Sri Matsya Mahapuranam-1    Chapters   

తృతీయో7ధ్యాయః- బ్రహ్మణోజగదుత్పత్తిః.

మనుః: చతుర్ముఖత్వ మగమ త్కస్మాల్లోకపితామహః | కథంచ లోకా నసృజ ద్బ్రహ్మా బ్రహ్మవిదాం వరః. 1

మత్స్యః: తప శ్చచార ప్రథమ మమరాణాం పితామహః | ఆవిర్భూతాస్తతో వేదా స్సాఙ్గోపాఙ్గపదక్రమాః. 2

పురాణం ధర్మశాస్త్రాణి ప్రథమం బ్రహ్మణా స్మృతమ్‌ | నిత్యశబ్దమయం పుణ్యం శతకోటిప్రవిస్తరమ్‌. 3

అనన్తరం తు వక్త్రేభ్యో వేదాస్తస్య వినిస్సృతాః | మీమాంసా న్యాయవిద్యాశ్చ ప్రమాణాష్టకసంయుతాః. 4

వేదాభ్యాసరతస్యాస్య ప్రజాకామస్య మానసాత్‌ | మనసః పూర్వసృష్టా వై జాతాస్తేనైవ మానసాః. 5

మరీచి రభవ త్పూర్వం తతో7త్రి ర్భగవా నృషిః | అఙ్గిరా శ్చాభవత్పశ్చా త్పుల స్త్య స్తదనన్తరమ్‌. 6

తతః పులహనామా వైతతః క్రతు రజాయత | ప్రచేతాశ్చ తతః పుత్త్రో వసిష్ఠ శ్చాభవత్పు నః. 7

పుత్త్రో భృగు రభూత్తత్ర నారదో పి చిరా దభూత్‌ | దశైతా న్మానసా న్పుత్త్రా ఞ్జీవపుత్త్రా నజీజనత్‌. 8

తత్పుత్త్రానథ వ క్ష్యామి హ్యాత్మహీనా న్ప్రజాపతే | అఙ్గుష్ఠా ద్దక్షిణాద్దక్షఃప్రజాపతి రజాయత. 9

ధర్మస్తు నాభిదేశాత్తు హృదయా త్కుసుమాయుధః | భ్రూమధ్యా దభవ త్క్రోధో లోభ శ్చాధరసమ్భవః. 10

బుద్ధే ర్మోహ స్సమభ వదహఙ్కారా ద భూన్మనః | ప్రమోద శ్చాభవత్కర్ణా న్మృత్యు ర్లోచనయోర్నృప. 11

ఏతే నవ సుతారాజ న్కన్యా చదశమీ పునః | అఙ్గజాఇతివిఖ్యాతా దశామీ బ్రహ్మణ స్సుతాః. 12

మూడవ అధ్యాయము

బ్రహ్మనుండి వేదాదికము ఉత్పత్తి చెందుట

మనువు ఇట్లడిగెను: లోకపితామహుడగు బ్రహ్మ ఏల చతుర్ముఖు డయ్యెను? బ్రహ్మ (వేద)వేత్తలలో శ్రేష్ఠుడు అగు బ్రహ్మ లోకములను ఎట్లు సృష్టించెను?

మత్స్యము ఇట్లు చెప్ప నారంభించెను: దేవతలకును పితామహుడగు బ్రహ్మ మొదట తపస్సు ఆచరించెను. అంతట అంగములతో ఉపాంగములతో పదములతో క్రముతో (ఘన జట మొదలగు వానితో) కూడ వేదములు అతనికి సాక్షాత్కరించెను. నిత్య శబ్ధమయమును పుణ్యకరమును శతకోటి గ్రంథ (32 అక్షరములు గ్రంథము అని పరిభాష) విస్తరము కలది అగు పురాణమును ధర్మశాస్త్రములతోకూడ మొదట బ్రహ్మ స్మరించి (పూర్వ కల్పములందు తనకు తెలిసిన వానినే) కొనెను. తరువాత అతని ముఖముల (నోళ్ల) నుండి వేదములును ఎనిమిది (ప్రత్యక్షము అనుమానము ఉపమానము ఆగమము అర్థాపత్తి అసంభవము ఐతిహ్యము పురాణము) ప్రమాణములతో కూడ న్యాయ విద్యలు బయటకు వచ్చెను. వేదములను ఆవృత్తము చేయుచునే యున్నవాడును ప్రజలను సృష్టింప సంకల్పించిన వాడునగు అతని మానసమునుండి సంకల్పముచే మొదట సృష్టింపబడిన పుత్త్రులు మానస పుత్త్రులైరి. వారు వరుసగా- మరీచి అత్రి అంగిరుడు పులస్త్యుడు పులహుడు క్రతువు ప్రచేతుడు వసిష్ఠుడు భృగువు నారదుడు. వీరందరును జీవ పుత్రులు (తమ నుండి పుత్త్రులనుత్పన్నులనుచేసి జీవింప జేసినవారు. (వీరిలో నారదుని విషయ మాలోచింప వలెను.) ఆత్మ హీనులు (దేహము లేనివారు) అగు బ్రహ్మ పుత్త్రుల దెలిపెదను. బ్రహ్మ కుడి బొటన వ్రేలినుండి దక్షుడు (ఇతడు మాత్రము దేహము కలవాడు. సృష్టిని కొనసాగించి ప్రజాపతి ఐనవాడు.) నాభినుండి ధర్మము హృదయమునుండి మన్మథుడు కనుబొమ్మల నడుమనుండి క్రోధము క్రింది పెదవినుండి లోభము బుద్ధినుండి మోహము అహంకారమునుండి మనస్సు చెవినుండి ప్రయోదము (సంతోషము) కన్నులనుండి మృత్యువు అను కుమారులును అంగజ అనెడి కన్యయు కలిగిరి.

మనః: బుద్ధే ర్మోహో హ్యహఙ్కారా న్మనోభూ దితి కీర్తితమ్‌ |

అహఙ్కారసుతః కోవా బుద్ధి బుద్ధి ర్నామ కి ముచ్యతే. 13

మత్య్స: సత్త్వం రజ స్తమశ్చై వగుణత్రయ ముదాహృతమ్‌ | సమానస్థితి రేతేషాం ప్రకృతిః పరికీర్తితా. 14

కేచా త్ప్రధాన మిత్యాహు రవ్యక్త మపరే జగుః | ఏతైరేవ సమం సృష్టం కరోతి వికరోతి చ. 15

గుణభ్యః క్షుభ్యమాణభ్య స్త్రయో దేవా విజజ్ఞిరే | ఏకా మూర్తి స్త్రయో భాగా ద్బ్రహ్మవిష్ణు మహేశ్వరాః. అవికారా త్ప్రధానాత్తు మహత్తత్త్వం ప్రజాయతే | మహా నితి యతః ఖ్యాతి ర్లరోకానాం జాయతే సదా. 17

అహఙ్కారస్తు మహతో జాయతే మానవర్ధనః ఇన్ద్రయాణి తతః పఞ్చ వక్ష్యే బుద్ధి వశాని తు. 18

ప్రాదుర్భవన్తి చాన్యాని తథా కర్మవశాని తు | శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చ యథాక్రమమ్‌. 19

పాయూపస్థం హస్తపాదం వాక్చే తీన్ద్రియసఙ్గ్రహః|శబ్ద స్స్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ పఞ్చముః. 20

ఉత్సర్గానన్ద మాదానగతివాచశ్చ యాః క్రియాః | మన ఏకాదశం చైషాం కర్మబుద్ధిగుణాన్వితమ్‌. 21

ఇన్ద్రియావయవా స్సూక్ష్మా యాన్యుఞ్ఛన్తి మనీషిణః | శయన్తి యస్మాత్తన్మాత్రా శ్శరీరం తేన తత్స్మృతమ్‌. శరీరయోగా జ్జీవశ్చ శరీరం రక్షతే బుధః | మన స్సృష్టం వికురుతే నోద్యమానం సిసృక్షయా. 23

ఆకాశం శబ్దతన్మాత్రా దభూ చ్ఛబ్దగుణాన్వితమ్‌ | ఆకాశవికృతే ర్వాయు శ్శబ్దస్పర్శగుణో7భవత్‌. 24

వాయోశ్చ స్పర్మతన్మాత్రా త్తేజ ఆవిరభూ త్తతః | త్రిగుణం చ వికారేణ తచ్ఛబ్దస్పర్శరూపవత్‌. 25

తేజోవికారా దభవ త్తత ఆప శ్చతుర్గుణమ్‌ | రసతన్మాత్రసమ్భూతం శబ్దస్పర్శరసాత్మకమ్‌. 26

*భూమిస్తు గన్ధన్మాత్రా దభూ త్పఞ్చగుణా తతః| ప్రాయో గన్ధగుణా సా తు బుద్ది రేషాం గరీయసీ. 27

ఏభి స్సమ్పాదితం భుఙ్త్కే పూరుషః పఞ్చవింశకః | ఈశ్వరో వాచకశ్చి జలాత్మా కథ్యతే బుధైః. 28

ఏవం షడ్వింశకం ప్రోక్తం శారీర మిహ మానవమ్‌ | సాఙ్ఖ్యం సఙ్ఖ్యత్మకత్వాచ్చ కపిలాదిభిరుచ్యతే. 29

మనువు మరల ఇట్లడిగెను: బుద్ధికుమారుడు మోహము అహంకారపుత్త్రుడు మనస్సు అంటిరి. బుద్ధి అనగా ఏమి? అహంకార కుమారుడగు మనస్సు అనగా ఎట్టిది?

మత్స్యము ఇట్లు పలికెను: సత్త్వము రజస్సు తమస్సు అనునవి మూడు గుణములు. వీటి మూడిటి సమత్వస్థితిని ప్రకృతి ప్రధానము అవ్యక్తము అందురు. ప్రకృతి ఈ మూడు గుణములతోనే సృష్ఠి జరుపును. సృష్టిలోని పదార్థముల పరిణమింప జేయును. లయముకూడ పొందించును. క్షోభము (స్పందము) పొందిన మూడు గుణములనుండి ఒకే మూర్తి యగు ప్రకృతినుండి ముగ్గురు దేవతలు జనించిరి. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వికారము నొందని ప్రధానమునుండి మహత్తత్త్వము పుట్టును. దాని మూలముననే లోకములకు మహాన్‌ (దృష్టికి గోచరమగునంత పెద్ద పరిమాణము కలవి) అను ప్రసిద్ధి ఏర్పడును. మహత్‌నుండి మాన(గర్వ)మును వృద్ధిచేయు అహంకారము దానినుండి బుద్ధి వశములగు ఐదు జ్ఞానేంద్రియుములు- త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములును కర్మ వశములగు ఐదు వాక్పాణిపాద పాయూపస్థములను కర్మేంద్రియములును జనించెను. వరుసగా స్పర్శము రూపము శబ్దము రసము గంధము అనునవి జ్ఞనేంద్రియములకు గోచరములగు విషయములు. వచనము ఆదానము గతి ఉత్సర్గము ఆనందము (ఆనందింప చేయుట) అనునవి కర్మేంద్రియములు చేయు పనులు. ఈ ఇంద్రియముల జ్ఞాన కర్మ లక్షణములుగల మనస్సు వీనితో పదునొకండవది. విద్వాంసులు మాత్రము దర్శింపగల సూక్ష్మములగు ఇంద్రియావయవములు పంచతన్మాత్రలను (పంచభూత సూక్ష్మాంశములను) ఆశ్రయించి ఉండును. అందుచేత ఈ ఇంద్రియ తన్మాత్రల సంఘాతము శరీరము అనబడును.

ప్రకృతి ఆపరమేశ్వరుని సృష్ఠి సంకల్పముచే ప్రేరింపబడినదగుచు పరమేశ్వరుని మనస్సు ప్రకృతిని పరిణమింప జేయును. శబ్ద తన్మాత్రనుండి శబ్ద గుణము కల ఆకాశమును అది పరిణమించగా శబ్దస్పర్శ గుణములుగల వాయువును అది పరిణమించగా శబ్ద స్పర్శ రూప గుణములు కల అగ్నియు అది పరిణమిచంగా శబ్ద స్పర్శ రూపరసములుగల జలమును అది పరిణమించగా శబ్ద స్పర్శ రూప రసగంధములు గుణములుగాగల పృథివియు ఉత్పత్తి పొందెను. వీటి అన్నింటిలో బుద్ధి శ్రేష్ఠమయినది. ఐదు మహాభూత(సూక్ష్మ)ములు అహంకారము బుద్ధి అవ్యక్తము మనస్సుతో కూడ పదునొకండు ఇంద్రియములు ఇంద్రియ విషయములు అను ఇరువదినాల్గు తత్త్వములకు అతీతుడగు(ఇరువది ఐదవ)పురుషుడు (జీవుడు) ఈ ఇరువది నాల్గింటిచే సాధింపబడిన సుఖదుఃఖాదులను అనుభవించుచుండును. అంతర్యామి అగు ఈశ్వరునకు వాచకుడనియు జలాత్మ అనియును పేరులు. ఇతడిరువదియారవవాడు. అందుచే మానవశరీరము నా శ్రయించి చేయుత త్త్వ విచారణమును షడ్వింశకమందురు. ఇట్లు ఇది సంఖ్యా రూపము కావున దీనిని సాంఖ్యము అని కపిలుడు మొదలగు వారందురు. (సంఖ్యా అనగా జ్ఞానము అని అర్థము.)

ఏత త్తత్త్వా త్మకం కృత్వా జగ ద్దేవా నజీజనత్‌ | సావిత్రీం లోకసృష్ట్యర్థం హృదికృత్వా సమాస్థితః. 30

తత స్తాం జపతస్తస్య భూత్వా దేహ మకల్మషమ్‌ | స్త్రీరూప మకరో దర్ధ మర్ధం పురుషరూపవత్‌. 31

సరస్వతీమోహాద్బ్రహ్మణః పఞ్చముఖోత్పత్తిః.

శతరూపా చ సఙ్ఖ్యాతా సావిత్రీ చ నిగద్యతే | సరస్వత్యథ గాయత్రీ బ్రహ్మాణీచపర న్తప. 32

*రూపం గన్ధగుణా క్ష్మాతు పరేషాం యా బలీయసీ.

తత స్స్వదేహ సమ్భూతా మాత్మజా మిత్యకల్పయత్‌ | స ఆస్తే వ్యథిత స్తత్ర కామబాణార్దితో విభుః. 33

అహో రూప మహో రూప మితి చాహ ప్రజాపతిః | వతో మసిష్ఠప్రముఖా భగినీమితి చుక్రుశుః. 34

బ్రహ్మా న కించి ద్దదృశే తన్ముఖాలోక నాదృతః | అహో రూప మహో రూప మితి ప్రాహ పునః పునః. 35

తతః ప్రణామసక్తాం తు పురస్తా దవలోకయత్‌ | అథ ప్రదక్షినం చక్రే సా పితు ర్వరవర్ణినీ. 36

పుత్త్రేభ్యో లజ్జితస్యాస్య తద్రూపాలోకనేచ్ఛయా | ఆవిర్భూత మథో వక్త్రం దక్షిణం పాణ్డుగండవత్‌. 37

విస్మయస్ఫురదోష్ఠం చ పాశ్చాత్త్యముదగా త్తతః | చతుర్థ మభవ త్పశ్చా త్కామం కామశరాతురమ్‌. 38

తతో7న్య దభవత్తస్య కామానుగతయా తదా | ఉత్పతన్త్యా స్తదాకాశ మాలోక్యచ కుతూహలాత్‌. 39

సృష్ట్యర్థం యత్కృతం తేన తపః పరమదారుణమ్‌ | తత్సర్వం నాశ మగమ త్స్వసుతోపగమేచ్ఛయా. 40

*తతోద్ధ్వవక్త్ర మభవ త్పఞ్చమం తస్య ధీమతః | ఆవిర్భాతం చ తత్రైవ తద్వక్త్ర మపరం ప్రభోః. 41

స తు తా నబ్రవీ ద్బ్రహ్మా వ్యగ్రా నాత్మనిసమ్భవా& | ప్రజా స్సృజధ్వం సమ్భూతా స్సదేవాసురమానుషాః. 42

ఏవ ముక్తా స్తత స్సర్వే ససృజు ర్వివిదాః ప్రజాః | గతేషు తేషు సృష్ట్యర్థం ప్రణమ్రవదనా మిమామ్‌. 43

ఉపయేమే స విశ్వాత్మా శతరూపా మనిన్దితామ్‌ | స బభూవ తయా సార్ధ మతికామాతురో విభుః. 44

సలజ్జాం చకమే దేవః కమలోదరమన్దిరే | యావదబ్దశతం దివ్యం యథా7న్యః ప్రాకృతో జనః. 45

కాలేన మహతా తస్య తద్వ త్పుత్త్రో7భవ న్మనః | స్వాయమ్భువ ఇతి ఖ్యాత స్స విరాడితి నశ్శుతమ్‌. 46

తద్రూపగుణసామాన్యా దధిపూరుష ఉచ్యతే | వైరాజా యత్ర తే జాతాః ప్రభవ స్సంశితవ్రతాః. 47

స్వాయమ్భువా మహాభాగా స్సప్తసప్త తథాపరే | స్వారోచిషాద్యా స్సర్వే తే బ్రహ్మతుల్యస్వరూపిణః. 48

ఉత్తమప్రముఖా స్తద్వ దేతేషాం నప్తమో7ధునా.

ఇది శ్రీమత్స్యమమాపురాణ మత్స్యమనుసంవాదే బ్రహ్మణో వేదాద్యుత్పత్తిర్నామ తృతీయో7ధ్యాయః.

బ్రహ్మ ఇట్లు షడ్వింశత్‌ తత్త్వరూపమయిన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను. అతడు లోకసృష్టి జరుపు సంకల్పముతో సావిత్రీ తత్త్వమును హృదయమును నిలుపుకొని సమాధిస్థితుడయ్యెను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమయి సగము స్త్రీరూపమును సగము పురుషరూపమును అయ్యెను. ఆ స్త్రీరూపమునకే శతరూప సావిత్రి సరస్వతి గాయత్రి అని వ్యవహారము. తన దేహమునుండి ఉత్పన్నయైన ఆమెను ఆతడు తనకుమా ర్తె (ఆత్మజ) అనియు ఆయనయే వ్యవస్థ చేసెను. ఐనను ఆదేవుడు ఆమెను చూచిన తతక్షణమే కామబాణములచే బాధనొంది ఎటువంటి రూపము! ఎటువంటి సౌందర్యము! అని ఆశ్చర్యముతో పలికెను. వసిష్ఠుడు మొదలగువారు అక్కా! అని అరచిరి! కాని బ్రహ్మ ఆమె మొగమును చూచు ఆసక్తి లో అది ఏమియు చూడలేదు. మాటిమాటికి ఎంత సౌందర్యము! అని పలుకసాగెను. అంతలో తనముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడెను. అంతట ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసెను.

ఆమెసౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆపని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల సోవుచున్న చెక్కిళ్లు కల దక్షిణ ముఖమును ఆశ్చర్యముతో వణకుచున్న పెదవులు కల పశ్చిమ ముఖమును మన్మథ బాణములచే బాధపడుచున్న (కామ పరవశమయిన) నాలుగవదగు ఉత్తర ముఖమును కలిగెను. అత డపుడట్లు కామానుచరుడగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గంతువేయుచు ఇదే మను కుతూహలముతో పైకి ఆకాశమువైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు ఐదవదగు ఊర్ద్వ ముఖము ఉత్పన్నము అయ్యెను. అట్లు ఆ ప్రభువునకు అక్క డకక్కడనే మరొక ముఖము (ఐదవది) కూడ మొలచెను.

_________________________________________

*తతః పున స్సమభవ త్పఞ్చమం

కాని తన కుమార్తెనే పొందగోరుటవలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమదారుణమగు తపస్సంతయు నాశము నందెను. అది చూచి కలవరపడుచున్న తన (మానస) పుత్త్రులతో బ్రహ్మ మీరందరును కూడి దేవా సురమానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు. అని ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారందరును వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి.

మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో నున్నదై ఏ దోషమును లేని పవిత్రురాలగు ఆశతరూపను విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడెను. అతడు (లోక) విభు డయియును ఆమె విషయమున కామముచే బాధపడినవా డయ్యెను. ఆ దేవుడు సామాన్యమానవునివలె నూరేండ్లపాటు తన స్థానమగు పద్మపు నడుమ అనెడి గ్రహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాలకాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. ఆతనకే 1. స్వాయంభువుడు అనియు 2. విరాట్‌ అనియు పేరులు మనకు అను శ్రుతముగా వినవచ్చుచున్నవి. ఇతని రూపమును గుణములును బ్రహ్మరూప గుణములతో సమానముగా ఉండుటచే అతనికి 3. అధిపూరుషుడు అనియు పేరు (1. స్వయంభూ యొక్క కొడుకు - 2. వివిధ రూపములతో ప్రకాశించువాడు 3. మొదటి పురుషుని నుండి పుట్టిన మరొక పురుషుడు.) ఈ స్వాయంభువునినుండి స్వారోచిషుడు ఉత్తముడు మొదలగు పదునాలుగు మంది మనువులు బ్రహ్మతో సమానముగా రూప గుణములు కలవారు ఉత్పన్నులైరి- ఇపుడు వారిలో ఏడవ మనువు పాలించుచున్నాడు.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున బ్రహ్మనుండి వేదాదికము జనించుట అను తృతీయాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters