Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుర్న వతితమో7ధ్యాయః.

శివచతుర్దశీవ్రతమ్‌.

నారదః : భగవ న్భూతభ##వ్యేశ తథాన్యదపి యద్ర్వతమ్‌ |

భు క్తిము క్తిఫలాయాలం తత్పున ర్వక్తు మర్హసి. 1

ఈశ్వరః : ఏవముక్తో7బ్రవీ చ్ఛమ్భు రయం వాఙ్మయపారగః |

మత్సమ స్తపసా బ్రహ్మ న్పురాణశ్రుతి విస్తరే 2

ధర్మో7యం వృషరూపేణ నన్దిర్నామ గణాగ్రణీః | ధర్మాన్మాహేశ్వరా న్వక్ష్య త్యతః ప్రభృతి నారద.

శ్రీమత్స్యః : ఇత్యుక్త్వా దేవదేవేశ స్తత్రైవాన్తరధీయత | నారదోపిచ శుశ్రూషు రపృచ్ఛ న్నన్ది కేశ్వరమ్‌. 4

ఆదిష్ట స్త్వం శివేనేహ వద మాహేశ్వర వ్రతమ్‌ |

నన్దికేవ్వరః: శృణుష్వావహితో బ్రహ్మన్వక్ష్యే మా హేశ్వరం వ్రతమ్‌. 5

త్రిషు లోకేషు విఖ్యాతం నామ్నా శివచతుర్దశీమ్‌ | మార్గశీర్షే త్రయోదశ్యాం సితాయా మేకభోజనః. 6

ప్రార్థయే ద్దేవదేవేశం త్వామహం శరణం గతః | చతుర్దశ్యాం నిరాహార స్సమభ్యర్చ్య మ హేశ్వరమ్‌. 8

సౌవర్ణం వృషభం దత్వా భోక్ష్యామీతి పరే7హని ఏవం నియమకృత్సుప్త్యా ప్రాత రుత్థాయ మానవః.

కృతస్నానజపః పశ్చా దుమయా సహితం శివమ్‌ | పూజయే త్కమలై శ్శుక్లై ర్గన్ధమాల్యానులేపనైః. 9

పాదౌ నమ శ్శివాయేతి శిర స్సర్వాత్మనే నమః | లలాటంతు త్రినేత్రాయ నేత్రాణి హరయే నమః. 10

ముఖ మిన్దుముఖాయేతి శ్రీకణ్ఠాయేతి కన్ధరామ్‌ | సద్యోజాతాయ కర్ణౌతు వాయదేవాయ వై భుజౌ. 11

అఘోరహృదయాయేతి హృదయం పరిపూజయేత్‌ | స్తనౌ తత్పురుషాయేతి తథేశానాయ చోదరమ్‌. 12

పార్శ్వే చానన్తధర్మాయ జ్ఞానరూపాయ వై కటిమ్‌ | ఊరూ చానన్తవై రాగ్యసింహాయేతి ప్రపూజయేత్‌. 13

అనన్తైశ్వర్యనాథాయ జానునీ త్వర్చయే ద్బుధః | ప్రధానాయ నమో జఙ్ఘే గుల్ఫౌ వ్యోమాత్మనే నమః. 14

నమః పరమరూపాయ పృష్ఠ మభ్యర్చయే న్నరః | వ్యోమ కేశాత్మరూపాయ కేశా న్పుష్టిం పినాకధృత్‌. 15

పుష్ట్యై నమ స్తథా తుష్ట్యై పార్వతీం చాపి పూజయేత్‌ |

తొంబది నాలుగవ అధ్యాయము.

శివ చతుర్దశీవ్రతము.

నారదు డీశ్వరునిట్లడిగెను: భగవన్‌; భూత-భవ్య-ప్రభూ! ఇంతవరకును మీరు చెప్పిన వానివంటిదే భు క్తి ముక్తి ఫలముల నీయగలిగినది ఇంకనునేదైన వ్రతమున్నచో దానిని నాకు తెలుపుము. అనగా ఈశ్వరుడతనితోనిట్లు చెప్పనారంభించెను. నారదా: ఇడుగో! ఈతడు వాఙ్మయమంతయు కడముట్ట చదివి దాని త త్త్వమునెరిగినవాడు. పురాణములు వేదములు అను రెండు విధములగు వాఙ్మయ విస్తారము నెరుగుటలోను తపశ్చర్యలోను నాతో సమానుడు. ఇతడు వృషభరూపములో కనబడుచున్న ధర్మమేకాని వేరుకాదు. ప్రమథగణమువారిలో శ్రేష్టుడు. ఈతని పేరు నంది. ఇక మీదట ఈతడే నీకు మహేశ్వర ధర్మములను చెప్పగలడు. అని పలికి ఈశ్వరుడచటనే అప్పుడే అంతర్ధానము నందెను. నారదుడు (ఆయా విషయముల) వినగోరినవాడు (శుశ్రూషువు) అగుచు నంది కేశ్వరునిట్లడిగెను: అయ్యా! శివుడు నిన్ను తనకు ప్రతినిధిగా నిలిపెను గదా: కావున నాకు మాహేశ్వరమగు (మ హేశ్వరునకు సంబంధించిన) వ్రతమును ప్రతిపాదింపుము. అనగా నందికేశ్వరు డతనికిట్లు చెప్పెను:

బ్రాహ్మణా! వినుము; మాహేశ్వరమగు వ్రతమును తెలిపెదను, అది శివచతుర్దశీ వ్రతమును పేరున త్రిలోకములయందును ప్రసిద్ధము. మార్గశీర్ష శుక్ల త్రయోదశినాడు దేవదేవేశుడగు ఈశ్వరుని ''నేను నిన్ను శరణుచొచ్చినాను. చతుర్దశినాడు నిరాహారుడై నైయుండి మహేశ్వరుని సమభ్యర్చించి సువర్ణ వృషభమును దానముచేసి భుజింతును.'' అని సంకల్పించి ఆనాడు (త్రయోదశినాడు) ఒక పూట మాత్రమే భుజించి యుండవలెను. ఇట్లు నియమము నేర్పరచుకొని ఆ రాత్రి నిద్రించి చతుర్దశినాటి ఉదయమున మేలుకొని స్నాన జపాదికము చేసికొని తెల్లకమలములతో గంధ మాల్యాను లేపనములతో సహితుడగు శివుని పూజించవలెను.

(పూజా మంత్రములు): 1. శివాయనమః-పాదౌ పూజయామి; 2. వ్యోమాత్మనే నమః-గుల్ఫౌ పూజయామి; 3. ప్రధానాయ నమః జంఘే పూజయామిణ 4. అనంతైశ్వర్య నాథాయనమః జానునీ పూజయామి; 6. జ్ఞాన రూపాయనమః కటిం పూజయామి; 7. అనంత ధర్మాయ నమః-పార్శ్వే పూజయామి; 8. ఈశానాయ నమః-ఉదరం పూజయామి; 9. తత్పురుషాయ నమః-స్తనౌ పూజయామి; 10. అఘోర హృదయాయ నమః-హృదయం పూజయామి; 11. వామదేవాయ నమః-భుజౌ పూజయామి; 12. సద్యోజాతాయ నమః- కర్ణౌ పూజయామి; 13. శ్రీకంఠాయ నమః-కంధరాం పూజయామి; 14. ఇందు ముఖాయనమః-ముఖం పూజయామి; 15. హరయే నమః-నేత్రాణి పూజయామి; 16. త్రిణత్రాయ నమః-లలాటం పూజయామి; 17. సర్వాత్మనే నమః-శిరః పూజయామి; 18. వ్యోమకేశాయ నమః-కేశాన్‌ పూజయామి; 19. పరమ రూపాయ నమః-సృష్టం పూజయామి; 20. ఆత్మరూపాయ నమః-పుష్టిం పూజయామి; (పుష్టిం-అనగా ఈ చెప్పినవి కాక తెలిసియో తెలియకయో చెప్పక మిగిలిన అంగములు అని అర్థము,

తరువాత-పుష్ట్యై నమః-తుష్ట్యై నమః-ఇత్యాది మంత్రములతో పార్వతిని పూజించవలయును.

తతస్తు వృషభం హైమం హేమకుమ్భసమన్వితమ్‌.

శుక్లమాల్యామ్బరయుతం పఞ్చరత్న సమన్వితం | భ##క్ష్యై ర్నా నావిధైర్యుక్తం గురవే వినివేదయేత్‌. 17

ప్రీయతాం దేవదేవో7త్ర సద్యోజాతః పినాకభృత్‌ | బ్రాహ్మణా న్భక్ష్యభోజ్యైశ్చ తర్పయే ద్భక్తిత శ్శుచిః.

పృషదాజ్యంచ సమ్ర్పాశ్చ స్వపే ద్భూమా వుదఙ్ముఖః |

పఞ్చదశ్యాం తతః పూజ్య విప్రా న్భఞ్జీత వాగ్యతః. 19

తద్వ త్కృష్ణచతుర్దశ్యా మేత త్సర్వం సమాచరేత్‌ | చతుర్దశీషు సర్వాసు కుర్యా త్పూర్వవ దర్చనమ్‌. 20

యే తు మాసా విశేషాస్తు తా న్నిబోధ క్రమా దిహ | మార్గశీర్షదిమాసేషు క్రమా దేవ ముదీర యేత్‌. 21

శఙ్కరాయ నమస్తే7స్తు నమస్తే గరకన్ధర | త్ర్యమ్బకాయ నమస్తే7స్తు మ హేశ్వర తతః పరమ్‌. 22

నమస్తే స్తు మహాదేవ స్థాణవేచ తతః పరమ్‌ | నమః పశుపతే నాథ నమస్తే శమ్భవే పునః. 23

నమస్తే వరమానన్ద నమ స్సోమార్ధధారిణ | నమో భవాయ భీమాయ త్వా మహం శరణం గతః. 24

గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌ |

పఞ్చగవ్యం తథా బిల్వం కర్పూరంవా7గురుం యవాః. 25

తిలాశ్చ కృష్ణా విధివ త్ర్పాశనం క్రమశ స్స్మృ తమ్‌ |

ప్రతిమాసం చతుర్దశ్యా మేకైకం ప్రాశనం స్మృతమ్‌. 26

మన్దానై ర్మాలతీభిశ్చ తథా బన్ధూకకైరవైః | సిన్దువారై రశోకైశ్చ మల్లికాభిశ్చ పాటలైః. 27

అర్కపుషై#్పః కదమ్బైశ్చ శతపత్రై స్తథోత్పలైః | ఏకై కేన చతుర్దశ్యా మర్చయే త్పార్వతీపతిమ్‌. 28

తరువాత బంగారు వృషభమును బంగారు కుంభము (జలపాత్ర)ను శుక్ల మాల్యాంబరములు నానావిధ భక్ష్యములు ''సద్యోజాతుడు దేవదేవుడు పినాకధనుర్ధారియగు పరమేశుడు ఈ వ్రతముచే ప్రీతుడగుగాక!'' అను అర్థము నిచ్చు మంత్రముతో గురు (ఆచార్యు-వురోహితు)నకు సమర్పించవలయును. శుచిత్వమును భ క్తియు కలవాడయి భక్ష్య భోజనములతో బ్రాహ్మణులను సంతృప్తుల జేయవలయును. పృ*షదాజ్యము ఆహారముగా తీసికొని ఉత్తరపు మొగమై నేలపై పడుకొన వలయును. పిమ్మట పూర్ణిమ నాడు బ్రాహ్మణులను (భోజనాదికముతో) పూజించి తానును భుజించి మౌనియై గడుపవలెను. ఇట్లే మరల కృష్ణ చతుర్దశియందును ఇదియంతయు చేయవలయును. ఇట్లు మార్గశీర్షము మొదలుగ అన్ని మాసములందును రెండుచతుర్దశులందును చేయుచు పోవలెను. ఈ విషయమున ఆయా మాసములందు వేరుగనుండు అంశములను తెలిపెదను; వినుము. మార్గశిరము మొదలుగ ప్రతి మాసమునందును ధ్యాన పూజాదులయందు వరుసగా-1. శంకరాయతే నమః; 2. గరకంధరాయ తే నమః; 3. త్ర్యంబకాయ తే నమః; 4. మ హేశ్వరాయ తే నమః; 5. మహాదేవాయ తే నమః; 6. స్థాణవే తే నమ; 7. పశుపతయే నాథాయ తే నమః; 8. శంభ##వే తే నమః; 9. పరమానందాయ తే నమః; 10. సోమార్ధధారిణ తే నమః; 11. భవాయ తే నమః; 12. భీమాయ తే నమః; అను మంత్రములను ప్రతి మంత్రముతోను త్వామహం శరణం గతః, అను వాక్యమును పలుకవలయును. అట్లే (యజమానుని) ఆహారము వరుసగా 1. గోమూత్రము 2. గోమయము 3. క్షీరము 4. పెరుగు 5. నేయి 6. కుశోదకము 7. పంచగవ్యము 8. బిల్వ (ఫల)ము; 9. కర్పూరము 10. సాంబ్రాణి 11. యవలు 12. నల్లనూవులు; పూజకై పుష్పములు మార్గ శీర్షాది మాసములందు వరుసగా-1. మందార 2. మాలతీ 3. ఇప్ప 4. తెల్ల కలువ 5. ప్రేంకణము 6. అశోకములు 7. మల్లె 8. పాటలము-దాసాని అనెడు ఎర్రని పూవు; 9. జిల్లేడు 10. కడిమి 11. నూరు రేకుల పద్మము 12. కలువ;

పునశ్చ కార్తికే మాసే ఏ సమ్ర్పప్తే ప్రార్థయే ద్ద్విజా& |

అన్నై ర్నానావిధై ర్భక్ష్యె ర్వస్త్రమాల్యవిభూషణౖః. 29

కృత్వా నీలవృషోత్సర్గం శ్రుత్యుక్తవిధినా నరః | ఉమామ హేవ్వరం హైమం వృషభంచ గవా సహ. 30

______________________________________________

*పృష దాజ్యము అనగా గడ్డకట్టించిన-గట్టి పరచిన పాలు-నేయి కలిపిన మిశ్రము; దూధ్‌ఖోవా-దూధ్‌బడా అను పాలవంట లేదా మీగడ పెరుగు.

ముక్తాఫలాష్టకయుతాం సితనేత్రపటావృతామ్‌ | సర్వోపస్కరసంయుక్తాం శయ్యాం దద్యాత్సుశోభనామ్‌. 31

తామ్రపాత్రోవరి పున శ్శాలితణ్డులసంయుతమ్‌ | స్థాప్య విప్రాయ శాన్తాయ వేదవ్రతధరాయచ. 32

అవ్యఙ్గాయచ సౌమ్యాయ సదా కల్యాణకారిణ | జ్యేష్ఠసామనిదే దేయం నచ కువ్రతినే క్వచిత్‌. 33

సపత్నీకాయ సమ్పూజ్య వస్త్రమాల్య విభూషణౖః | గుణజ్ఞే శ్రోత్రియే దద్యా దాచార్యే తత్త్వవేదిని. 34

గురౌ సతి గురో ర్దేయం తదభావే ద్విజాతయే | న విత్తశాఠ్యం కుర్వీత కుర్వన్దోష మవాప్నుయాత్‌. 35

అనేన విధినా యస్తు కుర్వా చ్ఛివచతుర్దశీమ్‌ | సో 7 శ్వమేధసహస్రస్య ఫల మాప్నోతి మానవః. 36

బ్రహ్మహత్యాదికం కించి ద్యదత్రాముత్ర వా కృతమ్‌|

పితృభి ర్ర్భాతృభిరామ్‌ ర్వాపి తత్సర్వం నాశ మాప్నుయాత్‌. 37

దీర్ఘాయురారోగ్యకులాభివృద్ధి రత్రాక్షయా 7 ముత్ర చతుర్భ జత్వమ్‌|

గాణాధి7పత్యం దివి కల్పకోటిశతా న్యుషిత్యా పద మోతి శమ్భోః. 38

న బృహస్పతిర ప్యనన్త మస్యాః ఫలమిన్ద్రోపి పితామహోపి వక్తుమ్‌ |

నచ సిద్దగణా7ప్యలం న చాహం యది జిహ్యాయుతకోటయో7పివక్రై. 39

భవ త్యమరవల్లభ స్స్మరతి యః పఠేద్వా లిఖ ఞ్ఛృణోత్యపి విమత్సర స్సకలపాపనిర్మోచనీమ్‌.

ఇమాం శివ చతుర్దశీ మమరకామినీకోటయ స్త్సువన్తి తమనిన్దితం కిము సమాచరే ద్య స్సదా. 40

యా వా7థ నారీ కురుతే7తిభక్త్యా భర్తార మాపృచ్ఛ్య సుతా న్గురూన్వా |

సా7పి ప్రసాదా త్పరమేశ్వరస్య పరం పదం యాతి పినాకపాణః. 41

ఇతి మత్స్యమహాపురాణ నన్దికేశ్వరనారదసంవాదే శివచతుర్దశీ

వ్రతకథనం నామచతుర్నవతితమో7ధ్యాయః.

మరల కార్తిక మాసము రాగానే బ్రహ్మణులను ప్రార్థించి పిలిచికొనివచ్చి నానావిధ భక్ష్యములు మొదలగు వానితో పూజించి వస్త్రములు మాల్యములు భూషణములు బంగారుతో చేసిన ఉమా మహేశ్వరుల ప్రతిమ గోప్రతిమ వృషభ ప్రతిమ గోవృషభ ప్రతిమలకు ఎనిమిదేసి ముత్యములు తెల్లని నేత్ర వస్త్రములు సరోపస్కారములతో కూడిన చక్కని శయ్య రాగి పళ్లెరములో (పాత్రలోకాని) తెల్లని బియ్యము అంగవైకల్యము లేనివారు శాంతులు వేదవ్రతములను ఆచరించినవారు సౌమ్యులు శుభమును ఆచరించువారు జ్యేష్ఠసామ (అను సామవేద భాగ)ము ఎరిగినవారు దురాచరణములు లేనివారు సపత్నీకులు అగు వారికిని -గుణజ్ఞడు (ఉత్తమ గుణములుఎరిగినాడు- కలిగినాడు) శ్రోత్రియుడు (సాంగముగ వేదాధ్యయనముచేసినవాడు) తత్వవేత్తయు నగు గురువు ఉన్నచో గురునకును లేని ఎడల అట్టి బ్రాహ్మణునకును దానమీయవలెను. వేదోక్త విధానమున నీల వృషో త్సర్జనమను చేయవలెను. విత్తశాఠ్యము చేయరాదు. చేసినచో దోషము పొందును.

ఈ విధానమున శిత చతుర్ధశీ వ్రతము చేసినవారు అశ్వమేధ సహస్ర ఫలము పొందుదురు. వారి తండ్రులో సోదరులో తానో చేసినవైనను బ్రాహ్మహత్యాదిదోషము లేవయిన ఉన్నచో వానివలన కలుగు ఇహలోకపరలోక పాపఫలము లేవేవియున్నను అవి యన్నియు నశించును. ఇహమున దీర్ఘాయురారోగ్యమును కులాభివృద్దియు పరమున విష్ణు సారూప్యమునుసిద్ధించును. ద్యులోకమున ప్రమథ గణములకు అధిపతియై నూరుకోట్ల కల్పముల కాలము ఉండి తుదకు శివస్థానమును చేరుదురు.

ఈ శివ చతుర్దశీ వ్రతఫలమును చెప్పుటకు బృహస్పతికిని బ్రహ్మకును సిద్దులకును నాకు (నందీకేశ్వరునకు)ను నోటి యందు పదివేల కోటుల నాలుకులున్నశక్తి చాలదు. ఏలయనే ఆఫలము అనంతరమయినది.

ఈ శివ చతుర్దశీ వ్రత విధానము సకల పాప విమోచనమును కలిగించునది; దీనిని స్మరించినను పఠించినను విమత్సరుడై వినినను వినిపించినను ఇంద్రత్వము సిద్ధించును. దీనిని అమర యువతి కోటులు స్తుతించుచుందురు. సదా ఇట్టి ప్రశస్తమగు దాని నాచరించినచో కలుగు ఫలము ఇంతయని చెప్పనేల?స్త్రీయైనను తన భర్తను కాని కుమారులను తన ఇంటి పెద్దలను కాని అడిగి వారి అనుమతి పొంది ఆచరించినను ఆమెయును పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రురాలై పినాక పాణియగు ఆ మహానుభావుని పరమపదమును పొందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున శివ చతుర్దశీ వ్రతవిధానము కథనమను

తొంబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters