Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకత్రింశ త్తమో7ధ్యాయః.

శర్మిష్ఠాయయాతిసంవాదః.

శౌనకః : 

యయాతి స్స్వపురం ప్రాప్య మహేన్ద్రపురసన్నిభమ్‌ | ప్రవిశ్యాన్తఃపురం తత్ర దేవయానీం న్యవేశయత్‌. 1

దేవయాన్యా శ్చానుమతే సుతాం తాం వృషపర్వణః | అశోకవనికాభ్యా శే గృహం కృత్వా న్యవేశయత్‌. 2

వృతాం దాసీసహస్రేణ శర్మిష్ఠా మాసురాయణీమ్‌ | వాసోభి రన్నపానై శ్చ సంవిభజ్య సుసంవృతామ్‌. 3

దేవయాన్యా తు సహిత స్స నృపో నహుషాత్మజః | విజ హార బహూనబ్దా న్దేవవ న్ముదితో భృశమ్‌. 4

ఋతుకాలే తు సమ్ర్పాప్తే దేవయానీ వరాఙ్గనా | లేభే గర్భం ప్రథమతః కుమారం చ వ్యజాయత. 5

గతే వర్షసహస్రే తు శర్మిష్ఠా వార్షపర్వణీ | దదర్శ ¸°వనప్రాప్తా మృతుం పా కమలేక్షణా. 6

చిన్తయామాస ధర్మజ్ఞా త్వృతౌ ప్రాప్తే తు భామినీ | ఋతుకాలశ్చ సమ్ర్పాప్తో నచ కశ్చి త్పతి ర్వృతః. 7

కిం ప్రా ప్తం కిఞ్చ క ర్తవ్యం కథం కృత్వా కృతం భ##వేత్‌ |

దేవయానీ యయాతిం సా వృతా సమ్ప్రాప్త¸°వనా. 8

యథా తయా వృతో భర్తా తథైవాహం వృణోమి తమ్‌ | రాజ్ఞా పుత్త్రఫలం దేయ మితి వే నిశ్చితా మతిః. 9

యదీదానీం స ధర్మాత్మా రహో మే దర్శనం వ్రజేత్‌ |

శౌనకః : అథ నిష్క్రమ్య రాజా7సౌ తస్మిన్కాలే యదృచ్ఛయా. 10

అశోకవనికాభ్వాశే శర్మిష్ఠాసహిత స్థ్సితః | తమేకం రాహసం దృష్ట్వా శర్మిష్ఠా చారుహాసినీ. 11

ముప్పది ఒకటవ అధ్యాయము

శర్మిష్ఠా యయాతి సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: యయాతి తన రాజధాని చేరెను. అది మహేంద్రుని అమరావతితో సమానమయినది. అతడు అంతఃపురమున ప్రవేశించి అందు దేవయానికి నివాసము ఏర్పరచెను. ఆమె అను మతితో అతడు వృషపర్వుని కుమా ర్తెయగు శర్మిష్ఠకు అశోకోద్యానపు సమీపమున గృహమును నిర్మింపజేసి దానియందామెను వసింపజేసెను. ఆమెకు పరివారముగా ఆమె నాశ్రయించియుండు దాసీ సహస్రము కూడ అచ్చటనే ఆ అశోకో ద్యానమునందే ఆమెతో పాటు వసించుచుండ రాజు వారికి వస్త్రములు అన్నపానములు వేరువేరుగ ఏర్పాటు చేయించి కనిపెట్టి యుండెను. నహుషాత్మజుడగు ఆ యయాతి రాజు దేవయానితో కూడి చాల ఏండ్లు దేవునివలె విహరించుచు మిగుల సంతోషించుచుండెను.

ఋతుకాలము రాగా ఉత్తమాంగనయగు దేవయాన మొదటిసారిగా గర్భవతి యయ్యెను. కుమారుని కనెను. కమలనయనయగు వృషపర్వుని కూతురు శర్మిష్ఠము వేయి సంవత్సరముల తరువాత ¸°వనవతియై ఋతుదర్శనమును పొందెను. లోకధర్మమును ఎరిగిన ఆశర్మిష్ఠ ''నాకు ఋతుకాలము సంప్రాప్తమయినది. కాని నేను ఎవరిని పతిగా వరించి పొందియుండలేదుకదా! ఇపుడు ఏది తగినది? ఏమి చేయవచ్చును? ఎట్లు చేసిన ఈ ఋతువు సఫలమగును?'' అని ఆలోచించి ఆమె తన మనసున యయాతినే తనకు ప్రాప్తించిన ¸°వనమునకు తగిన పతినిగా వరించుకొనెను. ''ఆమె (దేవయాని) తానై యయాతిని తన భర్తనుగా వరించినట్లే నేనును ఆతనినే నాభర్తనుగా వరింతును. రాజే నాకును పు త్త్ర ఫలమును ఈయదగినవాడు. అని నామదికి నిశ్చయముగా దోచుచున్నది. ఆరాజు ధర్మము నెరిగినవాడు. అతడు ఈ సమయమున ఏకాంతమున నాకు కనబడిన ఎంత బాగుగానుండును!'' అని ఆమె తలచెను.

ఇంతలో అదే సమయమున రాజు కూడ దైవికముగా బయటికి వచ్చి అశోకోద్యాన సమీపమున శర్మిష్ఠ యున్నచోటికి దగ్గరలో వచ్చియుండెను. సహజముగనే చూచువారికి ఇంపుగొలిపెడి చిరునవ్వుమోము గల శర్మిష్ఠ రాజట్లు ఏకాంతమం దుండుట గమనించెను. అతడు ఉన్న వైపునకు పోయెను.

ప్రతిగమ్యాఞ్జలింకృత్వా రాజానం వాక్యమబ్రవీత్‌| శర్మిష్ఠా: సోమస్యేన్ద్రస్య విష్ణోశ్చ యమస్య వరుణస్య చ.

తవ వా నాహుష గృహే కః స్త్రియం ద్రష్టు మర్హతి | రూపాభిజనశీలాంహి త్వం రాజ న్వేత్సి మాం సదా. సా త్వాం యాచే7భి కామార్తా ఋతం దేమి నరాధిప |

యయాతిః : వేద్మి త్వాం శీలసమ్పన్నాం దైత్యకన్యా మనిన్దితామ్‌. 14

రూపంతు తే న పశ్యామి సూచ్యగ్రమపి నిన్దితమ్‌ | మమాబ్రవీ త్తదా శుక్రో దేవయానీం యదా7వహమ్‌. 15

నేయ మాహ్వయితవ్యా తే శ యనే వార్షపర్వణీ |

శర్మిష్ఠా : న నర్మయుక్తం వచనం హినస్తి న స్త్రీషు రాజ న్న వివాహకాలే. 16

ప్రాణాత్యయే సర్వధనాపహారే పఞ్చానృతా న్యాహు రపాతకాని.

పృష్టాస్తు సాక్ష్యే ప్రవదన్తి యే7న్యధా భవన్తి మిథ్యావచనా నరేన్ద్ర! 17

ఏకార్థతాయాం తు సమాహతాయాం మిథ్యావదన్తం హ్వనృతం హినస్తి |

రాజా ప్రమాణం భూతానాం స వినశ్యే న్మృషా వదన్‌. 18

అర్థకృచ్ఛ్ర మనుప్రాప్య న మిథ్యా వక్తు ముత్స హే | సమా వేతౌ మతౌ రాజ న్పతి స్సఖ్యాశ్చ యః పతిః.

సమం వివాహ మిత్యాహు స్సఖ్యా మే7సి వతి ర్యతః. |

యయాతిః : దాతవ్యం యాచమానస్య ఇతి మే వ్రతమాహితమ్‌. 20

త్వంచ యాచసి కామం మాం బ్రూహి కిం కరవాణి తే |

శర్మిష్ఠా : అధర్మా త్పాహి మాం రాజ న్ధర్మం రాజ న్ధన్మం చ ప్రతిపాదయ. 21

త్వత్తో7పత్యవతీ లోకే చరేయం ధర్మముత్తమమ్‌ | త్రయ ఏవాధనా రాజ న్భార్యా దాస స్తథా సుతః. 22

యం తే సమధిగచ్ఛన్తి యసై#్యతే తస్య తద్ధనమ్‌ | దేవయాన్యా భుజిష్యా7స్మి వశ్యాచ తవ భార్గవీ. 23

సా చాహం తు త్వయా రాజ న్భరణీయా భజస్వ మామ్‌ |

శౌనకః : ఏవముక్త స్తయా రాజా తథ్యమి త్యధిజజ్ఞివాన్‌. 24

పూజయామాస శర్మిష్ఠాం ధర్మంచ ప్రతిపాదయ& | స సమాగమ్య శర్మిష్ఠాం యథాకామ మవాప్యచ. 25

అన్యోన్యం చాపి సమ్పూజ్య జగ్మతు స్తౌ యథాగతమ్‌ | తస్మిన్త్సమాగమే సుభ్రూ శ్శర్మిష్ఠా వార్షపర్వణీ. 26

లేభే గర్భం ప్రథమత స్తస్మాచ్చ నృపసత్తమాత్‌ | ప్రజజ్ఞేచ తతః కాలే రాజ న్రాజీవలోచనా. 27

కుమారం దేవగర్భాభ మాదిత్యసమవర్చసమ్‌. 28

ఇది శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీక సంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే శర్మిష్ఠాయయాతిసంవాదో నామైకత్రింశో7ధ్యాయః.

అతనిని సమీపించెను. దోసిలి చేసి ఇట్లు పలికెను. ''నహుష పుత్త్రా! సోముడు-ఇంద్రుడు-విష్ణువు-యముడు-వరుణుడు-నీవు- ఈ వీరి ఇండ్లయందలి స్త్రీని పరపురుషుడు ఎవ్వడు చూడనైన చూడగలడు? నేను గొప్ప వంశమున పుట్టినదాననని సౌందర్యవతినని నీకు మొదటి నుండియు తెలియును. ఇట్టి నేను కామార్తనై నిన్ను అభియాచించుచున్నాను. రాజా! నాకు ఋతుఫలము ఇమ్ము'' యయాతి: ''నీవు శీలసంపన్నవు. ఉత్తమ దైత్య వంశమున పుట్టితివి. నీలో దోష మేమియు లేదు నీ రూపమునందును సూదిమోనయంత కూడ దోషములేదు. ఇది యంతయు నాకు తెలియును. కాని నేనానాడు దేవయానిని వివాహమాడినప్పుడు శుక్రుడు 'నీవు ఈ శర్మిష్ఠను శయనముమీదకు పిలువరాదు.' అని నాతో చెప్పెను.'' శర్మిష్ఠ: ''పరిహాసమున-స్త్రీ విషయమున పెండిండ్లు ప్రాణహాని సర్వధననాశము-ఈ సందర్భములందు ఆడెడి అసత్యము పాతకము కాదందురు. సాక్ష్యము చెప్పుమనినప్పుడు అన్యధాగా చెప్పినవారు అసత్యము చెప్పిన పాపము పొందుదురు. ఏకార్థత (ఆ కార్యము వలన కలుగవలసిన వ్రధాన ప్రయోజనము) దెబ్బ తినినపుడు మాత్రమే అసత్యము అసత్యమై అది చెప్పిన వానిని హింసించును.'' యయాతి: ''అన్ని ప్రాణులకును రాజు ప్రమాణము. (అతడు నడచినట్లు అందరును నడతురు.) అట్టివాడు అసత్యము పలికినచో తానే నశించును. కావున ఎట్టి ప్రయోజనము కాని ధనముకాని నశించు పరిస్థితి పచ్చినను నేను అసత్యమాడజాలను.'' శర్మిష్ఠ: ''రాజా! తన పతియు తన సఖిపతియు స్త్రీకి సములే. ఈ ఇద్దరిలో ఏఒకరు ఒకనిని పతిగా చేసికొనినను రెండవ వారును అతనినే పతిగా చేసికొనినట్లే. అని పెద్దలు చెప్పుచున్నారు. నీవు నాసఖికి పతివి కధా!'' యయాతి: ''అడిగినవారికి అడిగినది ఈయవలయును. అని నావ్రతము-నీవు కామ ఫలమును కోరుచున్నావు. నేను నీకేమి ఉపకారము చేయవలెను?'' శర్మిష్ఠ: ''రాజా! నన్ను అధర్మము అంటకుండ కాపాడుము. ధర్మ ఫలము నాకు ఇమ్ము. నీవలన సంతానవతినై నేను లోకమున ఉత్తమ ధర్మము నాచరించగలుగవలయును. రాజా! భార్య-దాసుడు-సుతుడు- ఈ ముగ్గురును తమకు తమ ధనము మీదగాని తమమీదగాని స్వత్వమును స్వాతంత్ర్యమును లేనివారు. వీరు ఎవరిని ఆశ్రయించినచో-అనగా వీరు ఎవరి ధనమైనచో-వీరును వీరును వీరి ధనమును-ఆ భార్య-దాసుడు-సుతుడు-అను ముగ్గుర స్వామికి చెందియుండును. ఇక్కడనో-దేవయాని నీ భార్యకదా! ఆమెకు తనపై స్వత్వము లేదు. ఆమె నీ యధీనమునందలిది. నేనామెకు దాసిని. కనుక నేనును నీ స్వాధీనమునందుండి నీవనుభవింప దగినదాననే. ఈ హేతువులచే నన్ను నీవన్ని విధముల భరించవలసిన వాడవే. (నేను భరింపబడవలసిన దానను. భరింపబడునది భార్య. కావున నేనును నీకు భార్యనే.) కనుక నన్ను పొందుము.''

యయాతి రాజు శర్మిష్ఠ చెప్పినది నిజమే యనెను. ఆమెధర్మజ్ఞతను అతడు మెచ్చుకొనెను. ఆమెకు ధర్మమును దానముగా ఇచ్చుటకు అంగీకరించెను. అతడామెతో సంగమించెను. తమతమ కోరికలను ఇరువురును తీర్చుకొనిరి. ఒకరినొకరు మెచ్చుకొనిరి. ఎవరిత్రోవను వారు పోయిరి. ఈ సమాగమముతో వృషపర్వ పుత్త్ర శర్మిష్ఠ ఆ రాజశ్రేష్ఠుని వలన ప్రథమముగా గర్భవతియయ్యెను. యథాకాలమున ఆ పద్మలోచనకు కుమారుడు కలిగెను. వాడు దేవకుమారుడు వలెనుండెను. అతని వర్చస్సు ఆదిత్యుని వర్చస్సులవె నుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున శర్మిష్ఠా యయాతి

సంవాద (సమాగమ) మను ముప్పదియొకటవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters