Sri Matsya Mahapuranam-1    Chapters   

స ప్తపంచాశో7ధ్యాయః.

రోహిణీచన్ద్రశయనవ్రతమ్‌.

నారధః : దీర్ఘాయురారోగ్య కులాభివృద్ధి యుక్తః పుమా న్త్సర్వగుణాన్విత స్స్యాత్‌ |

ముహుర్ముహు ర్జన్మని యేన సమ్య గ్ర్వతం సమాచక్ష్వ త దిన్దుమౌళేః. 1

ఈశ్వరః : త్వయా సమ్యగిదం పృష్ట మముత్రాక్షయకారకమ్‌ |

రహస్యం తవ వక్ష్యామి యత్పురాణవిదో విదుః. 2

రోహిణీచన్ధ్రయనం నామ వ్రత మిహోత్తమమ్‌ | తస్మి న్నారాయణస్యార్చా మర్చయే దిన్దునామభిః. 3

యదా సోమదినే *శుక్లా భ##వే త్పఞ్చదశీ క్వచిత్‌ | అథవా బ్రహ్మనక్షత్రం పౌర్ణమాస్యాం ప్రజాయతే. 4

తదా స్నానం నరః కుర్యా త్పఞ్చగవ్యేన సర్షపైః | ఆప్యాయస్వేతి చ జపే ద్విద్వా నష్టశతం పునః. 5

శూద్రోపి పరయా భక్త్యా పాషణ్డాలాపవర్జితః | సోమాయ వరదాయాథ విష్ణవేచ సమోనమః. 6

కృతజప్య స్స్వభవన మాగత్య మధుసూదనమ్‌ | పూజయే త్ఫలపుషై#్పశ్చ సోమనామాని కీర్తయ&. 7

సోమాయ శాన్తాయ నమోస్తు పాదా వనన్తధామ్నేతి చ జానుజఙ్ఘే |

ఊరుద్వయంచాపి జలోదరాయ సమ్పూయే న్మేఢ్ర మనఙ్గబన్ధోః. 8

నమోనమః కామసుఖప్రదాయ కటి శ్శశాఙ్కాయ సదార్చనీయా |

తథోదరం చాప్యమృతోదరాయ నాభి శ్శశాఙ్కాయ నమోర్చనీయః. 9

నమోస్తు చన్ద్రాయ ముఖం ప్రపూజ్యం దన్తా ద్విజానా మధిపాయ పూజ్యాః |

ఆస్యం నమ శ్చన్ద్రమ సేతి పూజ్య మోష్ఠౌ ¡ కుముత్షణ్డవనప్రియాయ. 10

నాసాంచ నాధాయ తథౌషధీనా మానన్దబాజాయ పునర్ర్భువౌ చ |

నేత్రద్వయం పద్మవిభంజనాయ ఇన్దీవరశ్యామకరాయ శౌరేః. 11

నమ స్సమస్తాధ్వరవన్దితాయ కర్ణద్వయం దైత్యనిషూదనాయ |

లలాటమిన్దో రుదధిప్రియాయ కేశా స్సుషుమ్నాధిపతే7భిపూజ్యాః. 12

శిర శ్శశాఙ్కాయ నమో మురారే ర్విశ్వేశ్వరాయేతి నమః కిరీటమ్‌ |

పద్మప్రియే రోహిణి వామలక్ష్మి సౌభాగ్యసౌఖ్యామృత చారుకాయే. 13

దేవీం సుసమ్పూజ్య సుగన్ధపుషై#్ప ర్నైవేద్యధూపాదిభి రిన్దుపత్నీమ్‌ |

ఏబది ఏడవ అధ్యాయము

రోహిణీ చంద్రశయన వ్రతము

నారదుడు ఈశ్వరు నిట్లడిగెను: ''చంద్రమౌళీ! మానవుడు ఏ వ్రత మాచరించినచో ఇహలోకమున నిరంతరముగా దీర్ఘాయురారోగ్య వంశాభివృద్ధి నర్వగుణ సమృద్ధులు పొందునో అట్టి వ్రతము నుపదేశింపుము.'' అనగా ఈశ్వరుడిట్లు తెలపెను: నీవు చక్కగా అడిగితివి. పురాణవేత్తలు చెప్పెడి వ్రతము ఒకటి పరలోకమునందు కూడ అక్షయ ఫలముల నిచ్చునది కలదు. అది చెప్పెదను. రోహిణీ చంద్రశయన వ్రత ముత్తమమయినది. ఈ వ్రతమున నారాయణ ప్రతిమను చంద్రనామములతో పూజించవలెను. పూర్ణిమా సోమవారముకాని రోహిణితో పూర్ణిమకాని ఐననాడు ద్విజులు) పంచగవ్యములతో ఆవపిండితో స్నానముచేసి 'ఆప్యాయస్వ నమేతు తే' అను మంత్రమును అష్టోత్తరశతము జపించవలెను. శూద్రులయినచో పాషండ (వేదవిరుద్ధములగు) వచనములు పలుకక ఇదే స్నానముచేసి వరదుడగు సోమునకును విష్ణునకును నమస్కారమను అర్థ మిచ్చు ఈ మంత్రమును అష్ఠోత్తరశతము జపించవలెను. పిమ్మట నదీతీరమునుండి స్వరృహమునకు వచ్చి చెప్పబోవు విధమున చంద్రనామములతో విష్ణుపూజ చేయవలెను.

  • 1. r¡ª«sW¸R…V aSLi»y¸R…V ƒ«sª«sVM cFyµ_ xmspÇظR…W„sV; 2. @ƒ«sLi»R½ µ³y®ªs[Võ ƒ«sª«sVM Ç؃«sV¬ds ÇÁLi}mnsV¿RÁ xmspÇÁ¸R…W„sV; 3. ÇÁÍÜ[µR…LS¸R…V ƒ«sª«sVM ELRiW xmspÇÁ¸R…W„sV; 4. NSª«sVxqsVÅÁúxmsµy¸R…V ƒ«sª«sVMc®ªs[Vú²R…Li xmspÇÁ¸R…W„sV; 5. aRPaSLiNS¸R…Vƒ«sª«sVM c NRPÉÓÁLi xmspÇÁ¸R…W„sV; 6. @ª«sVX»][µR…LS¸R…V ƒ«sª«sVM c DµR…LRiLi xmspÇÁ¸R…W„sV; 7. aRPaSLiNS¸R…V ƒ«sª«sVM c ƒyÕ³ÁLi xmspÇÁ¸R…W„sV; 8. ¿RÁLiúµy¸R…Vƒ«sª«sVM c ª«sVVÅÁLi xmspÇÁ¸R…W„sV; 9. µj…*Ç؃y ª«sVµ³j…Fy¸R…Vƒ«sª«sVMcµR…Li»yƒ±s xmspÇÁ¸R…W„sV; 10. ¿RÁLiúµR…ª«sV}qs ƒ«sª«sVM AxqsùLi xmspÇÁ¸R…W„sV: 11. NRPVª«sVVµR…xtsQLi²R…ª«sƒ«s úzms¸R…W¸R…Vƒ«sª«sVMcJuî¢ xmspÇÁ¸R…W„sV; 12. JxtsQµ³j…ƒyµ³y¸R…V ƒ«sª«sVMcƒyryLi xmspÇÁ ¸R…W„sV; 13. Aƒ«sLiµR…ÕdÁÇظR…V ƒ«sª«sVMcú˳ÏÁVª_ xmspÇÁ¸R…W„sV; 14. BLiµk…ª«sLRi aSùª«sVNRPLS¸R…V xmsµR…ø „s˳ÏÁLiÇÁƒy¸R…V ƒ«sª«sVMcúa][ú¾»½[ xmspÇÁ¸R…W„sV; 15. DµR…µ³j… úzms¸R…W¸R…V ƒ«sª«sVMcÌÁÍØÈÁLi xmspÇÁ¸R…W„sV; 16. xqsVxtsvª«sWõµ³j…xms»R½¹¸…[V ƒ«sª«sVMcZNP[aSƒ±s xmspÇظR…W„sV; 17. aRPaSLiNS¸R…V ƒ«sª«sVMcbPLRiM xmspÇÁ¸R…W„sV; 18. „sZaP[*aRP*LS¸R…V ƒ«sª«sVMcNTPLkiÈÁLi xmspÇÁ¸R…W„sV; @¬s BÈýÁV ¿RÁLiúµR…ƒyª«sVª«sVVÌÁ»][ „sxtñsv¬s @ª«s¸R…Vª«sª«sVVÌÁNRPV xmspÇÁ ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. (B¿RÁÈÁ úNRPª«sVª«sVVÍÜ[ ˳ÏÁVÇÁª«sVVÌÁƒ«sV xmspÑÁLi¿RÁV xmspÑÁLi¿RÁV ª«sVLiú»R½ª«sVV ª«sVWÌÁúgRiLi´R…ª«sVVÌÁ»][ NRPƒ«s‡Á²R…VÈÁÛÍÁ[µR…V) »R½LRiVªy»R½ "L][z¤¦¦¦ßÓá'¬s ÌÁOTPQQøgS ˳ت«sƒ«s¿Á[zqs ""r¢ÆØùª«sVX»R½ª«sV¸R…Vª«sVgRiV ª«sVƒ¯[x¤¦¦¦LRi aRPLkiLRiª«sVVNRPÌÁ L][z¤¦¦¦¬dsLRiWxmsÌÁOUPQQø!'' @¬s xqsVò¼½LiÀÁ ®µ…[„s¬s xqsVgRiLiµ³R…xmsoxtsQö µR…Wxmsµk…xms \®ƒs®ªs[µyùµR…VÌÁ»][ xmspÑÁLi¿RÁª«sÛÍÁƒ«sV.
  • ¡ తుకౌమోద

    సుప్త్వాచ భూమౌ పునరుత్థితేన స్నాత్వాచ విప్రాయ హవిష్యయుక్తః. 14

    దేయః ప్రభాతే సహిరణ్యవారికుమ్భో మనః పాపవినాశనాయ |

    సమ్ర్పాశ్య గోమూత్ర మహాంస మన్న మక్షార మష్టావథ వింశతించ. 15

    గ్రాసా న్పయ స్సర్పియుతా నుపోష్య భుక్త్వేతిహాసం శృణుయాన్ముహూర్తమ్‌ |

    కదమ్బనీలోత్పలకేతకాని జాతీసరోజం శతపత్రకంచ. 16

    అవ్లూనకఞ్జా న్యథసిన్ధువారం పుష్పం పున ర్నారద మల్లికాయాః |

    శుక్లంచ విష్ణోః కరవీరపుష్పం శ్రీచమ్పకం చన్ద్రమసః ప్రదేయమ్‌. 17

    శ్రావణాదిషు సర్వేషు క్రమాదేతాని సర్వదా |

    యస్మిన్మాసే వ్రతాది స్స్యా త్తత్పుషై#్ప రర్చయేద్ధరిమ్‌. 18

    ఏవం సంవత్సరం యావ దుపోష్య విధివ న్నరః | వ్రతాన్తే శయనం దద్యా ద్దర్పణోపస్కరాన్వితమ్‌. 19

    రోహిణీచన్ద్రమిథునం కారయిత్వాతు కాఞ్చనమ్‌ | చన్ద్రం షడఙ్గులం కుర్యా ద్రోహిణీం చతురఙ్గుళామ్‌. 20

    ముక్తాపలాష్టకయుతం శతనేత్రపటావృతమ్‌ | క్షీరకుమ్భోపరి పునః కాంస్యపాత్రాక్షతాన్వితమ్‌. 21

    సువస్త్రే భూషణంచైవ తథా శఙ్ఖంచ భోజనమ్‌ | దద్యా న్మన్త్రేణ పూర్వాహ్ణే శాలీక్షుఫలసంయుతమ్‌. 22

    శ్వేతామథ సువర్ణాస్యాం రౌప్యఖురసమన్వితామ్‌ | సవస్త్రభాజనాం దేనుం దద్యా న్మన్త్రేణ శోభనామ్‌ 23

    భూషణౖ ర్ద్విజదమ్పత్య మలఙ్కృత్య గునాన్వితమ్‌ | చన్ద్రోయం విప్రరూపేణ సభార్య ఇతి కల్పయేత్‌. 24

    యథా న రోహిణీ కృష్ణ శయ్యాం స న్త్యజ్య గచ్ఛతి| సోమరూపస్య తే తద్వ న్మమాభేదో7స్తు భూతిభిః. 25

    యథా త్వమేవ సర్వేషాం పరమానన్దమూర్తిదః |

    భుక్తి ర్ముక్తి స్తథా భ క్తి స్త్వయి చన్ద్రాస్తు మే దృఢా. 26

    ఇతి సంసారభీతస్య ముక్తికామస్య చానఘ | రూపారోగ్యాయుషా మేత ద్విధాయక మనుత్తమమ్‌. 27

    ఇదమేవ పితౄణాంచ సర్వదా వల్లభం మునే | త్రైలోక్యాధిపతి ర్భూత్వా సప్తకల్పశతత్రయమ్‌. 28

    చన్ద్రలోక మవాప్నోతి విద్వా న్భూత్వా విమబుచ్యతే | నారీవా రోహిణీచన్ద్రశయనం యా సమాచరేత్‌. 29

    సాపి తత్ఫల మాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌ |

    ఇతి పఠతి శృణోతివా య ఇత్థం మధుమథనార్చన మిన్దుకీర్తనేన. 30

    మతిమపిచ దదాతి సో7పి శౌరే ర్భవనగతః పరిపూజ్యతే7మరౌఘైః.

    ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదాన్తర్గతే-

    శ్వరనారదసంవాదే రోహిణీచన్ద్రశయనవ్రతకథనం

    నామ సప్తపఞ్చాశో7ధ్యాయః.

    వ్రత దినమున హవిష్యాన్నమును (ఉప్పు కారము పులుపు తైలములేని ఆహారము-అదియును కేవలము బియ్యముతోపాటు పెసరపప్పుకాని సా త్త్వికములగు బీరవంటి కూరముక్కలు కాని కలిపి అత్తెసరు పెట్టి వండిన అన్నము) తిని నేల పైనే పండుకొనవలెను. తెల్లవారి లేచిన తరువాత స్నానము చేయవలెను. బ్రాహ్మణునకు బంగారముతో కూడ జలపాత్ర దాన మీయవలెను. (పగలంతయు) ఉపవాసముండి గోమూత్రము మాత్రము ఆహారముగా తీసికొనవలెను. (రాత్రి) (మాంసాహారులు) మాంసము ఉప్పు పులుపు కారములేని ఆహారము ఇరువదెనిమిది ముద్దలు తినవలెను. ముహూర్తకాలము ఇతిహాసము వినవలెను. చంద్రరూపవిష్ణుప్రీతిగా కడిమి-నల్లకలువ-మొగలి-జాజి-తామర-శతదళ పద్మము-వాడగన్నేరు - వాడని తామర - ప్రేంకణము-ముల్లె-తెల్లని కరవీరము (ఎర్ర గన్నేరు ఆకులవంటి ఆకులుకల చెట్లున పూచెడి తెల్లని పూలు) (కరవీరము) ఎర్రగన్నేరు-సంపెగ- ఈ పండ్రెండు విధములగు పూలు శ్రావణము మొదలుగా ఆయా మాసములం దేమాసమునందు వ్రతము చేయుదుమో ఆ మాసము వంతునకు వచ్చువానిని పూజ కుపయోగించుట శ్రేష్ఠము.

    ఇట్లొక సంవత్సరము వ్రతము జరుపవలెను. అనగా పూర్ణిమా సోమవారము కాన (కా ర్తికమాసములో ఐనచో పూర్ణిమా రోహిణీ నక్షత్ర దినమునకాని ఆరంభించి తరువాత ప్రతి పూర్నిమనాడును వరుసగ చేయవలయును. వ్రతము (సంవత్సరము) ముగిసిన తరువాత అద్దములు ఇతర పరికరములు అలంకారములు-వీటితో కూడ మంచము చేయించవలెను. ఆరంగుళముల చంద్రప్రతిమనునాలుగంగులముల రోహిణీ ప్రతిమను బంగారుతో చేయించవలెను. (అంగుళము=ఎనిమిది యవగింజలు అడ్డముగా ఒకదాని ప్రక్కను ఒకటిగా పెట్టుటచే అగు పొడవు-3/4 బ్రిటిషు అంగుళము) ఎనిమిది ముత్తెములు రోహిణికి కంటి ఆవరణ వస్త్రమును పాల పాత్రపై అక్షతలు నింపిన కంచుపాత్రము-మంచి వస్త్రముల జత-భూషణము(లు)-శంఖము-భోజనము-తెల్లని బియ్యము-చెరకు-పండ్లు - మొగమున బంగారు బిళ్ల-వెండి గిట్టలు - వెండి కొమ్మలు పైని వస్త్రము-పాలు పిండు పాత్ర-దూడ-కల-పాడియావు-ఇవి అన్నియు ఉదయమున మంత్రపూర్వకముగా విప్రదంపతులకు దాన మీయవలెను. సర్వ లక్షణములు సర్వ సద్గుణములుకల ఆ విప్రదంపతులను అలంకరించి వారిని లక్ష్మీవిష్ణ్వాత్మకులైన రోహిణీచంద్రరూనులనుగా భావించవలెను. ''విష్ణూ! రోహిణీరూపయగు లక్ష్మి చంద్రరూపుడవగు నిన్ను విడిచివెళ్లనట్లే నాకును ఆయా ఐశ్వర్యములతో భేదము కలుగకుండ గాక! చంద్రా! నీవు సర్వ భూతములకు పరమానందప్రదుడవు. కనుక సంసారభీతుడనై ముక్తికాముడనై నాకు నీ యందలి దృఢభ క్తిచే బుక్తిముక్తులు కలుగుగాక!'' అని ప్రార్థించవలెను.

    ఇది రూపాయురారోగ్య ప్రదమగు ఉత్తమ వ్రతము. పితృదేవతా ఏఈ ప్రీతికరము. దీని నాచరించినవారు ఇరువదియొక్క వందల కల్పముల కాలము త్రిలోకాధిపతియై బ్రహ్మజ్ఞానము పొంది ముక్తినందును. స్త్రీలు దీని నాచరించినను ఇదే ఫలము కలుగును.

    దీనిని చదివినను వినినను ఉత్తమ జ్ఞానమును పొంది విష్ణులోకమున దేవతలచే పూజలందుకొనును.

    ఇది శ్రీమత్స్యమహాపురాణమున రోహిణీ చంద్రశయన వ్రతమను

    ఏబది ఏడవ అధ్యాయము.

    Sri Matsya Mahapuranam-1    Chapters   

  •