Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుశ్చత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

దేవాసురయక్షగన్ధర్వ మనుష్యాదిపరిమాణోత్సేధకథనమ్‌.

సూతః : మన్వన్తరాణి యాని స్యుః కల్పే కల్పే చతుర్దశ | వ్యతీతానాగతాని స్యు ర్యాని మన్వన్తరే ష్విహ. 1

విస్తరేణానుపూర్వ్యాచ్చ స్థితం వక్ష్యే యుగే యుగే | తస్మిన్యుగేచ సమ్భూతి ర్యాసాం యావచ్చ జీవితమ్‌.

యుగమాత్రంతు జీవంతి న్యూనం తత్స్యా ద్ద్వయేనతు | చతుర్దశసు తావంతో జ్ఞేయా మన్వంతరేష్విహ. 3

మనుష్యాణాం పశూనాంచ పక్షిణాం స్థావరైః సహ | తేషా మాయు రుపక్రాంతం యుగధర్మేషు సర్వశః. 4

తథైవాయుః పరిక్రాంతం యుగధర్మేషు సర్వశః. 4

అస్థితించ కలౌ దృష్ట్వా భూతానా మాయుష స్తథా |

పర మాయుశ్శతం త్వేత న్మనుష్యాణ్యాం కలౌ స్మృతమ్‌. 5

దేవాసురమనుష్యాశ్చ యక్షగన్ధర్వరాక్షసాః | పరిణాహోచ్ర్ఛయై స్తుల్యా జాయన్తే హ కృతే యుగే. 6

షణ్ణవత్యఙ్గళోత్సధో అష్టానాం దేవయోనినామ్‌ | నవాఙ్గుళప్రమాణన నిష్పన్నేన తథాష్టకమ్‌. 7

ఏతత్స్వాభావికం తేషాం ప్రమాణ మధికుర్వతామ్‌ | మనుష్యా వర్తమానాశ్చ యుగసంధ్యాంశ##కే ష్విహ. 8

దేవాసురప్రమాణంతు సప్తసప్తాఙ్గుళం క్రమాత్‌ | చతురాశీతివైశ్చైవ కలిజై రఙ్గళై స్స్మృతమ్‌. 9

ఆపాదతలమస్తక్యే నవతాలో భ##వేత్తు యః | సంహత్యా యా తు బాహుశ్చ దైవతైరపి పూజ్యతే. 10

గజాశ్వహస్తినాం చైవ మహిషస్థావరాత్మనామ్‌ | క్రమేణౖతేన విజ్ఞేయా హ్రాసవృద్ధి ర్యుగేయుగే. 11

షట్సప్తత్యఙ్గుళోత్సేధః పశు రాకకుదో భ##వేత్‌ | అఙ్గుళానా మష్టశత ముత్సేధో హస్తినాం స్మృతః. 12

అఙ్గుళీ(ళా)నాం సహస్రంతు ద్విచత్వారింశదఙ్గుళమ్‌ | శతార్ధ మఙ్గళానాంతు ఉత్సేధ శ్శాభినాంపరః. 13

నూట నలువది నాలుగవ అధ్యాయము.

దేవాసుర యక్ష గంధర్వ మనుష్య పశుపక్షి -

వృక్షాదుల యుగానుగత పరిమాణాదికము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ప్రతి కల్పమునందును వచ్చు పదునాలుగు మన్వంతరములందును ఆయా యుగములందు దేవాది జాతుల జన్మము వారి శరీర ప్రమాణము వారి జీవితకాలము అనుపూర్వితో విస్తరమగు చెప్పెదను.

పదునాలుగు మన్వంతరములందును కృతాదియుగములందు ఆ యుగ ప్రమాణము - సంధ్యా సంధ్యాంశములు కాక - దివ్యమానమున ఎన్ని సంవత్సరములో ఆ యుగపు మానవులు మానవ మానమున అన్ని సంవత్సరములు జీవింతురు. (సంధ్యా సంధ్యాంశములు కాక కృతయుగ ప్రమాణము నాలుగు వేల వర్షములు కావున ఆ యుగపు మానవులు మానవ మానమున నాలుగు వేల ఏండ్లు జీవింతురు. అని ఇట్లు అన్ని యుగముల విషయము గ్రహించవలెను.) యుగధర్మము ననుసరించియే ఆయా యుగములందలి మానవ పశుపక్షి వృక్షాదుల ఆయుః పరిమాణాదికము ఏర్పడినది. వాటి శరీర పరిమాణము ఎత్తుసరి కూడ అంతే. కాని కలియుగమున మాత్రము ప్రాణుల దౌర్బల్యము అస్థిరత చూచి మానవుల పరమాయువు నూరు సంవత్సరములేయని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను. (పైని చెప్పిన విధముగ నైనచో యుగానుసారము కలి మానవుల పరమాయువు ఒక వేయి ఏండ్లు ఉండవలయును.)

ఇక కృతాది యుగములలో దేవతాది ప్రాణుల శరీరపు ఎత్తుసరి మొదలగునవి: కృతయుగమున దేవాసుర మానవ యక్ష గంధర్వ రాక్షసులు దేహపు చుట్టు కొలతలో కాని ఎత్తుసరిలో కాని సమానులై యుందురు. విద్యాధరాదులగు ఎనిమిది దేవజాతుల వారును మానవులును కూడ కృతయుగమున తొంబది యారు (కృతయుగపు) అంగుళముల ఎత్తు కలిగియుందురు. ఆ యుగ సంధ్యాంశములయందు వీరి శరీరముల ఎత్తుసరి డెబ్బదిరెండంగుళములే ఉండును. కలియుగమున దేవతల ఎత్తుసరి నలువది తొమ్మిది - రాక్షసుల శరీరపు ఎత్తు ఎనుబడి నాలుగు - కలియుగపు అంగుళములు ఉండును. (కలియుగమున మానవుల శరీరపు ఎత్తు తొంబది యారంగుళములే - కాని ఇవి కలియుగపు మానవుల ప్రమాణము ననుసరించియని తెలియవలెను. ఇట్లన్ని యుగములందును మానవదేహ ప్రమాణము తొంబది యారంగుళములేయైనను యుగానుసారము దాని పరిమాణము తగ్గును. మానవుని కుడిచేతి బొటనవ్రేలి నడిమి కణువపునొద్ద అరచేతివైపు తెల్లని వన్నెగల భాగపు కొలతను అంగుళముగా గ్రహించుట యొకపద్ధతి. అడ్డముగా ఉంచిన ఎనిమిది యవలు ఆక్రమించు పొడవును అంగుళమనుట శాస్త్ర వ్యవహారము.) కలియుగమున కాలి దిగువనుండి మస్తకాంతము వరకు తొమ్మిది తాలముల ఎత్తుకలిగి మోకాళ్ళవరకు బాహువులుగల మానవులను దేవతలును ప్రశంసింతురు. (తాలము=కుడిచేతి బొటనవ్రేలిని ఎడమకు - చూపుడు వ్రేలిని కుడికి - బాగుగా చావగా ఈ రెంటినడుమ అగు పొడవు; దీనిని తెలుగులో 'లుడితి' అందురు.)

ఈ చెప్పిన కొలతల ననుసరించియే ఆయా యుగములందలి గోవుల గజముల మహిషముల తదితర పశుమృగాదుల వృక్షజాతుల పరిమాణము కూడ తగ్గుచు పెరుగుచు నుండునని ఎరుగవలెను. పశువు (బహుశః వృషభము) కాలి కొననుండి మూపురము పైవరకు డెబ్బది ఆరంగుళములు ఎత్తుండును. ఏనుగులు ఎనిమిదివందల అంగుళముల ఎత్తుండును. వృక్షముల ఎత్తు ఒక వేయి తొంబదిరెండు అంగుళము లుండును. ఆయా యుగములయందు మానవుల దేహపు ఎత్తుసరియే దేవతలకును ఉండును. కాని బుద్ధి శక్తి విషయములో మానవులకంటె దేవతలు గొప్పవారు.

మానుష స్సన్నివేశస్తు యాదృశః పరిదృశ్యతే | తల్లక్షణంతు దేవానాం దృశ్యతే న్వయదర్శనాత్‌. 14

బుద్ధ్యాతిశయసంయుక్తం దేవానాం కార్య ముచ్యతే | తథా నాతిశయంచైవ మానుషం కార్య ముచ్యతే. 15

ఇత్యేవంహి పరిక్రాన్తా భావా యే దివ్యమానుషాః | పశూనాం పక్షిణాం చైవ స్థావరాణాంచ సర్వశః. 16

గవాజాశ్వాశ్చ విజ్ఞేయా హస్తినః పక్షిణో మృగాః | ఉపయుక్తాః క్రియాస్వేతే విజ్ఞేయా స్త్విహ సర్వశః. 17

యథాక్రమోపభోగశ్చ దేవానాం పశుమూర్తయః | తేషాం రూపాను రూపైశ్చ ప్రమాణౖ స్థ్సిరజఙ్గమాః. 18

మనోజ్ఞైస్తత్ర తే భావై స్సుఖినో హ్యుపపేదిరే | అథ శిష్టా న్ప్రవక్ష్యామి సాధూనథ సతశ్చ వై. 19

సాధ్వాచారధర్మాః.

బ్రాహ్మణాః స్తుతిశబ్దాశ్ఛ దేవానాం పశుమూర్తయః | సారూప్యం బ్రహ్మణో హ్యన్తే తేన సన్తః ప్రచక్షతే.

సామాన్యేషుచ ధర్మేషు తథా వైశేషికేషు చ | బ్రహ్మక్షత్త్రవిశో హ్యుక్తా శ్చాన్తే వై మేతుకర్మణా. 21

వర్ణాశ్రమేషు యుక్తస్యసుఖోదర్కస్య స్వర్గతౌ | శ్రౌతస్మార్తస్య మార్గస్య జ్ఞానధర్మ స్స ఉచ్యతే. 22

దివ్యానాంచ సుసాధూనాం బ్రహ్మచారీ గురో ర్హితః | కారణా త్సధనా చ్చైవ గృహస్థ

స్సాధు రుచ్యతే. 23

తపసశ్చ తథారణ్య సాధు ర్వైఖానస స్స్మృతః |

యతమానో యతి స్సాధు స్స్మృతో యోగస్య సాధనాత్‌. 24

ధర్మే ధర్మగతిః ప్రోక్త శ్శబ్ధో హ్యేషక్రియాత్మకః | కుశలీ కుశలం ధర్మాధర్మాం స్తమబ్రవీ త్ప్రభుః. 25

ధర్మాదిలక్షణమ్‌.

అథ దేవాశ్చ పితరో ఋషయోథ చ మానుషాః | అయం ధర్మోహ్యయంనేతి బ్రువతే మౌనమూర్తినా. 26

ధర్మేతి ధారణ ధాతు ర్మహత్త్వేచైవ ఉచ్యతే | ఆధారణ మహత్త్వేవా ధర్మ స్సతు నిరుచ్యతే. 27

తత్రేష్టప్రాపకో ధర్మ ఆచార్యై రుపదిశ్యతే | అధర్మశ్చానిష్టఫల

ఆచార్యై ర్నోపదిశ్యతే. 28

వృద్ధా హ్యలోలుపాశ్చైవ ఆత్మవన్తో హ్యదామ్భికాః | సమ్యగ్వినీతా గురుభి స్తనాచార్య న్ప్రచక్షతే. 29

ఆయా యుగములందలి దేవతలయు-మానవులయు పరిమానాదికము ఇట్లుండునని తెలుపుటయైనది. పశు పక్షి వృక్షాదుల పరిమాణమును తెలిపితిని. గోవులు గొర్రెలు మేకలు గుర్రములు ఏనుగులు పక్షులు మృగములు వృక్షాదికము ఆయా ప్రాణులకును మానవులకు ఆయా పనులయందును ఉపయుక్తములగుచున్నవి. దేవతలనుద్దేశించి చేయు యాగములందు వీనిలో కొన్ని యాగ పశువులయి దేవతలకుపభోగ సాధనములగుచున్నవి. కాగా ఇవి ఇట్లు యాగాదులయందు దేవతలకై ఉపయోగపడిన పుణ్య విశేషమున అవి తమ దేహమును వదలిన తరువాత పరలోకమున స్వర్గముచేరి సుఖమును పొందును.

ఇక మీదట శిష్టులు - సాధులు - 'సత్‌' శబ్దముతో చెప్పబడువారు ఎవరో తెలిపెదను. 'సత్‌' అనునది పర బ్రహ్మమునకు పేరు. బ్రాహ్మణులును వేద వచనములును యాగ పశువులును యాజ్ఞాదులకై దేవతలకుపయోగపడి తుదకు బ్రహ్మత్వమును పొందును. ఈ సామ్యముతో ఈ మూడిటిని 'సత్‌' అందురు.

ఆయా వర్ణముల వారయందును ఆయా బ్రహ్మచర్యాద్యాశ్రమములందును (ఉప) యుక్తము అయి స్వర్గమునకు పోయిన తరువాత అధిక సుఖము కలిగించు శ్రౌతస్మార్త ధర్మమును జ్ఞాన ధర్మము అందురు. ఇవి బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యులాచరించదగినవారు. ఇవి సామాన్య ధర్మములు - విశేష ధర్మములు - అని రెండు విధములు; 'ఇవి ఆచరించవలెను.' అని ఈ త్రైపర్ణికులును (ని) యుక్తులు - నియోగింప - శాసింప - బడినవారు. శాసింపబడుటచే వీరు శిష్టులు; (వాటిని ఆచరించువారు.)

బ్రహ్మచారి గృహస్థవానప్రన్థ సంన్యాసులు నలుగురును సాధువులని చెప్పబడుదురు. ఎట్లనగా - బ్రహ్మచారి తన గురువునకు హితకరుడై విదయలను సాధించుకొనును. గృహస్థుడు ప్రజాభివృద్ధికి సమాజపు సుఖవృద్ధికి కారణ భూతుడై తనకును లోకమునకును దేవతలకును సుఖమును సాధించును. అరణ్యమందు నివసించుచు వానప్రస్థుడు తపస్సును సాధించును. పరతత్త్వ ప్రాప్తికై యత్నించుచు (ప్రయత్నము చేయుచు యతియగు సంన్యాసి యోగమును సాధించును. ఇట్లు సాధనము చేయు వీరందరును సాధువులగుచున్నారు.

ఇక ధర్మాధర్మ విషయము : ధర్మము అనునది ఒక వస్తువు అనుకొనరాదు. ధర్మగతిని (ధర్మపు నడకను - ధర్మమును ఆచరించుటను) ధర్మమని ఇచ్చట భగవానుడు చెప్పెను. కావున ఈ విధముగ ధర్మశబ్దము క్రియారూపము కాని వస్తురూపము కాదు. సర్వలోకముల క్షేమమునకు ఉపయోగించు కర్మమును ధర్మమని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను.

ఇక - దేవతలును పితరులును ఋషులును మానవులును ఇది ధర్మము అని వ్యవహరించుచుందురు కదా! అట్లది నిర్ణయించుట మౌన మూర్తితో మాత్రమే - మునియై తపోబలమున విషయ తత్త్వ విచారణము చేసినవారికి మాత్రమే - శక్యమగును. 'దర్మ' శబ్దమునకు మూలమగు 'ధృ(ఞ్‌)' ధాతువునకు ధారణము (తన యందు ఇతరములను నిలుపుకొనుట-తాను ఇతరములకు ఆశ్రయమగుట) అనియు గొప్పదనము అనియు అర్థములు. కావున ధర్మము అనగా లోకస్థితికి ఆధారము-అన్నిటకి మహత్త్వమును కలిగించుచు తాను గొప్పదైయుండునది- అని అర్థములు. ఇష్టములను పొందునట్లుచే యునది ధర్మము; కావున అది ఆచరించుడని ఆచార్యులు ఉపదేశింతురు. అనిష్ట ఫలప్రదము అధర్మము; కావుననే దాని నాచరించుడని ఆచార్యు లుపదేశింపరు. మరి ఆచార్యులనగా ఎవరు ? అనిన-విద్యావయో నుభవములందు వృద్ధులు (పెరిగిన వారు)- ధన సుఖాదులందు ఆసలేనివారు- హృదయదార్ఢ్యము కలవారు-దంభము లేనివారు- పెద్దలవలన చాల తిన్నగా శిక్షణము నొందినవారు ఎవరో వారిని ఆచార్యులు అందురు.

శ్రౌతస్మా ర్తధర్మవిభాగః-శిష్టాచార లక్షణమ్‌.

ధర్మజ్ఞై ర్విహితో ధర్మ శ్శ్రాత స్స్మార్తో ద్విధా ద్విజైః |

దారాగ్నిహోత్రసమ్బన్‌న్ధ ఇజ్యా శ్రౌతస్య లక్షణమ్‌. 30

స్మార్తో వర్ణాశ్రమాచారో యమైశ్చ నియమైశ్చ సః |

పూర్వేభ్యో వేదయిత్వేహ శ్రౌతం స ప్తర్షయోబ్రువ&. 31

ఋచో యజూంషి సామాని బ్రహ్మణోఙ్గాని సాధుభిః |

మన్వంతరస్యాతీతస్య స్మృత్వా తం మను రబ్రవీత్‌. 32

తస్మా త్స్మార్తః స్మృతో ధర్మో వర్ణాశ్రమవిభాగశః | ఏవం వై ద్వివిధో ధర్మ శ్శిష్టాచార స్స ఉచ్యతే. 33

శిషేర్ధాతోశ్చ నిష్ఠాన్తా చ్ఛిష్టశబ్దః ప్రవక్ష్యతే | మన్వన్తరేషు యే శిష్టా ఇహ తిష్ఠన్తి ధార్మికాః. 34

మను స్సప్తర్షయశ్చైవ లోకసన్తానకారిణః | తిష్ఠన్తనీహచ ధర్మార్థా స్తాఞ్ఛిష్టా న్త్సమ్ప్రచక్షతే. 35

తై శ్శిష్టై శ్చరితో ధర్మ స్థ్సాప్యతే వై యుగే యుగే | వార్తావై దణ్డనీతిశ్చ ప్రజావర్ణాశ్రమేప్సయా. 36

శిష్టై రాచార్యతే యస్మా త్పునశ్చైవ మనుక్షయే | పూర్వైః పూర్వై ర్మతత్వాచ్చ శిష్టాచార స్స శాశ్వతః.

దానం సత్యం తపో లోకో విద్యేజ్యా పూజనం దమః | అష్టౌ తాని చరిత్రాణి శిష్టాచారస్య లక్షణమ్‌. 38

శిష్టా యస్మా చ్చర న్త్యేనం మను స్సప్తర్షయ స్తథా | మన్వన్తరేషు సర్వేషు శిష్టాచార స్తత స్స్మృతః. 39

విజ్ఞేయ శ్శ్రవణా చ్ఛ్రౌతః స్మరణా త్స్మార్త ఉచ్యతే | ఇజ్యా వేదాత్మక శ్శ్రౌత స్త్సార్తో వర్ణాశ్రమాత్మకః.

ప్రత్యఙ్గాని ప్రవక్ష్యామి ధర్మస్యా హేతులక్షణమ్‌ | దృష్టానుభూత మర్థం యః పృష్టో నిష్ట న్న గూహతే.

యథాభూతప్రవాదస్తు ఇత్యేత త్సత్య లక్షణమ్‌ |

ధర్మజ్ఞులగు ద్విజులు ధర్మమును శ్రౌత ధర్మము స్మార్త ధర్మము అని రెండుగా విభజించిరి. దారలతో కూడినవారు (గృహస్థులు)అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మలును యజ్ఞ ప్రభేదములును శ్రౌతధర్మము. యమ నియమసహితమగు వర్ణాశ్రమాచారము స్మార్త ధర్మము; పూర్వులనుండి తామెరిగిన శ్రౌతధర్మమును సప్తర్షులు లోకమున ప్రవచించిరి. గడచిన మన్వంతరము నందలి ఋగ్యజుః సామములను వేదాంగములను సాధు(సముచితము యథాతథమునగు)రూపములతో స్మరించి(తాము పూర్వమన్వంతర ములలో ఎరిగి యున్నందున చిత్తమున నిలిచిన సంస్కార బలమున వానినే యథార్థ రూపములో ఇపుడు చి త్తమున గోచరింపజేసికొని) మనువు ప్రవచించినది కావున దీనికి స్మార్త(స్మృతిచే లభించిన) ధర్మమని వ్యవహారము. ఇది వర్ణాశ్రమ విభాగమున విభ క్తమై యున్నది.

ఈ రెండు విధములగు ధర్మమునకును శిష్టాచారమని వ్యవహారము. 'శిషి'ధాతువు (శాసు-అనుశిష్టౌ)నుండి పరమయి'క్త' అను'నిష్ఠా' ప్రత్యయము చేరగా శిష్టశబ్దము (ఏర్పడును) సిద్ధించును-ఆయా మన్వంతరములయందు ఈ రెండు విధములగు ధర్మములను ఎరిగి ఆచరించుటచే శిష్టులనబడు ధర్మానుష్ఠాతలును లోక సంతానకారు లగు (లోక వ్యవస్థా ప్రవృత్తులను నిరంతరముగా కినసాగించుటయే పరమ ప్రయోజన మని భావించు)మను సప్తర్షి ప్రభృతులును ఇహలోకమందిప్పుడు ధర్మానుష్ఠానము పరమ ప్రయోజనముగా నెంచి దానినెరిగి అనుష్ఠించు ధార్మికులను శిష్టులు అనబడు దురు.

ఇట్టి శిష్టులు ప్రజలయందు వర్ణాశ్రమ ధర్మములను నిలుపూగోరి తాము శ్రౌతస్మా ర్త దర్మములను అనుష్ఠించి యుగయుగమునందును వా ర్త (జీవన మార్గములు) దండనీతి మొదలగువానిని లోకమునందు నిలుపుదురు. పునఃపునః మనువుల తరువాత మనువులుగా నడచు మన్వంతరములందు శిష్టులచే ఆచరింపబడుటచేతను అంతకంటె పూర్వులును పూర్వతరులునునగు శిష్టులకు సమ్మతమగుటచేతను ఈ విధమగు ఆచరణీయ ధర్మమునకు శిష్టాచారమని పేరు. ఇది శాశ్వతము (సార్వకాలికము సార్వదై శికము) అయినది.

దానము సత్యము తపస్సు లోకము (లోక వ్యవస్థాక ర్తలగు పెద్దల నడువడి) విద్య ఇజ్యా (యాగాది దేవతా-లోకోపకారక-కర్మలు) పూజనము దమము (ఇంద్రియనిగ్రహము) అను ఈ ఎనిమిది విధములగు చరిత్రములు (నడువడులు) శిష్టాచార సమగ్ర స్వరూపము. సర్వ మన్వంతరములందును మను సప్తర్షి ప్రభృతులగు శిష్టులు ఆచరించునది కావున దీనికి శిష్టాచారమని వ్యవహారము. శ్రవణమువలన (వేదశాస్త్రములనుండి గ్రహించగా) సిద్ధించినది శ్రౌతము; స్మృతివలన సిద్ధించినది స్మార్తము. యజనము-వేదములు-అను రూపముతో నున్నది శ్రౌతము-వర్ణాశ్రమాత్మకమయినది స్మార్తము-అని వీనిస్వరూపకథ నము.అహేతు లక్షణమగు (హేతువాదము చేయక శ్రద్ధతో ఆస్తిక్య భావముతో- గ్రహించవలసిన) ధర్మ ప్రత్యంగములను (ధర్మమునకు పుట్టి కలిగించు ప్రవృత్తులను) తెలిపెదను వినుడు. 1. మీరు చూచియు అనుభవించియు ఎరిగిన విషయమును మాకు తెలుపుడని ఎవరైనఅడిగినపుడు అనిష్టము చూపక దాచుకొనక యథార్థ వస్తు త త్త్వమును తెలుపుట సత్యము.

తపఃప్రభృతీనాం లక్షణమ్‌.

బ్రహ్మచర్యం తపో మౌనం నిరాహారత్వ మేవచ. 41

ఇత్యేత త్తపసో రూపం సుఘోరంతు దురాసదమ్‌ | పశూనాం ద్రవ్యహవిషా మృక్సామయజుషాం తథా. 42

ఋత్విజాం దక్షిణాయాశ్చసంయోగో యజ్ఞ ఉచ్యతే | ఆత్మవ త్సర్వభూతేషు యో హితాయ శుభాయ చ.

వ ర్తతే సతతం హృష్టః క్రియా యా సా దయా స్మృతా | ఆక్రుష్టోభిహతో యస్తు నాక్రోశే త్ప్రహరేదపి.

అదుష్టో వాఙ్మనఃకాయై స్తితిక్షు స్సా క్షమా స్మృతా | స్వామినా రక్ష్యమాణానాం విసృష్టానాంచ సమ్భ్రమే.

పరస్వానా మనాదాన మలోభఇతి సంజ్ఞితః | మైథునస్యాసమాచారో జల్పనా చ్చిన్తనా త్తథా. 46

నివృత్తిర్బ్రహ్మచర్యస్య తదచ్ఛిద్రస్యలక్షణమ్‌ | ఆత్మార్థేవా పరార్థేవా ఇన్ద్రియాణీహ యస్య వై. 47

విషయే న ప్రవర్తన్తే దమసై#్యవతు లక్షణమ్‌ | పంచాత్మకే యో విషయే కారణ వాష్టలక్షణ. 48

న క్రుధ్యేత ప్రతిహతో జితాత్మేతి స మన్యతే | యద్య దిష్టతమం ద్రవ్యం న్యాయేనైవాగతంచ యత్‌. 49

తత్త ద్గుణవతే దేయ మిత్యేత ద్దానలక్షణమ్‌ | శ్రుతిస్మృతిభ్యాం విహితో ధర్మో వర్ణాశ్రమాత్మకః. 50

శిష్టాచారవివృద్ధశ్చ ధర్మోయంసాధుసమ్మతః | అప్రద్వేషో హ్యనిష్టేషు ఇష్టంవై నాభినన్దతి. 51

ప్రీతితాపవిషాదానాం వినివృత్తి ర్విర క్తతా | సన్న్యాసః కర్మణాం న్యాసః కృతానా మకృతై స్సహ. 52

కుశలాకుశలాభ్యాంతు ప్రహాణం న్యాస ఉచ్యతే | అవ్యక్తాదివిశేషా న్తే వికారేస్మి న్నివర్తితే. 53

చేతనాచేతనం జ్ఞాత్వా జ్ఞానే జ్ఞానీ స ఉచ్యతే | ప్రత్యఙ్గానాంతు ధర్మస్య ఇత్యేత ల్లక్షణం స్మృతమ్‌. 54

ఋషిభి ర్మతత త్త్వజ్ఞైః పూర్వైః స్వాయమ్భవేన్తరే |

2. బ్రహ్మచర్యము తపస్సు (శరీరమును కఠిన నియమములకు పాలుపరచి శ్రమ పెట్టుట) మౌనము (విషయ తత్త్వ విచారణ చేయుట) నిరాహారత్వము అను ఇవి తపస్స్వరూపములు. ఇది ఘోరమును సామాన్యులకు చేరరానిదియు 3. యజ్ఞీయము లగు పశువులు ద్రవ్యములు హవిస్సులు ఋక్సామ యజుర్మంత్రములు ఋత్విజులు దక్షిణలు-వీని కూడికయే యజ్ఞము (ఇజ్యా) అనబడును. 4. ఏ చిత్తవృత్తి విశేషము ఉండుటచేత సర్వ భూతముల విషయమునను పురుషుడు తన విషయమునందువలెనే చూపుకలిగి హృష్టుడై వానికి శుభమును హితమును కలిగింపగోరునో-అది దయ యనబడును. 5. ఇతరులు తిట్టినను తిట్టక కొట్టినను కొట్టక మనోవాక్కాయములందు ప్రతీకార దోషములేక ఓర్పుతో నుండుట క్షమయనబడును. 6. ధనపు సొంతదారుడు కాపాడుకొనుచున్న దానినేకాని తొందరలలో విడిచిన దానినేకాని పరధనమును తీసికొన (దలచ)కుండుట అలోభమనబడును. 7. శారీరకముగా మైథునము చేయకుండుట నోటితో ఆ మాటలాడుకుండుట మనస్సుతో అది తలచకుండుట అచ్ఛిద్ర (ఏదోషమును లేని) బ్రహ్మ చర్యమనబడును. 8. తనకై కాని ఇతరులకై కాని విషయానుభవములందు ఇంద్రియములు ప్రవ ర్తిల్లకుండుట దమమనబడును. (బహిరింద్రియ నిగ్రహము) 9. ఐదు విధములగు (శబ్ద స్సర్శరూప రస గంధములను) విషయముల విషయమునను ధనకనక వస్తు వాహనాది (సుఖ) కారణ (సాధన)ములెనిమిదింటి విషయమునను ఎవరైన తన కడ్డము వచ్చినను కోపించకుండుట జితాత్మత్వము (శమము) అనబడును. 10. తాను న్యాయమున అర్జించినదియు తనకు మిగుల ఇష్టమును అగు వస్తువునుకూడ గుణవంతులగువారికి (ఇష్టముతో) ఇచ్చుట దానమనబడును. శ్రుతిస్మృతులు విధించిన వర్ణశ్రమాత్మక ధర్మమును-శిష్టాచారబలముచే వృద్ధిపొందిన ధర్మమును- సాధుజనులగు పెద్దలకు సమ్మతమగు ధర్మము. 11. ఇష్టములగు వానిని మెచ్చక-అనిష్టములగు వానిపై అధిక ద్వేషము చూపక ప్రీతి తాప విషాదములను పొందకుండుటయే వైరాగ్యమనబుడను. 12. ఇదివరకు చేసిన-ఇకముందు చేయనున్న-కర్మల ఫలసంగమును విడుచుట సంన్యాసమనబడును. 13. తనకు ఇమముననైన క్షేమము కలిగించు కర్మములను కీడు కలిగించు కర్మములను సమభావముతో విడుచుట న్యానమనబడును 14. అవ్యక్త (నామ రూప విభాగము లేని జగ దాది స్థితి) దశ మొదలుగా ఆయా-సకల నామరూప విశేషములవరకుగల వికారజాతమునుండి బుద్ధిని మరలించి చేతనమునకును అచేతన త త్త్వమునకునుగల భేదమును తెలిసికొని అట్టిజ్ఞానమందే యుండువాడు జ్ఞాని యనబడును. పూర్వపు స్వాయంభువ మన్వంతరమునందు ధర్మత త్త్వజ్ఞులగు ఋషులు ధర్మ ప్రత్యంగముల స్వరూపము ఇదియని తెలిపియుండిరి.

అత్ర వో వర్తయిష్యామి విదిం మన్వన్తరస్యతు.55

తథైవ చాతుర్హోత్రస్య చాతుర్వర్ణ్యస్య చైవహి | ప్రతిమన్వ న్తరంచైవ శ్రుతి రన్యా విధీయతే. 56

ఋచో యజూంషి సామాని యథావ త్ర్పతిదైవతమ్‌ | విధిస్తోత్రం తథాహౌత్రం పూర్వవ త్సమ్ర్పవర్తతే.

ద్రవ్యస్తోత్రం గుణస్తోత్కరం కర్మస్తోత్రం తథైవచ | తథైవాభిజనస్తోత్రం స్తోత్ర మేవం చతుర్వి(షడ్వి)ధమ్‌.

మన్వన్తరేషు సర్వేషు యథా వేదా భవన్తి హి | ప్రవర్తయతి తేషాంవై బ్రహ్మా స్తోత్రం పునఃపునః. 59

ఏవం సర్వగుణానాంతు సముత్పత్తి శ్ఛతుర్విధా | అథర్వ ఋగ్యజుస్సామ్నాం వేదేష్విహ షృథక్పీథక్‌.

ఋషీణాం తప్యతాం తేషాం తపః పరమదుశ్చరమ్‌ | మన్త్రాః ప్రాదుర్భవన్త్యాదౌ పూర్వమన్వ న్తరస్య హ.

అసన్తోషా ద్భయా ద్దుఃఖాన్మోహచ్ఛోకాచ్చ పఞ్చధా | ఋషీణాం తారకాఖ్యేన లక్షణన యదృచ్ఛయా. 63

ఋషీణాం యదృషిత్వంహి తద్వక్ష్యామీహ లక్షణమ్‌ | అతీతానాగతానాంతు పఞ్చధా హ్యార్షకం స్మృతమ్‌.

తథా ఋషీణాం వక్ష్యామి ఆర్షసై#్యత త్సముద్భవమ్‌ | గుణాః సామ్యమేన వ ర్తన్తే సర్వే సమ్ర్పళ##యే తదా. 63

మహదాదినిష్పత్తిః.

అవిభాగేన వేదానా మనిర్దేశ్యత మోమయే | అబుద్ధిపూర్వకం తద్వై చేతనార్థం ప్రవ ర్తతే. 66

తేనార్షంబుద్ధిపూర్వంతు చేతనేనాప్యధిష్ఠితమ్‌ | ప్రవర్తేతే తథా తౌతు యథా మత్స్యోదకా వుభౌ. 67

చేతనాధికృతం సర్వం ప్రవర్తేత గుణాత్మకమ్‌ | కార్యకాణభావేన తదా తస్య ప్రవర్తతే. 68

విషయో విషయిత్వం చ థా హ్యర్థపదాత్మకమ్‌ | కాలేన ప్రాపణీయేన భేదావై కారణాత్మకాః. 69

సాంసిద్ధికా స్తథా వ్యక్తాఃక్రమేణ మహదాదయః | మహత స్స్యా దహఙ్కార స్తస్మా ద్భూతేన్ద్రియాణి చ.

ఇక ఇక్కడ మీకు ప్రతి మన్వంతరమునందును సమానరూపములో నడుచు ధర్మపు నడకను చాతుర్హోత్ర (బ్రహ్మ అధ్వర్యుడు కాక హోతతో కూడ నలుగురు ఋత్విక్కులతో నిర్వర్తించు) యాగమును దాని విధానమును చాతుర్వర్ణ్య ధర్మవ్యవస్థను వర్ణింతును.

ప్రతి మన్వంతరమునందును శ్రుతి వేరువేరుగా నుండును. (ఏ మన్వంతరమునకు ఆ మన్వంతరమునందు శ్రుతిమారును.) అప్పుడును ఋగ్‌ యజుః సామవేదము లుండును. ప్రతి దేవతను ఉద్దేశించిన మంత్రములు నుండును. విధి స్తోత్రము హౌత్రస్తోత్రము ద్రవ్యస్తోత్రము గుణస్తోత్రము కర్మస్తోత్రము అభిజనస్తోత్రము అనునవియును ఉండును. కాని అవియును ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా నుండును. బ్రహ్మ ఆయా వేదములకు సంబంధించిన స్తోత్రములను ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా మలర మరల ప్రవ ర్తిల్ల చేయుచుండును. ఇది ఒక వేదమునకే కాదు; ఋగ్‌ యజు; సామాథర్వణ వేదములకు నాలుగిటికి సంబంధించిన స్తోత్రముల విషయమునందును మన్వంతర భేదమును బట్టి భేదము ఏర్పడును.

ఆయా మన్వంతరములందు మిగుల దుశ్చరమగు తపస్సాచరించిన ఋషులకు అతః పూర్వపు మన్వంతరమునందు వలెనే వేదమంత్రముల ప్రాదుర్భవించును. (వేదములను తదంశములును వెనుకటి మన్వంతరములందు వలెనే యున్నను వాటి రూపములందు భేదముండునని దీనిని బట్టి ఎరుగవలెను.)

ఆయా ఋషులకు ఆయా వేద-వేదాంశ ('వేదాంగ'అనికాదు.) మంత్రములు ప్రాదుర్బవించుటకు (వారికి తమ యుగపు ప్రాపంచిక స్థితుల విషయమున కలిగిన) అసంతోషము (వాటివలన కలిగిన) భయము దుఃఖము (ఈ పరిస్థితుల నుండి జనుల కెట్లు విడుదల కలిగిచవలెనో తెలియని స్థితి అనెడు) మోహము (ప్రజల క్లేశములు చూచి కలిగిన) శోకము అను ఈ ఐదు స్థితులును హేతువులగును.

ఋషులకు ఈ వేదవేదాంశములు సాక్షాత్కరించుట యాదృచ్ఛికముగ (అదృష్ట విశేషమున)ను తారకము అను (యోగ) లక్షణముచేతను సిద్దించును.

ఋషులకు (మంత్రద్రష్టలకు) ఋషిత్వమును కలిగించు లక్షణము తెలిపెదను. ఇది వరకు గడచిన మన్వంతరములందు కాని రాబోవు వానియందు కాని ఆర్షకము (ఋషిత్వమునందలి ప్రభేదములు) ఐదు విధములుగా నుండును. ఋషులకు ఈ ఋషిత్వము ఏర్పడు విధముతోపాటు ఆ ఐదు ఋషిత్వ ప్రబేదములను మీకు తెలిపెదను.

ప్రళయకాలమునందు సర్వ(త్రి)గుణములును సమతావస్థతో నుండును. వేదములును శబ్దర్థ ప్రవిభాగములేక వాని అవాంతర ప్రవిభాగములును లేక ఏకైకా ఖండ శబ్దరూపము కూడ అవ్యక్త త త్త్వమున లయమంది యుండును. సర్వమును తమోమయమయి యుండును. (ఈ దృశ్య ప్రపంచపు స్థూల రూపాంశములే కాదు సరియే కదా దీనికి మూలములగు సూక్ష్మతత్త్వములను అవ్యక్త దశయందుండును.) ఇది మూలప్రకృతి జడతావస్థ. ఇది కొంతకాలమునకు తరువాత మరల అబుద్ధి పూర్వకముగానే (తన సంకల్పము లేకయే - తాను జడము కావున తనకు సంకల్పించు శక్తియే లేదు- పరమాత్ముని చితిరూపశక్తి ప్రేరణచే తనయందు చైతన్యమును వ్యాప్త మొనరించుకొను టకును తాను చైతన్యమునకు ఆశ్రయమగుటకును ఉన్ముఖమయి) ప్రవర్తిల్లును.

ఇదియే ఆర్షతాస్థితి. అందుచేతనే ఆర్షత్వము అనునది చిదాత్మక (విశుద్ధ జ్ఞానాత్మక) తత్త్వపు శ క్తిచే ప్రేరితము కావున బుద్ధిపూర్వకము అనియు చేతనతత్త్వముచేత అధిష్టించబడినది (అనగా ఈ ఆర్షత్వమునందు చిదాత్మక లక్షణము వ్యాపించియున్నది) అనియు చెప్పబడుచున్నది. ఇట్లు చేతనాచేతనములు-చిదాత్మక పరమాత్ముడును మూలప్రకృతియు - మత్స్యమును ఉదకమునువలె పరస్పరము విడదీయరాక ప్రవృత్తి నందుచుండును. ఇ ట్లీ ప్రకృతి (జడ) పురుష (చేతన)తత్త్వములు రెండును పరస్పరము కార్యకారణ భావమును పొంది చేతనవ్యాప్తితో (తనయందు చేతనయందు చేతనత త్త్వము వ్యాపించగా) త్రిగుణమయ జగ ప్రకృతి సృష్టికి ప్రవ ర్తిల్లును.

ఈ విధముగ ప్రవర్తిల్లు సృష్టిలో శబ్దార్థ సృష్టియు వ్యక్తరూపము నందసాగును. అందు అర్థము విషయము-పదము (శబ్దము) విషయి-యగును. శబ్దమును వినగా తత్ప్రభావమున చిత్తమున ఆ శబ్దముచే ఉద్దేశించబడిన అర్థము (వస్తువుల సన్నివేశము) గోచరమగును. ఇదియే శబ్దార్థముల విషయి విషయభావసంబంధము.

ఇట్లు అస్పష్ట రూపమున నైన శబ్దర్థవ్యక్తి (స్పష్టీభావము ప్రవర్తిల్లుట) ఆరంభము కాగా కాలక్రమమున ప్రపంచసృష్టికి మూల కారణతత్త్వములగు మహదాది త త్త్వములు అవ్యక్తతత్త్వమునండి వికాస క్రమమున వ్యక్తము కానారంభించును. మహత్తత్త్వము నుండి ఆహంకారతత్త్వము దానినుండి సూక్ష్మభూతములు ఇంద్రియ తత్త్వములు వ్యక్తము లగును.

('నేను' అను సామాన్యాకారపు 'అహం తత్త్వ స్ఫురణచే ఈశ్వరుని యందు కలుగు బుద్ధ్యాత్మకదశ 'మహత్తత్త్వము' అనబడును. 'నేను ఇట్టివాడను ఈ పేరుగల వాని కుమారుడను.' ఈ మొదలగు విశేష జ్ఞానముతో కూడిన 'అహం' స్ఫురణను అహంకారము అందురు. ఈ శ్వరుని యందు జగత్సష్టి ప్రవృత్తి కాలమున కలుగు ఇట్టి బుద్ధిదశ అహంకారత త్త్వము.)

భూతభేదాశ్చ భూతేభ్యో జజ్ఞిరేతు పరస్పరమ్‌ | సంసిద్ధిః కారణం కార్యం సద్య ఏవ నివ ర్తతే. 71

యథోల్ముకా ద్విరుచయో ఏకకాలా ద్భవన్తిహి | తథాప్రవృత్తాః క్షేత్రజ్ఞాః కాలేనై కేన కారణాత్‌. 72

యథాన్ధకారే ఖద్యోత స్సహసా సమ్ర్పదృశ్యతే | తథా వివృత్తో హ్యవ్యక్తం ఖద్యోత ఇవ సఞ్జ్వల&. 73

స మహాత్మా శరీరస్థ స్తత్రైవ పరివర్తతే | మహత స్తమసః పారే వై లక్షణ్యా ద్విభావ్యతే. 74

తత్రైవ సంస్థితో విద్వా& తమసోన్త ఇతి శ్రుతమ్‌ | బుద్ధి ర్వివర్దత స్తస్య ప్రాదుర్భూతా చతుర్విధా.

జ్ఞానం వైరాగ్య మైశ్వర్యం ధర్మశ్చేతి చతుష్టయమ్‌ | సాంసిద్ధికా న్యథైతాని అప్రతీతాని తస్య వై. 76

మహాత్మనః శరీరస్య చైతన్యా త్సిద్ధి రుయ్యతే |

పురే శేతే యతం పూర్వం క్షేత్రజ్ఞానం తథాపిచ. 77

పురేషు శయనా త్పురుషః క్షేత్రజ్ఞానాద్‌జ్ఞ ఉచ్యతే | యస్మాద్ధర్మాస్ర్పసూతేహి తస్మా ద్వై దార్మికస్తుసః. 78

సాంసిద్ధికే శరీరేచ బుద్ధ్యా వ్యక్తంతు చేతనమ్‌ | ఏవం వివృత్తం క్షేత్రం జ్ఞః క్షేత్రం హ్యనభిసన్ధితః. 79

వివృత్తిసమకాలేతు పురాణం తదచేతనమ్‌ | క్షేత్రజ్ఞేన పరిజ్ఞాతం భోగ్యోయం విషయో మమ. 80

భూతతన్మాత్రలు అనెడు సూక్ష్మభూతములనుండి భూతభేదములు (స్థూల భూతములు) మొదలగునవి ఒకదాని నుండి మరియొకటి అనుక్రమమున ఉత్పన్నము లగును. స్వాభావికముగా స్వయంసిద్దమగు కారణతత్త్వమగు దానినుండి ఏర్పడిన కార్యతత్త్వము మరియొకదానికి కారణమగుచు ఈ క్రమమున వెంట వెంటనే సృష్టిక్రమములో పరమాత్ముడు ఈ ప్రపంచ రూపమున రూపొందును. ఒక కొరవినుండి ఒకే సమయమున అనేకములగు చిన్న చిన్న నిప్పురవ్వలు చెదరి బయటికి వచ్చినట్లు ఒకే చైతన్యమునుండి ఒకే క్షణమున జీవు లనేకులు పరమాత్మనుండి వివృత్తమైన భూతములతో ఏర్పడిన దేహములందు నానా దేహధారులుగా కనబడుదురు. ఇందరు క్షేత్రజ్ఞులకును (జీవులకును) కారణమగు చేతనముల త త్త్వము ఒక్కటియే.

చీకటిలో అకస్మాత్తుగా మెరపు తళుక్కున మెరసినట్లు అవ్వక్తతత్త్వమునుండి వివృ త్తమయిన జీవ సమూహము కూడ దేమధారులయి ప్రకాశించుచు కనబడును. పరమాత్మ త త్త్వముకూడ అంతర్యామియై ప్రతి శరీరమునందునుండును. మహాతమస్సునకు ఆవల పరమాత్ముడు ఈ సమ స్తసృష్టికిని అతీతమయి త్రిపాత్తత్త్వముగా అంతర్యామి కంటె విలక్షణమయి ప్రకాశించుచుండును.

ఇట్లా పరమాత్ముడు అక్కడనే-ఆయా దేహధారుల దేహయములనెడు క్షేత్రములందే- ఉండును-అదే సమయమున-తమస్సునకు ఆవలనుండును-అని శ్రుతుల యందు విన బడుచున్నది. ఇట్లతడు ప్రకృతికి అధిష్ఠాతయై వివర్తము పొందుచుండ (రూపవంతుడై భాసించుచున్న - కొలదిని) అతని బుద్ధిలో 1. జ్ఞానము- 2. వైరాగ్యము- 3. ఐశ్వర్యము- 4. ధర్మము అనునవి కలిగెను. (2. ఇది మనవంటి వారి విరక్తి వంటిదికాదు; నేను పొందవల సిన దేదియు లేదు; నేను అవా ప్తసకల కాముడను; నావారు అనదగు వారెవ్వరును లేరు; మమకారముతో నాకు పనిలేదు-అను బుద్ది; 3. నేను సర్వేశ్వరుడను; నేనే ఎల్ల జగములకును దిక్కు; అనుబుద్ధి; 4. లోకప్రవృత్తికి మూలమగు సత్కర్మానుష్ఠానము నేనే అను భావన.) ఇవి అతనికి స్వతస్సిద్ధములే కాని కావలెనని సంపాదించుకొన్నవి కావు. ఆ మహాత్మునికి మాయా శ క్తి కృతమగు శరీరప్రా ప్తివలన ఇవి సిద్ధించినవి.

ఇతడు'పూర్‌'అనబడు ఆయాప్రాణుల శరీరముల యందు సాక్షి రూపుడై యుండును; 'పురి-శ>పురుష'-అని వ్యవహరింపబడును. ఆయా దేహములందు (క్షేత్రములందు) ఉండి వాని తత్త్వమును ఎరుగును కావున క్షేత్రజ్ఞుడు-జ్ఞుడు-అనబడును. ధర్మమును అవలంబించి లోకములను సృజించి పాలించును కావున అతడు ధార్మికుడనబడును.

ఇట్లు తనకు అనపాయిని అగు(ఎన్నడును విడిపోని)మాయాశక్తిచే సిద్ధించిన దై స్వాభావికముగ లభించిన శరీరమునందు ఈ చెప్పిన బుద్ధి లక్షణముచే చేతనుడయి పరమాత్ముడు మూల ప్రకృతికి కలిగిన సృష్ట్యభిముఖ ప్రవృత్తిని సఫలము చేయును.

ఇట్లు పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా వివ ర్తము పొందియు క్షేత్రము విషయమునను అందలి జీవుని ప్రవృత్తుల విషయమునను వాటివలన కలుగు ఫలముల విషయమునను ఎట్టి అభినంధియు (అహంకార మమకారములు)ను లేకుండును.

ఈ పరమాత్ముడిట్లు వివ ర్తము పొందుటకు సమకాలముననే పురాణము (అనాది) అగు ఆ అచేతన(జడ) ప్రకృతి క్షేత్రరూపమునను భోగ్యవస్తు జాత రూపమునను రూపొంది ఆ క్షేత్రజ్ఞుని చేత 'ఇదినాకు ఆశ్రయము' అనియు 'ఇదినాకు భోగ్యము' అనియు ఎంచబడుచున్నది.

ఋష్యాదిలక్షణమ్‌.

ఋషి ర్హింసాగత్యోర్దాతుర్విద్యా సత్యం తప శ్ర్శుతమ్‌ |

ఏష సన్నిచయో యస్మాద్‌ బ్రహ్మణస్తు తత స్త్వృషిః. 81

వివృత్తిసమకాలాచ్చ బుద్ధ్యా వ్యక్త మృషి స్స్వయమ్‌ | ఋషతే పరమం యస్మా త్పరమర్షి స్తతః పునః.

గత్యర్థా దృషతే ర్ధతో ర్నా మనిర్వృత్తికారణమ్‌ |

యస్మా దేష స్వయమ్భూత స్తస్మాచ్చ ఋషితా మతా. 83

ఈశ్వరా స్స్వయముద్భూతా బ్రహ్మణో మానసా స్సుతాః| వివ ర్తమానై సై#్త ర్బుద్ధ్యా మహా న్పరగతః పరః.

యస్మా దృషి ర్మహ త్త్వేన సహ తస్మా న్మహర్షయః |

ఈశ్వరాణాం సుతా స్తేషాం మానసా శ్చౌరసాశ్చ వై. 85

ఋషి స్తస్మా త్పరత్వేన భూతాది రీషయ స్తతః | ఋషిపుత్త్రా ఋషీకాస్తు మైథునా ద్గర్బసమ్భవాః 86

పరత్వేన ఋషంతేవై భూతాదీ నృషికా స్తతః | ఋషికాణాం సుతా యేతు విజ్ఞేయా ఋషిపుత్త్రకాం. 87

శ్రుత్వా ఋషం పరత్వేన స్మృతా స్తస్మా చ్ర్ఛుతర్షయః |

అవ్యక్తాత్మా మహాన్తాత్మాహహాన్తాత్మాహఙ్కారాత్మా తథైవచ. 88

భూతాత్మా చేన్ద్రియాత్మాచ తేషాం తద్జాన ముచ్యతే | ఇత్యేవ మృషిజాత్యస్తు పఞ్చధా నామ విశ్రుతాః. 89

భృగు ర్మరీచి రత్రిశ్చ అఙ్గిరాః పులహః క్రతుః | మను ర్దక్షో వసిష్ఠశ్చ పుల స్త్యశ్చాపి తే దశ. 90

బ్రహ్మణో మానసా హ్యేతే ఉత్పన్నా స్స్వయ మీశ్వరాః |

పరత్వేన ర్షయో యస్మా న్మతా స్తస్మా న్మహర్షయః 91

మ న్త్రద్రష్టృఋషిపరిగణనమ్‌.

ఈశ్వరాణాం సుతా స్త్వేషా మృషయ స్తా న్నిబోధత | కావ్యో బృహస్పతిశ్చైవ కాశ్యప శ్చ్యవన స్తథా. 92

వత్సరో నగ్న హూశ్చైవ భరద్వాజశ్చ వీర్యవాన్‌ | ఋషిర్దీర్ఘమాశ్చైవ బృహద్వక్షాః శరద్వతః. 93

వాజిశ్రవాః సుచింతశ్చ శావశ్చ సపరాశరః | శృంగీచ శంఖపాచ్చైవ రాజావైశ్రవణ స్తథా 94

ఇత్యేతే ఋషికాః సర్వే సత్యేన ఋషితాం గతాః | ఈశ్వరా ఋషయశ్చైవ ఋషికా యేచ విశ్రుతాః. 95

జగత్సృష్టి పరమాత్మచై తన్య ఋషిత్వముల సంబంధము.

ఋషీ- «హింసాగత్యోః; అను ధాతువునుండి ఋషి అను శబ్దము సిద్ధించును. బ్రహ్మ (చతుర్ముఖబ్రహ్మయును పరబ్రహ్మయును) విద్యా సత్యతపః శాస్త్ర జ్ఞానముల రాశి స్వరూపుడు కావున అతనికి ఋషి అని వ్యవహారము; పరమాత్ముడు తాను వివృత్తి (సృష్టిగా రూపొందుట) పొందిన సమయమునందే బుద్ధి రూపమున వ్యక్తుడై (స్పష్టరూపమునందినవాడై) నందున అతడు ఋషి; పరమము (సర్వోత్తమము) అగుదానిని 'ఋషతే' తెలిసికొనెను; కావున అతడు పరమఋషి; ఇట్లే 'గతి' 'గమనము - జ్ఞానము' అను అర్థమును ఇచ్చు 'ఋష' ధాతువునుండి ఈ ఋషి శబ్దము ఏర్పడినది కావుననే - స్వయముగా తానే జ్ఞానము పరమాత్మగా స్వయం సముద్భూతమయినది కావున జ్ఞానమునకును ఋషి అని వ్యవహారము; ఇట్లే 1. బ్రహ్మ మానసపుత్త్రులగు మరీచి మొదలగువారు మైథున ప్రవృత్తితో పనిలేక స్వయముగా ఉత్పన్నులయిరి. వారును ఋషులు; వీరును వివర్తము పొందుచునే న్యాయముగా బుద్ధి (జ్ఞానము)తో వ్యాపింపబడిరి; కావున వీరు ఈశ్వర ఋషులు; (జ్ఞానమునకు అధీశ్వరులు); 2. ఈ ఈశ్వర ఋషులకు మానస పుత్త్రులుగాను-ఔరన (మైథనముతో జనించిన) పుత్త్రులుగాను కలిగినవారు కొందరు తాము పుట్లుచునే మహాజ్ఞానముతో (ఋషితో) వ్యాప్తులయిరి; కావున వీరు మహర్షులు; 3 భూతాది సృష్టికాలమున ఔరస సంతానముగా (మైథునముతో) జనించినవారు కేవల ఋషులు; 4. ఇట్లే మైథునముతో ఋషుల గర్భమునుండి జనించినవారు ఋషికులు; వీరు ఉత్కృష్టమగు విధమున భూతాది సృష్టి విషయములను తెలిసినవారు. 5. ఋషికుల ఔరస పుత్త్రులు; వీరు తమ పూర్వులనుండి శ్రుతులను శ్రుతము (వినబడినవి)గా చేసికొని లోకమున ప్రచారము చేయువారు; శ్రుతి త త్త్వము నెరిగినవారు; కావున వీరు శ్రుతర్షులు అనబడుదురు.

ఇక సృష్టిక్రమ దశల ననుసరించి పరతత్త్వము - 1. అవ్యక్తాత్మా 2. మహాన్తాత్మా 3. అహంకారాత్మా; 4. (సూక్ష్మ) భూతాత్మా 5 ఇంద్రియాత్మా అని ఐదు విధములగును; ఈ చెప్పినవారిలో 1. ఈశ్వర ఋషులు అవ్యక్తాత్మను 2. మహర్షులు మహాన్తాత్మను 3. ఋషులు అహంకారాత్మను 4. ఋషికులు భూతాత్మను 5. ఋషిపుత్త్రులు ఇంద్రియాత్మను స్వయముగా జ్ఞాన విజ్ఞానములతో ఎరిగినవారు. ఇట్లు ఈ ఐదు తెగల ఋషులును పరత త్త్వమును ఏదో రూపమున తాము ఎరిగియుండి ప్రజలకును ఎరుకపరచ గలిగినవారు.

« పాణినీయ ధాతు పాఠమున 'ఋషీ-గతౌ' అని మాత్రమున్నది. కాని ఇచట ఇచ్చిన హింసార్థము పాణినీయము కాని-ఇతర వైయాకరణుల ధాతు పాఠమున నుండి యుండును. ఋషిత్వములో తపస్సు కూడ చేరియున్నది. ఇది శరీర హింసా రూపమయినది. ఇందులకై ఈ ధాతువునకు ఈ యర్తము తగుననితోచును.

ఏవం మంత్రకీతః సర్వే కృత్స్న శశ్చ నిబోధత |

ఉచథ్యో వామదేవశ్చ అగస్త్యఃకౌశిక స్తథా | కర్దమో వాలఖిల్యాశ్చ విశ్రవా శ్శ క్తిమర్ధనః. 96

ఇత్యేతా(తే)ఋషయః ప్రోక్తా స్తపసా ఋషితాం గతాః |

తేషాం పుత్త్రా నృషీకాంస్తు గర్భోత్పన్నా న్నిబోధత. 97

భృగుః కాశ్యపః ప్రాచేతా దధీచో హ్యాత్మవానపి | ఊర్వోథ జమదగ్నిశ్చ వేదసార స్తత స్తథా. 98

ఆర్షిషేణశ్చ శ్యావాశ్వో వీతహవ్య స్సవేధసః | వైన్యః పృథు ర్దివోదాసో బ్రహ్మాస్వా గృత్స్నశౌనకాః. 99

ఏకోనవింశతి హ్యేతే భృగవో మ న్త్రకృత్తమాః | అఙ్గిరా బృహస్పతిశ్చ భరద్వాజో (థలక్ష్మణః) భవాత్మకః.

తథా మృగధరోగర్గ శ్శితిభాకృతి రేవచ | *తురవీతశ్చ మాన్ధాతా అమర్బరీష స్తథైవచ. 101

యువనాశ్వః పురుకుత్స స్స్వశ్రవశ్చ తమస్యవా& | అజమీఢోస్వహార్థ్యశ్చ హ్యతలః కవిరేవచ. 102

పృషదశ్వో విరూపశ్చ కణ్వశ్చైవాథ ముద్గలః |

ఉచథ్యశ్చ శరద్వాం(ఋషిజోబృహచ్ఛుక్ల) శ్చతథా వాజిశ్రవా అపి. 103

అపస్యోష స్సుచిత్తిశ్చ వామదేవ స్తతైవచ | ఉబిల్లో బృహసిక్యశ్చ ఋషి ర్దీర్గతమా అపి. 104

కక్షీవాం శ్చ త్రయస్త్రింశత్స్మృతా హ్యఙ్గిరసాం వరాః | ఏతే మ న్త్రకీత స్సర్వే కశ్యపాంస్తు నిబోధత.

కాశ్యప స్సహ వత్సారో నైధ్రువో నిత్య ఏవచ | అసితో దేవలశ్చైవ షడేతే బ్రహ్మ వాదినః. 106

అత్రిరర్ధస్వనాశ్చైవ శ్యావాశ్వోథ గవిష్ఠిరః | కర్ణికశ్చ ఋషి స్సిద్ధ స్తథా పూర్వాతిథిశ్చయః. 107

ఇత్యేతే త్వత్రయః ప్రోక్తా మన్త్రకృతో మహర్షయః | వసిష్ఠశ్చైవ శ క్తిశ్చ తృతీయశ్చ పరాశరః. 108

తతస్తు ఇన్ద్రప్రమితిః పఞ్చమస్తు భరద్వసుః | షష్ఠస్తు మిత్రావరుణ స్సప్తమః కుణ్డిన స్తథా. 109

ఇత్యేతే సప్త విజ్ఞేయా వాసిష్ఠా బ్రహ్మవాదినః | విశ్వామిత్రశ్చ గాధేయో దేవరాత స్తథాబలః. 110

తథా విద్వాన్యధుచ్ఛన్దా ఋషిశ్చాన్యోఘమర్షణః | అష్టకో లోహిత శ్చైవ భృతకీలశ్చ తా వుభౌ. 111

దేవశ్రవా దేవరాతః పురాణశ్చ ధనఞ్జయః | శిశిరశ్చమహాతేజాశ్శాలఙ్కాయన ఏవచ. 112

త్రయోదశైతే విజ్ఞేయా బ్రహ్మిష్ఠాః కౌశికా వరాః | అగస్త్యోథ దృఢాశ్వశ్చ ఇన్ద్రబాహు స్తథైవచ. 113

బ్రహ్మిష్ఠాగస్తయో హ్యేతే త్రయః పరమకీర్తయః | మను ర్వైవస్వతశ్చైవ ఐళో రాజా పురూరవాః. 114

క్షత్త్రియాణాం వరా హ్యేతే విజ్ఞేయా మ న్త్రవాదినః | బలన్ధశ్చ సవత్సశ్చ సఙ్కీలశ్చైవ తే త్రయః. 115

ఏతే మన్త్రకృతో జ్ఞేయా వైశ్యానాం ప్రవరా ఇమే | ఇత్యేకనవతిః ప్రోక్తా మన్త్రాయైశ్చ బహిఃకృతాః. 116

బ్రాహ్మణాఃక్షత్రియావైశ్యాభేషిపుత్త్రాన్నిబోధత |

ఋషికాణాం సుతా హ్యేతే ఋషిపుత్త్రాస్స(శ్శ్రు)తర్షయః. 117

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మన్వన్తరానువర్ణనే దేవాసురయక్ష గన్ధర్వమనుష్యాది

పరిమాణోత్సేధాదికథనం నామ చతుశ్చత్వారింశదు త్తరశతతమోధ్యాయః.

మంత్రద్రష్టలగు ఋషులు; త్రైవర్ణికులందును ఋషులు కలరు.

భృగువు మరీచి అత్రి అంగిరుడు పులహుడు క్రతువు మనువు దక్షుడు వసిష్ఠుడు పులస్త్యుడు అను పదిమందియు బ్రహ్మకు మానసపుత్త్రులు. వీరు ఈశ్వరులు; సర్వసమర్థులు; తమకు స్వయంభూబ్రహ్మ అప్పగించిన ఆయా

* కృతవాచస్తథా గర్ఘః కృతిస్సంకృతి రేవచ. (పాఠాం.)

స్పష్ట్యంశములపై సంపూర్ణధికారయము కలవారు. పైని తెలిపిన ఐదు విధములగు ఆత్మల త త్త్వమును ఎరిగినవారు అగుటచే వీరు ఋషులనబడుదురు; ఋషులలో అందరలో మొట్టమొదటివారును గొప్పవారును అగుటతో వారు మహర్షులు అనబడిరి. (పర=పరస్‌=మహత్‌.)

ఇట్టి ఈశ్వరులగు మహర్షుల కుమారులు ఋషులు; వీరిని తెలిపెదను వినుడు; కావ్యుడు బృహస్పతి కశ్యపుడు చ్యవనుడు ఉతథ్యుడు వామదేవుడు అగస్త్యుడు కౌశికుడు కర్దముడు వాలఖిల్యులు విశ్రవసుడు శ క్తివర్ధనుడు అనువారు ఋషులు. ఈ చెప్పబడిన ఋషులందరును తమ తపశ్శక్తిచే ఋషిత్వమును పొందిరి. వారి గర్భము లనుండి ఉత్పన్నులయిన 'ఋషికు'లనబడు 'ఋషులు' మైథునముచే జనించినవారు. (వీరు 'ఋషులను తెగకు చెందిన ఋషుల ఔరస పుత్త్రులు.) వీరిపేరులు: వత్సరుడు (వత్సారుడు) నగ్నహూ భరద్వాజుడు వీర్యవాన్‌ దీర్ఘతమసుడు బృహద్వక్షసుడు శరద్వాన్‌ వాజశ్రవస్‌ సుచింతుడు పరాశరుడు శృంగిన్‌ శంఖపాత్‌ వైశ్రవణుడు-వీరందరును ఋషికులు అనబడు ఋషులు; వీరెల్లరును సత్యమునందు సిద్ధినొంది ఋషిత్వమును పొందిరి.

ఈ చెప్పిన వారిలో ఈశ్వరులు (మహర్షులు) ఋషులు ఋషికులు వీరెల్లరును మంత్రకృత్‌లు (మంత్రములను దర్శించినవారు. వారి పేరులన్ని యు తెలిపెదను; తెలిసికొనుడు.

భృగువు కాశ్యపుడు ప్రచేతస్‌ దధీచుడు ఆత్మవాన్‌ ఊర్వుడు జమదగ్ని వేదుడు సారస్వతుడు ఆర్షిషేణుడు చ్యవనుడు వీతహవ్యుడు వేధసుడు వైన్యుడు పృథువు దివోదాసుడు బ్రహ్మస్వాన్‌ గృత్సుడు శౌనకుడు ఈ పందొమ్మిది మందియు భృగువంశమునందు జన్మించినే మంత్రకృత్‌(మంత్రకర్త-మంత్రద్రష్ట)లగు ఉ త్తములు.

అంగిరస్‌ వేదసుడు భరద్వాజుడు లక్ష్మణుడు (భవాత్మకుడు) కీతవాచుడు గర్గుడు స్మృతి సంకృతి (మృగధరుడు గర్గుడు శితిభా-కృతి) తురవీతుడు మాంధాత అంబరీషుడు యువనాశ్వుడు పురుకుత్సుడు స్వశ్రవుడు సదస్యవాన్‌ (తమస్యవాన్‌) అజమీఢుడు అస్వహార్యుడు ఉత్కలుడు కవి పృషదశ్వుడు విరూపుడు కావ్యుడు ముద్గలుడు ఉత(చ)థ్యుడు శరద్వాన్‌ వాజిశ్రవస్‌ అపస్యోషుడు సుచిత్తి వామదేవుడు ఋషిజుడు బృహచ్ఛుక్లుడు (ఉబిల్లుడు బృహసిక్ముడు) దీర్ఘతీ మస్‌ కక్షీవాన్‌-ఈ ముప్పది ముగ్గురును అంగిరో వంశమునందు జన్మించిన మంత్రద్రష్టలు.

ఇకమీదట కశ్యప వంశమునందలి మంత్రద్రష్టలు; వీరిని విని తెలిసికొనుడు; కాశ్యపుడు వత్సారుడు నైధ్రువుడు నిత్యుడ ఆసితుడు దేవలుడు అనువారు వీ రారుగురు.

అత్రి అర్ధస్యనుడు శ్యావాశ్వుడు గవిష్ఠిరుడు కర్ణికుడు తపస్పిద్దుడగు పూర్వాతిథి ఈ ఆరుగురును అత్రిపంశము నందలి మంత్రద్రష్టలు.

వసిష్ఠుడు శ క్తి పరాశరుడు ఇంద్రప్రమితి భరద్వసువు మిత్రావరుణుడు కుండినుడు ఈ ఏడుగురు వసిష్ఠ వంశమందలి మంత్రద్రష్టలు. వీరందరు బ్రహ్మవాదులు (వేదతత్త్వము నెరిగినవారు.)

గాధిపుత్త్రుడగు విశ్వామిత్రుడు దేవరాతుడు బలుడు విద్వాంసుడగు మధుచ్ఛందుడు అఘమర్షణుడు అష్టకుడు లోహితుడు భృతకీలుడు మాంబధి దేవశ్రవస్‌-ధనంజయుడు శిశిరుడు శాలంకాయనుడు - ఈ పదుముగ్గురును బ్రహ్మిష్ఠులు(బ్రహ్మత త్త్వవేత్తలలో ఉ త్తములు)ను కౌశిక వంశోత్పన్నులునుఅగు మంత్రద్రష్టలు.

అగస్త్యుడు దృఢద్యుమ్నుడు ఇంద్రబాహువు - ఈ ముగ్గురును బ్రహ్మిష్ఠులును అగ స్త్య గోత్రజాతులునగు మంత్ర ద్రష్టలు; వీరు ఉత్తమ కీ ర్తిశాలురు.

వైవస్వత మనువు-ఇలాపుత్త్రుడును రాజు నగు పురూరవుడు క్ష త్త్రియులలో శ్రేష్ఠులై మంత్రవాదులగు మంత్రద్రష్టలు; వీరు ఉత్తమ కీ ర్తిశాలురు.

వైవస్వత మనువు-ఇలాపుత్త్రుడును రాజు నగు పురూరవుడు క్షత్త్రియులలో శ్రేష్ఠులై మంత్రవాదులగు మంత్ర ద్రష్టలు. (మంత్రవాదులు=మంత్రతత్త్వవేత్తలు)

భలందకుడు వాసాశ్వుడు సంకీలుడు ఈ ముగ్గురును వైశ్యులలో ప్రవరు (శ్రేష్ఠు)లగు మంత్రద్రష్టలు.

(ఇచట చెప్పిన భృగ్వంగిరః కశ్యపాత్రి వసిష్ఠ విశ్వామిత్రాగస్త్యుల గోత్ర ప్రవరములే ముందటి(195-200) అధ్యాయములందు వివరింపబడును.)

ఇట్లు మంత్రములను దర్శించి బయల్పరచి మంత్రద్రష్టలలో తొంబది రెండు మంది నామములు ఇచట చెప్పబడినవి. వీరిలో బ్రాహ్మణులును క్ష త్త్రియులును వైశ్యులును అను మూడు వర్ణములవారును కలరు. వీరిని ఋషిపుత్త్రు లందురు. 'ఋషికు'ల కుమారులకు ఋషిపుత్రులనియు శ్రుత(సుత)ఋషులనియు కూడ వ్యవహారము కలదు.

ఇది శ్రీమపత్స్య మహాపురాణమున మన్వంతరాను వర్ణనమున-దేవాది పరిమాణ కథనము-శిష్ట సాధు ధర్మ తపోదానాది లక్షణ-ఋష్యాది లక్షణ-మంత్రద్రష్టృ ఋషి పరిగణన-మను నూట నలువది నాలుగవ అధ్యాయము.

తప్పొప్పుల పట్టిక

పుట పంక్తి తప్పు ఒప్పు

3 28 స్యధా న్యథా

3 28 పరన్య చరస్య

4 6 రెండు యోజనములంత (1600 మూరలు) యోజనమంత (16000 మూరలు)

47 1 శతత శత

52 9 సమృధ్ధేషు సమృద్ధేషు

53 22 బర్హిష్మంతు హవిష్మంతు

57 3 (లర్దము) (లఅర్థము)

66 19 బలి బలిం

79 16 సల్లాపః సంల్లాపః

80 21 ప్రపాత పపాత

84 34 శార్జధర శార్జధర

131 1 వృత్తాంతములు వృత్తాంతము

144 23 మార్య మాచార్య

162 22 కథనము కథనమ్‌

173 16 ప్రతం వ్రతం

220 12 చత్వాలే చాత్వాలే

220 21 చత్వాల చాత్వాల

222 13 ప్రకృచ్చ ప్రతికృచ్చ

233 12 సితపక్షే సితివక్షే

233 25 శుక్లపక్ష కృష్టపక్ష

277 4 బ్రహ్మణా భగవాన్‌

315 1 గుడ-సువర్ణపర్వతదానములు-84-85అ.

369 1 ప్రయోగ ప్రయాగ

453 1 విభగ విభాగ

465 1 155అ. 125అ.

480 480 హాసశ్ఛ హానశ్చ

483 1 స్తులించుట స్తుతించుట

436 22 సలిలె సలిలే

489 1 త్రివుర త్రిపుర

491 5 భగవాఞ్ఛాల భగవాఞ్ఛాల

525 1 కథనము వధాదికథనము

Sri Matsya Mahapuranam-1    Chapters   

గమనిక : 220 పుట-21 పంక్తిలో-యజ్ఞ పరికరములలో 'ధ్రువా-స్థాలీ' అను పేరుగల దారుమయస్థాలి ఒకటి.