Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకవింశో7ధ్యాయః.

చక్రవాకచతుష్టయస్య బ్రాహ్మణజన్మప్రాప్తిః.

ఋషయః :కథం సత్త్వరుతజ్ఞో7భూ ద్బ్రహ్మదత్తో ధరాతలే| తేచాభవ న్కస్యకులే చక్రవాకచతుష్టయమ్‌.

సూతః :తస్మిన్నేవ పురే జాతా తేతు చక్రాహ్వయా స్తదా |

వృద్ధద్విజస్య దాయాదా విప్రా జాతిస్మరా ద్విజాః. 2

ధృతిమాం స్తత్త్వదర్శీచ విద్యాచణ్డ స్తథోత్సుకః | నామతః కర్మతశ్చైతే సుదరిద్రస్య తే సుతాః. 3

తపసే బుద్ధి రభవ త్తదా తేషాం ద్విజన్మనామ్‌ | యాస్యామః పరమాం సిద్ధి మిత్యూచుస్తే ద్విజోత్తమాః. 4

తత స్తద్వచనం శ్రుత్వా సుదరిద్రో మహాతపాః | ఉవాచ దీనయా వాచా కిమే తదితి పుత్త్రకాః. 5

అధర్మకామా న్విధివ త్పితా తా నభ్యచోదయత్‌ | వృద్ధం పితర మత్సృజ్య దరిద్రం వనవాసినః. 6

కోను ధర్మోత్ర భవితా మర్త్యః కాం గతి మేతి హి | ఊచుస్తే కల్పితా వృత్తి స్తవ తాత వదస్వ మే. 7

వృత్త మేత త్పురో రాజ్ఞ స్సతే దాస్యతి పుష్కలమ్‌ | ధనం గ్రామసహస్రాణి ప్రభాతే పఠతస్తదా. 8

యే విప్రముఖ్యాః కురుజాఙ్గలేషు వ్యాధా స్తథా దాశపురే మృగాశ్చ |

కాలంజరే సప్త చ చక్రవాకా యే మానసే తే వయ మత్ర సిద్ధాః. 9

ఇత్యుక్త్వా పితరం జగ్ము స్తే వనం తపసే పునః | వృద్ధో7పి రాజభవనం జగామాత్మార్థసిద్ధయే. 10

ఇరువదియొకటవ అధ్యాయము.

కౌశిక పుత్త్రులకు బ్రహ్మలోకప్రాప్తి.

ఋషులు సూతునితో నిట్లు పలికిరి: ''భూలోకమునందలి ఇందరిలో ఈ బ్రహ్మదత్తుడు ఒకడు అపురూపముగా ఎట్లు ఆయా ప్రాణుల ధ్వనులను వాటి అర్థములను తెలిపికొనగలవాడయ్యెను? ఈ ఏడు చక్రవాక పక్షులలో ఈ ముగ్గురును కాక మిగిలిన నలుగురును ఎవరి వంశమునందు జన్మించిరి?''

సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను: బ్రహ్మదత్తుడు ఉండెడి ఆ పాంచాల రాజధానీపురమునందే విద్యాచండుడను వృద్ధ బ్రాహ్మణు డుండెను. అతడు తన పేరునకు తగినట్లు సకల విద్యలయందు చాల సమర్థుడగు విద్వాంసుడు. ఆయా విషయములను తెలిసికొనవలెనను జిజ్ఞాసయు కుతూహలమును కలవాడు. చాల దరిద్రుడు. ఆపదలలోను కలతపడని గుండెనిబ్బరము కవలవాడు. విద్యల త త్త్వమును ప్రపంచ త త్త్వమును భగవత్తత్త్వమును ఎరిగినవాడు. ఈ వైరాగ్యము గల నాలుగు చక్రవాక పక్షులును ఆ బ్రాహ్మణునికి కుమారులుగా జన్మించిరి. వీరు పూర్వజన్మ స్మరణము కలిగి ఉండిరి. వారికి నలుగురకును తపస్సు చేసికొనవలెనను సంకల్పము కలిగెను. మేము తప స్సాచంరిచి ఉత్తమసిద్దిని పొందదలచి ఉన్నాము. అని వారు తమ తండ్రితో పలికిరి. ఆ మాట విని మహా తపస్సంపన్నుడగు ఆ విద్యాంసుడు దీనవచనములతో ఇట్లు పలికెను: ''నాయనలారా! ఇది ఏమి? మీకు కలిగిన ఈ సంకల్పము ధర్మానుకూలమయినది కాదు. వృద్ధుడును దరిద్రుడును అగు తండ్రిని వదలిపోవుటచే మీకు లభించు ధర్మము ఏమున్నది? దీనివలన ఏ మానవునకుగాని ఏ సద్గతి లభించును?''

కుమారులు తండ్రితో ఇట్లనిరి! ''నాయనా! నీకు తగిన జీవనవృత్తి (భగవంతునిచే) ఏర్పరుపబడియే యున్నది కదా! మా ఈ వృత్తాంతమును రాజునకు తెలుపుము. అతడు నీకు పుష్కలముగా ఇచ్చును. ఉదయకాలమున వేదాదికమును పఠించునట్లు ఏర్పాటుచేసి రాజు నీకు వేలకొలది గ్రామములను జీవనమునకై ఈయగలడు. మొదట కురుక్షేత్రమునందు సప్త బ్రాహ్మణులుగా తరువాత దశపురమునందు వ్యాధులుగా పిమ్మట కాలంజరపర్వతమున లేళ్లుగా అటుపిమ్మట మానస సరస్సునందు చక్రవాక పక్షులుగా జన్మించిన మేము ఈ జన్మమున ఇట్లు జన్మించి సిద్ధి పొందనున్నాము.''

ఇట్లు తండ్రితో వలికి వారు తమ సంకల్పము ననుసరించి తపస్సు ఆచరించుటకు వనమునకు పోయిరి. వృద్ధ బ్రాహ్మణుడగు విద్యాచండుడును తన కుమారులు చెప్పినట్లు రాజు దగ్గర తన పనిని చూచుకొనుటకు రాజసభకు పోయెను.

అణుహో నామ విభ్రాజః పాఞ్చాలాధిపతిః పురా | పుత్రార్థీ దేవదేవేశం హరిం నారాయణం ప్రభుమ్‌. 11

ఆరాధయామాస విభుం తీవ్రవ్రతపరాయణః | తతః కాలేన మహతా తుష్ట స్తస్య జనార్దనః. 12

వరం వృణీష్య భద్రం తే హృదయే నేప్సితం నృప | ఏవముక్తస్తు దేవేన వవ్రే వర మనుత్తమమ్‌. 13

పుత్త్రం మే దేహి దేవేశ మహాబలపరాక్రమ్‌ | పారగం సర్వశాస్త్రాణాం ధార్మికం యోగినాం వరమ్‌.

సర్వసత్త్వరుతజ్ఞం మే దేహి యోగిన మాత్మజమ్‌ | ఏవ మస్త్వితి విశ్వాత్మా తమాహ పరమేశ్వరః. 15

పశ్యతాం సర్వదేవానాం తత్రైవాన్తరధీయత | తతస్స తస్య పుత్త్రోభూ ద్బ్రహ్మదత్తః ప్రతాపవా&. 16

సర్వసత్త్వానుకమ్పీచ సర్వసత్త్వబలాధికః | సరస్వత్త్వరుతజ్ఞశ్చ సర్వసత్త్వేశ్వరేశ్వరేశ్వరః. 17

బ్రహ్మదత్తసన్నతిసల్లాపః.

అహసద్యేన *యోగాత్మా నపిపీలికరాగతః | యత్ర తత్కీటమిథునం రమమాణ మవస్థితమ్‌. 18

తతస్సా సన్నతి ర్దృష్ట్వా తం హసన్తం సువిస్మితా |

కిమ ప్యాశఙ్క్య మనసా త మపృచ్ఛ న్నరేశ్వరమ్‌. 19

సన్నతిః : అకస్మా దతిహాస స్తే కిమర్థ మభవ న్నృప |

హాస్య హేతుం న జానామి య దకాలే కృతం త్వయా. 20

సూతః : అవద ద్రాజపుత్త్రోపి సపిపీలికభాషితమ్‌ | రాగాదేవ సముత్పన్న మేత ద్ధాస్యం వరాననే. 21

(బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము) : పర్వము విభ్రాజవంశమున పుట్టిన అణుహుడు అను రాజుండెను. అతడు పాంచాల దేశరాజు. అతడు పుత్త్రులను కోరి ప్రభుడును విభుడును దేవదేవులకు కూడ ఈశుడును అగు నారాయణుని తీవ్రవ్రతపరాయణుడై ఆరాధించెను. అట్లు ఆరాధించగా చాల కాలమునకు జనార్దనుడు అతని విషయమున సంతుష్టుడు అయ్యెను. నాయనా! రాజా! నీ హృదయమునందు ఈప్సితమయియున్న వరమును కోరుకొనుము. అని విష్ణువు పలుకగా రాజు మిగుల ఉత్తమమగు వరమును ఇట్లు కోరుకొనెను. ''దేవేశా! నాకు మహా బలపరాక్రముడగు కుమారుని ఇమ్ము. అతడు సర్వశాస్త్రములు తుదముట్ట చదివి వాని త త్త్వ మెరిగినవాడును ధార్మికుడును యోగియు యోగిశ్రేష్ఠుడును సర్వ ప్రాణుల ధ్వనులను వాటి యర్థములను నెరిగినవాడునై యుండవలెను.'' అని కోరగా పరమేశ్వరుడును సర్వ విశ్వరూపుడును సర్వ విశ్వములకు ఆత్మభూతుడును అగు విష్ణువు అట్లే యగుగాక!' అని అణుహునకు వరము నిచ్చి సర్వదేవతలును చూచుచుండ అచ్చటనే అంతర్ధానము పొందెను.

తరువాత అతనికి ప్రతాపవంతుడగు బ్రహ్మదత్తుడు కుమారుడుగా కలిగెను. అతడు సర్వప్రాణులయందు దయ కలవాడు. బలమునందు సర్వప్రాణులలో అధికుడు. అన్ని ప్రాణుల ధ్వనులను వాటి అర్థమును ఎరుగగలవాడు. సర్వప్రాణులకు అధిపతులగు వారికి అధిపతి. అంతేకాక అతడు యోగముతో నంస్కరింపబడిన ఆత్మకలవాడు. అందుచేతనే చీమలజంట రమించుచున్న చోట తానున్నప్పుడు అవి అనురాగ వశమున చేసిన సంభాషణమును విని ఆశ్చర్యపడినవ్యెను.

___________________________________________

*ధర్మాత్మా

అంతట అప్పుడు అచ్చటనేయున్న అతని భార్య సన్నతి అతని నవ్వును చూచి చాల ఆశ్చర్యపడెను. కాని మనస్సులో ఏదో సందేహము కలిగి ఆనరేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: ''రాజా! మీరెందులకు నవ్వితిరి? ఇచట అందులకు తగిన హేతువు ఏమియు కనబడుటలేదు. ఇది నవ్వుటకు తగిన సమయమును కాదు.''

సన్నతిమాటవిని రాజు చీమలదంపతుల సంభాషణ వృత్తాంతమును తెలిపి అనురాగపూర్వకమయిన చీమల సంభాషణము విని నాకు నవ్వు వచ్చినది. ఇంతకంటె ఈ నవ్వునకు వేరుగ కారణము ఏమియు లేదు. నీవు ఇంతగా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అని సన్నతితో పలికెను.

న చాన్య త్కారణం కిఞ్చి ద్ధాస్య హేతో స్సువిస్మితే | న చామన్యత తద్దేవీ పైపీలిక మిదం వచః. 22

అహమే వాపహసితా న జీవిష్యే త్వయా7ధునా | కథం పిపీలికాలాపం మర్త్యో వేత్తి నరేశ్వర. 23

త్వయా7హ మేవ హి కథం హసితా కి మతఃపరమ్‌ | తతో నిరుత్తరో రాజా జిజ్ఞాసు స్త త్పురో హరేః.

బ్రహ్మద త్తస్య ప్రభాతే వృద్ధద్విజదర్శనమ్‌.

ఆస్థాయ నియమం తస్థౌ సప్తరాత్ర మకల్మషః | స్వప్నే ప్రాహ హృషీ కేశః ప్రభాతే పర్యట న్సురి. 52

వృద్ధద్విజో య స్త్వద్వాక్యం సర్వం జ్ఞాస్య త్యశేషతః |

ఇత్యుక్త్వా7న్తర్దధే విష్ణుః ప్రభాతే7థ నృపః పురాత్‌. 26

నిర్గచ్ఛ న్మన్త్రి సహిత స్సభార్యో వృద్ధ మగ్రతః |

తత స్తం వృద్ధ మాయాన్తం స నృప స్సన్దదర్శ హ. 27

బ్రాహ్మణః: యే విప్రముఖ్యాః కురుజాఙ్గలేషు వ్యాధా స్తథా దాశపురే మృగాశ్చ |

కాళఞ్జరే స ప్త చ చక్రవాకా యే మానసే తే వయ మత్ర సిద్ధాః. 28

సూతః: ఇత్యాకర్ణ్య వం స్తాభ్యాం స ప్రపాత శుచా తతః|జాతిస్మరత్వ మగమ త్తౌ చ మన్త్రివరావుభౌ. 29

కామశాస్త్రప్రణతా చ బాభ్రవ్యశ్చ సువాలకః | పఞ్చాలా ఇతి దేశేషు విశ్రుత స్సర్వశాస్త్రవిత్‌. 30

కణ్డరీకో విశుద్ధాత్మా వైద్యశాస్త్ర ప్రవర్తకః | భూత్వా జాతిస్మరౌ శోకా త్పతితా వగ్రత స్తదా. 31

హా వయం* యోగవిభ్రష్టా హా గతాః కర్మబన్ధనాః | ఏవం విలప్య బహుశ స్త్రయ స్తే యోగపారగాః. 32

విస్మయా చ్ఛ్రద్ధమాహాత్మ్య మభినన్ద్య పునః పునః| తతస్తసై#్మ ధనం దత్వా ప్రభూతగ్రామసంయుతమ్‌.

విసృజ్య బ్రాహ్మణం తం చ వృద్ధం దనముదాన్వితమ్‌ |

ఆత్మీయం నృపతిః పుత్త్రం నృపలక్షణసంయుతమ్‌. 34

విష్వ క్సేనాభిధానం తు రాజా రాజ్యే7భ్య షేచయత్‌ | మానసే మిళితా స్సర్వే తత స్తే యోగినాం వరాః.

బ్రహ్మదత్తాదయ స్తస్మి న్పితృభక్త్యా విమత్సరాః | సన్నతి శ్చావద ద్దృష్ట్వా మయైతత్కిల కారితమ్‌. 36

రాజ న్యోగఫలం సర్వం య దేత దభిలష్యతే | తథేతి ప్రాహ రాజా తు పున స్తా మభ్యనన్దయత్‌. 37

త్వత్ప్రసాదాదిదం సర్వం మయైత త్ర్పాప్యతే ఫలమ్‌ |

తత స్తే యోగ మాస్థాయ సర్వ ఏవ మనోమయమ్‌. 38

బ్రహ్మరంధ్రేణ పరమం పద మాపు స్తపోబలాత్‌ | ఏవ మాయు ర్ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ.

ప్రయచ్ఛన్తి సుతా న్రాజ్యం నృణాం ప్రీతాః పి తామహాః |

య ఇదం పితృమాహాత్మ్యం బ్రహ్మదత్తస్య చ ద్విజాః. 40

ద్విజేభ్య శ్ర్శావయే ద్యో వా శృణోత్యథ పఠేత వా | కల్పకోటిశతం సాగ్రం బ్రహ్మలోకే మహీయతే. 41

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే శ్రాద్ధకల్పే పితృమాహా

త్మాత్‌స్వసృపాదీనాం జన్మాన్తరే బ్రహ్మలోక ప్రాప్తి

కథనం నామైకవింశతితమో7ధ్యాయః.

కాని సన్నతి బ్రహ్మదత్తుని మాటను నమ్మలేదు. ఈ నవ్వు చీమల దంపతుల సంభాషణమువలన కలిగిన దను విశ్వాసము ఆమెకు కలుగలేదు. నీవు నా విషయమునందే నవ్వితివి. నాపై అనురాగము లేని నీతో నేను జీవింపను. రాజా! మానవులకు చీమల మాటలను విని అర్థము చేసికొను శ క్తి ఎట్లుండును? ఏ విధముగా ఆలోచించినను నీవు నా విషయముననే నవ్వితివి. ఇంతకంటె మరి ఏమియు కారణములేదు- అని ఆమె రాజుతో పలికెను. ఆ మాటలకు బ్రహ్మదత్తుడు ఏమియు సమాధానము ఈయలేకపోయెను. అతడు ఈ విషయమును విష్ణుదేవుని ముందే (విష్ణుదేవునినుండియే) తెలిసికొన గోరెను. అందులకై అతడు నిష్కల్మషమగు మనస్సుతో ఏడు దినములు నియమమును పూని హరిధ్యానము చేసెను. స్వప్నములో అతనికి విష్ణు దేవుడు సాక్షాత్కరించి ఇట్లు పలికెను: నీవు ప్రభాతకాలమున నగరమున సంచరించుము. అప్పుడు నీకొక వృద్ధ బ్రాహ్మణుడు కనబడును. అతడు నీ వాక్యమును అంతయు తెలిసికొని తగిన సమాధానము ఈయగలడు. ఇట్లు పలికి విష్ణువు అంతర్ధానము నందెను.

తెల్లవారిన తరువాత ఉదయమున రాజగు బ్రహ్మదత్తుడు భార్యయగు సంనతితోను ఇద్ధరు మంత్రులతోను కలిసి పురమునుండి వెలుపలికి పోవుచుండగా అతని ఎదుట వృద్ధ బ్రాహ్మణుడు కనబడెను. అతడును తన వై పునకే వచ్చుట ఆరాజు గమనించెను.

అంతలో బ్రాహ్మణుడు తన రాజుకడకు వచ్చి ఇట్లు పలికెను. ''కురుక్షేత్రమునందు బ్రాహ్మణులుగా మొదటి జన్మమునందు పుట్టిన వారే తరువాత దశపురమున వ్యాధులుగా జన్మించిరి. వారే తరువాత కాలంజర పర్వతమున లేళ్ళుగా జన్మించిరి. పిమ్మట మానస సరస్సునందు చక్రవాక పక్షులుగా జన్మించిరి. ఆమేమే ఇపుడు ఇక్కడ ఇక్కడ యోగసిద్ధిని పొందుచున్నాము.''

ఈ మాటను వినుచునే రాజు పూర్వ జన్మ స్మృతి కలిగి శోకముతో క్రింద పడెను. మంత్రులు ఇద్దరును ఇదే విధముగా పూర్వజన్మ స్మరణము కలిగి క్రింద పడిపోయిరి.

ఈ ఇద్దరిలో సువాలకుడు బాభ్రవ్య గోత్రమున పుట్టినవాడు. 'పంచాలము' అను జనపదములందు (పాంచాలము అని కాదు.) అనేక శాస్త్రములు ఎరిగిన పండితుడుగా ప్రసిద్ధుడు. లోకమున కామశాస్త్రమును లోకమున ప్రవర్తింపజేసినవాడు. నిర్మలచి త్తము కలవాడగు కండరీకుడు అను రెండవ మంత్రి లోకమున వైద్యశాస్త్రమును ప్రవ వర్తింపజేసెను.

ఇట్లు ఈ యోగపారంగతు లగు ముగ్గురును అనేక విధముల విలపించిరి. తాము పూర్వ జన్మమునందు శ్రాద్ధము యొక్క మహిమయే ఇది అని గుర్తించి ఆశ్చర్యపడుచు ఆ మహిమను మాటిమాటికి అభినందించిరి.

అనంతరము వారు ఆ వృద్ధ బ్రాహ్మణునకు సమృద్ధమయి ధనవంతములగు గ్రామములను ధనమును ఇచ్చిరి. ధనముతోను సంతోషముతోను కూడిన వానినిగా చేసి వారా బ్రాహ్మణునికి వీడ్కోలు చెప్పి పంపివేసిరి.

తరువాత రాజగు బ్రహ్మదత్తుడు నమస్త రాజ లక్షణములతో కూడిన తన కుమారుని రాజ్యమునందు అభిషేకించెను. తరువాత ఆ యోగి శ్రేష్ఠులగు బ్రహ్మదత్తాదులు అందరును మత్సరము మొదలగు అవగుణములు లేనివారయి తమకు గల పితృభ క్తిచే గలిగిన ఈ సత్ఫలితమును పొంది అందరును పరస్సరము మానస సరస్సునందు కలిసికొనిరి.

అది ఎట్లు జరిగెను అనిన- వృద్ధ బ్రాహ్మణుని వచనమును విని బ్రహ్మదత్తుడు క్రింద పడగానే అది చూచి రాణియగు సన్నతి-రాజా! ఇది యంతయు ఇట్లు జరుగుటకు నేనే హేతువ నైతిని. ఏఏ కోరికలై నను యోగసిద్ధికి ఫలముగా లభించును-అనెను. ''అది నిజమే.'' అని రాజనెను. ఇందు నీ దోషము లేదు సరేకదా! నీవు నాకు మేలే చేసితివని రాజామెను మెచ్చుకొనెను. నీ అనుగ్రహము వలననే నా కీ మహీఫలము లభించె నని అతడామెతో పలికెను.

తరువాత ఆ బ్రహ్మదత్తుడును అతని మంత్రులగు కండరీక సువాలకులును మనోమయమగు యోగమును పూనిరి. బ్రహ్మరంధ్ర మార్గమున ప్రాణములను వదలిరి. తమ తపోబలమున వారిట్లు పరమపదమును-విష్ణుస్థానమును పొందిరి.

పితృ పితామహ ప్రపితామహాది పితృ దేవతలు మానవులకు ఈ విధముగానే ఆయువును విద్యను ధనమును స్వర్గమును మోక్షమును అన్ని సుఖములను సుతులను రాజ్యమును కూడ ఇత్తురు.

పితృ దేవతా మహిమమును బ్రహ్మదత్తుని చరిత్ర మాహాత్మ్యమును శ్రాద్ధకాలమున బ్రాహ్మణులకు వినిపించినను తాము వినినను చదివినను నూరుకోట్ల కల్పముల కాలము బ్రహ్మలోకమునందు సుఖింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున బ్రహ్మదత్తాదుల

బ్రహ్మలోక ప్రాప్తి అను ఇరువది యొకటవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters