Sri Matsya Mahapuranam-1    Chapters   

షష్ఠో7ధ్యాయః.

కశ్యపసన్తతిః.

సూతః కశ్యపస్య ప్రవక్ష్యా మి పత్నీభ్యః పుత్త్రపౌత్త్రకమ్‌ | అదితిశ్చ దితిశ్చైవ అరిష్టా సురసా దనుః. 1

సురభి ర్వినతా తద్వ త్తామ్రా క్రోధవశా ఇళా | కద్రూ ర్విశ్వా ముని స్తద్వ త్తాసాం పుత్త్రా న్నిభోధత. 2

తుషితా నామ యే దేవా శ్చాక్షుషస్యాన్తరే మనోః | వైవస్వతే7న్తరే చైతే ఆదిత్యా ద్వాదశ స్మృతాః. 3

ఇన్ద్రో ధాతా భగ స్త్వష్టా మిత్రో 7థ వరుణో యమః | వివస్వా న్త్సవితా పూషా అంశుమా న్విష్ణురేవచ. 4

ఏతే సహస్రకిరణా ఆదిత్యా ద్వాదశ స్మృతాః | మారీచా త్కశ్యపా త్ప్రాప్తా పుత్త్రా నదితి రు త్తమా9. 5

కృశాశ్వస్య ఋషేః పుత్త్రా దేవప్రహరణా న్మృతాః | ఏతే దేవగణా విప్రాః ప్రతిమన్వన్తరాదిషు. 6

ఉత్పద్యన్తే ప్రలీయన్తే కల్పేకల్పేపి తేచ హి | దితిః పుత్త్రద్వయం లేభే కశ్యపాదితి నశ్శ్రతమ్‌. 7

హితణ్యకశిపుశ్చైవ హిర ణ్యాక్షస్త థైవచ | హిరణ్యకశిపో స్తద్వ జ్ఞాతం పుత్త్రచతుష్టయమ్‌. 8

ప్రహ్లాదశ్చాప్యనుహ్లాద స్సంహ్లాదో హ్లాదఏవచ | ప్రహ్లాదపుత్త్రా ఆయుష్మా న్చిభి ర్బాహుల ఏవచ. 9

విరోచన శ్చతుర్థశ్చ స బలిం పుత్త్రమాప్తవా9 | బలేః పుత్త్రశతం త్వాసీ ద్బాణో జ్యేష్ఠ స్తతో ద్విజాః. 10

దృతరాష్ట్ర స్తథా సూర్యచన్ద్ర ధుర్యోధనాదయః | నికుమ్భనాభౌ గుర్వక్షః కుమ్భీ క్షీబో విభీషణః. 11

ఏతే సుతా స్సుబహవో బాణో జ్యేష్ఠో గుణాధికః | బాణ స్సహస్రబాహుశ్చ సర్వాస్త్రగుణసంయుతః. 12

తపసా తోషితో యస్య పురే వసతి శూలభృత్‌ | మహాకాలత్వ మగమ త్స మో7భూచ్చ పినాకినః. 13

హిరణ్యాక్షస్య పుత్రోభూ ద్దుర్ధుర శ్శకుని స్త థా | భూతసన్తాపనశ్చైవ మహానాభ స్తథైవచ. 14

ఏతే భ్యః పుత్త్రపౌత్త్రాణాం కోటయ స్సప్తసప్తతిః | మహాబలా మహాకాయా నానారూపా మహౌజనః.15

షష్ఠాధ్యాయము

కశ్యప సంతతి

సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పెను. మరీచి పు త్త్రుడగు కశ్యపుని పత్నులనుండి కలిగిన పుత్త్రపౌత్త్రాది సంతతిని ప్రవచింతును. అదితి-దితి-అరిష్ట-సురస-దనువు-సురభి-వినత-తామ్ర-క్రోధవశ-ఇళ-క ద్రువ-విశ్వ-ముని అను పదముగ్గురును కశ్యపుని పత్నులు. వీరి సంతతిని తెలిపెదను. చాక్షుషమన్వంతరమున తుషితులు అను దేవతలు వైవస్వతమన్వంతరమున అదితికి కుమారులై ఆదిత్యు లనబడుదురు. ఇంద్రుడు-ధాత-త్వష్ట-మిత్రుడు-వరుణుడు-యముడు-వివస్వాన్‌-సవిత-పూష-అంశుమాన్‌-విష్ణువు-అను పండ్రెండు మంది సూర్యులే వీరు.

కృశాశ్వుడను ఋషికి పుత్త్రులు దేవగణములు దేవవిప్రులు. వీరు ప్రతిమన్వంతరారంభములందును జన్మించుచు కల్ప కల్పమునందును పుట్టుచు లయించుచుందురు.

కశ్యపునకు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఇద్దరు కుమారులు కలిగిరి. హిరణ్యక శిపునకు ప్రహ్లాదానుహ్లాద సంహ్లాద హ్లాదులను నలుగురు కుమారులు. ప్రహ్లాదుని కొడుకులు ఆయుష్మాన్‌ శిబి బాహులుడు విరోచనుడు అనువారు. విరోచనుని కుమారుడు బలి. బలి కుమారులు నూరుమంది. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మంచిగుణములు కలవాడు. వేయి భుజములు కలవాడు. దృతరాష్ట్రుడు సూర్యుడు చంద్రుడు ధుర్యోధనుడు నికుంభుడు నాభుడు గుర్వక్షుడు కుంభి క్షీబుడు విభీషణుడు మొదలగువారు అనేకులు అతని తమ్ములు. అతడు అన్ని అస్త్రములను ఎరిగినవాడు. తపస్సుచే శివుని మెప్పించి అతడు తన పురుమునందు వసించునట్లు వరము పొందెను. బాణుడు మహాకాలత్వమును పొంది శివునితో సము డయ్యెను.

హిరణ్యాక్షునకు దుర్థురుడు శకుని భూత సంతాపనుడు మహానాభుడు అను వా రు కుమారులు. వీరి పుత్త్ర పౌత్త్రాది సంతతి డెబ్బది ఏడు కోట్లమంది. వీరందరు మహాకాయులు మహాబలులు నానా రూపములు ధరించగలవారు. మహా శక్తి సంపన్నులు.

దనుః పుత్త్రశతం లేభే కశ్యపా ద్భలదర్పితమ్‌ | విప్రచిత్తిః ప్రధానో7భూ దేషాం మధ్యే మహాబలః.16

ద్విమూర్థా శకుని శ్చైవ తథా శమ్బరత స్తథా | మరీచి ర్మథన శ్చైవ ఇరో గర్గతర స్తథా.17

విద్రావణశ్చ ఫేనశ్చ కేతువీర్య శ్శతహ్రదః | ఇన్ద్రజి త్సత్యజిఛ్ఛైవ వజ్రనాభ స్తథా మయః.18

ఏకవక్త్రో మహాబాహు రజాక్ష స్తారక స్తథా | అసిలోమా విలోమా చ రిపు ర్బాణో మహాసురః.19

స్వర్భాను ర్వృషపర్వా చ ఏవమాద్యా దనో స్సుతాః | స్వర్భానో స్సుప్రజా కన్యా శచీ చైవ పులోమజా.20

ఉపధా చ మయస్యాపి తథా మన్ధోదరీ కుహూః | శర్మిష్ఠా సున్దరీ చైవ చన్ద్రా చ వృషపర్వణః.21

పులోమా కాలకా చైవ వైశ్వానరసుతే హితే | బహ్వపత్యే మహాసత్వే మారీచస్య పరిగ్రహే.22

తయో ష్షష్టిసహస్రాణి దానవానా మభూ త్సదా | పౌలోమా న్కాలకేయాంశ్చ మారీచో7జనయ త్పునః.23

అవధ్యా యే నరాణాం వై హిరణ్యపురవాసినః | చతుర్ముఖా ల్లబ్ధవరా నిహతా విజయేన తే.24

విప్రచిత్తి స్సింహికాయాం సైంహికేయ మజీజనత్‌ | హిరణ్యకశిపో ర్యే వై భాగినేయా స్త్రయోదశ.25

వత్స శ్శల్యశ్చ రాజేంద్రో బలో వాతాపి రేవచ | ఇల్వలో నముచిశ్చైవ ససర్జో7శ్వాఞ్జన స్తథా.26

నరకః కాలనాభశ్చ సరమాభ స్తథైవ చ | అల్పవీర్యశ్చ విఖ్యాతా చనువంశస్య వర్థనాః.27

సంహ్లాదస్య తు దైత్యస్య నివాతకవచా స్సుతాః | అదాన్తా స్సర్వదేవానాం గన్ధర్వోరగరక్షసామ్‌.28

యే హతా బల మాశ్రిత్య అర్జునేన రణాజిరే | షట్కన్యా జనయామాన తామ్రా నామాని మే శృణు.29

శుకీ శ్యేనీ చ భాసీ చ సుగ్రీవా గృద్ధ్రికా శుచిః | శుకీ శుకా నులూకాంశ్చ జనయామాస ధర్మతః.30

శ్యేనం శ్యేనీ తథా భాసీ కురరాన ప్యజీజనత్‌ | గృద్ధీ గృద్ధ్రా న్కపోతాంశ్చ పారావతవిహజ్గమా9.31

హంసపారసకారణ్డప్లవా న్చుచి రజీజనత్‌ | అజాంశ్చ మేషోష్ట్రఖరా న్త్సుగ్రీవా చాప్యజీజనత్‌. 32

దనువు అను కశ్యపుని పత్నియందు బలదర్పితులగు నూరుమంది కుమారులు కలిగిరి. మహాబల సంపన్నుడగు విప్రచి త్తి వీరిలో ముఖ్యుడు. ఇంకను ద్విమూర్థ శకుని శంబరుడు మరీచి-మథనుడు ఇరుడు గర్గతరుడు విద్రావణుడు ఫేనుడు కేతువీర్యుడుయ శతహ్రదుడు ఇంద్రజిత్‌ సత్యజిత్‌ వజ్రనాభుడు మయుడు ఏకవక్త్రుడు మహాబాహుడు అజాక్షుడు తారకుడు అసిలోముడు విలోముడు రిపుడు బాణుడు స్వర్భానుడు వృషపర్వుడు మొదలగు వారు ధనుపుత్త్రులు. స్వర్భానునకు సుప్రజా-పులోమునకు శచీ-మయునకు ఉపధా-మండోదరీ-కుహూ-అనువారు- వృషపర్వునకు శర్మిష్ఠ-సుందరి-చం ద్ర అనువారు-పులోమ-కాలక అను ఇద్దరును వైశ్వానరునికి కుమార్తెలు. వీరు ఇరువురును హితకరులు గొప్ప బలము కల వారు బహు సంతానము కలవారును; వీరు మారీచుడు అను మునికి పత్నులైరి వీరివలన మారీచునకు పౌలోములు కాలకేయులు అను రాక్షసగణము జనించెను. వీరు నరులచేత చావకుండ బ్రహ్మవలన వరము పొందిరి. హిరణ్యపురము వారి నివాసము. వారు అర్జునుని చేతిలో మరణించిరి. విప్రచిత్తికి సింహికయందు సైంహికేయుడుకొడుకయ్యెను.హిరణ్యకశిపునకు మేనల్లుండ్రగు వత్సుడు శల్యుడు రాజేంద్రుడు బలుడు వాతాపి ఇల్వలుడు నముచి ససర్జుడు అశ్వాంజనుడు నరకుడు కాలనాభుడు నరమాభుడు అల్పవీర్యుడు అను పదుముగ్గురును దనువంశములోనివారే.వీరు దేవ గంధర్వోరగ రాక్షసులకు లొంగనివారు.వీరును బలశాలియగు అర్జునుని చేతిలో రణరంగమున మరణించిరి.

తామ్ర అనునామెకు శుకి-శ్యేని-భాసీ-సుగ్రీవా-గృధ్రికా-శుచి-అను ఆరుగురు కుమార్తెలు. శు కి-చిలుకలను గ్రుడ్లగూబలను శ్యేని-డేగలను భాసి కురర పక్షులను గృధ్రి గ్రద్దలను పావురపుజాతి పక్షులను కనెను. శుచి హంసలను బెగ్గురులను నీరు కోడులను నీరు కాకులను క నెను. సు గ్రీవ అను ఆమె మేకలను గొఱ్ఱలను ఒంటె లను గాడిదలను కనెను. ఇది తామ్రా సంతానము.

ఏష తామ్రాన్వయః ప్రోక్తో వినతాయా నిభోధత | గరుడః పతతాం నాథ అరుణశ్చ పతత్రిణామ్‌.33

సౌదామినీ తథా కన్యా యేయం నభసి విశ్రతా | సమ్పాతిశ్చ జటాయుశ్చ అరుణస్య సుతా వుభౌ.34

సమ్పాతిపుత్త్రా బ హ్వశ్వ శ్శీఘ్రగ శ్చాతివిశ్రుతః | జటాయుః కర్ణికారశ్చ శీఘ్రగామీ చ విశ్రుతః.35

సారసో రజ్జుపాలశ్చ అరుణశ్చాపి తత్సుతః | తేషా మనన్త మభవ త్పక్షిణాం పుత్త్రపౌత్త్రకమ్‌.36

సురసాయా స్సహస్రం తు సర్పాణా మభవ త్పురా | సహస్రశిరసాం కద్రూ స్సహస్రం నృప సువ్రత.37

ప్రధానా స్తేషు విఖ్యాతా ష్షడ్వింశతి రరిన్దమాః | శేష వాసుకి కార్కోట శంఖైరావత కమ్బళాః.38

ధనఞ్ఞయ మహానీల పద్మావతర తక్షకాః | ఏలాపుత్త్ర మహాపద్మ దృతరాష్ట్ర* వలాహకాః.39

శజ్ఖపాల మహాశజ్ఖ పుష్పదంష్ట్ర శుభాననాః | శజ్ఖరోమా చ నహుషో వామనః పాణిని స్తథా.40

కపిలో దుర్ముఖో వాపి పతంజ లి రితి స్మృతాః | ఏషా మనన్త మభవ త్సర్పాణాం పుత్త్రపౌత్త్రకమ్‌.41

ప్రాయశో య త్పురా దగ్థం జనమేజయమన్దిరే | రక్షోగణం క్రోధవశా సా త్వమాన మజీజనత్‌.42

దంష్ట్రిణాం నియుతం తేషాం భీమః క్షయ మనీనయత్‌ | రుద్రాణాం చ గణం తద్వ ద్గోమహిష్యో వరాజ్గనాః.43

సురభి ర్జనయామాస క శ్యపా న్న్రపతేః పురా | ముని ర్మునీనాం మహతాం గణ మప్పరసాం తథా.44

తథా కిన్నరగన్ధర్వా నరిష్టా7జనయద్భహూ9 | తృణవృక్షలతాగుల్మ మిరా సర్వ మజీజనత్‌.45

విశ్వాతు యక్షరక్షాంసి జనయామాస కోటిశః | ఏతే కశ్యపదాయాదా శ్శతశో7థ సహస్రశః.46

ఏష మన్వన్తరే రాజ న్త్సర్గ స్స్వారోచిషే స్మ్రతః | తత స్త్వేకోనపఞ్చాశ న్మరుతః కశ్యపో7దితేః.47

జనయామాస ధర్మజ్ఞా న్త్సర్వా నమరవల్లభాన్‌.

ఇతి శ్రీమత్స్య మహా పురాణ మత్స్యమనుసంవాదే మత్స్యప్రోక్త కశ్యపసన్తతికథనం నామ షష్టో7ధ్యాయః.

ఇక వినత సంతానమును వినుడు. పక్షులకు నాథులగు అరుణుడు ( సూర్యుని రథమునకు సారథియగు అనూరుడు) గరుడుడును ఆకాశమున కనబడుచు ప్రసిద్థురాలగు సౌదామిని (మెఱపు) అను కన్యయు కలిగిరి. అరుణునకు సంపాతి జటాయువులు సంపాతికి బహ్వశ్వుడు అతి ప్రసిద్ధుడగు శీఘ్రగుడు జటాయువు కర్ణికారుడు విశ్రుతుడగు శీఘ్రగామి సారసుడు రజ్జుపాలుడు అరుణుడు అనువారు కుమారులు. ఈ పక్షులకు అనంతమగు పుత్రపౌత్త్రాది సంతానము కలిగెను.

సురస అను కశ్యప భార్యకు వేయేసి శిరసులు కల వేయి సర్పములు సంతానమయ్యెను.

కద్రువకు వేయి సర్పములు కలిగెను. వారిలో ఇరువది ఆరు మంది ప్రసిద్ధులు; వారు : శేషుడు వానుకి కర్కోటుడు శంఖుడు ఐరావతుడు కంబళుడు ధనంజయుడు మహానీలుడు పద్ముడు అవతరుడు తక్షకుడు ఏలాపుత్త్రు డు మహాపద్ముడు దృతరాష్ట్రుడు వలాహకుడు శంఖపాలుడు మహాశంఖుడు పుష్పదంష్ట్రుడు శుభాననుడు శంఖరోముడు నహుషుడు వామనుడు పాణిని కపిలుడు దుర్ముఖుడు పతంజలి అనువారు. వీరి పుత్త్ర పౌత్త్రాది సంతతి అనంతముగా అయ్యెను. వీరిలో చాలమంది జనమేజయుని గృహమున దగ్ధులైరి.

క్రోధవశ అనునామెకు అపరిమిత సంఖ్యగల రాక్షసుల జన్మించిరి. వారు అందరు కోరలు గలవారు. వారిలో లక్షమందిని భీముడు చంపెను.

సురభి అను కశ్యప పత్నికి రుద్రులగణమును గోవులు గేదెలును కలిగెను.

ముని అనునామెకు మహాముని గణమును అప్సరోగణమును కలిగెను.

అరిష్టకు కిన్నరులు గంధర్వులు అనేకులు గలిగిరి.

ఇర అను ఆమెకు తృణజాతులు వృక్షములు లతలు గుల్మములు (గుబురు పొదలు మొదలగునవి) సంతాన మయ్యెను.

విశ్వకు కోట్లకొలది యక్షరాక్షసులు కలిగిరి.

ఇట్లు కశ్యపునకు నూర్ల-వేల-లక్షల-కోట్లకొలది సంతతి కలిగెను. ఇ ది స్వా రోచిష మన్వంతరమునందలి సృష్టి క్రమము. అనంతరము దితికి కశ్యపుని వలన నలువది తొమ్మిది మంది మరుత్తులను కుమారులు కలిగిరి. వారందరును ధర్మము ననుసరించి నడచువారును దేవతలను ఇష్టులు నైరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున కశ్యప సంతతి అను షష్ఠాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters