Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్విచత్వారింశో7ధ్యాయః.

యయాతిచరిత సమాప్తిః.

వసుమా& : పృచ్ఛా మ్యహం వసుమా నౌషదశ్వి ర్యద్యస్తి లోకో దివి మహ్యం నరేన్ద్ర |యద్యన్తరిక్షే ప్రథితో మహాత్మ& క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే. 1

యయాతిః : యద న్తరిక్షే పృథివీ దిశశ్చ యత్తేజసా తపతే భానుమాంశ్చ |

లోకా స్తావన్తో దివి సంస్థితా వై తే నా న్తవ న్తః ప్రతిపాలయన్తి. 2

వసుమా& : తాం స్తే దదామి మా ప్రపత ప్రపాతే యే మే లోకా స్తవ తే వై భవన్తు |

క్రీణీషై#్వతాం స్తృణకేనాపి రాజ న్ప్రతిగ్రహ స్తేయది సమ్య క్ర్పదుష్టః. 3

యయాతిః : న మిథ్యాహం విక్రమం వై స్మరామి వృథా గృహీతం శిశుకా చ్ఛఙ్కమానః |

కుర్యా న్న చైవాకృత పూర్వ మన్యై ర్విధిత్సమానో వసుమ న్న సాధు. 4

వసుమా& : తాన్త్స్వా న్లోకా న్ర్పతిపద్యస్వ రాజ న్మయా దత్తా న్యది నేష్టః క్రమ స్తే |

నాహం తాన్వై ప్రతిగన్తా నరేన్ద్ర సర్వే లోకా స్తావకా వై భవన్తు. 5

శిబిః : పృచ్ఛామి త్వాం శిబి రౌశీనరోహం మమాపి లోకా యది సన్తి తాత |

యద్యన్తరిక్షే యది వా దివి శ్రితాః క్షేత్రజ్ఞం త్వాం తస్య దర్మస్య మస్యే. 6

యయాతిః : య త్త్వం వాచా హృదయే వాపి విద్య న్పరీప్సమానా న్నావమంస్థా నరేన్ద్ర |

తేనాత్యన్తం దివి లోకా శ్శ్రితా స్తే విద్యు ద్రూపా స్స్వనవన్తో మహాన్తః. 7

శిబిః : తాం స్త్వం లోకా న్ప్రతిపద్యస్వ రాజ న్మయా దత్తా న్యది నేష్టః క్రయ స్తే |

నచాహం తా న్ప్రతిపత్య్సే7ద్య దత్వా యస్మి న్గత్వా నానుశోచన్తి ధీరాః. 8

యయాతిః : యథా త్వ మిన్ద్ర ప్రతిమ ప్రభావ స్తే చాప్యనన్తా నరదేవ లోకాః |

తథాద్య లోకే న రమే7న్యదత్తే తస్మా చ్ఛిబే నాభినన్దామి వాచమ్‌. 9

అష్టకః : న చే దేకైకశో రాజ లోకా న్నః ప్రతినన్దసి |

సర్వం ప్రదాయ భవతే గన్తారో నరకం వయమ్‌. 10

యయాతిః : యదర్హోహం త ద్వదధ్వం సన్త స్సత్యాదిదర్శినః |

అహం తు నాభిగృహ్ణామి య త్కృతం న మయా పురా. 11

అష్టకః : అలిప్సమానస్య తు మే యదుక్తం నత త్తథాస్తీవా నరేన్ద్రసింహ |

అస్య ప్రదానస్య యదేవ యుక్తం త త్త త్ఫలం తే భవితవ్యం భవిష్యమ్‌. 12

కసై#్యతే ప్రతి దృశ్యన్తే రథాః పఞ్చ హిరణ్మయాః | యా నారుహ్య నరా లోకా నభివాఞ్ఛన్తి శాశ్వతా&.

యయాతిః : భవతాం మమ చైవైతే రథా భాన్తి హిరణ్మయాః |

ఉచ్చై స్సన్తః ప్రకాశ##న్తే జ్వలన్త్యో7గ్నిశిఖా ఇవ. 14

ఆరుహ్యైతేషు గ న్తవ్యం భవద్భిశ్చ మయాష్టక !

నలువది రెండవ అధ్యాయము

అష్టక సోదరులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట.

వసుమాన్‌: ''మహాత్మా! నేను ఉషదశ్వుని కుమారుడను. నాపేరు పసుమాన్‌. నీవు ధర్మక్షేత్ర తత్త్వమును ఎరిగినవాడవను విశ్వాసముతో నిన్ను ప్రశ్నించుచున్నాను. నాకు అంతరిక్ష లోకములో కాని ద్యులోకములో కాని అనుభవింపదగిన పుణ్యలోకములు కలవా?'' యయాతి! ''సూర్యుడు తన తేజస్సుతో అంతరిక్షమునందును పృథివిమీదను దిక్కులను ఎంతమేర తపింప-ప్రకశింప -చేయుచున్నాడో ఆలోకములన్ని యును-అంత విస్తారము కలిగిన ద్యులోక స్థానములన్నియును అన న్తములైనవి నీవు అనుభవించదగినవి నీకు గలవు. అవి అన్నియు నీకొరకై ఎదురు చూచు చున్నవి.'' వసుమాన్‌: ''అయ్యా! నాకుగల లోకములన్నియు నీకు దత్తము చేయుచున్నాను. తీసికొనుము. ప్రపాతములో పడకుము. ఒకవేళ నీవు వాటిని ప్రతిగ్రహించుట దోషమని తలచినచో చిన్న గడ్డిపోచనైనను వెలగా ఇచ్చి తీసికొనుము.'' యయాతి: ''నేనెన్నడును మిథ్యా విక్రమముతో వస్తువును కొనినట్లు గాని పసివానినుండి ఆటలలోనైనను ఏ వస్తువును వెల ఈయక తీసికొన్నట్లుగాని స్మృతికి వచ్చుటలేదు. అట్టిది చేయుటకు నాకు భయము కలుగును. వివేకవంతుడనై యుండి నేను ఎవడును చేసియుండని పనిని చేయరాదు.'' వసుమాన్‌: ''నీకు క్రయము ఇష్టము కానిచో నేను స్వేచ్ఛతో ఇచ్చుచున్న ఆ నా లోకములనన్నిటిని తీసకొనుము. నానా లోకములకు ఎన్నటికిని పోదలచుటలేదు. ఆ లోకములన్నియు నీవే.'' శిబి: ''నేను ఉశీనరదేశాధిపతియగు శిబిని. నీవు ధర్మ తత్త్వజ్ఞుడవను నమ్మికతో నిన్నడుగు చున్నాను. అంతరిక్ష లోకములో కాని ద్యులోకములో కాని నాకు అనుభవించదగిన పుణ్యలోకములు గలవా?'' యయాతి: ''రాజా! నీవు యాచకులను ఎన్నడును వాక్కుతోగాని హృదయమున గాని అవమానింపలేదు. దానికి ఫలముగా నీకు ద్యులోకమునందు విద్యుద్రూపములును మనోహర ధ్వనితో (కీర్తితో) కూడినవియు అగు అనంతలోకములు కలవు. అవి చాల గొప్పవి.'' శిబి: ''బుద్ధిమంతులగు వారు ఏ లోకములకు పోయి దుఃఖము నెరుగక సుఖింతురో అట్టి నా లోకములన్నియు నీకు ఇచ్చుచున్నాను. నీకు క్రయము ఇష్టముకానిచో క్రయము లేకయే అవి తీసికొనుము.'' యయాతి: ''నీవు ఇంద్రునివలె మహా ప్రభావముకలవాడవు. నీ లోకములో!- అనన్తములైనవి. కాని ఇతరులు ఇచ్చినది అనుభవించుట నాకు ఆనందము కలిగించదు. కావున నీమాట నేను అంగీకరించజాలను.'' అష్టకుడు: ''మాలో ఒక్కొక్కరము వేరువేరుగా ఇచ్చిన పుణ్యలోకములను తీసికొనుట నీకు ఇష్టముకానిచో మేము అందరమును మా మొత్తము లోకములను మీకిచ్చి మేము నరకమునకు పోవుదుము.'' యయాతి: ''మీరు సత్యము మొదలగు ధర్మ తత్త్వమును ఎరిగినవారు. నేను దేనికి తగినవాడనో తెలుపుడు. నేను చేసియుండని పుణ్యఫలముల స్వీకరించుట మాత్రము నాకిష్టముకాదు.'' అష్టకుడు: ''అయ్యా! ఒకరు ఇచ్చినది తీసికొనుట మీకిష్టములేక ఇట్లనుచున్నారు. కాని అట్లనవలదు. మేము చేసిన ఈ దానమునకు ఎంత ఫలము కలదో అదియంతయు నీకే చెందునుగాక! ఇంతేకాక నరులను తమపై నెక్కించి కొని శాశ్వతలోకములకు తీసికొనిపోవు ఐదు బంగారు రథములు కనబడుచున్నవి. ఇవి ఎవరివి?'' యయాతి: ''మండెడు అగ్ని శిఖలవలె పైవైపునకు ప్రజ్వలించుచు ప్రకాశించెడు ఈ ఐదు బంగారు రథములును మీ కొరకును నా కొరకును వచ్చియున్నవి. అష్టకా! మనమైదుగురమును వీనిపై నెక్కి వెళ్లవలయును.''

అష్టకః : అతిష్ఠస్వ రథం రాజ న్విక్రమస్వ విహాయసా. 15

వయమ ప్యత్ర యాస్యామో యదా కాలో భవిష్యతి |

యయాతిః : సర్వై రిదానీం గన్తవ్యం సహ స్వర్గజితో వయమ్‌. 16

ఏష నో విరజాః పన్థా దృశ్యతే దేవసద్మనః |

శౌనకః : తే7ధిరుహ్య రథం సర్వే ప్రయాతా నృపతే నృపాః. 17

ఆక్రామన్తో దివం భాభి ర్ధర్మేనావృత్య రోదసీ |

అష్టకః : అహం మన్యే పూర్వ మేకోభిగన్తా సఖా చేన్ద్ర స్సర్వథా మే మహాత్మా. 18

కస్మా దేవం శిబి రౌశీనరోయం ఏకోత్యగా త్సర్వ వేగేన వాహాన్‌ |

యయాతిః : అదదా ద్దేవయానాయ యావ ద్విత్త మతన్ద్రతః. 19

ఉశీనరస్య పుత్త్రోయం తస్మా చ్ఛ్రేష్ఠో హి వశ్శిబిః |

దానం దమ స్సత్య మథో హ్యహింసా హ్రీ శ్ర్శీ స్తితిక్షా సతత మానృశంస్యమ్‌. 20

రాజ న్నేతా న్య ప్రమేయాణి రాజ్ఞి శిబౌ స్థితా న్యప్రతిమే సుబుద్ధ్యా |

ఏవంవృత్తం హ్రీనిషేధో బిభర్తి తస్మా చ్ఛిబి రగ్రగన్తా రథేన. 21

శౌనకః : అథాష్టకః పునరేవాన్వపృచ్ఛ న్మాతామహం కౌతుకా దిన్ద్రకల్పమ్‌ |

పృచ్ఛామి త్వాం నృపతే బ్రూహి సత్యం కుతశ్చ కశ్చాసి సుతశ్చ కస్య. 22

కృతం త్వయా యద్ధి న తస్య కర్తా లోకే త్వదన్యో బ్రాహ్మణః క్షత్త్రియో వా |

యయాతిః: యయాతి రస్మి నహుషన్య పుత్త్రః పూరోః పితా సార్వభౌమ స్త్విహా77సమ్‌. 23

గుహ్యం మన్త్రం మామకేభ్యో బ్రవీమి మాతామహోహం భవతాం ప్రకాశమ్‌ |

సర్వా మిమాం పృథివీం నిర్జిగాయ ప్రస్థే బద్ధ్వా హ్యదదం బ్రాహ్మణభ్యః. 24

మేధ్యా నశ్వా నేకశతా న్త్యురూపాం స్తదా దివః పుణ్యభాజో భవన్తి |

అదా మహం పృథివీం బ్రామ్మణభ్యః పూర్ణా మిమా మఖిలాం సర్వరత్నైః. 25

గోభి స్సువర్ణైశ్చ ధనైశ్చ ముఖ్యై స్తత్రాసఙ్గ శ్శతశ స్త్వర్బుదాని |

సత్యేన మే ద్యౌశ్చ వసున్ధరా చ తథైవ చాగ్ని ర్జ్వలతే మాను షేషు. 26

న మే వృథా వ్యాహృత మేవ వాక్యం సత్యం హి స న్తః ప్రతిపూజయన్తి |

సాధ్వష్టక ప్రబ్రవీమీహ సత్యం ప్రతర్దనం చౌషదశ్విం తథైవ. 27

సర్వే చ దేవా మునయశ్చ లోకా స్సత్యేన పూజ్యా ఇతి మే మనోగతమ్‌ |

యో న స్స్వయం స్వర్గజితాం యథావృత్తం నివేదయేత్‌. 28

అనసూయు ర్ద్విజా గ్రేభ్య స్స భ##జే న్న స్సలోకతామ్‌ |

శౌనకః: రాజ న్మహాత్మా స యయాతి రేవం సై#్వ ర్దౌహిత్రై స్తారితో మిత్రసాహః. 29

త్వక్త్వా మహీం పరమోదారకర్మా స్వర్గం గతః కర్మభి ర్వ్యాప్య పృథ్వీమ్‌ |

ఏవం సర్వం విస్తరతో యథావ దాఖ్యాతం తే చరితం నాహుషస్య. 30

వంశోయ మస్య ప్రథితిః కౌరవేయ యస్మి న్జాత స్త్వం యనుజేన్ద్రకల్పః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితం

నామ ద్విచత్వారింశో7ధ్యాయః. యయాతిచరితం సమాప్తమ్‌.

అష్టకుడు: ''రాజా! నీరథమును అధిష్ఠించుము. ఆకాశమార్గమున పైకి పొమ్ము. సమయము వచ్చినప్పుడు మేమును మా రథములెక్కి అక్కడకు వత్తుము.'' యయాతి: ''మనమందరమును ఒకేసారి స్వర్గమును జయించుకొంటిమి. కనుక అందరమును ఇప్పుడే పోవలయును. స్వర్గమునకు మీరు పోవలసిన నిర్మలమగు మార్గము కూడ ఇదుగో! కనబడుచున్నది.''

అంతట వారందరును తమతమ రథములను అధిరోహించి తమ ధర్మములతో ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును నింపుచు తమ కాంతులతో ద్యులోకమును క్రమ్మివేయుచు బయలుదేరిపోయిరి ''మహాత్ముడగు ఇంద్రుడు ఎల్ల హేతువులచే నాకే మిత్రుడనియు అందరలో నేనే మొదట స్వర్గమును చేరుదుననియు అనుకొనుచుంటిని. కాని ఇప్పుడు ఔశీనరుడగు ఈ శిబి సర్వవేగముతో మన రథములను దాటి తాను ముందుగా వెళ్ళినాడు. ఇట్లేల జరిగినది?'' అని అష్టకుడు యయాతిని ప్రశ్నించెను. యయాతి ఇట్లు పలికెను. ''ఔశీనరుడు శిబి తనకు ధనమున్నంత వరకు ఏ మాత్రమును వెనుకాడక దానము చేయుచునేయుండెను. అదియే ఇందులకు హేతువు. అతడు మన అందరలో శ్రేష్ఠుడు. దానము దమము సత్యము అహింస హ్రీ (సిగ్గు బిడియములు) శ్రీ (సంపదయు-ముఖమున కాంతి కలిగి ఉండుటయు) తితిక్ష (ద్వంద్వములను ఓర్చుట) ఆనృశంస్యము (క్రూరత లేకుండుట) ఈ సద్గుణములు శిబియందు ఆపరిమితములై యున్నవి. అతడు సాటిలేనివాడు. మంచి బుద్ధిశాలి (వివేకి). అదికాక బిడియపడుచు ఈ పని చేయరాదేమోయని వెనుకాడుట అనెడు గుణము ఈ పైచెప్పిన నడువడి కలవానిని కాపాడుచుండును. శిబి అట్టివాడు. కనుక అతడు తన రథమును మనకంటె ముందు నడుపుకొని పోగలిగెను.''

అంతట అష్టకుడు జిజ్ఞాసువై ఇంద్రతుల్యుడగు తన మాతామహుని ఇట్లు ప్రశ్నించెను: ''రాజా! నేను నిన్నొకటి అడుగుచున్నాను నిజము చెప్పుము. నీవు ఎక్కడి నుండి (ఏ వంశము నుండి) వచ్చినవాడవు? ఎవరవు? ఎవరి కుమారుడవు? ఏలయన నీవు చేసినంత సుకృతమును లోకమందు మరియే బ్రాహ్మణుడు కాని క్షత్త్రియుడు కాని చేసియుండలేదు.'' యయాతి:'' నన్ను యయాతి అందురు. నహుషుని కుమారుడను. పూరుని తండ్రిని. ఈ లోకమున సార్వభౌముడనైయుంటిని. స్వష్టముగా చెప్పుచున్నాను. మీకు మాతామహుడను. గుహ్యమగు మంత్రమును (తత్త్వమును) నా వారికి (మీకు) చెప్పుచున్నాను. ఈ భూమినంతటిని జయించితిని. శోభనమగు రూపము కలిగి అశ్వమేధమునకు యోగ్యములగు మంచి లక్షణములు కలిగిన అశ్వములను నూరిటిని ప్రస్థమునందు కట్టివేసి బ్రాహ్మణులకు దానముచేసితిని. అవి స్వర్గమును అనుభవించు పుణ్యమునకు పాత్రములయినవి. సర్వరత్నములతో గోవులతో బంగారములతో ముఖ్యములగు ఇతర ధనములతో నిండిన ఈ భూమినంతటిని నూర్లఅర్బుదముల సంఖ్యగల ధనములనుగా బ్రాహ్మణులకు దానము చేసితిని: నా సత్యముతో ద్యులోకముగాని భూమికాని మనుష్య లోకములందలి అగ్నికాని ప్రజ్వలించుచున్నవి. నేను వ్యర్థము అయథార్థమునగు వాక్యము ఏదియు పలుకనేలేదు. సజ్జనులు సత్యమును ఆదరింతురుగదా! అష్టకా! ప్రతర్దనా! వసుమన్‌! మీకందరకును చక్కగా సత్యము చెప్పుచున్నాను. సర్వ దేవులును సర్వ మునులును సర్వలోకములను సత్యముతో (సత్యశబ్దవాచ్యుడగు పరమాత్మ అను బుద్ధితో) పూజింపబడవలయును. అని నామనోగతమగు అభిప్రాయము. (ఇదియే యయాతి తన వారికి చెప్పదలచిన గుహ్య మంత్రము.)

స్వర్గమును స్వయముగా జయించిన మన ఈ వృత్తాంతమును అసూయా (దోషదృష్టి) రహితుడై ద్విజ శ్రేష్ఠులకు వినిపించు నట్టివాడు మనతో సాలోక్యమును పొందును.''

శౌనకుడు శతానీకునితో చివరకు ఇట్లు చెప్పెను: రాజా! మహాత్ముడగు యయాతి ఇట్లు తన దౌహిత్రులచే తరింపజేయబడెను. అతడు మిత్రసాహుడు (మిత్రులను గెలుచుకొనువాడు. ఇతరులకు తన యందు మైత్రికలుగునట్లు చేసికొను సుగుణములు కలవాడు.) ఉదారములగు కర్మలను ఆచరించినవాడు. అతడిట్లు భూమిని విడిచి తన కర్మలతో భూమియందంతటను వ్యాపించి తుదకు స్వర్గమును చేరుకొనెను.

ఇట్లు నీకు వి స్తరముగ యయాతి చరితమును యథాస్థితముగ చెప్పితిని. ఈ వంశము లోకమున ప్రసిద్ధిపొందినది. దానియందే నీవు జన్మించితివి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున

యయాత్యష్టకాది స్వర్గప్రాప్తియను నలువది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters