Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచవింశ తితమో7ధ్యాయః.

యయాతిచరితే కచవృత్తాంత కథనమ్‌.

ఋషయః. 

కిమర్థం పౌరవో వంశ శ్ర్శేష్ఠత్వం ప్రాప భూతలె | జ్యేష్ఠస్యాపి యదో ర్వంశః కిమర్థం హీయతే శ్రియా. 1

అన్య ద్యయాతే శ్చరితం సూత విస్తరతో వద | యస్మాత్తత్పుణ్య మాయుష్య మభినన్ద్యం సురై రపి. 2

సూతః: ఏతదేవ పురా పృష్ట శ్శతానీకేన శౌనకః|పుణ్యం పవిత్ర మాయుష్యం యయాతిచరితం మహత్‌. 3

శతానీకః: యయాతిః పూర్వకో7స్మాక మష్టమోయః ప్రజాపతేః|

కథం స శుక్రతనయాం లేభే పరమరూపిణీమ్‌. 4

ఏత దిచ్ఛా మ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన| ఆను పూర్వ్యాచ్చ మే శంస పూరో ర్వంశధరా న్నృపాన్‌. 5

శౌనకః: యయాతి రాసీ ద్రాజర్షి ర్దేవరాజసమద్యుతిః | తం శుక్కవృషపర్వాణౌ వవ్రాతే వై యథా పురా. 6

త త్తేహం సమ్ర్పక్ష్యామి పృచ్ఛతో రాజస త్తమ | దేవయాన్యాశ్చ సంయోగం యయాతే ర్నా హుషస్య చ. 7

సురాణా మసురాణాం చ సమజాయత వై మిథః | ఐశ్వర్యా దథ సంఘర్ష సై#్త్రలోక్యే సచరాచరే. 8

జిగీషయా తతో దేవాః ప్రవరాజ్గిరసం మునిమ్‌| సౌరోహిత్యేచ యజ్ఞారే కావ్యం తూశనసం పరే. 9

బ్రాహ్మణౌ తావుభౌ నిత్య మన్యోన్యప్పర్ధినౌ భృశమ్‌ | తత్ర దేవా నిజఘ్ను ర్యా న్దానవా న్యుధి సఙ్గతా&. 10

తా న్పువ ర్జీవయామాస కావ్యో విద్యాబలాశ్రయాత్‌ | తతస్తే పున రుత్థాయ యోధయాఙ్చక్రిరే సురా&. 11

అసురాస్తు నిజఘ్ను ర్యా న్త్సురా న్త్సమర మూర్ధని | న తా న్త్సఞ్జీవయామాస బృహస్పతి రుదారధీః. 12

న వివేద స తాం విద్యాం యాం కావ్యో వేద వీర్యవా& | సఞ్జీవినీం తతో దేవా విషాద మగమ స్పరమ్‌. 13

దేవప్రార్థనయా కచకృత శుక్రసమీపగమనమ్‌.

అథ దేవా భయోద్విగ్నాః కావ్యా దుశనస స్తతః| ఊచుః కర ముపాగయ్య జ్యేష్ఠం పుత్త్రం బృహస్పతేః. 14

భజమానా న్భజస్వాస్మా న్కురు సాహాయ్య ముత్తమమ్‌| యా7సౌ విద్యా నివసతి బ్రాహ్మణ7మితతేజపి. 15

శుక్రే తా మాహర క్షిప్రం భాగభాఙ్నో భవిష్యసి| వృషపర్వణ స్సమీ పే తు శక్యో ద్రష్టుం త్వయా ద్విజః. 16

ర క్షేత్ప దానవాం స్తత్ర న చ రక్షత్యదానవా& | త మారాధయితుం శక్తో నాన్యః పూర్వతమో మునే. 17

దేవయానీం చ దయితాం సుతాం తస్య మహాత్మనః|తా మారాధయితుం శక్తో నాన్యః కశ్చి దృతే త్వయా. 18

శీలమాధుర్యదాక్షిణ్యౖ రాచారేణ దమేన చ| దేవయాన్యాం చ తుష్టాయాం విద్యాం సమ్ర్పాప్స్యసి ధ్రువమ్‌. 19

ఇరువది ఐదవ అధ్యాయము

యయాతి చరితమున కచ వృత్తాంత కథనము

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి. పూరుడు యయాతి కుమారులలో చిన్న వాడే యైనను అతని వంశము లోకమున శ్రేష్ఠమయినదిగా ఏల ప్రసిద్ధమయ్యెను? యదువు జ్యేష్ఠుడే యైనను అతని వంశము ఏల శోభలో తక్కువది అయ్యెను? కారణము తెలుపుడు. అంతే కాక యయాతి చరితమును కూడ ఇంకను వి స్తరించి తెలుపుడు. అది పూణ్యకరమును ఆయుర్వృద్ధికరమును దేవతలు కూడ అభినందించునదియును.

సూతుడు ఈ విధముగా చెప్పెడు. ''ఋషులారా! మీరు అన్నట్లు ఈ యయాతి చరిత్రము పుణ్యకరమును పవిత్రమును ఆయుర్వృద్ధి కరమును చాల గొప్పదియును. పూర్వము శతానీకుడు (జనమేజయుని కుమారుడు) అడుగగా శౌనకుడు దీనిని అతనికి చెప్పెను.

ఎట్లన- ప్రజాపతినుండి ఎనిమిదవ తరమునకు చెందినవాడును మా పూర్వ పురుషుడును అగు యయాతి మిగుల సౌందర్యవతియు శుక్రుని కూతురును అగు దేవ యానిని ఎట్లు వివాహ మాడెను? తపోధనా? ఇదియంతయు సవి స్తరముగా వినవలెనని నాకు కుతూహలముగా ఉన్నది. యయాతి మొదలుకొని ఆనుపూర్వితో పూరుని వంశమును నిలిపిన రాజుల నందరను నాకు వివరింపుడు. అని శతానీకుడు శౌనకుని అడిగెను.

శౌనకుడు ఇట్లు చెప్పనారంభించెను: యయాతి రాజర్షి. దేవేంద్రునితో సమానముగా ప్రకాశించిన రాజు. శుక్రుడును వృషపర్వుడును ఆతనిని తమ అల్లునిగా చేసికొనిరి ఆ విధమును నీకు తెలిపెదను. రాక్షసగురుడగు శుక్రుని కూతురు దేవయాని. మానవలోకాధిపతియగు సహుషుని కుమారుడు యయాతి. వీరికిద్దరకును దంపతులుగా కలయిక ఎట్లు జరిగెను? అని నీవడిగితివి. రాజసత్తమా! మొదట నీకు అది తెలిపెదను.

చరాచరాత్మకమగు మూడు లోకముకు మేమే అధిపతులము. అను భావముతో ఈ విషయమున దేవతలకును అసురులకును పరస్సరము స్పర్ధ (పోటీ) ఏర్పడెను. వారు ఒక పక్షము వారు మరొక పక్షమువారిని జయించవలెనను తలంపుతో అంగిరసుని కుమారుడగు బృహస్పతిని దేవతలును కవి వంశీయుడగు ఉశనసుని (శుక్రుని) రాక్షసులును తాము జరిపెడి యజ్ఞములందు పురోమితులుగా నుండునట్లు ఏర్పరచుకొనిరి. ఆ బ్రహ్మణులు ఇరువురును ఒకరిపై ఒకరు పోటీ పడుచుండిరి. యుద్ధములందు దేవతల చేతిలో మరణించిన దానవులను శుక్రుడు తన విద్యాబలము నాశ్ర యించి పునర్జీవితులనుగా జేయుచుండెను. వారును మరల జీవించి లేచి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. బృహస్పతియు ఉదారమగు బుద్ధి కలవాడే కాని తపోవిద్యావీర్యము కల శుక్రునకు తెలిసిన సంజీవనీవిద్య బృహస్పతికి తెలియకపోవుటచే రాక్షసులచేతిలో మరణించిన దేవతలను తిరిగి బ్రదికింపలేకుండెను అందుచే దేవతలు మిగుల విషాదమును పొందుచుండిరి. వారు కావ్యుడగు ఉశనసునకు (శుక్రునకు) మిగుల భయపడుచు బృహస్పతిజ్యేష్ఠపుత్త్రుడగు కచునికడకు వచ్చి ఇట్లు పలికిరి: అయ్యా! మేము మిమ్ముల ఆశ్ర యించుచున్నాము. మాకు మీరు రక్షణమీయవలెను. మాకు మీరొక సహాయము చేయవలెను. అమిత తేజోవంతు డగు శుక్రునియొద్ద నున్న సంజీవనీ విద్యను శీఘ్రముగా సంపాదించి తెచ్చి మా కుపకారము చేయుడు. మేము నీకు మాతోపాటు యజ్ఞ భాగమును అంగీకరింతుము. నీ వా బ్రాహ్మణుని రాక్షస రాజగు వృషపర్వుని యొద్ద దర్శింపవచ్చును. అతడచ్చట నుండి రాక్షసులను రక్షించుచు రాక్షసుల కాని వారికి రక్షణ కలుగనీయ కున్నాడు. ఇంతకుముందు ఎవ్వరును అతనిని మొప్పించగలవారు లేకుండరి. ఆ మహాత్మునకు దేవయానియను ప్రియపుత్త్రి కలదు. నీవు తప్ప ఆమెను ఆరాధించి మెప్పించగల వారు ఇంకెవ్వరును లేరు. నీ శీలము తీయని నడువడి ప్రీతిభావము ఆచారము ఇంద్రియనిగ్రహము వీటితో నీవామెను ఆరాధించి సంతుష్టురాలనుగా చేయుము. ఆమె సంతుష్టురాలయినచో నీవు నిశ్చయముగా ఆ విద్యను సంపాదింపగలవు.''

తథేత్యుక్తః కచః ప్రాయా ద్బృహస్పతిసుత స్తదా | తదాభిపూజితో దేవై స్సమీపం వృషపర్వణః. 20

స గత్వా త్వరితో రాజ న్దేవై స్సమ్పూజితః కచః | అసురేన్ద్రపురే శుక్రం దృష్ట్వా వాక్య మువాచ హ. 21

కచః: ఋషే రఙ్గిరసః పౌత్త్రం పుత్త్రం సాక్షా ద్బృహస్పతేః |

నామ్నా కచ ఇతి ఖ్యాతం శిష్యం గృహ్ణాతు మాం భవాన్‌. 22

బ్రహ్మచర్యం చరిష్యామి తతో7హం పరమం గురౌ| అనుమన్యస్వ మాం బ్రహ్మ న్త్సహస్రపరివత్సరాన్‌. 23

శుక్రః: కచ! సుస్వాగతం తే7స్తు ప్రతిగృహ్ణామి తే వచః |

అర్చయిష్యే7హ మర్చ్యం త్వా మర్చితో7స్తు బృహస్పతిః. 24

కచకృతశుక్రశుశ్రూషా.

శౌనకః: కచస్తు తం తథేత్యుక్త్వా ప్రతిజగ్రహ తద్ర్వతమ్‌|ఆదిష్టం కవిపుత్త్రేణ శుక్రేణోశనసా స్వయమ్‌. 25

వ్రతస్య వ్రతకాలం స యథో క్తం వై గృహీతవా& | ఆరాధయ న్ను పాధ్యాయం దేవయానీం చ భారత. 26

నిత్య మారాధయిష్యం స్తాం యువా ¸°వనగోచరామ్‌ |

గాయ న్నృత్యైశ్చ వాద్యైశ్చ దేవయానీ మతోషయత్‌. 27

సంశీలయ న్దేవయానీం కన్యాం సమ్ర్పాప్త¸°వనామ్‌|పుషై#్పః ఫలైః ప్రేషణౖశ్చ తోషయామాస భారత. 28

దేవయాన్యపి తం విప్రం నియమవ్రతధారిణమ్‌|లలనా7దేహసంస్కారం రహః ప్రీత్యా7వద త్తదా. 29

పఞ్చవర్షశతా న్యేవం కచస్య చరతో వ్రతమ్‌ | తత్ర తీవ్రవ్రతం బుద్ధ్వా దానవా స్తం తదా కచమ్‌. 30

గా రక్షన్తం వనే దృష్ట్వా రహ స్యేక మమర్షితాః | జఘ్నుర్బృహసృతే ర్ద్వేష్యా విద్యా రక్షార్థమేవచ. 31

హత్వా సాలావృ కేభ్యశ్చ ప్రాయచ్ఛం స్తిలశః కృతమ్‌ | తతో గావో నివృత్తా స్తా అగోపా స్స్వం నివేశనమ్‌.

తా దృష్ట్వా రహితా గాస్తు కచే నాభాగతా వనాత్‌ | ఉవాచ వచనం కాలే దేవయా న్యథ భార్గవమ్‌. 33

దేవయానీ: హుతం చైవాగ్నిహోత్రం తే సూర్య శ్చాస్తఙ్గతః ప్రభో |

అగోపా శ్చాగతా గావః కచశ్చై వ న దృశ్యతే. 34

వ్యక్తం హతో మృతో వాపి కచ స్తాత భవిష్యతి| తం వినా న చ జీవామి వచ స్సత్యం బ్రవీమి తే. 35

శుక్రః: అయ మేహీతిశబ్దో7యం మృతం సఞివయామి తమ్‌ |

తత స్సఞ్జీవినీం విద్యాం ప్రయుఙ్త్క్వా కచ మాహ్వయత్‌. 36

ఆహూతః: ప్రాదురభవ త్కచో దృష్ట స్స విద్యయా |

బృహస్పతి కుమారుడగు కచుడు దేవతల ప్రార్థన నంగీకరించి దేవతలు తను అభిపూజించుచుండ బయలు దేరి వృషపర్వునిరాజధానికి పోయి అచట శుక్రుని దర్శించి ఇట్లు పలికెను: ''నేను అంగిరసుని మనుమడను-బృహస్పతి కుమారుడను. కచుడనువాడను. తాము నన్ను తమ శిష్యునిగా గ్రహింపవలెను. గురుకులమున వేయి సంవత్సరములైనను బ్రహ్మచర్య వ్రతమును ఆచరింపగలను. అందులకు నన్ననుమతించుడు.'' అనగా శుక్రుడును కచునకు ఆదరముతో స్వాగతము పలికి నాయనా! నీ కోరిక నంగీకరించుచున్నాను. నీవు అర్చనీయుడవు. కావున నిన్నర్చింతును. నిన్నర్చించినచో బృహస్పతిని అర్చించినట్లే. అనెను. కచుడును కవిమునిపుత్త్రుడగు ఉశనసుడు (శుక్రుడు) స్వయముగా ఆదేశించిన బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించెను. వ్రతకాలమంతయును గురువు చెప్పినట్లు పాటించుచు తన ఉపాధ్యాయుని దేయానిని కూడ ఆరాధించుచుండెను.

కచుడు తానును యువకుడు. దేవయానియు ¸°వనమందుండెను. అందుచే ఆమెను మెప్పింపగోరి అతడు నిరంతరమును గానము చేయుట నృత్యము చేయుట వాద్యములు మ్రోయించుట-ద్వారమున ఆమెను సంతోష పెట్టుచుండెను. ఆమె మనస్సును అనుసరించి నడుచుకొనుచు ఆమెకు ఇష్టములగు పూవులు పండ్లు తెచ్చి ఇచ్చుచు ఆమె చెప్పిన పనులు చేయుచుండెను. ఆ విప్రుడు కచుడు ఇట్లు గురుకుల నియమములను అనుష్ఠించుచు తన దేహ సంస్కారమును కూడ మరచియుండెను. ఇట్టి కచునిపై ప్రీతి కలిగి దేవయాని అపుడపుడు ఏకాంతమున అతనితో మాటలాడుచుండెడిది.

ఇట్లు ఐదువందల సంవత్సరములు గడచెను. ఈ విషయమును రాక్షసులు తెలిసికొనిరి. అత డేదో సంకల్పముతో ఇట్లు తీవ్రమగు బ్రహ్మచర్య వ్రతమును పాటించుచున్నాడని వారు గు ర్తించిరి. వారు బృహస్పతిపై పగ తీర్చుకోవలెననియు సంజీవని విద్య రక్షించుకొనవలెననియు సంకల్పించుకొనిరి. ఒక నాడు ఆక చుడు ఒంటిగా అడవిలో గోవులను కాచుచుండుట చూచి వారు అతనిని చంపిరి. నువ్వు గింజలంత ముక్కలు చేసిరి. వాటిని సాలావృకములను మృగములకు తినవేసిరి.

గోఅంతట సాయంకాలమున వులు తమ్ము కాచు కచుడు లేకయే తమ (శుక్రుని) ఆశ్రమమునకు పోయెను. కచుడు లేకయే వనము నుండి మరలివచ్చిన గోవులను దేవయాని చూచెను. కొంతసేపటి తరువాత ఆమె శుక్రుని కడకు పోయి ఇట్లు పలికెను. ''తండ్రీ! సూర్యుడు అ స్తమించినాడు. మీ అగ్నిహోత్రములందు హోమము ముగిసినది. గోపాలకుడు లేకయే గోవులు మరలివచ్చినవి. కచుడు మాత్రము కనబడుటలేదు. అతనిని ఎవరో చంపుటయో అతడు తానే కారణముననో మరణించుటయో జరిగినట్లు తోచుచున్నది. ఉన్న మాట చెప్పుచున్నాను. అతడు లేనిదే నేను జీవించజాలను.''

అది విని శుక్రుడును ''ఇదుగో! ఇదుగో! రమ్ము! అని పలికినంతనే కచుడు జీవించివచ్చును.'' అనుచు సంజీవనీ విద్యను ప్రయోగించెను. కచుని పలిచెను. పిలిచిన వెంటనే అతడు ఆవిద్యకు అంది జీవించివచ్చి ఎదుట నిలిచెను.

న పున ర్దేవయాన్యోక్తః పుష్పాహారే యదృచ్ఛయా. 37

వనం య¸° కచో విప్రాః! పఠ న్బ్రహ్మ చ శాశ్వతమ్‌ |

తతో ద్వితీయం తం హత్వా పునః కృత్వాచ చూర్ణవత్‌. 38

ప్రాయచ్ఛ న్బ్రాహ్మణాయైన సురాయా మసురా స్తదా |

దేవయాన్యథ భూయో7పి పితరం వాక్య మబ్రవీత్‌. 39

పుష్పాహరప్రేణకృ త్కచ స్తాత న దృశ్యతే | శుక్రః: బృహస్పతే ర్మృతః పుత్త్రో గతః ప్రేతగతిం కచః.

శుక్రః: విద్యయా జీవితో7ప్యేష పున స్తే కరవాణి కిమ్‌ |

మైనం శుచో మా రుద దేవయాని న త్వాదృశీ మర్త్య మనుప్రశోచేత్‌. 41

యస్యా స్తవ బ్రహ్మగణాశ్చ సేంద్రాః సేన్ద్రాశ్చ దేవా వసవో7శ్వినౌ చ |

సురద్విషశ్చైవ జగత్తు సర్వ ముపస్థితా మత్తపసః ప్రభావాత్‌. 42

అశక్యో7సౌ జీవయితుం ద్విజాతి స్సంజీవితో మ్రియతే చైవ భూయః |

దేవయానీ : యస్యాఙ్గిరా వృద్ధతమః పితామహో బృహస్పతిశ్చాపి పితా తపోనిధిః. 43

స బ్రహ్మచారీ చ తపోధనశ్చ సదోచ్ఛ్రితః కర్మసు చైవ దక్షః |

కచస్య మార్గం ప్రతిపత్స్యే న భోక్ష్యే ప్రియో హి మే తాత కచో7భిరూపః. 44

శౌనకః: స త్వేవ ముక్తో దేవయాన్యా మహర్షి స్సంరమ్భేణ వ్యాజహారాథ కావ్యః |

అసంశయం మా మసురా ద్విషన్తి యే మే శిష్యం తద్గతా స్సూదయన్తి. 45

అబ్రాహ్మణం కర్తు మిచ్ఛన్తి హా మే ఏభి ర్యథా ప్రస్తుతం దానవైర్హి |

తత్కర్మణో7ప్యస్య భ##వే దిహాన్తః కం బ్రహ్మహత్యాన దహే దపీన్ద్రమ్‌. 46

న తేన హూతో విద్యయా చోపహూత శ్శనై ర్వాచం జఠరే వ్యాజహార |

త మబ్రవీ త్కేన ఇహోపయాతో మమోదరే తిష్ఠసి బ్రూహి విప్ర. 47

కచః : భవత్ర్పసాదా న్న జహాతి మాం స్మృతి స్సర్వం స్మరేయం యచ్చ యథా చ వృత్తమ్‌ |

నన్వేవ న స్యా త్తపసః క్షయో మే తతః క్లేశం ఘోరతరం సహామి. 48

అసురై స్సురాయాం భవతో7స్మి దత్తో హత్వా దగ్ధ్వ చూర్ణయిత్వా చ కావ్య |

బ్రాహ్మీం మాయాం త్వాసురీ త్వన్యమాయా త్వయి స్థితే కథమే వాతివర్తతే. 49

శుక్రః: కిం తే ప్రియం కరవాణ్యద్య వత్సే! వధేన య త్తేన మే జీవితం స్యాత్‌ |

నాన్యత్ర కుక్షే ర్మమ భేదనేన దృశ్యే త్కచో మద్గతో దేవయాని. 50

దేవయానీ: ద్వౌ మాం శోకా వగ్నికల్పౌ దహేతాం కచస్య నాశ స్తవ చాభిఘాతః.

కచస్య నాశే మమ నాస్తి ధర్మ స్తవోపఘాతే జీవితుం నాస్మి శక్తా. 51

శుక్రః: సంసిద్ధరూపో7సి బృహస్పతే స్సుత! య త్త్వాం భక్తం భజతే దేవయానీ |

విద్యా మిమా మాప్నుహి జీవినీం త్వం న చే దిన్ద్రః కచరూపీ త్వ మద్య. 52

నివర్తేత పున ర్జీవ న్కశ్చి దన్యో మమోదరాత్‌ |

బ్రాహ్మణం వర్జయిత్వైకం తస్మా ద్విద్యా మవాప్నుహి. 53

పుత్త్రో భూత్వా భావయిత్వా మమ త్వం తస్మా ద్దేహా త్తవ నిష్క్రాన్తి రస్తు |

సమవాచక్ష చ్చాధర్మవతా మపేతాం గురో స్సకాశా త్ర్పాప్య విద్యాం సవిద్యః 54

భిత్త్వా కుక్షిం నిర్విచక్రమే విప్రః కచోభిరూపో దక్షిణం బ్రాహ్మణస్య |

ప్రాలేయాద్రే శ్శుక్ల ముద్భిద్య శృఙ్గం రాత్ర్యాగమే పౌర్ణమాస్యా మివేన్దుః. 55

దృష్ట్యా చ తం పతితం బ్రహ్మరాశిం సంస్థాపయామాన తతః కచోపి |

విద్యాం సిద్ధాం తా మవాప్యాభివాద్య తతః కచ స్తం గురు మిత్యువాచ. 56

కచః ప్రతస్య దాతార మను త్తమస్య నిధిం నిధీనాం చ పరం పరాణామ్‌ |

యే'నాద్రియన్తే గురు మర్చనీయం పాపా న్లోకాం స్తే వ్రజ న్త్యప్రతిష్ఠా&. 57

సురాయాశ్శుక్రద త్తశాపః.

శౌనకః : సురాపానా ద్వంచనాం ప్రాపయిత్వా సంజ్ఞా నాశం చేతసశ్చాపి ఘోరమ్‌ |

దృష్ట్వా కచం చాపి తథాభిరూపం పీతం తథా సురయా మోహితేన. 58

సమన్యు రుత్థాయ మహానుభావ స్తదోశనా విప్రహితం చికీర్షుః |

కావ్య స్స్వయం వాక్య మిదం జగాద సురాపానా త్ర్పత్యసంజాతశఙ్కః. 59

శుక్రః : యో బ్రాహ్మణో7ద్యవ్రభృతీహ కశ్చి న్మోహా త్సురాం పాస్యతి మన్దబుద్ధిః |

అ పేతధర్మా బ్రహ్మహా చైవ స స్యా దస్మి న్లోకే గర్హిత స్స్యా త్పరే చ. 60

మయా చేమాం విప్రధర్మోక్తసీమాం మర్యాదాం చ స్థాప్య తాం సర్వలోకే |

సన్తో విప్రా శ్శుశ్రువాంసో గురూణాం దేవలోకా శ్చోపశృణ్వన్తు సర్వే. 61

శౌనకః : ఇతీద ముక్త్వా స మహానుభావ స్తపోనిధీనాం నిధి రప్రమేయః |

తా న్దానవాం శ్చైవ విమూఢబుద్ధీ నిదం సమాహూయ వచో7భ్యువాచ. 62

శుక్రః : ఆచక్షే వో దానవా బాలిశాస్తు శిష్యః కచో వత్స్యతి మత్సమీపే |

సఞ్జీవినీం ప్రాప్య విద్యా మమాయం తుల్యప్రభావో బ్రా(బ్ర)హ్మణో బ్రహ్మభూతః. 63

శౌనకః : గురో రృషే స్సకాశే చ దశవర్షశతాని చ | అనుజ్ఞాతః కచో గన్తు మియేష త్రిదశాలయమ్‌.

ఇతి శ్రీమత్స్య మమాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీక

సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే కచవృత్తాన్త

కథనం నామ పఞ్చవింశతితమో7ధ్యాయః.

మరల ఒకనాడు దేవయాని కోరగా ఆమె కొరకు పుష్పములను తెచ్చుటకై శాశ్వతమగు బ్రహ్మమును-వేదమును (ఏలయన అది పరబ్రహ్మమువలెనే శాశ్వతమును-ప్రతి నృష్టియందును తనంతట తాను నిష్పన్నమై బ్రహ్మాది ఋషులకు దర్శనమును ఇచ్చుచు లోకమున పరంపరాగతమయి వ్యాపించునదియును) పఠించుచు అరణ్యమునకు పోయెను. అంతట మరల రాక్షసులు రెండవమారు కచుని చంపి చూర్ణముగా చేసి దానిని మద్యములో కలిపి శుక్రునకు త్రావుటకై ఇచ్చిరి.

మరల దేవయాని తన తండ్రి కడకు పోయి తండ్రితో ఇట్లు పలికెను. ''నాయనా' నేను పూలు తెమ్మని కచుని పంపితిని. ఆ పనికై వెళ్ళిన అతడు తిరిగి కనబడలేదు. బృహస్పతి పుత్త్రుడు కచుడు మృతుడై ప్రేతల గతికి పోయియుండును.''

శుక్రుడు: ''నేను అతనిని మరల విద్యతో జీవింపజేసినను నేను నీకు చేయు ఉపకారమేమున్నది? దేవయానీ! నీవు ఇట్లు శోకింపకుమయు. ఏడువకుము. ఐనను నీకు మాత్రము తక్కువ ఏమున్నది? ఇంద్రుని సేవించుచుండు దేవర్షులను బ్రహ్మర్షులును మునులును ఇంద్రాది దేవతలును వసువులును అశ్వినులును రాక్షనులందరును లోకమునందలి ప్రతియొక పదార్థమును నా తపఃప్రభావమున నీ సేవకై నీ ఎదుట నిలుచును. ఇట్టి నీవంటి ఆమె మర్త్యుని విషయములో శోకించుట తగినది కాదు. అదియును కాక ఈ బ్రాహ్మణుని జీవింపజేయుట సాధ్యముకాదు. ఒకవేళ జీవింపజేసినను అతడు మరల మరణించును.''

దేవయాని: సాక్షాత్‌ ప్రజాపతియగు అంగిరసుడు లోకమునందలి వృద్ధతములలోనివాడు ఈ కచునికి తాతగారు. తపోనిధియగు బృహస్పతి ఇతని తండ్రి. బ్రహ్మ%్‌మచర్య వ్రతమును అనుష్ఠించుచున్న వాడు. తపోధనుడు. ఎల్లప్పుడు ఉన్నతమగు చి త్తవృత్తితో ఉండువాడు. కార్యములను ఎట్టివానినైనను నిర్వహించుటలో సమర్థుడు. చాల సుందరుడు. నాకు ఇష్టుడు. నేను కచుని మార్గమునే అనుసరింతును. భోజనము చేయను''

దేవయాని పలికిన మాటలు విని మహర్షియు కవి కుమారుడును అగు శుక్రుడు క్రోధావేశముతో ఇట్లు పలికెను: ఈ రాక్షసులు నా శిష్యునియందు పగపూని ఇట్లు చంపుచున్నారు. అనిన - వారు నన్నును ద్వేషించుచున్నట్లున్నది. దానవులు ఈ విధముగా చేయుచున్నారనిన-వారు బ్రాహ్మణులనే నశింపజేయదలచుచున్నట్లున్నది. వారు చేయదలచు-చేయు-ఈపని కూడ ఇంతటితోనే ముగియగలదు. బ్రహ్మహత్యా దోషము ఎవనిని కాల్చివేయకుండును? అది ఇంద్రుని కూడ విడువదు.''

ఇట్లు పలికి శుక్రుడు విద్యతో కచుని పిలిచెను. దానితో అతడు బ్రదికెను. తరువాత అతనిని దగ్గరకు రమ్మని పిలిచెను. అతడు శుక్రుని ఉదరమందుండియే నెమ్మదిగా మాటలాడెను. శుక్రుడును కచునితో ''విప్రా! ఎవరు చేసిన పనిచేత నీవు నా ఉదరములోనికి వచ్చి ఇక్కడ ఇట్లున్నావో చెప్పుము.'' అనెను.

కచుడు: అయ్యా! మీ అను గ్రహమువలన పూర్వ స్మృతి జ్ఞానము నన్ను విడుచుటలేదు. ఏది ఎట్లు జరిగినదో అంతయు స్మృతియందు ఉన్నది. (ఇక్కడ నాకు కలుగుచున్న బాధను నా తపో మహిమతో పోగొట్టుకొనగలను. బయటకు రాగలను. కాని) నా తపోనాశము జరుగనీయరాదను తలంపుతో ఈ బాధను సహించుచు ఊరకున్నాను. రాక్షసుల నన్ను చంపి కాల్చి నీ మద్యములో కలిపి నీకు ఇచ్చినారు. మీరు ఇంతటివారు ఉండగా రాక్షసమాయ కాని మరి ఏ ఇతరుల మాయకాని వేదశ క్తితో సిద్ధించిన బ్రాహ్మణ మాయను మించిపోగలదు?''

శుక్రుడు: ''వుత్త్రీ! నా మరణము జరుగనిదే కచుడు జీవించుట జరుగదు. నా ఉదరము చీలనిదే నా పొట్టలోని ఈ కచుడు బయటకు వచ్చి కనబడు అవకాశము లేదు. ఈ రెంటిలో నీకు ఏది ప్రియమో తెలిపినచో అది చేయుదును.''

దేవయాని: ''నన్ను అగ్నివంటి రెండు శోకములు దహించుచున్నవి. వానిలో ఒకటి కచుని మరణము-రెండవది మీ నాశము. కచుని నాశము వలన నాధర్మము నశించును. మీరు మరణించినచో నేను బ్రదుకనే బ్రదుకజాలను.''

శుక్రుడు (కచునితో): ''బృహన్పతి కుమారా! నీవు భక్తితో దేవయానిని సేవించి ప్రతిఫలముగా నీవు ఆమె శక్తిని పొందగలుగుటచేత నీవు నీ యత్నములో సంపూర్ణముగా సిద్ధి పొందితిని. ఇదిగో! ఈ సంజీవనీ విద్యను నీకు అందించుచున్నాను. గ్రహింపుము. నీవు కచుని రూపములో నున్న ఇంద్రుడవు ఐనచో మాత్రము నీకు నేను ఈ విద్యనీయను. ఏ లయనగా బ్రామ్మణుడు తప్ప మరెవ్వడును నా ఉదరమునుండి పునర్జీవితుడయి బయటకు వచ్చు అవకాశమయు లేదు. నీవు బ్రాహ్మణుడవే కనుక నా కుమారుడవయి నానుండి విద్యను సీకరింపుము. అనంతరము ఆ విద్యా గ్రహణముతో దానిని భావనచేసి (ఆ మంత్రమునందు సిద్ధినిపొంది) తరువాతనే నీవు నా శరీరము నుండి వెలుపలికి రావలెను.''

ఇట్లు పలికి శుక్కుడు అధర్మపరులయి ప్రవ ర్తించువారి భేదమును (ధర్మపరులకును అధర్మపరుకును గల భేదమును) నిందించెను. అంతట కచుడు గురువగు శుక్రునినుండి సంజీవనీ విద్యను అందుకొని విద్యాసహితుడై అతని దోక్షణకుక్షిని (ఉదరమును) చీల్చుకొని ఎప్పటి సుందరరూపముతో వెలుపలికి వచ్చెను. అపుడతడు రాత్రి కాగానే హిమవత్పర్వతపు తెల్లని శిఖరపు చాటునుండి ఉదయించి పైకి వచ్చు పూర్ణిమా చంద్రునివలె ప్రకాశించెను. కచుడును పడియున్న వేదరాశివంటి శుక్రుని చూచి తన విద్యాబలముచే అతనిని మరల బ్రదికించి లేవదీసెను. ఇట్లు సిద్ధి పొందిన విద్యను సంపాదించుకొని కచుడు గురుని నమస్కరించి ఇట్లు పలికెను.

''సర్వోత్తమమగు బ్రహ్మచర్య వ్రతమును ప్రదానము చేసినవాడును నిధులలో గొప్ప నిధియు గొప్ప వారందరలో గొప్పవాడును పూజింపదగిన వాడును అగు గురుని ఎవరు ఆదరించరో-వారు అయోగ్యములును పాపానుభవమును కలిగించు నవియును అగు లోకములను పొందుదురు.''

శుక్రుడు తాను సురాపాన ప్రభావమున రాక్షసులవలన వంచనకు పాత్రుడయ్యెను. తన చిత్తమునకు గల తెలివి అంతయు ఘోరమగు నాశమును పొందెను. మిగుల సుందరుడును యోగ్యుడును అగు కచుడు అజ్ఞానముచే మద్యముతో పాటు తనచేత త్రాగబడిన విషయము నాత డాలోచించెను. ఇందుచే ఆ మహానుభావునకు కోపము కలిగి అతడు లేచి నిలువబడెను. సురాపానము విషయమున ఏ సందేహమును లేని నిశ్చయము చేసికొనెను. ఆ కావ్యుడు ఉశనసుడు బ్రాహ్మణులకు హితము చేయగోరి స్వయముగా ఈ విధమున పలికెను. ''ఇది మొదలుకొని ఏ బ్రాహ్మణుడైన మందబుద్ధియై అజ్ఞానవశమున మద్యమును త్రావినచో అతడు ధర్మభ్రష్టుడై బ్రహ్మహత్యా పాపమును పొందును. ఇహలోకమునందును పరలోకమునందును నిందితు డగును. బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మము విషయములో నేను చెప్పిన అవధిని ధర్మవ్యవస్థను లోకమునందంతట విప్రులు నిలుపుకొందురుగాక! వేదములందును శాస్త్రములందును పెద్దల వచనములందును ప్రామాణ్య బుద్ధి కలవారును గురువుల నుండి వేదశాస్త్ర తత్త్వమును అధ్యయనము చేసిన వారును అగు విప్రులును దేపలోకమునందలి దేవతులను దేవర్షులును అందరును దీనిని విందురుగాక!''

మహానుభావుడును తపోనిధులలో గూడ ఇంత గొప్పది అని చెప్పనలవికాని గొప్పనిధియును అగు ఆ శుక్రుడు విమూఢ బుద్ధులగు దానవులను కూడ పిలిచి ఇట్లు పలికెను. '' బాలిశులైన దానవులారా! మీకు ఒకమాట చెప్పుచున్నాను వినుడు. నా శిష్యుడు అగు ఈ కచుడు నావలన మాయారహితమగు సంజీవనీ విద్యను సంపాదించి నాప్రభావముతో సమాన ప్రభావము కలిగి బ్రహ్మత్వమునే పొందిన బ్రాహ్మణుడై నా సమీపమున నుండును.''

ఇట్లు కచుడు ఋషియు తన గురువును అగు శుక్రుని దగ్గర వేయి సంవత్సరములు ఉండి గురునినుండి అనుమతిని పొంది స్వర్గమునకు మరలిపోదలచెను.

ఇది శ్రీమత్స్యమమాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరిత్రమున

కచ వృత్తాంత కథనము ఈను ఇరువదియైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters