Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తత్రింశో7ధ్యాయః.

యయాత్యష్టకసంవాదః.

ఇన్ద్రః : సర్వాణి కర్మాణి సమాప్య రాజ న్గృహా న్పరిత్యజ్య వనం గతో7సి |

పృచ్ఛామి త త్త్వం నహుషస్య పుత్త్ర | కో7న్యస్తుల్య స్తపసా తే యయాతే. 1

యయాతిః : నాహం దేవమనుష్యేషు న గన్ధర్వమహర్షిషు |

ఆత్మన స్తపసా తుల్యం కఞ్చి త్పశ్యామి వాసవ. 2

ఇన్ద్రః : యదా7వమంస్థాః సదృశ శ్శ్రేయసశ్చ పాపీయస శ్చా7విదితప్రభావః |

తస్మా ల్లోకా హ్యన్తవన్త స్తవేమే క్షీణ పుణ్య పతితో 7స్యద్య రాజన్‌. 3

యయాతిః : సురర్షి గన్ధర్వనరావమానా తక్షయం గతా మే యది శక్ర లోకాః |

ఇచ్ఛేయం త త్సురలోకా ద్విహీన స్సతాం మధ్యే పతితుం దేవరాజ. 4

ఇన్ద్రః : సతాం సకాశే పతితో7 సి రాజం శ్చ్యుతః ప్రతిష్ఠాం యత్ర లబ్ధా7 సి భూయః |

ఏవం విదిత్వా తు పునర్యయాతే న తే7 వమాన్యా స్సదృశా శ్శ్రేయసశ్చ. 5

శౌనకః : తతః ప్రహాయామరరాజజుష్టా త్పుణ్యా ల్లోకా త్పాత్యమానం యయాతిమ్‌ |

నమ్ప్రేక్ష్య రాజర్షివరో7ష్టక స్త మువాచ వై ధర్మనిదాన గోప్తా. 6

అష్టకః : క స్త్వం యువా వాసవతుల్య రూప స్స్వతేజసా దీప్యమానో యథా7 గ్నిః |

పత స్యుదీర్ణామ్భుధరాన్ధకారా త్ఖాత్ఖేచరాణాం ప్రవరో యథా7 ర్కః. 7

దృష్ట్వా చ త్వాం స్వర్గపథా త్పతన్తం వైశ్వానరార్కద్యుతి మప్రవేయమ్‌ |

కిన్నుస్వి దేత త్పతతీతి సర్వే వితర్కయస్తః పరిమోహితా స్స్మః. 8

దృష్ట్వాచ త్వా7ధిష్ఠితం దేవమార్గే మత్వా7ర్కవిష్ణుప్రతిమప్రభావమ్‌ |

ప్రత్యుద్గతా స్త్వాం వయమేవ సర్వే త త్త్వం పాతే తవ జిజ్ఞాసమానాః. 9

న వా7పి త్వాం ధృష్టవః ప్రష్టు మగ్రే న చ త్వ మస్మా స్పృచ్ఛసి కే వయం స్మః |

తత్త్వాం పృచ్ఛామి స్పృహణీయరూపం కస్య త్వం వాకింనిమిత్తం త్వ మాగాః. 10

భయం తు తే వ్యేతు విషాదమోహౌ త్యజాశు దేవేంద్రసమానరూప |

త్వాం వర్తమానం హి సతాం సకాశే నాలం ప్రసోఢుం బలహా7పి శక్రః. 11

సస్తః ప్రతిష్ఠా ద్యుసుఖచ్యుతానాం జయన్తి దేవామరరాజకల్ప |

తే సఙ్గతా స్థ్సావరజఙ్గమేశాః ప్రతిష్ఠిత స్త్వం సదృశేషు సత్సు. 12

ప్రభు రగ్నిః ప్రతపనే భూమి రావపనే వ్రభుః | ప్రభు స్సూర్యః ప్రకాశేచ సతాం చాభ్యాగతః ప్రభుః. 13

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే సప్తత్రింశో7ధ్యాయః.

ముప్పది ఏడవ అధ్యాయము

యయాతి స్వర్గభ్రంశము-యయాత్యష్టక సంవాదము.

ఇంద్రుడు యయాతితో ఇట్లనెను: ''నహుషపుత్త్రా! యయాతి రాజా! గృహస్థుడుగా సర్వకర్మములను ముగించుకొని గృహములను విడిచి వానప్రస్థుడవయి వనమును చేరుకొంటివి. అందువలన నిన్నడుగుచున్నాను. తపస్సుచే నీకు సమానుడు మరి ఎవ్వరో చెప్పుము. యయాతి: ''వాసవా! దేవతలు మనుష్యులు గంధర్వులు మహర్షులు- ఈ ఎవ్వరి యందును తపస్సుచే నాకు సమానుడు మరి ఎవ్వడును కనబడడు.'' ఇంద్రుడు: ''నీవు వారివారి వైయ క్తిక ప్రభావమును ఎరుగకయే సమానులను అధికులను హీనులను కూడ అవమానించినావు. కావున ఇవిగో! ఈ నీలోకములన్నియు అంత వంతములు (ముగిసిపోయినవి) అగుచున్నవి. ఇప్పుడే పడిపోవుచున్నావు.'' యయాతి: ''సురలను ఋషులను గంధర్వులను నరులను అవమానించినందున నాలోకములన్నియు క్షీణములయినచో ఇంద్రా! సురలోకమునుండి జారిపడియు సత్‌ జనుల నడుమ పడగోరుచున్నాను.'' ఇంద్రుడు: ''యయాతిరాజా! నీవు జారియును సత్‌ జనుల నడుమనే పడుచున్నావు. మరల వారివలననే నిలుకడను పొందగలవు. ఈ విషయమును గుర్తునందుంచుకొని మరల ఎప్పుడును సమానులనుగాని అధికులనుగాని అవమానింపకుము.''

అంతట దేవేంద్రుడే సాఓఆత్‌ అనుభవించు పుణ్యలోకమునుండి పడద్రోయబడుచున్న యయాతిని చూచి రాజర్షి వరుడును ధర్మమునకు మూలత త్త్వమును (వేదమును వేదమార్గమును) రక్షించువాడునగు అష్టకుడు అతనితో ఇట్లనెను: ''నీవు ఎవరవు? యువకుడవు. ఇంద్రుని రూపమువంటి రూపముతో నున్నావు. స్వతేజముతో అగ్నివలె ప్రకిశించుచున్నావు. మేఘావరణముచే విజృంభించిన అంధకారముతో నిండిన ఆకాశమునుండి గ్రహ శ్రేష్ఠుడగు సూర్యుడు వలె పడుచున్నావు. అగ్ని వలెను అర్కునివలెను ద్యుతి కలిగి ఇంతటివాడవు అన నలవికాని నీవు స్వర్గపథమునుండి పడుచుండుట చూచి ఈ పడుచున్నది ఏమియో అని అందరమును పరిమోహితులము (ఏమియు తెలియనివారము) అగు చున్నాము. స్వర్గమార్గము నధిష్ఠించియున్న నీవు రవి విష్ణుల ప్రభావమువంటి ప్రభావము కలిగియున్నావు. ఇట్టి నీవు పడుటకు కారణమగు తత్త్వము ఎరుగగోరి మేమందరమును లేచి నీకు ఎదురు వచ్చుచున్నాము. నిన్ను మేమే మొదట ప్రశ్నించుటకు సాహసించలేకున్నాము. నీవో- మమ్ములను మీరెవ్వరని అడుగుటయులేదు. కావున ముచ్చటగొలుపు రూపముగల నిన్ను నేనే ముందుగా ప్రశ్నించుచున్నాను. నీవు ఎవ్వరివాడవు? ఎందులకె నీవు వచ్చితివి? దేవేంద్ర సమాన రూపుడవు-గాని నీవు సామాన్యుడవుకావు. నీవు ఏమాత్రమును భయమును విషాదమును మోహమును (ఏమి చేయుటకును తోచకుండుటను) విడువుము. నీవిపుడు సత్‌జనుల దగ్గర నున్నావు. ఇంద్రుడు బలాసురునంతటివానిని చంపినవాడే అగుగాక! ఇట్టి నిన్ను అతడును ఏమియు ఎదిరింపజాలడు. అదియుగాక స్వర్గముఖమునుండి భ్రంశమునొందిన వారికి నిలుకడ చోటయి సత్‌జనులు వర్ధిల్లుచున్నారు. నీవో-దేవులతో దేవరాజుతో సమానుడవు. సజ్జనులును సత్‌ జనులును ఒకచోట పరస్పరము కలిసినచో స్థావరజంగమరూపమగు ప్రపంచమునకెల్ల ప్రభువులై దానిని రక్షించగలరు. నీవు ఇపుడు నీకు సాటివారగు సత్‌జనుల (మైనమా) యందు నిలుకడ పొందినావు. (కనుక భయపడకుము. చింతింపకుము.) వేడిమినిచ్చుటలో అగ్నియు బీజములను విత్తుటకు అనుకూలమగుటలో భూమియు ప్రకాశమునిచ్చుటలో రవియు అబ్యాగతులకు ఆశ్రయమునిచ్చుటలో సజ్జనులను సమర్థులు.''

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాతికి

స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము అను ముప్పది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters