Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుస్త్రింశో7ధ్యాయః.

పూరుపట్టాభిషేచనమ్‌.

శౌనకః : 

ఏవ ముక్త స్స రాజర్షిః కావ్యం స్మృత్వా మహావ్రతమ్‌ | సఙ్క్రామయామాస జరాం తదా పుత్త్రే మహాత్మని. 1

పౌరవేణాథ వయసా యయాతి ర్నహుషాత్మజః | ప్రీతియుక్తో నరశ్రేష్ఠ శ్చచార విషయా న్ప్రియాన్‌. 2

యథాకామం యథోత్సాహం యథాప్రీతి యథాసుఖమ్‌ | ధర్మావిరుద్ధం రాజేన్ద్రో యథా7ర్హతి స ఏవ హి. 3

దేవా న్దేవార్హణౖ ర్యజ్ఞై శ్ర్శాద్ధైరపి పితామహా& | దీనా ననుగ్రహై రిష్టైః కామైశ్చ ద్విజసత్తమాన్‌. 4

అతిథీ నన్నపానైశ్చ విశశ్చ ప్రతిపాలనైః | ఆనృశంస్యేన శూద్రాంశ్చ దస్యూ న్నిగ్రహణన చ. 5

ధర్మేణచ ప్రజా స్సర్వా యథావ దనురఞ్జయ& | యయాతిః పాలయామాస సాక్షా దిన్ద్ర ఇవాపరః. 6

స రాజా సింహివిక్రాన్తో యువా విషయగోచరః | అవిరోధేన ధర్మస్య చచార సుఖ ముత్తమమ్‌. 7

స సమ్ర్పాప్య సుఖం కామా& తృప్తః ఖిన్నశ్చ పార్థివః | కాలం వర్షసహస్రంతు సస్మార మనుజాధిపః. 8

పరిచిన్త్య స కాలజ్ఞః కాలాకాంక్షీ చ వీర్యవా& | పూర్ణం మత్వా స తం కాలం పూరుం పుత్త్ర మువాచహ. 9

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి | హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. 10

యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్స్రియః|*ఏకస్యాపి న పర్యాప్తం తస్మా త్తృష్ణాం పరిత్యజేత్‌.

యథాసుఖం యథోత్సాహం యథాకామ మరిన్దమ | సవితా విషయాః పుత్త్ర ¸°వనేన మయా తవ. 11

పూరో ప్రీతో7స్మీ భద్రంతే గృహాణదం స్వ¸°వనమ్‌ |

రాజ్యం చైవ గృహాణదం త్వం హి మే ప్రియకృత్సుతః. 13

శౌనకః : ప్రతిపేదే జరాం రాజా యయాతి ర్నా హుషస్తదా |

¸°వనం ప్రతిపేదేచ పూరు స్స్వం పునరాత్మజః. 14

ముప్పది నాలుగవ అధ్యాయము.

యయాతికి ¸°వనప్రాప్తి-పూరు రాజ్యాభిషేకము.

శౌనకుడు శకానీకునకు ఇంకను ఇట్లు చెప్పెను: రాజర్షియగుయయాతి (తన కుమారుడగు) పూరుని సమాధానము విని (లోగడ శుక్రుడు చెప్పియున్నట్లు) మహావేదవ్రత సంపన్నుడగు కావ్యుని-శుక్రుని- స్మరించి మహాత్ముడగు (మహామనస్కుడగు) పూరునియందు తన ముసలితనమును వ్యాపింపజేసెను. పూరుని ¸°వనముతో తాను తన యోగ్యతకు తగినట్లును తన కామమును ఉత్సాహమును ప్రీతిని సుఖమును అనుసరించియు ధర్మమునకు అవిరుద్ధముగా తనకు ప్రియములగు విషయనుఖములను అనుభవించి ప్రీతియుక్తుడయ్యెను. దేవతలను వారికి అర్హములగు యజ్ఞములతోను పితరులను శ్రాద్ధములతోను దీనులను అనుగ్రమములతోను ద్విజనత్తములను వారికిష్టములగు కోరికలను తీర్చుటతోను అతిథులను అన్న పానములతోను వైశ్యులను వాణిజ్యము కని పెట్టి చూచుటతోను శూద్రులను కరుణా భావనముతోను దొంగలను దోపిడి గాండ్రను నిగ్రహణము (దండించుట) తోను ప్రజలను అందరను ధర్మముతోను ఎవరికి తగినట్లు వారిని అనురంజింప (తృప్తినంద) జేయుచు సాక్షాత్‌ రెండవ ఇంద్రుడువలె యయాతి పాలించుచుండెను. ఆ రాజు సింహమువలె విక్రమము చూపుచు యువకుడై విషయ సుఖముల ననుభవించుచునే ధర్మమునకు అవిరుద్ధముగా ఉత్తమమగు సుఖమును అనుభవించెను. ఆ యయాతి రాజు సుఖముగా ఆ యా కోరికలను అనుభవించి తృప్తి పొందెను. పొందుటతోపాటే వాటి విషయమున (ఇవి ఎందులకు? ఎన్నాళ్ళు? అని) ఖేదముకూడ పొందెను. ఇంతలో వేయిఏండ్ల గడచెను. అత డదికూడ జ్ఞాపకము చేసికొనెను. అతడు కాలమును కాలతత్త్వమును ఎరిగినవాడు కావునను వీర్యవంతుడైనను కాలము ఎప్పుడెప్పుడు ముగియునా అని ఎదురు చూచుచున్న వాడు కావునను తాననిన వేయిఏండ్ల కాలము ముగిసెనని గుర్తించి పుత్త్రుడగు పూరునితో ఇట్లు పలికెను: ''కామము కామములను అనుభవించుటచే ఎన్నటికిని ఉపశమించదు. హవిస్సుతో అగ్నివలె ఇంకను పెరుగుచునేయుండును. పుడమి మొత్తముపై గల వరియు యవలును బంగారును పశువులును స్త్రీలును అన్నియు కలిసినను ఒక్కనికి కూడ చాలవు. కావున తృష్టను విడువవలెను. (అన్ని విధములగు) శత్రువులను అణచినవాడా! నేను నా సుఖమునకు కామమునకు ఉత్సాహమునకు తగినట్లు నేను నీ ¸°వనముతో విషయసుఖముల ననుభవించితిని. ఇందు నీ యోగ్యత నాకు ఇంత ప్రీతి కలిగించినది. ఇదిగో! నీ ¸°వనము తీసికొనుము. ఇదిగో! రాజ్యము కూడ తీసికొనుము. ఏలయన నాకు ప్రీతి కలిగించు పుత్త్రుడవు నీవు.''

ఇట్లు పలుకుచునే యయాతి తన వార్ధకమును తీసికొనెను. పూరునకు తన ¸°వనము మరల లభించెను.

రాజ్యే7 భిషేక్తుకామం తం పూరుం పుత్త్రం కనీయసమ్‌ | బ్రాహ్మణ ప్రముఖావర్ణా ఇదం వచన మబ్రువన్‌.

యయాతిపౌరసంవాదః.

ప్రకృతయః : కథం శుక్రస్య దౌహిత్రం దేవయాన్యా స్సుతం ప్రభో |

జ్యేష్ఠం యదు మతిక్రమ్య రాజ్యం పూరోః ప్రదాస్యసి. 16

జ్యేష్ఠో యదు స్తవ సుత స్తుర్వసు స్తదనన్తరః | శర్మిష్ఠాయా స్సుతో ద్రుహ్యు స్తథా7నుః పూరురేవచ. 17

కథం జ్యేష్ఠ మతిక్రమ్య కనీయా న్రాజ్య మర్హతి |

ఏత త్సమ్బోధయామ స్త్వాం ధర్మం త్వ మనుపాలయ. 18

యయాతిః : బ్రాహ్మణప్రముఖా వర్ణా స్సర్వే శృణ్వన్తు మే వచః |

జ్యేష్ఠం ప్రతి యథారాజ్యం న దేయం మే కథఞ్చన. 19

మమ జ్యేష్ఠేన యదునా నియోగో నానుపాలితః | ప్రతికూలః పితుర్యశచ్చ న స పు త్త్ర స్సతాం మతః. 20

మాతాపిత్రోర్వచనకృ ద్ధితః పథ్యశ్చ య స్సుతః | స పుత్త్రః పుత్త్రవర్యశ్చ వర్తతే పితృమాతృషు. 21

యదునా7హ మవజ్ఞాత స్తథా తుర్వసునాపిచ | ద్రుహ్యునా చానునా చైవ మయ్యవజ్ఞా కృతా భృశమ్‌. 22

పూరుణా మే కృతం వాక్యం మానితంచ విశేషతః |

కనీయా న్మమ దాయాదో జరా యేన ధృతా మమ. 23

మమ కామ స్సచ కృతః పూరుణా పుత్త్రరూపిణా | శుక్రేణచ వరో దత్తః కావ్యేనోశనసా స్వయమ్‌. 24

పుత్త్రోయ స్త్వనువర్తేత స రాజా పృథివీపతిః | భవన్తః ప్రతిజానన్తు పూరూ రాజ్యే7భిషిచ్యతామ్‌. 25

ప్రకృతయః : యః పుత్త్రో గుణసమ్పన్నో మాతాపిత్రో ర్హిత స్సదా |

సర్వశో7ర్హతి కల్యాణం కనీయానపి స ప్రభుః. 26

అర్హః పూరు రిదం రాజ్యం యః ప్రియః ప్రియకృత్తవ| వరదానేన శుక్రస్య న శక్యం వక్తు ముత్తరమ్‌. 27

శౌనకః : పౌరజానపదై స్తుష్టై రిత్యుక్తో నాహుషస్తదా |

అభిషిచ్య తతః పూరుం రాజ్యే స్వం సుత మాత్మజమ్‌. 28

దత్వాచ పూరవే రాజ్యం వనవాసాయ దీక్షితః | పురాత్స నిర్య¸° రాజా బ్రాహ్మణౖ స్తాపసై స్సహ. 29

యదోస్తు యాదవా జాతా స్తుర్వసో ర్యవనా స్సుతాః | ద్రుహ్యోస్సుతావై భోజాస్తు అనోస్తు వ్లుెచ్ఛజాతయః.

పూరోస్తు పౌరవో వంశో యత్ర జాతో7సి పార్థివ| ఇదం వర్షసహస్రం యో రాజ్యం కా రయితుం వశీ. 31

ఇతి శ్రీమత్స్యమమాపురాణ శౌనకశతానీక సంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే చతుస్త్రింశో7ధ్యాయః.

పూరుడు కడసారి కుమారుడే యైనను యయాతి అతనికే తన రాజ్యము నీయదలచెను. అది తెలిసి బ్రాహ్మణులు మొదలగు ఆయా వర్ణములవారు ఈ విధముగా పలికిరి: ''ప్రభూ! శుక్రునికి దౌహిత్రుడును దేవయానికి కుమారుడును కొడుకులలో పెద్దవాడును అగు యదుని విడిచరి రాజ్యమును పూరున కిచ్చుచున్నావు. ఇది ఎట్లు? క్రమముచే యదువు మొదటివాడు. తుర్వసుడు రెండవవాడు. శర్మిష్ఠ కుమారులలో ద్రుహ్యుడు అనుడు పూరుడు అనువారు క్రమముగా కుమారులు. పెద్ద వానిని విడిచి కడసారి వాడు రాజ్యమునకు ఎట్లు అర్హుడగును? ఇది నీకు తెలియజేయుచు హెచ్చరించుచున్నాము. నీవు ధర్మమును అనుపాలనము చేయుట మంచిది.''

యయాతి: ''బ్రాహ్మణులు మొదలగు సర్వవర్ణములవారు అందరును నామాట వినగోరుచున్నాను. పెద్దవానికి ఏవిధముగను రాజ్యము ఈ యగూడని హేతువును చెప్పెదను. యదువు నా పెద్దకొడుకు అయి ఉండియు నానియోగమును అనుపాలించలేదు. అదియుకాక తండ్రికి ప్రతికూలుడగు పుత్త్రుడు పుత్త్రుడు కాడని విజ్ఞుల తలపు. తల్లిదండ్రులమాట పాటించుచు వారికి హితుడు అనుకూలుడు ఐయుండు కుమారుడే పుత్త్రుడును పుత్త్రులలో శ్రేష్ఠుడును ఐ తల్లిదండ్రులకు దగ్గర వాడై యుండును. యదువు తుర్వసుడు ద్రుహ్యుడు అనువు ఈ నలుగురును నన్ను లెక్క సేయలేదు. పూరుడు మాత్రము నామాటను అధికమగు ఆదరముతో పాటించినాడు. నాజరను తాను మోసికొనిన పూరుడే చిన్న వాడైనను నా ఆస్తిని అనుభవించుటకు అధికారి. పుత్త్రులలో మేటియై అతడే నాకోరికను తీర్చినాడు. అదికాక కవి మునికి కుమారుడు అగు ఉశనసుడు (శుక్రుడు) స్వయముగా ''నిన్ను అనువ ర్తించు కుమారుడే నీతరువాత రాజు కాదగినవాడు.'' అని వరమును ఇచ్చియున్నాడు. కావున పూరుని రాజ్యమునం దభిషేకము చేయుటకు మీకభ్యంతరము లేదను విషయము స్పష్టముగా చెప్పగోరుచున్నాను.'' ప్రకృతులు (పౌరులు జానపదులు అగు ప్రజాజనము): ''గుణ సంపన్నుడు మాతాపితరులకు ఎల్లప్పుడు మేలు సేయువాడు అగుకొడుకే ప్రతియొక విధమునను శుభమును పొంద అర్హుడు. కడగొట్టువాడైనను అతడే ప్రభువు. నీకు ప్రియము నాచరించి నీ ప్రీతికి పాత్రుడై నందున పూరుడే ఈరాజ్యమునకు అర్హుడు. ఈ విషయమున శుక్రుని వరదానము కూడ ఇట్లే యుండుటచేత మరేమియు పైమాట మేము చెప్పు నవకాశము లేదు.''

పౌరులును జానపదులును నగు ప్రజాజనము సంతుష్టులై ఇట్లు పలుకగానే యయాతి పూరుని తన రాజపదమునం దభిషేకించెను. అతనికి తన రాజ్యమును అప్పగించెను. వనవాసమునకై దీక్ష తీసికొనెను. బ్రాహ్మణులును తాపసులును వెంటరాగా పురమును వెలువడి వనమున కేగెను.

యదుని సంతతివారు యాదవులును తుర్వసుని సంతతివారు యవనులును ద్రుహ్యుని సంతతివారు భోజ జాతీ యులును అను సంతతివారు వ్లుెచ్ఛ జాతులవారునునైరి. పూరుని సంతతివారు పౌరవులని ప్రసిద్ధి నొందిరి. ఈ వంశమునందే నీవు (శతానీకుడు) జనించి వేయి ఏండ్లపాటు రాజ్యము నేలువాడ వయినావు.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున

పూరురాజ్యాబిషేకమను ముప్పది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters