Sri Matsya Mahapuranam-1    Chapters   

నవతితమో7ధ్యాయః.

రౌప్యపర్వతదానమ్‌.

ఈశ్వరః: అతఃపరం ప్రవక్ష్యామి రౌప్యశైల మనుత్తమమ్‌l యత్ర్పదానా న్నరో యాతి సోమలోకం ద్విజోత్తమ. 1

దశభిః పలసాహసై#్ర రుత్తమో రజతాచలః | పఞ్చభి ర్మధ్యమః ప్రోక్త స్తదర్ధేనాధమ స్స్మృతః. 2

అశక్తో వింశ##తే రూర్ధ్వం కారయే ద్భక్తిత స్సదా | విష్కమ్భపర్వతాం స్తద్వ త్తురీయాం శేన కల్పయేత్‌ . 3

పూర్వవ ద్రాజతా న్కుర్యా న్మనరాదీ న్విధానతః L కలధౌతమయాం స్తద్వ ల్లోకేశా న్కారయే ద్బుధః . 4

బ్రహ్మవిష్ణ్వర్కవ త్కార్యో నితమ్బో7త్ర హిరణ్మయః | రాజత స్స్యా దతో7న్యేషాం సర్వస్మిన్నిహ కాఞ్చనమ్‌. 5

శేషంచ పూర్వవత్కుర్యా ద్ధోమజాగరణాదికమ్‌ | దద్యా త్తతః ప్రభాతేతు గురవే రజతాచలమ్‌ . 6

విష్కమ్భశైలా నృత్విగ్భ్యః పూజ్య వస్త్రవిభూషణౖః l ఇమం మన్త్రం పఠే ద్దద్యాద్దర్భపాణి ర్విమత్సరః.

పితౄణాం వల్లభం యస్మా ద్విష్ణోర్వా శజ్కరస్యచ l పాహి రాజత తస్మా త్త్వం శోకసంసారసాగరాత్‌.

ఇత్థం నివేద్య యో దద్యా ద్రజతాచల ముత్తమమ్‌ l గవా మయుతసాహస్రఫల మాప్నోతి మానవః. 9

సోమలోకే సగన్ధర్వైః కిన్నరాప్సరసాం గణౖః l పూజ్యమానో వసే ద్విద్వా న్యావదాభూతసవ్ల్పువమ్‌ . 10

ఇతి శ్రీమత్స్యమహాపురాణ రజతాచల దానమాహాత్య్మ కథనం

నామ నవతితమో7ధ్యాయః.

తొంబది యవ అధ్యాయము.

రౌప్య పర్వత దానము.

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను: ఇకమీదట రౌప్య పర్వత (వెండికొండ) దాన విషయము తెలిపెదను. ఇది సర్వోత్తమము. దీని నాచరించినవారు సోమలోక ప్రాప్తులగుదురు. దీనికై పదివేల పలములుకాని ఐదువేల పలములు కాని రెండున్నర వందల పలములు కాని తూకముకల వెండి కావలయును. శక్తిలేనివారు భక్తితో ఇరువది పలములకు తక్కువ కాని వెండితోనైన చేయవచ్చును. పైవలెనే చతుర్థాంశముతో విష్కంభ పర్వతములను వెండితోనే మందరాది పర్వతముల నాయా దిశలందును బంగారుతో లోకపాలురను బంగారుతో నెత్తము చేయించి దానిపై బ్రహ్మ విష్ణు రవి రుద్రుల స్వర్ణ ప్రతిమలను చేయించవలెను. మిగిలిన పర్వతముల విషయమున వెండినుపయోగించిన వానికి ఈ రౌప్య పర్వత దానములో బంగారు ఉపయోగించవలెను. హోమ జాగరణాదికము పైవలెనే చేయవలెను. తెల్లవారిన పిదప ఈ రజతా చలములోని నడుమ భాగమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును నీయవలెను. (దాన కాలమున) వారినందరను వస్త్రాభరణములతో పూజించవలయను. దర్భపాణియై విమత్సరుడై ఈ అర్థమునిచ్చు మంత్రమును పఠించవలయును:''రజతమా! నీవు పితరులకును విష్ణు శంకరులకును ప్రియమైన దానవు. ఇట్టి నీవు సంసార సాగరమునుండి నన్ను దాటించుము. '' ఇట్లు ఆవాహనము చేసి ప్రార్థించి రజతాచల దానము నొనరించువారు వేయి పదివేల (1000 x10000)గోవుల దానమిచ్చినంత ఫలము నందుదురు. గంధర్వ కిన్నరాప్సరో గణముల పూజలనందుకొనుచు కల్పాంతమువరకును సోమలోకమునందు వసింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రజతాచల దాన మాహాత్య్మ కథనమను

తొంబదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters