Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తస ప్తతితమో7ధ్యాయః.

శర్కరాఫలస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

శర్కరాసప్తమీం వక్ష్యే తద్వ త్కల్మషనాశనీమ్‌ | ఆయురారోగ్య మైశ్వర్యం యథా7న న్తం ప్రజాయతే. 1

మాఘస్య సితపక్షే తు సప్తమ్యాం నియతవ్రతః | ప్రాత స్సాత్ర్వా తిలై శ్శుక్లై శ్శుక్లమాల్యానులేపనైః. 2

స్థణ్ణిలే పద్మ మాలిఖ్య కుఙ్కు మేన సకర్ణివమ్‌ | తస్మి న్న మస్సవిత్రేతి గన్ధం పుష్పం నివేదయేత్‌. 3

స్థాపయేదుదకుమ్భంచ శర్కరాపాత్రసంయుతమ్‌ | శుక్లై ర్వసై#్త్ర రలఙ్కృత్య శుక్ల మాల్యానులేపనైః. 4

సువర్ణాశ్వసమాయుక్తం మన్త్రేణానేన పూజయేత్‌ | విశ్వదేవమయో యస్మా త్త్వం వేదేషు చ పఠ్యసే. 5

త్వమేవ సర్వం దేవేశ జగ దేత చ్చరాచరమ్‌ | పఞ్చగవ్యం తతః పీత్వా స్వ పే త్తత్పార్శ్వతః క్షితౌ. 6

సౌరం సూ క్తం స్మర న్నాస్తే పురాణశ్రవణన తు | అహోరాత్రే గతే పశ్చా దష్టమ్యాం కృతనైత్యకః. 7

తత్సర్వం వేదవిదు షే బాహ్మణాయ నివేదయేత్‌ | భోజయే చ్ఛక్తి తోవిప్రా ఞ్ఛర్కరాఘృతపాయసైః. 8

భుఞ్జీతాతైలలవణం స్వయమప్యథ వాగ్యతః | అనేన విధినా సర్వం మాసిమాసి సమాచరేత్‌. 9

సంవత్సరా న్తే శయనం శర్కరాకలశాన్వితమ్‌ | సర్వోపస్కరసంయుక్తం తథైకాం గాం పయస్వినీమ్‌. 10

గృహం చ శ క్తిమా న్దద్యా త్సమస్తోపస్కరాన్వితమ్‌ | సహస్రేణాథనిష్కాణాం కృత్వా దద్యా చ్ఛతేనవా.

దశభిర్వా త్రిభిర్వాపి నిష్కేణౖ కేన శ క్తితః | సువర్ణాశ్వః ప్రదాతవ్యః పూర్వవ ద్విప్రవాచనమ్‌. 12

న విత్తశాఠ్యం కుర్వీత కుర్వ న్దోషా న్త్సమశ్నుతే | అమృతం పిబతో వక్త్రా త్సూర్యస్యామృతబిన్దవః.

నిపేతు ర్యే ధరాయాం వై శాలిముద్గేక్షవ స్స్మృతాః. 13

శర్క రా పరత స్తస్మా దిక్షుసారో7మృతాత్మవా& | ఇష్టా రవే రతః పుణ్యా శర్కరా హవ్యకవ్యయోః.

శర్కరాస ప్తమీ చేయం వాజిమేధ ఫలప్రదా | సర్వదుఃఖప్రశమనీ పుత్త్రపౌత్త్ర ప్రపర్ధినీ. 15

యః కుర్యా త్పరయా భక్త్యా స పరం బ్రహ్మ గచ్ఛతి | కల్ప మేకం వసే త్స్వర్గే తతో యాతి పరాం గతిమ్‌.

ఇద మనఘ శృణోతి య స్స్మరేద్వా సరిపఠతీహ సురేశ్వరస్య లోకే |

మతిమపిచ దదాతి సోపి దేవై రమరవధూజనమాలయా7భిపూజ్యః. 17

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శర్కరాసప్తమీవ్రతకథనం నామ

సప్తసప్తతితమో7ధ్యాయః.

డెబ్బదియేడవ అధ్యాయము

శర్కరాఫల స ప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్టిదే యగు శర్కరా స ప్తమీ వ్రతమును తెలిపెదను. అది కల్మషనాశకమును-అనంతాయురారోగ్యైశ్వర్యప్రదమును.

మాఘ శుక్ల స ప్తమినాడుదయమున తెల్లని నూవుల(పొడితో-నూనె)తో స్నానము చేసి తెల్లని వస్త్రమాల్యముల ధరించవలెను. ఆరుగు అలికి దానిపై కుంకుమతో పద్మమును దాని నడుమ కర్ణికను వేయవలెను. 'నమః సవిత్రే' అను మంత్రముతో దానిపై గంధపుష్పము లుంచవలెను. దాని నడుమ నీటి కలశముంచి దానిపై శర్కరాపాత్ర నుంచవలెను. బంగారు గుర్రపు ప్రతిమను దానియందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ నలంకరించవలయును. రవి నీ మంత్రముతో పూజించవలెను. (అర్థము): ''దేవేశా! సర్వదేవమయుడవుగా నీవు వేదములందు పఠింపబడుచున్నావు. కనుక ఈ చరాచర జగ త్తంతయు నీవే.'' తరువాత పంచగవ్యము త్రావి (ఉపవాసముతో) ఆ అరుగునకు దగ్గరగా నేలపయి వయనించవలెను. సౌరసూ క్తములనో పురాణములనో పురాణములనో చదువుచు కాని వినుచు కాని ఆ పగలును రాత్రియు గడుపవలెను. అష్టమినాడు నిత్యానుష్ఠానము నెరవేర్చికొని అదియంతయు బ్రాహ్మణునకు దానము ఈయవలయును. తన శ క్తికొలదిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయసముతో భోజనము పెట్టవలెను. తానును మౌనముతో నుండి తై ల లవణరహితముగా భుజించవలెను.

ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరకాలము చేసి పిమ్మట శర్కరా పూర్ణకలశముతో సర్వోపస్కర (సర్వసామగ్రీ) సహితమగు మంచమును పడకను పాడియావును శక్తి యున్నచో గృహమును కూడ సర్వోపకరణములతో ఈయవలయును. వేయి-లేదా నూరు-లేదా ఒక నిష్కము (పూర్వపు ఒక బంగారు నాణము) తూకముతో బంగారు గుర్రములను (యథాశ క్తి) చేయించి విప్రులచే సౌరసూక్తపాఠము పురాణ పఠనము చేయించి వారి కిది దానమీయవలయును. ధనమునకు లోభించి లోపము చేయుట దోషకరము.

సూర్యు డమృతము త్రావునపుడు అతని నోటినుండి పడిన అమృతపు బొట్టులే వడ్లు పెసలు చెరకు ఐనవి. ఇక్షుసారము శర్కర; అది అందేచే ఈ మూటిలో గొప్పది. అమృత స్వరూపము అయినది. హవ్యకవ్యములందు అందుచే శర్కర రవికి ప్రీతికరము.

ఈ శర్కరా సప్తమీ వ్రతానుష్ఠానము అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. సర్వదుఃఖశాంతిని పుత్త్రసౌత్త్ర వృద్ధిని పరబ్రహ్మత్వమును కూడ కలిగించును. అట్టివా డొక కల్పము కాలము స్వర్గమందుండి పిదప ముక్తి నందును.

దీనిని చదివినను వినినను తలచినను ఉ త్తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సరః సమూహముచే పూజింపబడును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున శర్కరా స ప్తమీ వ్రత కథనమను డెబ్బది యేడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters