Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టషష్టితమో ధ్యాయః.

సప్తమీస్న పనవ్రతమ్‌ -మృతవత్సాదిశాంతిః.

నారదః : కి ముద్వేగాద్భుతే కృత్య మలక్ష్మీ ః కేన హన్యతే | మృతవత్సాభిషేకాదికార్యేషు చ కిమిష్యతే. 1

పురా కృతాని పాపాని ఫల స్త్యస్త్మిం స్తపోధన | రోగదుః ఖాదిరూపేణ తథై వేష్టవధేన చ. 2

తద్వినాశంచ వక్ష్యామి సదా కల్యాణకారకమ్‌ | సప్తమీస్నపనం నామ జనపీడావినాశనమ్‌. 3

బాలానాం మరణం యత్ర క్షీరపానాం ప్రదృశ్యతే| ద్వృద్దనరాణాంచ ¸°వనేచాపి వర్తతామ్‌. 4

శాస్తయే తత్ర వక్ష్యామి మృతవత్సాదికే చ యత్‌ | ఏతదే వాద్భుతోద్వేగచిత్తభృమవినాశనమ్‌. 5

భవిష్యతిచ వారాహే యత్ర కల్పే తపోధన | వైవస్వతంచ తత్రాపి యత్రాన్తర మునుత్తమమ్‌. 6

భవిష్యతిచ తత్రాపి పఞ్చవింశతిమం తథా | కృతం నామ యుగం తత్ర హైహయాన్వయవర్దనః. 7

భవితా నృపతీ ర్వీరః కృతవీర్యః ప్రతాపవా& | స సప్తద్వీప ముఖిలం పాలయిష్యతి మణ్డలమ్‌. 8

యావద్వర్షసహస్రాణి సప్తసప్తతి నారద | జాతమాత్రంతు తత్రాపి యావత్పుత్త్రశతం తథా. 9

చ్యవనస్యతు శాపేన వినాశ ముపయాస్యతి | సహస్రబాహుశ్చ తతో భవితా తస్య వై సుతః. 10

సంయుత శ్శఙ్ఖచక్రాదిచక్రవర్తిత్వలక్షణౖః | కృతవీర్య స్తదాగత్య సహస్రాంశుం దివాకరమ్‌. 11

ఉపవాసవ్రతై ర్దివ్యై ర్వేదసూక్తైశ్చ నారద | పుత్త్రస్య జీవనాయాల మేతత్స్నాన మవాప్స్యతి. 12

కృతవీర్యేణవై పృష్ణ ఇదం వక్ష్యతి భాస్కరః| అశేషదుఃఖశమనం కలికల్మషనాశనమ్‌. 13

అరువది ఎనిమిదవ అధ్యాయము.

సప్తమీ స్నపన వ్రతము.

నారదుడు ఈశ్వరుని ఇట్లు ప్రశ్నించెను : ఉద్వేగము (భయమును కలవరపాటును) కలిగించు అద్భుత విషయములు సంభవించినపుడు ఏమి చేసినచో వాటివలన సంభవించు ఆశుభము నశించును? శిశు మరణము అభిషేకము మొదలగు కార్యములందు (అశుభ నివారణము శుభవృద్ది కలుగుటకు) ఏమి చేయవలయును?

ఈశ్వరుడు ఇట్లు చెప్పెను: నారదమునీ : పూర్వ జన్మమున చేసిన పాపములు ఈ జన్మమున రోగములు ఇతర దుఃఖములు ఇష్టజనుల మృతి మొదలగు రూపమున ఫలించును. అవి నశించి శుభము కలిగించు విధానమును చెప్పెదను. బాలురును పాలు త్రాగు శిశువులు వృద్దులు ¸°వనస్థులు ఆకస్మికముగా మరణించుట - మరణించిన శిశువులు జన్మించుట ఆశ్చర్యకరములు భయాకులత్వమును కలిగించునవి అగు సంఘటనలు జరుగట మొదలగు జనపీడలను నశింప జేయు 'సప్తసమీన్న పనము' అను శాంతి ప్రకియ కలదు.

రాబోవు వరాహకల్పమున వైవస్వత మన్వంతరమున ఇరువది యైదవ మహాయుగమున హైహయ వంశమున కృతవీర్యుడను రాజు పుట్టి డెబ్బది ఏడు వేల సంవత్సరములపాటు సప్తద్వీపసహిత భూమండలమును పాలించును. చ్యవనునని శాపమున అతని నూరుగురు కుమారులు పుట్టిన వెంటనే మరణింతురు. అతనికే సహస్రబాహుడు కాబోవు కుమారుడు (అర్జునుడు) శంఖచక్రాది (రేఖారూప) చక్రవర్తిత్వ లక్షణములతో పుట్టును. ఈ పుత్రుడు (చ్యవన శాపముచే మరణించక) జీవించుటకై కృతవీర్యుడు సూర్యుని అడుగగా అతడు అతనికి ఉపవాస వ్రతములతో వేదసూక్త పారాయణము మొదలగు వానితో కూడిన ఈ సప్తమీ స్నపనమను స్నాన విధానమును తెలుపును సూర్యు డతనికి చెప్పబోవు ఈ ప్రక్రియ అశేష దుఃఖ శాంతిని కలిగించి కలి కల్మషములను నశింపజేయును.

సూర్యః : అలంక్లశేన మహతా పుత్త్ర స్తవ సరాధిప | భవిష్యతి చిరంజీవీ కలికల్మషనాశనమ్‌. 14

సప్తమీన్నపనం వక్ష్యే సర్వలోకహితాయవై | జాతస్య మృతవత్సాయాః సప్తమే మాసి నారద. 15

అథవా శుక్లసప్తమ్యా మేతత్సర్యం ప్రశామ్యతి | గ్రహతారాబలం లబ్ద్వా కృత్వా బ్రాహ్మణవాచనమ్‌. 16

బాలస్య జన్మనక్షత్రతిథిదేవా న్యజే ద్భుధః | తద్వ ద్వృద్ధనరాణాంచ కృత్యం స్యా దితరేషు చ. 17

గోమయే నానులిప్తాయాం భూమా వేకాగ్రవ త్తదా | తణ్డులై రక్తశాలీయై ర్బహుగోక్షీరసంయుతై ః. 18

నిర్వపే త్సూర్యరుద్రాభ్యాం తన్మన్త్రాథ్యాం విధానతః |

కీర్తయే త్సూర్యదైవత్యం సప్తార్చిశ్చ మృతాహుతీః. 19

జుహుయా త్సూర్యసూ కైన తద్వ ద్రుద్రాయ నారద |

హోతవ్యా స్సమిద స్తత్ర తథై వార్కపలాశయోః. 20

యవకృష్ణతిలైర్హోమః కర్తవ్యోష్టశతం పునః | వ్యాహృతీభి రథాజ్యేన తథైవాష్టశతం పునః. 21

హుత్వా స్నానంచ కర్తవ్యం మఙ్గళాఙ్గేన ధీమతా | విప్రేణ వేదవిదుషా విధివద్దర్భపాణినా. 22

స్థాపయిత్వాథ చతురః కుమ్భా న్కోణషు శోభనా & |

పఞ్చమఞ్చ పునర్మధ్యే దధ్యక్షతసమన్వితమ్‌. 23

స్థాపయే దవ్రణం కుమ్భం సప్తార్చే నాభిమన్త్రితమ్‌ | సౌరభ్యేణాథ తోయేన పూర్ణా న్పల్లవసంయతా& . 24

సర్వా న్త్సర్వౌషధియుతా ఞ్ఛ్వే తదూర్వాఫలాయుతా&. 25

గజాశ్వరథవల్మీక సఙ్గమహ్రదగోకులాత్‌ | సంశుద్దమృద మాదాయ సర్వేష్వథ నిధాపయేత్‌. 26

చతుర్‌ష్వథచ కుమ్భేషు వఞ్చమంచాపి మధ్యమమ్‌ | వేష్టయేద్వస్త్ర యుగ్మేన సౌరాన్మన్త్రా సుధీర్‌యేత్‌. 27

సప్తభిశ్చాథ నారీభి రవ్యఙ్గాఙ్గాభి రేవచ | పూజితాభి ర్యథాశక్త్యా మాల్యవస్త్రవిభూషణౖః 28

సవిప్రాభిశ్చ కర్తవ్యం మృతవత్సాభిషేచనమ్‌ |

సూర్యుడిట్లు చెప్పెనుః రాజా: (కృతవీర్యా:) నీవు ఎక్కువ క్లేశము పొందవలసిన పని లేదు. నీ కుమారుడు చిరంజీవి కాగలడు. కలికల్మషనాశకమగు సప్తమీ స్నపనము (సప్తమినాడు స్నానము చేయించుట) అను స్నానప్రక్రియను సర్వలోక హితమునకై చెప్పెదను.

(కాలము) మరణించిన శిశులు పుట్టుట పాలు త్రాగెడి శిశువులకు మరణాంతమగు వ్యాధులు కలుగుట మొదలగునవి సంభవించినపుడు తల్లి గర్భవతియైన ఏడవ మాసమునగాని బిడ్డని శైశవమున శుక్లపక్ష సప్తమినాడు కాని శిశువునకు గ్రహతారాబలములు బాగుగా నున్న దినమున కాని బాలుని జన్మతిథి జన్మనక్షత్రములందుకాని శాస్త్ర సంప్రదాయముల నెరిగి దేవతల నారాధించవలయును. వృద్ధులు యువకులు మొదలగు వారికి ఆకస్మికముగా మరణాంతక వ్యాధులు ఉపద్రవములు కలిగినను అద్భుతములు సంభవించినను ఈ సప్తమీ స్నపనము జరుపవలెను.

(స్థానము) గోమయముతో ఆలికిన ప్రదేశము (స్థితి) ఏకాగ్రభావముతో ఈ సప్తమీ న్నపనము చేయవలెను. (ద్రవ్యములు) ఎర్రని వడ్లనుండి చేసిన బియ్యముతో ఎక్కువ పరిమాణముగల ఆవుపాలతో మొదట సూర్యదేవతాకములు రుద్రదేవతాకములు నగు మంత్రములతో అగ్నిలో ఆహుతులను వేల్చవలెను. తరువాత సూర్యదేవతాకములును రుద్రదేవతాకములు అగు సూక్తములతో వేరు వేరుగా ఈ ఇద్దరు దేవతల నుద్దేశించి (ప్రతి ఋక్కుతోను స్వాహా అని పలుకుచు) నేతితో తడిపిన జిల్లేడు - మోదుగ సమిధలతోను యవలతోను నల్లని నూవులతోను నేతితో నూట ఎనిమిదే సిసారుల ఆహుతులు వేయవలెను.

తరువాత మంగళ పవిత్ర ద్రవ్యములతో మంగళ స్నానము జరుపుకొని యజమానుడు మంగళాలంకారములు వస్త్రములు ధరించి మంగళ శరీరుడు కావలెను. వేదవిదుడు దర్భ పవిత్రపాణి యగు బ్రాహ్మణునిచే నాలుగు కోణములందు రంద్రములులేని నాలుగు (మామిడి పల్లవములు మొదలగునవి అలంకరించిన)మంగళ కలశములను స్థాపింపజేయవలెను. నాలుగింటికి నడుమ రంధ్రములేని మరియొక (ఐదవ) కలశమును నిలుపవలెను. దాని యందు పెరుగును అక్షతలను వేయవలెను. (అక్షతము -దెబ్బ తిననిది; నడుము విరుగకుండునట్లు ఱోటిలో దంచి చేసిన బియ్యము అక్షతలు; అంతేకాని వేరు విధమగునవి కావు) దీనిని అగ్ని దేవతాకములగు మంత్రములతో అభిమంత్రములతో అభిమంత్రించవలెను. ఈ ఐదిటిని సుగంధజలముతోనింపవలెను. వాటియందు రావి మామిడి జువ్వి మొదలగు చిగుళ్లను అన్ని విధములుగా ఓషదులను (భృంగము మొదలగునవి) తెల్ల గరికను ఫలములను కూడా వేయవలెను. పంచరత్నములను కూడా వేయవలెను. నూతన వస్త్రములతో చుట్టవలెను. ఏనుగలు గుర్రములు రథములు గోవులు మొదలగునవి తిరుగు స్థలమునుండి పుట్టనుండి నదీద్వయ-నదీసాగర-సంగమ ప్రదేశములనుండి సంపాదించిన శుద్దమగు (జల్లించిన) మట్టి కూడ వానితో వేయవలెను. నడుమ నున్న ఐదవ కలశమును మాత్రము రెండు వస్త్రములతో చుట్టవలెను. అంతట సూర్యదేవతాకములగు మంత్రములను పఠించవలయును. అంగ వైకల్యములేని ఏడుమంది ముత్తైదువలను ఏడు మంది బ్రాహ్మణులను యథాశక్తిగా పూలతో వస్త్రములతో అలంకరణములతో సంపూజించి వారిచేత మరణించునంత దురన్తములగు వ్యాధులకు లోనై బాధపడుచున్న ఈ శిశువును (బాలుడుకాని బాలికకాని) స్నానము చేయించవలెను.

ధీర్గయురస్తు బాలో 7 యం జీవవత్సా చ భామినీ. 29

ఆదిత్య శన్ద్రమా స్సార్ధం గ్రహనక్షత్రమణ్డలైః | శక్రశ్చ లోకపాలాశ్చ బ్రహ్మ విష్ణు ర్మహేశ్వరః. 30

ఏతే చాన్యేచ దేవౌఘా స్సదా పాస్తు కుమారకమ్‌ | మాత్రా7శ నిర్మా హుతభుఙ్మాచ బాలగ్రహాః క్వచిత్‌.

పీడాం కుర్వస్తు మా మాతు ర్జనకస్య జనస్య వైః | తత శ్శుక్లామ్భరధరా కుమారపతి సంయుతా. 32

పద్మజం పూజయే ద్భక్త్యా సదస్యాంశ్చ గురూన్పునః| కాఞ్చనీంచ తతః కృష్ణతిలపాత్రోపరి స్థితామ్‌. 33

ప్రతిమాం ధర్మరాజస్య గురవేతు నివేదయేత్‌ | వస్త్రకా ఞ్చ నరత్నౌ ఘైర్భక్తై స్సఘృతపాయసైః. 34

పూజయేద్బ్రాహ్మణాం స్తద్య ద్విత్తశాఠ్యవివర్జితః | భుక్త్వాచ గురుణా చేయముచ్చార్యా మంత్రపస్తతిః. 35

ధీర్గయు రస్తు బాలో7యం యావద్వర్షశతం సమాః| యత్కిఞ్చి దస్య దురితం క్షప్తం త దృడబానలే.

బ్రహ్మా రుద్రో వసు స్క్సన్దో విష్ణు ర్దేవో హుతాశనః | రక్షస్తు సర్వదుంఖేభ్యో వరదా స్సస్తు సర్వదా. 36

ఏవమాదీని వాక్యాని వదస్తం పూజాయే ద్గురుమ్‌ |

శక్తితః కపిలాం దద్యా త్ర్పణిపత్య విసర్జయేత్‌. 38

చరుంచ పుత్త్ర సహితా ప్రణమ్య రవిశఙ్కరౌ | హుతశేషం తదా7శ్నీయా దాదిత్యాయ సమో7స్త్వితి. 39

ఇదమే వాద్భుతోద్వేగదుస్స్యప్నేషు చ శస్యతే | కర్తు ర్జన్మాదిఋక్షాణాం దేవా స్త్సమ్పూజయే త్తదా. 40

శాస్త్యర్థం శుక్లసప్తమ్యా మేవం కుర్వ న్న పీదతి | స చానేన విధానేన దీర్ఘాయు రభవ న్నృపః. 41

సంవత్సరాణాం ప్రయుతం శశాస పృథినీ మిమామ్‌ | పుణ్యం పవిత్ర మాయుష్యం సప్తమీన్నపనం రవేః.

కథయిత్వా ద్విజశ్రేష్ఠం తత్రైవాస్తరధీయత | ఆరోగ్యం భాస్కరా దిచ్చే ద్ద్రవ్య మిచ్చే ద్దుతాశనాత్‌. 43

ఈశ్వరా ద్ఞాన మన్విచ్ఛే ద్గతి మిచ్ఛే జ్జనార్దనాత్‌|

ఏత న్మహాపాతక నాశనం స్యా దప్యక్షయం వేదవిదోవదన్తి. 44

శృణోతి యశ్చైన మనన్యచేతా స్తస్యాసి సిద్దిం మునమో వదన్తి 44 ||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమను సంవాదే సప్తమీన్నపన

వ్రతకథనం నామాష్టషష్టిత మో 7 ధ్యాయః.

స్నాన సమయమున ఆచార్యుడు ఈ అర్థ మిచ్చు మంత్రములను పలుకవలయును. ''ఈ బాలుడు (బాలిక) దీర్ఘాయువగుగాక: ఈ స్త్రీ (మాత) జీవించిన శిశువు కలది యగుగాక: అదిత్యుడు చంద్రుడు గ్రహములు నక్షత్ర (మండల)ములు ఇంద్రుడు లోకపాలురు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇతర దేవతలును ఈ కుమారకుని (కుమారికను)సదా రక్షింతురు గాక : ఇచట పిడుగుకాని అగ్నికాని బాలగ్రహములు కాని ఈ శిశువునకును తల్లిదండ్రులకును ఏ పీడను కలగు నీయకుందురు గాక!''

తరువాత ఈ శిశుమాత శిశువుతోను భర్తతోను కూడి బ్రహ్మదేవుని - సభయందలి పెద్దలను గురువులను పూజించవలెను. తరువాత ఒక తామ్ర పాత్రయందు నల్లని నూవులను నింపి దానిపై బంగారు (యమ) ధర్మరాజ ప్రతిమనుఉంచి దానినంతటిని గురువునకు సమర్పించవలెను. పిమ్మట వస్త్రములు బంగారు రత్నములు ఇచ్చి పిండివంటలు నేతి పాయసములు-వీనితో బ్రాహ్మణులను భుజింపజేసి పూజించవలయును. గురుని కూడా భుజింపజేయవలెను.

అపుడు గురువు ఈ యర్థమునిచ్చు మంత్రములను పలుకవలయును: ''ఈ బాలుడు (బాలిక) ధీర్ఘాయువగుగాక: నూరేండ్లు నిండుగా జీవించుగాక : ఈ శిశుని పాపమంతయు బడబానలములో పడుగాక : బ్రహ్మ రుద్ర వసు సుబ్రహ్మణ్య విష్ణు హుతాశనులు ఈ శిశువును అన్ని దుఖములనుండి కాపాడుచు వరముల నిత్తురుగాక:'' ఈ మొదలగు వాక్యములు మంత్ర రూపమున పలికిన గురుని యథాశక్తిగ సమ్మానించి శక్తి యున్నచో కపిల గోదానము చేసి నమస్కరించి వీడ్కొనవలయును.

తరువాత శిశుమాత శివుతో కూడి రవి శ కరులను నమస్కరించి హోమము చేయగా మిగిలిన 'చరు' ద్రవ్యమును 'ఆదిత్యాయ నమో7స్తు' అనుచు భుజించవలయును. (చరువు-అవిరి బయటికి పోనీయక అత్తెసరుతో పాలతోనో నేతితోనో నీటితోనో వరిబియ్యపు-గోదుమ నూక - యవలనూక- ఏనిలో దేనితోనైనా చేసిన అన్నము) ఈవిధానము ఆశ్చర్యకరములగు అపురూపపు సంఘటనలు జరిగినపుడు -కలవరపాటు భయము కలిగించు సంఘటనములు దుస్స్వప్నములు సంభవించినపుడు కూడ ప్రశస్తమయినది. యజమానుని జన్మ నక్షత్రము మొదలగునవి కల దినమున ఆయా నక్షత్రాధి దేవతలను పూజించవలయును. లేదా శుక్లపక్ష సప్తమినాడైనను ఈ శాంతి జరుప వచ్చును. (అందుచేతనే దీనికి సప్తమీ స్నపనమని పేరు) దాని వలన ఉపద్రవములు శాంతించును. శుభము కలుగును.

కృతవీర్యుడు సూర్యుని ఉపదేశానుసారము ఈ శాంతిక స్నానము తన కుమారునకు జరిపించుటచేతనే అతడు (అర్జునుడు) ధీర్ఘాయుష్మంతుడై లక్ష సంవత్సరములీ పృథివిని పాలించెను.

అని ఇట్లు సప్తమీ స్నపన ప్రక్రియను కృతవీర్యునకు తెలిపి రవి అంతర్ధానమునందెను.

రవినుండి ''ఆరోగ్యమును అగ్ని నుండి ద్రవ్యమును ఈశ్వరుని నుండి జ్ఞానమును విష్ణునినుండి సద్గతిని కోరవలయును-(పొందవలయును)

ఈ స్నాన విధానము మహాపాతకనాశనము; అక్షయ ఫలప్రదము; అని వేదతత్వ వేత్తలు చెప్పుదురు, అనన్య చిత్తులై దీనిని వినిన వారికి కూడా దీనిని యథా విధానముగా ఆచరించిన ఫలము కలుగునని మునులు చెప్పుచున్నారు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సప్తమీ న్నపన విధానమను ఆరువది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters