Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్విషష్టితమో7ధ్యాయః.

అన న్తతృతీయావ్రతమ్‌.

మనుః : సౌభాగ్యారోగ్యఫలదమముత్రాక్షయకారకమ్‌ | భు క్తిము క్తి ప్రదం దేవ తన్మే బ్రూహి జనార్దన. 1

శ్రీమపత్స్యః : య దుమాయాః పురా దేవ ఉవాచాన్ధక సూదనః | కై లాసశిఖరాసీనో దేవ్యా పృష్ట స్తదా కిల.

కథాసు సమ్ర్పవృత్తాసు ధర్మ్యాసు లలితాసు చ | త దిదానీం ప్రవక్ష్యామి భు క్తిము క్తిఫలప్రదమ్‌. 3

ఈశ్వరః : శృణుష్వావహితా దేవి తథైవాన న్తపుణ్యకృత్‌| నరాణా మథ నారీణా మారాధన మనుత్తమమ్‌.

నభ##స్యే వా7థ వైశాఖే మాఘేవా మార్గశీర్షకే | శుక్లపక్షతృతీయాయాం ప్నాతస్స న్గౌరసర్షపైః. 5

గోరోచనాంచ గోమూత్రం కృష్ణ గోశకృతం తథా | దధిచన్దనసమ్మిశ్రం లాటే తిలకం న్యసేత్‌. 6

సౌభాగ్యారోగ్యకృ త్తస్మా త్తత్సదా లలితాప్రియమ్‌ | ప్రతిపక్షం తృతీయాసు దధానః పీతవాససీ. 7

ధారయే దథ రక్తాని నారీచే త్పతిసంయుతా | విధవా వా త్వరక్తాని కుమారీ శుక్లవాససీ. 8

దేవీంచ పఞ్చగవ్యేన తతః క్షీరేణ కేవలమ్‌ | స్నాపయే న్మధునా * తద్వ త్పుష్పగన్ధోదకేనతు. 9

పూజయే చ్ఛక్లపుషై#్పస్తు ఫలై ర్నానావిధై రపి | ధాన్యకైర్జీరలవణౖ ర్గుడక్షీరఘృతాన్వితైః. 10

శుక్లాక్షతతిలై రర్చాం తతో దేవీం సమర్చయేత్‌ | పాదా ద్యభ్యర్చనం కుర్యా త్ర్పతిపక్షం వరాననే. 11

అరువది రెండవ అధ్యాయము.

అనంత తృతీయా వ్రతము

సౌభాగ్యారోగ్య ఫలప్రదమును పరలోకమున అక్షయఫల మిచ్చునదియు భుక్తి ముక్తిప్రదమును నగు వ్రత మును నాకు తెలుపుమని మనువు అడుగగా మత్స్యనారాయణు డిటులు చెప్పెను. పూర్వము అంధకాసురహంతయగు పరమేశ్రుని ఉమాదేవి యడుగ కైలాస శిఖరమం దాసీనుడై యున్న ఈశ్వరుడు ధర్మమునకు అనుకూలములును లలితములును అగు ప్రసంగముల నడుమ చెప్పిన వ్రతము ఒకటి కలదు. దానిని చెప్పెద; వినుము.

ఈశ్వరుడు ఉమకు ఇటులు చెప్పెను: నరులకు కాని నారులకు కాని అనంత పుణ్యఫలమును ఇచ్చు అత్యుత్తమమగు వ్రతము ఒకటి కలదు; అవహితురాలవయి వినుమ. భాద్రపద వైశాఖ మాఘ మార్గశీర్ష మాసములతో దేనియందైన శుక్ల తృతీయనాడు తెల్లని ఆవాలతో (ఆవపిండితో ఆవనూనెతో) స్నానము చేయవలెను. గోరోచనము గోమూత్రము నల్లని ఆవు గోమయము పెరుగు చందనము-ఇవన్ని యు కలిపిన తిలకమును నుదుట ధరించవలయును. ఏలయన ఈ తిలకము సదా లలితా ప్రీతికరమును సౌభాగ్యారోగ్యకరమును. తరువాత పట్టు వస్త్రములు ధరించవలయును. ముత్తైదువలు ఎర్రని వస్త్రములను విధవయైనచో ఎర్రనివి కాని వస్త్రములను కన్యలై నచో తెల్లని వస్త్రములను ధరించవలయును. దేవిని వరుసగా పంచగవ్యముతో కేవలము గోక్షీరములతో తేనెతో పన్నీటితో స్నానము చేయించవలెను. తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో తెల్లని పూవులతో పూజించవలయును. నానావిధ ఫలములు జీలకర్ర ధనియాలు ఉప్పు బెల్లము పాలు నేయి నివేదించవలయును.

వరదాయై నమః పాదౌ తథా గుల్ఫౌ శ్రియై నమః | అశోకాయై నమో జఙ్ఘే పార్వత్యై జామనీ తథా. 12

ఊరూ మఙ్గళకారిణ్యౖ వామదేవ్యై తథా కటిమ్‌ | పద్మోదరాయై జఠర మురః కామశ్రియై నమః. 13

కరౌ సౌభాగ్యదాయిన్యై బాహూ హరముఖశ్రియే | ముఖం దర్పణవాసిన్యై స్మరదాయై స్మితం నమః. 14

గౌర్యై నమ స్థథా నాసా మతులాయై చ లోచనే | తుష్ట్యై లలాటపలకం కాత్యాయన్యై నమ శ్శిరః. 15

నమో గౌర్యై నమో ధృత్యై నమః కాళ్యై నమ శ్శ్రియై | రమ్భాయై లలితాయైచ వామదేవ్యై నమోనమః.

ఏవం సమ్పూజ్య విధివ దగ్రతః పద్మ మాలిఖేత్‌ | పత్రై ర్ద్వాదశభి ర్యుక్తం కుఙ్కుమేన సకర్ణికమ్‌. 17

పూర్వేతు విన్యసే ద్గౌరీ మపర్నాంచ తతః పరే | భవానీం దక్షిణ తద్వ ద్రుద్రాణీంచ తతః పరే. 18

విన్యసే త్పశ్చిమే సౌమ్యాం తథా మదనవాసినీమ్‌ |

వాయవ్యే పాటలా ముగ్రా ముత్తరేణ తథా7ప్యుమామ్‌. 19

సాధ్యాం సత్యాం శుభాం సౌమ్యాం మఙ్గళాం కుముదాం సతీమ్‌ |

రుద్రంచ మధ్యే సంస్థాప్యలలితాం కర్ణికోపరి. 20

కుసుమై రక్షతై ర్వాపి నమస్కారేణ విన్యసేత్‌ | గీతమఙ్గళనిర్ఘోషం కారయిత్వా సువాసినీః. 21

పూజయే ద్రక్తవాసోభీ ర క్తమాల్యానులేపనైః | సిన్దూరం స్నానచూర్ణంచ తాసాం శిరసి దాపయేత్‌. 22

___________________________________

*తద్దత్పుణ్యగన్ధోదకేనతు

సిన్దూరం కుఙ్కు మస్నాన ముపదిష్టం యత స్తతః | తథోపదేష్టారమపి పూజయే ద్యత్నతో గురుమ్‌. 23

సమ్పూజ్యతే గురు ర్యత్ర సర్వా స్తస్య ఫలాః క్రియాః |

పాదాది పూజా మంత్రములు: 1. వరదాయై నమః పాదౌ పూజయామి; 2. శ్రియై నమః గుల్ఫౌ పూజయామి; 3. అశోకాయై నమః జంఘే పూజయామి; 4. పార్వత్యై నమః జానునీ పూజయామి; 5. మంగళకారిణ్యౖ నమః ఊరూ పూజయామి; 6. వామదేవ్యై నమః కటిం పూజయామి; 7. పద్మోదరాయై నమః జఠరం పూజయామి; 8. కామవ్రియై నమః ఉరం పూజయామి; 9. సౌభాగ్యదాయిన్యై నమః కరౌ పూజయామి; 10. హరముఖశ్రియే నమః - బాహూ పూజ యామి; 11. దర్పణ వాసిన్యై నమః-ముఖం పూజయామి; 12. స్మరదాయై నమః స్మితం పూజయామి; 13. గౌర్యై నమః నాసికాం పూజయామి; 14. అతులాయై నమః నేత్రే పూజయామి; 15. తుష్ట్యై నమః లలాట ఫలకం పూజయామి; 16. కాత్యాయన్యై నమః-శిరః పూజయామి; గౌరికి ధృతికి కాళికి శ్రీకి రంభకు లలితకు వామదేవికి నమస్కారము. అని ఇట్లు పూజించవలెను.

పూజకు ముందే ఆయా దేవతలను కూర్చుండ పెట్టవలసిన విధానమును స్థానములును ఏవి యని- మొదట కుంకుమతో పండ్రెండు రేకులును నడుమ దుద్దుకల పద్మము మ్రుగ్గుగా వేయవలెను. దాని పై తూర్పున గౌరిని అపర్ణను-దక్షిణమున భవానిని రుద్రాణిని-పడమట సౌమ్యను మదనవాసిని-వాయవ్యమున పాటలను ఉగ్రను- ఉత్తరమున ఉమాసాధ్యా నత్యాశుభా సౌమ్యా మంగళా కుముదా సతీ-దేవులను నడుమ కర్ణికపై రుద్రుని స్థాపించవలయును. అట్లు నిలుపు నపుడు వారిపై కుసుమములను అక్షతలను ఉంచి (ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుచు) నమస్కరించుచుండవలయును.

ఇట్లు మొదట ఆవాహనము తరువాత పైని చెప్పినట్లు పూజనము నివేదనము ఐన తరువాత మంగళవాద్యములు మ్రోగుచుండ ముత్తైదువలను రావించి ఎర్రని వస్త్రములతో ఎర్రని పూలతో ఎర్రని గంధ ద్రవ్యములతో వారిని పూజించవలెను. సిందూర కుంకుమ కుసుమ చూర్ణములతో స్నానము చేయించవలయునని శాస్త్రమున చెప్పబడియున్నది. కావున వారి శిరస్సుపై సిందూరమును కుంకుమమును వేయవలయును. తనకు మంత్రోపదేశము చేసిన గురునికూడ యత్న పూర్వకముగా పూజించవలయును. గురువునకు అర్చన చేసిన సమస్త క్రియలు సఫలము లగును.

సభ##స్యే పూజయే ద్గౌరీముత్పలై రసితై స్సదా. 24

ఆశ్వినే బన్ధుజీవైశ్చ కార్తికే శతపత్రకైః | జీతీపుషై ర్మార్గశీర్గే పౌషే పీతైః కురణ్టకైః. 25

కున్దకుఙ్కుమపుషై#్పవ్చ మాఘే దేవీం సమర్చయేత్‌ | సిన్దువారేణ జాత్యావా ఫాల్గునే పూజయే దుమామ్‌.

చైత్రే తు మల్లికాశోకై ర్వైశాఖే గన్ధపాటలైం | జ్యేష్ఠే కమలమన్దారై రాషాఢేచ జపామ్బుజైః. 27

కదమ్బైరథ మాలత్యా శ్రావణ పూజయే త్సదా | గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌.

బిల్వపత్రార్కపుష్పంచ యవా గోశృఙ్గవారిచ | పఞ్చగవ్యంచ బిల్వంచ ప్రాశ##యే త్క్రమశ స్సదా. 29

ఏత ద్భాద్రపదాద్యంతు ప్రాశనం క్రమశ స్స్మృతమ్‌ | ప్రతిక్షంచ మిథునం తృతీయాయాం వరాననే. 30

భోజయిత్వా7ర్చయే ద్భక్త్యా వస్త్రమాల్యానులేపనైః |

పుంసః పీతామ్బరం దద్యా త్త్సియః కౌస్సమ్భవానసీ. 31

నిష్పావ జాజీ లవణ మిక్షుదణ్డం గుడాన్వితమ్‌ | నార్యా దద్యా త్ఫలం పుంస స్సువర్ణోత్పలసంయుతమ్‌.

యథా న దేవి దేవ స్త్వాం పరిత్యజ్యేహ గచ్ఛతి | తథా మా ముద్ధరాశేషదుఃఖసంసారసాగరాత్‌. 33

కుముదా విమలా నన్దా భవానీ వనుధా శివా | లలితా కమలా గౌరీ సతీ రమ్భాచ పార్వతీ.

నభస్యాదిషు మాసేషు ప్రీయతా మిత్యుదీరయేత్‌ |

భాద్రపదాదిగా పండ్రెండు మూసములందును పూజకు పుష్పములు ఉపవాసమునాడు ఆహారముగా తీసికొన వలసిన ద్రవ్యము దాన సమయమున చెప్పు మంత్రము వేరు వేరుగా నుండును. ఎట్లన-

మాసము: పూజా పుష్పములు: ఆహారము: మంత్రము:

భాద్రపదము నల్ల కలువలు గోమూత్రము కుముదా ప్రీయతామ్‌

ఆశ్వయుజము మంకెన గోమయము విమలా ప్రీయతామ్‌

కా ర్తికము నూరు రేకుల తామర ఆవు పాలు నందా ప్రీయతామ్‌

మార్గశిరము జాజి ఆవు పెరుగు భవానీ ప్రీయతామ్‌

పుష్యము పచ్చ గోరంట ఆవు నేయి వసుధా ప్రీయతామ్‌

మాఖము మొల్ల లేదా కుంకుమ పూవులు దర్భలు వేసిన నీరు శివా ప్రీయతామ్‌

ఫాల్గునము ప్రేంకణము లేదా జాజి మారేడు దళములు లలితా ప్రీయతామ్‌

చైత్రము మల్లిక లేదా అశోకము తెల్ల జిల్లేడు పూలు కమలా ప్రీయతామ్‌

వైశాఖము సం పెగ-పాటల యవలు వేసిన నీరు గౌరీ ప్రీయతామ్‌

జ్యేష్ఠము కమలము-మందారము ఆవు కొమ్ములో పోసి సతీ ప్రీయతామ్‌

ఉంచిన నీరు

ఆషాఢము జపాకుసుమ-పద్మములు పంచగవ్యము రంభా ప్రీయతామ్‌

శ్రావణము కడిమి-మాలతి బిల్వఫలము పార్వతీ ప్రీయతామ్‌

ప్రతిమాస శుక్లపక్ష తృతీయాతిథినాడును బ్రాహ్మణ దంపతులను భ క్తితో వస్త్ర పుష్ప గంధములతో అర్చించవలెను. పురుషులకు పచ్చని వస్త్రము లీయవలెను. (పురుషులకు దోవతి ఉ త్తరీయము కాని రెండు దోవతులను కాని-స్త్రీలకు చీరను రవిక గుడ్డను-ఇ ట్లెవరికైనను రెండు వస్త్రము లీయవలెను.) స్త్రీలకు బొబ్బరలు జాజికాయ లవణము చెరకుగడ బెల్లమును పురుషులకు ఈ పదార్థములతోపాటు బంగారు కలువపూవును కూడ ఈయవలెను. ఇవి ఇచ్చునపుడును శయనము మొదలగునవి ఇచ్చునపుడును దేవిని ''దేవీ! పరమేశ్వరుడు ఎన్నడును నిన్ను విడువక సుఖింపజేయుచున్నట్లే నీవును నన్ను సంసార సాగరమునుండి తరింపజేసి సుఖింపజేయుము.'' అని ప్రార్థించవలెను.

వ్రతా న్తే శయనం దద్యా త్సువర్ణకమలాన్వితమ్‌. 35

మిథునాని చతుర్వింశద్ద్వాదశాథ సమర్చయేత్‌ | అష్టౌ షడ్వా ప్యథ పున రనుమాసం సమర్చయేత్‌. 36

పూర్వం దత్వా7థ గురవే శేషా నభ్యర్చయే త్తతః | ఉక్తా7నన్తతృతీయైషా సదా7నన్తఫలప్రదా. 37

సర్వపాపహరా దేవీ సౌభాగ్యారోగ్యవర్ధనీ | న చైనాం విత్తశాఠ్యేన కదాచిదపి లఙ్ఘయేత్‌. 38

నరో వా యది వా నారీ విత్తశాఠ్యా త్పతత్యధః | గర్భిణీ సూతికా న క్తం కుమారీ వా7థ రోగిణీ. 39

యదా శుద్ధా తదా తేన కారయే త్ర్కమశ స్సదా | ఇమా మనన్తఫలదాం య స్తృతీయాం సమాచరేత్‌. 40

కల్పకోటిశతం సాగ్రం శివలోకే మహీయతే | విత్తహీనో7పి కుర్వీత వర్షత్రయ ముపోషణమ్‌. 41

పుషై#్ప ర్మన్త్రవిధానైశ్చ సోపి తత్ఫల మాప్నుయాత్‌ | నారీ వా కురుతే యా తు కుమారీ విధవా తథా.

* వ్రతమిన్ద్ర

సా7పి తత్ఫల మాప్నోతి గౌర్యనుగ్రనుగ్రహలాలితా |

ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం గిరితనయా*వ్రత ముగ్రలోకసంస్థమ్‌. 43

మతిమపిచ దదాతి సో7పి దేవై రమరవధూజనకిన్నరైశ్చ పూజ్యః. 43||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే అన న్తతృతీయావ్రతకథనం

నామ ద్విషష్టితమో7ధ్యాయః.

వ్రతము ఇట్లు పండ్రెండు మాసములు జరిగి ముగిసిన తరువాత మంచము పరపు మొదలయినవి బంగారు కమలముతో కూడ విప్ర దంపతులకు ఈయవలెను. ఇదిగాక ప్రతి మాసమునను విప్ర దంపతులను యథాశ క్తిగా ఇరువది నాలుగు మందిని కాని పండ్రెండు మందిని కాని ఎనిమిది కాని ఆరు మందిని కాని అర్చించవలెను. (వారికి పుష్పగంధ తాంబూల దక్షిణాదికము నీయవలెను.) ఇట్లు అర్చించునపుడు మొదట తన గురుని పిమ్మట మిగిలినవా ని అర్చించవలెను.

దేవీ! ఈ చెప్పిన అనంత తృతీయావ్రతము సదా అనంతఫలప్రదము సర్వపాపమరము; సౌభాగ్యారోగ్యవృద్ధికరము. దీనిని స్త్రీలు కాని పురచుషులు కాని ఎవరైనను చేయవచ్చును. కాని తనకు వ క్తి యన్నంతలో ధనమున లోభము చూపరాదు. చూపినచో అధః పతితు లగుదురు.

ఈ వ్రతమును చేయుగట స్త్రీ గర్భిణి రోగిణి కుమారియైనను చేయవచ్చును. పగలే కాదు; రాత్రి (ప్రదోషకాల మేన-రాత్రి ఎక్కువ గడువకుండ) చేయవచ్చును. ప్రసవించుట మొదలయిన కారణములచే అశుచిత్వము వచ్చినపుడు శుద్ధి అయిన తరువాత చేయవలెను.

అనంత ఫలప్రదమగు ఈ అనంతతృతీయావ్రతమును ఆచరించినవాడు కల్పకోటి శతములపాటు (పూ ర్తిగా) శివలోకమున సుఖించును. ధనము లేనివాడు మూడు సంవత్సరములు మాత్రమయిన ఆయా మాస శుక్ల తృతీయనాడుపవాసముండి పూవులతో మంత్రములతో యథాశ క్తి గ దొరకిన ద్రవ్య నివేదనములతో ఈ వ్రతమును జరిపినచో నమగ్రఫలమును పొందును. దీనిని కన్య కాని విధవకాని చేసినను గౌరీకృపచే వ్రతము ఫలించును.

దీనిని చదివినను వినినను ఉ త్తమ జ్ఞానము శివలోక ప్రాప్తి అచట కిన్నరాది దేవగణములచే పూజలు లభించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదాంతర్గత పార్వతీశ్వర సంవాదమున

అనంత తృతీయావ్రతమను అరువది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters