Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుర్వింశో7ధ్యాయః.

బుధోత్పత్తిః.

సూతః: తత స్సంవత్సరస్యాన్తే ద్వాదశాదిత్యసన్నిభః | దివ్యపీతామ్చరధరో దివ్యాభరణభూషణః. 1

తారోదరా ద్వినిష్క్రాన్తః కుమార శ్చంద్రసన్నిభః | సర్వార్థశాస్త్రవి ద్ధీమా న్త్సర్వశాస్త్రప్రవర్తకః. 2

నామ్నా యద్రాజపుత్త్రీయం విశ్రుతం గజవైద్యకమ్‌ |

రాజ్ఞ స్సోమస్య పుత్త్రత్వా త్తస్య పుత్త్రో బుధస్స్మృతః. 3

జాతమాత్ర స్స తేజాంసి సర్వాణ్య వాజయ ద్బలీ | బ్రహ్మాద్యా స్తత్ర చాజగ్ము ర్దేవదేవర్షిభి స్సహ. 4

బృహసృతిగృహే సర్వే జాతకర్మోత్సవోద్యతాః | అపృచ్ఛంస్తే సురా స్తారాం కేన జాతః కుమారకః. 5

తత స్సా లజ్జితా తేషాం న కిఞ్చి దవదత్తదా | పునఃపున స్తదా పృష్టా లజ్జయన్తీ వరాఙ్గనా. 6

సోమ స్యేతి చిరా దాహ తతో7 గృహ్ణా ద్విధు స్సుతమ్‌|బుధ ఇత్యకరో న్నామ ప్రాదా ద్రాజ్యంచ భూతలే. 7

అభిషేకం తతః కృత్వా యువాన మకరో ద్విభః | గ్రహసామ్యం ప్రదాయాథ బ్రహ్మా బ్రహ్మర్షిసంయుతః. 8

పశ్యతాం సర్వలోకానాం తత్రై వాన్తరధీయత | ఇలోదరేతు ధర్మిష్ఠం బుధః పుత్త్ర మజీజనత్‌. 9

పురూరవశ్చరితమ్‌.

అశ్వమేధశతం సాగ్ర మకరో ద్య స్స్వతేజసా | పురూరవా ఇతి ఖ్యాత స్సర్వలోక నమస్కృతః. 10

ఇరువది నాలుగవ అధ్యాయము.

బుధోత్పత్తి-పురూరవో -రజి-యయాతి వృత్తాంతములు.

సూతుడు ఋషులతో ఇంకను ఈ విధముగా చెప్పెను: సంవత్సరము గడచిన తరువాత తారా గర్భము నుండి కుమారుడు జనించెను. అతడు పండ్రెండు మంది ఆదిత్యుల తేజస్సులను పోలిన తేజస్సుతో దీపించుచుండెను. దివ్యమగు పీతాంబరమును ధరించియుండెను. దివ్యములగు ఆభరణములతో ఆలంకరించుకొని యుండెను. రూపమునందు చంద్రుని పోలియుండెను.

అతడు అర్థ శాస్త్రమును సమగ్రముగా ఎరిగిసవాడు. చాల బుద్ధిశాలి. స్వరశాస్త్రములను ప్రవర్తిల్లజేసినవాడు. రాజ పుత్త్రీయము అను పేరున ప్రసిద్ధమయియున్న గజ వైద్యశాస్త్రము ఈ తారా పుత్త్రుడు ప్రవర్తిల్లజేసినదే. సోమునకు (చంద్రునకు) రాజు అనియు పేరుగలదు. చంద్రుని కుమారుడగుటచే ఇతడు రాజపుత్త్రుడు. అతడు ప్రవర్తిల్లజేసిన శాస్త్రము కనుక రాజ పుత్త్రీయము అని దానికి పేరు వచ్చెను. సర్వశాస్త్రముల నెరిగిన పండితుడు కావున బుధుడని అతనికి పేరు ప్రసిద్ధమయ్యెను.

అతడు పుట్టుకతోనే లోకములందలి సకల తేజస్సులను తన తేజస్సుతో జయించువాడును బలశాలియు నయియుండెను ఈతని జనన సమయమున బ్రహ్మదేవుడును దేవతలును దేవ ఋషులును బృహస్పతి గృహమునకు వచ్చిరి. అచ్చట వారందరును పుట్టిన కుమారునకు జాత కర్మమును జరుపుటకు పూనుకొనిరి. ఆ దేవతలందరును ఈ కుమారుడు ఎవరి వలన కలిగినవాడు ? అని తారను అడిగిరి. ఆమె సిగ్గుపడి ఏమియు మాటాడక యూరకుండెను. వారును మరల మరల అదే ప్రశ్నము నడుగసాగిరి. ఆ ఉత్తమాంగన సిగ్గుపడుచు చంద్రుని కుమారుడే అని చాల సేపటి తరువాత సమాధానము ఆచ్చెను. అంతట కుమారుని చంద్రుడు తీసికొనెను. అతడు అతనికి బుధుడు అని నామకరణము చేసెను. భూలోకమునందు రాజ్యమును కూడ ఇచ్చెను. తరువాత అతనిని యువరాజునుగా చేసి అభిషేకము జరిపెను.

తరువాత బ్రహ్మ బ్రహర్షులతో కూడి ఆలోచించి బుధునకు గ్రహత్వమును ఇచ్చి సర్వ లోకములును చూచుచుండ అచ్చటనే అంతర్ధానమునందెను.

బుధునకు లోగడ తెలిపినట్లు ఇలాగర్భమున కుమారుడు కలిగెను. అతడు పురూరవసుడు అను పేర ప్రసిద్ధుడయి సర్వలోక జనుల నమస్కారములను అందుకొను వాడయ్యెను. తన ప్రతాపముతో అతడు సమగ్రముగా నూరు అశ్వమేధ యాగములు చేసెను.

హిమవచ్ఛిఖరే రమ్యే సమారాధ్య జనార్దనమ్‌ | లోకైశ్వర్య మగా ద్రాజా* సప్తద్వీపాధిప స్తథా. 11

కేశిప్రభృతయో దైత్యాః కోటిశో యేన ఘాతితాః | ఊర్వశీ యస్య పత్నీత్వ మగమ ద్రూపమోహితా. 12

స ప్తద్వీపా వసుమతీ సశైలవనకాననా | ధర్మేణ పాలితా తేన సర్వలోకమితైషిణా. 13

చామరగ్రాహిణీ కీర్తి స్సదా చై వాఙ్గవాహికా | విష్ణుప్రసాదా ద్దేవేన్ద్రో దదా వర్ధాసనం పదా. 14

ధర్మార్థకామా న్ధర్మేణ సమమే వాభ్యపాలయత్‌ | ధర్మార్థకామా స్తం ద్రష్టు మాజగ్ముః కౌతుకా త్పురా. 15

జిజ్ఞాసవ స్తచ్చరితం కథం పశ్యతి న స్సమమ్‌ | భక్త్యా చక్రే తత స్తేషా మర్ఘ్యపాద్యాదికం నృపః. 16

ఆససత్రయ మానీయ దివ్యం కనక భూషణమ్‌ | నివేశ్యాథాకరోత్పూజా మీషర్ధర్మే7ధికాం పునః. 17

జగ్మతు స్తేతు కామార్థా వతికోపం నృపం ప్రతి | అర్థ శ్శాప మదా త్తసై#్మలోభా త్త్వం నాశ మేష్యసి. 18

కామో7ప్యాహ తవోన్మాదో భవితా గన్ధమాదనే | కుమారవన మాశ్రిత్య వియోగా (దూ)దుర్వశీభవాత్‌. 19

ధర్మో7ప్యాహ చిరాయు స్త్వం ధార్మికశ్చ భవిష్యసి | సన్తతి స్తవ రాజేంద్ర యావచ్చన్ద్రార్కతారకమ్‌. 20

శతశో వృద్ధి మాయాతు న నాశం భువి యాస్యతి |

ఇత్యుక్త్వా7 న్తర్దధు న్తర్దధు స్సర్వే రాజా రాజ్యం త దా7న్వభూత్‌. 21

ఆ పురూరవుడు మనోహరమగు హిమవత్పర్వత శిఖరమునందు (తపస్సు చేసి) శ్రీ మహావిష్ణుని మెప్పించెను. జనార్దనుని వరప్రభావమున లోకేశ్వరుడయ్యెను. భూలోకమునందలి సప్త ద్వీపములకును అధిపతి అయ్యెను. ఈతడు కేశి మొదలగు కోట్లకొలదిగా రాక్షసులను చంపెను. ఆతని రూపమును చూచి మోహితురాలయి ఊర్వశి అతనికి భార్య అయ్యెను. అతడు సర్వలోకములహితమును కోరి సప్త ద్వీపములతోను పర్వతములతో కాననముల (చిన్న అడవలు లేదా చెట్ల తోపుల) తోను కూడిన భూమిని అంతటిని ధర్మానుసారముగా పాలించెను. కీర్తి అతనికి వింజామరను పట్టి వీచెడి సేవికగా ఒడలు పట్టెడి సేవకురాలుగా అయ్యెను. విష్ణుని అనుగ్రహ ప్రభావమున దేవేంద్రుడు అతనికి తన అర్ధాసనమును ఇచ్చెను. ధర్మము అర్థము కామము అనెడి మూడు పురుషార్దములను ధర్మానుసారము సమభావముతో అతడు పాలించెను. పూర్వము ఒకానొకప్పుడు ధర్మార్థ కామములకు మూవురకు ఈతడు మనలను ముగ్గురను ఎట్లు సమానముగా చూచుచున్నాడో పరీక్షింపవలెనని కుతూహలము కలిగెను. అందుచే వారు అతని నడువడిని తెలిసికొనగోరి ఆ పురూరవుని కడకు వచ్చిరి. రాజపుడు బంగారు తొడుగుతోను అలంకారములతోను కూడిన దివ్యములగు పీఠములను తెప్పించి వారిని వాటిపై కూర్చుండబెట్టెను. భక్తి పూర్వకముగా అర్ఘ్యము పాద్యము మొదలగు వానితో వారిని పూజించెను. వారిని పీఠములపై కూర్చుండబెట్టి పూజించుటలో ఆ రాజు ధర్మమునందు అధికము అగు భక్తిని చూపెను. దానిచే కోపించి అర్థము నీవు లోభము చేత నశింతువు. అని పురూరవుని శపించెను. కామమును గంధమాదన సర్వతమున కుమార వనమునందు ఊర్వశితోడి వియోగము కారణముగా నీకు ఉన్మాదము కలుగును. అని అతనిని శపించెను. ధర్మము అతనితో ఇట్లు పలికెను : ''నీవు దీర్ఘాయువవును ధార్మికుడవును అయ్యెదవు. నీ సంతానమును చంద్రార్క నక్షత్రములు ఉన్నంత వరకును నూరుల కొలదిగా వృద్ధి పొందుచుండును. అది ఎన్నటికిని భూలోకమునందు నశించదు. ఇట్లు పలికి ధర్మార్థకామములు మూడును అంతర్ధానము నందెను. ఆనాటి నుండియు ఆ పురూరవుడు రాజ్యమును ధర్మానుసామముగా అనుభవించెను.

__________________________________________

*సప్తద్వీపానిసప్తధా

అహన్యహని దేవేన్ధ్రం ద్రష్టుం యాతి స రాజరాట్‌ | కదాచి దారుహ్య రథం దక్షి ణామ్బరచారిణమ్‌. 22

సార్ధమర్కేణ సో7పశ్య న్నీ యమానా మథామ్బరే | కేశినా దానవేన్ద్రేన చిత్రలేఖా మథోర్వశీమ్‌. 23

తం వినిర్జిత్య సమరే దధౌ బౌధి స్స్వపాణినా | బుధపుత్త్రేణ వాయవ్య వస్త్రం ముక్త్వా యశోర్థినా. 24

తథా శక్రోపి సమరే యేన వ జీ వినిర్జితః | మిత్రత్వ మగమ ద్దేవై రదా దిన్ద్రాయ చోర్వశీమ్‌. 25

తతః ప్రభృతి మిత్రత్వ మగమ త్పాకశాసనః | సర్వలోకాతిశాయిత్వం బల మూర్జం యశశ్శ్రియమ్‌. 26

ప్రాదా ద్వజ్రీ తు సన్తుష్టో గేయతాం భరతేన చ | సా పురూరవసః ప్రీత్యై గాయన్తీ చరితం మహత్‌. 27

లక్ష్మీస్వయంవరం నామ భరతేన ప్రవర్తితమ్‌ | మేనకా ముర్వశీం రమ్భాం నృత్యతేతి తదా7దిశత్‌. 28

ననర్త సలయం తత్ర లక్ష్మీరూ పేణ చోర్వశీ | సా పురూరవసం దృష్ట్వా నృత్యన్తీ కామపీడితా. 29

విస్మృతా7భినయం సర్వం త త్పురా భరతోదితమ్‌ | శశాప భరతః క్రోధా ద్వియోగా దస్య భూతలే. 30

పఞ్చ పఞ్చాశదబ్దాని లతా సూక్ష్మా భవిష్యసి | పురూరహః పిశాచత్వం తత్రై వానుభవిష్యతి. 31

తత స్త ముర్వశీ గత్వా భర్తార మకరో చ్చిరమ్‌ | శాపా న్తే భరతస్యాథ (ఊ)ఉర్వశీ బుధసూనుతః. 32

అజీజన త్సుతా నష్టౌ నామత స్తా న్ని బోధత | ఆయుర్దృఢాయు రశ్వాయుర్ధనాయుశ్చ ధృతి ర్మతిః. 33

శుచి ర్వీర శ్శతాయుశ్చ సర్వే దివ్యబలౌజనః | ఆయుషో నహుషః పుత్త్రో వృద్ధశర్మా తథైవచ. 34

రజీ రసో విపాప్మాచ వీరాః పఞ్చ మహారథాః | రజేః పుత్త్రశతం జజ్ఞే రాజేయా ఇతి విశ్రుతాః. 35

రాజరాజగు ఆపురూరవుడు ప్రతి దినమునను స్వర్గమునకు పోయి దేవేంద్రుని దర్శించి వచ్చుచుండెడివాడు. అట్లు జరుగుచుండ ఒకనాడు ఆ రాజు దక్షిణాయన గతిలోనున్న సూర్యునితో పాటు దక్షిణపు ఆకాశమున సంచరించుచున్న తన రథమును ఆరోహించి పోవుచు దానవరాజగు కేశియను వాడు ఊర్వశిని చిత్రలేఖను కొని పోవుచుండుట చూచెను. బుధ పుత్త్రుడగు ఆపురూరవసుడు ఇంద్రుని కూడ జయించియుండిన ఆకేశిపై వాయ వ్యాస్త్రమును ప్రయోగించి వానిని జయించెను. ఇట్లతడు యుద్ధమున కేశి రాక్షసుని జయించి వానిని తన హన్తముతో పట్టివేసెను. తరువాత ఆ రాజు ఊర్వశిని ఇంద్రునికి ఒప్పగించెను. ఈ కారణముగా ఆతడు ఇంద్రాది దేవతలతో మైత్రిని సంపాదించెను. ఆనాడు మొదలుకొని దేవేంద్రుడు పురూరవునితో మైత్రిని అంగీకరించుటయే కాక అతని పయి ప్రీతి చెంది అతనికి సర్వ లోకాధికుడుగా నుండునట్లును బలమును సామర్థ్యమును యశస్సును ఐశ్వర్యమును శోభను భరతునిచే గానముచే కీర్తింపబడుటను వరముగా ఇచ్చెను. ఆ ఊర్వశియును నాటి నుండి పురూరవుని పూజ్యచరితమును పాడుచు ప్రీతి కలిగించు చుండెడిది. ఇట్లుండ ఒకనాడు దేవేంద్రుడు ఊర్వశీ మేనకా రంభలను భరతుడు రచించి ప్రవ ర్తిల్ల జేసిన లక్ష్మీ స్వయం వరమను నృత్య రూపకమును నృత్యమున నభినయించవలసినదిగా అజ్ఞాపించెను. అనృత్యాభినయ ప్రసంగములోఊర్వశి లక్ష్మీ రూపము ధరించి లయాను గుణముగా నాట్యము చేయుచుండెను. ఆమె పురూరవసుని చూచుచు నాట్యము చేయుచు కామపీడితురా లయ్యెను. ఈ హేతువుచే నామె తనకు భరతుడు ఉపదేశించి యుండిన అభినయము అంతయు మరచెను. భరతుడును అందులకు కోపించి ఈ రాజుతోడి వియోగమున నీవు భూలోకమున మిగుల సన్నని తీగవై ఉండుమని ఊర్వశిని-భూలోకమునందే ఊర్వశి తీగయై యున్న పరిసరములందే పిశాచమయియుండునని పురూరవసుని శపించెను. వెంటనే ఊర్వశియును శాపానుసారము భూలోకమున శావకాలమంతయు లతగా నుండి చాలకాలమునకు శాపము తీరి ఆ పురూరవసుని తన పతిగా చేసి కొనెను. శాపావసానమున ఆమెకు పురూరవసునివలన ఎనమండ్రు కుమారులు కలిగిరి. వారు ఆయువు దృఢాయువు అశ్వాయువు ధనాయువు ధృతి మతి శుచి శతాయువు అను వారు. వీరందరును వీరులును దివ్యములగు బలమును సామర్థ్యమును కలవారు. వీరిలో ఆయువు అనునతనికి నహుషుడు వృద్ధశర్మ రజి-రసుడు విపాప్మ అను వారు కుమారులైరి. వారు ఐదుగురును మహారథులు అగు వీరులు. వారిలో రజికి నూరుగురు కుమాలరులు కలిగిరి వీరి కందరకును రాజేయులు అని ప్రసిద్ధి.

రజి రారాధయామాన నారాయణ మకల్మషమ్‌ | తపసా తోషితో విష్ణు ర్వరం ప్రాదా న్మహీపతేః. 36

దేవాసురమనుష్యాణా మభూ త్స విజయీ తదా | అథ దైవాసురం యుద్ధ మభూ ద్వర్షశతత్రయమ్‌. 37

ప్రహ్లాదశక్రయో ర్భీమం న కశ్చి ద్విజయీ తయోః| తతో దేవాసురైః పృష్టః ప్రాహ దేవశ్చతుర్ముఖః. 38

అనయో ర్విజయీ క స్స్యా ద్రజి ర్జేతేతి సో7బ్రవీత్‌ | జయాయ ప్రార్థితో రాజా సహాయ స్త్వం భవస్వ నః.

దైత్యైః ప్రాహ యది స్వామీ వో భవామి తతస్త్వలమ్‌ | నాసురైః ప్రతిపన్నం తత్ర్ఫతిపన్నం సురై స్తదా.

స్వామీ భవ త్వ మస్మాకం సఙ్గ్రమే నాశయ ద్విషః | తతో వినాశితా స్సర్వే యే7వధ్యా వజ్రపాణినా. 41

పుత్త్రత్వ మగమ త్తుష్ట స్తస్యేన్ద్రః కర్మణా విభుః | దత్వేన్ద్రాయ తదా రాజ్యం జగామ తపసే రజిః. 42

రజిపుత్రై స్త దాచ్ఛిన్నం బలా దిన్ద్రస్య వైభవమ్‌ | యజ్ఞభాగం తు రాజ్యం చ తతో గుణబలాన్వితైః.

రాజ్యా ద్భ్రష్ట స్తథా శక్రో రజిపుత్త్రైర్నిపీడితః | ప్రాహ వాచస్పతిం దీనః పీడితో7స్మి రజేస్సుతైః. 44

న యజ్ఞభాగో రాజ్యం చ రాజేయానాం బృహస్పతే | రాజ్యలాభాయ మే యత్నం విధత్స్వ ధిషణాధిప. 45

తతో బృహస్పతి శ్శక్ర మకరో ద్బలదర్పితమ్‌ | గ్రహశా న్తి విధానేన పౌష్టికేన చ కర్మణా. 46

స గత్వా మోహయామాస రజిపుత్త్రా న్బృహస్పతిః | యేనాధర్మం సమాస్థాయ వేదబాహ్యం స వేదవిత్‌.

వేదమార్గపరిభ్రష్టాం శ్చకార ధిషణాధిపః | వేదబాహ్యా న్సరిజ్ఞాయ హేతువాదసమన్వితా&. 48

జఘాన శక్రో7థ రణ సర్వా న్ధర్మబహిష్కృతా& |

రజి పాపనాశకుడగు నారాయణుని ఆరాధించెను. అతని తపమునకు మెచ్చి నారాయణుడు ఆ మహీపతికి వరము నిచ్చెను. తత్ప్రభావమున అతడు దేవతలను అసురులను కూడ జయించగలవాడయ్యెను.

ఇట్లుండ గొంత కాలమునకు దేవాసులరుకు యుద్ధము సంభవించెను. అది మూడు నూరుల సంవత్సరములు ప్రవ ర్తిల్లెను. ప్రహ్లాదునకును ఇంద్రునకును జరిగిన ఆయుద్ధములో ఎంతకాలమునకును ఎవరికిని గెలుపు కలుగక యుద్ధము సాగుచునే యుండెను. అపుడు దేవాసురులు ఇరువురును చతుర్ముఖునికడకు పోయి మాలో ఎవరికి గెలుపు కలుగునవి ప్రశ్నించిరి. ఈ ఇరువురిలో ఎవరు జయింతురు అని చెప్పగలను? రజి జయించును. అని బ్రహ్మ పలికెను. దైత్యులు ంజికడకు పోయి నీవు మాకు సహాయుడవు కమ్ము. అని అతనిని ప్రార్థించిరి. జయించిన తరువాత నేను మీకు అధిపతిగా ఉండుటకు అంగీకరించినచో నేను మీకు యుద్దమున సాయము చేయుదునని రజి పలికెను. అది రాక్షసులంగీకరింపలేదు. దేవతలు అందులకు ఒప్పుకొనిరి నీవు యుద్ధమున మా శత్రువుల నశింపజేయుము. తరువాత నీవే మా అధిపతివి కమ్ము-అని దేవత లనిరి. అంతట రజి అంతవరకును వజ్రపాణియగు దేవేంద్రునకును అవధ్యులుగా నుండిన రాక్షసులనందరను నశింపజేసెను. రజి తమకు చేసిన ఈ సాహాయ్యకృత్యమునకు మెచ్చి ఇంద్రుడు తానతనికి కుమారుడుగా ఉండ నంగీకరించెను. అంతట రజియును తన రాజ్యము నంతయు దేవేంద్రున కప్పగించి తాను తపస్సునకు పోయెను.

రజిపుత్త్రులు నూరుమందియు సద్గుణములును బలమును కలవారు. వారు తమ తండ్రి తపోవనమునకు పోయి తరువాత ఇంద్రుని వైభవమును యజ్ఞభాగమును కూడ హరించిరి. ఇట్లు రజిపుత్త్రులచేత విశేషముగా బాధింపబడి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై పోయెను. అతడు తన గురువగు బృహస్పతి దగ్గరకు పోయెను. నేను రజిపుత్త్రులచేత మిగుల పిడింపబడియున్నాను. నాకిపుడు రాజ్యము లేదు. యజ్ఞభాగమును లేదు. అవి రెండును ఇపుడు రజి కుమారులకే చెందియున్నవి. నీవు బుద్ధిమంతులలో ఉ త్తముడవు. నాకు మరల నారాజ్యము లభించుటకై యత్నము చేయ ప్రార్థించు చున్నాను. అని ఇంద్రుడు గురుని ప్రార్థించెను.

బృహస్పతి తన నీతి బలమునను మంత్రబలమునను ఇంద్రుని మరల బలదర్పితునిగా జేసెను. శాస్త్రవిధానము ననుసరించి అతడు గ్రహశాంతిని సౌష్టిక కర్మలను ఆచరించెను. అంతేకాక ఆ బృహస్పతి పోయి తన బుద్ధిబలమున రజిపుత్త్రులను మోహ పెట్టెను. వారి బుద్ధిని మార్చెను. దానిచే వారు వేదబాహ్యమగు అధర్మమును ఆశ్రయించిరి. ఇట్లు పండిత శ్రేష్ఠుడును వేదవేత్తయు అగు బృహస్పతి రాజేయులను వేద మార్గమునుండి పరిభ్రష్టులనుగా చేసెను. వారందరును వేద బాహ్యులుగా హేతువాదపరులుగా ఐరి. ఇది ఎరిగిన దేవేంద్రుడు ధర్మమార్గ బహిష్కృతులగు ఆ రజిపుత్త్రులనందరను చంపెను.

నహుషస్య ప్రవక్ష్యామి పుత్త్రాన్త్సపై#్తవ ధార్మికా&. 49

యతి ర్యయాతి స్సంయాతి రుద్భవః పాఞ్చి రేవచ | సయాతి ర్మేఘసంయాతి స్సపై#్తతే వంశవర్దనాః. 50

యతిః కుమారభావేపి యోగీ వైఖానసో7భవత్‌ | యయాతి రకరో ద్రాజ్యం ధర్మైకశరణస్తదా. 51

శర్మిష్ఠా తస్య భార్య7భూ ద్ధుమితా వృషపర్వణః |భార్గవస్యాత్మజా తద్వ ద్దేవయానీ చ సువ్రతా. 52

యయాతేః పఞ్చ దాయాదా స్తా న్స్రక్ష్యామి నామతః |

దేవయానీ యదుం పుత్త్రం తుర్వసుం చాప్యజీజనత్‌. 53

తథా ద్రుహ్య మనుం పూరుం శర్మిష్ఠా7జనయ త్సుతా& | యదుః పూరుశ్చ భవత ఏషాం వై వంశవర్ధనౌ.

యయాతి ర్నాహుష శ్చాసీ ద్రాజా సత్యపరాక్రమః | పాలయామాస చ మహీ మీజే చ వివిధై ర్మఖైః. 55

అతిభక్త్యా పితౄ నర్చ్య దేవాంశ్చ ప్రయత స్సదా | అథాసృజ త్ర్పజా స్సర్వా యయాతి రపరాజితః.

స శాశ్వతీ న్సమా రాజా ప్రజా ధర్మేణ పాలయ&|జరా మార్ఛ న్మహాఘోరాం నాహుషో రూపనాశినీమ్‌. 57

జరాభిభూతః పుత్త్రా న్త్స రాజా వచన మబ్రవీత్‌ | యదుం పూరుం తుర్వసుం చ ద్రుహ్యం చానుంచ పార్థివః.

¸°వనేన చ వః కామా న్యువా యువతిభి స్సహ |విహర్తు మహ మిచ్ఛామి సాహ్యం కురుత పుత్త్రకాః 59

తం పుత్త్రో దేవయానేయః పూర్వజో యదు రబ్రవీత్‌ | కిం సాహ్యం భవతః కార్య మస్మాభి ర్యౌవనేన తు.

యయాతి రబ్రవీ త్పుత్త్రా న్జరా మే ప్రతిగృహ్యతా మ్‌ః¸°వనేన త్వదీయేన చరేయం విషయా నహమ్‌. 61

యజతో దీర్ఘసత్రై ర్మే శాపా చ్చోశనసో మునేః | కామార్థీ పరిణామోద్య తప్తోహం తేన పుత్త్రకాః. 62

తాం స్వకేన శరీరేణ జరా మేకః ప్రశాస్తు వః|అహం తన్వా7భినవయా యువా కామా నవాప్ను యామ్‌. 63

న తే తస్య ప్రతీత్యగృహ్ణ న్యదుప్రభృతయో జరామ్‌ | చత్వార స్తా న్త్స రాజర్షి రశపచ్చేతి నశ్ర్శుతమ్‌. 64

తమబ్రవీ త్తతః పూరుః కనీయా న్త్సత్యవిక్రమః | రాజ న్గృహీత్వా7భినవం ¸°వనం త్వం సుకీ చర. 65

అహం జరాం తవాదాయ రాజ్యే స్థాస్యామి తే77జ్ఞయా | ఏవ ముక్త స్స రాజర్షి స్తపోవీర్యసమాశ్రయాత్‌.

సఞ్చారయామాస జరాం తదా పుత్త్రే మహాత్మని | పౌరవేణాథ వయసా రాజా ¸°వన మాస్థితః. 67

యాయాతేన ప్రవయసా రాజ్యం పూరు రకారయత్‌ | తతో వర్షసహస్రాన్తే యయాతి రపరాజితః. 68

అతృప్త ఇవ కామానాం పూరుం పుత్త్ర మువాచ హ | త్వయా దాయాదవానస్మి త్వం మేవంశకర స్సుతః.

పౌరవో వంశ ఇత్యేష ఖ్యాతిం లోకే గమిష్యతి | తత స్స నృపశార్దూలః పూరుం రాజ్యే7భిషిచ్య చ. 70

కాలేన మహతా పశ్చా త్కాలధర్మ ముపేయివా& | పూరువంశం ప్రవక్ష్యామి శృణుధ్వ మృషిసత్తమాః.

యత్ర తే భారతా జాతా బరతాన్వయవర్ధనాః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే

బుధాద్యుత్పత్తికథనం నామ చతుర్వింశో7ధ్యాయః.

ఇక నహుషుని కుమారులను పేరుకొందును. వారు యతి యయాతి సంయాతి ఉద్భవుడు పాంచి సయాతి మేఘసంయాతి అను వారేడుమంది. వీరు ధార్మికులును వంశవృద్ధికరులును. యతి అనునాతడు చిన్న తనమునందే యోగియై వానప్రస్థుడయ్యెను. యయాతి ధర్మమునకు తాను ఆశ్రయమై ధర్మమును తానాశ్రయించి రాజ్యమును పాలించెను. వృషపర్వుడను దానవరాజు కుమా ర్తెయగు శర్మిష్ఠము శుక్రుని కూతురగు దేవయానియు ఆతని భార్యలు. యయాతికి దేవ యానివలన యదువు తుర్వసుడు అనువారును శర్మిష్ఠవలన ద్రుహ్యుడు అనువు పూరుడు అనువారును మొత్తము ఐదుమంది కుమారులు కలిగిరి. వీరై దుమందిలోను యదువు పూరుడు అనువారు ఇద్దరును వంశవృద్ధికరు లయిరి.

సహుషపుత్త్రుడగు ఈ యయాతి రాజుగా సత్యపరాక్రముడై (ధర్మము మొదలగు సత్ర్పవృత్తులయందు పూనిక కలిగి) భూమిని పాలించెను. వివిధములగు యజ్ఞములతో దేవతల నారాధించెను. అతిభ క్తితో ప్రయతుడయి (శరీరమునందును చి త్తమునను శుచియై) పితలరును దేవతలను కూడ అర్చించెను. అటువలెనే ప్రజలను అందరను శత్రువులవలన ఓటమి నెరుగని ఆయయాతి దృఢ బుద్ధితో పాలించెను.

ఇట్లు ఆ యయాతి ధర్మానుసారము ప్రజలను పాలించుచుండ మహాఘోరమును సౌందర్యమును దేహదార్ఢ్యమును నశింపజేయునదియు నగు వార్ధకము ఆతనిని ఆవేశించెను. ముసలితనము తను క్రమ్ముకొనగా నాతడు తన కుమారులగు యదుపూరుతుర్వసు ద్రుహ్య్వనువులను పిలిచి ఇట్లు పలికెను. ''¸°వనముతో మీరు అనుభవించు కామ సుఖముల ననుభవింపవలెనను కోరికతో నున్నాను. కుమారులారా! నాకు ఈ విషయమున సాహాయ్యము చేయుడ.'' అనగా దేవయానీ జ్యేష్ఠ కుమారుడగు యదువు-¸°వనముతో మేము వీకు చేదదగిన సాహాయ్యము ఏమి?-అని ప్రశ్నించెను. యయాతి కుమారులతో ఇట్లు పలికెను. ''నావార్ధకమును మీరు తీసికొనవలయును. మీ ¸°వనముతో నేను విషయ సుఖములను అనుభవింతును. నేనింతవరకును దీర్ఘ సత్రయాగముల (దీర్ఘ కాలము దీక్ష వహించి ఆచరిచవలసిన సత్రయాగములు) అనేకములు ఆచరించుచుండుటతోను శుక్రమహాముని ఇచ్చిన శాపముతోను ఈ వయఃపరిణామము (ముసలితనము) కలిగినది. ఐనను అది ఇంకను కామ సుఖములను కోరుచున్నది. నాయనా! నేను ఈ హేతువుచే తపంచిపోవుచున్నాను. కనుక మీలో నెవరైన ఒకరు ఈ నావార్దకమును తన శరీరముతో గ్రహించి స్వాధీనపరచుకొనవలెను. నేను సరిక్రొత్త శరీరమును పొంది దానితో పడుచువాడనై కామములను అనుభవింతును.''

కాని యదువు మొదలగు కుమారులెవ్వరును తమ తండ్రియగు యయాతి యొక్క వార్ధకమును స్వీకరించలేదు. ఆ హేతువుచే ఆ రాజర్షి యుదుతుర్వసు ద్రుహ్వ్యనువులు అను నలుగురను శపించెను. అని పరంపరలో వినబడుచున్నవి.

కాని వారిలో ఐదవ వాడగు పూరుడు సత్యవిక్రముడు (ధర్మ ప్రధానమగు ప్రవృత్తికి సత్యమని పేరు. దానియుందు తన శ క్తిని ప్రయోగించి ప్రవ ర్తిల్లు వాడు సత్యవిక్రముడు.) కావున అంతట తన తండ్రితో ''తండ్రీ! నా అభినవ ¸°వనమును నీవు తీసికొని సుఖములను అనుభవించుము. నీ ఆజ్ఞానుసారముగా నీవార్ధకమును గ్రహించి నీ అనుమతితో రాజ పదమునందు నిలిచియుందును. (రాజ్యమును పాలించుచుందును.) అనెను.

పూరుడు ఇట్లు చెప్పగానే రాజర్షియగు యయాతి తన తపస్సామర్థ్య బలమును ఆధారముగా చేసికొని తన దేహమునందలి ముసలితనమును మహాత్ముడు (ఉన్న తమగు మనస్సు కలవాడు) అగు పూరుని శరీరమునందు వ్యాపింపజేసెను. పూరుని వయస్సును తాను గ్రహించి ¸°వనమును పొందెను. యయాతినుండి గ్రహించిన వార్ధకముతో పూరుడు రాజ్యమును పాలించెను.

ఇట్లు వేలకొలది సంవత్సరముల గడచెను. మహా వరాక్రమ శాలియగు యయాతి కామ సుఖముల విషయమున తృప్తి పొందలేదేమో! అనునట్లే యుండి తన కుమారుడగు పూరునితో ఇట్లు పలికెను. ''నేను నీ మూలముననే పుత్త్రులు కలవాడ నయితిని. నా వంశమును నాలుపు కుమారుడవు నీవే. ఈ వంశమునకు లోకమున పౌరవవంశము అను ఖ్యాతి కలుగును.''

ఇట్లు పలికి ఆ రాజశ్రేష్ఠుడు పూరుని రాజ్యమున అభి షేకించెను. చాలకాలము జీవించి అతడు-యయాతి-కాల ధర్మము నందెను.

మునిశ్రేష్ఠులారా! ఇకమీదట పూరు వంశమును మీకు వివరించి తెలుపుదును. వినుడు. భరత వంశమును వృద్ధి చేయు భారతులు అనబడు పాండవ కౌరవులు ఆవంశమునందే కదా జన్మించిరి!

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున చంద్రవంశాను వర్ణనమున బుధోత్పతి మొదలగు వృత్తాంతములు అను ఇరువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters