభావముల ప్రకటించు ప్రియురాండ్రగు స్త్రీలతో కూడి ముదితులగుచు దానవులందు సతతము ఆనందించుచుండిరి. మహాబలులగు ఆ అసురులు మయ నిర్మితమగు ఆ స్థానమున మోదించుచు తమ మతులను ధర్మార్థ కామములందు నిలిపి ప్రవర్తిల్లుచుండిరి. ఇట్లు పురుషార్థత్రితయమున ప్రవర్తిల్లుచుండు అమర వైరులకు అత్రిపుర దుర్గమున చాలకాలము స్వర్గమందువలె గడచెను. పుత్త్రులు తండ్రులను పత్నులు పతులను యత్న పూర్వకముగా శుశ్రూష చేయుచు కలహముల లేక పరస్పరము సానురాగులై యుండిరి. ఆత్రిపుర దుర్గవాసులలో అధర్మము కాని అనృతముకాని లేకుండెను. వారు ఆలయములందు హరునర్చించుచుండిరి. ఎల్లయెడల ఎల్లవేళల విప్రుల పుణ్యాహ ధ్వనులను ఆశీర్వాద శబ్దములును వినబడుచుండెను. మంజుల మంజీర రవములను వీణావేణు స్వనములును విహరించు వరనారీ జనులయు-దానవేంద్రులయు- హాసధ్వనులును వినవచ్చుచుండెను.

తేషా మర్చయతాం దేవా న్బ్రాహ్మణాంశ్చ సమస్యతామ్‌ |

ధర్మకామార్థతన్త్రాణాం మహాన్కాలో వ్యజాతయ. 16

లోభాదీనాం త్రిపురప్రవేశః

*కదాచిదత్ర లోభశ్చ క్రోధ శ్చైవ తథైవచ | కలిశ్చ కలహశ్చైవ వివిశు స్త్రిపురం సహ. 17

నన్ధ్యాకాలే ప్రవిఫష్టాస్తే త్రిపురం చాసురాలయమ్‌ | బాధన్తే తే జనా న్ఘోరా శ్శరీరాణి యథా೭೭పిమయాః. 18

__________________________________

·స్వనశ్చ శఙ్ఖభేరీణాం వీణావేణురవా అపి. Oపురాణగానశబ్దాశ్చ.

*మిథ్యాలక్ష్మీరసూయాచ ఋభుక్షాచతథైవచ

సర్వఏవ నిశాన్తేతు సమయే త్రిపురేసురాః +తానుత్పాతాం స్తథా దృష్ట్వా విమృశన్తిస్మ దానవాః. 19

ఉదితేతు సహస్రాంశౌ తేజ శ్శుభకరే రవౌ | మయ స్సభా మావివేశ భాస్కరాభా మివామ్బుజమ్‌. 20

మేరుకూటనిభే రమ్యే ఆసనే స్వర్ణమణ్డితే | O నివేశిత స్సభామధ్యే స్థిత స్తోయధరో యథా. 21

దానవానాం మయజ్ఞాపితయామినీదృష్టదుష్టస్వప్నాః.

పార్శ్వయో స్తారకాక్షశ్చ విద్యున్మాలీచ దానవౌ | ఉపవిష్టౌ మయస్యాన్తే హస్తినః కలభావివః. 22

తతోమరారయ శ్శిష్టా విశిష్టా స్సమరాఙ్గణ | ఉపవిష్టా దృఢం దృష్టా దేవానాం దేవరాడివ. 23

సర్వేషు దానవేన్ద్రేషు సుఖాసనగతేషుచ | మయో మాయాభిజనక ఇత్యువాచ స దానవాన్‌. 24

ఖేచరా దైత్యరాజానో భోభో దానవసత్తమాః | అసురా రాక్షసాశ్చైవ సర్వే దాక్షాయణీసుతాః. 25

నిశామయధ్వం యస్స్వప్నో మయా దృష్టో భయావహః |

·త్రయశ్చ తిస్రః పురుషాః ప్రమదాశ్చ మహాబలాః. 26

మహాక్రోధా హ్యుగ్రాముఖాః ప్రవిష్టా స్త్రిపురం దివా | ప్రవిశ్య రుషితా స్తేచ పురం చాతులవిక్రమాః.27

ప్రవిష్టాశ్చ శరీరాణి భూత్వా బహుశరీరిణః | నగరం త్రిపురంచైవ తమసా సముపస్థితమ్‌. 28

సగృహం సహ *యుష్మాభి స్సవాజిరథకుఞ్జరమ్‌ | ఉలూకచఞ్చుకా నారీ నగ్నా೭೭రూఢా ఖరాసనమ్‌.

సహస్త్రీభి ర్హసన్తీ సా చుమ్బతే ప్రమదా యథా | పురుషశ్చేన్దుతిలక శ్చతురఙ్ఘ్రి స్త్రిలోచనః. 30

యేన సా ప్రమదా నూనం దృష్టా చాహం విబోధితః | ఈదృశీ ప్రమదా దృష్టా మయా చాతిభయావహా.

ఇట్లు త్రిపుర దానవులు దేవతల నర్చించుచు బ్రాహ్మణుల నమస్కరించుచు దర్మ కామార్థాసక్తులై ప్రవర్తించు చుండ చాలకాలము గడచెను. ఇట్లుండ ఒకానొక సమయమున ఒకేమారు లోభము క్రోధము కలహము అనెడు కలిలక్షణములు త్రిపుర దుర్గమును ప్రవేశించెను. వారు అసురావాసమగు ఆ త్రిపురదుర్గమును సంధ్యాకాలమున ప్రవేశించి అది మొదలు వ్యాధులు శరీరమును వలె ఘోరరూపులయి జనుల బాధింపసాగిరి.

వేకువ సమయమున త్రిపుర దుర్గమందలి అసురులకును దానవులకును ఎల్లరకును ఉత్పాతములు కననయ్యెను. వారవి తమలోతాము చెప్పుకొని విమర్శించుకొనసాగిరి. అంతలో సూర్యదోదయమయ్యెను. రవి తన శుభకర తేజస్సు లతో వెలుగుచుండెను. పద్మము రవి తేజస్సును వలె మయుడు సభను ప్రవేశించెను. అతడు మేరుపర్వత శృంగము వంటి సువర్ణ భూషిత పీఠమున సజలమగు మేఘమువలె కూర్చుండెను. మదపుటేనుగునకు రెండువైపుల రెండు గున్న ఏనుగులువలె అతనికి రెండువైపుల సమీపమునందు తారకాక్షుడును విద్యున్మాలియు కూర్చుండిరి. అంతంతలలో అమరారులును శిష్టులను సమరాంగణమున విశిష్టులునగువారు ఠీవిగ ఉపవిష్టులయిరి. వారినడుమ ఆ మయుడు దేవతల నడుమ దేవరాజులవలెనుండెను.

దానవేంద్రు లందరును సుఖాసన గతులయిన యనంతరము మాయాజనకుడగు మయుడు వారితో నిట్లనెను. ఖేచరులగు దైత్యరాజులారా! దానవ సత్తములారా! అసురులారా! రాక్షసులారా! దాక్షాయణీ (దితి)సుతులారా! నేను గాంచిన భయావహస్వప్నము వినుడు. మహాబలము మహాక్రోధము ఉగ్రముఖము కల ముగ్గురు పురుషులును ముగ్గురు స్త్రీలును పగలే త్రిపురదుర్గమున ప్రవేశించిరి. అతులవిక్రములగు వారు రోషావిష్టులై బహుశరీరములు దాల్చి ఇచటి వారి శరీరములందు ప్రవేశించిరి. త్రిపుర నగరమంతయు మీరే కాదు-ఇండ్లే కాదు-రథాశ్వగజములే కాదు-అంతయు చీకటితో నిండిపోయెను. (గుడ్లగూబ

_______________________________________

+ స్వప్నేభయావహాన్‌ దృష్ట్వా విమృశన్తిస్మ దానవాః O ఆసీనః కాఞ్చనగిరేశ్శృఙ్గే తోయధరో యథా

· చతస్రః ప్రమదాస్తత్ర త్రయోమర్త్యాభయావహాః. * యుష్మాభిస్సాగరామ్భసిమజ్జితమ్‌.

ముక్కుకల దిస్సమెల స్త్రీ గాడిద నెక్కి కొందర స్త్రీలతో కూడి నవ్వుచు (అందరను) ముద్దు పెట్టుకొనుచుండెను. చంద్రుని తిలకముగా ధరించిన త్రిలోచనుడు-చతుష్పాదుడు నగు పురుషు డొకడు స్త్రీని పోలినవాడు కనబడెను. వాడు బహుశః ఆ స్త్రీని చూచియుండును. అతడే నన్ను మేలుకొనిపెను. నా కిట్టి మహా భయంకరియగు స్త్రీ కనబడినది.

మయా చైవంవిధ స్స్వప్నో నిశాయాం దితినన్దనాః | దృష్టః కథన్ను కష్టోయ మసుఖం నో భవిష్యతి. 32

యది వోహం క్షమో రాజా యదిదం వేత్థ నో హితమ్‌ | నిబోధధ్వం సుమనసో నచాసూయితు మర్హథ.

కామంచేర్ష్యాంచ రోషంచ త్యక్త్వా నియతమానసాః | సత్యే శ##మే దమే చాథ మునివాదేవతిష్ఠత. 34

శాన్తయశ్చ ప్రయుజ్యన్తాం పూజ్యతాంచ మహేశ్వరః | యదినామాస్య స్వప్నస్య నైవం హ్యుపశయో భ##వేత్‌. 35

కుప్యతే నో ధ్రువం దేవో దేవదేవ స్త్రిలోచనః | యతోత్పాతాశ్చ దృశ్యన్తే సదాచ త్రిపురేసురాః. 36

కలహం వర్జయన్తశ్చ ఆర్జయన్త స్తథార్జనమ్‌ | స్వప్నశాన్తిం ప్రతీక్షధ్వం కాలోదయ మథాపివా. 37

త్రైపురజనానామధర్మప్రవృత్తిః.

శ్రుత్వా దాక్షాయణీపుత్త్రా ఇత్యేవం మయభాషితమ్‌ | క్రోధవ్యాకులనేత్రాశ్చ శిష్టాచారవినాశకాః. 38

*వినాశ ముపపశ్యన్తి అలక్ష్మ్యా వ్యాపితాసురాః | తత్రైవ దృష్ట్వా తేన్యోన్యం సక్రోధం లోహితేక్షణాః.

సద్యో దైవపరిధ్వస్తా దానవా స్త్రిపురాలయాః | హిత్వా సత్యంచధర్మంచ అకార్య ణ్యుపచక్రముః. 40

నా కిట్టి కల రాత్రివేళ వచ్చుటకు ఫలముగా ఎట్టి నీచమగు అసుఖము మనకు సంభవించునో ఎరుగజాలను. మీకు నేను తగిన రాజననియు నేను చెప్పు ఈ మాట మీకు హితకరమనియు భావించినచో మీరు మంచి మనస్సులతో నా వచనమును గ్రహించుడు. దానియందు దోషములు పట్టుకొనవలదు. మీరు అందరును మనస్సులను నియమములందు నిలిపి కామమును రోషమును ఈర్ష్యను వదలి సత్య శమ దమములందును ముని వచనములందును మనస్సు లుంచుడు. శాంతు లాచరించుడు. మహేశ్వరు నర్చించుడు. నేను ఇట్లు చెప్పుచున్నానే కాని ఈ స్వప్నమునకు ఇట్లు కూడ ఉపశాంతి జరుగ దేమో! అసురులారా! ఈ త్రిపుర దుర్గమున నిరంతరముగా ఇట్టి ఉత్పాతములే కనబడుచుండుట బట్టి చూడగా దేవదేవుడగు త్రిలోచనుడే మనపై అలిగినట్లున్నది. ఏమయినను మీరు కలహము విడిచి ఋజుప్రవర్తన మవలంబించి స్వప్న శాంతి జరిపి ఆ శాంతి ఫలమును కాని అభ్యుదయకరకాలమును గాని ఎదురు చూచుచుండుడు.

దైత్యులు మయుని ఈ మాటలు విని క్రోధవ్యాకులిత నేత్రులును శిష్టాచార వినాశకులు నయిరి. అలక్ష్మీకాలము చేరువయైనందునను నాశము దాపురించినందునను వారందరును మయుని మాటలు సహించక క్రోధముతో కను లెర్రజేసి పరస్పరము చూచుకొనిరి. తత్‌క్షణము వానికి దైవము ప్రతికూలించెను; త్రిపుర దానవు లెల్లరును సత్యధర్మములను విడిచి అకార్యములు చేయ సంకల్పించి వాని నారంభించిరి.

ద్విషన్తి బ్రాహ్మణా న్పుణ్యా న్నార్చయన్తి స్మ దేవతాః |

గురూంశ్చైవావమన్యస్తే అన్యోన్యం చాపి చుక్రుదుః. 41

కలహేషు చ సజ్జన్తే అధర్మేషు రమన్తిచ | పరస్పరంచ నిన్దన్తి సదాచాప్రియవాదినః. 42

ఉచ్చైర్తురూ న్ప్రభాషన్తే నాభిభాషన్తి పూజితా& | అకస్మా త్సాశ్రునయనా జాయన్తేచ సముత్సుకాః. 43

దధిసక్తూ న్పపుశైవ కపిత్థానిచ రాత్రిషు | భక్షన్తే శేరతేచాపి ఉచ్ఛిష్టా స్సంపృతా స్తథా. 44

మూత్రంకృత్వా న స్పృశన్తి అకృత్వా పాదశౌచనమ్‌ | నిర్విశన్తిస్మ శయ్యాసు శౌచాచారవివర్జితాః. 45

సఙ్కుచన్తి భయాచ్చైవ మార్జారాణాం యథా ఖగాః | +భార్యాః పతీ న్వినిన్దన్తి తేపి పత్నీశ్చ నిర్ఘృణాః.

______________________________________

*అలక్ష్మీర్హ్రీఃకలిః క్రోధాసూయాప్రాప్తాస్తథాసురాః. + భార్యాంగత్వానశుద్ధ్యన్తిరహోవృత్తిషు.

పురా సుశీలా భూత్వాచ దుశ్శీలత్వ ముపగతాః | దేవాం స్తపోధనాంశ్చైవ బాధన్తే త్రిపురాలయాః. 47

మఘానాం బ్రాహ్మణానాంచ తే వినాశాయ రక్షసామ్‌ | విప్రియాణ్యవ విప్రాణాం కుర్వాణాః కలహైషిణః.

వైభ్రాజకం వనంచైవ తథా చైత్రరథం వనమ్‌ | అశోకం చావరాశోకం సర్వర్తుకమథాపిచ. 49

స్వర్గంచ దేవతావాసం పూర్వదేవా బలాన్వితాః | ధ్వంసయన్తి స్వయం క్రుద్ధా స్తపోధనవనానిచ. 50

విధ్వస్తదేవాయతనాశ్రమాశ్చ సంభగ్నదేవధ్వజయూపకాశ్చ | జగద్బభూవామరరాజజుష్ట మభిద్రుతం సర్వమివారిబృన్ధైః. 51

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే త్రిపురవాసిభ్యో

మయోక్తదుస్స్వప్న దర్శనాది కథనం నామైకోన

త్రింశదుత్తరశతతమోధ్యాయః.

నాటినుండి త్రిపుర దానవులు బ్రాహ్మణుల ద్వేషించసాగిరి. దేవతల నర్చించుట మానిరి. పెద్దల నవమానింప సాగిరి. పరస్పరము క్రుద్ధులగుచుండిరి. కలహాసక్తులగుచుండిరి. అధర్మము లాచరించి ఆనందించుచుండిరి. పరస్పరము నిందించుకొనుచుండిరి. సదా అప్రియములు పలుకుచుండిరి. గురువులతో బిగ్గరగా మాటలాడుచుండిరి. పూజ్యులతో (ఆదరముతో కాదు-మొదలే) మాటలాడకుండిరి. ఆకస్మికముగా తహతహపాటు చెంది కన్నీరు కార్చుచుండిరి. రాత్రులందు పెరుగుతో సక్తువును (పేలపిండిని) త్రావుచు వెలగపండు తినుచు నుండిరి. (ఇవి రాత్రులందు తినుటయు త్రాగుటయు నిషిద్ధము) ఎంగిలిగా ఉండియే ఆహారము తినుచు నిండు ముసుగుతో పండుకొని నిద్రించుచు ఉండిరి. మూత్ర విసర్జనమయిన తరువాత ఉదకోపస్పర్శనము చేయకయే కాళ్లయిన కడుగుకొనకయే శౌచము కాని సదాచారము కాని పాటించకయే శయ్యలపయి నిద్రించుచుండిరి. పిల్లులనిన పక్షులు ముడుచుకొని పోవునట్లు ఏ కొంచెము భయకారణమునకును ముడుచుకొని పోవుచుండిరి. పత్నులు మతుల నిందించుచుండిరి. పతులు పత్నులయందు నిర్దయులయిరి. త్రిపుర వాసి దానవు లొకప్పుడు సుశీలురుగా నున్నవారే ఇపు డిట్లు దుశ్శీలు రయిరి. దేవతలను తపోధనులను బాధించుచుండిరి. రాక్షసులకు వినాశము దాపురించినందున వారు యజ్ఞములకు విఘాతములను బ్రాహ్మణులకు విప్రియములను ఆచరించుచు విప్రులతో కలహించుచుండిరి. వైభ్రాజక చైత్రరథాశోక వరాశోక సర్వర్తుక వనములను తపోధన వనములను బలాన్వితు లగు దానవులు క్రుద్ధులగుచు ధ్వంసము చేయుచుండిరి.

వా రిట్లు దేవాలయములను ఆశ్రమములను ధ్వంసము చేయగా దేవాలయ ధ్వజములను యూపస్తంభములను విరుగగొట్టగా జగత్తు అంతయును-అమర రాజావాసమగు స్వర్గము కూడ-దేవ శత్రువులచే ఉపద్రవముల పాలయ్యెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున దానవుల త్రిపుర దుర్గ ప్రవేశము-దుఃస్వప్న దర్శనము-దానవుల దుర్వర్తనమునను నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters