Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్చత్వారింశో7ధ్యాయః.

చన్ద్రవంశా న్తర్గతశూరవంశః.

సూతః : 

ఐక్ష్వాకీ సుషువే శూరం ఖ్యాత మద్భుతమీఢుషమ్‌ | పౌరిష్యాం జజ్ఞిరే శూరా ద్భోజాయాం పురుషా దశ. 1

వసుదేవో మహాబాహుః పూర్వ మానకదున్దుభిః | దేవభాగ స్తతో జజ్ఞే తతో దేవశ్రవాః పునః. 2

అనాధృష్టి శ్శినిశ్చైవ నన్దశ్చైవ ససృంజయః | శ్యామసామీకసంయూపాః పంచ చాస్య వరాంగనాం. 3

శ్రుతకీర్తిః పృథాచైవ శ్రుతదేవీ శ్రుతశ్రవా | రాజాధి దేవీచ తథా పఞ్చైతా వీరమాతరః. 4

కృతస్యచ శ్రుతాదేవీ సుగ్రహం సుషువే సుతమ్‌ | కైకేయా న్ఛ్రుతకీర్తేస్తు జజ్ఞే సోనువ్రతోనృపః. 5

శ్రుతశ్రవాపి చైద్యాంతు సునీథం సమపద్యత | బర్హిషా ద్ధర్మశారీర స్సమ్బభూ వారిమర్దనః. 6

అథ సఖ్యేపి వృధ్ధస్య కున్తిభోజే పృథాం దదౌ | ఏవం కున్తీసమాఖ్యాతా వసుదేవస్వ సా పృథా. 7

వసుదేవేన సా దత్తా పాణ్డో ర్భార్యా హ్యనినిర్దతా | పాణ్డోరర్ధేన సా జజ్ఞే దేవపుత్త్రా న్మహారథా&. 8

ధర్మా ద్యుధిష్ఠిరో జజ్ఞే వాయో ర్జజ్ఞే వృకోదరః | ఇన్ద్రా ద్థనంజయశ్చైవ శక్రతుల్యపరాక్రమః. 9

మాద్రవత్యాం చ జనితా వశ్విభ్యా మితి శుశ్రుమః | నకుల స్సహదేవశ్చ రూపశీల గుణాన్వితౌ. 10

రోహిణీ పౌరవీ చైవ ఖ్యాత మానకదున్దుభేః | లేభే జ్యేష్ఠం సుతం రామం సారణం చ రణప్రియమ్‌. 11

దుర్గమం దమనం శుబ్రం పిణ్డకంచ మహాహనుమ్‌ | చిత్రాక్షేత్రే కుమార్యౌతు రోహిణ్యాం జజ్ఞిరే తథా. 12

దేవక్యాం జజ్ఞిరే శౌరే స్సుషేణః కీర్తిమాసపి | ఉదాసీ భద్రసేనశ్చ ఋషిదాస స్తథైవచ. 13

షష్ఠో భద్రవిదేహౌచ కంస స్సర్వా నపాతయత్‌ | ప్రథమా యా హ్యమావాస్యా వార్షికీతు భవిష్యతి. 14

తస్యాం జజ్ఞే మహాబాహుః పూర్వం కృష్ణః వ్రజాపతిః | అనుజా త్వభవత్కృష్ణా సుభద్రా కలభాషిణీ. 15

నలువది ఆరవ అధ్యాయము

యదువంశమున శూరవంశ వృత్తాంతము

సూతుడు ఋషులకు ఇకను ఇట్లు చెప్పెను: వృష్ణికుమారులలో నొకడు * దేవమీఢ్వాన్‌ (దేవమీఢుష్‌). అతనికి ఐక్ష్వాకి (ఇక్ష్వాకు రాజపుత్త్రి) యందు శూరుడను కుమారుడు కలిగెను. పురుషుడను రాజు కూతురగు భోజయందు శూరునకు పదిమంది కుమారులు కలిగిరి. వారు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవసుడు అనాధృష్టి శిని నందుడు సృంజయుడు శ్యాముడు సామీకుడు సంయూపుడు అనువారు. ఐదుమంది కుమార్తెలు-శ్రుతకీ ర్తి-పృథ - శ్రుతదేవి-శ్రుతశ్రవ-రాజాధిదేవి అనువారును శూరునకు కలిగిరి. వీరందరును వీరమాతలు. వీరిలో శ్రుతదేవికి కృతుడను భర్తవలను సుగ్రహుడును శ్రుతకీ ర్తికి కైకేయుని వలన సునీథుడను కుమారుడును రాజాధిదేవికి బర్హిషుని వలన ధర్మాత్ముడగు అరిమర్దనుడును

________________________________________

*ఇచట మూలములో దేవమీఢుషః అనుటకు మారుగా 'అద్భుత మీడుషః' అని ఛందస్సున కనుకూలతకై ఋషులు వ్రాసిరి. కాని ముద్రిత ప్రతులలో ఇది శూర శబ్దమునకు విశేషణముగా అద్భుత మీఢుషమ్‌ అని యున్నది. కలిగిరి. వృధ్ధుడగు శూరుడు తన మిత్రుడగు కుంతి భోజునకు పృథను కూతుగా నిచ్చెను. ఇందుచే వసుదేవుని చెల్లెలగు పృథకు కుంతి అను పేరు వచ్చెను. తండ్రి యనంతరము వసుదేవుడు పృథను (కుంతిని) పాండున కిచ్చి పెండ్లి చేసెను. పాండునకు ఆమెయందు తరువాత ధర్మదేవుని వలన యుధిష్ఠిరుడు వాయువు వలన భీముడు ఇంద్రుని వలన అర్జునుడు రెండవ భార్య అగుమాధికి అశ్వినులవలన నకుల సహదేవులు కుమారులయిరి.

పూరువంశ సంజాతయగు రోహిణియందు వసుదేవునకు రాముడు సారణుడు దుర్దముడు దమనుడు శుభ్రుడుపిండకుడు మహాహనుడు అను కుమారులును చిత్ర-క్షేత్ర అను కుమార్తెలను కలిగిరి. దేవకియందు సుషేణుడు కీర్తి మాన్‌ ఉదాసి భద్రసేనుడు ఋషిదాసుడు భద్రుడు విదేహుడు అను కుమారులు కలిగిరి. వీరి నందరసు కంసుడు చంపెను. కృష్ణుడును అతని చెల్లెలు సుభద్రయు దేవకికి కలిగినవారే. శ్రీకృష్ణుడు వర్షాకాలమునందలి మొదటి అమావాస్యనాడు (శ్రావణమాసమున) పుట్టెను.

దేవక్యా స్సుమహాతేజా జజ్ఞే శూరో మహాయశాః | సమదేవస్తు తామ్రాయాం జజ్ఞే శౌరికులోద్వహః. 16

ఉపాసంగధరం లేభే తనయం దేవరక్షితా | ఏకాం కన్యాంచ సుభగం కంస స్తా సభ్యఘాతయత్‌. 17

విజయం రోచమానంచ వర్ధమానంచ దేవలమ్‌ | ఏతే సర్వే మహాత్మాన ఉపదేవ్యాః ప్రజజ్ఞిరే. 18

అవగాహో మహాత్మాచ వృకదేవ్యాం వ్యజాయత | వృకదేవ్యా స్స్వయం జజ్ఞే నన్దకో నామ నామతః. 19

సప్తకం దేవకీపుత్త్రం మదనా సుషువే సుతమ్‌ | గవేషణం మహాభాగం సఙ్గ్రామే ష్వపరాజితమ్‌. 20

శ్రద్ధాదేవ్యా విహారేతు వనే విచరతా పురా | వైశ్యాయా మదదా చ్ఛౌరిః పుత్త్రం కౌశిక మగ్రజమ్‌. 21

సుతౌద్వావథ రాజానౌ శౌరే రాస్తాం పరిగ్రహే | ముణ్డశ్చ కపిలశ్చైవ సుదేవో7నఙ్గజో బలీ. 22

జరోనామ నిసాదో7భూ త్ర్పథమ స్స ధనుర్దరః | సౌభద్రశ్చ భవశ్చైవ మహాసత్త్వౌ బభూవతుః. 23

దేవభాగాసుతశ్చాపి నామ్నా7సా వుద్ధవ స్స్మృతః | పణ్డితం ప్రథమం ప్రాహుర్‌ దేవశ్రవస ముత్తమమ్‌. 24

ఐక్ష్వాకీ పుత్త్ర మలభ దనాధృష్టే ద్యశస్వినీ | నిర్ధూతశత్రు శ్శత్రుఘ్న శ్ర్శాద్ధ స్తస్మా దజాయత. 25

*గణ్జూషాయానపత్యాయ కీష్న స్తుష్ట స్సుతం దదౌ | సుచంద్రంతు మహాభాగం వీర్యవంతం మహాబలమ్‌ |

జామ్బవత్యా స్సుతా వేతౌ ద్వౌచ సత్కృతలక్షణౌ. 26

చారుదేష్ణశ్చ సామ్బశ్చ వీర్యవన్తౌ మహాబలౌ | తన్త్రిపాలశ్చ తన్త్రిశ్చ నన్దనస్య సుతావుభౌ. 27

శమీకపుత్త్రా శ్చత్వారో విక్రన్తాస్త్రమహాబలాః | విరజశ్చ ధనుశ్చైవ శ్యామశ్చ సృఞ్జయ స్తథా. 28

అనపత్యో7భవ చ్ఛ్యామ స్సృఞ్జయస్తు వనం య¸° | జుగుప్సమానో భోజత్వం రాజర్షిత్వ మవాప్తవాన్‌. 29

కృష్ణస్య జన్మాభ్యుదయం యఃకీర్తయతి నిత్యశః | శృణోతి మానవో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే. 30

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే శూరవంశాదికథనం నామ

షట్చత్వారింశో7ధ్యాయః.

ఇంకను వసుదేవునకు తామ్రయందు సహదేవుడు దేవరక్షితయందు ఉపాసంగధరుడును ఒక కుమార్తెయు కలిగిరి. ఈ కన్యను కంసుడు చంపెను. ఉపదేవియందు విజయుడు రోచమానుడు వర్థమానుడు దేవలుడు ఉపదేవి యందు అవగాహుడు నందకుడు వనవిహారమున తాను కూడిన వైశ్య జాతీయయగు శ్రద్ధాదేవియందు కౌశికుడు గవేషణుడు అనువారును మరియొక భార్య (పేరు ఈయలేదు) యందు ముండుడు కపిలుడు అనువారును జరుడు సౌభద్రుడు భవుడు అను నిషాదులును దేవభాగయందు దేవశ్రవసుడని ప్రసిద్ధుడైన మహా పండితుడగు ఉద్ధపుడును కలిగిరి. (యశస్వినియగు ఐక్ష్వాకి అను నామెను అనాధృష్టి అను వానివలన శత్రుఘ్నుడు కలిగెను. అతని కుమారుడు శ్రాద్ధుడు. (ఇది ఇచ్చట అప్రస్తుతము.)

_______________________________________

*కరూ.

శ్రీకృష్ణుడు అనపత్యుడగు గంఢూషుడను వానికి తన కుమారుడును బలవీర్య సంపన్నుడునగు సుచంద్రుడను వాని నిచ్చెను. శ్రీకృష్ణునకు జాంబవతియందు చారుదేష్ణుడు సాంబుడు అను కుమారులు కలిగిరి. నందనుడను వానికి తంత్రిపాలుడు తంత్రి అనువారు కుమారులు.

శమీకునకు మహాబలవిక్రమ సంపన్నులగు విరజుడు ధనువు శ్యాముడు సృంజయుడు అను నలుగురు కుమారులు కలిగిరి. వీరిలో శ్యామునకు సంతతి కలుగలేదు. సృంజయుడు వానప్రస్థుడయ్యెను. అతడు భోజుడుగా - లోక సుఖానుభవమున-ఉండుట కసహ్యపడి ఇట్లు రాజర్షి యయ్యెను.

శ్రీకృష్ణ భగవానుని జన్మాభ్యుదయమును అనుదినము కీ ర్తించువాడును వినువాడును సర్వపాపములనుండి విముక్తుడగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున శూరవంశాను వర్ణనమను నలువది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters