Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వావింశో7ధ్యాయః.

పితృప్రీతికర తీర్థకాలకథనమ్‌.

ఋషయః : 

కస్మి న్కాలే చత చ్ఛ్రద్ధ మనన్తఫలదం భ##వేత్‌ |

కస్మి న్వాసర భాగే తు శ్రాద్ధకృచ్చ సమాచరేత్‌| తీర్థేషు కేషు చ కృతం శ్రాద్ధం బహుఫలం భ##వేత్‌. 1

సూతః: అపరాహ్ణే తు సమ్ప్రాప్తే హ్యభిజి ద్రౌమిణోదయే |

యత్కించిద్ధీయతే తత్ర త దోయ ముదాహృతమ్‌. 2

తీర్థాని యాని శస్తాని పితౄణాం వల్లభాని చ | నామత స్తాని వక్ష్యామి సఙేపేణ ద్విజో త్తమాః. 3

పితృతృప్తికరగ యాదితీర్దకథనమ్‌.

పితృతీర్థం గయా నామ సర్వతీర్థవరం శుభమ్‌ | తత్రాస్తే దేవదేవేశ స్స్వయ మేవ పితామహః. 4

తత్రైషా పితృభి ర్గీతా గాథా భాగ మభీప్సుభిః| ఏష్టవ్యా బహవః పుత్త్ర యద్యేకో7పి గయాం వ్రజేత్‌. 5

యజేత వాశ్వమేధేన నీలం వా వృష ముత్సృజేత్‌ | తథా వారాణసీ పుణ్యా పితౄణాం వల్లభా సదా. 6

తత్రావిముక్తసాన్నిధ్యం భుక్తిము క్తిఫలప్రదమ్‌ | పితౄణాం వల్లభం తద్వ త్పుణ్యం చ విమలేశ్వరమ్‌. 7

పితృతీర్థం ప్రయాగంతు సర్వకామఫలప్రదమ్‌ | వటేశ్వరంతు సుభగం సర్వకామలఫప్రదమ్‌. 8

వటేశ్వరస్తు భగవా న్మాధవేన సమన్వితః | యోగనిద్రశ్రయ స్తద్వ త్సదా వసతి కేశవః. 9

దశాశ్వమేధికం పుణ్యం గఙ్గాద్వారం తథైవచ | నన్దాథ లలితా తద్వ త్తీర్థం మాయాపురం శుభమ్‌. 10

తీర్థం బ్రహ్మసర స్తద్వ చ్ఛతద్రుసలిలే హ్రదః | తీర్థం తు నై మిశం నామ సర్వతీర్థఫలప్రదమ్‌. 11

గఙ్గోద్భేదంతు గోమత్యాం యత్రోద్భూత స్సనాతనః |తథా యజ్ఞవరాహస్తు దేవదేవశ్చ శూలభృత్‌. 12

యత్ర తత్కాఞ్చనం ద్వార మష్టాదశభుజో హరః| నేమిస్తు హరిచక్రస్య శీర్ణా యత్రాభవ త్పురా. 13

తదేవ నైమిశారణ్యం సర్వతీర్థనిషేవితమ్‌ | దేవదేవస్య తత్రాపి వారాహస్య చ దర్శనమ్‌. 14

యః ప్రయాతి స పూతాత్మా నారాయణపదం వ్రజేత్‌ | కృతశౌచం మహారణ్యం సర్వపాపవిషూదనమ్‌.

యత్రాస్తే నరసింహస్తు స్వయమేవ జనార్దనః | తీర్థ మిక్షుమతీ నామ పితౄణాం వల్లభం సదా. 16

సఙ్గమే యత్ర తిష్ఠన్తి గఙ్గాయాః పితర స్సదా |

ఇరువది రెండవ అధ్యాయము

శ్రాద్ధము జరుపదగిన తీర్థ క్షేత్రములును-కాలమును

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి : ''ఏ సమయమునందు-అనగా పగటి ఏ అంశమునందు శ్రాద్ధకర్త శ్రాద్ధము జరిపినచో అనంతమగు ఫలము లభించును? ఏ తీర్థములందుకాని క్షేత్రములందుగాని శ్రాద్ధము జరిపినయెడల బహుఫలము లభించును? తెలుప వేడుచున్నాము.''

సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను : అభిజిన్ముహూర్తము రౌహిణ ముహూర్తము ఉదయించు సమయము అగు అపరాహ్ణ కాలమున జరిపిన శ్రాద్ధము అనంతమగు ఫలమును ఇచ్చును.

పితృదేవతలకు ప్రీతికరములగు తీర్థములను క్షేత్రములను పేర్కొని వాటిని గూర్చి సంక్షేపముగా తెలుపుచున్నాను.

గయా తీర్థము పితృ తీర్థములన్నిటిలో మేలయినది. శుభకరమయినది. అక్కడ దేవదేవులకును ఈశుడు అగు బ్రహ్మస్వయముగా సన్నిహితుడై యుండును. తమ పితృభాగమగు కవ్యమును అనుభవింపగోరు పితృదేవతలు గానము చేసిన గాథ (యొక్క అర్థము) ఈ విధముగా నున్నది: ''పితరులు అనేకులగు పుత్త్రులు కలుగవలెనని కోరుకొనవలెను. ఏలయన వారిలో ఒకడైన గ యకు పోయి పితృ శ్రాద్ధము జరుపునేమో: అశ్వమేధ యాగమునైన జరుపునేమో! నీల వృషభమును విడుచునేమో!'' వారాణసి సదా పితరులకు ప్రియమయినది. దానిని ఎన్నడును పార్వతీ పరమేశ్వరులు విడువనందున దానిని అవిముక్త క్షేత్రము అందురు. వారి నిరంతర సన్నిధి వలన అది భు క్తి ము క్తి ఫలములను శ్రాద్ధకు ర్తకు ఇచ్చును. విమలేశ్వరము ప్రయాగ కటీశ్వరము అను క్షేత్రములును పితరులకు ప్రియములై నవి పుణ్యకరములై నవి సర్వ కామములను తీర్చునవి. వటేశ్వర క్షేత్రమునందు వటేశ్వరుడను శివుడు యోగనిద్రతో శయనించియుండు వేశవునితో కూడి నివసించును. దశాశ్వ మేధము-గంగా ద్వారము (హరిద్వారము) నందా లలితాతీర్థములు మాయాపురము (జగన్నాధపురి) బ్రహ్మసరమను తీర్థము శతద్రు (సట్‌లజ్‌) జలపుమడుగు గంగాగోమతీ సంగమ స్థానము నైమిశము పితృప్రీతికరములు. గంగాగోమతీ సంగమమున శాశ్వతుడగు యజ్ఞవరామ విష్ణుడును శూలధారియగు శివుడును సన్నిహితులైయుందురు. అచట బంగారుద్వారము కలదు. అచటి శివుడు అష్టాదశభుజుడు. విష్ణుచక్రపు నేమి (అంచు) శీర్ణము (శిథిలము) అయిన స్థలమే నైమిశము. ఈ క్షేత్రమునందు యజ్ఞ వరాహ మూర్తిని దర్శించినచో విష్ణులోకమును పొందును. కృతశౌచ మను మహారణ్యము సర్వపాప నాశకము. అచట సాక్షాత్‌ నారాయణుడు నరసింహ రూపమున నున్నాడు. ఇక్షుమతీగంగా సంగమము పితృప్రియమగు తీర్థము. అచట పితృదేవతలు ఎల్లప్పుడును నివసించుచుందురు.

కురుక్షేనత్రం మహాపుణ్యం సర్వతీర్థసమన్వితమ్‌. 17

తథాచ సరయూఃపుణ్యా సర్వదేవనమస్కృతా|ఇరావతీ నదీ తద్వ త్పితృతీర్థాధివాసినీ.18

యమునా దేవికా కాళీ చన్ద్రభాగా దృషద్వతీ | నదీ వేణుమతీ పుణ్యా పారా వేత్రవతీ తథా. 19

పితౄణాం వల్లభా హ్యేతా శ్శ్రద్ధే కోటిగుణా మతాః |

జమ్బూమార్గం మహాపుణ్యం యత్ర మార్గో హి లక్ష్యతే. 20

అద్యాపి పితృతీర్థం త త్సర్వకామఫలప్రదమ్‌ | నీలకుణ్డ మితి ఖ్యాతం పితృతీర్థం ద్విజోత్తమాః. 21

తథా భద్రసరః పుణ్యం సరో మానస మేవ చ | మన్దాకినీ తథా చ్ఛోదా విపాశాథ సరస్వతీ. 22

పూర్వం మిత్రపదం తద్వ ద్వైద్యనాధం మహాఫలమ్‌| శి(క్షి)ప్రానదీ మహాకాలం తథా కాళఞ్జరం శుభమ్‌. 23

వంశోద్భేదం ఫలోద్భేదం గఙ్గోద్భేదం మహాఫలమ్‌ | భద్రాస్పదం విష్ణుపదం నర్మదాద్వార మేవ చ. 24

గయాపిణ్డప్రదానేన సమా న్యాహు ర్మహర్షయః | ఏతాని పితృతీర్థాని సర్వపాపహరాణి చ. 25

స్మరణా దపి లోకానాం కిము శ్రాద్ధకృతాం నృణామ్‌ | ఓఙ్కారం పితృతీర్థం చ కావేరీ కపిలోదకమ్‌. 26

సమ్భేద శ్చణ్డవేగాయా స్తథైవామరకణ్టకమ్‌ | కురుక్షేత్రా చ్ఛతగుణం తస్మిన్త్స్నా నాదికం భ##వేత్‌. 27

శుక్లతీర్థం చ విఖ్యాతం తీర్థం సోమేశ్వరం పరమ్‌ | సర్వవ్యాధిహరం పుణ్యం శతకోటిపలాధికమ్‌. 28

శ్రాద్ధదానే తథా బ్రహ్మ న్త్స్వాద్యాయం జలసన్నిధౌ | కాయావరోహణం నామ తథా చర్మణ్వతీ నదీ. 29

గోమతీ చారుణా తద్వ త్తీర్థ మౌశనసం పరమ్‌ | భైరవం భృగుతుఙ్గం చ గౌరీతీర్థ మనుత్తమమ్‌. 30

తీర్థం వైనాయకం నామ వస్త్రేశ్వర మతః పరమ్‌ | తథా పాపహరం నామ పుణ్యా చ తపతీ నదీ. 31

భూతిదా చ పయోష్టీ చ పయోష్టీసఙ్గమ స్తథా | మహామ్భోధిః పాటలా చ నాగతీర్థమవన్తికా. 32

తథా వేణునదీ పుణ్యా మహాశాలం తథై వచ | మహారుద్రం మహాలిఙ్గం దశార్ణాచ నదీ శుభా. 33

శతరుద్రా శతాహ్వా చ తథా విశ్వపదం పరమ్‌ | అఙ్గారవాహికా తద్వ న్నదౌ తౌ శోణఘర్ఘరౌ. 34

కాళికా చ నదీ నుణ్యా వితస్తాచ నదీ తథా | ఏతాని పితృతీర్థాని శస్యన్తే స్నానదానయోః. 35

శ్రాద్ధ మేతేషు యద్దత్తం తదన న్తఫలప్రదమ్‌ |

కురుక్షేత్రము మహాపుణ్యకరము. ఆచట సర్వతీర్థములు చేరియుండును. సరయూనది పుణ్యకరమయినది. సర్వదేవతలకును అది పూజ్యమయినది ఇరావతీ- యమునా-దేవికా-కాళీ-చంద్రభాగా-దృషద్వతీ-వేణుమతీ-పారా-వేత్రవతీ నదులును పితరులకు ఇష్టములై నవి. ఇచట శ్రాద్ధము జరుపుటచేత కోటిరెట్లు ఫలితము గలుగును.

నేటికిని మమామార్గము కనబడు జంబూ మార్గము నీలకుండము భద్రసరము మానస సరస్సు అచ్ఛోదానది. మందాకిని-విపాశా (బియాస్‌)-సరస్వతీ-మిత్రపదము-వైద్యనాధము-శిప్రా (క్షిప్రా) నది-(ఉజ్జయినిదగ్గర) మహాకాలక్షేత్రము కాలంజరము (పర్వతము) వంశోద్భేదము ఫలోద్భేదము-గంగోద్భేదము- భద్రాస్పదము విష్ణుపదము నర్మదాద్వారము (నర్మదా సాగర సంగమము) ఈ ప్రదేశములందు పితరులకు పిండదానము చేసినచో గయలో పిండదానము చేసినట్లగును. ఈ పితృతీర్తములు స్మరణమాత్రముననే జనుల సర్వపాపముల హరించును. శ్రాద్ధమువలన కలుగు ఫల మింతయని చెప్పనేల? ఓంకారము పితృతీర్థము కావేరీ-కపిలా-చండవేగా నదీ సాగర సంగమము-అమరకంటకము-వీటియందు స్నానము కురుక్షత్ర తీర్థములందు స్నానము కంటెను నూరురెట్లు ఎక్కువ ఫలము నిచ్చును. శుక్లతీర్థ సోమేశ్వర తీర్థములందు శ్రాద్ధము జరిపినను స్వాధ్యాయము చేసినను సర్వవ్యాధులును నశించును. ఇతర క్షేత్రములందు కంటె నూరురెట్లు ఎక్కువ పుణ్యము కలుగును.

కాయావరోహణక్షేత్రము చర్మణ్వతీ గోమతి అరుణ-ఔశనస తీర్థము భైరవము భృగుతుంగము గౌరీతీర్థము వై నాయక తీర్థము వస్త్రేశ్వర తీర్థము పాపహరమను తీర్థము తపతీనది-భూతిదా-పయోష్ణీ-పయోష్ణీ సంగమము మహాంభోధి తీర్థము పాటలాతీర్థము నాగ తీర్థము అవంతికా-వేణునదీ-మహాశాలము-మహారుద్రము-మహాలింగము దశార్ణానది-శతరు ద్రాశతాహ్వానదులు-విశ్వపదము-అంగార వాహికానది-శోణ-ఘర్ఘరము లను నదములు-కాళికా వితస్తానదులు-కాళికా వితస్తానదులు-ఈ పితృ తీర్థములు స్నా నదానములందు ప్రశస్తములు. ఈ తీర్థ క్షేత్రములందు శ్రాద్ధము జరిపినచో అనంతపుణ్యము లభించును.

ద్రోణీ వటనదీ ధారా సరి ద్వీరనదీ తథా. 36

గోకర్ణం గజకర్ణంచ తథాచ పురుషోత్తమమ్‌ | ద్వారంచ కర్ణద్వారంచ కృష్ణతీర్థం సరస్వతీ. 37

నదీ మణిమతీ నామ తథాచ గిరికర్ణికా | ధూతపాపం తథా తీర్థం సముద్రో దక్షిణ స్తథా. 38

ఏతాని పితృతీర్థాని శ్రాద్ధ మానన్త్య మశ్నుతే | తీర్థం మేఖలకం నామ స్వయమేవ జనార్దనః. 39

యత్ర శార్జధరో విష్ణు ర్మేఖలాయా మవస్థితః | తథా మన్దోదరీతీర్థం తీర్థం వంశనదీ తథా. 40

తథా చామరనాధంచ మహీ శాలనదీ తథా | చిత్రకూటంచ మర్కోటం తథా జన్మేశ్వరం మహత్‌. 41

అర్జునం త్రిపురంచైవ సిద్ధేశ్వర మతఃపరమ్‌ | శ్రీశైలం శాంకరం తీర్థం నారసింహ మతః పరమ్‌. 42

మహేన్ద్రంచ తథా పుణ్యం తథా శ్రీశఙ్కుసంజ్ఞితమ్‌ | ఏతేష్వపి దద చ్ఛ్రాద్ధ మనన్తఫల మశ్నుతే. 43

దర్శనాదపి చైతాని సద్యః పాపహరాణి వై | తఙ్గభద్రా నదీ పుణ్యా త్రిసన్ధ్యాతీర్థ ముత్తమమ్‌. 44

ఏత త్తీర్థం మహాపుణ్యం తథా భీమనదీ సరిత్‌ | భీమేశ్వరం కృష్ణవేణీ కావేరీ వఞ్జళా నదీ. 45

నదీ గోదావరీ పుణ్యా త్రిసన్ధ్యాతీర్థ ముత్తమమ్‌ | తీర్థం త్రైయమ్బకం నామ సర్వతీర్థనమస్కృతమ్‌. 46

యత్రాస్తే భగవా నీశ స్స్వయమేవ త్రిలోచనః | శ్రాద్ధ మేతేషు తీర్థేషు దత్తం కోటిగుణం భ##వేత్‌. 47

స్మరణాదపి పాపాని నశ్యన్త్యాశు తథా ద్విజాః | శ్రీపర్ణా చ నదీ పుణ్యా దానతీర్థ మనుత్తమమ్‌. 48

తథా వంశనదీ ధారా శివా ధారా తథైవ చ | భావతీర్థం చ విఖ్యాతం పఞ్చతీర్థంచ శాశ్వతమ్‌. 49

పుణ్యం రామేశ్వరం తద్వ దేలాపుర మలమ్పురమ్‌ | అఙ్గభూతిచ విఖ్యాత మాపాణ్డర మలమ్బుకమ్‌. 50

నామ్నా7నోకేశ్వరం తద్వ దేకామ్రక మతఃపరమ్‌ | గోవర్ధనం హరిశ్చన్ద్రం సరః పుణ్యం పృథూదకమ్‌. 51

సహస్రాక్షం హిరణ్యాక్షం తథాచ కదళీ నదీ | రామచిత్రా7జితాచైవ తథా సౌమిత్రిసఙ్గమమ్‌. 52

ఇన్ధ్రకీలం మహానాదం తథా చ ప్రియమాలకమ్‌ | ఏతాన్యపి సదా శ్రాద్ధప్రశస్తా న్యధికాని తు. 53

ఏతేషు సర్వదేవానాం సాన్నిధ్యం విదితం యతః | దానం చైతేషు సర్వేషు భ##వే త్కోటీప్సితాధికమ్‌. 54

బాహుదా చ నదీ పుణ్యా తథా సిద్ధవనం శుభమ్‌ | తీర్థం పాశుపతం నామ నదీ పర్వతికా తథా. 55

శ్రాద్ధ మేతేషు సర్వేషు దత్తం కోటిశతో త్తరమ్‌ |

ద్రోణీనది-వటనది-ధారానది-వీరనది-గోకర్ణము-గజకర్ణము-పురుషోత్తమక్షేత్రము (జగన్నాధము)-ద్వారము-కర్ణద్వారము-కృష్ణతీర్థము-సరస్వతీ-మణిమతీ గిరికర్ణికానదులు ధూతపాత తీర్థము-దక్షిణ సముద్రము-ఈ పితృతీర్థములందు చేసిన శ్రాద్ధము అనంతమగును. మేఖలకమను తీర్థమునందు సర్వాంతర్యామియు శార్జధరుడునగు జనార్దనుడు స్వయముగా ఎల్లప్పుడు మేఖలయందు సంనిహితుడై యుండును. (మేఖల = పర్వతపు నిలువుటెత్తులో నడుమ భాగము) మండోదరీ తీర్థము వంశనదీ తీర్థము అమరనాధము మహీశాలనది-చిత్రకూటము మర్కోటము జన్మేశ్వరము అర్జునము త్రిపురము సిద్ధేశ్వరము శ్రీశైలము శాంకరతీర్థము నారసింహతీర్థము మహేంద్రము శ్రీశంకుక్షేత్రము-వీటిని దర్శించినను వెంటనే పాపములన్ని యు నశించును. వీటియందు జరుపబడిన శ్రాద్ధము అనంత ఫలమును ఇచ్చును.

తుంగభద్రానది-త్రిసంధ్యాతీర్థము-భీమనదీ-భీమేశ్వరక్షేత్రము-కృష్ణవేణీ-వంజులానది గోదావరి త్ర్యంబక తీర్థము ఇవి ప్రశ స్తములగు పితృప్రీతికర తీర్థములు. త్ర్యంబక తీర్థమునందు ఎల్లప్పుడును త్ర్యంబక శివుడు సంనిహితుడై యుండును. వీటిని స్మరించినను పాపములు వెంటనే నశించును. ఇచట చేసిన శ్రాద్ధము కోటిరెట్లు ఫలమును ఇచ్చును.

శ్రీపర్ణానది-వంశనదీ శివానది-భావతీర్థము-పంచతీర్థము రామేశ్వరము-ఏలాపురము అలంపురము అంగభూతి క్షేత్రము ఆపాణ్డురము-అలంబుకము అనోకేశ్వరము ఏకామ్రక్షేత్రము గోవర్ధనము హరిశ్చంద్రము-పృథూదక సరస్సు-సహస్రాక్షము హిరణ్యాక్షము కదళీనది-రామచిత్ర-అజితానది-సౌమిత్రిసంగమము-ఇంద్రకీలము మహానాదము ప్రియమాలము-ఇవి శ్రాద్ధము జరుపుటకు ప్రశ స్తములు-అధిక ఫలప్రదములు. వీటియందు దేవతలు ఎల్లప్పుడు సంనిహితులయి యందురు. వీటియందు గానము చేసినచో కోరిన కోరికలు కోటిరెట్లుగా ఫలించును.

తథైవ పితృతీర్థంతు యత్ర గోదావరీ నదీ. 56

యుతా లిఙ్గసహస్రేణ సర్వాన్తరజలావహా | జామదగ్న్యస్య తీర్థంతు క్రమా దాయు రనుత్తమమ్‌. 57

ప్రతీకస్య భయా ద్భిన్నా యత్ర గోదావరీ నదీ | త త్తీర్థం హవ్యకవ్యానా మప్సరోయుగసంజ్ఞితమ్‌. 58

శ్రాద్ధాగ్ని కార్యదానేషు తథా కోటిశతాధికమ్‌ | తథా సహస్రలిఙ్గంచ రాఘవేశ్వర ముత్తమ్‌. 59

ఇన్ద్రఫేనా నదే పుణ్యా యత్రేన్ద్రః పతితం పురా | నిహత్య నముచిం శక్ర స్తపసా స్వర్గ మాప్తవా&. 60

తత్ర దత్తం నరై శ్శ్రాద్ధ మనన్తఫలదం భ##వేత్‌ | తీర్థంతు పుష్కరం నామ సాలగ్రామం తథైవచ. 61

శోణపాశశ్చ విఖ్యాతో యత్ర వైశ్వానరాలయమ్‌ | తీర్థం సారస్వతం నామ స్వామితీర్థం తథైవచ. 62

మలందరా నదీ పుణ్యా కౌశికీ చన్ద్రికా తథా | విదర్భాచ తథా వైరా పయోష్టీ ప్రాఙ్ముఖా పురా. 63

కావేరీ చోత్తరా కార్యా తథా జాలన్ధరో గిరిః | ఏతేషు శ్రాద్ధతీర్థేషు శ్రాద్ధ మాన న్త్య మశ్నుతే. 64

లోహదణ్డం తథా తీర్థం చిత్రకూట స్తథైవచ | విన్ధ్య యోగేశ్వరం గఙ్గా తథా నద్యా స్తటం శుభమ్‌. 65

కుబ్జామ్రకంతు తత్తీర్థ మూర్వశీపుళినం తథా | సంసారమోచనం తీర్థం తథైవ ఋణమోచనమ్‌. 66

ఏతేష్వపిచ తీర్థేషు శ్రాద్ధ మానన్త్య మశ్నుతే | అద్రుహాసం తథా తీర్థం గౌతమేశ్వర మేవచ. 67

తథా వసిష్ఠతీర్థం తు హారీతంతు తతఃపరమ్‌ | బ్రహ్మా వర్తం కుశా వర్తం హయతీర్థం తథైవ చ. 68

పిణ్డారకంచ విఖ్యాతం శఙ్ఖాధారం తథైవచ | ఘటేశ్వరం బిల్వకంచ నీలపర్వత మేవచ. 69

సుగ్రీవం దరణీతీర్థం రామతీర్థం తథైవచ | అశ్వతీర్థంచ విఖ్యాత మానన్త్యం శ్రాద్ధదానయోః. 70

తీర్థం వేదశిరో నామ తథైవోద్యవతీ నదీ | తీర్థం చ వసుదం నామ చాగలాణ్డం తథైవచ. 71

ఏషు శ్రాద్ధప్రదాతారః ప్రయాన్తి పరమం పదమ్‌ | తథాచ బదరీతీర్థం గణతీర్థం తథైవచ. 72

జయ న్తం విజయంచైవ శుక్రతీర్థం తథైవచ |శ్రీపతేశ్చ తథా తీర్థం తీర్థం రై వతకం తథా. 73

తథైవ శారదా తీర్థం భద్రకా ళేశ్వరం తథా | వైకుణ్ఠతీర్థంచ పరం భీమేశ్వర మథాపివా. 74

ఏషు శ్రాద్ధప్రదాతారః ప్రయాన్తి పరమాం గతిమ్‌ | తీర్థం మాతృగృహం నామ కరవీరం తథైవచ. 75

జలేశ్వరం చ విఖ్యాతం గౌరీశిఖర మేవచ | లకుటీశస్య తీర్థంతు కర్దమాలం తథైవచ. 76

దణ్డిముణ్డికరం తద్వ త్పుణ్డరీకపురం తథా | సప్తగోదావరం తీర్థం సర్వతీర్థేశ్వరేశ్వరమ్‌. 77

తత్ర శ్రాద్ధం ప్రదాతవ్య మనన్తఫల మీప్సుభిః | ఏష తూద్దేశతః ప్రోక్త స్తీర్థానాం సఙ్గమో మయా. 78

వాగీశోపి న శక్నోతి గదితుం కిము మానవః | సత్యం తీర్థం దయా తీర్థం తీర్థ మిన్ద్రియనిగ్రహమ్‌. 79

వర్ణాశ్రమాణాం గేహేపి తీర్థం సమ ముదాహృతమ్‌ | ఏషు తీర్థేషుయచ్ర్ఛాద్ధం తత్కోటిగుణ మిష్యతే. 80

యస్మా త్తస్మా త్ప్రయత్నేన తీర్థశ్రాద్ధం సమాచరేత్‌ |

గోదావరీ నదీ సమీపమునందలి పితృతీర్థమను తీర్థము చాల ప్రశ స్తమయినది. ఇచ్చట గోదావరి నది అన్ని చోటులందు కంటె చాల లోతుగా ప్రవహించుచు వేయి శివలింగములతో కూడి ఉన్నది. ఈ తీర్థమునకే జామదగ్న్య తీర్థము అని నామాంతరము. ఇది శ్రాద్ధ క ర్తలకు సర్వోత్తమమగు దీర్ఘాయువును ఇచ్చును. ఇచ్చటనే గోదావరీ నది ప్రతీకుడను ఋషివలన భయముచే చీలినది. ఇది దేవతలనుద్దేశించి హవ్యములను ఇచ్చుటకును పితృ దేవతల నుద్దేశించి కవ్యములను ఇచ్చుటకును కూడ ప్రశస్తమయినది. అందుచే దీనికి అప్పరోయుగ తీర్థము అని పేరు. ఇచట శ్రాద్ధములు కాని అగ్ని కార్యములు కాని (యజ్ఞ హోమాదికము కాని) దానములు కాని చేసినచో నూరు కోట్ల రెట్ల పుణ్యము లభించును.

సహస్ర లింగ క్షేత్రమును రాఘవేశ్వర క్షేత్రమును పితృ కార్యములకు ప్రశస్తములు. ఇంద్ర సేనా నది పితృ శ్రాద్ధము విషయమున పుణ్యకరము. పూర్వము నముచి దానవుని చంపినందున పతితుడైన ఇంద్రుడు ఇచట తపస్సాచరించి పుణ్యము సంపాదించి సర్వమును పొంద గలిగెను. ఇచ్చట మానవులు శ్రాద్ధము జరిపినచో అనంత ఫలము కలుగును.

పుష్కర తీర్థము సాల గ్రామ తీర్థము శోణ పాదము వైశ్వానరుడను పేరుగల అగ్ని విశేషమునకు స్థానమగు వైశ్వానరాలయ తీర్థమును దాని సమీపమందలి సారస్వత తీర్థము స్వామి తీర్థము మలందరానదీ కౌశికీనది చంద్రికానది విదర్భానది వై రానది పూర్వము ప్రాఙ్ముఖ ప్రవాహముతో నుండిన పయోష్ణీనది ఉత్తర వాహినిగా నున్న కావేరి జాలంధర పర్వతము - ఈ ప్రదేశము లందు జరిపిన పితృ శ్రాద్ధము అనంత ఫలము నిచ్చును. లోహదండ తీర్థము చిత్రకూటము వింధ్య-యోగేశ్వరము గంగానదీ తటము కుబ్జామ్రకము ఊర్వశీ పులినము సంసారమోచన తీర్థము ఋణమోచన తీర్థము అద్రుహాసము గౌతమేశ్వరము వసిష్ఠ తీర్థము హారీతము బ్రహ్మావ ర్తము కుశావర్తము హయతీర్థము పిండారకము శంకాధారము ఘటేశ్వరము బిల్వకము నీల పర్వతము సుగ్రీవము ధరణీతీర్థము రామతీర్థము అశ్వతీర్థము వేదశిర స్తీర్థము ఉద్యవతీనది వసుదతీర్థము ఛాగలాండము బదరీతీర్థము గణతీర్థము జయంతము విజయము శుక్రతీర్థము శ్రీవతితీర్థము రైవతకతీర్థము శారదాతీర్థము భద్రకాళేశ్వరము వైకుంఠతీర్థము భీమేశ్వరము మాతృగృహతీర్థము కరవీరతీర్థము జలేశ్వరము గౌరీ శిఖరము లకుటీశము కర్దమాలము దండిముండికరము పుండరీకపురము స ప్తగోదావరము - ఇవన్ని యు పితృ శ్రాద్ధమునకు ప్రశస్తములగు తీర్థరాజములు. పేరులు మాత్రమే గ్రహించి (వాటి మహిమములను వి స్తరింపక) కొన్ని కొన్ని పితృ తీర్థములను మీకు తెలిపితిని. అన్నిటిని సంపూర్ణముగా తెలుపుట బ్రహ్మకు కూడ సాధ్యము కాదు.

ముఖ్యముగా-సత్యము దయ ఇంద్రియ నిగ్రహము - ఇవి అత్యుత్తమములగు తీర్థములు. ఇవి కలిగి తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి నడచుకొను వారికి ఇంటియందే పితృ తీర్థస్థానము ఉండును.

ఏమయినను ఈ చెప్పిన తీర్థములందు శ్రాద్దము చేసినచో కోటిరెట్లు పుణ్యము కలుగును. కనుక సర్వ విధముల ప్రయత్నించి తీర్థ శ్రాద్ధమును జరుపవలయును.

శ్రాద్ధకాల నిర్ణయః.

ప్రాతఃకాలే ముహూర్తాం స్త్రీ న్పూర్వాహ్ణే తావదేవతు. 81

మధ్యాహ్న స్త్రిమూహూ ర్త స్స్యా దపరాహ్ణ న్తతఃపరమ్‌ |

సాయాహ్న స్త్రిముహూ ర్తస్స్యా చ్ఛ్రాద్ధం తత్ర న కారయేత్‌. 82

రాక్షసీ నామ సా హోరా గర్హితా సర్వకర్మను | అహ్నో ముహూర్తా విఖ్యాతా దశపఞ్చచ సర్వదా. 83

తత్రాష్టమో ముహూర్తో య స్స కాలః కుతపః స్మృతః|మధ్యా హ్నే సర్వదా యస్మా న్మన్దీభవతి భాస్కరః. 84

తస్మా దన న్తఫలద స్తదారమ్భా ద్భవిష్యతి| మధ్యాహ్నః ఖడ్గపాత్రం తు తథా నేపాలకమ్బళః. 85

దీపో దర్భా స్తిలా గావో దౌహిత్ర శ్చష్టమః స్మృతః | పాపం కుత్సిత మిత్యాహు స్తస్య సన్తాపకారిణః. 86

అష్టా వేతే యత స్తస్మా త్కుతపా ఇతి విశ్రుతాః |

ఊర్ధ్వం ముహూర్తా త్కుతపా ద్య న్ముహూర్తచతుష్టయమ్‌. 87

ముహూర్తపఞ్చకం చైతా స్స్వధాభవన మిష్యతే | విష్ణో ర్ధేహసముద్భూతాః కుశాః కృష్ణా స్తిలా స్తథా. 88

శ్రద్ధస్య లక్షణాయేమే తత్రాహు ర్దివి దేవతాః | తిలోదకాంజలి ర్దేయో జలస్థై స్తీర్థవాసిభిః. 89

సదర్భహస్తే నైకేన శ్రాద్ధ సేచన మిష్యతే | పుణ్యం పవిత్ర మాయుష్యం సర్వపాపవినాశనమ్‌. 90

పురా మత్స్యేన కథితం తీర్థశ్రాద్ధానుకీర్తనమ్‌ |

శృణోతి యః పఠేద్వాపి శ్రీమా న్త్సంజాయతే నరః. 91

శ్రాద్ధకాలేచ క ర్తవ్యం తథా తీర్థనివాసిభిః | సర్వపాపోపశా న్త్యర్థ మలక్ష్మీనాశనంపరమ్‌. 92

ఇదం పవిత్రం యశసాం నిదాన మిదం మహాపాపహరం చ పుంసామ్‌ |

బ్రహ్మార్కరుద్రై రభిపూజితంచ శ్రాద్ధస్య మహాత్మ్య ముశన్తి తద్‌ జ్ఞాః. 93

ఇతి శ్రీమపత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే శ్రాద్ధకల్పే పితృప్రీతికర

తీర్థకాలకథనం నామ ద్వావింశతితమో7ధ్యాయః.

పగటి కాలము మొత్తము పదునైదు ముహూర్తములగును. వరుసగా ప్రాతఃకాలము పూర్వాహ్ణము మధ్యాహ్నము అపరాహ్ణము సాయాహ్నము - ఇవి ఒక్కొక్కటి మూడేసి ముహూర్తములు. సాయాహ్నమునకు రాక్షసీ హోరా అనియు పేరున్నది. ఆ సాయాహన్న కాలమునందు శ్రాద్ధము జరుపరాదు. ఏలయన రాక్షసీహోరా ఏ కర్మములకును పనికిరాదు. వీనిలో ఎనిమిదవ ముహూర్తమునకు కుతప కాలమని శాస్త్రమున పేరు. మధ్యాహ్న కాలమున ఏ సమయము నుండి రవి చల్లదనము పొందునో అప్పటినుండి సాయాహ్న మారంభమగు లోపల శ్రాద్ధము జరిపిన వారికి రవి అనంత ఫలము ఇచ్చును.

ఇదియును కాక - మధ్యాహ్న కాలము ఖడ్గము నుంచు పాత్రము (ఒర) నేపాళ దేశమున నేసిన కంబళము దీపము దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు - ఈ ఎనిమిదింటికిని కుతపము అని పేరు. కుతపము అను శబ్దము నందలి కు - అనగా కుత్సితము - పాపము అని అర్థము. తపము అనగా దానిని తపింప చేయునది.

ఇదియును కాక పగటి ముహూ ర్తములలో ఎనిమిదవది అగు కుతప ముహూర్తమును దాని తరువాత వచ్చు నాలుగు ముహూ ర్తములను-మొత్తము ఈ అయిదు మహూర్తములకు స్వధా భవనములు అని వ్యవహారము.

దర్భలును నల్లని నువ్వులును విష్ణు శరీరము నుండి ఉత్పన్నమయినవి. శ్రాద్ధము శుభ ఫలమును ఈయవలెననినచో శ్రాద్ధమున వీనిని వినియోగించవలయును. అని ద్యులోక నివాసులగు పితృ దేవతుల స్వయముగా చెప్పిరి. కనుక శ్రాద్ధము లందును చేతియందు (ఒక చేతిలోనే)దర్భలు ధరించి తిలోదకమును పితరుల సుద్దేశించి ఈయవలెను.

పూర్వము మత్స్య రూపుడగు నారాయణుడు మనువునకు చెప్పిన శ్రాద్ధాను కీర్తనము పుణ్యకరము - పవిత్రము-ఆయః ప్రదము - సర్వ పాపములను నశింపజేయునది. దీనిని చదివినను వినినను నరుడు శ్రీ మంతుడగును. తీర్థ శ్రాద్ధ సమయమున దీనిని తప్పక చదువుటయో వినుటయో చేయవలెను. దాని వలన అశుభము - నశించును. ఇది పవిత్రమయినది. కీ ర్తికలుగుటకు మూల కారణ మయినది. మహా పాప హరము. ఈ శ్రాద్ధ మాహాత్మ్యము బ్రహ్మార్కరుద్రులు కూడ ఆదరించునది. అని దాని త త్త్వము నెరిగిన వారు చెప్పుచున్నారు.

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్య్సమను సంవాదమున శ్రాద్ధ యోగ్య

దేశ కాలాను కీర్తనము అను ఇరువది రెండవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-1    Chapters