Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోననవతితమో7ధ్యాయః.

రత్నపర్వతదానమ్‌.

ఈశ్వరః: అతఃపరం ప్రవక్ష్యామి రత్నాచల మనుత్తమమ్‌ l

యత్ర్పదానా న్నరో యాతి విష్ణులోక మనుత్తమమ్‌. 1

ముక్తాపలసహస్రేణ పర్వత స్స్యా దనుత్తమః l మధ్యమః పఞ్చశతిక స్త్రిశ##తే నాధమ స్స్మృతః .2

చతుర్థాంశేన విష్కమ్భపర్వతా స్స్యు స్సమన్తతః l పూర్వేణ వజ్రగోమేదై ర్దక్షీణనేన్ద్రనీలకైః .3

పుష్యరాగయుతః కార్యో విద్వద్భి ర్గన్దమాదనః lవైడూర్యవిద్రుమైః పశ్చాత్సమ్మిశ్రో విపులాచలః. 4

పద్మరాగై స్ససౌపర్ణై రుత్తరేణాపి విన్యసేత్‌ l ధాన్యపర్వతవ త్సర్వం మన్త్రార్చనవిధి స్స్మృతః. 5

తద్వదావాహనం కుర్యా ద్వృక్షా న్దేవాంశ్చ కాఞ్చనా& l పూజయే త్పుష్పధూపాద్యైః ప్రభాతే గతమత్సరః . 6

పూర్వవ ద్గురుఋత్విగ్భ్య ఇమం మన్త్ర ముదీరయేత్‌ l యథా దేవగణా స్సర్వే సర్వరత్నే ష్వవస్థితాః. 7

సచ రత్నమయో నిత్యమతః పాహి మహాచల l యస్మాదన్న ప్రదానేన వృష్టిం ప్రకురుతే హరిః. 8

సదా రత్నప్రదానేన తస్మా న్నః పాహి పర్వత l అనేన విధినా యస్తు దద్యా ద్రత్నమయం గిరిమ్‌ . 9

స యాతి వైష్ణవం లోక మమరేశ్వరపూజితమ్‌ l యావత్కల్పశతం సాగ్రం వసేత్త్విహ నరాధిప. 10

రూపారోగ్యగుణోపేత స్సప్తద్వీపాధిపో భ##వేత్‌ l బ్రహ్మత్యాదికం కించి ద్యదత్రాముత్ర వాకృతమ్‌. 11

తత్సర్వం నాశ మాయాతి గిరి ర్వజ్రహతో యథా. 11u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రత్నాచలదానమాహాత్య్మ కథనం

నామైకోన నవతితమో7ధ్యాయః.

ఎనుబది తొమ్మిదవ అధ్యాయము.

రత్న పర్వతదానము.

ఈశ్వరుడు నారదునకు ఇట్లు తెలిపెను: ఇకమీదట రత్న పర్వత దాన విషయమును తెలిపెదను. ఇది అత్యుత్తమ మయినది. దీని నాచరించినవారు సర్వోత్తమమగు విష్ణులోకమేగుదురు. వేయికాని ఐదువందలుకాని మూడు వందలుకాని పలముల ముతైములు దీనికై వినియోగించవలెను. మొత్తము తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల నాలుగు దిక్కులందు చేయవలెను. తూర్పున వజ్రములతో గోమేదములతో మందరమును దక్షిణమున ఇంద్ర నీలములతో పద్మరాగములతో గంధమాదనమును పశ్చిమమున వైదూర్యములతో పగడముతో విపుల పర్వతమును ఉత్తరమున పద్మరాగములతో గరుడు పచ్చలతో సుపార్శ్వ పర్వతమును నిర్మించవలెను. మంత్రములు అర్చన విధానము బంగారుతో వృక్షములు దేవతలు వారినావాహనము చేయుట అన్నియు ధాన్య పర్వతమునందువలెనే. దాన దినపు ఉదయమున మత్సరము లేక లోగడ చెప్పినట్లే గురునకును ఋత్విక్కులకును మేరువును విష్కంభ పర్వతములను దానమీయవలెను. (దానమంత్రము:) దేవతలందరు అన్ని రత్నములయందు వసింతురు. అట్టి రతనముల పర్వతమా! నన్నెల్లప్పుడు కాపాడుము. అన్న(హవిః) ప్రదానముచే ఇంద్రుడు సంతసించి వర్షమును కురిపించునట్లే నేను చేసిన ఈ రత్న ప్రదానముచే హరి సంతసించి నాకు కోరికలు కురియునట్లు అనుగ్రహంచుము . ఈ విధానమున రత్న పర్వతదానము చేసినవారు దేవేంద్రునిచే కూడ పూజితమగు విష్ణులోకమున కేగి పూర్ణముగ నూరు కల్పములపాటచటనుండి మరల కల్పాది సృష్టియందు రూపారోగ్య సద్గుణ సంపన్నుడైన సప్త ద్వీపాధిపతిగా జన్మించును ఇహముననో పరముననో చేసిన బ్రహ్మహత్యాది పాపములన్నియు వజ్రపు దెబ్బ తినిన పర్వతమువలె నశించును.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున రత్న పర్వతదాన మాహత్మ్య కథనమను

ఎనుబది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters