Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టత్రింశదుత్తరశతతమోధ్యాయః.

త్రిపురదాహే విద్యున్మాలివధః.

సూతః : 

ఉదితేతు సహస్రాంశౌ మేరుభాసాఙ్కురే రవౌ | ననర్దచ బలం కృత్స్నం యుగాన్తఇవ సాగరః. 1

సహస్రనయనో దేవ స్తత శ్శక్రః పునర్దరః | సమహేన్ద్ర స్సవరుణ స్త్రిపురం ప్రయ¸° హరః. 2

తే నానావిధరూపాశ్చ ప్రమథాతిప్రమాథినః | యయు స్సింహరవై ర్ఘోరై ర్వాదిత్రనినదైరపి. 3

తతో వాదితవాదిత్రై స్సాతపత్రై స్సహధ్వజైః | బభూవ తద్బలం దివ్యం వనం ప్రచలితం యథా. 4

తదాపతన్తం సమ్ప్రేక్ష్య రౌద్రం రుద్రబలం మహత్‌ |

ఙోభో దానవేన్ద్రాణాం సముద్రప్రతిమోభవత్‌. 5

తేషాం ప్రాసాసిపట్టాకశ శక్తిశూలపరశ్వథాః | శరాసిచాపవజ్రాణి గురూణి ముసలానిచ. 6

ప్రగృహ్య కోపరక్తాక్షా స్సపక్షాఇవ పర్వతాః | నిర్జగ్ముర్దానవఘటా ఘనాఇవ ఘనాగమే. 7

విద్యున్మాలి న్నమస్తేవై సమయే దితినన్దనాః | వన్దమానా స్సమానేదు ర్దేవా దేవై స్సురారయః. 8

మర్తవ్యే కృతబుద్దీనాం జయేవా నిశ్చితాత్మనామ్‌ | అచలానా మివాత్రాసం స్తత్ఫలానాం యథాపురా. 9

విగర్జన్త ఇవామ్భోదా హ్యమ్భోదసదృశత్విషః | ప్రబుద్ధా యుద్ధకుశలాః పరస్సరకృతాగసః. 10

ధూమాయన్తి జ్వలద్భిశ్చ ఆయుధై శ్చన్ద్రభాస్వరైః |

కోపాద్వా యుద్ధలోభాద్వా చూర్ణయన్తః పరస్పరమ్‌. 11

వజ్రాహతాః పతన్త్యన్యే అన్యే చక్రవిదారితాః | బాణౖ ర్విదారితాశ్చాన్యే పతన్తి హ్యుదధర్జేలే. 12

భిన్న స్రగ్దామహారాశ్చ ప్రభష్టామ్బరభూషణాః | తిమినక్రముఖేష్వేవ పతన్తి ప్రమథా స్సురాః. 13

నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము.

విద్యున్మాలి వధాది కథ.

మేరు పర్వతపు కాంతులవంటి కాంతుల మొలకలతో సహస్ర కిరణుడు రవి ఉదయించెను. దేవ దానవుల బలములు రెండును ప్రళయకాల సాగరములవలె ధ్వనింపసాగెను. అంతట సహస్ర నేత్రుడును శత్రుపురముల భేదించిన వాడును మహాశక్తిశాలియు నగు ఇంద్ర దేవుడును త్రిపుర దాహమునకు సన్నద్దుడయ్యెను. హరుడును మహేంద్రునితో వరుణునితో కూడి త్రిపురదుర్గమునకు బయలుదేరెను. శత్రువులను మిగుల మథించగల వారును నానా విధ రూపులు నగు ప్రమథులు భయంకర సింహనాదములతో వాద్య ధ్వనులతో యుద్దమునకు బయలు వెడలిరి. మ్రోగుచున్న వాద్యములతో ఛత్త్రములతో ధ్వజములతో ఒప్పు ఆ దివ్యదేవతా సేన వనమే కదలిపోవుచున్నట్లు కనబడెను. భయంకరముగు ఆ రుద్రసేన వచ్చి పడుచుండుట చూచి దానవశ్రేష్ఠలును సముద్రమువలె సంక్షోభిల్లసాగిరి. వా రెల్లరును ప్రాసలములు ఖడ్గములు పట్టసముల శక్త్యాయుధములు శూలములు గండ్రగొడ్డండ్రు బాణములు ఖడ్గ విశేషములు ధనువులు వజ్రములు బరువైన ఇనుప రోకళ్ళు తీసికొని కోపముతో కండ్లెర్ర చేసి రెక్కలుగల కొండలవలె కనబడుచుండిరి. ఆ దానవులు ఏనుగులవలె వర్షాకాల మేఘములవలె బయలుదేరి విద్యున్మాలి కడకు వచ్చి తగిన సమయమున అతని నమస్కరించి ' నమస్తే' అని పలికి సింహగర్జనలు చేసిరి. దేవతల నుద్దేశించి అరచిరి. వారందరును పూర్వము ఇంద్రుని ఎదుర్కొన సిద్దపడిన పర్వతమలవలె మరణించుటకైన జయించుటకైన సిద్దపడి దృఢ నిశ్చయముతో నుండిరి. వారు భయంకరముగ గర్జిల్లు మేఘములవలె నుండిరి. వా రెల్లరు మేఘముల కాంతులవంటి కాంతికలవారు; బుద్దిశాలురు, యుద్దమున నేర్పరులు, ఇంతలో దేవ దానవుల నడుమ యుద్ద మారంభ మాయెను. వా రొకరి అయుధములతో అవకారము చేసికొనసాగిరి. చంద్రునివలె ప్రకాశించుచు ప్రజ్వలించుచున్న ఆయుధములు చేతుల దాల్చి పొగలు గ్రక్కుచున్న అగ్నులవలె నుండిరి. కోపముతోను యుద్దమునందలి పేరాసతోను ఒకరి నింకొకరు చూర్ణము చేసికొనుచుండిరి. వారు వజ్రపు దెబ్బలతో చక్రాయుధాఘాతములతో బాణ ప్రయోగములతో ముక్కలయి చీలికలయి సముద్ర జలమున పడిపోవుచుండిరి. ప్రమథులను దేవతలును కూడ మాలికలు దండలు హారములు తెగి వస్త్ర భూషణములు జారిపడి సముద్రములో తిమితిమింగిల నక్రాది జల జంతువుల నోళ్లలో పడుచుండిరి.

గదానాం ముసలానాంచ తోమర ప్రాసవాజినామ్‌ | వజ్ర శూలార్షిపాతానం వతితానాం చ సర్వశః 14

గిరిశృజ్గోపలానాంచ ప్రేరితానం ప్రవత్తిభిః | దేవానాం దానవవానాంచ సధూమానాం రవిత్విషామ్‌. 15

ఆయుధానం మహానోఘ స్సాగరౌఘే పతత్యపి | క్షీణవేగైస్తు తైస్తత్ర సురాసురకరేరితైః 16

ఆయుధౌఘై స్తు నక్రాణాం క్రియతే సజ్జయో మహా& | క్షుద్రాణాం గజయోర్యుద్దే యథా భవతి సజ్జయః 17

దేవాసురగణ తద్వ త్తిమినక్రక్షయో భవత్‌ | నన్దికేశ్వరవిద్యున్మాలీచ వేగేన విద్యున్మాల ఇవామ్బుదః 18

విద్యున్మాలిఘనాకారం నన్దీశ్వర మభిద్రుతః | స్వకం నామాతివదతే ప్యువాచ వదతాం వరః 19

నన్దినం యుధి శైలాదిం దానవో యుధి నిశ్చితః | యుద్దాకాజ్జేవ బలవా& త్వయాహం యోద్దుమాగతః 20

యుధి త్విదానీం మా జీవ& ముచ్యసే నన్దికేశ్వర | తమేవం వాదినం దైత్య నన్దీశ స్తపతాం వరః 21

ఉవాచ ప్రహసం స్తత్ర వాక్యాలజ్కారభూషితః | దానవా దమాకామానాం నైషోవసర ఇత్యుత. 22

శక్తో హస్తుం కిమాత్మానాం జాతిదోషా ద్వికత్థసే | యుధి తావ న్మయా పూర్వం నిహతా దితిజా యదా 23

ఇదానీంతు కథం త్వాహం న హింస్యే కులదూషణమ్‌ | *ఆకాశం ధారయేద్దోర్బ్యాం పాతయేద్వా దివాకరమ్‌. 24

సోపి మాం శక్నుయాన్నైవ చక్షుర్బామపి వీక్షితుమ్‌ | ఇత్యేవం మస్త్రయం స్తత్ర నన్దినా ప్రతియో బలే. 25

బిభేదై కేషుణా దైత్యః కరేణార్క ఇవామ్బుదమ్‌ | విక్షతస్య శరస్తస్య పపౌ రుధిరముత్తమమ్‌. 26

సూర్యస్త్వాత్మప్రభావేన యథార్ణవజలం తథా | సతు తేన ప్రహారేణ ప్రమథో జాతరోషితః 27

హస్తేన వృక్షముత్పాట్య చిక్షేప గజరాడివ |

గదలు ముసలములు తోమరములు ప్రానములు గుర్రములు వజ్రములు శూలములు ఋష్టులు (చిన్న ఖడ్గములు) కొండరాళ్ళు దేవతలచే దానవులచే ప్రయోగింపబడి రవి సమాన కాంతులను పొగలను క్రక్కుచు మహారాసులై సముద్రములో పడుచుండెను. అవి పడునపుడు వేగము తగ్గుచు పోయి జల జంతువులపై పడి వాటిని నశింపజేయుచుండెను. ఇది ఏనుగుల పోరిలో వాటి నడుమ అల్ప జంతువులు నలిగి చచ్చినట్లుండెను.

అంతలో మెరపులతో మెరయు మేఘము అదే విధముగు మేఘము నెదర్కొన్నట్లు విద్యున్మాలి నందిని ఎదుర్కొనుటకై అతినివైపునకు పరుగును పోయెను. యుద్దమున నిశ్చితాభిప్రాయముకల ఆదానవుడు తన పేరు తెలుపుచు శిలాద పుత్త్రుడగు నందీశ్వరునితో 'ఓయీ : నాకు యుద్దమనని మక్కువ ఎక్కువ; బలవంతుడనగు నేను యుద్దా కాంక్షినై నీతో పోరవచ్చితిని. నీవు ఇపుడిక ప్రాణాలతో పోజాలవు.' అనెను. అతని ఈ పలుకులు విని మహా తపస్వియగు నందీశ్వరుడు నవ్వుచు వాక్యాలంకార భూషితమగు వాక్యమిట్లు పలికెను. 'ఓయీ : మీరు దానవులు కరా! మావంటివారు దమము (ఇంద్రియశాంతి) కోరువారమయినను అట్టి దానికిది సమయము కాదు. నీజాతి సహజ స్వభావముతో బడాయి మాటలు పలుకుచున్నా వేకాని నీవు నన్ను చంపగలవాడవా? ఇదివరకే యుద్దములో ఎందరనో దానవుల చంపిన నేను నీవంశమునే నాశము చేయ పుట్టిన నిన్ను చంపక ఎట్లు విడువగలను?' అనగా విద్యున్మాలి నందితో 'ఓయీ : ఆకాశమును భుజములతో పట్టగలవాడును సూర్యునిక్రింద పడగొట్టగలవాడును గూడ నన్ను కన్నులతో చూడనైన జాలడు.' అనుచునే - నందితో బలమున సాటికాని ఆ దానవుడు - ఏనుగు తన తొండముతో మేఘమును చీల్చినట్లు ఒక బాణముతో నందిని గ్రుచ్చెను. ఆ బాణము - రవి తన కిరణములతో సముద్ర జలమును త్రావినట్లు - నంది రక్తమును త్రావెను. ఆ దెబ్బతో రోషించిన నంది గజేంద్రుడువలె వృక్షమొకటి పెకలించి విద్యున్మాలిపై విసరెను.

విద్దోభిపన్న స్సతరు శ్శీర్ణపుప్పో మహాజవః 28

విద్యున్మాలికరైశ్చిన్నః పపాత వతగేశవత్‌ | వృక్షసాలోపి నంఛిన్నోదానవేన వరేషుభిః. 29

రోష మాహారయం స్తీవ్రం నన్దీశ్వరః సువిగ్రహః | సోద్యమ్య కరమారావీ రవేస్సదృక్కర వ్రభమ్‌. 30

దుద్రావ హన్తుం సక్రూరం మహిషం గజరాడివ | తమాపతన్తం వేగేన వేగే వాయుసమో బలీ. 31

విద్యున్మాలీ శరశ##తైః పూరయామాస నన్దినమ్‌ | శరకణ్టకితై ర్గాత్రై శ్శైలాదిశ్చాపివిక్షతః 32

అరేర్‌ గృహ్య రథం తస్య మహతః ప్రయ¸° జవాత్‌ | విలమ్బితాశ్వో విశిరా భ్రమితశ్చ రణ రథః 33

వపాత మునిశేపేన సాదిత్యోర్కరథో యథా | అస్తరాన్నిర్గతశ్చైవ మాయయా స దితేస్సుతః 34

ఆజఘాన తదాశక్త్యా శైలాదిం నమవస్థితమ్‌ | తామేవతు వినిష్కృష్య శక్తిం శోణితభూషితామ్‌. 35

విద్యున్మాలిన ముద్దిశ్య చిక్షేప వ్రమథాగ్రణీః | తయా భిన్నతనుత్రాణో విభిన్నహృదయ స్తదా. 36

విద్యున్నాల్యవతద్బూమౌ వజ్రాహత ఇవాచలః | విద్యున్మాలౌ వినిహతే సిద్దచారణకిన్నరాః 37

సాధుసాధ్వితి చోక్త్వా తే యయు ర్దేవ ముమాపతిమ్‌ | నన్దినా సాదితే దైత్యే విద్యున్మాలౌ హతే మయః 38

దదాహ ప్రమథానీకం నల మగ్నిరివోత్థితః | శూలనిర్దారితోరస్కా గదాచూర్ణితమస్తకాః 39

ఇషుభి ర్గాడవిద్ధాశ్చ ప్రపతన్తి మహార్ణవే | అథ వజ్రధరో యమోర్థద స్సహనన్ది స్సహషణ్ముఖో గుహః 40

మయ మాసురవీరసంమతం ప్రహర ఞ్ఛస్త్రగణౖ ర్హతారయః | నాగస్తు నాగాధిపతిర్వ తార్‌క్ష్యం మయో వియో విదార్యేషువరైశ్చ తూర్ణమ్‌. 41

యమంచ విత్తాధిపతిం చభిత్త్వా రరాజ మన్ద్రామ్బుదవ త్తదానీమ్‌ | తతస్సురైః ప్రమథగణౖశ్చ దానవా దృడాహతా శ్చోత్తమదర్పవిక్రమాః. 42

భృశానువిద్దా స్త్రిపురం ప్రపేదిరే యథాసురా శ్చక్రధరేణ సంయుగే | తతశ్చ శజ్ఖానకభేరిసజ్కులా స్ససింహనాదా దనుపుత్త్రబేదకాః 43

కపర్దిసైన్యే వ్రహృతా స్సమంతతో నిపత్యమానాశ నివజ్రసన్నిభా ః 43u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే త్రిపురదాహే విద్యున్మాలి

వధాదికథనం నామ అష్టత్రింశదుత్తర శతతమోధ్యాయః

ఆ వృక్షము నంది హస్తమునుండి విద్యున్మలి దగ్గరకు వచ్చులోపుగనే వాడు ప్రయోగించిన బాణపు దెబ్బలతో దాని పూవులన్నియు రాలిపోయెను. వాని బాణముతో ఛిన్నమయి అది మహావేగమున గరుడునివలె క్రింద పడెను. అది చూచి ఉత్తమ మూర్తిగల నందీశ్వరుడు మిగుల కోపించి రవికర సదృశమగు తన కరమెత్తి మహిషముమీదికి పరుగెత్తు గజేంద్రునివలె విద్యున్మాలి మీదకు పరుగెత్తెను. వేగమున వాయు సమానుడును బలశాలియునగు ఆ విద్యున్మాలి మహావేగమున తనపైకి వచ్చు నందీశ్వరుని వందలకొలది శరములతో నింపెను. అట్లు గాయపడి నంది తన శరీరమంతయు ఆ బాణములతో గగుర్పాటు చెందినదివలె కనబడుచుండ మహావేగమున వచ్చి విద్యున్మాలి రథమును తీసికొని మహావేగమున అటనుండి పోయి గిరగిర త్రిప్పివేసెను. దానిచే ఆ రథము ముని శాపమున సూర్యునితో కూడ పడిపోయిన రవి రథము వలె పడిపోయెను. విద్యున్మాలియును పడిపోవుచున్న ఆ రథమునుండి తన మాయా బలమున తప్పించుకొని బయటపడి అచ్చటనే నిలిచియున్న నందీశ్వరుని శక్త్యాయుధముతో కొట్టి గాయపరచెను. ప్రమథ శ్రేష్ఠుడగు ఆనందియును తన గాయపు నెత్తటితో తడిసిన ఆశక్తినే లాగి ఆ దానవునిపై విసరగా వాని కవచమును హృదయమును బ్రద్దలయి వాడు వజ్రపుదెబ్బ తినిన పర్వతమువలె క్రింద పడిపోయెను. అది చూచి సిద్దులును చారణులును కిన్నరులును 'సాధు-సాధు' 'బాగు-బాగు' అని పలికి శిపునికడకు పోయిరి. విద్యున్మాలి మృతి విని కోపించి మయుడు ప్రజ్వలించు అగ్ని ఎండుగడ్డిని వలె ప్రమథ సేనను కాల్చెను. శూలముతో రొమ్ములు చీలికలయి గదలతో తలలు పగిలి గాఢముగా బాణపు దెబ్బలుతిని ప్రమథులు సముద్రమున పడుచుండిరి. అది చూచి ఇంద్రయమ కుబేర నంది షణ్ముఖులు దానవ వరశ్రేష్ఠుడగు మయుని వివిధ శస్త్ర గణములు ప్రయోగించి కొట్టిరి. నాగాధిపతి గరుత్మంతుని చీల్చినట్లు మయుడు శ్రేష్ఠ బాణములతో యముని కుబేరుని చీల్చి గంభీర మేఘమువలె ప్రకాశించెను. అంతట ప్రమథులను దేవతలును ఏకమై దానవులను కొట్టగా వారు తామెంత ఉత్తమ దర్పము విక్రమము కలవారయినను ఆయుధపు దెబ్బల వ్యథ అధికము కాగా పూర్వము విష్ణుని చేతిలో దెబ్బలు తినిన అసురులవలెనే యుద్దము వదలి త్రిపురదుర్గమున ప్రవేశించిరి. అంతట దేవసేనలోనుండి శంఖములు తప్పెటలు నగారాలు ఢంకలు సింహనాదములు ఆకసమునుండి పడుచున్న పిడుగుల మ్రోతలు వెలుపడి దానవుల గెండెలు బ్రద్దలు చేయసాగెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున విద్యున్మాలి వధ వృత్తాంతమను నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters