Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుశ్చత్వారింశో7ధ్యాయః.

అర్జునం ప్రతి ద్విజరూపసూర్యాగమనమ్‌.

ఋషయః : 

కిమర్థం తద్వనం దగ్ధం భార్గవస్య మహాత్మనః | కార్తవీర్యేణ విక్రమ్య సూత ప్రవద పృచ్ఛతామ్‌. 1

రక్షితా స తు రాజర్షిః ప్రజానా మితి న శ్శ్రుతమ్‌| స కథం రక్షితా భూత్వా ప్రాద త్త త్తపోవనమ్‌. 2

సూతః : ఆదిత్యో ద్విజరూపేణ కార్తవీర్యముపస్థితః | తృప్తి మేకాం ప్రయచ్ఛస్వ ఆదిత్యోహం నరేశ్వర.

కార్తవీర్యః : భగవ న్కేన తే తృప్తి ర్భవిత్రీ వై దివాకర |

కీదృశం భోజనం దద్మి శ్రుత్వా తు విదధామ్యహమ్‌. 4

ఆదిత్యః : స్థావరం దేహి మే సర్వ మాహారం దదతాం వర |

తేన తృప్తొ భ##వేయం వైసా మే తృప్తిర్హ పార్థివ. 5

కార్యవీర్యః న శక్యా స్థావరా సర్వే తేజసా చ బలేనచ

నిర్దగ్దుం తపతాం శ్రేష్ఠ త్వామేవ ప్రణమా మ్యహమ్‌. 6

ఆదిత్యః : తుష్ట స్తే7హం శరా& దాస్యా వ్యక్షయా న్త్సర్వతోముఖా& |

యే ప్రక్షిప్తా జ్వలిష్యన్తి మమ తేజస్సమన్వితాః. 7

అవిష్టా మమ తేజోభి శ్శోషయిష్యన్తి స్థావరాన్‌ | శుష్కా న్భస్మీ కరిష్యామి తేన తృప్తి ర్నరాధిప. 8

సూతః : తత శ్శరాం స్తదాదిత్య స్త్వర్జునాయ ప్రయచ్ఛత |

తతో దదాహ సమ్ప్రాప్తా& స్థావరా న్త్సర్వమేవ చ. 9

తథా గ్రామాశ్రమాంశ్చైవ ఘోషాణి నగరాణి చ | తపోవనాని రమ్యాణి వనాన్యుపవనాని చ. 10

ఏవం సర్వం సమదహ త్తత స్సర్వాంశ్చ పక్షిణః | నిర్వృక్షా నిస్తృణా భూమిః కృతా ఘోరేణ తేజసా. 11

ఏతస్మిన్నేవ కాలే తు *భార్గవో జల మాస్థితః | దశవర్షసహస్రాణి తత్రాస్తే స మహానృషిః. 12

పూర్ణే వ్రతే మమాతేజా ఉదతిష్ఠ త్తపోధనః | సో7పశ్య దాశ్రమం దగ్ధ మర్జునేన మహామునిః. 13

క్రోధా చ్ఛశాప రాజర్షిం కీర్తితం వో యథా మయా | క్రోష్టోః కృణ్విహ రాజేన్ద్ర వంశ ముత్తమపూరుషమ్‌.

యస్యాన్వయే7 సమ్భూతో విష్ణు ర్వృష్ణికులోద్వహః |

నలువది నాలుగవ అధ్యాయము

కార్త వీర్యార్జున కథాశేషము-క్రోష్టువంశ కథనము.

ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: కార్తవీర్యుడు ప్రజారక్షకుడని వినియుంటిమి. అటువంటివాడు విక్రమము చూపి మహాత్ముడగు భార్గవముని వనము నేల దహించెను?

సూతుడు ఋషులతో నిట్లు చెప్పనారంభించెను: ఆదిత్యుడు విప్రరూపమున కార్తవీర్యుని కడకువచ్చి'నేనాదిత్యుడను. నాకు తృప్తి కలిగించుము.' అని కోరెను. నీకు దేనిచే తృప్తి కలుగును? నీ కెట్టి భోజనము కావలెనో తెలిసిన నది ఏర్పరతునని కార్తవీవీర్యుడన నాకు స్థావర రూపమగు ఆహారమునేదైన నిమ్ము. దానిచే తృప్తి కలుగునని ఆదిత్యుడు పలికెను. వేడిమినిచ్చు వారిలో శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము. నీ తపస్సుచే కాని బలముచే కాని స్థావరములన్నిటిని కాల్చుట నాకు శక్యముకాదు. అని కార్తవీర్యుడన ఆదిత్యుడును నీ భక్తికి నీ మాటకు సంతోషించితిని. అక్షయములును సర్వతో ముఖములను (ఎటయిన ప్రసరించునవి) అగు బాణములు నీకిత్తును. అవి నీవు య్రోగించినపుడు వానియందు నా తేజస్సు ప్రవేశించి అవి మండి వృక్షాదిక స్థావరముల నెండించును. వాటిని నేను భస్మముచేసి తృప్తి పొందుదు ననెను. తరువాత నాతడు తానన్నట్లర్జునునకు శరములనిచ్చి వాటిమూలమున ఎండిన స్థావరములను కాల్చి వాటితోపాటు గ్రామములు ఆశ్రమములు పల్లెలు నగరములు రమ్యములగు తపోవనములు వనములు ఉపవనములు ఆయా తావులందలి పక్షులు మొదలగు అన్నింటిని కాల్చెను. సూర్యుని భయంకర తేజస్సుచే భూమిపై (అతడు కాల్చి నంతమేర వృక్షములు కాని గడ్డికాని లేకుండనయ్యెను. ఈ కాలమునందే భార్గవుడను మహాఋషి ఆ ప్రదేశమునందలి నీటిలో నుండి తపస్సాచరించుచుండెను. అతడు పదివేల యేండ్లు వ్రతము పూని తపస్సుచేసి అది ముగియగానే పైకి వచ్చిచూచెను. తన అశ్రమ మంతయు కార్తవీర్యుడు కాల్చెనని ఎరిగి క్రోధముపూని లోగడ చెప్పినట్లు ఆతనిని శపించెను.

ఇక క్రోష్టువంశము తెలిపెదను. దానియందన్ని తరములవారు నుత్తములు. ఆ వంశమందే వృష్టివంశ శ్రేష్ఠుడగు కృష్ణుడు జన్మించెను.

క్రోష్టుస న్తతిః.

క్రోష్ణొరే వాభవ త్పుత్త్రో వృజినీవా న్మహారథః.

వృజినీవతశ్చ పుత్త్రో7భూ త్స్వాహో నామ మహాబలః | స్వాహపుత్తోభవ ద్రాజా ఉషఙ్గో వదతాం వరః.

తతః ప్రసూతి మిచ్ఛన్వై ఉషఙ్గ స్యోగ్రమాత్మనః | చిత్రీ చిత్రరథశ్చాస్య పుత్త్రకర్మభి రన్వితః. 17

అథ చైత్రరథిర్వీరో జజ్ఞే విపులదక్షిణః | శశిబిన్దు రితి ఖ్యాత శ్చక్రవ ర్తీ బభూవ హ. 18

అత్రానువంశశ్లోకోయం గీత స్త్వస్మి న్పురా7భవత్‌ | శశిబిన్దోస్తు పుత్త్రాణాం శతానా మభవ చ్ఛతమ్‌. 19

ధీమతాం చాభిరూపాణాం భూరిద్రవిణతేజసామ్‌ | తేషామతిప్రధానానాంపృథుసత్త్వో మహాబలః. 20

పృథుశ్రవాః పృథుయశాః పృథుధర్మా పృథుఞ్జయః | పృథుకీర్తిః పృథుమనా రాజాన శ్శశిబిన్దవః. 21

శంసన్తి చ పురాణజ్ఞాః పృథుస త్త్వ మనుత్తమమ్‌ | అన న్తరం సుయజ్ఞశ్చ ప్రజ్ఞస్య తనయో7భవత్‌. 22

ఉశనా తు సుయజ్ఞస్య యో7రక్ష త్పృథివీ మిమామ్‌ | ఆజహారాశ్వమేధానాంశత ముత్తమధార్మికః. 23

తితిక్షు రభవ త్పుత్త్ర ఔశన శ్శత్రుతాపనః | మరున్త స్తస్య తనయో రాజర్షీణా మనుత్తమః. 24

ఆసీ న్మరున్తతనయో వీరః కమ్బళబర్హిషః | పుత్త్రస్తు రుక్మకవచో విద్వా న్కామ్బళబర్హిషః. 25

నిహత్య రుక్మకవచః పరా న్కవచధారిణః | ధన్వినో వివిధై ర్బాణౖ రవాప్య పృథివీ మిమామ్‌. 26

అశ్వమేదే దదౌ రాజా న్ర్బాహ్మణభ్యస్తు దక్షిణామ్‌ | యజ్ఞే స రుక్మకవచః కదాచి త్పరవీరహా. 27

జజ్ఞిరే పఞ్చపునత్త్రాస్తు మహావీర్యా ధనుర్భృతః | రుక్మేషుః పృథురుక్మశ్చ జ్యామేఘః పరిఘో హరిః. 29

పరిఘంచ హరించైవ విదేహే7స్థాపయత్పితా | రుక్మేషు రభవ ద్రాజా పృథురుక్మ స్తదాశ్రయః. 29

తేభ్యః ప్రవ్రాజితో రాజా జ్యామేఘో7థ యదాశ్రమే | ప్రశాన్త శ్చాశ్రమస్థశ్చ బ్రాహ్మణ నావబోధితః. 30

జగామ థను రాదాయ దేశ మన్యం ధ్వజీ రథీ | నర్మదాం నృప ఏకాకీ కేవలం వృత్తికామతః. 31

ఋక్షవన్తం గిరిం గత్వా7భుక్త మన్యై రుపావిశత్‌ | జ్వామేఘ స్యాభవ ద్భార్యా శైబ్యా పరిణతా సతీ. 32

అపుత్త్రో న్యవస ద్రాజా భార్యా మన్యాం న విన్దత | తస్యాసీ ద్విజయో యుద్ధే తత్ర కన్యా మవాప సః. 33

భార్యా తూవాచ సన్త్రాసా త్కైషా కన్యా సులోచనా | భార్యార్థేతు సమానీతా కథయస్వేతి లమ్పటా. 34

భార్యా మువాచ సత్రాసం న్ను షేయం తే సువిశ్రుతా | ఏవముక్తా బ్రవీ దేనం కస్య చేయం స్ను షేతి చ. 35

నాహం ప్రసూతా పుత్త్రేణ నాన్యా పత్న్యభవ త్తవ | స్నుషాసమ్బర్దక స్తేన కతమేన సుతేన తే. 36

జ్యామేఘః: యం త్వం జనిష్యసే పుత్త్రం తస్య భార్యా భవిష్యతి |

తస్మా త్సా తపసోగ్రేణ కన్యా యాం సమ్ర్పసూయతే. 37

పుత్త్రం విదర్భం సుభగా శైబ్యా పరిణతా సతి | రాజపుత్త్రౌ చ విద్వాంసౌ స్నుషాయాం క్రథకైశికౌ. 38

లోమపాదం తృతీయం తు పుత్త్రం పరమధార్మికమ్‌ |

తస్యాం విదర్భో7జనయ చ్ఛూరా న్రణవిశారదా&. 39

లోమపాదాత్మజః పుత్త్రో జ్ఞాతి స్తస్య చ ఆత్మజః |

కైశికస్య చిదిః పుత్త్ర స్తస్మా చ్చైద్యా నృపా స్స్మృతాః. 40

క్రథో విదర్భపుత్త్రస్తు కున్తి స్తస్యాత్మజో7భవత్‌ | కున్తే ర్వృష స్సుతో జజ్ఞే రణధృష్టః ప్రతాపవా&. 41

ధృష్టస్య పుత్త్రో ధర్మాత్మా నివృత్తిః పరవీరహా | పరిష్ఠో నివృతేః పుత్త్రో నామ్నా స తు విదూరథః. 42

విదూరథస్య పుత్త్రో7భూ ద్దశార్హోనామ వీర్యవాన్‌| దశార్హ పుత్త్రో వ్యోమస్తు వ్యోమా జ్జీమూత ఉచ్యతే|

జీమూతపుత్త్రో విమల స్తస్య భీమరథ స్స్మృతః. 43

సుతో భీమరథస్యాసీ త్స్మృతో నవరథః కిల | తస్య చాసీ ద్దృఢరథ శ్శకుని స్తస్య చాత్మజః. 44

తస్మా త్కరమ్భః కారమ్భో దేవరాతో బభూవ హ | దేవక్షత్త్రో7భవ ద్రాజా దేవరాతా న్మహాయశాః. 45

దేవగర్భసమో జజ్ఞే దేవనక్షత్రనన్దనః | మదు ర్నామ మహాతేజాః మధోః పురువసు స్తథా. 46

ఆసీ త్పురువసోః పుత్త్రః పురుద్వా న్పురుషోత్తమః | జన్తు ర్జజ్ఞే హ వైదర్భ్యం భద్ర సేన్యాం పురుద్వతః.

ఐక్ష్వాకీ చాభవ ద్భార్యా జంతో స్తస్యా మజాయత | సాత్వత స్సత్త్వంయుక్త స్సాత్వతాం కీర్తివర్ధనః. 48

ఇమాం విసృష్టిం విజ్ఞాయ జ్యామేఘస్య మహాత్మనః| ప్రజావానేతి సాయుజ్యం రాజ్ఞ స్సోమస్య ధీమతః. 49

క్రోష్టునికి మహారథుడగు వృజినీవాన్‌-అతనికి మహాబలుడగు స్వాహుడు-అతనికి పురుష శ్రేష్ఠుడగు ఉషంగుడు-అతనికి సార్థకనాముడగు చిత్రరథుడు-అతనికి వీరుడై విపుల దక్షిణలతో యజ్ఞముల చేసిన శశిబిందుడును కలిగిరి. అతడు గొప్ప చక్రవర్తి. అతనిగూర్చి అనువంశ శ్లోకము ఈ యర్థమును ఇచ్చునది కలదు. 'శశివబిందునకు నూరునూరుమంది (10000) కుమారులు కలరు. వారందరు చాల విద్వాంసులు సుందరులు. అధికమగు ధనమును తేజస్సును కలవారు. అతి ప్రధానులగు ఆశశిబిందు పుత్త్రులలో ముఖ్యులు-మహాబలుడగు పృథు సత్త్వుడు-పృథుశ్రవుడు - పృథుయవుడు - పృథు ధర్ముడు-పృథుంజయుడు-పృథుంజయముడు-పృథుకీ ర్తి-పీథుమనసుడు అనువారు. పృథుసత్త్వునకు ప్రజ్ఞుడు-అతనికి సుయజ్ఞుడు-అతనికి ఆశనుడు కలిగిరి. ఉశనుడు ఉత్తమ ధార్మికుడగు చక్రవ ర్తియై నూరశ్వమేధము లొనరించెను. అతనికి తితిక్షువు-అతనికి రాజర్షి శ్రేష్ఠుడగు మరుంతుడు అతనికి కంబళ బర్హి షుడు-అతనికి రుక్మకవచుడు కలిగిరి. ఈతడు యుద్ధమున కవచధారులగు శత్రులను ధనుర్ధరులను వివిధ బాణములతో చంపి భూమినంతటిని స్వాధీనము చేసికొని అదియంతయు ఒక యజ్ఞములో బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చెను. అతనికి మహావీర్యులు మహాధనుర్ధరులునగు రుక్మేషువు-పృథురుక్ముడు-జ్యామేఘడు-పరిఘుడు-హరి అను ఐదు మంది కుమారులు. వీరిలో పరిఘుని హరిని తండ్రి విదేశములకు పాలకులుగా పంపెను. రుక్మేషువు తండ్రిరాజ్యమునం దుండెను. పృథురుక్ముడు రుక్మేషు నాశ్రయించి యుండెను. వారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి జ్యామేఘుడు ప్రశాంతుడై ఒక యాశ్రమమందుండెను. ఒక బ్రాహ్మణుడు చేసిన బోధనముచే అతడు కేవలము జీవన వృత్తికై యుద్ధయు చేయదలచి రథమునెక్కి ధనువును ధ్వజమును దాల్చి ఏకాకియై నర్మదాతీర దేశమునకుపోయెను. అచ్చట ఋక్షవంతమను పర్వతము ఇతరుల అనుభవములో లేకుండుట చూచి అచ్చట నివాసము నేర్పరచుకొనెను. అతనికి గొడ్రాలగు శైబ్య అను పతివ్రత భార్య. ఐనను అతడు మరియొక పెండ్లి చేసికొనకుండెను. అతడు ఒక మారు యుద్ధములో ఒక సుందరియగు కన్యను గెలిచి తెచ్చెను. ఆమెను చూచి శైబ్య 'ఈ సులోచనయగు కన్య ఎవరు? భార్యగా చేసికొనదలచి తెచ్చితివా? నాకు కుమారులు లేరు కావున ఈమె మనకు కోడలుగాజాలదు. నీకుమరియొక భార్యయు ఆమెకు కుమారులునులేరు. ఈమె మనకెట్లు కోడలగును? అనగా అతడు నీకు పుట్టబోవు కొడుకునకీమె భార్యయగుననెను. అపుడామె ఉగ్రతపముచేసి జ్యామేఘుని వలన విదర్భుడను కుమారునికనెను. ఈ కన్య అతనికి భార్యయయ్యెను. విదర్భునకు ఈమెయందు క్రథుడుకై శికుడురోమపాదుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వీరిలో రోమపాదునకు మనువు అతనికి జ్ఞాతి-కుమారులు. కైశికునకు బది అనువాడు కుమారుడు. అతని వంశము వారికి చైద్యులని పేరు. క్రథడను వానికి కుంతి అతనికి వృషుడు-అతనికి ధృష్టుడు-అతనికి నివృత్తి-అతనికి విదూరథుడు-అతనికి విమలుడు-అతనికి భీమరథుడు-అతనికి నరరథుడు-అతనికి దృఢరథుడు-అతనికి శకుని-అతనికి కరంభుడు-అతనికి దేవరాతుడు-అతనికి దేవ క్షత్త్రుడు-అతనికి మధుడు-అతనికి పురువసుడు-అతనికి పురుద్వాన్‌-అతనికి విదర్భరాజ పుత్త్రియగు భద్రసేనియందు జంతుడు-అతనికి క్ష్వావాకురాజపుత్త్రియందు సాత్వతుడు కలిగిరి.

జ్యామేఘుని ఈ వంశవృద్ధిని వినినవాడు సంతానవృద్ధి కలిగి సోమునితో సాయుజ్యము పొందును.

సాత్వతా త్సత్త్వసమ్పన్నా త్కౌసల్యా సుషువే సుతా& |

భాగినం భజమానంతు దివ్యం దేవావృధం నృపమ్‌. 50

అన్ధకంచ మహాభోజం వృష్ణించ యదునన్దనమ్‌ | తేషాం సర్గాశ్చ చత్వారో విస్తరేణౖవ తాన్ఛృణు. 51

భజమానస్య సృఞ్జయ్యాం బాహ్యకాయాంచ బాహ్యకాః |

సృఞ్జయస్య సులే ద్వేతు బాహ్యకాస్తు తదా7భవ&. 52

తస్య భార్యే భగిన్యౌ ద్వే సుషువాతే బహూ న్త్సుతా& | నిమించ కీమిలం చైవ వృష్ణిం పరపురఞ్జయమ్‌.

తే బాహ్యకాయాం సృఞ్జయ్యాం భజమానా ద్విజజ్ఞరే | జజ్ఞే దేవావృధో రాజా బన్ధూనాం మిత్రవర్ధనః. 54

అపుత్త్ర శ్చాభవద్రాజా చచార పరమం తపః | పుత్త్ర స్సర్వగుణోపేతో మమ భూయా దితి స్పృహ&.

సంయోజ్య మన్త్రమేవాద్యం పర్ణాశాజల మస్పృశత్‌ | సదోపస్పర్శనా త్తస్య చకార ప్రియ మాపగా. 56

కల్యాణత్వా న్నరపతే స్తసై#్మ సా నిమ్నగోత్తమా | చి న్తయా7థ పరీతాత్మా జగామాథ వినిశ్చయమ్‌. 57

నాధిగచ్ఛా మ్యహం నారీం యస్యా మేవంవిధ స్సుతః |

జాయేత తస్మా దద్యాహం భవామ్యథ సహప్రజాః. 58

అథ భూత్వా కుమారీ సా బిభ్రతీ పరమం వపుః | జ్ఞాపయామాస రాజాసం తా మియేష మహావ్రతః. 59

అథ సా నవమే మాసి సుషువే సరితాం వరా | పుత్త్రం సర్వగుణోపేతం బభ్రుం దేవావృథాన్నృపాత్‌.

అనువంశే పురాణజ్ఞా గాయన్తీతి పరిశ్రుతాః | గుణా న్దేవావృధస్యాథ కీర్తయన్తో మహాత్మనః. 61

యథైవ శృణుమో దూరా త్సంపశ్యామ స్తథా7న్తికాత్‌ |

బభ్రు శ్శ్రేష్ఠో మనుష్యాణాం దేవై ర్దేవావృధ స్సమః. 62

పురుషాః పంచషష్టిశ్చ షట్సహస్రాణి చాష్ట చ |

ఏతే7మృతత్వం సమ్ర్పాప్తా బభ్రో ర్దేవావృధా న్నృపాత్‌. 63

యజ్ఞదానపతి ర్వీరో బ్రహ్మణ్య స్సుదృఢవ్రతః | రూపవా న్త్సుమహాతేజా శ్ర్శుతవీర్యదర స్తథా. 64

సురనాభస్య దుహితా సుషువే చతుర స్సుతా& | కుకురం భజమానం చ సాగ్నిం కమ్బళబర్హిషమ్‌. 65

కుకురస్య సుతో వృష్ణిర్‌ వృష్ణేస్తు తనయో దృతిః | కపోతరోమా తస్యాథ తైత్తిరి స్తస్య చాత్మజః. 66

తస్యాసీ త్తనయా పుత్త్ర స్సఖా విద్వా న్నలః కిల | ఖ్యాయతే తస్యనామ్నా స నన్దనోదరదున్దుభిః. 67

తస్మి న్ప్రవితతే యజ్ఞే అభిజాతః పునర్వసుః | అశ్వమేధం తు పుత్త్రార్థ మాజహార నరోత్తమః. 68

తస్య మధ్యే7తిరాత్రస్య సభ్యమద్యా త్సముత్థితః | అతస్తు విద్వా న్కర్మజ్ఞో యజ్వా దేవపునర్వసుః. 69

తస్యాసీత్‌ పుత్త్రమిథునం బభూవావర్జితం కిల | ఆహుక శ్చాహుకీ చైవ ఖ్యాతౌ మతిమతాం వరౌ. 70

ఇమాం శ్చోదాహర న్త్యత్ర శ్లోకాన్‌ ప్రతి త మాహుకమ్‌ |

సోపాసంగా నుకర్షాణాం సద్వజానాం వరూథినామ్‌. 71

రథానా మథ ఘోషాణాం సహస్రాణి దశైవ తు | నాసత్యవాదీ నాతేజా నాయజ్వా నాసహస్రదః. 72

నాశుచి ర్నాప్యవిద్వాన్హి యో భోజే ష్వభ్యజాయత | ఆహుకస్య భృతిం ప్రాప్తా నిత్యేతద్వై తదోచ్యతే. 73

ఆహుకశ్చా ప్యవ న్తీషు స్వసారం చాహుకీం దదౌ| ఆహుకా త్కాశ్య దుహితా ద్వౌ పుత్త్రా సుషువే సతీ. 74

దేవకం చోగ్రసేనంచ దేవగర్భసమా వుభౌ | దేవకస్య సుతా వీరా జజ్ఞిరే త్రిదశోపమాః. 75

దేవవా నుపదేవశ్చ సుదేవో దేవరక్షితః|తేషాం స్వసార స్సప్తాస న్వసుదేవాయ తా దదౌ. 76

దేవకీ శ్రుతదేవీ చ యశోదా చ చయశోధరా | శ్రీదేవీ సత్యదేవీ చ సుతాపీ చేతి సప్తమీ. 77

నవోగ్రసేనస్య సుతాః కంస స్తేషాం తు పూర్వజః |

న్యగ్రోధశ్చ సునామా చ కఙ్క శ్శుఙ్కశ్చ భూయసః. 78

సుతన్తూ రాష్ట్రపాలశ్చ శుద్ధముష్టి స్స ముష్టిదః | తేషాం స్వసారః పఞ్చాస న్కంసా కంసవతీ తథా. 79

సుతన్తూ రాష్ట్రపాలీ చ కఙ్కా చేతి వరాఙ్గనా | ఉగ్ర సేన స్సహాపత్యో వ్యాఖ్యాతాః కుకురోదర్భవాః. 80

భజమానస్య పుత్త్రోథ రథముఖ్యో విదూరథః|రాజాథదేవ శ్శూరశ్చ విదూరథసుతో7భవత్‌. 81

రాజాధిదేవస్య సుతౌ జజ్ఞాతే దేవసమ్మతౌ | నియమవ్రత ప్రధానౌ తౌ శోణాశ్వ శ్వేతవాహనౌ. 82

శోణాశ్వస్య సుతాః పఞ్చ శూరా రణవిశారదాః | శమీచ గదశర్మాచ నికృత శ్శక్రశత్రుజిత్‌. 83

శమీపుత్త్రః ప్రతిక్షత్త్రః పరిక్షత్త్ర స్తదాత్మజః | పరిక్షత్త్రసుతో భోజో హృదిక స్తస్య చాత్మజః. 84

హృదికస్యాభవ న్పుత్త్రాదశ భీమపరాక్రమాః | కృతవర్మా7గ్రజ స్తేషాం శతధన్వాచ మద్యమః. 85

దేవార్హశ్చైవ నాభశ్చ భీషణశ్చ మహాబలః | అజాతో వనజాతశ్చ కనీయక కరమ్భకౌ. 86

దేవార్హ స్య సుతోవిద్వా న్జజ్ఞే కమ్బళ బర్హిషః | అసమఞ్జా స్సుత స్తస్య తమోజా న్తస్యచాత్మజః. 87

(అజాతపుత్త్రస్య సుతః ప్రజాయత మమాయకః | ) తమోజపుత్త్రా విక్రాన్తాస్త్రయః పరమకీర్తయః. 88

సుదంష్ట్రశ్చ సునాభశ్చ కృష్ణ ఇత్యంధకా మతాః | అన్ధకానా మిమంవంశం కీర్తయన్తి చ నిత్యశః. 89

ఆత్మనో విపులం వంశం ప్రజావా నాప్నుతే నరః. 894

ఇది శ్రీమత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే సహస్రజిత్ర్కోష్టు వంశకథనం

నామ చతుశ్చత్వారింశో7ధ్యాయః.

సాత్వతునకు భాగి-భజమానుడు-దివ్యుడు దేవావృధుడు-అంధకుడు-వృష్టి-మహాభోజుడు-అను ఏడుగురు కుమారులు కల్గిరి. వారిలో నలుగురి వంశములు విస్తరిల్లినవి. సృంజయుడను రాజునకు ఇద్దరు కుమా ర్తెలుండిరి. వారిద్దరును భజమానునకు భార్యలైరి. వారికి అనేకులు కుమారులు కలిగిరి. ఆ అక్కాచెల్లెండ్రలో 'బాహ్యక' అను ఆమెకు జన్మించిన కుమారుల వంశమువారిని బాహ్యకులందురు. బాహ్యక కుమారులలో ముఖ్యులు నిమి-కృమిలుడు-వృష్ణి-అనువారు. దేవావృధుడను రాజు బంధుమిత్త్రుల కానందము కలిగించువాడు. అతనికి సంతతి కలుగకుండెను. సర్వగుణోపేతుడగు కుమారునిగోరి అతడుత్తమ తపస్సాచరించెను. అతడు ఆద్యమగు మంత్ర (ప్రణవ)మును అనుసంధానము చేయుచు పర్ణాశా నదీజలమును స్పృశించెను. (నదీ దేవతను అనుసంధానము చేయుచు జపించెను.) ఇట్లు నిరంతరమును ఉపస్పర్శనము చేయుచుండుటచేతను ఆరాజు శుభగుణములు కలవాడగుటచేతను ఆ నదీదేవత ప్రసన్నురాలై అతనికి ప్రీయమును సమకూర్చగోరెను. ఆ దేవావృధుడును తన వలన అట్టి ఉత్తమ పుత్త్రుని కనగల స్త్రీ యెవ్వరును లభించుట లేదే యని చింతిల్లుచుండుటచే అది ఎరిగి పర్ణాశా నదీ దేవత తానే అతని వలన సంతానవతి కాగోరెను. ఆమె సుందరియగు కన్యగాఅయి రాజునకు తనుతాను తెలుపుకొనెను. రాజామెయందు అనురాగము కలవాడయ్యెను. ఆ దంపతులను సర్వగుణ సంపన్నుడగు బభ్రుడను కుమారుడు కలిగెను.

మహాత్ములగు ఈ దేవావృధ బభ్రులనెడి తండ్రి కొడుకులగూర్చి పురాణములయందు అనువంశ గీతము ఇట్లు వినబడుచున్నది: 'దూరమునుండి వినుచున్నట్లే సమీపమునుండి చూచుచున్నాము. ఏమనిన-బభ్రువు మనుష్యులలో శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతలతో సమానుడు ఈ మహాత్ములుపదేశించిన యోగము ననుష్ఠించి పదునాలుగువేల అరువదియైదుమంది మోక్షము పొందిరి.' బభ్రుడు యజ్ఞములు దానములు చేసినవాడు. వీరుడు-తత్త్వజ్ఞుడు-దృఢవ్రతుడు-రూపవంతుడు-మహాతేజశ్శాలి. శాస్త్రజ్ఞానము-వీరత్వము కలవాడు. అతనికి సురనాభుని కుమా ర్తెయందు కుకురుడు భజమానుడు అగ్ని కంబళబర్హిషుడు అను నలుగురు కుమారులు కలిగిరి. కుకురునకు వృష్టి-అతనికి ధృతి-అతనికి కపోతరోముడు. అతనికి తైత్తిరి-అతని దౌహిత్రుడే ఇంద్రునికి మిత్రుడు విద్వాంసుడునగు నలుడు. నందనోద్యానమునందలి దుందుభి అతని పేరుతోనే 'నలము' అను పేర ప్రసిద్ధమయియున్నది. తైత్తిరి చేసిన యజ్ఞఫలముగా అభిజాతుడు అతనికొడుకయ్యెను. అభిజాతుడు పుత్త్రార్థమై అశ్వమేధము చేసెను. ఆ యజ్ఞపు అతిరాత్ర దీక్షయందు సభ్యాగ్నిహోత్రుని నుండి విద్వాంసుడు కర్మజ్ఞుడు యజ్వయగు పునర్వసుడు జన్మించెను. అతనికి ఆహుకుడు ఆహుకి అను కవలు పుట్టిరి. వారిద్దరును బుద్ధిమంతులలోకెల్ల గొప్పవారు. ఆహుకుని గూర్చి వైదిక పురాణములందు పెద్దలు ఈ శ్లోకములు చెప్పుదురు. ''అమ్ములపొదులు ధనువులు మొదలైన పరికరములు ధ్వజములు కవచములు మొదలగు సాధనములతో నిండినరథములు-ఘంటలు మొదలగువాని మనోహర ధ్వనులతో కూడినవి-ఆహుకునకు పదివేలు గలవు. ఆహుకుని చేత పోషితులగు ఆయా విద్యావంతులు శిల్పులు మొదలగువారిలో అసత్యవాది అతేజస్కుడు యజ్వ కానివాడు వేలకొలది ధనమును ఇతరులకు దానము చేయనివాడు అశుచి అవిద్వాంసుడు ఎవడును భోజ జనపదములందుడెడివాడు కాడు.'' ఈ ఆహుకుడు తన సోదరియగు ఆహుకిని అవంతి దేశరాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆహుకునకు కాశ్యుని కూతువలన దేవకుమారులను పోలిన దేవకుడు ఉగ్రసేనుడు అను కుమారులు కలిగిరి. వీరిలో దేవకునకు దేవులతో సమానులగు వీరులగు కుమారులు దేవవాన్‌ ఉపదేవుడు సుదేవుడు దేవరక్షితుడు అను వారలును దేవకి శ్రుతదేవి యశోద యశోదర శ్రీదేవి సత్యదేవి సుతాపి అను ఏడుగురు కుమా ర్తెలును కలిగిరి. అతడు ఈ కుమా ర్తెలను వసుదేవున కిచ్చి పెండ్లి చేసెను. ఉగ్రసేనునకు తొమ్మిదిమంది కుమారులు. వారు-కంసుడు-న్యగ్రోధుడు - సునాముడు కంకుడు - శంకుడు- సుతంతు-రాష్ట్రపాలుడు-శుద్ధముష్టి-నముష్టిదుడు-అనువారు. ఐదుగురు కుమా ర్తెలు: కంస-కంసవతి-సుతంతు-రాష్ట్రపాలి-కంకా-అనువారు. ఇది కుకురు వంశమునకు చెందిన ఉగ్రసేనుడును అతని సంతతియును.

భజమానునకు విదూరథుడు-అతనికి రాజ్యాధిదేవుడు-అతనికి దేవసమానులు నియమవ్రతప్రధానులు అగు శోణాశ్వశ్వేతవాహనులనువారు కలిగిరి. శోణాశ్వునకు శూరులు రణ విశారదులునగు శమి-గదశర్మ నికృతుడు శక్రజిత్‌ శత్రుజిత్‌ అను ఐదుగురు కుమారులు. శమికి కుమారుడు ప్రతిక్షత్త్రుడు-అతనికి పరిక్షత్త్రుడు-అతనికి భోజుడు-అతనికి హృదికుడు కలిగిరి. హృదికునకు భీమ పరాక్రములగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో కృతవర్మ పెద్దవాడు. శతధన్వుడు నడిమివాడు. మిగిలినవారు-దేవార్హుడు-నాభుడు-భీషణుడు-మహాబలుడు-అజాతుడు-వనజాతుడు-కనీయకుడు-కరంభకుడు అనువారు. దేవార్హునకు కంబళ బర్హిషుడు-అతనికి అసమంజుడు-అతనికి తమోజుడు అతనికి సుదంష్ట్రుడు సునాభుడు కృష్ణుడు అను ముగ్గురు కుమారులును కలిగిరి. ఇది అంధకవంశ క్రమము. దీనిని నిత్యము కీర్తించుచుండు వాడు వంశవృద్ధి కలిగి విస్తరిల్లును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణమున సహస్రజిత్‌

క్రోష్టు వంశ కథనమను నలువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters