Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వ్యశీతిత మో 7 ధ్యాయః.

ధాన్యాదిపర్వతదానాని.

నారదః : భగవ& శ్రోతు మిచ్ఛామి దానమహాత్మ్యముత్తమమ్‌|

యదక్షయం పరే లోకే దేవర్షిగణ సేవితమ్‌. 1

ఈశ్వరః : మేరోః ప్రదానం వక్ష్యామి దశధా మునిసత్తమ|

యత్ర్పదానా న్నరో లోకా నాప్నోతి సురపూజితాన్‌. 2

పురాణషుచ వేదేషు యజ్ఞే ష్వాయతనేషు చ | న తత్పల మధీతేషు కృతేష్యిహ యదశ్నుతే. 3

తస్మా ద్విధానం వక్ష్యామి పర్వతానా మనుక్రమాత్‌ | ప్రథమోధాన్యశైల స్స్యా ద్ద్వితీయో లవణాచలః. 4

గుడాచల స్తృతీయస్తు చతుర్థో హేమపర్వతః| పఞ్చమ స్తిలశైల స్స్యా త్షష్ఠః కార్పాసపర్వతః. 5

సప్తమో ఘృతశైలశ్చ రత్నశైల స్థథా7ష్టమః | రాజతో నవమ స్తద్వ ద్దశమ శ్శర్కరాచలః. 6

వక్ష్యే విధాన మేతేషాం యథావ దనుపూర్వశః| అయనే విషువే పుణ్య వ్యతీపాతే దినపత్రయే. 7

శుక్లపక్షతృతీయాయా ముపరాగే శిశక్షయే| వివాహోత్సవయజ్ఞేషు ద్వాదశ్యా మథవా పునః. 8

శుక్లాయాం పఞ్చదశ్యాంవా పుణ్యరేక్షవా విధానతః | తీర్థేవా77 యతనేవాపి గోష్టేవా ప్రాఙ్గణ వనే. 9

ధాన్యశైలాదయో దేయో యథాశాస్త్రం విజానతా | మణ్డపం కారయే ద్భక్త్యా చతురశ్ర ముదఙ్మఖమ్‌. 10

ప్రాగుదక్ర్పవణ దేశే పాఙ్ముఖం వా విధానతః | గోమయే నామలిప్తాయాం భూమా వా స్తీర్యవై కుశా &.

తన్మధ్యే పర్వతం కుర్యా ద్విష్కమ్భపర్వతాన్వితమ్‌|

ఎనుబది రెండవ అధ్యాయము.

ధాన్యాది పర్వత దానములు

నారదుడు ఈశ్వరుడిని ఇట్లడిగెను: పరలోకమున అక్షయ ఫలదమైనదియు దేవతలును దేవర్షులును ప్రశంసించునదియు మహా మహిమము కలదియు నగు ఉత్తమ దానమును తెలుప వేడుచున్నాను. అనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: పది విధములగు మేరు(పర్వత) దానము అనునది కలదు. దానిని చేసిన నరుడు సుర పూజితములగు ఉత్తమ లోకము లందు సుఖించును. ఇవి చేయుటచే కలుగునంత ఫలము పురాణములను వేదములను అధ్యయనము చేయుటచే కాని వాని యందు చెప్పబడిన ఆయా యాగాది పుణ్య కార్యములనుచేయుటచే కాని లభింపదు. అవి వరుసగా ధాన్య లవణ గుడ సువర్ణ తిలక కార్పాస (దూది) ఘృత రత్న రజత-శర్కరా మేరు (పర్వత) దానములు. క్రమముగా వీని విధానము తెలిపెదను. (ఉత్తర - దక్షిణ) అయనములు-విషువము (దివారాత్ర పరిమాణము సమమగు దినములు రెండు) వ్యతీపాత యోగము అవమ-త్రిద్యుస్పృక్‌ దినములు- (ప్రతిమాస) శుక్లపక్ష తృతీయ-(చంద్ర-సూర్య) గ్రహణములు - అమావాస్య- వివాహములు- ఉత్సవములు - యజ్ఞములు-ద్వాదశి-పూర్ణిమ-పుణ్య(శుభ)నక్షత్రమున్న దినము-ఈ కాలములందును పుణ్యతీర్థక్షేత్రములు- గోవులు నిలుచు ప్రదేశము -ఇంటి ముంగిలి-వనము-ఇట్టి దేశములందును వీటిని యథా విధానముగే నీయవలెను.

తూర్పునకో ఉత్తరమునకో వాలుగా ఉండు ప్రదేశమున భక్తితో ఉత్తరమో తూర్పో మొగముండునట్లు చతురస్ర మండపము (పందిరి) ఏర్పరచవలయును. దానియందు గోమయముతో అలికిన ప్రదేశమున దర్భలను పరచవలయును. ఆచోట నడుమ శాఖా పర్వతములతో కూడిన ప్రధాన పర్వతమును (మేరుపును) నిర్మించవలెను.

ధాన్యద్రోణసహస్రణ భ##వేద్గిరి రిహోత్తమః. 12

పఞ్చశ##తై ర్మధ్యమ స్స్యా త్కనిష్ఠ స్య్సాత్త్రిభి శ్శతైః |

మేరు ర్మహావీహిమయశ్చ మధ్యే సువర్ణశృఙ్గ త్రయసంయత స్స్యాత్‌. 13 పూర్వేణ ముక్తాఫలవజ్రయుక్తో యామ్యేన గోమేధిక పుష్యరాగైః|

పశ్చాచ్చ గారుత్మతనీలరత్నై స్సౌమ్యేన వైడూర్యసరోజరాగైః. 14

శ్రీఖణ్డఖణ్డౖరభితః ప్రవాళై ర్లతాన్విత శ్శుక్తిశిలాతల స్స్యాత్‌|

బ్రహ్మాచ విష్ణు ర్భగవా న్పురారి ర్దివాకరో7 ప్యత్ర హిరణ్మయే స్స్యాత్‌. 15

మూర్ధన్యవస్థాన మమత్సరేణ * కార్యం త్వనైకైస్సు రసిద్దసజ్ఘైః|

చత్వారి శఙ్గాణిచ రాజతాని నితమ్బభాగేష్వపి రాజత స్స్యాత్‌. 16

తథేక్షుదణ్డావృతకన్దరస్తు ఘృతోదక ప్రస్రణశ్చ దిక్షు|

శుక్లామ్బరా ణ్యమ్బుధరావళి స్స్యా త్పూర్వేణ పీతానిచ దక్షిణన. 17

వాసాంసి పశ్చాదథ కర్బురాణి రక్తానిచైవో త్తరతోయాదాళిః|

రౌప్యా న్మహేన్ద్ర ప్రముఖా నథాష్టౌ సంస్థాప్య లోకాధిపతీస్క్రమేణ. 18

నానాఫలాశిశ్చ సమన్తతస్స్యా న్మనోహరం మాల్య విలేపనంచ|

వితాన మస్యోపరి పఞ్చవర్ణమవ్లూనపుష్పాభరణాన్వితం చ. 19

ఇత్థం నివేశ్యామర శైల మగ్ర్యం మేరో స్సువిష్కమ్బగిరీ న్క్రమేణ|

తురీయభాగేన చతుర్దిశంవై సంస్థాపయే త్పుష్పవిలేపనాడ్యమ్‌. 20

పూర్వేణ మన్దర మనేకఫలైశ్చ యుక్తం యుక్తం గణౖః కనకరుద్రకదమ్బచిహ్నమ్‌|

కామేన కాఞ్చనమయేన విరాజమాన మాకారయే త్కసుమవస్త్రవిలేపనాడ్యమ్‌.|

క్షీరారుణోదసరసాచ వనేన చైవం రౌప్యేన శుక్తిఘటితేన విరాజమానమ్‌|

యామ్యేచ గాన్దమదనోత్ర నివేశనీయో గోధూమసఞ్చయమయః కలధౌతజమ్బ్యా. 22

హైమేన యక్షపతినా ఘృతమానసేన వసై#్త్రశ్చ రాజతవనేన సుసంతయుత స్స్యాత్‌.

పశ్చా త్తిలాచల మనేకసుగన్దపుషై#్ప స్సౌవర్ణ పిప్పలహిరణ్మయహంసయుక్తమ్‌. 23

ఆకారయే ద్రజతపుష్పవనేన తద్వ ద్వస్త్రాన్వితం దధిసితోదసర స్తథాగ్రే|

సంస్థాప్య తం విపులశైల మథోత్తరేణ శైలం సుపార్శ్య మపిl కాంస్యమయం సువప్రమ్‌. 24

పుషై#్పశ్చ హేమవటపాదప శేఖరాన్త మాకారయే త్కనకధేను విరాజమానమ్‌|

మాక్షీకభద్ర సరసాచ వనేన తద్వ ద్రౌప్యేన భాస్వరవతాచ వనం విధాయ. 25

హోమ శ్చతుర్భి రథ వేదపురాణవిద్భి ర్దాన్తై రనిన్ద్యచరితాకృతిభి ర్ద్విజేన్ద్రైః

పూర్వేణ హస్తమిత మత్ర విధాయ కుణ్డం కార్య స్తిలై ర్యవఘృ తేన సమిత్కశైశ్చ. 26

_______________________________________

­ కార్యంత్వనేకైశ్చ పునర్ద్విజాద్యైః l మాష

ధాన్యాది పర్వత దానములు -82 అ.

(పర్వత నిర్మాణము:)1. ధాన్య పర్వతము: దీనికై కావలసిన ధాన్య పరిమాణము-వేయి « తూములు-గాని ఐదు వందల తూములు కాని మూడు వందల తూములు కాని ఉండవలెను. నట్ట నడుమ మూడు బంగారు శిఖరములు తూర్పున ముత్తెముల వజ్రముల శిఖరము-దక్షిణమున గోమేదక పుష్యరాగ శిఖరము పడమర గరుడ పచ్చల ఇంద్ర నీలముల శిఖరము ఉత్తరమున వైదూర్య పద్మరాగముల శిఖరము ఉండవలెను. మంచి గంధపు కర్రలతోను పగడములతోను చేసిన తీగల ముత్తెపు చిప్పలతో అమర్చిన రాతినేలలు ఉండవలెను. బంగారుతో చేసిన బ్రహ్మ విష్ణు రుద్ర శివుల ప్రతిమలును సురసిద్ద ప్రముఖ దేవతల ప్రతిమలును ఈ పర్వతపు పై భాగమున అమర్చవలెను. నాలుగు శిఖరములును నెత్తములును వెండితో చేయవలెను. నానా దిక్కులందును చెరకుగడలతో మూయబడిన గుహలును నేతితో నీటితో అమర్చిన సెలేఏరులును కొండ ఊటలును ఉండవలెను. తూర్పున తెల్లని వస్త్రములు దక్షిణమున పచ్చని వస్త్రములు పడమర కలుగలుపు వన్నెల వస్త్రములు ఉత్తరమున ఎర్రని వస్త్రములు మేఘములుగా అమర్చవలెను. వెండితో చేసిన దిక్పాలకు ప్రతిమలను ఎనిమిది దిక్కులందును నిలపవలెను. కొండపై అంతటను వివిధ ఫలపుష్ప మూల్యములు అమర్చవలెను. దీనికి పైభాగమున ఐదు వన్నెల వస్త్రములతో వాడని పూవులతో ఆభరణములతో అమర్చిన చాందినీని అమర్చవలెను. (నిర్ణయించుకొనిన ధాన్య పరిమాణములో నాలుగింట మూడు వంతుల ధాన్యముతో మేరు పర్వతము అమర్చగా మిగిలిన) నాలుగవవంతు ధాన్యముతో గంధమాల్య యుక్తముగా ఆయా కుల (శాఖా)పర్వతములను అమర్చవలెను. ఎట్లనగా-తూర్పున బంగారుతో చేసిన రుద్రుని ప్రతిమయు ప్రమథుల ప్రతిమలును అనేక ఫలపుష్ప గంధ విలేపనములును బంగారు మన్మథ ప్రతిమయును వీరికందరకును వస్త్రమాల్య గంధ విలేపనములును మందర పర్వతముపై అమర్చవలెను.

దక్షిణమున గోధుమల రాశితో గంధమాదన పర్వతమును దానిపై బంగారుతో నేరేడు చెట్టు-బంగారుతో కుబేర ప్రతిమ నేతితోమానన సరస్సు చక్కని వస్త్రములు వెండితో చేసిన చెట్ల అడవులు ఉండవలెను. పడమట తిలలతో చేసిన విప్రుల పర్వతము దానిపై అనేక సుగంధ పుష్పములు బంగారుతో అశ్వత్థ వృక్షము బంగారు హంసలు వెండితో తెల్లని పూలవనము తెల్లని వస్త్రములతో దధి(పెరుగు) సరస్సు అమర్చవలయును. ఉత్తరమున కంచుతో సుపార్శ్వ పర్వతమును దానిపై శిఖరములు బంగారుతో పూల మొక్కలు మర్రిచెట్టు బంగారు గోవు వెండిచెట్ల అడవి తేనెతో భద్రమను సరస్సు ఏర్పరచవలయును.

ఈ మండపముకు తూర్పున హస్త ఘనపరిమాణము కల కుండమునందు వేద పురాణ వేత్తలును పవిత్ర చరిత్రలు సమర్థులునగు నలుగుర బ్రాహ్మణులచే తిలలతో యవలతో ఘృతముతో సమిధలతో కుశలతో హోమము చేయించవలెను.

రాత్రౌచ జాగర మనుద్దతతూర్యనాదై రావాహనంచ కథయామి శిలోచ్చయానామ్‌ |

త్వం సర్వదేవగణధామనిధే విరుద్ధ మస్మద్గృహే ష్వమర పర్వత నాశయాశు. 27

క్షేమం విధత్స్వ కురు శాన్తి మనత్తమాం స్సమ్పూజితః పరమభక్తిమతా మయాహి|

త్వమేవ భాగవా నీశో బ్రహ్మ విష్ణు ర్దివాకరః. 28

మూర్తామూర్తం పరం బీజ మతః పాహి సనాతన |

యస్మాత్త్వం లోకపాలానాం విశ్వమూర్తశ్చ మన్దిరమ్‌. 29

రుద్రాదిత్యవసూనాంచ తస్మాచ్ఛాన్తిం ప్రయచ్చమే | యస్మా దశూన్య కుమారై ర్నారీభిశ్న శిర స్తవ. 30

_______________________________________

«తూము-32 మానికలు-64కొలతలు. అని గుంటూరు మండలమునందును రాయలసీమలోను వాడుక; తూము = కడవ (రాయలసీమలో)

తస్మాన్మా ముద్దరా శేషదుఃఖసంసారసాగరత్‌| ఏవ మభ్యర్చర్యతం మేరుం మన్దరంచాపి పూజయేత్‌. 31

యస్మాచ్చైత్రరథేనత్వం భద్రాశ్వవర షేణచ | శోభ##సే మన్దర క్షిప్ర మత స్తుష్టికరో భవ. 32

యథా చూడామణి ర్జముద్వీపే త్వం గన్దమాదన | గన్ధర్వవనశోభావా నతః కీర్తి ర్దృఢా7స్తుమే. 33

యస్మా త్త్వం కేతుమాలేన వైభ్రాజేన వనేన చ| హిరణ్మయాశ్వత్థశిరా స్తస్మా త్పుష్టి ర్దృఢా7స్తు మే. 34

ఉత్తరైః కురుభి ర్యస్మా త్సావిత్రేణ వనేన చ | సుపార్శ్వ రాజసే నిత్యమత శ్ర్శీరక్షయా 7స్తుమే. 35

ఈ దానవ్రత దినమున రాత్రియంతయు జాగరణము చేయవలెను. తీవ్రతలేని సరస మధురములగు తూర్య నాదములతో పర్వతముల నావాహనముచేయవలెను. (ఆవాహన మంత్రార్థము): సర్వ దేవ గణముల తేజస్సులకు నివాస స్థానము (నిధి)వగు దేవపర్వతమా! మా గృహములందలి అశుభమును శీఘ్రముగా నశింపజేయుము. పరమ భక్తితో చేసిన నాపూజలందుకొని అత్యుత్తమమగు శాంతి ని క్షేమమునుకలిగించుము. నీవే భగవానుడవగు ఈశుడవు బ్రహ్మయు విష్ణువును రవియును మూర్తికలదియు లేనిదియు అగు వ్యక్తా వ్యక్త తత్త్వమును జగద్భీజమును; కావున సనాతన పర్వతమా! మమ్ములను రక్షించుము నీవు లోకపాలురకును విశ్వమూర్తియగు విష్ణవునకును రుద్రాదిత్య వస్తువులకును నివాసస్థానమవు; కావున అట్టి నీవు నాకు శాంతిని కలిగించుము. నీశిరము దేవ-దేవనారీ జనముతో నిండియుండును. కావున ఇట్టి నీవు నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్దరించుము. ఇట్లు మేరు పర్వతమునర్చించి. పిమ్మట మందర పర్వతమునర్చించవలెను. (మంత్రార్థము:) నీవు చైత్రరథ(వన) ముతోను భద్రాశ్వ వర్షముతోను శోభించుచుందువు. కావున ఇట్టినీవు శీఘ్రమే నాకు తుష్టి కలిగించుము. (గంధమాదనార్చనము): గంధమాదనమా! నీవు జంబూ ద్వీపమున చూడామణివి; గంధర్వ వనపు శోభతో కూడినదానవు. ఇట్టి నీచే నాకు దృఢమగు కీర్తికలుగుగాక| (విపుల పర్వతార్చనము) : విపుల పర్వతమా! కేతుమాల వర్షముతోను వైబ్రాజవనముతోను శిరసునందు బంగారు రావిచెట్టుతోను ప్రకాశించుదానవు. ఇట్టి నీదయచే నాకు దృఢమగు పుష్టి కలుగుగాక: (సుపార్శ్వ పర్వతార్చనము) : సుపార్శ్వ పర్వతమా! ఉత్తర కురు వర్షముతోను సావిత్రమనెడు వనముతోను నిరంతరమును ప్రకాశింతువు. ఇట్టి నీదయచే నాకు అక్షయశ్రీ కలుగుగాక!

ఏవ మామస్త్ర్య తా స్త్సర్యా స్ర్పభాతే విమలే పునః

స్నాత్వాతు గురవే దద్యా న్మధ్యమం పర్వతోత్తమమ్‌. 36

విష్కమ్భపర్వతా& దద్యా దృత్విగ్భ్యః క్రమశో మునే| గావో దేయాశ్చతుర్వింశ దథవా దశ నారద. 37

శక్తిత స్సప్త చాష్టౌవా పఞ్చ దద్యా దశక్తిమా& | ఏకాంచ గురవే దద్యా త్కపిలాంచ పయస్వినీమ్‌. 38

పర్వతానాంచ సర్వేషా మేష ఏవ విధి స్స్మృతః | త ఏవ పూజనే మన్త్రా స్త ఏవోపస్కరా స్స్మృతా. 39

గ్రహాణాం లోకపాలానం బ్రహ్మదీనాంచ నాకినామ్‌ | స్వమన్రైణౖన సర్వేషు హోమ శ్శైలేషు పఠ్యతే.

ఉపవాసీ భ##వే న్నిత్య మశక్తౌ నక్త మిష్యతే | విధానం సర్వశైలానాం క్రమశ శ్శృణు నారద. 41

దానకాలేషు యే మన్త్రాః పర్వతేషుచ య త్ఫలమ్‌|

అన్నం బ్రహ్మ యతః ప్రోక్త మన్నం ప్రాణాః ప్రకీర్తితాః. 42

అన్నా ద్భవన్తి భూతాని జగదన్నేన వర్తతే | అన్న మేవయతో లక్ష్మీ రన్నమేవ నార్ధనః. 43

ధాన్యపర్వత రూపేణ పాహి తస్మా న్నగోత్తమ| అనేన విధినా యస్తు దద్యా ద్దాన్యమయం గిరిమ్‌. 44

మన్వన్తరశతం సాగ్రం దేవలోకే మహీయతే | అప్సరోగణగన్దర్వై రాకీర్ణైశ్చ విరాజితమ్‌. 45

విమానేన దివః పృష్ఠ మాయాతి ఋషిసేవితమ్‌ | కర్మక్షయే రాజ్యరాజ్య మాప్నోతీహ న సంశయః. 46

ఇతి శ్రీమత్స్యమహపురాణ ఈశ్వరనారదసంవాదే ధాన్యపర్వతదాన

మహాత్మ్యకథనం నామ ద్వ్యశీతితమో & ధ్యాయః.

ఇట్లు వాటిని అన్నిటిని అవాహనము చేసి అర్చించి నిర్మలమగు ప్రభాతము కాగానే మధ్యము (మేరు)పర్వతమును గురు (పురోహితు)నకును మిగిలిన నాలుగింటిని నలుగురు ఋత్విక్కులకును ఈయవలెను. శక్తిననుసరించి ఇరువది నాలుగు-పది-ఎనిమిది-ఏడు-ఐదు-ఐన పాడి కపిల గోవులను దానమీయవలయును. గురునకొకటి తప్పక ఈయవలయును.

అన్ని పర్వతముల విషయమునను ఇదే విధానము-మంత్రము- ఉపస్కరములును. సర్వదేవతలకును హోమము కూడ పైవలెనే.

వ్రత దినమున ఉపవాసముండ వలయును. శక్తిలేనిచో నక్తమున భుజించ వచ్చును.

అన్ని పర్వతదానములందును ప్రధానముగా చెప్పవలసిన మంత్రము. ''అన్నమే బ్రహ్మను ప్రాణములును భూతోత్పతత్తి స్థితి హేతువులును లక్ష్మియు జనార్ధనుడును కావున (అన్నమునకు మూలమగు ) ధాన్యపర్వత రూపమున ఉన్న పర్వత రాజమా! మమ్ము కాపాడుము.''

ఈ విధానముతో ధాన్య పర్వతమును (కాని ఇతర పర్వతములను కాని) దానమిచ్చినవారు సమగ్రమగు మన్వంతర శతము దేవలోకమున సుఖింతురు. సర్వత్ర వ్యాపించియున్న అప్సరో గంధర్వ గణములతో వ్యాప్తమైయున్న స్వర్గమును దివ్వ విమానములో చేరుదురు. కర్మక్షయముకాగానే మరల కల్పాదియందు మరల కల్పాదియందు రాజరాజై జన్మింతురు.

ఇది శ్రీమత్స్య మహపురాణమున ధాన్యపర్వత దాన మహాత్మ కథనమను ఎనబది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters