Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచచత్వారింశో7ధ్యాయః.

వృష్టివంశ కథనము.

సూతః: గాన్ధరీ చైవ మాద్రీచ వృష్ణిభార్యే బభూవతః | గాన్ధారీ జనయామాస సుమిత్రం నన్దవర్ధనమ్‌. 1

మాద్రీ యుధాయుతం పుత్త్రం తతో వై దేవమీఢుషమ్‌ | అనమిత్త్రం శిబిం చైవ పఞ్చాత్రకృతలక్షణాః.

అనమిత్రసుతో నిఘ్నో నిఘ్నస్యాపితు ద్వౌ సుతౌ | ప్రసేనశ్చ మహావీర్య శ్శక్తిసేనశ్చ తా వుభౌ. 3

స్యమన్తకోపాఖ్యానమ్‌.

స్యమన్తకం ప్రసేనస్య మణిరత్న మనుత్తమమ్‌ | పృథివ్యాం సర్వరత్నానాం రాజా చాసా వభూ న్మణిః. 4

హృది కృత్వా తు బహుశో మణిం త మభియాచితం | గోవిన్దో నచతం లేభే శక్తోపి న జహార తమ్‌. 5

కదాచి న్మృగయాం యాతః ప్రసేన స్తేన భూషితః | యదా శబ్దం స శుశ్రావ బిలే సత్త్వేన పూరితే. 6

తతః ప్రవిశ్య స బిలం ప్రసేనో ఋక్ష మైక్షత | ప్రసేనంచ తదా ఋక్షః ఋక్షం చాపి ప్రసేనజిత్‌. 7

హత్వా ఋక్షః ప్రసేనం తు తత స్తం మణిమాదదౌ | అదృష్టస్తు హత స్తేన హ్యన్త ర్బిల మగా త్తతః. 8

ప్రసేనం తు హతం జ్ఞాత్వా గోవిన్దః పరిశఙ్కితః | గోవిన్దేన హతో వ్యక్తం ప్రసేనో మణికారణాత్‌. 9

గోవిన్దస్తు గతో7రణ్యం మణిరత్నేన భూషితమ్‌ | తం దృష్ట్వా సఙ్గత స్తేన గోవిన్దః ప్రత్యువాచహ. 10

హన్మి చైనం దురాచారం శత్రుభూతం హి వృష్టిషు | అథ దీర్ఘేణ కాలేన మృగయానిర్గతః ప్రభుః. 11

యదృచ్ఛయాచ గోవిన్దో బిలస్యాభ్యాశ మాగతః | తం దృష్ట్వా సుమహాశబ్దం స చక్రే ఋక్షరా డ్బలీ. 12

శబ్దం శ్రుత్వా తు గోవిన్దః ఖడ్గపాణిః ప్రవిశ్య చ | అపశ్యజ్జామ్బవన్తం తు ఋక్షరాజం మహాబలమ్‌. 13

తత స్తూర్ణం హృషీకేశో బిభ్ర ద్గాత్రం మహాబలమ్‌ | జామ్బవన్తం తు జగ్రాహ క్రోధసంర క్తలోచనః. 14

దృష్ట్వా చైనం తదా ఋక్షః కర్మభి ర్వైష్టవైః ప్రభుమ్‌ | తత స్తుష్టస్తు భగవాన్వరేణౖన మరోచయత్‌. 15

చక్రప్రహారేణ విభో త్వత్తోహం మరణం వృణ |

కన్యా ప్రౌఢా మమ సుతా భర్తారం త్వా మవాప్నుయాత్‌. 16

యో7యం మణిః ప్రసేనం తు హత్వా ప్రాప్తో మయా విభో |

తత స్స జామ్బవన్త స్తం మణిం ప్రాదాచ్చ విష్ణవే. 17

తతస్తు జామ్బవన్తం తు హత్వా చక్రేణ స ప్రభుః | కృతకర్మా మహాబాహు స్సకన్యాం మణి మాహరత్‌.

నలువది ఐదవ అధ్యాయము

స్యమంతకోపాఖ్యానము - వృష్టివంశకథనము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: వృష్ణికి గాంధారి మాద్రి అను ఇద్దరు భార్యలు. అతనికి గాంధారి యందు సుమిత్రుడు మాద్రియందు యుధాజితుడు దేవమీఢుడు అనమిత్రుడు శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి. అన మిత్రునకు నిఘ్నుడు అతనికి ప్రసేనుడు శక్తిసేనుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. వీరిలో ప్రసేనుడు రత్నరాజమగు స్యమంతకమణిని సంపాదించెను. అది అతడు హృదయమున ధరించుట చూచి శ్రీకృష్ణుడడిగినను అతడది అతనికీయ లేదు. శక్తుడై యుండియు కృష్ణుడు దానిని బలమున హరించలేదు. ఒకమారు ప్రసేనుడు దానిని ధరించి వేటకై పోయి ఒక గుహలో జంతువేదియో చేసిన శబ్దము విని లోనికిపోగా అచటనతని కొక ఎలుగుబంటి కనబడెను. వారొకరినొకరు చూచుకొనిరి. ఋక్షము ప్రసేనుని చంపి మణిని హరించెను. మరణించినందున ప్రసేనుడు గుహలోనికి పోయినవాడు తిరిగిరాలేదు. మణికై గోవిందుడే ప్రసేనుని చంపియుండునని శ క్తి సేనాదులు శంకించిరి. నా సోదరుడు మణిని ధరించి అడవికి పోవుట చూచి కృష్ణుడును అటకు వెళ్ళి ప్రసేనుని చంపెను. అని శ క్తి సేనుడనెను. తాను చంపలేదని కృష్ణుడు మారుపలికెను. కాని వృష్టివంశపువారికి శత్రువుగానున్న ఇతనిని చంపుదునని శక్తిసేనుడనెను. కొంత కాలమునకు తరువాత యాదృచ్ఛికముగా శ్రీకృష్ణుడు వేటకై పోవుటయు ఋక్షముండెడి బిలముకడకు చేరుటయు జరిగెను. అతనిని చూచి ఋక్షరాజు మహాశబ్దము చేసెను. అదివిని శ్రీకృష్ణుడు ఖడ్గపాణియై గుహలోనికి పోగా అతనికి జాంబవంతుడు కనబడెను. కృష్ణుడు క్రోధముతో కండ్లెర్రచేసి మహాబల సంపన్న శరీరుడగు జాంబవంతుని పట్టుకొనెను. అతని పనులనుబట్టి జాంబవంతుడు కృష్ణుని విష్ణునిగా గుర్తించెను. అందులకు సంతసించి కృష్ణుడు వరము కోరుకొనుమన నీచేతిలో చక్రప్రహారముతో నాకు మరణము కావలయునని జాంబవంతుడు కృష్ణుని వరమడిగెను. యుక్తవయస్సు వచ్చిన నాకుమా ర్తెను నీవు భార్యగా గ్రహించుము. ప్రసేనుని చంపి నేను గ్రహించిన ఈ మణిని కూడ తీసికొనుము. అని అతడు జాంబవతిని మణిని శ్రీకృష్ణునకర్పించెను. తరువాత ఆ ప్రభువు చక్రముతో జాంబవంతుని సంహరించి జాంబవతిని మణిని గ్రహించెను.

దదౌ సత్రాజితాయైనం సర్వసాత్వతసంసది | తేన మిథ్యాప్రవాదేన విముక్త స్స తథా విభుః. 19

తతస్తు యాదవా స్సర్వే వాసుదేవంతదా7బ్రువ& | అస్మాకం మనసి త్వాసీ త్ర్పసేనస్తు త్వయా హతః.

కేకయో7సౌ దదౌ భార్యా దశ సత్త్రాజిత స్సుతాః | సముత్పన్నా స్సుతాస్తాసు సర్వలోకేషు విశ్రుతాః. 21

ఖ్యాతిమంతో మహాసత్త్వా భఙ్గకారస్తు పూర్వజః | అథ తు బ్రువతీ తస్మా ద్భఙ్గకారాత్తు పూర్వజాత్‌. 22

సుషువే సా కుమారీస్తు తిస్రః కమలలోచనాః | సత్యభామా వరా స్త్రీణాంవ్రతినీవ దృఢవ్రతా. 23

తథా పద్మవతీ చైవ తాశ్చ కృష్ణాయ తాం దదౌ | అనమిత్త్రా చ్ఛిని ర్జజ్ఞే కనిష్ఠా ద్వృష్టినన్దనాత్‌. 24

సత్యవాం స్తస్య పుత్త్రస్తు సాత్యకి స్తస్య చాత్మజః | సత్యవా న్యు యుధానశ్చ శినేర్నప్తా ప్రతాపవాన్‌. 25

అసఙ్గో యుయుధానస్య ధుని స్తస్యాత్మజో7భవత్‌ | ధేనే రసత్వరః పుత్త్ర ఇతి శైన్యాః ప్రకీర్తితాః. 26

అనమిత్రాన్వయో హ్యేష వ్యాఖ్యాతో వృష్టివంశజః | అనమిత్రస్య సంజజ్ఞే పృథ్వ్యాం వీరో యుధాజితః. 27

అనౌ తు తన¸° వీరౌ ఋషభః క్షత్త్ర ఏవ చ | ఋషభః కాశిరాజస్య సుతాం భార్యా మవిన్దత. 28

జయ న్తస్య జయన్త్యాం తు పుత్త్రా స్సమభవం స్తతః | సదాయజ్వా7తివీరశ్చ శ్రుతవా నతిథిప్రియః. 29

అక్రూరం సుషువే తస్మా త్సదాయజ్వా7తిదక్షిణః |

రత్నాం కన్యాం చ శైబ్యస్య అక్రూర స్తా మవా ప్తవాన్‌. 30

తరువాత శ్రీకృష్ణుడు స్యమంతకమణిని శ క్తి సేనునకు (సత్రాజితునకు) సాత్వతుల సభయందు సమర్పించెను. ఇట్లు శ్రీకృష్ణుడు మిథ్యా ప్రవాదమునుండి ముక్తుడయ్యెను. ఇంతవరకును నీవే ప్రసేనుని చంపితివని మేము అనుకొంటిమని యాదవులందరును కృష్ణునితో ననిరి.

కేకయ రాజు తన పదిమంది కుమా ర్తెలను సపత్రాజిత్తునకు ఇచ్చి పెండ్లి చేసెను. వారికి సర్వలోక ప్రసిద్ధులు మహా సత్త్వ సంపన్నులు నగు కుమారులు కలిగిరి. వారిలో భంగకారుడు పెద్దవాడు. అతనికి బ్రువతి (వ్రతవతి) అను భార్యయందు సత్యభామ-వ్రతిని-పద్మవతి అను ముగ్గురు కుమా ర్తెలు కలిగిరి. సత్రాజిత్తు తన ఈ ముగ్గురు కన్యలను శ్రీకృష్ణునికిచ్చి పెండ్లిచేసెను.

వృష్ణి కుమారులలో కనిష్ఠుడగు అనమిత్రునకు శినియను కుమారుడు కలిగెను. అతని కుమారుడు సత్యవంతుడు-అతని కుమారుడు సాత్యకి. అతని కుమారుడు యుయుధానుడు. అతని కుమారుడు అసంగుడు. అతని కుమారుడు ధుని. అతని కుమారుడు అసత్వరుడు. ఇది శిని వంశక్రమము. వృష్టి కుమారుడగు అనమిత్రుడని వంశమునిట్లు వివరించుటయైనది. ఈ అనమిత్రునకే యుథాజితుడు ఋషభుడు క్షత్త్రుడు జయంతుడు మొదలగు కుమారులుండిరి. కాశి రాజపుత్త్రి ఋషభుని భార్య యయ్యెను. జయంతునకు జయంతియందు సదాయజ్వా-అతివీరుడు-శ్రుతవాన్‌-అతిథి ప్రియుడు అను కుమారులు కలిగిరి. అతిదక్షిణుడగు సదాయజ్వకు అక్రూరుడు కలిగెను. శై బ్యుని కుమార్తె రత్న అను నామె అక్రూరుని భార్య.

పుత్త్రా నుత్పాదయ త్తస్యా మేకాదశ మహాబలాన్‌ | ఉపలమ్భం నదాలమ్భ ముత్కలం చార్యమేవచ. 31

సితేతరం సదాపక్షం శత్రుఘ్నం చారుమేవచ | సుధర్మం ధర్మధుగ్థర్మా వథ మౌనిం తథైవచ. 32

సర్వేచ ప్రతిహోతారో రత్నాయాం జజ్ఞిరే సుతాః. 33

అక్రూరా దుగ్రసేనాయాం సుతౌ ద్వౌ కులనన్దనౌ | దేవవా నుపదేవస్తు జజ్జాతే వేవసమ్మతౌ. 34

అశ్విన్యాం చ తతః పుత్త్రాః పృథు ర్విపృథు రేచవ | అశ్వత్థామా సుబాహుశ్చ సుపార్శ్వశ్చ గవేషణః. 35

ధృష్టు ర్నేమిః సుపర్ణశ్చ ధర్మో ధర్మాతిరేవచ | అభూమి ర్బహుభూమిశ్చ శర్మిష్ఠాశ్రవణ స్తథా. 36

ఇమాం మిథ్యాభిశ ప్తిం యాం వేద కృష్టా దపోహితామ్‌ | న స మిథ్యాభిశాపేన అభిశాపో స్తి కేనచిత్‌. 37

ఇది శ్రీమత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే వృష్ణివంశకథనం నామ

పఞ్చచత్వారింశో7ధ్యాయః.

ఆమెయం దతనికి మహాబలులగు పదునొకండుమంది కుమారులు కలిగిరి. వారు-ఉపలంభుడు-సదాలంభుడు-ఉత్కలుడు-ఆర్యుడు-సితేతరుడు-సదాపక్షుడు-శత్రుఘ్నుడు-చారుడు-ధర్మదుక్‌-ధర్ముడు-మౌని-అనువారు. అక్రూరునకు ఉగ్రసేనయందు దేవవాన్‌-ఉపదేవుడు అనువారును అశ్వినియందు పృథు-విపృథు-అశ్వత్థామ-సుబాహు-సుపార్శ్వ-గవేషణ ధృష్ణు-నేమి-సువర్ణ-ధర్మ-ధర్మాతి-(శర్యాతి) అభూమి-బహుభూమి-శర్మిష్ఠ ఆశ్రవణ అను కుమారులును కలిగిరి.

శ్రీకృష్ణుడు తనకు కలిగిన మిథ్యాపవాదమును పోగొట్టుకొనిన ఈకథ వినినవానికి ఎవరివలనను మిథ్యాభి శాపములు సంభవింపవు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున స్యమంతకోపాఖ్యానము-వృష్ణివంశానుకథనమునను నలువదియైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters