Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టచత్వారింశో7ధ్యాయః.

తుర్వసుప్రభృతీనాం సన్తతికథనమ్‌

సూతః ః తుర్వసోస్తు సుతో గర్గో గోభాను స్తస్య చాత్మజః | గోభానో స్తు సుతో ధీరస్త్రిశరిశ్చాపరాజితః . 1

కరన్ధమస్తు త్రిశ##రే రనన్త స్తస్య చాత్మజః | దుష్యన్తః పౌరవ శ్చాసీ త్తస్య పుత్త్రోహ్యకల్మషః. 2

ఏవం యయాతిశాపేన జరాసజ్క్రతమః పురా | తుర్వసోః పౌరవం వంశం ప్రవివేశ పురా కిల. 3

దుష్యన్తస్య తు దాయాదో వరూథో నామ పార్థివః | వరూథాత్తు తథాణ్ఢీర శ్చత్వార స్తస్య చాత్మజాః . 4

పాణ్డ్యశ్చ కేరళ##శ్చైవ చోళః పల్గు స్తథైవ చ | తేషాం జనపదా స్స్ఫీతాఃపాణ్డ్యాశ్చోళాస్స కేరళాః. 5

ద్రుహ్యోస్తు తనయ శ్శూరో బభ్రుస్సేతు స్తథైవ చ | సేతుపుత్త్రస్తు భద్రశ్చగాన్ధార స్తస్య చాత్మజః. 6

ఖ్యాయతే యస్య నామ్నాసౌ గాన్ధారో విషయో మహా | గాన్ధారదేశజా స్తత్ర తురగా వాజినాం వరా ః. 7

గాన్ధారపుత్త్రో ధర్మస్తు ఘృత స్తస్యాత్మజో7భవత్‌ | ఘృతాత్తు విద్రుమో జజ్ఞే ప్రచేతా స్తస్య చాత్మజః .8

ప్రచేతసః పుత్త్రశతం రాజాన స్సర్వ ఏవ తే | వ్లుెచ్ఛరాజ్యాధిపా స్సర్వే ఉదీచీం దిశ మాశ్రితాః. 9

ఆనోశ్చైవసుతా వీరా స్త్రయః పరమకీర్తయః | సభానర శ్చాక్షుషశ్చ పరమేష్ఠి స్తథైవ చ . 10

సభానరస్య పుత్త్రస్తు విద్వా న్కోలాహలో నృపః | కోలాహలస్య ధర్మాత్మా సఞ్జయో నామ విశ్రుతః 11

సఞ్జయస్యాభవ త్పుత్త్రో వీరో రాజా పురఞ్జయః | జనమేజయా మహారాజా పురఞ్జయసుతో7భవత్‌ . 12

జనమేజయస్య రాజర్షే ర్మహాశాలో7భవత్సుతః | ఆసీ దిన్ధ్రసమో రాజా ప్రతిష్టితయశా బభౌ . 13

మహామనా స్సుతస్తస్య మహాశాలస్య ధార్మికః | సప్తద్వీపేశ్వరో జజ్ఞే చక్రవర్తీ మహామనాః.14

మహామనాస్తు ద్వౌ పుత్త్రౌ జనయామాస విశ్రుతౌ | ఉశీనరశ్చ ధర్మజ్ఞ స్తితిక్షుశ్చైవ తావుభౌ . 15

నలువది ఎనిమిదవ అధ్యాయము

తుర్వసుడు మొదలగువారి వంశము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను. యయాతి పుత్త్రుడగు తుర్వసునకు గర్గుడు అతనికి గోభానుడు అతనికి ధీరుడు అపరాజితుడునగు త్రిశరి అతనికి అనంతుడు అతనికి పూరు వంశీయుడగు అకల్మషుడైన దుష్యన్తుడును కుమారులయిరి. ( అనంతుడు పూరు వంశీయుడగు దుష్యంతునే తన కుమారునిగా స్వీకరించేను. ) ఇట్లు జరా సంక్రమణము హేతువుగా యయాతి శాపము పాలైన తుర్వసు వంశము పూరు వంశములో కలిసిపోయెను.

ఈ దుష్యంతునకు వరూథుడు అతనికి ఆండీరుడు అతనికి నలుగురు పాండ్యుడు కేరళుడు చోళుడు ఫల్గుడు అనువారును కుమారులయిరి . వీరి పాలిత జనపదములు పాండ్య కేరళ చోళములు చాల సమృద్ధితో నుండినవి .

యయాతికి ఇంకొక కుమారుడగు ద్రుహ్యునకు శూరుడు బభ్రువు సేతువు అనువారు కుమారులు. సేతునకు భధ్రుడు అతనికి గాంధారుడు కుమారులు. ఈ గాంధారుని పేరనే గాంధారదేశము ప్రసిద్ధమయినది . ఆ దేశపు గుర్రములు చాల మేలయినవి. అతనికి ధర్ముడు అతనికి ఘృతుడు అతనికి విద్రుముడు అతనికి ప్రచేతుడు కుమారులయిరి . ప్రచేతునకు నూరుమంది కుమారులు కలిగిరి. వారందరును ఉత్తర దిశయందలి రాజ్యములకు పాలకులయిరి .

యయాతికి మరియొక కుమారుడగు అనువునకు పరమ కీర్తిమంతులు వీరులునగు సభానరుడు చాక్షుషుడు పరమేష్టి అను ముగ్గురు కుమారులు. సభానరునకు విద్వాంసుడగు కోలాహలుడు అతనికి ధర్మాత్ముడగు సంజయుడు అతనికి వీరుడగు పురంజయుడు అతనికి మహారాజగు జనమేజయుడు ఆరాజర్షికి మహాశాలుడు కుమారులయిరి. అతడు మహాకీర్తిశాలియు ఇంద్రునితో సమానుడును. అతనికి ధార్మికుడగు మహామనస్కుడు కుమారుడు అతడు సప్తద్వీపాధి వతియగు చక్రవర్తి . అతనికి ధర్మజ్ఞులగు ఉశీనరుడు తితిక్షుడు అనువారు పుత్రులు .

ఉశీనరస్య పత్న్యస్తు పఞ్చ రాజర్షిసమ్భవాః | భృశా నరా కృశీ దర్శా యాచ దేవీ దృషద్వతీ . 16

ఉశీనరా త్సుతాస్తాసు జజ్ఞిరేచ కులోద్వహాః | తపసోన్తేచ మహతో జాతా వృద్ధస్య ధార్మికాః 17

భృశాయాంచ భృశః పుత్త్రోనరాయా నర ఏవచ | కృశ్యాఃకృశిస్తు దర్శాయా స్సువ్రతో నామ విశ్రుతః .

దృషద్వత్యా స్సుతశ్చాపి శిబి రౌశీనరో నృపః | శిబేస్తు శిబయః పుత్త్రాశ్చత్వారో లోకవిశ్రుతాః . 19

పృథుదర్భశ్చ సౌవీరః కేకయోభద్రకస్తథా | తేషాం జనపదా స్స్ఫీతాః కేకయా భద్రకా స్తథా . 20

సౌవీరాశ్చైవ పౌరాశ్చ భృశస్యకేకయా స్తథా | సౌవీరస్య సుతో7మ్బష్ఠః కృశేస్తు కృశళా స్సుతాః . 21

నరస్య నరరాష్ట్రస్తు తితిక్షో స్తనయాన్భృణు | తితిక్షు రభవ ద్రాజా పూర్వస్యాం దిశి విశ్రుతః .22

వృషద్రథ స్సుత స్తస్య తస్య ఫేనోభవత్సుతః | ఫేనస్య సుతపా జజ్ఞే సుతప స్తనయో బలిః .23

జాతో మనుష్యయోన్యాం తు క్షీణ వంశే ప్రజేచ్ఛయా | మహాయోగీతు స బలి ర్బద్ధో యో విష్ణునా పురా .

పుత్త్రా నుత్పాదయామాస క్షేత్రజా న్పఞ్చ పార్ధివా | అఙ్గం సఞ్జనయామాస వజ్గం

సుహ్మకమేవచ . 25

పుణ్డ్రం కలిజ్గంచ తథా బాలేయం క్షత్త్రముచ్యతే | బాలేయా బ్రాహ్మణాశ్చైవ తస్య వంశకరాః ప్రభో . 26

బలయే బ్రహ్మణా దత్తో వరః ప్రీతేన ధీమతే | మహాయోగిత్వ మాయుశ్చ కల్పస్య పరిమాణకమ్‌ . 27

సంగ్రామే చాప్యజేయత్వం ధర్మేమతి మను త్తమామ్‌ | త్రైలోక్యదర్శనం చైవ ప్రాధాన్యం ప్రసవే తదా.

_________________________________________

*సేనో. ¨సేనస్య.

జయంవా(చా)7ప్రతిమం యుద్ధే ధర్మే తత్త్వార్థదర్శనమ్‌ | చతురో నియతా న్వర్ణా న్త్స వై స్థాపయితా ప్రభుః.

తేషాం వంశధరాః పఞ్చ అఙ్గవఙ్గా స్ససుహ్మకాః | పుణ్డ్రాః కళిఙ్గాశ్చ తథా అఙ్గస్యచ నిబోధత. 30

రాజర్షి సుతలగు భృశ-నర-కృశి-దర్శ-దృషద్వతి-అను ఐదుమంది ఉశీనరుని భార్యలు. అతడు చాలకాలము చేసిన మహా తపఃఫలముగా అతనికి వార్ధకమున ఆ ఐదుగురియందు వరుసగా భృశుడు నరుడు కృశి-సువ్రతుడు-శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి.

వీరిలో శిబికి శిబులు అను పేరున లోక విశ్రుతులగు పృథుదర్భుడు సౌవీరుడు కేకయుడు భద్రకుడు అను నలుగురు కుమారులు. వీరి పాలిత జనపదములు సర్వసమృద్ధములగు కేకయ-భద్రక - సౌవీరు-పౌర-జనపదములు. వీరిలో భృశుని కుమారులు కేకయులని ప్రసిద్ధులయిరి. సౌవీరుని కుమారుడు అంబష్ఠుడు. కృశికుమారులు కృశళులు. నురుని కుమారుడు నరరాష్ఠ్రుడు. తితిక్షుడు తూరుపున రాజయ్యెను. అతనికి పృషద్రథుడు అతనికి ఫేనుడు అతనికి సుతపుడు అతనికి బలియనువారు కుమారులయిరి. (సుతపుడు దైత్యుడగు బలిని తన కుమారునిగా స్వీకరించెను.) ఇతడు మహాయోగి. పూర్వము విష్ణునిచే బంధింపబడిన బలియే ఇతడు. మనుష్యుడుగా అయిన బలి మానవ జాతియందలి తన వంశము నశించునట్లున్న సమయమున క్షేత్రజ్ఞులనుగా మానుషియగు తన భార్యయందు ఐదుమంది క్షత్త్రయ కుమారుల నుత్పాదించెను. వారు అంగుడు వంగుడు సుహ్ముడు పుండ్రుడు కళింగుడు అనువారు. వీరు బలి సంతతిలోని క్షత్త్రియులు. వీరు కాక బలి సంతతివారు కొందరు బ్రాహ్మణులుగానై విప్ర వంశములను నిలిపి వృద్ధిచేసిరి. ఈ అంగుడు మొదలగు ఐదుమంది వంశములందు జన్మించి వారి వంశముల నిలిపిన వారికి అంగులు వంగులు సుహ్ములు పుండ్రులు కళింగులు అనిపేరు. (వీరి జనపదములకును ఇదియే పేరు.)

పూర్వము బలి విషయమున బ్రహ్మ ప్రీతుడై అతనికి వరముల నొసగెను. వానిచే అతడు మహాయోగిత్వమున కల్పపరిమాణపు ఆయువును యుద్ధమున ఓటమి లేకుండుటయు ధర్మమునందు అత్యుత్తమ స్థిరబుద్ధియు త్రిలోకము లందలి సర్వవిషయముల చూచుట తన జాతి వారిలో ప్రధానుడగుట యుద్ధమున సాటిలేని గెలుపు ధర్మతత్త్వార్థమును దర్శించుట నాలుగు వర్ణముల వారిని వారివారి నియమములందు నిలుపుట అను యోగ్యతలను సంపాదించెను.

దీర్ఘతమన ఉత్పత్త్యాదికథనమ్‌.

ఋషయః: కథం బలే స్సుతాః పఞ్చ జాతా స్తస్య మహాత్మనః |

కింనామ్నీ మహిషీ తస్య జనితా కతమో మునిః. 31

కథం చోత్పాదితా స్తేన తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్‌ | మాహాత్మ్యంచ ప్రభావంచ నిఖిలేన వదస్వ నః.

సూతః: ఉచథ్యో7ఙ్గిరసః పుత్త్రః ఖ్యాత ఆసీ దృషిః పురా |

పత్నీవై మమతా నామ బభూవాస్య మహాత్మనః. 33

ఉచథ్యస్య యవీయాన్వై భ్రాతృపత్నీ మకామయత్‌ | తస్య చాసీ దవరజః పురోధా యో దివౌకసామ్‌. 34

బృహస్పతి ర్ర్బహ్మతేజా మమతా మేత్య కామతః | ఉవాచ మమతా తం తు దేవరం వరవర్ణినీ. 35

అ న్తర్వత్న్యస్మి తే భ్రాతు ర్జ్యేష్ఠస్య చ విరమ్యతామ్‌ |

అయం తుమే మహాగర్భః కు ప్యే త్తవ బృహస్పతే. 36

ఔచథ్యో భ్రాతృజన్యస్తే షడఙ్గం వేద ముద్గిర& | అమోఘరేతా స్త్వం చాసి న మాం యభితు మర్హసి. 37

అస్మి న్నేవం గతే కాలే యథా వా మన్యసే భవాన్‌ | ఏవ ముక్త స్తయా సమ్య గ్ర్బహ్మతేజా బృహస్పతిః.

కామాత్మనో మహాత్మాపి న స కామ మవారయత్‌ | సమ్బభూవాథ ధర్మాత్మా తయా సార్ధ మకామయా. 39

ఉత్సృజన్తం తు తద్రేతో గర్భస్థ స్సోభ్యభాషత | భో తాత కష్ట మేతద్ధి ద్వయో ర్నస్తీహ సంస్థితిః. 40

అమోఘరేతా స్త్వంచాపి పూర్వం చాహ మిహాగతః | శశాప తం తతః క్రుద్ధ ఏవ ముక్తో బృహస్పతిః. 41

పుత్త్రం జ్యేష్ఠస్య వై భ్రాతు ర్గర్భస్థం కామవా నృషిః | యస్మా త్త్వ మీదృశే కాలే సర్వభూతహితే స్థితే.

మా మేవ ముక్తవాం స్తస్మా త్తమో దీర్ఘం ప్రవేక్ష్యతి | తతో దీర్ఘతమా నామ శాపా దృషి రజాయత. 43

ఉత్పతన్నో యో బృహత్కీ ర్తి ర్బృహస్పతి రివాపరః | ఊర్ధ్వరేతా స్తత స్సోథ వసన్వై భ్రాతు రాశ్రమే.

గోధర్మాన్‌ సౌరభేయాంస్తు ఋషభాత్‌ శ్రుతవాంస్తు సః | తస్య భ్రాతా పితుర్యోవై చకార భరణం తదా.

తస్మి న్నివసత స్తస్య యదృచ్ఛా77గత్యగోవృషః | యజ్ఞార్థ మాహృతం బర్హి శ్చఖాద సరభీసుతః. 46

జగ్రాహ తం దీర్ఘతమా శ్శృఙ్గయో స్తం చతుష్పదమ్‌ | తేనాసౌ నిగృహీతస్తు న చచాల పదాత్పదమ్‌. 47

తతో7బ్రవీ ద్వృష స్తం వై ముఞ్చ మాం బలినాం వర |

న మయా77సాదిత స్త్వాదృక్‌బలవాంశ్చ వనే క్వచిత్‌. 48

భవతో7త్ర సమం వాపి న హి మే బల మక్షయమ్‌ | ముఞ్చ తాతేతి చ పునః ప్రీత స్తేహం వరం వృణు.

ఏవ ముక్తో7బ్రవీ దేనం జీవ& స త్వం క్వ యాస్యసి |

ఏష త్వాం న విమోక్ష్యామి పున స్త్వాహ చతుష్పదః. 50

ఋషభః: నాస్మాకం విద్యతే తాత పాతకం స్తేయమేవ వా |

భక్ష్యాభక్ష్యం తథాచైవ పేయాపేయం తథైవచ. 51

ద్విపదాం బహవో హ్యేతే ధర్మా నైతే గవాం స్మృతాః|కార్యాకార్యం న వైచిత్ర్యం గమ్యాగమ్యం తథై వ చ.

సూతః: గవాం ధర్మం స వై శ్రుత్వా సమ్ర్భాన్తస్తు విసర్జితః |

భక్త్యాన్న పానదానాత్తు గోపతిం తం ప్రసాదయత్‌. 53

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: ''మహాత్ముడగు బలికి మానుషి అగు భార్యయందు ఐదుగురు కుమారులు ఎట్లు కలిగిరి? అతని భార్య (అగు మనుష్యస్త్రీ) ఎవరు? వారిని ఆమెయందు కనిన ముని ఎవరు? ఎట్లు వారిని అతడు జన్మింపజేసెను? ఆ ముని మాహాత్మ్య ప్రభావములు ఎట్టివి? ఇది అంతయు మాకు తెలుపుము.''

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: పూర్వము అంగిరోముని కుమారుడు ఉచ (త) థ్యుడను ప్రసిద్ధుడగు ఋషి ఉండెను. ఈ మహాత్ముని భార్య పేరు మమత. ఇతని తమ్ముడును దేవగురువును బ్రహ్మతేజస్సంపన్నుడును అగు బృహస్పతి ఒకమారు తన వదినెను- ఈ మమతను-కామించెను. ఆమె ఇట్లనెను: ''నేను నీకు వదినెను. గర్భవతిని. నా గర్భమునందున్న నీయన్న కుమారుడు షడంగ వేదవేత్త. ఇట్టి ఈ మహాగర్భము నీ పె కోపించును. నీవును అమోఘ వీర్యుడవు. కనుక నీవు నన్ను కూడుట మంచిపనికాదు. కనుక తగని ఈ ప్రయత్నము మానుకొనుట మంచిది. ఈ సమయమునకు తగిన విషయము ఇది. నీవు ఏమనుకొనినను సరియే.''

బృహస్పతి బ్రహ్మతేజస్సంపన్నుడే మహాత్ముడే కాని అతడు తన కామమును నిగ్రహించుకొనలేకపోయెను. అందుచే అతడు ధర్మాత్ముడై యుండియు కామములేని తన వదినెను కూడెను. సంయోగక్రమములో బృహస్పతి తన శుక్రమును మమతా గర్భమునందు విడుచుసమయమున ఆమె గర్భమునందున్న శిశువు ఇట్లు పలికెను: ''తండ్రీ! నీవు చేయుచున్న ఈ పని చాల నీచమయినది. ఇచ్చటనో-ఇద్దరు ఉండుటకు అవకాశములేదు. నీ రేతస్సును వ్యర్థముకానికి. (అదియు సఫలమై శిశువు అగును.) కాని నేను ముందుగా ఇచటకు వచ్చి ఉన్నాను.'' ఈ శిశువు ఇట్లనగా బృహస్పతి క్రుద్ధుడయి అతనిని శపించెను. ఆ శిశువు తన అన్నగారి కుమారుడు. గర్భమునందున్న పసికందు. బృహస్పతి తానును ఋషి. ఐనను కాముకుడు. ''ఇటువంటి సమయమున నన్ను వారించితివి కావున నీవు దీర్ఘ మగు తమస్సును (అంధత్వమును) ప్రవేశింతువు.'' అని అతడు అతనిని శపించెను.

తరువాత మమతకు శిశువు జనించెను. అతడు రెండవ బృహస్పతి వంటివాడు- మహాకీర్తి సంపన్నుడగు ఋషి-అయ్యెను. కాని ఈ శాపముచే అతడు దీర్ఘతముడు అనబడెను. అతడు ఊర్ధ్వరేతస్కుడు (బ్రహ్మచర్య ధర్మమున ఇంద్రియమును నిగ్రహించుకొనినవాడు.)

అతడు తన (తండ్రి) సోదరుని ఆశ్రమమునందు నివసించుచు ఒకమారు సురభి (కామధేనువు) వంశము వారికి సంబంధించిన గోధర్మములను ఒకానొక ఋషభము వలన వినెను. ఎట్లనగా-

ఈ దీర్ఘతముడు తన తండ్రికి సోదరుని పొషణలో అతని ఆశ్రమమున నివసించుచుండెను. ఒకనాడు దాని లోనికి దై వవశమున ఒక వృషభము వచ్చెను. యజ్ఞమునకై తెచ్చి ఉంచిన దర్భలను అది తినెను. దీర్ఘతముడు దాని కొమ్ములు బిగించి పట్టుకొనెను. అది కదలలేకపోయెను. ''తండ్రీ! నన్ను విడువుము. నీవు బలశాలురలో గట్టివాడవు. ఈ వనమున నీవంటి బలశాలి నాకు మరెవ్వరును కనబడలేదు. నా అక్షయ బలమును నీ బలముతో సమానముకాదు. నీ బలమునకు నేను ప్రీతుడనై తిని. నన్ను విడువుము. నీకు వరముల నిత్తును.'' అని అది మునితోననెను. ''నీవు ప్రాణములతో నన్ను తప్పించుకొని పోలేవు. నేను నిన్ను విడువను. (నీవు మాదర్భలను తింటివి.)'' అని ముని వృషభముతో ననెను. అంత వృషభము ''నాయనా! మాకు ఇది దొంగతనము. ఇది చేయుట పాతకము. అనునది లేదు. ఇది భక్ష్యము-ఇది అభక్ష్యము-ఇది పేయము-ఇది అ పేయము (త్రాగదగినది-త్రాగరానిది) అను నియమము మాకు లేదు. ఇవి అన్నియు మానవులకు మాత్రమే. ఇది చేయతగినది. ఇది చేయతగనిది. వీరిని కూడవచ్చును. వీరిని కూడరాదు. అను వ్యవస్థ కూడ మాసవులకే కాని మాకు లేదు.'' అనెను.

దీర్ఘతముడు ఈ గోధర్మములను విని తడబాటు చెంది ఆ వృషభమును విడిచెను. దానికి భ క్తి పూర్వకముగా అన్నపానములనిచ్చి దానిని ఆనుగ్రహింపజేసికొనెను.

ప్రసాదితే గతే తస్మి న్గోధర్మాన్‌భ క్తిత శ్ర్శుతాన్‌ మనసైవ సమాదధ్యౌ తన్నిష్ఠ స్తత్పరాయణః. 54

తతో యవీయసః పత్నీం గౌతమస్యాభ్యపద్యత | తస్యావలేపం మత్వా తు సోనడ్వానివ న క్షమే. 55

గోధర్మంతు పరం మత్వా స్నుషాం తా మభ్యపద్యత |

నిర్భర్త్స్య తాం తథా మూర్ధ్నా బాహుభ్యాం సమ్ర్పగృహ్యచ. 56

భావ్య మర్థం తు తం జ్ఞాత్వా మహాత్మా తా మువాచ హ |

విపర్యయం తు తం బుద్ధ్వా మాహాత్మ్యా త్తమువాచ సా. 57

విపర్యం తు త్వం లబ్ధ్వా అనడ్వ న్న నివర్తసే |

గమ్యాగమ్యం న జానీషే గోధర్మా త్ర్పార్థయ న్త్స్నుషామ్‌. 58

దుర్వృత్తత్వా త్త్యజామ్యద్య గచ్ఛవా7నేన కర్మణా |

యస్మా త్త్వమంధో వృద్ధశ్చ భర్తవ్యో దురనుష్ఠితః. 59

కాష్ఠే సముద్గే ప్రక్షిప్య గఙ్గామ్భసి సముత్సృజత్‌ | త మూహ్యమానం వేగేన స్రోతసో7భ్యాశ మాగతః. 60

అట్లు వృషభము అనుగ్రహముతో వెళ్ళిన తరువాత దీర్ఘతముడు తాను గోవృషభమునుండి భ క్తితో వినిన గోధర్మములను తనకు పరమార్థముగా ముఖ్యాశ్రయముగా భావించి వానినే ధ్యానింపసాగెను. అతని తమ్ముని పేరు గౌతముడు. అతని భార్యను ఈ దీర్ఘతముడు కలియగోరెను. ఆమె తనకు కోడలివంటిది. ఐనను అతడు గోధర్మములను శ్రేష్ఠములనుగా తలచి అట్లు సంకల్పింనెను-(ఆమె అంగీకరించలేదు.) అది ఆమె గర్వము అని తలచెను. అతడది సహించలేకపోయెను. అతడామెను బెదరించెను. ఆమె తలను తన బాహువులతో అదిమిపట్టెను. అతడు మహాత్ముడయ్యు జరుగవలసినది ఇట్లు ఉన్నదని నిశ్చయించి తన కోరిక ఆమెతో పలికెను: అతడు మహాత్ముడని ఆమెకు తెలియును. కాని అతడు విపర్యయమునకు సిద్ధపడినాడు. (మానవుడయియుండి పశు ధర్మమునకు పాల్పడుట విపర్యయము-విరుద్ధ ధర్మము.) అది చూచి ఆమె అతనితో ఇట్లు పలికెను: ''నీవు విపర్యయమునకు పూనితివి. ఎద్దువలె ప్రవర్తించుచున్నావు. ఎవరిని కలియవచ్చునో ఎవరిని కలియరాదో ఎరుగకున్నావు. వృషభ ధర్మము నవలంబించి కోడలిని పొందగోరుచున్నావు. నీ నడువడి మంచిదికాదు. నీవు గ్రుడ్డివాడవు. వృద్ధుడవు. నిన్ను మేము పోషించుచు కాపాడవలసిన మాట నిజమే. ఐనను నీ ప్రవర్తనము మంచిదికాదు. కావున నిన్ను విడుచుచున్నాము. ఇది నీ ఈ కర్మమునకు ఫలితము; పొమ్ము.'' అని పలికి ఆమెఅతనిని కొయ్య పెట్టెలో ఉంచి కట్టివేసి గంగా జలములో విడిచెను.

బలిభార్యాయాం దీర్ఘతమస స్సన్తానోత్పత్తిః.

జగ్రాహ తం స ధర్మాత్మా బలి ర్వైరోచని స్తథా | అన్తఃపురే జుగోపైనం భక్ష్యభోజ్యైశ్చ తర్పయ&. 61

ప్రీతశ్చైనం వరేణాథ చ్ఛన్దయామాస వై బలిమ్‌ | తస్మాచ్చ స వరం వవ్రే పుత్త్రార్థ మసురోత్తమః. 62

సన్తానార్థం మహాభాగ భార్యాయాం మమ మానద | పుత్త్రా న్ధర్మార్థత త్త్వజ్ఞా నుత్పాదయితు మర్హసి. 63

ఏవ ము క్త స్స దేవర్షి స్తథా7స్త్వి త్యుక్తవా న్ర్పభుః |

తత స్స రాజా స్వాం భార్యాం సుదేష్టాం నామ ప్రాహిణోత్‌. 64

అన్ధం వృద్ధం చ తం జ్ఞాత్వా న సా దేవీ జగామ హ |

శూద్రీం ధాత్రేయికాం తస్మా అన్ధాయ ప్రాహిణో త్తదా. 65

తస్వాం కక్షీవదాదీంశ్చ శూద్రయోన్యా మృషి ర్వశీ| జనయామాస ధర్మాత్మా శూద్రా నిత్యేవమాదిక్‌&. 66

ఉవాచ తం బలీ రాజా దృష్ట్వా కక్షీవదాదికా&| అధీతా నృషిధర్మజ్ఞా నీశ్వరా న్ర్బహ్మవాదినః. 67

శుద్ధా న్ర్పత్యక్షధర్మాణ శ్శుచిమద్బుద్ధిసంయుతా& | మమైవమితి హోవాచ తం దీర్ఘతమసం బలిః. 68

నేత్యువాచ తత స్తం వై మమైవ మితి చాబ్రవీత్‌ | ఉత్పన్నా శ్శూద్రయోనౌ తు న తే క్షేత్రే7సురోత్తమ.

అన్ధం వృద్ధం చ మాం జ్ఞాత్వా సుదేష్టా మహిషీ తవ| ప్రాహిణో దవమానాన్మే శూద్రాం ధాత్రేయికాం నృప. 70

దీర్ఘతముడట్లు గంగా ప్రవాహమున కొట్టుకొనిపోవుచుండెను. ఆ సమీపమునకు వచ్చియుండిన విరోచన పుత్త్రుడు ధర్మాత్ముడుఅగు బలి అది చూచి అతనిని తీసికొనెను. అతడతనిని భక్ష్య భోజ్యములతో తృప్తినందించుచు తన అంతఃపురమునందు దాచెను. దీర్ఘతముడు ప్రీతుడై బలిని వరము కోరుకొమ్మనెను. ఆ ఆసురోత్తముడు పుత్త్రులు కావలెనని కోరెను. పూజ్యమునీ! నావంశము (మానవులలో) కొనసాగునట్లు నాభార్యయందు ధర్మార్థ త త్త్వజ్ఞులగు కుమారులను మీరు జన్మింపజేయవలయునని వేడెను. ఆ దేవర్షి సరేయనెను. తన భార్యలలో సుదేష్ణ యనునామెను మునికడకు పొమ్మనెను. ఆరాణి అతడు అంధుడును వృద్ధుడును అని ఎరిగి అతనికడకుపోవక తన దాది కూతురగు శూద్రస్త్రీని పంపెను. చిత్త నిగ్రహముకల ధర్మాత్ముడు ఆ దీర్ఘతముడు ఆమెయందు కక్షీవాన్‌ మొదలగు శూద్రులను జనింపజేసెను. వారందరును జాతిచే శూద్రులు. ఐనను వారందరును అధ్యయనము చేసినవారు- ఋషిత్వము నందినవారు. ఈశ్వరత్వము కలవారు. బ్రహ్మవాదులు (వేదవేదాంగ వేదాంత తత్త్వము నెరిగినవారు.) (శారీరకముగను చిత్తమునను) శుద్ధులు. ధర్మమును సాక్షాత్కరించుకొనినవారు. శుచియగు బుద్ధికలవారు. ఇట్టి వీరిని చూచి బలి 'వీరు నా కుమారులే అగుదురా?' అని దీర్ఘతము నడుగగా 'కాదు. నా కుమారులు.' అని అతడనెను. 'వీరు నావలన శూద్రయోనియందు జనించినారు. నీ భార్యయందు కలిగినవారు కారు.' అని జరిగినదంతయు రాజునకు ముని చెప్పెను.

తతః ప్రసాదయామాస బలి స్త మృషిసత్తమమ్‌ | బలి స్సుదేష్ణాం తాం దేవీం భర్త్సయామాస దానవః. 71

పునశ్చైనా మలఙ్కృత్య ఋషయే ప్రత్యపాదయత్‌ | తాం స దీర్ఘతమా దేవీ మలఙ్కృతవతీం తదా. 72

దధ్నా లవణమిశ్రేణ అభ్యక్తం మధు కేన చ | లిహ మా మజుగుప్సన్తీ త్వాపాదతలమ స్తకమ్‌. 73

తత స్త్వం ప్రాప్స్యసే దేవి పుత్త్రాన్వై మనసేప్సితా& | తస్య సా తద్వచో దేవీ సర్వం కృతవతీ తదా (థా).

తస్య సా7పాన మాసాద్య దేవీ పర్యహర త్తదా | తా మువాచ తత స్సోథ య త్తే పరిహృతం శుభే. 75

వినా7సానం కుమారం తు జనయిష్యసి పూర్వజమ్‌ |

సుదేష్ణా: నార్హసి త్వం మహాభాగ పుత్త్రం మే దాతు మీదృశమ్‌. 76

తోషితస్తు యథాశ క్తి ప్రసాదం కురు మే ప్రభో | దీర్ఘతమాః: తవాపచారా ద్దేవ్యేష నాన్యథా భివితా శుభే.

దేవ్యపానం వినా జాతః పుత్త్ర స్తే దాస్యతే ఫలమ్‌ | తస్యాపానం వినాచై వయోగ్యో భావీ భవిష్యతి. 78

తస్యా దీర్ఘతమా7ఙ్గేషు కుక్షౌ స్పృష్ట్వేద మబ్రవీత్‌ | ప్రాశితం దధి యద్యగ్రే మమాఙ్గస్థం శుచిస్మితే. 79

తేన తే పూరితో గర్భః పౌర్ణమాస్యామివోడురాట్‌ | భవిష్యన్తి కుమారాస్తే పఞ్చ దేవసుతోపమాః. 80

తేజస్వినః పరాక్రాన్తా యజ్వానో ధార్మికాశ్చ తే | సూతః: అఙ్గా దఙ్గ స్సుదేష్ణాయా జ్యేష్ఠపుత్త్రో వ్యజాయత.

వఙ్గ స్తథా కలిఙ్గస్తు పుణ్డ్రస్సుహ్మ స్తథైవచ | అఙ్గాదయస్తు పఞ్చైతే బలేః పుత్ర్రాస్తు క్షేత్రజాః. 82

ఇత్యేతే దీర్ఘతమసా సుతా దత్తా స్తథా బలేః | ప్రతిష్ఠా మాగతా స్తస్య బ్రాహ్మణ్యం కారణం యతః. 83

తతో మానుషయోన్యాం స జనయామాస వై ప్రజాః |

తరువాత బలి మరల ఆఋషి సత్తముని అనుగ్రహింపజేసికొని తన భార్యను చీవాట్లు వేసెను. ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించెను. నీవు నా శరీరమునందంతటను పెరుగు ఉప్పు ఇప్పతేనె పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలయును. అపుడు నీకు మనస్సునకు ఇష్టులగు కుమారులు కలుగుదురు. అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు అట్లే చేసెను. కాని అపానప్రదేశమును నాకక విడిచెను. ఇందులవలన నీకు జ్యేష్ఠుడు అపానము లేని కుమారుడు కలుగునని మునియనెను. ''మహాభాగా! నిన్ను వేడుచున్నాను. నాకట్టి కుమారు నీయవలదు. నాయథాశక్తి నీమనన్తృప్తి కలిగించితిని. అనుగ్రహించుము.'' అని రాణి వేడగా ''నీవు మంచిదానవే. కాని ఈ అపచారమువలన ఇది ఇట్టే జరుగును. అపానము లేనివాడయినను ఆ కలిగెడి పుత్త్రుడు యోగ్యుడే అగును.'' అని ముని ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరల ఇట్లు పలికెను: ''శుచియగు చిరునవ్వు కలదానా! నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి. కావున నీ గర్భమునందు అది పూర్ణిమాతిథియందలి చంద్రుడువలె నిండినది. దాని ఫలితముగా నీకు దేవకుమారులంవంటి కుమారు లైదుగురు జనింతురు. వారు తేజోవంతులు-పరాక్రమవంతులు యజ్ఞములు చేయువారు ధార్మికులు నగుదురు.''

పిమ్మట సుదేష్ణ అంగము (గర్భము)నుండి జ్యేష్ఠుడుగా అంగుడును వంగ కలింగ పుండ్ర సుహ్ములను మరినలుగురును-ఐదుగురు బలి దైత్యునకు మానవియగు భార్యకు« క్షేత్రజులుగా కుమారులు కలిగిరి. దీర్ఘతముడు బలికి ఇచ్చిన వీరందరును అతని బ్రాహ్మణ్య ప్రభావమున లోకమున ప్రతిష్ఠ నార్జించి గొప్పవారయిరి. ఇట్లు బలి తాను దైత్యుడయ్యు మానవ స్త్రీయందు సంతానమును కనెను.

తతస్తు దీర్ఘతమసం సురభి ర్వాక్య మబ్రవీత్‌. 84

వి2చార్య యస్మా ద్గోధర్మం తే ప్రమాణీకృతం ప్రభో | భక్త్యా ప్రపద్య యో7స్మాకం తేన ప్రీతాస్మి తేనఘ.

తస్మా త్తుభ్యం తమో దీర్ఘ మాఘ్రాయాపనయా మ్యహమ్‌ |

బార్హస్పత్యం తు విధివ త్పాప్మ య త్తిష్ఠతి త్వయి. 86

జరాం మృత్యుం తమశ్చైవ మాఘ్రాయాపనుదామి తే |

సద్య స్త్వాఘ్రాతమాత్రే తు హృతే తమసి వై మునేః. 87

_______________________________________

« భర్త ఉండగా అతని అనుమతితో కాని భర్త మరణించిన తరువాతనైనను అతని కుటుంబపు పెద్దల అనుమతితో కాని అతని భార్యయందు పరునివలన జనించిన కుమారులు క్షేత్రజులు.

ఆయుష్మాన్వపుషా చైవ చక్షుష్మాంశ్చ తతో7భవత్‌| గవా హృతే తమసి వై గోతమస్తు తతో7భవత్‌. 88

కక్షీవానసి గత్వా7సౌ సహ పిత్రా గిరివ్రజమ్‌ | దృష్ట్వా పితు స్సమీ పేవై ఉపాతిష్ఠ చ్చిరం తపః. 89

తతః కాలేన మహతా తపసా భావితస్తు సః |

విధూయ* శూద్రాం తు తనుం బ్రాహ్మణం ప్రాప్తవా న్ర్పభుః. 90

తతో7బ్రవీ త్పితా తం వై పుత్త్రవా నస్మ్యహం త్వయా |

సత్పుత్త్రేణతు ధర్మజ్ఞ కృతార్థో7హం యశస్వినా. 91

ముక్త్వాత్మాన మసావేవ ప్రాప్తవా న్ర్బహ్మణః క్షయమ్‌ |

బ్రాహ్మణ్యం ప్రాప్య కక్షీవా న్త్సహస్ర మసృజ త్సుతాన్‌. 92

కూశ్మాణ్డా గౌతమా స్తే వై సుతాః కక్షీవత స్మ్సృతాః | ఇత్యేష దీర్ఘతమసో బలే ర్వైరోచనస్య చ. 93

సమాగమో వః కథిత స్సన్తతి శ్చోభయో స్తథా | బలి స్తా నభివాద్యాథ పఞ్చ పుత్త్రా నకల్మషా&. 94

కృతార్థ స్సోపి ధర్మాత్మా యోగమాయా77వృత స్స్వయమ్‌ |

అదృశ్య స్సర్వభూతానాం కాలాపేక్షీ సవై ప్రభుః. 95

తరువాత సురభి (కామధేనువు) దీర్ఘతమునితో ఇట్లు పలికెను: ''ప్రభూ! నీవు గోధర్మమును ఉత్తముగా భావించి దానిని ప్రమాణముగా తీసికొంటివి. నీవు మాయందు ప్రప త్తి పూర్వకమగు భ క్తి చూపితివి. అందుచే నేను నీయందు ప్రీతి చెందితిని. నేను నిన్ను ఆఘ్రాణించి నీయందు బృహస్పతి శాపము చేతను అతని రేతఃసంసర్గ పాపము చేతను సంక్రమించిన దోషమును జరామృత్యువులను దీర్ఘమగు తమస్సును (దృష్టియందలి దోషమును) తొలగింతును.'' ఇట్లు పలికి సురభి దీర్ఘతముని ఆఘ్రాణించి (ముక్కుతో పీల్చివేసి) అతని యందలి ఈ దోషములన్ని యు లాగివేసెను. దానితో అతడు ఆయుష్మంతుడు వపుష్మంతుడు (సుందర శీరుడు) చక్షుష్మంతుడు (చూడగలవాడు) అయ్యెను. గోవుచే అతని 'తమస్సు' హరింపబడినందున అతనికి ''గో-తముడు'' అను స్రసిద్ధి వచ్చెను.

తరువాత 'కక్షీవాన్‌' తన తండ్రి (దీర్ఘతముని)తో కూడ గిరివ్రజమునకు పోయి అచ్చటనేయుండి చిరకాలము తపము నొనరించెను. అనంతరము అతిదీర్ఘకాలమునకు అతడు తపస్సుచే భావితుడై (సంస్కారమునంది) శూద్ర (సంస్కారముకల) శరీరమును విడిచి బ్రాహ్మణ్యమును పొందెను. అంతట తండ్రి దీర్ఘతము డతనితో ''నాయనా! నేను నీచే పుత్త్రవంతుడనైతిని. నీవు సత్పుత్త్రుడవు. ధర్మజ్ఞడవు. కీ ర్తిమంతుడవు. నీచే నేను కృతార్థుడనయితిని. నీవు ఈనీవుగా (ఈ దేహము కలవాడుగా) ఉండియే దేహమును (దేహమందలి సంస్కారములను) విడిచి బ్రహ్మయొక్క స్థానమును (బ్రాహ్మణ స్థానమును బ్రాహ్మణత్వమును) పొందితివి.'' అనెను.

కక్షీవాన్‌ ఇట్లు బ్రాహ్మణత్వమును పొందిన తరువాత అతనికి వేయిమంది కుమారులు కలిగిరి. వారికి కూశ్మాండులు గౌతములు అని నామము.

ఇట్లు మీకు దీర్ఘతమునికిని విరోచన సుతుడగు బలికిని సమాగమము కలుగుటయు ఇరువురి సంతానమును తెలిపితిని.

అనంతరము బలి అకల్మషులగు అంగుడు మొదలగు ఐదుమంది కుమారులను అభివాదము చేసి కృతార్థుడయ్యెను. ఆ ధర్మాత్ముడు తాను మోగమాయచే కప్పువడి ఏ భూతములకును కనబడనివాడయి రానున్న కాలమును ఎదురు చూచుచు ఉండెను.

__________________________________________

*చాత్మనః కాయం

తత్రాఙ్గస్యతు దాయాదో రాజా77సీ ద్దధివాహనః | దధివాహనపుత్త్రస్తు రాజా దధిరథ స్స్మృతః. 96

ఆసీ ద్ధధిరథాపత్యం విద్వా న్ధర్మరథో నృపః | సహి ధర్మరథ శ్ర్శీమాం స్తేన విష్ణుపదే గిరౌ. 97

సోమ శ్శక్రేణ వై రాజ్ఞా సహ పీతో మహాత్మనా | సమో ధర్మథరస్యాపి పుత్త్ర శ్చిత్రరథః కిల. 98

తస్య చైత్రరథః పుత్త్ర స్తస్మా ద్దశరథః కిల | రోమపాద ఇతి ఖ్యాతో యస్య శాన్తా సుతా7భవత్‌. 99

అథ దాశరథి ర్వీర శ్చతురఙ్గో మహాయశాః | ఋశ్యశృఙ్గ ప్రసాదేన జజ్ఞే స్వకులవర్ధనః. 100

చతురఙ్గస్య పుత్త్రస్తు పృథులాక్ష ఇతి స్మృతః | పృథులాక్షసుతశ్చాపి చమ్పో నామ బభూవ హ. 101

చమ్పస్య తు పురీ చమ్పా పూర్వం యా మాలినీ భవత్‌ | పూర్ణభద్రప్రసాదేన హర్యఙ్గో7స్య సుతో7భవత్‌.

జజ్ఞే విభాణ్డకాచ్చాస్య వరణ శ్శత్రువారణః | అవతారయామాస మహీం మన్త్రై ర్వాహనముత్తమమ్‌. 103

హర్యఙ్గస్య తు దాయాదో జాతో భద్రరథః కిల | అథ భద్రరథస్యా సీ ద్బృహత్కర్మా జనేశ్వరః. 104

బృహద్భాను స్సుత స్తస్య తస్మాజ్జజ్ఞే బృహన్మనాః |

బృహన్మనాస్తు రాజేన్ద్రో జనయామాసవై సుతమ్‌. 105

నామ్నా జయద్రథం వీరం యస్మా జ్జాతో బృహద్రథః ఆసీ ద్బృహద్రథస్యాపి విశ్వజి జ్జనమేజయః.

దాయాద స్తస్య చాఙ్గో వై యస్మా త్కర్ణో7భవ న్నృపః |

కర్ణస్య వృషసేనస్తు వృషసేని స్తదాత్మజః. 107

ఏతే7ఙ్గా త్క్రమశస్సర్వే రాజానః కీర్తితా మయా | విస్తరేణానుపూర్వ్యాచ్చ పూరోశ్చ శృణుత ద్విజాః.

ఋషయః : సూతాత్మజః కథం కర్ణః కథ మఙ్గస్య చాత్మజః |

ఏత దిచ్ఛామ హే శ్రోతు మత్యన్తకుశలో హ్యసి. 109

సూతః : బృహాద్భానో స్సుతో జజ్ఞే నామ్నా రాజాబృహన్మనాః |

తస్య పత్నీ ద్వయం హ్యాసీ చ్చైద్యస్య తనయే శుభే. 110

యశోదేవీచ సత్యాచ తయో ర్వంశ మిమం శృణు | జయద్రథంతు రాజానం యశోదేవీ వ్యజీజనత్‌. 111

సా బృహన్మనస స్సత్యా విజయం నామ విశ్రుతమ్‌ | విజయస్య బృహత్పుత్త్ర స్తస్య పుత్త్రో బృహద్రథః.

బృహద్రథస్య పుత్త్రస్తు సత్యకర్మా మహామనాః | సత్యకర్మసుతశ్చాపి సూత స్త్వతి(ధి)రథ స్మ్సృతః.

యః కర్ణం ప్రతిజగ్రాహ తేన కర్ణస్తు సూతజః |

ఏత ద్వ స్సర్వ మాఖ్యాతం మ త్కర్ణం ప్రతి చోదితమ్‌. 114

ఇతి శ్రీమత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే తుర్వస్వాదిస న్తతికథనం

నామాష్టచత్వారింశో7ధ్యాయః.

వీరిలో అంగునకు దధవాహనుడు అతనికి దధిరథుడు అతనికి విద్వాంసుడగు ధర్మరథుడు కుమారులయిరి. ఇతడు చాల పూజ్యుడు. విష్ణుపదమను పర్వతమున ఇతడు దేవరాజగు ఇంద్రునితో కూడి సోమపానము చేసెను. అతనికి తండ్రితో సముడగు చిత్రరథుడు అతనికి చైత్రరథుడు అతనికి రోమపాదుడని ప్రసిద్ధుడును శాంతకు తండ్రియు అగు దశరథుడు (ఇతడు శ్రీరాముని తండ్రియగు దశరథునకు సనాముడేమో!) అతనికి ఋశ్యశృంగుని అనుగ్రహమున వంశవర్ధనుడగు చతురంగుడు అతనికి పృథులాక్షుడు అతనికి పూర్వపు మాలినీ నగరమును చంపానగరి యని ప్రసిద్ధికి తెచ్చిన చంపుడు అతనికి పూర్ణభద్రముని అనుగ్రహమున హర్యంగుడు విభాండకుని దయవలన వారణుడు కుమారులయిరి. ఈ వారణుడు శత్రువులను నిరోధించగల వీరుడు. మంత్రబలముతో ఉ త్తమ వాహనమును (ఉచ్చైఃశ్రవమును) భూమికి దిగి వచ్చునట్లు చేసెను. హర్యంగునకు భద్రరథుడు అతనికి బృహత్కర్మ అతనికి బృహద్భానుడు అతనికి బృహన్మనసుడు అతనికి జయద్రథుడు అతనికి జనమేజయుడు అతనికి అంగుడు అతనికి కర్ణుడు (కుంతికి కానీన సుతుడు) అతనికి వృషసేనుడు అతనికి వృషసేని కుమారులయిరి. ఇది అంగ వంశీయులగు రాజుల పరంపర. ఇక పూరువంశమును వివరింతును.

అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: ''కర్ణుడు సూతుని కుమారుడని విందుము. ఇతడు అంగుని కుమారు డెట్టయ్యెను? నీవు ఇవి బాగుగ ఎరిగినవాడవు. చెప్పగలవాడవు. కావున నీనుండి వినగోరుచున్నాము.''

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన బృహద్భానునకు బృహన్మనసుడు కుమారుడంటినికదా! అతనికి చైద్యుని కూతురు యశోదాదేవి-సత్య-అనువారు ఇద్దరు భార్యలు. యశోదాదేవికి జయద్రథుడును సత్యకు విజయుడును కుమారులయిరి. విజయునకు బృహత్‌ అనునతడు అతనికి బృహద్రథుడు అతనికి సత్యకర్మన్‌ అతనికి అతి(ధి)రథ సూతుడు కుమారులయిరి. ఈతడు కర్ణుని తన కుమారునిగా గ్రహించెను. «అందుచే కర్ణునకు సూతపుత్త్రుడను ప్రసిద్ధి వచ్చెను.

మీరు కర్ణుని విషయమున ప్రశ్నించినదంతయు మీకు ఇట్లు తెలిపితిని.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున తుర్వసుడు మొదలగువారి వంశముల వృత్తాంతములనెడు నలువది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters